
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మరోసారి నిరాశపరిచాడు. టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్స్‌లో విరాట్‌కు మంచి రికార్డు ఉండడంతో ఈ ఏడాది కూడా సత్తాచాటుతాడని అభిమానులు భావించారు.
కానీ గయనా వేదికగా ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో కోహ్లి కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇంగ్లండ్ పేసర్ రీస్ టాప్లీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి కోహ్లి క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో నిరాశతో కోహ్లి తన బ్యాట్‌ను పంచ్ చేస్తూ పెవిలియన్‌కు చేరాడు.
అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా కోహ్లి తన సహచరులతో దిగులుగా కూర్చోన్నాడు. ఊబికి వస్తున్న కన్నీరును ఆపునకుంటూ విరాట్ మ్యాచ్‌ను వీక్షించాడు. ఈ క్రమంలో భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. విరాట్ వద్దకు వెళ్లి భుజం తట్టి ఓదార్చాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 75 పరుగులు మాత్రమే చేశాడు. అందులో రెండు డక్‌లు కూడా ఉన్నాయి.
Rahul dravid went to Virat as he was looking broken after that dismissal, can't see him like this man 💔 #INDvsENG pic.twitter.com/X0nPoSdF5s
— a v i (@973Kohli) June 27, 2024
Comments
Please login to add a commentAdd a comment