
పంజాబ్ నేషనల్ బ్యాంకును సుమారు రూ. 13వేల కోట్లు మోసం చేసి భారతదేశాన్ని విడిచిపెట్టి బెల్జియం పారిపోయిన వజ్రాల వ్యాపారి 'మెహుల్ చోక్సీ'ను రప్పించడానికి భారత ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం.. బెల్జియంలోని సంబంధిత అధికారులను సంప్రదించింది.
వేలకోట్లు మోసం చేసి.. ఆంటిగ్వా-బార్బుడా పౌరసత్వం తీసుకున్న మెహుల్ చోక్సీ.. ఈ మధ్య కాలంలోనే బెల్జియం వెళ్ళాడు. తన భార్య ప్రీతి బెల్జియన్ పౌరురాలు అని తెలుస్తోంది. దీంతో చోక్సీ కూడా అక్కడ రెసిడెన్సీ కార్డ్ పొందాడు. బెల్జియన్ నివాసం కోసం తప్పుడు పత్రాలు ఉపయోగించారని చోక్సీపై ఆరోపణలు ఉన్నాయి.
నిజానికి పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చిన తరువాత.. చోక్సి, నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయారు. ఛోక్సీ ఆంటిగ్వా-బార్బుడాకు పారిపోగా.. నీరవ్ మోదీ బ్రిటన్ జైలులో ఉన్నాడు. వీరిని భారత్‌కు రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన ఆంటిగ్వా-బార్బుడా విదేశాంగ మంత్రి ఈపీ ఛెత్ గ్రీన్ మాట్లాడుతూ.. మెహుల్ ఛోక్సీ ప్రస్తుతం తమ దేశంలో లేరని, వైద్యం కోసం విదేశాలకు వెళ్లినట్లు తెలిసిందని వెల్లడించారు. ప్రస్తుతం చోక్సి విదేశాల్లో ఉన్నప్పటికీ.. భారతదేశ పౌరసత్వాన్ని వదులుకోలేదు.
ఇదీ చదవండి: వారానికి 70 గంటల పని: మొదటిసారి స్పందించిన సుధామూర్తి
ఇక లండన్ జైలులో ఉన్న నీరవ్ మోదీకి బెయిల్ ఇవ్వడంపై కోర్టులు పదే పదే నిరాకరించడంతో.. తనను భారతదేశానికి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాడు. మెహుల్ ఛోక్సీని బెల్జియం అధికారులు.. భారత ప్రభుత్వానికి అప్పగిస్తారా?.. లేదా?, అనే విషయాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment