టీ20 వరల్డ్‌కప్‌ను సాధించి 11 ఏళ్ల నిరీక్షణకు తెరిదించిన భారత జట్టు ఎట్టకేలకు సొంత గడ్డపై అడుగుపెట్టింది. బార్బడోస్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న రోహిత్ సేనకు ఆపూర్వ స్వాగతం లభించింది.
ఎయిర్ పోర్ట్‌కు భారీగా చేరుకున్న అభిమానులు టీమిండియాకు జేజేలు పలికారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీని భారత జట్టు తన నివాసంలో కలిసింది. ప్రధానితో కలిసి వారు అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా మోదీ ప్రతి క్రికెటర్ వద్దకు వెళ్లి అప్యాయంగా పలకరించి అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో భారత జట్టు ఢిల్లీ నుంచి ముంబైకు పయనమైంది.
ఇక మోదీతో భేటి అనంతరం టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి స్పందించాడు. విరాట్ సోషల్ మీడియా వేదికగా ప్రధానికి కృతజ్జతలు తెలిపాడు.
"ఈ రోజు మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారిని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాము. మమ్మల్ని మీ నివాసానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు సార్ అంటూ" కోహ్లి ఎక్స్‌లో రాసుకొచ్చాడు. మరోవైపు టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సైతం సోషల్ మీడియా మోదీకి ధన్యవాదాలు తెలిపాడు.
చదవండి: T20 WC 2024: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై
Humbled to meet honorable PM Shri Narendra Modi Sir along with the entire team. Thank you Sir for your encouraging words, means a lot to all of us. 🇮🇳 pic.twitter.com/I6lq3E1nS1
— Yuzvendra Chahal (@yuzi_chahal) July 4, 2024
Comments
Please login to add a commentAdd a comment