
ముంబై: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. బుధవారం ఉదయం 4 గంటల సమయంలో ఛత్రపతి శంభాజీ నగర్‌లో ఉన్న టైలరింగ్ షాప్‌లో అగ్నిప్రమాదం జరిగింది. భారీ ఎత్తున మంటలు చెలరేగటంతో స్థానికులు ఫైర్ పోలీసులు సమాచారం అంధించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురు ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
‘టైలర్ షాప్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మృతి చెందిన వారు పైఫ్లోర్‌లో నివసిస్తున్నారు. అయితే టైలర్ షాప్‌లో జరిగిన అగ్ని ప్రమాదపు పొగ పీల్చుకొని మృతి చెందినట్లు తెలుస్తోంది’ అని శంభాజీ నగర్ సీపీ మనోజ్ లోహియా తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకోని దార్యప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment