Family died
-
తేనెటీగలదాడి.. తల్లీ ముగ్గురు కూతుళ్లు మృతి
రాంచీ:తేనేటీగల దాడిలో తల్లి ముగ్గురు కుమార్తెలు మృతిచెందిన విషాద ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగింది.జ్యోతిగడి అనే మహిళ తన ముగ్గురు కుమార్తెలను తీసుకుని వీకెండ్ సరదాగా గడిపేందుకు తన పుట్టింటికి వెళ్లింది. వీరంతా కలిసి శనివారం(సెప్టెంబర్21)అకడున్న ఒక బావిలో స్నానం చేసేందుకు దిగారు.ఇంతలో ఎక్కడినుంచో వచ్చిన తేనెటీగల గుంపు ఒక్కసారిగా వారిపై దాడి చేసింది.దీంతో తల్లీకూతుళ్లు గట్టిగా అరవడంతో చుట్టుపక్కల ఉన్నవారు అక్కడి నుంచి పారిపోయారు తేనెటీగల దాడికి తట్టుకోలేక నలుగురూ బావిలోనే ప్రాణాలు విడిచారు.పోలీసులు నలుగురి మృతదేహాలను బావి నుంచి వెలికితీసి పోస్టమార్టంకు పంపారు. ఇదీ చదవండి: కామాంధుడి చెర నుంచి రక్షించిన కోతులు -
నంద్యాలలో విషాదం.. నిద్రలోనే కుటుంబం మృత్యువాత
సాక్షి, నంద్యాల: జిల్లాలోని చాగలమర్రి మండలం చిన్నవంగలిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో దంపతులు, వాళ్ల ఇద్దరు పిల్లలు ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న ఆ కుటుంబ సభ్యులపై మట్టి మిద్దె కూలి ఒక్కసారిగా మీద పడింది. దీంతో ఆ కుటుంబం అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు తెల్లారి చూసేసరికి దిబ్బల కింద ఆ కుటుంబం సజీవ సమాధి అయ్యి ఉంది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. బాధిత కుటుంబాన్ని గురుశేఖర్ రెడ్డి కుటుంబంగా పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోగా.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి
ముంబై: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. బుధవారం ఉదయం 4 గంటల సమయంలో ఛత్రపతి శంభాజీ నగర్లో ఉన్న టైలరింగ్ షాప్‌లో అగ్నిప్రమాదం జరిగింది. భారీ ఎత్తున మంటలు చెలరేగటంతో స్థానికులు ఫైర్ పోలీసులు సమాచారం అంధించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురు ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ‘టైలర్ షాప్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మృతి చెందిన వారు పైఫ్లోర్‌లో నివసిస్తున్నారు. అయితే టైలర్ షాప్‌లో జరిగిన అగ్ని ప్రమాదపు పొగ పీల్చుకొని మృతి చెందినట్లు తెలుస్తోంది’ అని శంభాజీ నగర్ సీపీ మనోజ్ లోహియా తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకోని దార్యప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. -
విహారయాత్రలో విషాదం: అనంతపురానికి చెందిన ఫ్యామిలీ మృతి
యశవంతపుర: కారును ప్రైవేట్ బస్ ఢీకొన్న ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన శనివారం ఉదయం జరిగింది. ఉడుపి జిల్లా కార్కళ తాలూకా నెల్లికారు గ్రామ పంచాయతీ పరిధిలోని మైనేరు వద్ద ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్ వేగంగా వచ్చి కారును ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న బెంగళూరుకు చెందిన శ్రీకాంత్ (36), భార్య ప్రత్యూష, మూడేళ్ల కూతురు గమ్య దుర్మరణం పాలయ్యారు. బస్సు ధాటికి కారు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. శృంగేరికి వెళ్తుండగా.. దంపతులు ఇద్దరూ బెంగళూరులో టెక్కీలుగా పనిచేస్తారు. వారాంతపు సెలవులు కావడంతో సొంత కారులో పుణ్యక్షేత్రాల దర్శనానికి బయల్దేరారు. శుక్రవారం రాత్రి ధర్మస్థలకు చేరుకున్నారు. మంజునాథస్వామిని దర్శించికొని అక్కడి నుంచి శృంగేరికి వెళ్తుండగా ఘాటు రోడ్ మలుపు వద్ద వద్ద కారు– బస్సు వేగంగా ఢీకొన్నాయి. కారు నుజ్జునుజ్జు కాగా ముగ్గురూ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కన్నుమూశారు. మృతులు అనంతపురం జిల్లావాసులని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోలీసులు మూడబిదిరె ఆస్పత్రిలో ఉంచారు. మృతులు అనంతపురం జిల్లావాసులు ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణం సమీపంలోని చిన్న ముష్టూరు గ్రామానికి చెందిన దంపతులు కర్ణాటకలో ఉడుపి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో విషాదం అలముకొంది. వివరాల్లోకి వెళితే చిన్న ముషూ్టరు గ్రామానికి చెందిన విశ్రాంత ఉద్యోగి మాసినేని శ్రీరాములు, అనంతలక్ష్మి దంపతుల కుమారుడు శ్రీకాంత్ (36) అతని భార్య ప్రత్యూషా (30)లు బెంగళూరులో సాప్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరికి మూడేళ్ల కుమార్తె గమ్య, ఏడాది బాబు ఉన్నారు. బెంగళూరు నుంచి దైవదర్శనానికి కారులో వెళ్లారు. ధర్మస్థలం దాటగానే ఓ ప్రైవేట్ బస్సు వేగంగా వచ్చి వీరి కారును ఢీకొనడంతో కారు నుజ్జు నుజ్జు అయి శ్రీకాంత్, ప్రత్యూషా పాటు కుమార్తె గమ్య దుర్మరణం పాలయ్యారు. ఒకేసారి రోడ్డు ప్రమాదంతో ముగ్గురు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
ఘోర రోడ్డు ప్రమాదం: సీఐ దంపతుల దుర్మరణం
కర్ణాటక: అతివేగం ఓ సీఐ, ఆయన భార్య ప్రాణాలను బలి తీసుకుంది. కలబుర్గిలో సొంత పనులను ముగించుకొని సింధగికి తిరిగి కారులో వెళుతుండగా అదుపు తప్పి ఆగి ఉన్న కంటైనర్ లారీ వెనుక భాగాన్ని ఢీకొనడంతో కారులోనే సీఐ దంపతులు మృతి చెందారు. కారు నుజ్జునుజ్జయింది. ఈ దుర్ఘటన కలబుర్గి జిల్లా జేవర్గి తాలూకా నెలోగి వద్ద బుధవారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న సీఐ రవి ఉక్కుంద (45)తో పాటు ఆయన భార్య మధు (40) తీవ్ర గాయాలతో సంఘటన స్థలంలోనే మృతి చెందారు. వేగం, పొగమంచు వల్ల.. వేగంగా వెళ్లడానికి తోడు పొగ మంచులో దారి కనిపించకపోవడమే కారణమని భావిస్తున్నారు. కారు కంటైనర్ కిందకు దూసుకెళ్లడంతో బయటకు పోలీసులకు తీయడానికి చాలా సమయం పట్టింది. గతంలో కొప్పళ జిల్లాలో పోలీస్ అధికారిగా పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం విజయపుర జిల్లా సింధగి సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ దంపతులకు 10 ఏళ్ల లోపు కొడుకు కూతురు ఉన్నారు. -
ప్లాట్‌లో నేలపై రక్తపు మరకలతో భార్య, బిడ్డలు.. ఏం జరిగింది?
ఒకే ఫ్యామిలీకి చెందిన ఆరుగురు కుటుంబ సభ్యులు మృతిచెందడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ షాకింగ్ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. కాగా, మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉండటం అందరిని విషాదానికి గురిచేసింది. వివరాల ప్రకారం.. ప్రకాశ్ కుటుంబం ఉదయ్‌పూర్‌లోని గోగుండా ప్రాంతంలో నివాసం ఉంటోంది. ప్రకాశ్‌కు భార్య దుర్గాగోమతి(27), వారి నలుగురు పిల్లలు కలిసి ప్లాట్‌లో నివసిస్తున్నారు. కాగా, ప్రకాశ్.. గుజరాత్లో పని చేస్తూ బస్సుల్లో ఆహారాన్ని విక్రయించేవాడు. ప్రకాశ్ సోదరులు కూడా అతడి ఇంటికి దగ్గరలోనే నివసిస్తున్నారు. అయితే, సోమవారం ప్రకాశ్.. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అతడి సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గది తలుపులు ఓపెన్ చేశారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులందరూ చనిపోయి ఉండటం గమనించారు. ఈ సందర్భంగా ఘటనపై అడిషనల్ ఎస్పీ కుందన్ కన్వారియా వివరాలు వెల్లడించారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రకాశ్ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చాము. ప్రకాశ్ మొదట కుటుంబ సభ్యులను చంపి.. తర్వాత తాను ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారని అన్నారు. ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్ చేరుకున్నట్టు స్పష్టం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. Six members of a family, including four children, were found dead in mysterious circumstances in Rajasthan's Udaipur on Monday. The bodies of the couple and their four children were recovered from a room in the house in Gogunda town. pic.twitter.com/4OqxhY2n4x — Aakash Shukla (@JournoAakash) November 21, 2022 -
చెంగల్పట్టులో రోడ్డు ప్రమాదం.. తెలుగు ప్రముఖుల దుర్మరణం
సాక్షి, చెన్నై(తమిళనాడు): ప్రముఖ పారిశ్రామిక వేత్త, పల్లవాగ్రానైట్స్ అధినేత డాక్టర్ కొడలూరు సుబ్బారెడ్డి సోదరుడి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. చెంగల్పట్టు సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుబ్బారెడ్డి తమ్ముడు నరోత్తంరెడ్డి భార్య కె.భారతి రెడ్డి (60), కుమారుడు డాక్టర్ కె. శ్రీహిమవర్ష్ (27) దుర్మరణం చెందారు. సుబ్బారెడ్డి సోదరుడి కుటుంబం చెన్నై మైలాపూర్, అభిరామపురంలో ఉంటున్నారు. చాలాకాలం క్రితం సోదరుడు నరోత్తంరెడ్డి మరణించారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ డాక్టర్ అయిన కె. శ్రీహిమవర్ష్ తన తల్లి భారతి రెడ్డితో కలిసి జీప్‌లో దిండివనం సమీపంలోని ఆలయానికి వెళ్లారు. పూజల అనంతరం సోమవారం తిరుగుపయనం అయ్యారు. సాయంత్రం మార్గం మధ్యలోని చెంగల్పట్టు జిల్లా పళవేలి గ్రామం వద్ద వీరి జీప్ ప్రమాదానికి గురైంది. అతివేగంగా వచ్చిన ఓ కారు జీప్‌ను ఢీకొట్టి వెళ్లింది. దీంతో అదుపు తప్పిన జీపు చెట్టును ఢీకొని డివైడర్ దాటి అవతలి మార్గంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో జీపులో ఉన్న తల్లి, కుమారుడు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ సమాచారంతో సుబ్బారెడ్డి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. చెంగల్పట్టు తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మంగళవారం అప్పగించారు. వీరి భౌతికకాయాలను ఆళ్వార్‌పేట, అభిరామపురం, సుబ్రమణ్యం వీధి, నెంబర్ 19 చిరునామాలో ఆప్తులు, కుటుంబీకుల సందర్శనార్ధం ఉంచారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. టీనగర్ కన్నమ్మపేట శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా, ఎంబీబీఎస్ పూర్తి చేసిన కె.శ్రీహిమవర్ష్ ఎం.ఎస్ చదివేందుకు సిద్ధమవుతున్న తరుణంలో మరణించడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చదవండిః అత్త సూటిపోటి మాటలు.. వేధింపులు భరించలేక అల్లుడు.. -
ఒకరికి తెలీయకుండా ఒకరు.. కుటుంబాన్ని చిదిమేసిన కరోనా
సాక్షి, మంచిర్యాల: మండలంలోని తాళ్లపేటలో ఓ కుటుంబాన్ని కరోనా చిదిమేసింది. పదిహేను రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో ముగ్గురిని బలితీసుకుంది. భర్త మృతి విషయం భార్యకు తెలియదు.. భార్య మరణం విషయం భర్తకు తెలియదు.. వీరిద్దరి మరణం కుమారుడికి తెలియదు. కుమారుడు లేడనే విషయం తల్లిదండ్రులకూ తెలియదు. ఒకరి మరణ వార్త మరొకరికి తెలియకుండా అందరూ చనిపోయారు. గ్రామానికి చెందిన విశ్రాంత సింగరేణి కార్మికుడు అక్కనపెల్లి కుమారస్వామి(70), ఆయన భార్య భూలక్ష్మీ(65), కుమారుడు రఘు(28) గత పదిహేను రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. దీంతో తండ్రీకొడుకులు కరీంనగర్ ఆస్పత్రిలో చేరారు. తల్లి తాళ్లపేటలో హోంఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంది. ఆసుపత్రిలో చేరిన మూడు రోజులకే రఘు ఈ నెల 9న మృతిచెందాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియదు. అతను మృతిచెందిన మరుసటి రోజే హోం ఐసోలేషన్‌లో ఉన్న తల్లి భూలక్ష్మీ ఈ నెల 10న మృతిచెందింది. వీరిద్దరు మృతిచెందిన విషయం కుమారస్వామికి తెలియదు. తీరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు కూడా గురువారం అర్ధరాత్రి మృతిచెందాడు. ఇలా ఒకే కుటుంబంలో కరోనా బారిన పడ్డ ముగ్గురు పదిహేను రోజుల్లో మృత్యువాత పడడం తాళ్లపేటలో తీవ్ర విషాదాన్ని నింపింది. చదవండి: కరోనా సోకిన వారిలో ఆకస్మిక మరణాలకు కారణాలెన్నో.. -
ప్రభుత్వ టీచర్ కుటుంబాన్ని చిదిమేసిన కరోనా
యశవంతపుర: కరోనా భూతం ఒకే కుటుంబంలో నలుగురిని పొట్టనబెట్టుకున్న ఘటన బాగలకోట తాలూకా దేవినాళ గ్రామంలో జరిగింది. వెంకటేశ్ ఒంటగోడి (45) అయన భార్య రాజేశ్వరి (40), రాజేశ్వరి తండ్రి రామనగౌడ (74), తల్లి లక్ష్మీబాయి (68)లు బలయ్యారు. మే 3 నుండి 15 వరకు వీరందరూ బాగలకోటలోని కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వరుసగా మృతి చెందారు. రాజేశ్వరి ప్రభుత్వ టీచర్ కాగా, భర్త వెంకటేశ్ రామదుర్గలో ప్రభుత్వ బీసీ వసతిగృహంలో అధికారి. ఇటీవల బెళగావి ఉప ఎన్నికలలో పనిచేసిన రాజేశ్వరికి మొదట కరోనా సోకింది. తరువాత కుటుంబసభ్యులందరికీ వ్యాపించింది. మరోవైపు బాగలకోట జిల్లా వక్ఫ్‌బోర్డు అధ్యక్షుడు మైనుద్దీన్ నబివాలె (57) కరోనాతో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. చదవండి: కాపురాన్ని సరిదిద్దుకుని సంతోషంగా వెళ్తుంటే.. -
పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు
-
వ్యాపారవేత్త కుటుంబం విషాదాంతం..
లక్నో : నూతన సంవత్సరం తొలి రోజే విషాదం చోటుచేసుకుంది. మధుర హైవేలో బుధవారం ఓ కారులో వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు విగతజీవులుగా పడిఉండటం గుర్తించారు. ఘటనా స్ధలంలో పిస్టల్ లభించడంతో మృతులు తుపాకితో కాల్చుకుని మరణించినట్టు భావిస్తున్నారు. ఘటనా స్ధలం నుంచి తుపాకిని స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతులను నీరజ్ అగర్వాల్, నేహ అగర్వాల్, ధన్య అగర్వాల్‌లుగా గుర్తించారు. వ్యాపారవేత్త ఆయన భార్య, కుమార్తె ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్ధలంలోనే తీవ్ర గాయాలతో బాధపడుతున్న శౌర్య అగర్వాల్ అనే బాలుడిని గుర్తించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. -
ఇంటికి చేరుకునేలోపే..
నెల్లూరు , ఆత్మకూరు/మర్రిపాడు: మరికాసేపట్లో ఇంటికి చేరుకుంటారనగా ఘోర రోడ్డు ప్రమాదం వారి ప్రాణాలను బలితీసుకుంది. కుటుంబసభ్యుల్లో తీవ్ర నిషాదాన్ని నింపింది. అతివేగం కారణంగా మూడు నిండు ప్రాణాలు బలికావడంతోపాటు ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం రాత్రి మర్రిపాడు మండలంలోని నందవరం సమీపంలో నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన తల్లీకూతుళ్లు ఉన్నారు. ఇంటి యజమాని సయ్యద్ వశీ అహ్మద్, అతని మరో ఇద్దరు కుమార్తెలు తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారికి చెందిన సయ్యద్ వశీ అహ్మద్ 15 సంవత్సరాల క్రితం జిల్లా కేంద్రమైన నెల్లూరుకు ఉపాధి కోసం వచ్చాడు. కర్నూలుకు చెందిన షాజీయా పర్వీన్ (40)ను వివాహం చేసుకున్న ఇతను నగరంలోని గాంధీనగర్‌లో ఉన్న ఓ స్కూల్ పక్కనే నివాసం ఉంటున్నాడు. ఆటోనగర్‌లో హోస్‌పైపుల తయారీ వ్యాపారం నిర్వహిస్తున్న అహ్మద్‌కు సౌమ్యుడిగా పేరుంది. తన వ్యాపారం, తన కుటుంబం అన్నట్లుగా ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. ఇతనికి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె తుహారా బేగం డిగ్రీ, మరో కుమార్తె ఉమైనా బేగం (18) ఇంటర్మీడియట్, చిన్న కుమార్తె మొబీనా చదువుతున్నారు. ఇటీవల కళాశాలకు వరుసగా సెలవులు రావడంతో అహ్మద్ కుటుంబంతో సహా కారులో అత్త వారి ఊరైన కర్నూలుకు వెళ్లాడు. సెలవులు ముగుస్తుండడంతో గురువారం నెల్లూరుకు కారులో గురువారం బయలుదేరారు. ఈ క్రమంలో నందవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురికావడంతో అహ్మద్ భార్య షాజియా పర్వీన్ కుమార్తె ఉమైనా బేగంలను కోల్పోయాడు. ప్రమాద విషయం తెలుసుకున్న గాంధీనగర్‌లోని వశీ అహ్మద్ ఇంటి సమీపంలోని వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ కుటుంబానికి ప్రమాదం చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పనిచేసే చోటుకు వెళుతూ.. చేజర్ల మండలం కోటితీర్థంకు చెందిన పెంచలమ్మ, కుమారుడు నాగేంద్ర జీవనం కోసం బద్వేల్లో సిమెంట్ ఒరలు తయారుచేసే ఫ్యాక్టరీలో పనిచేస్తుంటారు. సంక్రాంతి సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన వారు తిరిగి పనిచేసే ప్రాంతానికి వెళ్లేందుకు నెల్లూరుపాళెం వద్ద బద్వేల్‌కు వెళుతున్న కారులో ఎక్కారు. వారితోపాటు జలదంకి మండలం గట్టుపల్లి గ్రామానికి చెందిన రామానాయుడు (55) బద్వేల్‌కు వెళ్లేందుకు అదే కారులో ప్రయాణం చేస్తున్నాడు. నందవరం వద్ద ట్రాక్టర్‌ను తప్పించబోయి ఎదురుగా వస్తున్న కారును వేగంగా ఢీకొంది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రామానాయుడు ఆస్పత్రిలో చికిత్స అందించేలోగా మృతిచెందాడు. బీపీ ఎక్కువై.. తల్లి పెంచలమ్మ, తమ్ముడు నాగేంద్ర రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న సుబ్బారాయుడు వారిని చూసేందుకు ఆత్మకూరులోని ఆస్పత్రికి వచ్చాడు. వారిద్దరిని చూసి బీపీ ఎక్కువ కావడంతో ఆస్పత్రి వెలుపల మెట్లపై బోర్లా పడిపోయాడు. దీంతో అతని దంతాలు ఊడిపోవడంతోపాటు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. -
పండగకు వెళ్లొస్తూ..పరలోకాలకు
బంధు మిత్రులతో కలిసి సంక్రాతిని పండుగను ఆనందోత్సాహాలతో గడిపారు.. తిరిగి వస్తున్న ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ దుర్ఘటనలో భార్యభర్తలు, కుతూరు మృతిచెందగా కుమారుడు గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన కోదాడ మండల పరిధిలోని జాతీయ రహదారిపై కొమరబండ శివారులో బుధవారం చోటు చేసుకుంది. కోదాడ రూరల్ : హైదరాబాలోని చరల్లపల్లి ఈసీనగర్‌కు చెందిన రావి నాగమురళీకృష్ణ(48) ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంతో పాటు వ్యాపారం చేస్తుంటాడు. సంక్రాంతి పండుగకు బ్యాంక్ ఆఫ్ అమెరికా అనే కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేస్తున్న భార్య కవిత(42), ఇంటర్మీడియట్ చదువుతున్న కూతురు ధనుష(17), కుమారుడు యునిత్లతో కలిసి అత్తగారి గ్రామమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా నూజివీడు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామానికి వెళ్లారు. అక్కడ బంధువులతో ఆనందంగా గడిపిన వారు బుధవారం ఉదయం హైదరాబాద్ బయలుదేరారు. ఈ క్రమంలో ఎం జరిగిందో ఏమో కానీ కొమరబండ శివారుకు రాగానే వేగంగా ఉన్న కారు ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం గాలిలో లేచి అటువైపుగా హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్న రెండు కార్లను ఢీకొట్టి పక్కనే ఉన్న కల్వర్టును బలంగా తగిలింది. దీంతో యునిత్ చెయ్యివిరిగి గాయాలతో బయట పడగా ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. యునిత్ కారు వెనుక సీటులో పడుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడని స్థానికులు తెలిపారు. తల్లిదండ్రులు, అక్క మృతి చెందడంతో బాలుడు అనాథగా మిగిలాడు. గాలిలో లేచిపడిన మృతదేహాలు... కారు వేగంగా కల్వర్టును ఢీకొట్టడంతో కవిత, ధనుషలు 15 మీటర్ల దూరంలో లేచిపడ్డారు. సీటు »ñ బెల్టుపెట్టుకున్న మురళీకృష్ణ కారులోనే తీవ్ర గాయాలపాలై మృతిచెందాడు. కవిత తలపైభాగం విడిపోయి దూరంగా పడింది. కారులో ఇరుక్కుపోయిన అతన్ని పోలీసులు అతికష్టం మీద బయటకు తీశారు. అతివేగమే కారణమా..? ఈ ప్రమాదానికి గల కారణం అతి వేగమే కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. వేగంగా ఉండటంతోనే అదుపుతప్పి కారు దాదాపుగా 20మీటర్ల దూరం వరకు డివైడర్‌పై ఉన్న చెట్లను వేర్లతో సహా పెకిలించుకుని పూర్తిగా అవతలివైపునకు వెళ్లి బలంగా ఢీకొట్టి ఉంటుందని చర్చించుకున్నారు. దీంతో పాటుగా ఎయిర్‌బెలూన్స్ తెరుచుకున్నా పగిలిపోవడం, మృతదేహాలు దూరంగా ఎగిరిపడటం చూస్తుంటే అతి వేగమే కారణమని భావిస్తున్నారు. మరో ముగ్గురికి గాయాలు... నాగమురళీకృష్ణ కారు అవతలి వైపు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్న రెండు కార్లను ఢీకొట్టడంతో ఓ కారులో ఉన్న ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. మెదక్‌జిల్లా రామాయంపేటకు చెందిన కంభంపాటి ఈశ్వర్, సోమనగారి స్వామి, హైదరాబాద్‌కు చెందిన కలువ అనిరుధ్‌లకు గాయాలయ్యాయి. వారు స్థానిక ప్రైవేట్ వైద్యాశాలలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంపై ఆరా తీసిన ఏపీ హోంమినిస్టర్ ప్రమాదం జరిగిన సంఘటనపై ఎపీ హోం మినిస్టర్ చిన్న రాజప్ప కోదాడ పోలీసులను ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. బాధిత కుటుంబాలకు సహాయం అందించాలని తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ... ఘెర రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. గాయపడిన బాధితులకు మెరుగైన సహాయం అందే విధంగా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అప్పటికే డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి, పట్టణ, రూరల్ సీఐలు శ్రీనివాసరెడ్డి, రవిలతో పాటు రూరల్, అనంతగిరి ఎస్‌లు దశరథ, రామాంజనేయులు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. మృతదేహాన్ని బయటికి తీస్తున్న పోలీసులు -
చివరి మజిలీ
చిత్తూరు, ములకలచెరువు:బంధువులతో ఆత్మీయతను, ఆనం దాన్ని పంచుకున్నారు. వధూవరులను ఆశీర్వదించారు. తిరిగి స్వగ్రామానికి ఆ కుటుంబ సభ్యులంద రూ కారులో బయల్దేరారు. అదే వారి జీవితంలో చివరి ప్రయాణమైంది. రోడ్డు ప్రమాదం ఆ కుటుం బాన్ని కాటేసింది. ఒకేసారి నలుగురి ప్రాణాలను అనంతలోకాలకు తీసుకెళ్లింది. మరో ముగ్గురు కొన ఊపిరితో మృత్యుపోరాటం చేస్తున్నారు. ఈ విషాదభరిత సంఘటన బుధవారం జరిగింది. వివరాలు.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన వీఎస్ఎస్ వర్మ ఎనిమిదేళ్ల క్రితం మండలంలోని సోంపల్లె పంచాయతీ జవకలకోట సమీపంలో భూములు కొనుగోలు చేశారు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబ సభ్యులతో ఇక్కడే స్థిరపడ్డాడు. వీరితో పాటు అన్న కుమారుడు సుందరరామరాజు కుటుంబం కూడా ఇక్కడే ఉంటున్నారు. స్థానికులకు చేదోడువాదోడుగా ఉంటూ మంచిపేరు సాధించుకున్నారు. బంధువుల పెళ్లి కోసమై గత ఏడాది డిసెంబర్ 26న వీఎస్ఎస్ వర్మ, భార్య భారతి, కుమారుడు సునీల్‌వర్మ, భార్య సుష్మా, కుమార్తెలు జాహ్నవి, సాయి కస్వీక, వీఎస్ఎస్ వర్మ అన్న కుమారుడు సుందరరామరాజు, భార్య రాధసౌందర్యలు ఎనిమిది మంది కారులో కాకినాడకు బయల్దేరి వెళ్లారు. బంధువుల వివాహంలో వారి సంతో షాలను బంధువులతో పంచుకొని బుధవారం తిరిగి ఇంటికి బయల్దేరారు. గుంటూరు జిల్లా యడ్లపాడు వద్ద ముందు వెళ్తున్న కంటైనర్‌ను కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో భారతి(53), సుష్మా(28), సాయి కస్వీక(02), సుందరరామరాజు(32)లు అక్కడికక్కడే మృతిచెందారు. జాహ్నవి(12), రాధసౌందర్య(26), సునీల్‌వర్మ(35)లు తీవ్రంగా గాయపడడంతో గుంటూరులోని కాటూరి మెడికల్ వైద్య కళాశాలకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. వీరి మృతి వార్త తెలిసి జవకలకోటలో విషాదచాయలు అలముకున్నాయి. -
ప్రాణాలు తీసిన వేగం
కీసర: కీసర రింగ్‌రోడ్డుపై రాంపల్లిదాయర వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలతో పాటు రెండు నెలల పసి కందు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఝార్ఖండ్ రాష్ట్రం జంషెడ్‌పూర్‌కు చెందిన దినేష్‌కుమార్ కుటుంబంతో గత కొన్నేళ్లుగా ఫీర్జాదిగూడ బుద్దనగర్‌లో ఉంటూ, ఉప్పల్ అపోలో క్లీనిక్‌లో సెంట్రల్ మేనేజర్‌గా పనిచేసేవాడు . నెలరోజుల క్రితం ఉద్యోగాన్ని మానివేసిన అతను ఇటీవల రాజేంద్రనగర్ అత్తాపూర్ కేశవనగర్‌కు మకాం మార్చాడు. దినేష్‌కుమార్ బావమరిది రిషికేష్ నారపల్లిలోని నల్లమల్లారెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతూ సమీపంలోని సింగపూర్‌టౌన్‌షిప్‌లో ఉంటున్నాడు. మంగళవారం రిషికేష్‌ను కలిసి కాలేజీ ఫీజు చెల్లించేందుకు దినేష్‌కుమార్ ఆల్టోకారులో భార్య సాగరిక, కుమారుడు రుద్రాన్స్‌తో ఓఆర్ఆర్ మీదుగా ఘట్కేసర్ బయలుదేరాడు. ఘట్కేసర్ ఓఆర్ఆర్ వద్ద కిందకు దిగాల్సి ఉండగా ముందుకు వెళ్లాడు. తాను దిగాల్సిన చోటు దాటిపోయిందన్న కంగారులో వేగంగా కారును నడుపుకుంటూ రాంపల్లి దాయర సమీపంలోని ఓఆర్ఆర్పై ఉన్న వంతెనగోడను ఢీకొన్నాడు. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో దినేష్‌కుమార్, ఆయన భార్య, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై సమాచారం అందడంతో కీసర సీఐ ప్రకాష్ సిబ్బందితో అక్కడికి చేరుకుని, మృత దేహాలను కారులోనుంచి బయటికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చిన్నారి రుద్రాన్స్ తలకు తీవ్ర గాయాలు కావడంతో తల్లి ఒడిలోనే ప్రాణాలొదిలాడు. సంఘటన స్థలాన్ని డీసీపీ ఉమామహేశ్వర్రావు, ఏసీపీ శివప్రసాద్, ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిరెడ్డి సందర్శించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు 170 కిలోమీటర్ల స్పీడ్‌లో పోలీసులు తెలిపారు. -
అయ్యయ్యో
ఏమీ మిగల్లేదు.. భర్తకు భార్య.. భార్యకు భర్త.. పిల్లలకు తల్లిదండ్రులు.. అమ్మానాన్నలకు పిల్లలు.. ఇలా ఏ ఒక్క బంధమూ మిగల్లేదు. పచ్చని ఆ కుటుంబంపై కన్నుకుట్టిన విధి పగబట్టినట్టు మొత్తాన్ని మింగేసింది. మృత్యువు రూపంలో దూసుకొచ్చిన లారీ కిందపడి ఇద్దరు పిల్లలు సహా తల్లిదండ్రుల జీవితాలు అర్ధంతరంగా తెల్లారిపోయాయి. ఎటు చూసినా మాంసపు ముద్దలే.. వారి ఆర్తనాదాలు రాత్రి వేళ చిమ్మచీకట్లో కలిసిపోయాయి. తెగిన చేతులు, రక్తం చిందిన శరీరాలు, పగిలిన తలలు.. చూపరుల హృదయాలను ద్రవింపజేశాయి. ఆదివారం రొంపిచర్ల మండలం అద్దంకి– నార్కెట్‌పల్లి రహదారిలో మర్రిచెట్టుపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. బుట్టబొమ్మల్లా ఉన్న ఆ చిన్నారులను చూసి ప్రతి ఒక్కరూ చలించిపోయారు. దేవుడా.. ఎంత పని చేశావయ్యా అంటూ గుండెలు చెమ్మగిల్లేలా రోదించారు. నకరికల్లు: తలకొరివి పెట్టాల్సిన కొడుకు కుటుంబంతో సహా తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లి ఆవేదన చెప్పనలవి కావడం లేదు. ‘పిల్లలను అమ్మమ్మ వాళ్లింట్లో వదిలి తెల్లారేసరికి వస్తాను జాగ్రత్త.. అని చెప్పి.. నన్ను ఏకాకిని చేసి వెళ్లారే’ అంటూ ఆ తల్లి విలపిస్తున్న తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. రొంపిచర్ల మండలం మర్రిచెట్టుపాలెం గ్రామ సమీపంలో ఆదివారం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. మృతులంతా నకరికల్లు మండలం చీమలమర్రి వాసుల కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన దొంతుల ఆంజనేయులు(38) వ్యవసాయ కూలీ. ఆదివారం కూడా ధాన్యం కాటా పనికి వెళ్లాడు. భార్య తిరుపతమ్మ(35) మిర్చికోతకు వెళ్లింది. వేసవి సెలవులు కావడంతో పిల్లలు అంజలి(13), కోటేశ్వరి(11) తల్లితోనే ఉన్నారు. పనులు పూర్తయ్యాక నలుగురు సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. పిల్లలు అమ్మమ్మ వాళ్ల ఊరు వెళ్దామని మారం చేశారు. నాయనమ్మ దొంతుల లక్ష్మి రెండు రోజులు ఆగి తాను వదలిపెట్టి వస్తానని సర్ది చెప్పడానికి ప్రయత్నించినా పిల్లలు వినలేదు. దీంతో పిల్లలను విడిచి రేపు ఉదయం కల్లా వచ్చేస్తామని తల్లితో చెప్పి అద్దంకి సమీపంలోని వేంపాడుకు బయలుదేరారు. బయలుదేరిన అర్ధగంటలోపే మృత్యువాత పిల్లలతో సరదాగా వారి అమ్మమ్మ గారింటికి వెళ్తుండగా ఎదురుగా లారీ మృత్యు రూపంలో వచ్చింది. వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే విషయం గ్రామంలోకి చేరింది. కొడుకు, కోడలు, మనవరాళ్ల మృతి వార్త విన్న లక్ష్మి సొమ్మసిల్లింది. ఇరుగుపొరుగు అక్కడకు చేరుకొని ఆమెను ఎంత ఓదారుస్తున్నా ఆమె గుండెకోత తీర్చలేకపోయారు. అయోపాపం.. కష్టజీవులు రోజు కూలీపని చేసుకొనే పేద కుటుంబం. పిల్లలిద్దరూ ఆరో తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. ‘రెక్కల కష్టం మీద పిల్లలను చదివించుకుంటున్న వారిని.. దేవుడు ఎంత అన్యాయం చేశాడోన’ని గ్రామస్తులు విలపించారు. వృద్ధురాలు లక్ష్మికి ఇద్దరు కుమారులుకాగా పెద్ద కుమారుడు వేరే ప్రాంతానికి ఉపాధి కోసం వెళ్లాడు. -
రూమ్ హీటరుతో ఊపిరాడక ఇంజనీర్ కుటుంబం దుర్మరణం
సాక్ష, న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని కోట్లా ముబారక్‌పుర్‌లో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అతని భార్య, కుమారుడు శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరై నిద్రలోనే ప్రాణాలు విడిచారు. వారి గదిలో రూమ్ మీటరు స్విచ్ ఆన్ చేసి ఉందని పోలీసులు తెలిపారు. సతీష్‌కుమార్, భార్య శశి, ఐదు నెలల కొడుకు అర్చిత్‌తో కోట్లా ముబారక్‌పుర్‌లో అద్దెకు ఉండేవాడు. బుధవారం ఉదయం ఎనిమిది గంటలైనా వారి ఇంటి తలుపులు తెరుచుకోకపోవడంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో మొత్తం కుటుంబం మరణించి ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఉదయం ఎనిమిదిన్నరకు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి రూమ్‌హీటర్ కారణంగానే సతీష్‌కుమార్ కుటుంబం దుర్మరణం చెందిందని గుర్తించారు. చలి తీవ్రతను తట్టుకోలేక రూము హీటరు ఆన్ చేసి, తలుపులు కిటికీలు అన్నీ గట్టిగా మూసి నిద్రపోవడంతో ఆక్సీజన్ అందక చనిపోయారని పోలీసులు తెలిపారు. -
ఏ కష్టం కడతేర్చిందో..?!
ఎల్.ఎన్.పేట: రాత్రి వరకు ఇరుగుపొరుగు వారితో సరదాగానే గడిపిన ఆ కుటుంబం తెల్లవారేసరికి ఈ లోకంలోనే లేకుండా పోయింది. నిద్రలోనే నాలుగు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ సంఘటన ఇటు ఎల్.ఎన్.పేటను.. అటు వసప గ్రామాన్ని విషాదంలో ముంచేసిం ది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కొత్తూరు మండలం వసప గ్రామానికి చెందిన పిచ్చుక తవిటయ్య, లక్ష్మిల ఏకైక కుమారుడు భద్రయ్య(35). ఆయనకు భార్య నాగమణి(30), కుమారులు హరిప్రసాద్(8), చంద్రమౌళి(6) ఉన్నారు. బతుకు తెరువు కోసం భ ద్రయ్య సుమారు ఏడాదిన్నర క్రితం అత్తవారి ఊరుకు సమీపంలో ఉన్న ఎల్.ఎన్.పేటకు వలస వచ్చి షాపు అద్దెకు తీసుకొని ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలు, ఆటో ల రిపేర్లు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. షాపు ఎదురుగానే ఇల్లు అద్దెకు తీసుకొని భార్యాపిల్లలతో కాపురం పెట్టాడు. పిల్లలి ద్దరు స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. చుట్టుపక్కలవారితో సరదాగా ఉండే ఈ కుటుంబీకులు శుక్రవారం రాత్రి కూడా అలాగే గడిపా రు. శనివారం శని త్రయోదశి కావడంతో శనీశ్వరాలయానికి వెళతామని ఇరుగుపొరుగు వారికి చెప్పారు. అనంతరం భోజనాలు చేసి నిద్రపోయారు. గుడికి వెళ్లారనుకున్నాం.. శనివారం ఉదయం పది గంటల వరకు ఆ ఇంటి తలుపులు తెరుచుకోలేదు. రాత్రి చెప్పినట్లు ఆలయానికి వెళ్లి ఉంటారని భావించిన చుట్టుపక్కలవారు మొద ట పెద్దగా పట్టించుకోలేదు. సమయం గడుస్తోంది.. పది గంటలైంది.. అయినా భద్రయ్య ఇంటి వాతావరణంలో ఎలాం టి మార్పులేదు. దాంతో చిన్న అనుమానం మొదలైంది. కొందరు తలుపు, కిటికీల సందుల్లోంచి లోపలికి చూశారు. నలుగురూ మంచాలపై కనిపిం చారు. ఇంకా పడుకొని ఉన్నారనుకుని వెళ్లిపోయారు. అయితే 11 గంటలవుతున్నా ఆ ఇంటి సభ్యులు బయటకు రాకపోవడంతో స్థానికుల్లో అనుమానాలు బలపడ్డాయి. వెంటనే సరుబుజ్జిలి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఎస్సై ఎం.శ్రీనివాస్ సిబ్బందితో అక్కడికి చేరుకొని ఇంటి తలుపులు తెరిపిం చారు. లోపలికి వెళ్లి పరిశీలిస్తే.. నలుగురూ విగతజీవులుగా కనిపించారు. విషయం క్షణాల్లో ఊరంతా పాకింది. మొత్తం విషా దం అలుముకుంది. బంధువులు, స్థాని కులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కుటుంబ సభ్యు లు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఆ కుటుంబానికి ఎటువంటి కష్టాలు, ఆర్థిక సమస్యలు లేవని బంధువులు, స్థానికు లు చెప్పారు. పిల్లలిద్దరూ బాగానే చదువుతారని సంఘటన స్థలానికి వచ్చిన పాఠశాల ఉపాధ్యాయుడొకరు చెప్పారు. సమాచారం తెలుసుకొని హిరమండలం మండలం చిన్న కొల్లివలసకు చెందిన నాగమణి కన్నవారు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇంటిని, మెకానిక్ షెడ్‌ను శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ టి. మోహనరావు పరిశీలించారు. స్థానికు లు, మృతుల తల్లిదండ్రులు, బంధు వులను విచారించారు. మృతదేహా లను పోస్టుమార్టానికి పంపించి కేసు న మోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ చె ప్పా రు. పోస్టుమార్టం నివేదిక అందేవరకు వారి మరణానికి కారణాలు చెప్పలేమని, ఇంట్లో ఎలాంటి ఆనవాళ్లు, అనుమానాస్పద పరిస్థితులు కనిపించలేదన్నారు. తల్లడిల్లిన తల్లిదండ్రులు వసప(కొత్తూరు): భద్రయ్య కుటుంబ మరణంతో స్వగ్రామం కొత్తూరు మం డలం వసపలోనూ విషాదం అలుముకుంది. కుటుంబ పోషణకు భద్రయ్య ఎల్.ఎన్.పేటకు తరలివెళ్లినా అతని తల్లిదండ్రులు వసపలోనే ఉంటున్నారు. కూలి పనులు చేసుకొని జీవిస్తున్న వీరి ద్దరూ కొడుకు, కోడలు, ఇద్దరు మనవలు మృతి చెందిన విషయం తెలుసుకొని ఒక్కసారిగా కుంగిపోయారు. చెట్టంత కొడుకు మృతి చెందడంతో ఏ విధంగా బతకాలని ఆవేదనగా ప్రశ్నించడం స్థాని కులను కంట తడిపెట్టించింది. వారితోపాటు ఇతర బంధువులు హూటాహుటిన ఎల్.ఎన్.పేటకు వెళ్లారు. ఏం జరిగి ఉంటుంది? భద్రయ్యకు ఆర్థికపరమైన సమస్యలే వీ లేవని తల్లిదండ్రులతో పాటు అత్తమామాలు చెబుతున్నారు. భార్యాభర్తలిద్దరిదీ ఉన్నంతలో సరిపెట్టుకునే తత్వమేనని అన్నారు. పురుగుల మందులాంటి విషపూరిత పదార్థాలు సేవించారనడానికి.. ఇంట్లో అటువంటి ఆనవాళ్లు లభించలేదని పోలీసులు చెప్పారు. నిద్రలోనే మరణించినట్లు ఉందన్నారు. రాత్రి తీసుకున్న ఆహార పదార్థాల్లో బల్లి వంటివి పడి విషపూరితమయ్యాయా?.. లేక చెరువు గట్టున ఇల్లు ఉన్నందున విషపురుగులు ఏమైనా కుట్టాయా?? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషపూరిత ఆహారం తిన్నా.. పురుగూపుట్రా కుట్టినా.. వాంతులు కావడం, అస్వస్థతకు గురవడం జరుగుతుంది. అదే జరిగితే బయటకు వచ్చి ఇరుగుపొరుగువారి సహాయం తీసుకుంటారు. పైగా వాంతులు చేసుకున్న ఆనవాళ్లు కూడా లేవు. ఎవరితోనూ తగాదాలు, సమస్యలు లేదు. దంపతులిద్దరూ ఎంతో సరదాగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు.ఇవేవీ కానప్పుడు.. వీరి మరణానికి కారణమేమిటన్నది మిస్టరీగా మారింది.