ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'పుష్ప ది రూల్'.. బాలీవుడ్‌లో కూడా పుష్ప చిత్రానికి భారీగా అభిమానులు ఉండటంతో అక్కడ భారీ ఎత్తున సినిమాను విడుదల చేస్తున్నారు. ‘పుష్ప 2’ సూపర్ డూపర్ హిట్ అవుతుందని అక్కడి సినీ ప్రముఖులు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఢిల్లీ, ముంబైలలోని కొన్ని థియేటర్లలో హిందీ వెర్షన్ టిక్కెట్‌ల ధర రూ. 3000 వరకు ఉంది. బుక్‌మైషోలోనే ఈ ధరకు టికెట్లు అమ్ముడుపోతున్నాయి.
పుష్ప సినిమా టికెట్ ధరలు టాలీవుడ్ మాదిరే బాలీవుడ్‌లో కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ముంబైలోని మైసన్ PVR: Jio వరల్డ్ డ్రైవ్ థియేటర్‌లో ఒక టికెట్ ధర రూ. 3000 ఉంది. బుక్‌మైషోలోనే ఈ టికెట్లను పొందే అవకాశం ఉంది. ముంబైలోని పీవీఆర్, ఐనాక్స్ చైన్ లింక్‌లో ఉన్న కొన్ని స్క్రీన్స్‌లలో ఒక టికెట్ ధర రూ. 1500 నుంచి రూ. 2400 వరకు ఉంది. ఢిల్లీలోని PVR డైరెక్టర్స్ కట్ స్క్రీన్స్‌లో హిందీ 2D వెర్షన్ టిక్కెట్ ధర రూ. 2400 వరకు ఉంది. ఢిల్లీలో కూడా పీవీఆర్, ఐనాక్స్‌కు సంబంధించిన కొన్ని థియేటర్స్‌లలో రూ. 1500 పైగానే ఒక టికెట్ ధర ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించే అంశమని చెప్పవచ్చు. ఈ ధరలతో చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాస్త బెటర్ అనేలా పరిస్థితి ఉంది.
తెలంగాణలో టికెట్ల ధరలు ఇలా
పుష్ప-2 సినిమా టికెట్ల ధరల పెంపు, అదనపు షోలకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, సినిమా విడుదల ముందురోజు అంటే డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల నుంచి ప్రదర్శించే బెన్‌ఫిట్ షోకు అన్ని రకాల స్క్రీన్లలో రూ.800 పెంచుకోవచ్చని అనుమతి ఇచ్చింది. అర్ధరాత్రి 1 గంట, తెల్లవారుజామున 4 గంటల అదనపు షోలకు కూడా అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 5వ తేదీ నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరలు రూ.150, మల్టీఫ్లెక్స్‌లలో రూ. 200 పెంచుకోవచ్చని తెలిపింది.
అయితే, డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్స్‌లలో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతి ఉంది. డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఏపీ ప్రభుత్వం నుంచి ప్రస్థుతానికి టికెట్ల ధరల విషయంలో ఎలాంటి ప్రకటన రాలేదు.
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. ఆరు భాషలల్లో సుమారు 12 వేలకు పైగానే థియేటర్స్‌లలో విడుదల కానుంది. ఈ సినిమా రన్ టైమ్ విషయానికొస్తే 3 గంటలా 20 నిమిషాల 38 సెకన్ల నిడివితో రాబోతోంది.
#Pushpa2 one ticket price ₹3️⃣0️⃣0️⃣0️⃣ pic.twitter.com/bCo8JSZWTV
— Manobala Vijayabalan (@ManobalaV) December 1, 2024
Comments
Please login to add a commentAdd a comment