
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టైర్ పేలడంతో ఓ పోలీస్ వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులు మరణించారు. సోమవారం పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా కలకత్తాలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన డీజీపీ గౌతం సవాంగ్.. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి వివరాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
సీఎం జగన్ సంతాపం
ఏఆర్ పోలీసుల దుర్మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చదవండి: పేదలందరికీ ఇల్లు, ఇంటి స్థలాల పంపిణీపై సీఎం జగన్ సమీక్ష