
ప్రతీకాత్మకచిత్రం
నూతన సంవత్సరం తొలిరోజునే ఓ వ్యాపారి కుటుంబం తమకు తాము తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
లక్నో : నూతన సంవత్సరం తొలి రోజే విషాదం చోటుచేసుకుంది. మధుర హైవేలో బుధవారం ఓ కారులో వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు విగతజీవులుగా పడిఉండటం గుర్తించారు. ఘటనా స్ధలంలో పిస్టల్ లభించడంతో మృతులు తుపాకితో కాల్చుకుని మరణించినట్టు భావిస్తున్నారు. ఘటనా స్ధలం నుంచి తుపాకిని స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతులను నీరజ్ అగర్వాల్, నేహ అగర్వాల్, ధన్య అగర్వాల్‌లుగా గుర్తించారు. వ్యాపారవేత్త ఆయన భార్య, కుమార్తె ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్ధలంలోనే తీవ్ర గాయాలతో బాధపడుతున్న శౌర్య అగర్వాల్ అనే బాలుడిని గుర్తించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.