
కర్ణాటక: అతివేగం ఓ సీఐ, ఆయన భార్య ప్రాణాలను బలి తీసుకుంది. కలబుర్గిలో సొంత పనులను ముగించుకొని సింధగికి తిరిగి కారులో వెళుతుండగా అదుపు తప్పి ఆగి ఉన్న కంటైనర్ లారీ వెనుక భాగాన్ని ఢీకొనడంతో కారులోనే సీఐ దంపతులు మృతి చెందారు. కారు నుజ్జునుజ్జయింది. ఈ దుర్ఘటన కలబుర్గి జిల్లా జేవర్గి తాలూకా నెలోగి వద్ద బుధవారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న సీఐ రవి ఉక్కుంద (45)తో పాటు ఆయన భార్య మధు (40) తీవ్ర గాయాలతో సంఘటన స్థలంలోనే మృతి చెందారు.
వేగం, పొగమంచు వల్ల..
వేగంగా వెళ్లడానికి తోడు పొగ మంచులో దారి కనిపించకపోవడమే కారణమని భావిస్తున్నారు. కారు కంటైనర్ కిందకు దూసుకెళ్లడంతో బయటకు పోలీసులకు తీయడానికి చాలా సమయం పట్టింది. గతంలో కొప్పళ జిల్లాలో పోలీస్ అధికారిగా పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం విజయపుర జిల్లా సింధగి సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ దంపతులకు 10 ఏళ్ల లోపు కొడుకు కూతురు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment