mumabi
-
ఐఫోన్ 16 అందుకున్న తొలి కస్టమర్ ఇతనే..
ప్రపంచంలో ఐఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఖరీదైనా కొనడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. తాజాగా ఐఫోన్ 16 సిరీస్ విడుదలైంది. దీంతో ముంబైలోని యాపిల్ స్టోర్‌కు కస్టమర్లు పోటెత్తారు. స్టోర్ తెరవక ముందు నుంచే బారులు తీరారు.ముంబైకి చెందిన ఉజ్వల్ అనే యువకుడు స్థానిక స్టోర్‌లో ఐఫోన్ 16 అందుకున్న తొలి కస్టమర్‌గా మారాడు. ఇందు కోసం ముందు రోజే ఆయన ముంబైలోని బీకేసీలో ఉన్న యాపిల్ స్టోర్ వద్దకు చేరుకున్నాడు. 21 గంటల పాటు లైన్లో వేచి ఉన్నాడు. ముందు రోజు రాత్రి ఉజ్వల్ అక్కడికి చేరుకోగానే పదుల సంఖ్యలో జనం క్యూలో అతనితో చేరారు. ఉదయానికి వందల మంది వచ్చేశారు. యాపిల్ స్టోర్ తలుపులు తెరుచుకోగానే ఉజ్వల్ మొదటి కస్టమర్‌గా లోపలికి అడుగుపెట్టాడు.యాపిల్ అభిమాని అయిన ఉజ్వల్ ఐఫోన్ తొలి కస్టమర్ కావడం ఇదే మొదటిసారి కాదు. కొత్త ఐఫోన్ విడుదలైన ప్రతిసారి ముందు వరుసలో ఉంటుంటాడు. గత సంవత్సరం ఐఫోన్ 15 విడుదలైనప్పుడు కూడా కొనుగోలు చేయడానికి మొదటి వ్యక్తిగా 17 గంటలు వేచి ఉన్నాడు. యాపిల్ ఉత్పత్తుల పట్ల అతనికున్న క్రేజ్ ఎలాంటిదో దీన్ని బట్టి తెలుస్తోంది. -
దుమ్ములేపిన శార్దూల్, తుషార్.. విఫలమైన పృథ్వీ షా
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ రెండో సెమీ ఫైనల్లో ముంబై- తమిళనాడు తలపడుతున్నాయి. శరద్ పవార్ క్రికెట్ అకాడమీలో శనివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తమిళనాడు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ముంబై పేసర్ల దెబ్బకు కేవలం 146 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. తొలుత.. ‘లార్డ్’ శార్దూల్ ఠాకూర్.. తమిళనాడు ఓపెనర్ సాయి సుదర్శన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని డకౌట్‌గా వెనక్కిపంపాడు. ఆ తర్వాత మరో ఇద్దరు ఫాస్ట్‌బౌలర్లు మోహిత్ అవస్థి, తుషార్ దేశ్‌పాండే తమిళ బ్యాటర్ల పనిపట్టారు. మోహిత్.. ఎన్ జగదీశన్(4) రూపంలో వికెట్ దక్కించుకోగా.. ప్రదోష్ పాల్(8), కెప్టెన్ సాయి కిషోర్(1), ఇంద్రజిత్ బాబా(11) వికెట్లు పడగొట్టాడు. ఇక ప్రమాదకరంగా మారుతున్న విజయ్ శంకర్(44)ను శార్దూల్ ఠాకూర్ అవుట్ చేసి మరోసారి బ్రేక్ అందించగా.. అర్ధ శతకం దిశగా వెళ్తున్న వాషింగ్టన్ సుందర్(43)ను స్పిన్నర్ తనుశ్ కొటియాన్ పెవిలియన్‌కు పంపాడు. ఓవరాల్‌గా తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో పేసర్లు శార్దూల్ రెండు, తుషార్ దేశ్‌పాండే మూడు, మోహిత్ అవస్థి ఒక వికెట్ తీయగా.. స్పిన్నర్లు తనుశ్ కొటియాన్, ముషీర్ ఖాన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో తొలిరోజే తమిళనాడు ఆలౌట్ చేసి.. బ్యాటింగ్ మొదలుపెట్టిన ముంబైకి కూడా శుభారంభం లభించలేదు. ఓపెనర్లు పృథ్వీ షా(5), భూపేన్ లల్వానీ(15) పూర్తిగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం నాటి ఆట పూర్తయ్యేసరికి ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. తమిళనాడు కంటే ప్రస్తుతం 101 పరుగులు వెనుకబడి ఉంది. Early Breakthroughs for Mumbai 🙌 Shardul Thakur and Mohit Avasthi get the big wickets of Sai Sudharsan and N Jagadeesan, respectively 👌👌@IDFCFIRSTBank | #RanjiTrophy | #MUMvTN | #SF2 Follow the match ▶️ https://t.co/697JfqUC9i pic.twitter.com/H1cgkXWzpO — BCCI Domestic (@BCCIdomestic) March 2, 2024 -
Mumbai: అటల్ సేతుపై మొదటి ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు
ముంబై: ముంబైలో కొత్త నిర్మించిన అటల్ సేతు వంతెనపై మొదటి ప్రమాదం జరిగింది. హైస్పీడ్‌లో ఉన్న ఓ కారు అదుపుతప్పి వంతెన రైలింగ్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో సినిమా రేంజ్లో పల్టీలు కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ముంబైలోని అటల్ సేతు వంతెనపై మొదటి ప్రమాదం జరిగింది. హైస్పీడ్‌లో ఉన్న మరో కారును ఓవర్ టేక్ చేయబోయి వంతెన రైలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు సినిమా రేంజ్లో రెండు పల్టీలు కొట్టింది. అయితే, వంతెనపై మరో కారులో ఉన్న డ్యాష్క్యామ్లో ఇదంతా రికార్డు అయ్యింది. కాగా, ఈ ప్రమాదంలో కారును ప్రయాణిస్తున్న వారు స్వల్పంగా గాయపడినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ప్రమాదానికి గురైన వారు రాయ్‌గఢ్‌లోని చిర్లేకు వెళ్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. ముంబైలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘అటల్ సేతు’ను ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించారు. దీనినే ముంబై ట్రాన్స్‌హార్బర్ లింక్ అని కూడా పిలుస్తున్నారు. ముంబైలో దాదాపు రూ.20 వేల కోట్ల వ్యయంతో ఆరు లేన్లుగా నిర్మించిన ఈ బ్రిడ్జిని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. కాగా అటల్ సేతు మొత్తం పొడువు 22 కిలోమీటర్లు. 16.5 కిలోమీటర్ల మేర అరేబియా సముంద్రంపై.. 5.5 కిలో మీటర్ల భూభాగంపై నిర్మించారు. భూకంపాలను సైతం తట్టుకొనేలా దీని నిర్మాణంలో అధునాతన సాంకేతికతతో నిర్మించారు. ఇది ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే, ముంబై-గోవా హైవేలను కలుపుతుంది. ఈ బ్రిడ్జిపై టోల్ ఫీజు ఒకవైపు రూ. 250 వసూలు చేయనున్నారు. -
ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరు అంతస్తుల్లో చెలరేగిన మంటలు
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డోంబివాలిలోని ఓ ఎత్తైన భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డోంబివాలి ఈస్ట్‌లోని లోధా పలావా టౌన్‌షిప్‌లోని కాసా అరేలియా భవనంలో ఈ ఘటన జరిగింది. భవనంలోని ఆరు అంతస్తుల్లో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది.. సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. అయిదు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. భవనం నుంచి భారీ ఎత్తున మంటలు. దట్టమైన పొగలు వెలువుతున్న దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడున్నాయి. అయితే రెస్క్యూ టీమ్‌లు అందరినీ సకాలంలో బయటకు తీసుకు రావడంతో.. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. చదవండి: అది ప్రేమే..కామం కాదు: పోక్సో కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు #NewsFlash | Massive fire broke out at in a high-rise building in Mumbai’s Dombivali, 6 floors set ablaze pic.twitter.com/VekPUwDS5c — CNBC-TV18 (@CNBCTV18Live) January 13, 2024 The fire broke at Tata Orolia Blg at Palawa Phase 2 Dombivali (East) has been completely extinguished around 14:30 hrs & no one was injured in the said incident.pic.twitter.com/BXHuQ1GP9q — मुंबई Matters™ (@mumbaimatterz) January 13, 2024 -
ఆస్తులు అమ్మేస్తున్న శ్రీదేవి భర్త!
సీనియర్ సినీ నిర్మాత బోనీ కపూర్, అతని కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ముంబైలోని అంధేరి శివారులో ఉన్న తమ నాలుగు అపార్ట్మెంట్లను విక్రయించినట్లు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ముంబైలోని అంధేరీ వెస్ట్‌లో రెండు ఫ్లాట్లను రూ. 6.02 కోట్లకు విక్రయించారు. దీనికి సంబంధించిన ఒప్పందం 2023 నవంబర్ 2 నమోదైనట్లు తెలుస్తోంది. రెండు అపార్ట్మెంట్లు లోఖండ్వాలా కాంప్లెక్స్‌లోని మొదటి అంతస్తులో ఉన్నాయి. రెండు ఫ్లాట్ల విస్తీర్ణం 1870.57 చదరపు అడుగులు. ఈ ఫ్లాట్లు ఒక ఓపెన్ కార్ పార్కింగ్తో వస్తాయి. ఈ రెండు ఫ్లాట్లను కొనుగోలు చేసినవారు సిద్ధార్థ్ నారాయణ్, అంజు నారాయణ్‌గా చెబుతున్నారు. అదే కాంప్లెక్స్‌లో ఉన్న మరో రెండు అపార్ట్మెంట్లను వారు మరో రూ. 6 కోట్లకు విక్రయించారు. ఈ ఒప్పందం 2023 అక్టోబర్ 12 న జరిగినట్లు సమాచారం. 1614.59 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఫ్లాట్లు రెండు కార్ పార్కింగ్‌లతో వస్తాయి. వీటిని ముస్కాన్ బహిర్వానీ, లలిత్ బహిర్వానీలకు విక్రయించినట్లు సమాచారం. 2022లో బోనీ, జాన్వీ, ఖుషీలు 65 కోట్ల రూపాయల విలువైన బాంద్రాలో డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ని కొనుగోలు చేశారు. దీని విస్తీర్ణం 6421 చదరపు అడుగుల వరకు ఉంటుంది. ఇందులో ఐదు పార్కింగ్ ప్రదేశాలు ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: భారీగా పెరిగిన అపార్ట్మెంట్ సేల్స్ - హయ్యెస్ట్ ఈ నగరాల్లోనే.. గతంలో ఆస్తులు విక్రయించిన సెలబ్రిటీలు సెలబ్రిటీలు ఖరీదైన ప్లాట్లను కొనుగోలు చేయడం, విక్రయించడం కొత్తేమీ కాదు. కొన్ని నెలల క్రితం నటుడు 'రణవీర్ సింగ్' ముంబైలోని ఒక లగ్జరీ టవర్లోని రెండు ఫ్లాట్లను రూ.15.24 కోట్లకు విక్రయించాడు. నవంబర్‌లో నటి 'ప్రియాంక చోప్రా' ఓషివారాలోని లోఖండ్వాలా కాంప్లెక్స్‌లో 2,292 చదరపు అడుగుల బిల్ట్ అప్ ఏరియాలో ఉన్న రెండు పెంట్‌హౌస్‌లను రూ. 6 కోట్లకు విక్రయించింది. -
ముంబై అగ్ని ప్రమాదం.. పోటాపోటీ ఆర్థిక సాయం
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో శనివారం చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. దురదృష్టకర అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.5లక్షల పరిహారం ఇవ్వనుందని మంత్రి ఆదిత్యా ఠాక్రే తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ ముంబైలో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ముంబైలోని టార్డియోలో భవనం అగ్ని ప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఒక్కొక్కరికీ రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియాను మోదీ ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి రూ.50వేలు అందజేస్తామమని పీఎంఓ వెల్లడించింది. PM Narendra Modi has approved an ex-gratia of Rs. 2 lakh each from Prime Minister’s National Relief Fund for the next of kin of those who have lost their lives due to the tragic hospital fire in Bhandara, Maharashtra. Rs 50,000 would be given to those seriously injured: PMO — ANI (@ANI) January 11, 2021 అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశం: డిప్యూటీ సీఎం అజిత్ పవార్ టార్డియో ప్రాంతంలోని కమలా భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంపై విచారణకు ఆదేశించామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. మంత్రి ఆదిత్య ఠాక్రే, ముంబై నగర సంరక్షక మంత్రి అస్లాం షేక్ ఘటన స్థలాన్ని పరిశీలిస్తారని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 15 మందిపైగా గాయపడ్డారని బృహన్ముంబై కార్పొరేషన్ అధికారులు తెలిపారు. చదవండి: ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి -
ఆకాశాన్ని తాకే అద్భుతాలు.. ఇవి తెలుసా?
World Skyscraper Day 2021: జనారణ్యంలో ఆకాశాన్ని తాకే అద్భుతాల్ని ‘బహుళ అంతస్తుల భవనాలు’ అని పిలుచుకుంటున్నాం. నగరాలకు హారాలుగా మారుతున్న భారీ భవనాలు మన చుట్టూనే బోలెడన్ని ఉన్నాయి. వీటికి అయ్యే ఖర్చు మాత్రమే కాదు.. కట్టడానికి సమయం, వాటి నిర్మాణం వెనుక శారీరక శ్రమ కూడా వాటిలాగే ఆకాశాన్ని అంటుతుంటాయి. అందుకే వీటికంటూ ఒక రోజు కూడా ఉంది. ఇవాళ ప్రపంచ బహుళ అంతస్తుల భవన దినోత్సవం(స్కైస్క్రాపర్ డే). ► స్కైస్క్రాపర్స్ డే ప్రధాన ఉద్దేశం.. 130 ఏళ్లుగా బహుళ అంతస్తుల నిర్మాణాల కోసం కృషి చేస్తున్న ఇంజినీరింగ్ నిపుణులు, ఆర్కిటెక్టర్లను గౌరవించుకోవడం, వాళ్ల గురించి తెలుసుకోవడం కోసం. ► మొదటి బహుళ అంతస్తుల భవవాన్ని మొదటగా డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ విలియమ్ లె బారోన్ జెన్నెకి గుర్తింపు దక్కింది. ► చికాగోలోని హోం ఇన్సురెన్స్ భవవాన్ని(1984).. ప్రపంచంలోని మొట్టమొదటి స్కైస్క్రాపర్గా గుర్తించారు. ► సెప్టెంబర్ 3న ప్రముఖ ఆర్కిటెక్ట్ లూయిస్ సుల్లైవన్ పుట్టినరోజు. ఈయన్ని ఫాదర్ ఆఫ్ స్కైస్క్రాపర్స్ అంటారు. ► ఈయన మోడ్రనిజానికి కూడా ఫాదర్లాంటి వాడనే పేరుంది. అమెరికాలోని వెయిన్‌రైట్ బిల్డింగ్, ది క్రౌజ్ మ్యూజిక్ స్టోర్, యూనియన్ ట్రస్ట్ బిల్డింగ్, ది ప్రూడెన్షియల్ బిల్డింగ్.. ఇలా ఎన్నో బిల్డింగ్‌లను చీఫ్ ఆర్కిటెక్ట్‌గా పని చేశారు. ► అందుకే ఈ రోజును(సెప్టెంబర్ 3ను) ‘వరల్డ్ స్కైస్క్రాపర్’డేగా నిర్వహిస్తున్నారు. ► స్కైస్క్రాపర్స్(బహుళ అంతస్తుల భవంతి) ఆధునిక యుగంలో భారీ భవనాలకు ముద్దుగా పెట్టుకున్న పేరు. ► కనీసం వంద మీటర్ల నుంచి 150 మీటర్లు ఉంటేనే.. అది బహుళ అంతస్తుల భవనంగా గుర్తిస్తారు.(కంపల్సరీ అనేం లేదు). కాకపోతే పది అంతస్తుల కంటే ఎక్కువ మాత్రం ఉండాలి. అన్ని వసతులూ ఉండాలి. ► ప్రపంచంలో అతిఎత్తైన బహుళ అంతస్తుల భవనం.. బుర్జ్ ఖలీఫా ► యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ దుబాయ్‌లో ఉన్న బుర్జ్ ఖలీఫా కట్టడం.. ప్రపంచ వింతల్లోనూ చోటు దక్కించుకుంది. అమెరికా ఆర్కిటెక్ట్ అడ్రియాన్ స్మిత్ దీనిని రూపొందించగా.. స్కిడ్మోర్, ఓవింగ్స్, మెర్రిల్ సంస్థలు భాగస్వాములుగా వ్యవహరించాయి. బిల్ బేకర్ నిర్మాణ ఇంజినీర్‌గా వ్యవహరించాడు. ఎమ్మార్ ప్రాపర్టీస్ దీని ఓనర్. బుర్జ్ ఖలీఫా ఎత్తు 828 మీటర్లు(2, 722 అడుగులు), 168 అంతస్తులు 12 వేల మంది ఈ బిల్డింగ్ కోసం పని చేశారు ఒకటిన్నర బిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ భవనాన్ని కట్టించారు జనవరి 4, 2010 నుంచి ఇది ఓపెన్ అయ్యింది లిఫ్ట్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లు. అంటే రెండు నిమిషాల్లో 124వ అంతస్తుకు చేరుకోవచ్చు. ► ప్రపంచంలో రెండో పెద్ద బహుళ అంతస్తుల భవనం.. షాంగై టవర్(చైనా). ఎత్తు 632 మీటర్లు(2,073 అడుగులు)-163 అడుగులు. ఇది మెలికలు తిరిగి ఉండడం విశేషం. అమెరికన్ ఆర్చిటెక్ట్ మార్షల్ సస్రా్టబలా, చైనా ఆర్కిటెక్ట్ జన్ గ్సియాలు దీనిని డిజైన్ చేశారు. ► భారత్‌లో అతిపెద్ద భవనంగా ముంబై ‘పోలయిస్ రాయల్’కు పేరుంది. దీని ఎత్తు 320 మీటర్లు(1,050 అడుగులు)-88 అంతస్తులు. నోజర్ పంథాకీ నేతృత్వంలోని తలాటి పంథాకీ అసోషియేట్స్ ఈ భవనాన్ని రూపకల్పన చేసింది. - సాక్షి, వెబ్ స్పెషల్ చదవండి: పేన్లను పచ్చడి చేసి వ్యాక్సిన్ తయారు చేశాడు -
పెట్రో ధరలు: ఇవాళ ఎంత పెరిగిందంటే!
న్యూఢిల్లీ: చమురు కంపెనీలు వాహనదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. మంగళవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఒకరోజు వ్యవధిలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ నెలలో వరుసగా పదిసార్లు పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. తాజాగా చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై 27 పైసలు, లీటర్ డీజిల్‌పై 31 పైసలు పెంచాయి. పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.92.58, డీజిల్ రూ.83.51కు చేరింది. మరో వైపు ఆర్థిక రాజధాని ముంబైలో వందకు చేరువైంది. ప్రస్తుతం పెట్రోల్ రూ.99.14, డీజిల్, రూ.90.71కు పెరిగింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో అత్యధికంగా రికార్డు స్థాయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.80, డీజిల్ రూ.96.30కి చెరింది. ► కోల్‌కతాలో పెట్రోల్ రూ.92.92, డీజిల్ రూ.86.35 ► చెన్నైలో పెట్రోల్ రూ.94.54, డీజిల్ రూ.88.34 ► హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.96.50, డీజిల్ రూ.91.04 ► జైపూర్‌లో పెట్రోల్ రూ.99.30, డీజిల్ రూ.92.18 ► బెంగళూరులో పెట్రోల్ రూ.95.94, డీజిల్ రూ.88.53 (చదవండి:India WPI Inflation: టోకు ధరలు... గుభేల్!) -
వెబ్ దునియాను ఏలేస్తున్న బెంగాలీ బ్యూటీ
కేవలం స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అనుకోలేదు. తన కంటే తన పాత్రలకే అభిమానులు ఉండాలని అనుకుంది, సాధించింది. విభిన్న పాత్రలతో వెబ్ సిరీస్ దునియాను ఏలేస్తున్న బెంగాలీ బ్యూటీ స్వస్తిక గురించి కొన్ని మాటల్లో.. ► కోల్‌కతాలో పుట్టి పెరిగింది. పద్దెనిమిదేళ్ల వయసులోనే ప్రముఖ బెంగాలీ సింగర్ సాగర్ సేన్ కుమారుడు ప్రమిత్ సేన్‌తో వివాహం అయింది. రెండేళ్లకే ఆ బంధం నుంచి విడిపోయి, ఒంటరిగా జీవిస్తోంది. ఆమెకు ఒక పాప. పేరు అన్వేష. ► రెండు దశాబ్దాల కిందటే ‘హేమంతర్ పాఖీ’ అనే బెంగాలీ సినిమాతో తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది స్వస్తిక. అంతకు ముందు ‘దేవదాసి’ బెంగాలీ టీవీ సీరియల్లో నటించింది. ఆ తర్వాత ‘మస్తాన్’, ‘ముంబయ్ కటింగ్స్’ సినిమాలు చేసింది. ► నిదానమే ప్రధానం ఆమె లక్షణం. వరుస అవకాశాలకు ఆశ పడకుండా.. కేవలం ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేస్తూ వస్తోంది. ‘డిటెక్టివ్ బ్యోమకేశ్ బక్షి’, ‘దిల్ బేచారా’ సినిమాలు మంచి గుర్తింపు తెచ్చాయి. ► ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా తను నటించిన అన్ని సినిమాలూ, వెబ్ సిరీస్‌లూ.. వరుసగా వివిధ ఓటీటీ వేదికల్లో విడుదలయ్యాయి. దీంతో, ఒకే సంవత్సరంలో ఎనిమిది విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ► రూమర్స్.. పాత్రల ఎంపికలో ఉన్న పట్టు, జీవిత భాగస్వామి ఎంపికలో లేకపోయింది. అప్పట్లో సహనటుడు సుమన్ ముఖోపాధ్యాయతో మోసపోయి, ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు ఆమెపై పెద్దగానే పుకార్లు వినిపించాయి. ఆ తర్వాత కూడా కొంతమందితో ప్రేమలో ఉండి, విడిపోయింది. ► ఒకసారి చేసిన పాత్ర తిరిగి చేయకూడదనేదే నా లక్ష్యం. నన్ను నేను ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్తగా కనిపించడానికే ఆసక్తి చూపిస్తా. ఎక్కువ సినిమాలు చేయాలి. ఎక్కువ సంపాదించాలి అనే ఆలోచనే నాకు లేదు. – స్వస్తికా ముఖర్జీ చదవండి: నేనెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదు: స్వస్తిక చదవండి: నటి సెల్ఫీ: అస్సలు బాగోలేదంటున్న నెటిజన్లు -
జిప్ తెరచి ఉంచినంత మాత్రాన.. జడ్జి సంచలన వ్యాఖ్యలు
ముంబై: పన్నెండేళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్న వేళ జస్టిస్ పుష్ప గనేడివాలా మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. మైనర్ బాలిక చేతులు పట్టుకోవడం, ప్యాంటు జిప్ తెరిచి ఉండటం వంటి చర్యలు పోక్సో చట్టం కింద నేరాలుగా పరిగణించబడవని పేర్కొన్నారు. అయితే భారత శిక్షాస్మృతి 354-ఏ(1)(i) సెక్షన్ కింద వీటిని లైంగిక వేధింపులుగా పరగణించవచ్చన్నారు. యాభై ఏళ్ల వ్యక్తి ఐదేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ నమోదైన కేసులో జస్టిస్ పుష్ప ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. కేసు ఏమిటంటే.. తమ చిన్నారి పట్ల నిందితుడు అసభ్యంగా ప్రవర్తించాడంటూ బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాయమాటలు చెప్పి తన కూతురిని పక్కకు తీసుకువెళ్లి, తన చేతులు పట్టుకుని, ఆ తర్వాత అతడి ప్యాంటు విప్పేసి వికృత చేష్టలకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో సెషన్స్ కోర్టు పోక్సో చట్టంలోని సెక్షన్ 10 కింద తీవ్రమైన లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అతడికి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 25 వేల రూపాయల జరిమానా విధించింది. (చదవండి: శరీరాన్ని శరీరం తాకలేదు గనుక..) ఈ నేపథ్యంలో కేసు బాంబే హైకోర్టుకు చేరింది. దీనిపై విచారణ చేపట్టిన నాగపూర్ ధర్మాసనం.. నిందితుడి చర్యను లైంగిక దాడి అనలేమని, కాబట్టి ఐపీసీ సెక్షన్ 354A (1) (i) ప్రకారం మాత్రమే శిక్షకు అర్హుడని పేర్కొంది. కాగా ఈ సెక్షన్ ద్వారా నిందితుడికి మూడేళ్లపాటు మాత్రమే శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాగా జనవరి 19 నాటి తీర్పులో జస్టిస్ పుష్ప ‘‘దుస్తుల పై నుంచి చిన్నారి ఒంటిని తాకినంత మాత్రాన అది పోక్సో నేరం అవదు. చర్మాన్ని చర్మం తాకాలి. కానీ ఈ కేసులో అలా జరగలేదు’’ అని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లైంగిక వేధింపుల నుంచి చిన్నారులను రక్షించేందుకు ఉద్దేశించిన పోక్సో(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్) చట్టంపై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.(చదవండి: బాంబే హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే) -
కరోనా వ్యాప్తి: నైట్ కర్ఫ్యూ, సెక్షన్ 144!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. యూరప్ దేశాల్లో సెకండ్ వేవ్ మొదలవడంతో ఫ్రాన్స్ వంటి దేశాలు మరోసారి లాక్డౌన్ విధించాయి. రెండో దశలో వైరస్ మరింత తీవ్ర ప్రభావం చూపనుందన్న హెచ్చరికల నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇక భారత్‌లోనూ ఇప్పటికే కరోనా బాధితుల సంఖ్య 90 లక్షల యాభై వేలు దాటింది. అయితే రికవరీ రేటు 93 శాతానికి పైగా ఉండటం ఊరట కలిగించే అంశమే అయినా మరోసారి కరోనా పంజా విసిరితే కట్టడి చేయడం కష్టమని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, భోపాల్ తదితర ప్రధాన పట్టణాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్డౌన్ నిబంధనలు కఠినతరం చేస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించేందుకు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలు.. ఢిల్లీ ఢిల్లీలో కరోనా థర్డ్‌వేవ్ మొదలైన తరుణంలో కేజ్రీవాల్ సర్కారు కోవిడ్-19 నిబంధనలను కఠినతరం చేసింది. మాస్కు ధరించకపోతే 2 వేల రూపాయల జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. అదే విధంగా పెళ్లి తదితర శుభాకార్యాలకు 50 మంది అతిథులకు మాత్రమే అనుమతించింది. మార్కెట్లు తెరిచేందుకు పర్మిషన్ ఇచ్చినా, పూర్తిస్థాయిలో నిఘా ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించే ఆలోచన తమకు లేదని, అయితే అదే సమయంలో రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు.(చదవండి: భారత్‌లో కరోనా యాక్టివ్ కేసులు 4.86 శాతం) ముంబై దేశ ఆర్థిక రాజధానిలో కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో డిసెంబరు 31 వరకు పాఠశాలు మూసివేయాలని బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా లోకల్ రైళ్ల ప్రయాణాలు ఇప్పుడప్పుడే మొదలుకావని ముంబై మేయర్ స్పష్టం చేశారు. కాగా ముంబై మినహా మిగతా ప్రాంతాల్లో నవంబరు 23 నుంచి స్కూళ్లు పునఃప్రారంభించాలని ఠాక్రే సర్కారు ఆదేశించింది. గుజరాత్ గుజరాత్ ముఖ్యపట్టణం అహ్మదాబాద్‌లో శుక్రవారం రాత్రి 9 నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు పూర్తిస్థాయిలో కర్ఫ్యూ విధించారు. కేవలం నిత్యావసరాల(పాలు, మెడికల్ షాపులు) షాపులు మాత్రమే తెరిచేందుకు అనుమతినిచ్చారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. నవంబరు 23 నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరవచ్చన్న ఆదేశాలు వచ్చినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో, పట్టణంలో వాటిని అమలు చేయలేమని పేర్కొన్నారు. రాజ్‌కోట్, సూరత్, వడోదరలోనూ నైట్ కర్ఫ్యూ విధించినట్లు తెలిపారు.(చదవండి: ఊరంతా కరోనా.. అతడికి తప్ప) మధ్యప్రదేశ్ ఇండోర్, భోపాల్, గ్వాలియర్, రట్లాం, విదిశలో నవంబరు 21 నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని మధ్యప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. రాత్రి 10 నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఇది కొనసాగుతుందని పేర్కొంది. అయితే కంటెన్మైంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో లాకౌడౌన్ విధించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. అంతర్రాష్ట్ర, అంతర్జిల్లా ప్రయాణాలపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. తదుపరి ఆదేశాల వరకు స్కూళ్లు మూసివేసే ఉంచాలని, క్లాస్9-12 విద్యార్థులు మాత్రం కాస్లులకు హాజరుకావొచ్చని వెల్లడించారు. ఇక సినిమా హాళ్లు 50 శాతం సీట్ల సామర్థ్యంలో యథావిధిగా కొనసాగించవచ్చని తెలిపారు. రాజస్తాన్ నవంబరు 21 నుంచి అన్ని జిల్లాల్లో సెక్షన్ 144 విధిస్తూ రాజస్తాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు నిర్ణయం తీసుకునేలా జిల్లా మెజిస్ట్రేట్(కలెక్టర్ల)లకు అధికారాలు కట్టబెట్టినట్లు సీఎం అశోక్ గెహ్లోత్ వెల్లడించారు. -
101 మంది అరెస్ట్.. ఒక్క ముస్లిం కూడా లేడు
ముంబై: మహారాష్ట్రలో గతవారం పాల్గాడ్ జిల్లాలో చోటుచేసుకున్న మూకహత్యకు సంబంధించి ఇప్పటివరకు 101మందిని అరెస్ట్ చేశామని రాష్ట్ర హోంమంత్రి అనిల్ దినేష్‌ముఖ్ బుధవారం తెలిపారు. ఈ మూకహత్యను బీజేపీ నేతలు మతకల్లోలానికి చెందినదిగా ఆరోపణలు చేయటాన్ని ఆయన ఖండించారు. హత్యకేసులో భాగంగా అరెస్ట్‌చేసిన 101 మందిలో ఒక్కరు కూడా ముస్లిం కాదని ఆయన వెల్లడించారు. బీజేపీ నాయకులు ఈ మూకహత్యకు మతం రంగు పులమడం సరికాదన్నారు. (మూకహత్య: ఉద్ధవ్ ఠాక్రేకు అమిత్ షా ఫోన్) ఇక భయంకరమైన కారోనా వైరస్‌ను అరికట్టాలంటే ప్రజలు తప్పనిసరిగా సామాజిక దూరాన్ని పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కొంతమంది కరోనా వైరస్ విస్తరిస్తున్న ఇటువంటి క్లిష్ట సమయంలో రాజకీయాలు చేస్తున్నారని వాటిని మానుకోవాలని ఆయన హితవు పలికారు. పాల్గాడ్ జిల్లాలోని దబాధి ఖన్వేల్ రహదారిని ఆనుకుని ఉన్న ఓ గ్రామం గుండా కారులో సూరత్ వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను ఆపి గ్రామస్తులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. వీరిని దొంగలుగా భావించి కారు నుంచి కిందకు దింపి రాళ్లు, ఇనుపరాడ్లతో చితకబాదారు. ఈ ఘటనలో ఆ ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. మృతులను చిక్నే మహరాజ్ కల్పవృక్షగిరి(70), సుశీల్‌గిరి మహరాజ్(35), వారి డ్రైవర్ నీలేశ్ తెల్గాడే(30)గా పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను పోలీసులు అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ ఆ గ్రామస్తులు వారిపై కూడా దాడికి తెగపడ్డారు. (దొంగల ముఠా అనుమానంతో ముగ్గురి హత్య) -
దూరంగా ఉంటునే ఆశీర్వదించారు
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో సినిమా సెలబ్రిటీలు స్వీయ నిర్భందానికి పరిమితయ్యారు. ఇక పలువురు సినీ ప్రముఖులు ప్రజలకు కరోనాపై సూచనలు, సలహాలు ఇస్తున్న విషయం తెలిసిందే. సాధారణంగా బాలీవుడ్ హీరోయిన్లు తమ బర్త్‌డే పార్టీని స్నేహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఖరీదైన రెస్టారెంట్లలో చాలా స్పెషల్‌గా జరుపుకుంటారు. అయితే బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ బర్త్ డే(ఏప్రిల్ 9) అందుకు భిన్నంగా జరిగింది. ప్రస్తుతం స్వరభాస్కర్ 32వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఇక ఈ సమయంలో స్వయంగా వెళ్లి విష్ చేసే పరిస్థితి లేకపోవటంతో స్నేహితులు, అభిమానులు స్వర భాస్కర్‌కు ఎవరి ఇంట్లో వారు ఉంటూనే జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మరికొంత మంది స్నేహితులు గ్రూప్ వీడియో కాలింగ్ చేసి ఆమెకు వర్చువల్ బర్త్‌డే పార్టీని సెలబ్రేట్ చేశారు. స్వర వర్చువల్ బర్త్‌డే పార్టీ నాలుగు గంటలపాటు ఆటా, పాటలతో చాలా ఉల్లాసంగా కొనసాగింది. SO blessed to have so many kind friends & well wishers in the world, such a loving family & such a thoughtful & giving bunch of close friends who made my #lockdownBirthday so special & wonderful! SO much gratitude, counting my blessings everyday! Thank u all ♥️ I feel so loved! — Swara Bhasker (@ReallySwara) April 10, 2020 దీనిపై స్పందించిన స్వర ‘లాక్డౌన్ సమయంలో వచ్చిన నా బర్త్ డేకు విష్ చేసిన స్నేహితులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులకు, అభిమానులకు కృతజ్ఞతలు. ఇటువంటి అద్భుతమైన సన్నిహితుల బృందం ఆశీర్వాదానికి చాలా కృతజ్ఞతలు, అందరికీ ధన్యవాదాలు. ఏమాత్రం ఊహించని వర్చువల్ పార్టీని సెలబ్రేట్ చేయటం చాలా సరదా ఉంది. మీరు కుటుంబసభ్యుల వంటి స్నేహితులని చెప్పడానికి నాకు మాటలు చాలడం లేదు’ అని ఆమె ట్విటర్లో పేర్కొన్నారు. ఇక 2018లో వచ్చిన ‘వీరే ది వెడ్డింగ్’ సినిమాలో స్వరభాస్కర్ నటించిన విషయం తెలిసిందే. Had the most unbelievably fun virtual birthday party, with across countries & continents. FOUR HOURS complete with games & performances! U guys r literally THE BEST people ever! I have no words to tell you’ll how lucky I am that you’ll are my friends like family. 😍😘 THANK YOU pic.twitter.com/IT71Wnn5Tj — Swara Bhasker (@ReallySwara) April 10, 2020 -
వర్షా బంగ్లా ఖాళీ చేసి ముంబైలోనే నివాసం
సాక్షి, ముంబై: ముంబైలోని మలబార్ హిల్ ప్రాంతంలో ప్రభుత్వ నివాస గృహమైన వర్షాబంగ్లాలో ఇదివరకు నివాసమున్న మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఖాళీ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. దీంతో నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉద్ధవ్ ఠాక్రే కుటుంబ సమేతంగా వర్షా బంగ్లాలోకి నివాసముండేందుకు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో వర్షా బంగ్లాను సాధ్యమైనంత త్వరగా ఫడ్నవిస్‌కు ఖాళీ చేయక తప్పడం లేదు. సుమారు 12 సిబ్బంది సామాగ్రి ప్యాకింగ్ చేయడంలో నిమగ్నమయ్యారు. సామాగ్రి తరలించేందుకు ట్రక్కులు, కంటైనర్లు, టెంపోలు తదితర వాహనాలను వర్షా బంగ్లా ఆవరణలో సిద్ధంగా ఉన్నాయి. చదవండి: నేడు ఠాక్రే విశ్వాస పరీక్ష అందులో సామగ్రి సర్దుబాటు చేసి దేవేంద్ర ఫడ్నవిస్ వ్యక్తిగత నివాసానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉద్ధవ్ ఠాక్రే వర్షాబంగ్లాకు మారుతారా? లేక తనకు సెంటిమెంట్‌గా ఉన్న మాతోశ్రీ బంగ్లా నుంచి పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తారా? అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయినప్పటికీ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన వారు నియమాల ప్రకారం వర్షా బంగ్లాను ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బంగ్లాను మళ్లీ కొత్తగా ముస్తాబు చేస్తారు. నూతన ముఖ్యమంత్రికి అనుగుణంగా దాన్ని తీర్చిదిద్దుతారు. ఫర్నిచర్, కిటికీ, డోరు కర్టెన్లు, హాలు, గదుల రంగులు, అలంకరణ తదితర పనులు పూర్తిచేస్తారు. అందుకు కొంత సమయం పడుతుంది. దీంతో ఫడ్నవిస్ ఖాళీ చేయగానే నవీకరణ పనులు ప్రారంభిస్తారని ఓ అధికారి చెప్పారు. మారిన పరిస్థితులు.. ఇక రాష్ట్రంలో ఈ నెల 12 నుంచి రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. దీంతో ఇదివరకు బీజేపీ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు నివాసముంటున్న క్వార్టర్స్, బంగ్లాలు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మరో మూడు నెలలు వర్షా బంగ్లాలోనే ఉంటారని ఆ సమయంలో పేర్కొన్నారు. అందుకు పీడబ్ల్యూడీ కూడా గడువు పెంచింది. కానీ ఈ నెల 23న ఊహించని విధంగా పరిస్థితులు మారిపోయాయి. రాత్రికి రాత్రే రాష్ట్రపతి పాలన ఎత్తేయటం.. సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్‌పవార్ ప్రమాణ స్వీకారం చేయటం ఉత్కంఠ రేపాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో ప్రతిపక్షాలు అవాక్కయ్యాయి. చివరకు విపక్షాలు కోర్టును ఆశ్రయించడం, తగినంత మెజారిటీ లేకపోవడం, అజిత్‌పవార్ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం అన్ని జరిగిపోయాయి. చివరకు ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 90 గంటల్లోనే కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. ముంబైలోనే ఫడ్నవిస్ నివాసం.. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మలబార్ హిల్‌లోని ప్రభుత్వ నివాస గృహమైన వర్షా బంగ్లాను ఖాళీ చేసిన తర్వాత ఆయన ముంబైలోనే ఉంటారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దక్షిణ–పశ్చిమ నాగ్‌పూర్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి గెలిచిన ఫడ్నవిస్‌పై బీజేపీ అధిష్టానం ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు కట్టబెట్టే అవకాశాలున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఆయన ముంబైలోనే ఉండాల్సి ఉంటుంది. ఒక ప్రతిపక్ష నాయకుడికి ముంబైలో ప్రభుత్వ బంగ్లా లభించనుంది. అంతేగాకుండా దేవేంద్ర సతీమణి అమృత ఫడ్నవిస్ ముంబై, యాక్సిస్ బ్యాంకులో సీనియర్ అధికారి పదవిలో కొనసాగుతున్నారు. అలాగే ఆమె కూతురు కూడా ముంబైలో విద్యాభ్యాసం చేస్తోంది. దీంతో వర్షా బంగ్లా ఖాళీ చేసినప్పటికీ ఫడ్నవిస్ కుటుంబానికి ముంబైలోనే ఉండాల్సి రానుంది. దీంతో ఆయన కుటుంబం కోసం ముంబైలోనే ఇల్లు కోసం గాలించడం ప్రారంభించారు. -
ప్రయాణికులు నరకయాతన అనుభవించారు..
సాక్షి, ముంబై: గత నాలుగైదు రోజులుగా విశ్రాంతి లేకుండా కురుస్తున్న వర్షాలు ఆదివారం కూడా ముంబైతోపాటు యావత్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో అనేక గ్రామాలు జలమయ్యాయి. ఇప్పటికీ అనేక గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో అందులో చిక్కుకున్న ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నీటిలో పాములు, తేళ్లు, ఇతర విష ప్రాణులు ఇళ్లలోకి రావడంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. తాగునీరు ఆహారం లేక విలవిలలాడుతున్నారు. రైల్వే వ్యవస్థ అస్తవ్యస్థం.. భారీ వర్షాల కారణంగా రోడ్డు మార్గంతో పాటు రైల్వే వ్యవస్థ కూడా స్థంబించిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి ముంబై దిశగా వచ్చే అనేక రైళ్లను నాసిక్, ఇగత్పురి, కల్యాణ్, థానేలోనే నిలిపివేశారు. ఇందులో కొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా, మరికొన్నింటిని రీ షెడ్యూల్ చేసి నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పట్టాలపై నిలిచిన నీటిమట్టం తగ్గకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రైళ్లు రాకపోవడంతో స్టేషన్లలో ప్లాట్‌ఫారాలపై ప్రయాణికులు పడిగాపులు కాశారు. ఏ రైలు ఎప్పుడొస్తుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. వర్షాల ప్రభావం దూరప్రాంతాల ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లతోపాటు దూరాంతో రైళ్లను సైతం నిలిపివేశారు. వర్షం ప్రభావం లోకల్ రైళ్ల రాకపోకలపై కూడా పడింది. నీటిలో రైల్వే ట్రాక్, ట్రాక్ చేంజింగ్ యంత్రాలు, సిగ్నల్ ప్యానెళ్లు మునిగిపోవడంతో కల్యాణ్–కర్జత్ స్టేషన్ల మధ్య అవి పనిచేయకుండా పోయాయి. రైల్వే ట్రాక్‌ల కిందున్న కంకర, మట్టి కొట్టుకుపోవడంతో రైల్వే అపార నష్టం వాటిళ్లింది. ఈ ప్రాంతంలో రైళ్లను పునరుద్ధరించడానికి కనీసం రెండు రోజుల సమయం పట్టే అవకాశముందని అధికారులు వెల్లడించారు. నిలిచిన లోకల్‌రైళ్లు.. నగరంలో పశ్చిమ మార్గం మినహా సెంట్రల్, హార్బర్ రైల్వే మార్గాలు ఆదివారం ఉదయం నుంచి స్తంభించిపోయాయి. అదృష్టవశాత్తు ఉద్యోగులకు, విద్యార్థులకు ఆదివారం సెలవు కావడంతో అనేక మంది ఇళ్లకే పరిమితమయ్యారు. శనివారం సాయంత్రం కార్యాలయాల్లో చిక్కుకున్న అనేక మంది ఉద్యోగులు, వ్యాపారులు ఆదివారం ఉదయం ఇళ్లకు చేరుకున్నారు. లోకల్ రైళ్లు నిలిచిపోవడంతో దాదాపు అన్ని స్టేషన్లలో ఇసుకపోస్తే రాలనంత జనం ఉన్నారు. థానే, కల్యాణ్, అంబర్నాథ్, బద్లాపూర్ స్టేషన్లలో రైల్వే ట్రాక్‌పై నిలిచిపోయిన నీరు తగ్గుముఖం పట్టలేదు. దీంతో ఆదివారం కూడా శనివారం పరిస్థితి నెలకొంది. అత్యవసరమైతే తప్ప ముంబైకర్లు ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబైలోని కుర్లా, సైన్ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌పై నీరు చేరడంతో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. గత్యంతరం లేక నగరం బయట దూరప్రాంతాల ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపివేయాల్సి వచ్చింది. రైల్వే ద్వారా ఎలాంటి ఎనౌన్స్మెంట్ చేయకపోవడంతో ప్లాట్‌ఫారంపై పడిగాపులు కాస్తున్న ప్రయాణికులకు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలకు సెలవు.. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం పుణే, నాసిక్, థానేలలో సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. థానే జిల్లాలో రెండ్రోజులుగా వర్షాలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. సోమవారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శనివారం నుంచి ఉప్పు భూముల్లో చిక్కుకున్న దాదాపు 400 మందిని ఆదివారం మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నాసిక్, త్రయంబకేశ్వర్ ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా గంగాపూర్, దారణా డ్యాముల్లోకి భారీగా నీరు రావడం మొదలైంది. పంటపొలాలన్ని జలమయమయ్యాయి. నాసిక్‌లో పంచవటి పుణ్య క్షేత్రం నీటిలో చిక్కుకుంది. నదులన్నీ ప్రమాద సూచికలను దాటి ప్రవహించడంతో పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఆయా జిల్లా యంత్రాంగాలు హెచ్చరించాయి. ఇప్పటికే అనేక కుటుంబాలను పాఠశాలల భవనాలకు తరలించారు. కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు బాధితులకు తాగు నీరు, అల్పాహారం అందించి మానవత్వాన్ని చాటుకున్నాయి. ప్రయాణికుల నరకయాతన ముంబై నుంచి పుణే దిశగా బయలుదేరిన డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్ రైలు 21 గంటలు గడచిన పుణే చేరుకోకపోవడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. ఈ రైలును కల్యాణ్ మీదుగా నుంచి వయా మన్మాడ్ మీదుగా దారి మళ్లించారు. ఒక్కో స్టేషన్లో గంటల తరబడి నిలపడంతో ప్రయాణికుల వెతలు వర్ణనాతీతంగా మారాయి. శనివారం రాత్రి ఠాకూర్వాడి స్టేషన్ సమీపంలోని మంకీ హిల్ వద్ద రైల్వే ట్రాక్‌లపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో సీఎస్ఎంటీ నుంచి సాయంత్రం 5.50 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు శనివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో బయలుదేరిన ఈ రైలు 21 గంటలు గడిచిన పుణేకు చేరుకోలేకపోయింది. గత్యంతరం లేక కొందరు రైలు దిగి బస్సుల్లో తమ ఇళ్లకు చేరుకున్నారు. డెక్కన్ క్వీన్‌తోపాటు దక్షిణ దిశగా వెళ్లే అధిక శాతం రైళ్లు పుణే మీదుగా వెళతాయి. కాని కొండచరియలు విరిగిపడటం వల్ల వయా నాసిక్, మన్మాడ్ మీదుగా నడపడంతో గందరగోళం నెలకొంది. ముంబై నుంచి పుణే మీదుగా వెళ్లాల్సిన అనేక రైళ్లు రాకపోవడంతో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. వర్షం కారణంగా ఏ రైలు ఎప్పుడు వస్తుందో విచారణ కౌంటర్ సిబ్బంది కూడా సమాధానం సరిగా చెప్పలేక పోతున్నారు. దీంతో పుణే స్టేషన్లో వేలాది మంది ప్రయాణికులు ప్లాట్‌ఫారంపై పడిగాపులు కాస్తున్నారు. -
బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ అరెస్టు
ముంబై : బాలీవుడ్ నటుడు, హిందీ బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ అజాజ్ ఖాన్‌ను సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్న అభ్యంతరకర వీడియోలను అజాజ్ ఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో కొద్ది క్షణాల్లోనే ఆ వీడియోలు వైరల్ కావడంతో అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉందంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో వెంటనే అజాజ్ ఖాన్ ఇంటికి చేరుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కాగా అజాజ్ ఖాన్ గతంలో కూడా అనేకమార్లు అరెస్టయ్యాడు. 2016లో ఓ బ్యూటీషియన్‌ను లైంగికంగా వేధించిన కేసులో పోలీసులు అతడిని అరెస్టు చేయగా... 2018లో డ్రగ్స్ కేసులో ముంబై యాంటీ- నార్కోటిక్స్ పోలీసుల చేతికి చిక్కాడు. ఇక హిందీ బిగ్‌బాస్ 7 సీజన్లో పాల్గొన్న అజాజ్ ఖాన్..పలు బాలీవుడ్ సినిమాలతో పాటు దూకుడు, బాద్షా, హార్ట్ ఎటాక్, నాయక్, టెంపర్ వంటి తెలుగు చిత్రాల్లోనూ నటించాడు. -
అంతలా చెప్తే.. ఇలా చేశావేంటి కోహ్లి?!
ముంబై : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ శాతం పెంచేందుకు సెలబ్రిటీలంతా ముందుకొచ్చి ప్రజలను చైతన్యవంతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ‘ క్రికెట్ మైదానంలో అద్భుత ప్రదర్శనతో ఎన్నో రికార్డులు నెలకొల్పుతావు. అయితే ఈసారి 130 కోట్ల మంది భారతీయులను చైతన్యవంతం చేసి.. పోలింగ్ శాతాన్ని పెంచే సరికొత్త రికార్డు నెలకొల్పాల్సి ఉంది. ఇలా జరిగితేనే ప్రజాస్వామ్యం గెలుస్తుంది’ అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ప్రత్యేక విఙ్ఞప్తి చేశారు. అయితే కోహ్లి మాత్రం ఈసారి ఓటువేసే అవకాశం లేదని ఓ ఎన్నికల అధికారి తెలిపారు. నిర్ణీత గడువు ముగిసేలోగా ఓటరు కార్డు కోసం అప్లై చేయకపోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. అసలేం జరిగిందంటే.. ఢిల్లీకి చెందిన కోహ్లి ప్రస్తుతం భార్య అనుష్క శర్మతో కలిసి ముంబైలో నివసిస్తున్న సంగతి తెలిసిందే. అనుష్క ప్రస్తుతం ముంబైలో ఓటరుగా నమోదు చేయించుకున్నారు. ఈ క్రమంలో కోహ్లి కూడా అక్కడి నుంచే ఓటు వేయాలని భావించాడు. ఓటరు జాబితాలో తన పేరు నమోదు చేసుకునేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేశాడు. అయితే నిర్ణీత గడువులోగా(మార్చి 30) అప్లికేషన్ సమర్పించలేకపోయాడు. దీంతో ఓటు ఈ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కోల్పోయాడు. ఈ విషయం గురించి ఎన్నికల సంఘం సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ విరాట్ కోహ్లి అప్లికేషన్ ఆలస్యంగా అందింది. అందుకే పెండింగ్‌లో పెట్టాము. ఈ దఫా లోక్‌సభ ఎన్నికల్లో అతడు ఓటు వేయలేడు. వచ్చే ఎన్నికల దాకా వేచి చూడాల్సిందే. వర్లీ నివాసిగా ముంబైలో ఓటరుగా నమోదు చేయించుకోవాలనుకున్నాడు. అతడి టీమ్ కూడా ఇందుకోసం తీవ్రంగా శ్రమించింది. కానీ సమయం మించిపోయినందు వల్ల కోహ్లి ఓటువేయడం సాధ్యం కాదు’ అని పేర్కొన్నారు. దీంతో నిరాశకు లోనైన కోహ్లి అభిమానులు ప్రధాని మోదీ అంతగా చెప్తే ఇలా చేశావేంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు..
ముంబై: లెఫ్టార్మ్ స్పిన్నర్ సిదక్ సింగ్... భారత మాజీ కెప్టెన్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే సరసన చేరాడు. 19 ఏళ్లు కూడా నిండని ఈ కుర్రాడు... స్పిన్ దిగ్గజం సరసన చేరడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా! కల్నల్ సీకే నాయుడు అండర్–23 క్రికెట్ టోర్నమెంట్లో పుదుచ్చేరి బౌలర్ సిదక్ సింగ్ ఒకే ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. గతంలో అనిల్ కుంబ్లే (10/74; 1999లో పాకిస్తాన్‌పై) ఫిరోజ్ షా కోట్లా టెస్టులో ఈ ఘనత సాధించగా... అంతకుముందు 1956లో ఇంగ్లండ్ స్పిన్నర్ జిమ్ లేకర్ (10/53) ఆస్ట్రేలియాపై ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టారు. ఈ టోర్నీలో పుదుచ్చేరి తరఫున బరిలో దిగిన సిదక్ మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 7 మెయిడెన్ల సహా 17.5 ఓవర్లు వేసి 31 పరుగులిచ్చి 10 వికెట్లు పడ గొట్టాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సిదక్ గతంలో ముంబై తరఫున ఆడినా తాజాగా పుదుచ్చేరికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ‘చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఘనత కలలో కూడా ఊహించలేదు. అండర్–16 మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు పడగొట్టాను’ అని సంతోషం వ్యక్తం చేశాడు. సిదక్ చెలరేగడంతో మణిపూర్ తొలి ఇన్నింగ్స్‌లో 71 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత పుదుచ్చేరి 105 పరుగులు చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మణిపూర్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 51 పరుగులు చేసింది. -
రాకాసి జెల్లీఫిష్‌ల కలకలం.. అలర్ట్
సాక్షి, ముంబై: వాణిజ్య రాజధానిలో రాకాసి జెల్లీఫిష్‌లు కలకలం రేపుతున్నాయి. విషపూరిత ‘బాటిల్ జెల్లీఫిష్‌లు’ సంచరిస్తుండటంతో ముంబై బీచ్‌లో సంచరించేందుకు ప్రజలు వణికిపోతున్నారు. జూహూ బీచ్‌లో గత రెండు రోజుల్లో 150 మంది వీటి దాడుల్లో గాయపడినట్లు సమాచారం. బీచ్‌లో ఎక్కడ చూసినా అలర్ట్ బోర్డులు కనిపిస్తున్నాయి. ‘బీచ్‌కి వస్తున్న ఎంతో మంది గాయపడ్డారు. విష ప్రభావం పని చేయకుండా వాళ్ల కాళ్లకు నిమ్మకాయ రాస్తున్నా. ప్రజలకు నేను సూచించేది ఒక్కటే. బీచ్‌కు రాకపోవటమే ఉత్తమం’ అని అక్కడ ఓ షాపు నిర్వహించే వ్యక్తి చెబుతున్నాడు. (కిల్లింగ్ వేల్ ‘హర్ట్ టచింగ్’ ఉదంతం) అంత డేంజర్ కాదు... బ్లూ బాటిల్ జెల్లీఫిష్ విషపూరితమైనవి కావటంతో వాటికి రాకాసి జెల్లీఫిష్‌లుగా పేరుపడిపోయింది. అయితే అవి మరీ అంత ప్రమాదకరమైనవి కాదని అధికారులు చెబుతున్నారు. ‘ఈ విషయంలో అపోహలు వద్దు. వాటి విషంతో చేపలను మాత్రమే చంపుతాయి. మనుషులను కరిచినప్పుడు వాటి విషం వల్ల వచ్చిన ప్రమాదం ఏం లేదు. కాకపోతే విపరీతమైన నొప్పి కొద్ది గంటలపాటు ఉంటుంది. ప్రతీ ఏటా అవి బీచ్‌లో సంచరిస్తుంటాయి. ఈ దఫా భారీ సంఖ్యలో అవి వచ్చి చేరాయి. అయినప్పటికీ ఆ చుట్టుపక్కలకు వెళ్లకపోతే మంచిది’ అని అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. -
లైంగిక వేధింపులు.. భవనం నుంచి దూకిన బాలిక
ముంబై : లైంగిక వేధింపుల నుంచి తప్పించుకునేందుకు ఓ బాలిక(12) నాలుగంతస్తుల భవనంపై నుంచి దూకింది. ఈ సంఘటన రెండు రోజుల క్రితం ముంబయిలోని పాల్ఘార్ జిల్లా ఆల్కాపూరి కాలనీలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి ఇంటి వద్ద ఉన్న బాలిక దగ్గరకు వచ్చి కాగితం చూపించి చిరునామా అడిగాడు. అంతేకాక ఆ బాలికకు మాయ మాటలు చెప్పి అడ్రస్ చూపించమని తన వెంట తీసుకెళ్లాడు. ఆ వ్యక్తి ఓ భవనంపైకి తీసుకెళ్లి బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. తీవ్రంగా ప్రతిగటించిన బాలిక అతని నుంచి తప్పించుకోవటానికి భవనం నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకేసింది. ఇది గమనించిన స్థానికులు తీవ్ర గాయాలైనా ఆ బాలికను నగరంలోని నాయర్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
లైంగిక వేధింపులు.. భవనంపై నుంచి దూకిన బాలిక
-
ఐఎన్ఎస్ కొచ్చి జలప్రవేశం
-
ఆరో విడతలో భారీ పోలింగ్
117 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తి మొత్తం 349 స్థానాలకు ఎన్నికలు పూర్తి.. మిగిలింది 194 స్థానాలే ఇప్పటివరకూ అన్ని చోట్లా సగటున 10 శాతం పెరిగిన పోలింగ్ అస్సాం, జార్ఖండ్‌లలో హింస... తొమ్మిది మంది మృతి న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా గురువారం ఆరో విడతలో దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం పరిధిలో గల 117 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. పోలింగ్ 2009 నాటి ఎన్నికల కంటే ఎక్కువగా నమోదైంది. పలు చోట్ల చెదురుమదురు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ ఎన్నికలు భారీ పోలింగ్‌తో ప్రశాంతంగా ముగిశాయి. అస్సాం, జార్ఖండ్‌లలో జరిగిన హింసాత్మక ఘటనల్లో ముగ్గురు పోలీసులు సహా తొమ్మిది మంది ఎన్నికల సిబ్బంది మృతిచెందారు. మొత్తం తొమ్మిది విడతల్లో రెండో అతిపెద్ద విడత అయిన ఆరో విడతలో 2,100 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక్కడ 18 కోట్ల మంది ఓటర్లున్నారు. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను ఇప్పటివరకూ 349 స్థానాలకు.. అంటే మూడింట రెండు వంతుల స్థానాలకు పోలింగ్ పూర్తయింది. మిగతా 194 స్థానాలకు మరో మూడు విడతలుగా(ఏప్రిల్ 30న 89 సీట్లు, మే 7న 64 సీట్లు, 12న 41 సీట్లకు) పోలింగ్ జరగనుంది. అన్ని స్థానాలకూ ఓట్ల లెక్కింపు మే 16న జరుగుతుంది. పూర్తయిన 349 స్థానాలకు కలిపి సగటున 66 శాతం పోలింగ్ నమోదైందని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ అలోక్‌సిన్హా తెలిపారు. 2009లో ఈ స్థానాలన్నిటికీ కలిపి కేవలం 57.53 శాతం పోలింగ్ నమోదు కాగా.. అది ఇప్పుడు దాదాపు 10 శాతం పెరిగిందన్నారు. ఆరో విడతలో..: జమ్మూకాశ్మీర్‌లో ఒక లోక్‌సభ స్థానం, అస్సాంలో 6, పశ్చిమబెంగాల్లో 6, బీహార్‌లో 7, ఛత్తీస్‌గఢ్‌లో 7, జార్ఖండ్‌లో 4, ఉత్తరప్రదేశ్‌లో 12, మధ్యప్రదేశ్‌లో 10, రాజస్థాన్‌లో 5, మహారాష్ట్రలో 19, తమిళనాడులో మొత్తం 39, పుదుచ్చేరిలో 1 స్థానానికి పోలింగ్ పూర్తయింది. ములాయంసింగ్ యాదవ్(సమాజ్‌వాదీ), సుష్మాస్వరాజ్. షానవాజ్హుస్సేన్ (బీజేపీ), దయానిధి మారన్, ఎ.రాజా(డీఎంకే), సల్మాన్‌ఖుర్షీద్, వి.నారాయణసామి, రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ(కాంగ్రెస్) తదితర ప్రముఖుల భవితవ్యం ఈ పోలింగ్‌లో తేలనుంది. తాజా ఎన్నికల్లో పుదుచ్చేరిలో అత్యధికంగా 83 శాతం పోలింగ్ నమోదవగా.. అత్యల్పంగా జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ స్థానంలో కేవలం 28 శాతం పోలింగ్ నమోదైంది. అయితే.. అనంతనాగ్‌లో గత ఎన్నికల్లో నమోదైన 26.9 శాతం కన్నా ఇప్పుడు పెరగటం విశేషం. పశ్చిమ బెంగాల్లో 82 శాతం, అస్సాంలో 77, తమిళనాడులో 73, ఉత్తరప్రదేశ్‌లో 60.2, బీహార్‌లో 60, రాజస్థాన్‌లో 59.2, మహారాష్ట్రలో 55.33, ఛత్తీస్‌గఢ్‌లో 62, జార్ఖండ్‌లో 63, మధ్యప్రదేశ్‌లో 64.4 శాతం పోలింగ్ నమోదైంది. ముంబైలో వ్యాపార, సినీ ప్రముఖుల ఓట్లు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అనిల్ అంబానీ, ఆది గోద్రెజ్ వంటి వ్యాపార దిగ్గజాలతో పాటు.. సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, రేఖ, విద్యాబాలన్ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సచిన్ టెండూల్కర్ సతీమేతంగా వెళ్లి ఓటు వేశారు. చెన్నైలో సినీ నటులు రజనీకాంత్, కమల్‌హాసన్, ఉదయమే ఓటేశారు. పుదుచ్చేరిలో సీఎం ఎన్.రంగసామి మోటార్‌సైకిల్ మీద వెళ్లి ఓటు వేయటం విశేషం. మోడల్ పోలింగ్ బూత్‌లపై ఓటర్ల హర్షం ఓటర్లకు రెడ్‌కార్పెట్ ఆహ్వానం పలుకుతూ ఆహ్లాదకరమైన సౌకర్యాలు కల్పిస్తూ తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ బూత్‌లపై ఓటర్లు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తంచేశారు. బూత్‌లకు వచ్చే ఓటర్లకు పూలు, స్వీట్లు ఇచ్చి ఆహ్వానించటం.. వారు వేచి ఉండటానికి పందిళ్లు, వాటి కింద కుర్చీలు సిద్ధంగా ఉంచటం, ఏసీలు పెట్టటం, వృద్ధులు, వికలాంగులకు వీల్చైర్లు, చల్లని పానీయా లు అందించటం తదితర సౌకర్యాలు కల్పించారు. కాగా, ఆరో విడత పోలింగ్ రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం రూ.81 కోట్ల నగదును జప్తు చేసింది. ఆంధప్రదేశ్‌లో 43 చెల్లింపు వార్తల ఉదంతాలను గుర్తించి నోటీసులు జారీ చేశామని, దర్యాప్తు జరుగుతోందని తెలిపింది. -
ఐపీఎల్ అంతా ఫిక్సింగే!
ముంబై: వివాదాల్లో ఇప్పటికే నిండా మునిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై నటుడు విందూ సింగ్ మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో అసలు గొడవంతా శరద్‌పవార్, శ్రీనివాసన్‌లకు సంబంధించిందేనని, తనలాంటి వారిని పావులుగా మార్చారని అతను అన్నాడు. ఇక ఆర్సీబీ యజమాని విజయ్ మాల్యా అయితే బెట్టింగ్ ద్వారానే కోట్లు గడించారని అన్నాడు. విందూ సింగ్ తమ శూలశోధనలో ఇదంతా బయట పెట్టాడంటూ ‘జీ న్యూస్’ చానల్ ప్రకటించింది. ‘జీ’ కథనం ప్రకారం...బెట్టింగ్‌లో తన పాత్ర ఏమీ లేకపోయినా శరద్ పవార్ చెప్పడం వల్లే జైల్లో ఉండాల్సి వచ్చిందంటూ స్వయంగా తనతో పోలీసులు చెప్పారని విందూ అన్నాడు. అయితే పవార్‌లాంటి పెద్ద వ్యక్తి ముందు నేనెంత అని అతను చెప్పాడు. ఐపీఎల్లో అంతా ఫిక్సింగ్ జరుగుతుందని, విజయ్ మాల్యా ఒక్కడే రూ. 100-200 కోట్లు బెట్టింగ్ ద్వారా సంపాదించారని విందూ వెల్లడించాడు. బాలీవుడ్ తారలంతా బెట్టింగ్ చేస్తారని, అయితే ఫిక్స్ చేయలేరని అతను చెప్పాడు. ఫిక్సింగ్ చేసేవాళ్లు ఆటగాళ్లకు ఒక్కసారిగా రూ. 14-15 కోట్లు ఇచ్చి తమ బుట్టలో పడేసుకుంటారని, ఆ తర్వాత వారు చెప్పినట్లుగా ఆటగాళ్లు చేస్తారని సంచలన వ్యాఖ్య చేశాడు. ఐపీఎల్‌తో బాగా కలిసిపోయిన ఆటగాళ్లు ఆ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లను కూడా ఫిక్స్ చేస్తారన్న విందూ...శ్రీశాంత్ ఎలాంటి తప్పూ చేయలేదని మద్దతు పలికాడు. లలిత్ మోడి సహకారంతో శ్రీనివాసన్‌ను నిలువరించాలన్న శరద్ పవార్ వ్యూహంలో భాగంగానే ఐపీఎల్లో ఇన్ని విపరిణామాలు చోటు చేసుకున్నాయని విందూ సింగ్ వెల్లడించాడు. -
సెప్టెంబర్ కల్లా రిలయన్స్ జియో 4జీ!
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో కంపెనీ ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా 4జీ సర్వీసులను ప్రారంభించే అవకాశాలున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీ ఢిల్లీ, ముంబైల్లో ఈ సర్వీసులను అందిస్తుందని సమాచారం. దీనికి సంబంధించి కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయని, ఇప్పటికే కొంతమంది ఉద్యోగులను కం పెనీ నియమించుకున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 7,000 మంది ఉద్యోగులను తీసుకోనున్నామని, దీంతో తమ ఉద్యోగుల సంఖ్య 2014-15 చివరికి 10,000కు చేరుతుందని రిలయన్స్ జియో గతేడాది జూలైలోనే పేర్కొంది. కాగా, ఈ కంపెనీ ప్రయోగ పద్ధతిన 4జీ సర్వీసులను ఇప్పటికే ఢిల్లీ, ముంబై, జామ్‌నగర్‌లో ప్రారంభించింది. ఇందులో 49 ఎంబీపీఎస్ స్పీడ్‌ను అం దిస్తోంది. ఇది 3జీ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్(4ఎంబీపీఎస్) కంటే 10-12 రెట్లు అధికం. 49 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఒక పూర్తి సినిమాను 2 నిమిషాల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.