Bihar: 7 Killed In Auto-Rickshaw-Truck Collision In Katihar District - Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి.. మరో ఇద్దరూ..

Published Tue, Jan 10 2023 2:47 PM | Last Updated on Tue, Jan 10 2023 3:41 PM

Bihar Katihar Speeding Truck Rams Into Auto Family Killed - Sakshi

పాట్నా: బిహార్ కటిహార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును ఆటో ఢీకొట్టి కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు చనిపోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. 

సోమవారం రాత్రి 8:30 గంటలకు జాతీయ రహదారి-81 పై ఈ ప్రమాదం జరిగింది. ఆటోను ఓవర్‌టేక్ చేయిబోయిన ట్రక్కు దాన్ని ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆటోలో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మరణించినట్లు చెప్పారు.

ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహం చెందిన స్థానికులు రోడ్డుపై టైర్లకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. రహదారిని దిగ్బంధించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగంలోకి దిగి వాళ్లను శాంతింపజేశారు. ట్రక్కు, డ్రైవర్‌ను వీలైనంత త్వరగా పట్టుకుంటామన్నారు.
చదవండి: రోడ్డును కమ్మేసిన పొగమంచు.. ట్రక్కు-బస్సు ఢీ.. నలుగురు దుర్మరణం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement