ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డోంబివాలిలోని ఓ ఎత్తైన భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డోంబివాలి ఈస్ట్‌లోని లోధా పలావా టౌన్‌షిప్‌లోని కాసా అరేలియా భవనంలో ఈ ఘటన జరిగింది. భవనంలోని ఆరు అంతస్తుల్లో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది.. సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. అయిదు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
భవనం నుంచి భారీ ఎత్తున మంటలు. దట్టమైన పొగలు వెలువుతున్న దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడున్నాయి. అయితే రెస్క్యూ టీమ్‌లు అందరినీ సకాలంలో బయటకు తీసుకు రావడంతో.. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
చదవండి: అది ప్రేమే..కామం కాదు: పోక్సో కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు
#NewsFlash | Massive fire broke out at in a high-rise building in Mumbai’s Dombivali, 6 floors set ablaze pic.twitter.com/VekPUwDS5c
— CNBC-TV18 (@CNBCTV18Live) January 13, 2024
The fire broke at Tata Orolia Blg at Palawa Phase 2 Dombivali (East) has been completely extinguished around 14:30 hrs & no one was injured in the said incident.pic.twitter.com/BXHuQ1GP9q
— मुंबई Matters™ (@mumbaimatterz) January 13, 2024
Comments
Please login to add a commentAdd a comment