టీ20 వరల్డ్‌కప్-2024 విజేతగా నిలిచి భారత్ తమ 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో సగర్వంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు విడ్కోలు పలికారు. వీరిముగ్గురు మాత్రమే కాకుండా రాహుల్ ద్రవిడ్ సైతం భారత హెడ్‌కోచ్‌గా తన ప్రస్ధానాన్ని ముగించాడు.
గతేడాది వన్డే వరల్డ్‌కప్‌లో ఆఖరి మెట్టుపై బోల్తా పడిన టీమిండియాకు.. 7 నెలల తిరిగకముందే పొట్టి ప్రపంచకప్ రూపంలో ఐసీసీ టైటిల్‌ను ది గ్రేట్ వాల్ అందించాడు. విజయనంతరం భారత ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
కొంతమంది ఆటగాళ్లు అయితే కన్నీటి పర్యంతమయ్యారు. ఈ భావోద్వేగ క్షణాలను యావత్తు ప్రపంచం వీక్షించింది. ఇక తాజాగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టీ20 వరల్డ్‌కప్ విన్నింగ్ సెలబ్రేషన్స్‌లో తన ఫేవరేట్ మూమెంట్‌ను ఎంచుకున్నాడు. సెలబ్రేషన్స్ సమయంలో విరాట్ కోహ్లి ట్రోఫీని రాహుల్ ద్రవిడ్‌కు అందజేసినప్పుడు తన కళ్లలో నీళ్లు తిరిగినట్లు అశ్విన్ చెప్పుకొచ్చాడు.
"నిజంగా ఇది యావత్తు భారత్ గర్వించదగ్గ విజయం. మా 13 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. అయితే ఈ టోర్నీలో విజయం సాధించిన తర్వాత ఓ మూమెంట్ నా మనసును హత్తుకుంది. విరాట్ కోహ్లి.. రాహుల్ ద్రవిడ్‌కు పిలిచి ట్రోఫీని అందిండచడం నన్ను ఎంతగానే ఆకట్టుకుంది.
ఇదే నా ఫేవరేట్ మూమెంట్. ద్రవిడ్ వెంటనే కప్‌ను అందుకుని గట్టిగా కేకలు వేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ క్షణం నా కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. ద్రవిడ్ నుంచి ఇటువంటి సెలబ్రేషన్స్ ఇప్పటివరకు నేను చూడలేదు. అయితే అందుకు ఓ కారణముంది.
2007లో కరేబియన్ దీవుల వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ద్రవిడ్ సారథ్యంలోని భారత జట్టు గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది. ఆ తర్వాత ద్రవిడ్ తన కెప్టెన్సీ నుంచి వైదొలగాడు. అప్పటి నుంచి జట్టులో కేవలం ఆటగాడిగా కొనసాగాడు.
కెప్టెన్సీ నుంచి తప్పకున్నప్పటకి ద్రవిడ్ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఒకవేళ భారత జట్టు మ్యాచ్ ఓడిపోయినా అందరూ ద్రవిడ్‌నే టార్గెట్ చేసేవారు. అప్పుడు తను కెప్టెన్‌గా సాధించలేకపోయింది.. ఇప్పుడు కోచ్‌గా సాధించి చూపించాడని" తన యూట్యూబ్ ఛానల్‌లో అశ్విన్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment