
తారకేశ్వరరాయ్ మృతదేహం
టెక్కలి రూరల్ : జాతీయ రహదారిపై మండలంలోని బోప్పాయిపురం వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్ తారకేశ్వరరాయ్(40) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... ముంబాయి నుంచి కోల్‌కత్తా వైపు పార్సిల్ లోడ్‌తో వెళుతున్న లారీ బోప్పాయిపురం గ్రామ సమీపంలో ముందువెళుతున్న మరో లారీని ఓవర్‌టేక్ చేయబోయి దానిని ఢీకొని డివైడర్‌పైకి దూసుకువెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న తారకేశ్వరరాయ్ కేబిన్‌లో ఇరుక్కుపోవడంతో తీవ్రగాయాలపాలయ్యాడు.
స్థానికులు బాధితుడిని వెంటనే 108లో టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడు తారకేశ్వరరాయ్ బిహార్ రాష్ట్రం బాపర గ్రామానికి చెందిన వ్యక్తిగా క్లీనర్ తెలిపాడు. క్లీనర్ తెలిపిన వివరాలు ప్రకారం మృతుని కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి ఎస్‌ఐ బి.సురేష్‌బాబు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment