అంతలా చెప్తే.. ఇలా చేశావేంటి కోహ్లి?! | Virat Kohli Miss The Chance Of Vote In Lok Sabha Elections 2019 | Sakshi
Sakshi News home page

కోహ్లి ఓటువేయడం కుదరదు!

Published Sat, Apr 27 2019 6:19 PM | Last Updated on Sat, Apr 27 2019 6:27 PM

Virat Kohli Miss The Chance Of Vote In Lok Sabha Elections 2019 - Sakshi

ముంబై : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ శాతం పెంచేందుకు సెలబ్రిటీలంతా ముందుకొచ్చి ప్రజలను చైతన్యవంతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.  ఇందులో భాగంగా... ‘ క్రికెట్‌ మైదానంలో అద్భుత ప్రదర్శనతో ఎన్నో రికార్డులు నెలకొల్పుతావు. అయితే ఈసారి 130 కోట్ల మంది భారతీయులను చైతన్యవంతం చేసి.. పోలింగ్‌ శాతాన్ని పెంచే సరికొత్త రికార్డు నెలకొల్పాల్సి ఉంది. ఇలా జరిగితేనే ప్రజాస్వామ్యం గెలుస్తుంది’ అని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి ప్రత్యేక విఙ్ఞప్తి చేశారు. అయితే కోహ్లి మాత్రం ఈసారి ఓటువేసే అవకాశం లేదని ఓ ఎన్నికల అధికారి తెలిపారు. నిర్ణీత గడువు ముగిసేలోగా ఓటరు కార్డు కోసం అప్లై చేయకపోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే..
ఢిల్లీకి చెందిన కోహ్లి ప్రస్తుతం భార్య అనుష్క శర్మతో కలిసి ముంబైలో నివసిస్తున్న సంగతి తెలిసిందే. అనుష్క ప్రస్తుతం ముంబైలో ఓటరుగా నమోదు చేయించుకున్నారు. ఈ క్రమంలో కోహ్లి కూడా అక్కడి నుంచే ఓటు వేయాలని భావించాడు. ఓటరు జాబితాలో తన పేరు నమోదు చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశాడు. అయితే నిర్ణీత గడువులోగా(మార్చి 30) అప్లికేషన్‌ సమర్పించలేకపోయాడు.  దీంతో ఓటు ఈ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కోల్పోయాడు.

ఈ విషయం గురించి ఎన్నికల సంఘం సీనియర్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ విరాట్‌ కోహ్లి అప్లికేషన్‌ ఆలస్యంగా అందింది. అందుకే పెండింగ్‌లో పెట్టాము. ఈ దఫా లోక్‌సభ ఎన్నికల్లో అతడు ఓటు వేయలేడు. వచ్చే ఎన్నికల దాకా వేచి చూడాల్సిందే.  వర్లీ నివాసిగా ముంబైలో ఓటరుగా నమోదు చేయించుకోవాలనుకున్నాడు. అతడి టీమ్‌ కూడా ఇందుకోసం తీవ్రంగా శ్రమించింది. కానీ సమయం మించిపోయినందు వల్ల కోహ్లి ఓటువేయడం సాధ్యం కాదు’ అని పేర్కొన్నారు. దీంతో నిరాశకు లోనైన కోహ్లి అభిమానులు ప్రధాని మోదీ అంతగా చెప్తే ఇలా చేశావేంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement