Eid al-Fitr: ఢిల్లీ నుంచి ముంబై వరకూ.. అంతటా ఈద్‌ సందడి | Delhi Jama Masjid to Mumbai Namaz on Occasion of Eid al Fitr | Sakshi
Sakshi News home page

Eid al-Fitr: ఢిల్లీ నుంచి ముంబై వరకూ.. అంతటా ఈద్‌ సందడి

Mar 31 2025 9:18 AM | Updated on Mar 31 2025 11:57 AM

Delhi Jama Masjid to Mumbai Namaz on Occasion of Eid al Fitr

భారతదేశంతో సహా ప్రపంచంలోని వివిధ దేశాలలో ఈరోజు(సోమవారం) ఈద్ పండుగను ముంస్లింలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఉదయం నుండి మసీదులలో ప్రార్థనలు చేసేందుకు తరలివస్తున్నారు. రాజధాని ఢిల్లీ నుండి ముంబై వరకూ దేశంలోని వివిధ నగరాలలోని మసీదులలో ఈద్  వేడుకలు జరుగుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో ఈద్-ఉల్-ఫితర్(Eid al-Fitr) సందర్భంగా ఫతేపురి మసీదులో  ప్రార్థనలు కొనసాగుతున్నాయి. అలాగే జామా మసీదుకు పెద్ద సంఖ్యలో ముస్లింలు చేరుకుంటున్నారు.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని ఈద్గా మసీదు(Eidgah Mosque)కు ముస్లింలు తమ చేతులకు నల్లటి బ్యాండ్లు ధరించి తరలివస్తున్నారు. వక్ఫ్ (సవరణ) బిల్లుకు నిరసనగా చేతులకు నల్లటి బ్యాండ్ ధరించి, నమాజ్ చేయాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు విజ్ఞప్తి చేసింది. భోపాల్‌లోని ఈద్గా మసీదులో ఈద్ ప్రార్థనలు కొనసాగుతున్నాయి.


 

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటున్నారు. పోలీసు సిబ్బంది అన్ని మసీదుల వద్ద పహారా కాస్తున్నారు.

గౌతమ్ బుద్ధ నగర్ పోలీస్ కమిషనర్ శివహరి మీనా మాట్లాడుతూ ఈ రోజు ఒకవైపు ఈద్, మరోవైపు నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని, మతపరమైన ప్రదేశాలలో పోలీసు భద్రత కల్పించామన్నారు.

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లింలు మహీం దర్గాలో నమాజ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: మయన్మార్‌లో దారుణ పరిస్థితులు.. రెస్య్కూ వేళ వైమానిక దాడులు!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement