న్యూఢిల్లీ: చమురు కంపెనీలు వాహనదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. మంగళవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఒకరోజు వ్యవధిలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ నెలలో వరుసగా పదిసార్లు పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి.
తాజాగా చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై 27 పైసలు, లీటర్ డీజిల్‌పై 31 పైసలు పెంచాయి. పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.92.58, డీజిల్ రూ.83.51కు చేరింది. మరో వైపు ఆర్థిక రాజధాని ముంబైలో వందకు చేరువైంది. ప్రస్తుతం పెట్రోల్ రూ.99.14, డీజిల్, రూ.90.71కు పెరిగింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో అత్యధికంగా రికార్డు స్థాయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.80, డీజిల్ రూ.96.30కి చెరింది.
► కోల్‌కతాలో పెట్రోల్ రూ.92.92, డీజిల్ రూ.86.35
► చెన్నైలో పెట్రోల్ రూ.94.54, డీజిల్ రూ.88.34
► హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.96.50, డీజిల్ రూ.91.04
► జైపూర్‌లో పెట్రోల్ రూ.99.30, డీజిల్ రూ.92.18
► బెంగళూరులో పెట్రోల్ రూ.95.94, డీజిల్ రూ.88.53
(చదవండి:India WPI Inflation: టోకు ధరలు... గుభేల్!)
Comments
Please login to add a commentAdd a comment