Onions Prices: Onion Prices Reached More Than Double In Few Weeks - Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన ఉల్లి ధర

Published Mon, Feb 22 2021 5:14 PM | Last Updated on Tue, Feb 23 2021 3:17 AM

Onion Prices Reach More Than Double in Few Weeks - Sakshi

ముంబై: పెట్రోల్, డీజిల్, గ్యాస్, పాలు ధరలు పెరిగి పోతుంటే ఇప్పుడు ఉల్లి గడ్డల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. గత కొన్ని వారాలలో ఉల్లి ధర రెట్టింపు అయ్యింది. ఈ ఏడాది ప్రారంభంలో కిలోకు 25-30 రూపాయలకు విక్రయిస్తున్న ఉల్లిపాయను ప్రస్తుతం కిలోకు 60-70 రూపాయలకు విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి.. ఇలా ధరలు పెరిగిపోతుండటంతో ప్రజల ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కురిసిన అకాల వర్షాల కారణంగా మహారాష్ట్రలోని ఉల్లి పంట ఎక్కువగా నాశనమైంది. 

ఉత్పత్తి లేకపోవడం వల్ల సరఫరా కూడా తగ్గింది. ఇప్పుడు దాని ప్రభావం ధరలపై కనిపిస్తుంది. గత కొన్ని వారాలలో ఉల్లి ధర రెండు రెట్లుపైగా పెరిగింది. నవీ ముంబైలోని ఎపిఎంసి మార్కెట్లో గతంలో ఉల్లిపాయ కిలోకు 30-40 రూపాయల హోల్‌సేల్ ధరకు అమ్మేవారు. ముంబై, థానే, పూణే రిటైల్ మార్కెట్లలో ప్రస్తుతం ఉల్లిపాయ కిలోకు రూ.50 నుంచి రూ.60 వరకు అమ్ముడవుతోంది. దేశంలోని అతిపెద్ద హోల్‌సేల్ ఉల్లి మార్కెట్ అయిన లాసల్‌గావ్‌లో ఉల్లిపాయల టోకు రేటు గత 10 రోజుల్లో 15శాతం నుంచి 20శాతానికి పెరిగింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం రిటైల్ లో ఉల్లిపాయ ధర కిలోకు రూ.54గా ఉంది. మరోవైపు, డీజిల్ ధరలు నిరంతరం పెరగడం కూడా ఒక ప్రధాన కారణం, ఎందుకంటే సరుకు రవాణా మరింత ఖరీదైనది. జనవరి 1న ఢిల్లీలో డీజిల్ ధర లీటరుకు 73.87 రూపాయలు ఉండగా నేడు అది 78.38 రూపాయలుగా ఉంది.

చదవండి:

వాహనదారులకు కేంద్రం తీపికబురు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement