Namaz Timings
-
నమాజ్ వేళ దుర్గా పూజ మైకులు ఆపండి
ఢాకా: షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయాక మైనారిటీ హిందువులపై దాడులు, ఆంక్షలు పెరిగాయన్న వార్తల నడుమ దుర్గాపూజకూ అక్కడి తాత్కాలిక ప్రభుత్వం అవరోధాలు సృష్టిస్తోంది. ముస్లింలు నమాజ్, అజాన్ వేళల్లో దుర్గామాత మండపాల వద్ద పూజా కార్యక్రమాలు నిశ్శబ్దంగా జరగాలని, ఎలాంటి సంగీత వాయిదాల శబ్దాలు వినిపించడానికి వీల్లేదని తాత్కాలిక సర్కార్ గురువారం హుకుం జారీచేసింది. దేశంలో శాంతిభద్రతలకు సంబంధించిన సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. నమాజ్, అజాన్ సమయాల్లో దుర్గాపూజ మండపాల వద్ద ఎలాంటి సౌండ్ సిస్టమ్‌లను వాడకూడదని, సంగీత పరికరాలను వాయించకూడదని బంగ్లాదేశ్ హోం శాఖ సలహాదారు లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) మొహమ్మద్ జహంగీర్ ఆలం చౌదరి చెప్పారు. -
జామా మసీదులో ముస్లింల ప్రార్థనలు
నేడు (సోమవారం) బక్రీద్ సందర్భంగా ఢిల్లీలోని జామా మసీదులో ముస్లిం సోదరులు ఈద్ ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. తెల్లవారుజాము నుంచే ముస్లింలు ప్రార్థనల కోసం మసీదుకు తరలివచ్చారు. దీంతో జామా మసీదు చుట్టుపక్కల ప్రాంతాలు, మార్కెట్లలో సందడి నెలకొంది.ఈద్ ఉల్ అజా పండుగను బుధవారం సాయంత్రం వరకు ముస్లింలు జరుపుకోనుండటంతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. జామా మసీదులో ఈరోజు ఉదయం 6 గంటలకు, ఫతేపురి మసీదులో ఉదయం 7.15 గంటలకు ఈద్-ఉల్-అజా ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఫతేపురి మసీదు షాహీ ఇమామ్ డాక్టర్ ముఫ్తీ ముకర్రం అహ్మద్ మాట్లాడుతూ బక్రీద్ పండుగను సమైక్యంగా జరుపుకోవాలన్నారు. #WATCH | Delhi: Devotees offer Namaz at the Jama Masjid on the occasion of Eid Al Adha festival. pic.twitter.com/OnufmNVisx— ANI (@ANI) June 17, 2024 పండుగలనేవి ఆనందంగా చేసుకునేందుకేనని, ఈరోజు ఎవరినైనా బాధపెడితే పండుగ అర్థరహితమన్నారు. జంతువుల బలి విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఈద్ ఉల్ అజా సందర్భంగా పాత ఢిల్లీలోని మార్కెట్లలో సందడి నెలకొంది. రాత్రంతా ఇది కొనసాగింది. ఢిల్లీలోని దర్గా పంజా షరీఫ్‌లో ఈద్-ఉల్-అజా సందర్భంగా బీజేపీ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ నమాజ్ చేశారు. #WATCH | Delhi: BJP Leader Mukhtar Abbas Naqvi offers Namaz at Dargah Panja Sharif on the occasion of Eid Al Adha pic.twitter.com/bVcNW9Ec6K— ANI (@ANI) June 17, 2024 -
ఢిల్లీ ఎస్సై అత్యుత్సాహం
న్యూఢిల్లీ: శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల వేళ ఉత్తర ఢిల్లీలోని కిక్కిరిసిన రహదారిపై నమాజ్ చేస్తున్న ముస్లింలపై ఒక పోలీస్ అధికారి తన ప్రతాపం చూపించాడు. రోడ్డు దిగ్బంధం చేయొద్దని తిడుతూ వీరావేశంతో కొట్టడం మొదలెట్టాడు. తన్నుతూ అక్కడి వారిని పక్కకు నెట్టడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మసీదు జనంతో నిండిపోవడంతో రోడ్డుపై నమాజ్ చేయాల్సి వచి్చందని కొందరు ఆ సబ్ఇన్స్పెక్టర్ మనోజ్‌కుమార్ తోమర్‌తో వాగ్వాదానికి దిగారు. ఢిల్లీలోని ఇందర్‌లోక్ మెట్రో స్టేషన్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నమాజ్ చేయొద్దని ఒక పోలీసు నెమ్మదిగా వారిస్తుండగా, కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో సబ్ఇన్స్పెక్టర్ కొట్టడాన్ని ముస్లింలు తీవ్రంగా తప్పుబట్టారు. ఎస్సైను సస్పెండ్చేయాలటూ స్థానిక ముస్లింలు రాస్తారోకో చేపట్టారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. ఆ ఎస్సైను సస్పెండ్ చేస్తూ ఢిల్లీ నార్త్ డెప్యూటీ కమిషనర్ ఎంకే మీనా ఆదేశాలిచ్చారు. -
పారిస్ ఎయిర్ పోర్టులో నమాజ్.. సమర్థించుకున్న ప్రభుత్వం!
ఇజ్రాయెల్- హమాస్ మధ్య నెల రోజులుగా యుద్ధం నడుస్తోంది. ఈ యుద్ధం కారణంగా ఫ్రాన్స్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పారిస్‌లోని చార్లెస్ డి గల్లె విమానాశ్రయం డిపార్చర్ హాల్లో 30 మంది ముస్లింలు నమాజ్ చేశారు. విమానాశ్రయంలోని టెర్మినల్ 2లో ఈ ప్రార్థనలు జరిగాయి. ఈ ఉదంతంపై ఫ్రాన్స్ మాజీ మంత్రి నోయెల్ లెనోయ్ స్పందిస్తూ ఎయిర్ పోర్టులో నమాజ్ చేయడం విచారకరమని అన్నారు. ప్రార్థనల కోసం తగిన ప్రార్థనా స్థలాలు ఉన్నాయని, అక్కడ వీటిని నిర్వహించుకోవాలని అన్నారు. ఎయిర్ పోర్టులో ఇలాంటి చర్యలను అరికట్టాలని, నిఘా మరింతగా పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. విమానాశ్రయం ప్రార్థనా స్థలంగా మారినప్పుడు సీఈఓ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. కాగా ‘విమానాశ్రయంలో ప్రత్యేక ప్రార్థన స్థలం అందుబాటులో ఉందని, ఎయిర్‌పోర్టులో నిబంధనలను అమలు చేసేందుకు విమానాశ్రయ అధికారులు కట్టుబడి ఉన్నారని ఫ్రెంచ్ రవాణా మంత్రి క్లెమెంట్ బ్యూన్ ట్విట్టర్లో తెలిపారు. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధ నేపధ్యంలో ముస్లింలకు మద్దతుగా పారిస్ ఎయిర్‌పోర్టులో నమాజ్ చేశారని భావిస్తున్నారు. ఇది కూడా చదవండి: మనిషి దీర్ఘాయుష్షు ఎంత? -
మోదీపై కాంగ్రెస్ మహిళా నేత వివాదాస్పద వ్యాఖ్యలు
జైపూర్: ప్రధాని నరేంద్ర మోదీపై రాజస్థాన్ కాంగ్రెస్ మహిళా నేత ఇంద్రా డూడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఝున్‌ఝునా జిల్లా సుల్తానాలో శనివారం ఓ ర్యాలీకి హాజరై ఆమె మాట్లాడిన మాటలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఒక వేళ మన దేశంలో ముస్లింల జనాభా హిందువుల జనాభాతో సమానంగా ఉండి ఉంటే.. మోదీ రోజుకు ఏడు సార్లు నమాజ్ చేసేవారని ఇంద్రా డూడీ అన్నారు. బీజేపీ దేశంలో విభజన రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంద్రా ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు రాజస్థాన్ రవాణా శాఖ మంత్రి బ్రిజేంద్ర ఓలా కూడా పక్కనే ఉన్నారు. ఇంద్రా వ్యాఖ్యలపై కమలం పార్టీ తీవ్రంగా స్పందించింది. హస్తం పార్టీనే బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తింది. చదవండి: ఢిల్లీ అసెంబ్లీలో రగడ.. ఆప్, బీజేపీ నేతల మాటల యుద్ధం -
Hyderabad: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: చార్మినార్‌లో నమాజ్ కోసం సంతకాల సేకరణపై రాజకీయ వివాదం ముదురుతోంది. కాంగ్రెస్ నేత రషీద్‌ఖాన్ సంతకాల సేకరణ చేపట్టడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే భాగలక్ష్మి ఆలయంపై చేయి వేయాంటూ సవాల్ విసిరారు ఎంపీ బండి సంజయ్. ‘‘మేం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటేనే.. మీకు నమాజ్ గుర్తొచ్చిందా?. అంతకుముందు నమాజ్ ఎందుకు చేయలేదు?. కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్ఎస్ కలిసి డ్రామాలాడుతున్నాయి అంటూ విరుచుకుపడ్డారు ఆయన. చార్మినార్ దగ్గర ఆలయం లేదని చెప్పేవాడు మూర్ఖుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. ఇదిలా ఉంటే.. సంతకాల సేకరణను ముస్లి సమాజం సైతం హర్షించదని ఎమ్మెల్యే రాజా సింగ్ పేర్కొన్నారు. చార్మినార్ వద్ద సంతకాల సేకరణపై రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. షో పుటప్ ప్రోగ్రాం చేసేవాళ్లపై చర్యలు తీసుకోవాలని రాజా సింగ్ కోరారు. ఇలాగైతే.. మసీద్ వద్ద మేము కూడా సంతకాల సేకరణ చేయాలా? అని ప్రశ్నించారు. కానీ, తామూ అలా చేస్తే రాష్ట్రంలో వాతావరణం దెబ్బతింటుందని రాజా సింగ్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కడ ఉంది? కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్ మీద సుమోటోగా కేసు నమోదు చేయాలని, అసలు రషీద్ ఖాన్‌కు సిగ్గుందా అని మండిపడ్డారు రాజా సింగ్. చార్మినార్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, అటు నుంచి పెద్ద వాహనాలు వెళ్తే కూలిపోయే స్థితిలో ఉందని గుర్తు చేస్తున్నారు ఆయన. -
కర్ణాటక సర్కారీ స్కూల్లో పిల్లల నమాజ్!
కోలార్ (కర్ణాటక): స్కూలు ఆవరణలో శుక్రవారం రోజు ముస్లిం విద్యార్థులు నమాజ్ చేసుకోవడానికి కర్ణాటక రాష్ట్రం ముల్బగల్ పట్టణంలోని బలెచంగప్ప ప్రభుత్వ పాఠశాల అనుమతివ్వడంపై పిల్లల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. శుక్రవారం రోజు మధ్యాహ్నం ముస్లిం విద్యార్థులు ఓ తరగతి గదిలో నమాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరలైంది. దీంతో స్కూలు నిర్ణయానికి వ్యతిరేకంగా పిల్లల తల్లిదండ్రులు, హిందూ సంఘాలు నిరసన తెలిపాయి. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా సీఎం బసవరాజ్ బొమ్మై, కోలార్ ఎంపీ మునిస్వామి, విద్యా శాఖ అధికారులు స్పందించాలని డిమాండ్ చేశాయి. పిల్లలు నమాజ్ చేసుకోవడానికి ఎందుకు అనుమతిచ్చారని బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి నుంచి తనకు శుక్రవారం ఫోన్ వచ్చిందని, తాను త్వరగా వెళ్లి చూడగా పిల్లలు నమాజ్ చేస్తూ కనిపించారని తెలిపారు. -
సంచలన వ్యాఖ్యలు : మసీదులో హోమం చేస్తాం!
లక్నో: విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నాయకురాలు సాధ్వీ ప్రాచి లక్నోలోని ఒక మసీదులో హోమం చేస్తామని శుక్రవారం నాడు సంచలన వాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ మధురాలోని ఒక ఆలయంలో నమాజ్ సమర్పించినందుకు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన కొన్ని రోజుల తరువాత ఆమె ఇలా బహిరంగంగా ప్రకటించడం తీవ్ర కలకలం రేపింది. అయితే వెంటనే ఆమె తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. అక్టోబర్ 29 న మధురలోని నందగావ్‌లో ఉన్న నంద్ బాబా మందిర్ వద్ద ఇద్దరు వ్యక్తులు నమాజ్ చేశారనే ఆరోపణలతో పోలీసులు నలుగురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫైజల్ ఖాన్, చంద్ మొహమ్మద్ అనే వ్యక్తులు నమాజ్ చేయగా వారితో పాటు వచ్చిన అలోక్ రతన్, నీలేష్ గుప్తా వారి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో ప్రసారం చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన తరువాత, మసీదులలో 'హనుమాన్ చలీసా' చదివిన కేసులు వెలువడ్డాయి. తారోలి గ్రామంలోని ఒక మసీదులోకి ప్రవేశించి హనుమాన్ చలీసాను పఠించినట్లు ఆరోపణలు రావడంతో మధుర పోలీసులు గురువారం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిపై సీఆర్పీసీ 151 కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రాచి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇక ప్రాచి ఈ విషయాల పై స్పందిస్తూ సామాజిక సామరస్యం పేరిట ఒక ముఠా దేవాలయాలకు వెళ్లి నమాజ్ చేస్తోందని, సాంఘిక సామరస్యాన్ని కాపాడుకునేలా హిందువులు కూడా మసీదుల వద్దకు వెళ్లి హోమం చేయాలని తాము అభిప్రాయపడుతున్నామని ఆమె పేర్కొన్నారు. దేవాలయాలను నాశనం చేసి నిర్మించిన మసీదులను కూల్చివేసి అక్కడ పూజలు నిర్వహించాలన్నారు. హోమం చేయడం ద్వారా వాయు కాలుష్యం కూడా తగ్గుతుందన్నారు. లక్నోలో ఉన్న పురాతన మసీదలో హోమం చేస్తామని ఆమె ప్రకటించారు. అయితే తరువాత ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. దీంతో పాటు ఆమె ‘లవ్ జిహాద్’ పై కూడా స్పందించారు. ఇది ఎంతోకాలంగా చేస్తోన్న కుట్ర అని ఇది నెమ్మదిగా భారతదేశమంతా విస్తరిస్తుందన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులను బహిరంగా ఉరితీయాలన్నారు. ఈ విషయానికి సంబంధించి కఠినమైన చట్టాన్ని తీసుకురావాలన్నారు. చదవండి: లవ్ జిహాద్: విచారణలో కీలక విషయాలు -
ఇళ్ల వద్దే శుక్రవారం నమాజ్
సాక్షి, హైదరాబాద్: కరోనా నియంత్రణ కోçసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ముస్లింలు శుక్రవారం ప్రార్థనలను ఇళ్లలోనే చేసుకోవాలని తెలంగాణ వక్ఫ్‌బోర్డు సీఈఓ హమీద్ ఖాన్ ఆదేశాలు జారీ చేశారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది గూమికూడవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు మసీదుల్లో జరిగే శుక్రవారం నమాజులో ఐదుగురు మాత్రమే పాల్గొనాలని గురువారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. మసీదులు శుక్రవారం నమాజుకు నోచుకోని పరిస్థితి ఉత్పన్నం కావద్దనే ఈ సడలింపునిస్తున్నామన్నారు. ముస్లింలందరూ ఇళ్ల వద్దే నమాజు చదువుకోవాలని, శుక్రవారం రోజు కూడా మసీదుకు రావొద్దని హైదరాబాద్‌లోని జామియా నిజామియా ఇస్లామిక్ వర్సిటీ ఉపకులపతి ఫత్వా జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు సీఈఓ గుర్తు చేశారు. ఈ ఆదేశాలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ ఆడిటర్లకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులను మసీదు కమిటీలకు చేరవేయాలని కోరారు. -
శుక్రవారం... మధ్యాహ్నం మాత్రమే!
సాక్షి, సిటీబ్యూరో: కేవలం శుక్రవారం... అది కూడా మధ్యాహ్నం పూట... ప్రార్థనలకు వెళ్లే యజమానుల దుకాణాలే టార్గెట్... సగం దింపిన షట్టర్‌ను ఎత్తి ఏది దొరికితే అది ఎత్తుకుపోతారు... ఈ పంథాలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లలోని ఠాణాలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులకు వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. నిందితులను అరెస్టు చేసి వాహనం, చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు ఆదివారం తెలిపారు. పాతబస్తీ, ఫలక్‌నుమా పరిధిలోని వట్టేపల్లికి చెందిన మహ్మద్ అక్రమ్ వెల్డింగ్ వర్కర్‌గా, మహ్మద్ పాషా కూలీగా పని చేసేవారు. దురలవాట్లకు బానిసైన అక్రమ్ అందుకు అవసరమైన డబ్బు సంపాదించడానికి కొన్నాళ్ల క్రితం నుంచి చోరీలు చేయడం మొదలెట్టాడు. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల కోసం వెళ్లే వ్యాపారులు తమ దుకాణాల షట్టర్స్ సగం వరకే కిందికి దించుతుంటారు. దీనిని గుర్తించిన అక్రమ్ ఆయా షాపుల్లోకి దూరి అందినకాడికి నగదు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లేవాడు. తస్కరించిన నగదుతో పాటు చోరీ వస్తువుల్ని అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సా చేసేవాడు. గతంలో అతడిపై షాహినాయత్‌గంజ్, కుల్సుంపుర, మైలార్‌దేవ్‌పల్లి ఠాణాల పరిధిల్లో కేసులు నమోదయ్యాయి. అక్రమ్‌ను అరెస్టు చేసిన పోలీసులు జైలుకు పంపారు. 2018 జూన్‌లో జైలు నుంచి బయటికి వచ్చిన అతను ఏడాది తర్వాత భవానీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఇదే తరహాలో మరో చోరీ చేసి పోలీసులకు చిక్కాడు. ఈ ఏడాది అక్టోబర్ 1న జైలు నుంచి విడుదలయ్యాడు. అయినా తన పంథా మార్చుకోని అక్రమ్ ఈసారి ముఠా కట్టి పంజా విసరాలని భావించాడు. తన స్నేహితుడైన పాషాకు విషయం చెప్పడంతో సహకరించడానికి ముందుకు వచ్చాడు. ఆ నెల మొదటి వారంలో తన స్నేహితుడు ఖాలీద్‌తో కలిసి రెండు రోజుల పాటు బీదర్‌లో ‘పర్యటించిన’ అక్రమ్ ఓ ద్విచక్ర వాహనం చోరీ చేసి తీసుకువచ్చాడు. పాషాతో కలిసి దీనిపై తిరుగుతూ నేరాలు చేయాలని నిర్ణయించుకున్నారు. రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఇద్దరూ కలిసి చోరీ బైక్‌పై సంచరిస్తూ ఓ చెత్త వాహనం డ్రైవర్‌ను గమనించారు. అతడు తన ఫోన్‌ను వాహనం సీటుపై ఉంచి ఇంట్లోకి వెళ్లడాన్ని గుర్తించిన వీరు ఫోన్ తస్కరించారు. నిందితులు అక్రమ్, పాషా అదే నెల ఆఖరి వారంలో అదే చోరీ బైక్‌పై టోలిచౌకి ప్రాంతంలో సంచరించారు. ఆ సమయంలో నవాజ్ చికెన్ షాప్ షట్టర్ సగం దించిన యజమాని ప్రార్థనల కోసం వెళ్లారు. దీనిని గమనించిన అక్రమ్ వాహనాన్ని కొద్దిదూరంలో ఆపాడు. పాషాను దాని సమీపంలోనే ఉంచి యజమాని రాకను గమనించమని చెప్పాడు. అక్రమ్ నేరుగా దుకాణంలోకి ప్రవేశించి క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.85 వేల నగదు, సెల్‌ఫోన్ చోరీ చేశాడు. ఈ డబ్బును ఇద్దరూ కలిసి ఖర్చు చేశారు. ఈ రెండు ఉదంతాలకు సంబం«ధించి బాధితుల ఫిర్యాదుతో స్థానిక ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. వీటిని ఛేదించేందుకు పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు మహ్మద్ ముజఫర్, పి.మల్లికార్జున్, ఎన్.రంజిత్‌కుమార్‌లతో కూడిన బృందం చోరీ జరిగిన దుకాణం సమీపంలోని సీసీ కెమెరాల ఫీడ్‌ను సేకరించి అధ్యయనం చేసింది. ఫలితంగా అనుమానితుల జాడ తెలియడంతో లోతుగా దర్యాప్తు చేసింది. ఆదివారం అక్రమ్, పాషాలను పట్టుకుని వాహనం, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను గోల్కొండ పోలీసులకు అప్పగించినట్లు డీసీపీ తెలిపారు. -
చెవికీ... కంటికీ ఉపవాసం
ఒక రోజు కొందరు యువకులు నమాజ్ కోసం మసీదుకు వెళుతున్నారు. ఆ దారిలో ఒక మూలన ఒక ముసలివాడు చాటుగా కూర్చుని అన్నం తింటూ కనిపించాడు.అందులో ఒక యువకుడు, ‘‘ఏయ్ తాత! ఈ రోజు ఉపవాసం లేవా?’’ అని అడిగాడు.‘‘ఎందుకు లేను? ఉన్నాను. నేను ఉపవాసం ఉండి అన్నం తింటాను, నీళ్ళు కూడా తాగుతా’’ అని సమాధానం ఇచ్చాడు తాత. ‘‘భలే చెబుతున్నావు తాతా నువ్వు. ఇది కొత్త రకం రోజానా?‘ఎగతాళి చేస్తూ ఆ యువకులు.‘‘అవును నాయనా!. నేను నా కళ్ళతో చెడు చూడను. నాలుకతో చెడు మాట్లాడను. ఎవరినీ నిందించను. ఎవరి మీదా చాడీలు చెప్పను. చెడ్డ పనులు చేయను. అశ్లీల పలుకులు అసలే పలకను. ఎవరినీ మోసం చేయను. అబద్ధాలు ఆడను. అధర్మ పనులు అసలే చేయను. ఈరా‡్ష్య ద్వేషాల దరిదాపుల్లోకి కూడా వెళ్లను. ఎవరిపైనా దౌర్జన్యం చేయను. ఇలా నా శరీరంలోని అవయవాలు అన్నీ ఉపవాసం ఉంటున్నాయి. కాకపోతే అనారోగ్యం కారణంగా అన్న పానీయాలు మాత్రం తీసుకుంటాను. మరి మీరంతా ఇలా ఉపవాసం ఉన్నారా?’’ అని అడిగాడు తాత. అందులో ఒక యువకుడు,‘‘క్షమించాలి తాత! అన్న పానీయాలు తీసుకోకుండా ఉపవాసమైతే ఉన్నాం, కాని నీలా పరిపూర్ణ ఉపవాసం మాత్రం లేము‘’ అని అన్నాడు సిగ్గుతో తల దించుకుని.నిజమే. ఉపవాసం అంటే ఆకలితో కడుపు మాడ్చుకోవడం కాదు. అల్లాహ్ ఇచ్చిన శరీరంలోని సకల అంగాలను ఆ దైవం, ప్రవక్త ముహమ్మద్( స) చెప్పినట్లు జీవింప చేయడం, అల్లాహ్ ఆదేశాలను తు.చతప్పకుండా పాటించడం. మనిషిని సంస్కరించి, నైతికోన్నతుడిగా మార్చడం కోసమే రంజాన్ ఉపవాసాలు. –షేక్ అబ్దుల్ బాసిత్ -
నమాజ్.. స్వర్గానికి తాళం చెవి
కర్నూలు (ఓల్డ్‌సిటీ): నమాజ్ అనేది స్వర్గానికి తాళం చెవి లాంటిది. ఇది లేకపోతే స్వర్గ ప్రవేశమే ఉండదు. ఎన్ని పుణ్య కార్యాలు చేసినా, దైవచింతనలు చేసినా నమాజ్ లేకుండా అల్లా అనుగ్రహం పొందలేరని మౌల్వీలు చెబుతున్నారు. అసలు నమాజ్ లేనిదే రంజాన్ ఉపవాసాలకు పరిపూర్ణత ఉండదు. అందువల్ల నమాజ్ అనేది ఇస్లాం ధర్మానికి మూలాధారం. దీనిని మహమ్మద్ ప్రవక్త తన కంటిచలువగా పేర్కొన్నారు. ప్రతి ముస్లిం కచ్చితంగా రోజుకు ఐదుపూటలా నమాజు చేయాలని నిబంధన. నమాజ్‌ను అరబ్బీ భాషలో సలాహ్, పర్షియన్లు సలాత్ అని అంటారు. నమాజుకు ముందు వజూ (శారీరక శుద్ధత) అనేది తప్పనిసరి. వజూ ద్వారా కాళ్లు, చేతులు, ముఖం, మెడ భాగాలు శుభ్రమవుతాయి. దీనివల్ల శారీరక శుద్ధి లభిస్తుంది. ఆ తర్వాత ఏకాగ్రతతో నమాజు ఆచరించడం వల్ల మానసిక శుద్ధి కలుగుతుంది. నమాజు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి ముస్లిం కచ్చితంగా నమాజు చేసే విధానం తెలుసుకుని ఉండాలి. అంతేకాకుండా నిత్యజీవితంలో ప్రతి రోజూ ఐదు పూటలా నమాజు ఆచరించాలి. ఎలాంటి పరిస్థితుల్లో కుర్చీలో ఆశీనులై నమాజ్ చేయవచ్చు? సర్వసాధారణమైన నమాజు విధానం ప్రతిఒక్కరికి తెలుసు. అయితే ఆర్థోరైటిస్తో మోకాలు వంగని వ్యక్తులు, వృద్ధులు కూడా నమాజు చేయాల్సి ఉంటుంది. వారు కుర్చీలో కూర్చుని నమాజ్ చేసుకోవచ్చు. అయితే వారు పాటించాల్సిన నమాజు కొంత వేరుగా ఉంటుంది. ఇలాంటి వారికి సదుపాయంగా ఉండేందుకు వీలుగా మసీదుల్లో కుర్చీలు ఏర్పాటు చేశారు. సమయపాలన పాటించాలి.. నమాజుకు సమయపాలన పాటించడం చాలా ముఖ్యం. అందువల్ల అన్ని మసీదుల్లోనూ నమాజు వేళల బోర్డులు ఏర్పాటు చేశారు. అందరూ ఆ సమయానికి చేరుకుని సామూహిక నమాజులో (ఫరజ్ నమాజ్‌లో) పాల్గొనాల్సి ఉంటుంది. నమాజ్ వేళ అయ్యిందని గుర్తుచేయడానికి మసీదుల నుంచి ఐదు పూటలా అజాన్ అనే పిలుపు వినిపిస్తూఉంటుంది. ఉదయం నమాజును ఫజర్ అని, మధ్యాహ్నం నమాజును జొహర్, సూర్యాస్తమయం కంటే గంట లేక గంటన్నర ముందు చేసే నమాజ్‌ను అసర్ అని, సూర్యాస్తమయం తర్వాత చేసే నమాజును మగ్రిబ్, రాత్రి 8.30 గంటల ప్రాంతంలో చేసేది ఇషా నమాజ్. ఇంకా ఆసక్తి కలిగిన వారు ఇష్రాక్, తహజ్జుద్ నమాజులు కూడా చేస్తారు. ఒక్క జొహర్ తప్ప మిగతా నమాజుల వేళలు సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాలను బట్టి మారుతుంటాయి. నమాజులో ఇవి చేయాలి.. ♦ ఖిబ్లా (మక్కాలోని కాబా మసీదు) వైపు తిరగాలి. శరీర భాగాలు పూర్తిగా కప్పుకోవాలి. ♦ దుస్తులు, శరీరం, సజ్దాచేసే ప్రదేశం పరిశుభ్రంగా ఉండాలి. ♦ ప్రార్థనకు ముందు ఆచార శుద్ధత, వజూ, తైమామ్, గుసూల్ వీటిలో ఏదో ఒకటి పాటించాలి. ఇవి చేయకూడదు.. ♦ నమాజు చేసే వారి ముందు ఎవరూ వెళ్లకుండా చూడాలి. ♦ రక్త గాయమై రక్తం ప్రవహిస్తూ ఉంటే నమాజు చేయరాదు. ♦ మహిళలు రుతుక్రమ సమయంలో నమాజు చేయరాదు. నమాజ్‌లోని దశలు.. ♦ తక్బీర్ తహిరియా ∙ ఖియామ్ ∙ రుకూ ♦ సజ్దా ∙ ఖాయిదా ∙ సలామ్ ఫేర్నా ∙దువా నమాజ్ ప్రతి ముస్లింకు తప్పనిసరి ఇస్లాం ధర్మంలో నమాజ్‌కు మినహాయింపు ఉండదు. ప్రతి ముస్లింకు ఇది తప్పనిసరి. ఐదు పూటలా నమాజ్ చేస్తూ మహమ్మద్ ప్రవక్త సూచించిన శైలిలో జీవనం గడపాలి. సమయ పాలన కూడా చాలా ముఖ్యం. ఎప్పుడూ ఆలస్యంగా నమాజు చేసే వారు కూడా అల్లాకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. – ముఫ్తి అబ్దుర్రహ్మాన్ అల్లా చల్లగా చూస్తున్నాడు నేను ఐదు పూటలా నమాజ్ చేస్తుంటాను. నమాజ్‌కు వెళ్లొస్తే మానసిక అలజడులు దూరం అవుతాయి. నమాజ్ అనంతరం దువా చేస్తూ బాధలన్నింటినీ అల్లా ముందు పెట్టేస్తాను. అల్లా నన్ను చల్లగా చూస్తున్నాడు. – సాహెబ్జాని -
నమాజ్ కోసం ప్రసంగాన్ని మధ్యలో ఆపిన షర్మిల
-
తాజ్ ప్రాంగణంలో నమాజ్‌కు ఏఎస్ఐ నో
ఆగ్రా : తాజ్‌మహల్ ప్రాంగణంలోని మసీదులో శుక్రవారం మినహా మరే రోజూ నమాజ్ చేయరాదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ముస్లింలను కోరింది. ఈ ఉత్తర్వులు పెనువివాదం రేపుతుండగా, సుప్రీం కోర్టు జులైలో ఇచ్చిన ఉత్తర్వులనే తాము అమలు చేస్తున్నామని ఏఎస్ఐ అధికారులు వివరణ ఇచ్చారు. శుక్రవారం తాజ్‌మహల్‌ను ప్రజా సందర్శనకు అనుమతించని క్రమంలో ఆ రోజు ప్రవేశ టికెట్ లేకుండానే స్ధానికులు ప్రార్ధన చేసుకోవచ్చని కోర్టు పేర్కొంది. తాజ్ మహల్ కాంప్లెక్స్‌లోని మసీదులో శుక్రవారం స్ధానికేతరులు నమాజ్ చేసుకోరాదని స్ధానిక అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు సమర్ధించింది. భద్రతా కారణాల రీత్యా స్ధానికేతరులెవరూ శుక్రవారం తాజ్ ప్రాంగణంలోని మసీదులో నమాజ్ చేయరాదని ఆగ్రా ఏడీఎం ఈ ఏడాది జనవరి 24న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది. అయితే ఇతర రోజుల్లో నమాజ్‌లపై సుప్రీం కోర్టు ఎంతమాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం. మరోవైపు నమాజ్‌కు ముందు ముస్లింలు తాజ్ ప్రాంగణంలోని స్నానం చేసే వుదు చెరువును ఏఎస్ఐ ఆదివారం మూసివేసింది. దశాబ్ధాలుగా తాజ్ మహల్ మసీదులో నమాజ్ చేస్తున్న ఇమాం సయ్యద్ సాధిక్ అలి ఏఎస్ఐ ఉత్తర్వుల పట్ల విస్మయం వ్యక్తం చేశారు. తాజ్ మహల్ ప్రాంగణంలో ఏ కారణం లేకుండానే నమాజ్‌ను నిలిపివేశారని తాజ్‌మహల్ మసీదు నిర్వహణ కమిటీ ప్రెసిడెంట్ ఇబ్రహిం హుసేన్ జైదీ ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నేతృత్వంలోని యూపీ, కేంద్ర ప్రభుత్వాలు ముస్లిం వ్యతిరేక వైఖరితో వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. -
తాజ్ వద్ద నమాజ్ వద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : ‘తాజ్‌మహల్ ఏడో ప్రపంచ వింత.. కాబట్టి ఇక మీదట అక్కడ వద్ద నమాజ్ చేయరాద’ని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ ఏడాది, జనవరి 24న ఆగ్రా జిల్లా అదనపు కోర్టు.. ‘ఇకమీదట స్థానికులు మాత్రమే తాజ్‌మహల్ వద్ద ప్రార్ధనలు చేయాలి.. స్థానికేతరులకు తాజ్ వద్ద నమాజ్ చేసేందుకు అనుమతి లేదం’టూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని బెంచ్ ఆగ్రా ఏడీఎమ్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ తాజ్‌మహల్ వద్ద స్థానికేతరులు నమాజ్ చేయరాదని స్పష్టం చేసింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తాజ్ వద్దకు విదేశీ టూరిస్టులు కూడా వస్తుంటారని, భద్రత దృష్ట్యా నమాజ్ చేసుకోవడాన్ని నిలిపివేయాలని కోర్టు తెలిపింది. నేటికి ప్రతి శుక్రవారం తాజ్‌మహల్ సందర్శనకు యాత్రికులను అనుమతించరు. ఆ రోజున స్థానిక ముస్లింలు తాజ్ వద్ద నమాజ్ చేస్తారు. అయితే ఇటీవల బంగ్లాదేశ్‌తో పాటు ఇతర దేశాల ముస్లిం అక్కడకు వచ్చి నమాజ్ చేయడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తాజ్‌మహల్‌ను సందర్శించేందుకు విదేశీ టూరిస్టులు ఏడాది పాటు వస్తుంటారు. భద్రత దృష్ట్యా తాజ్ వద్ద స్థానికేతరులు నమాజ్ చేసుకోవడాన్ని నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
శివాలయంలో నమాజ్, ఇఫ్తార్ విందు..
లక్నో, ఉత్తరప్రదేశ్ : మత ఘర్షణలు పెరిగిపోతున్నాయంటూ తరచూ వార్తలు వస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో... హిందువుల ఆరాధ్య దైవమైన మహాశివుడు కొలువైన ఓ ఆలయంలో ఇఫ్తార్ విందు, హారతి ప్రదేశంలో నమాజ్.. ఇలాంటి ఊహ కూడా అసాధ్యమే. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు దేవ్యగిరి. లక్నోలోని వెయ్యేళ్ల చరిత్ర ఉన్న శివాలయంలో పూజారిగా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళ దేవ్యగిరి. మత సామరస్యాన్ని పెంపొందించడం కోసం ఆమె చేపట్టిన కార్యక్రమం అందరి మన్ననలు అందుకుంటోంది. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌లోని గోమతి నది ఒడ్డున అతి పురాతనమైన మంకమేశ్వర్ గుడి ఉంది. అక్కడ ప్రధాన అర్చకురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మహంత్ దేవ్యగిరిగా మారారు అరుణిమా సింగ్. ఏ మతమైనా మనుషులను ప్రేమించమని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించమని మాత్రమే చెబుతుందనే ఆమె నమ్మకాన్ని ఆచరించి చూపాలనుకున్నారు. అందుకోసం వెయ్యేళ్ల ప్రాశస్త్యం ఉన్న శివాలయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారు. హారతి స్థలంలో ముస్లిం సోదరులు నమాజ్ చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు కూడా చేశారు. ‘మంకమేశ్వర్ ఆలయంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు సుమారు 500 మంది సున్ని, షియా ముస్లింలను ఆహ్వానించాం. విందు ఏర్పాటు కోసం ముగ్గురు వంటవారు, గుడిలో పనిచేసే కార్యకర్తలు ఉదయం నుంచే ఎంతో కష్టపడ్డారు. ముస్లిం సోదరుల కోసం మొదటిసారిగా మేము చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. లక్నోలో ఒక ఆలయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడమనేది మొదటిసారి. ఇలాంటి కార్యక్రమానికి నాందిగా నిలవడం ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ దేవ్యగిరి హర్షం వ్యక్తం చేశారు. ఆమె నిర్ణయం ఆదర్శనీయం.. ఇఫ్తార్ విందుకు హాజరైన తేలీ వలీ మసీదు మౌలానా ఫజల్-ఈ-మనన్ మాట్లాడుతూ.. ‘మహంత్ దేవ్యగిరి శివాలయంలో విందు ఏర్పాటు చేస్తున్నామని నన్ను ఆహ్వానించినపుడు ఎంతో సంతోషంగా అనిపించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరం. ఆమె నిర్ణయాన్ని మేమంతా స్వాగతిస్తున్నాం’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. -
దిల్ దిల్ రమజాన్
రమజాన్ చివరి పదిరోజులు ఎంతో కీలకం. ఖుర్ఆన్ గ్రంథ సందేశాలు దివి నుంచి భువికి వచ్చింది ఈ చివరి పదిరోజుల్లోని ఒక బేసి రాత్రిలోనేనన్నది ప్రవక్త సూచన. అందుకే ఆ రాత్రిని అన్వేషించడం, ఆ రాత్రిలో దైవచింతనలో గడపడం వెయ్యి నెలలపాటు చేసిన పుణ్యకార్యాలతో సమానంగా ముస్లిముల విశ్వాసం. నేల నేలంతా ఒక్కటే పాట..షానే రమజాన్... జానే రమజాన్... దిల్ దిల్ రమజాన్ప్రేమ, కరుణ, క్షమ, ఆరాధనల పవిత్ర నెల, ఒకరినొకరు క్షమించుకుని చూసుకునే ప్రేమపూర్వక చూపులు, ఆకలి బాధానుభూతులు, ఇఫ్తార్ ఆనందాలు సహెరీ శుభాలు, జకాత్, ఫిత్రా దానాలు, ఖుర్ఆన్ పారాయణ చైతన్యం, తరావీహ్ ఆరాధనలు, మది నిండా రమజాన్ వెలుగులే!మాటల్లో, చేతల్లో దైవాదేశాల పరిమళాలే. నలుదిశలా ప్రేమ పవనాల సుమగంధాలే. ఇదంతా అల్లాహ్ రాసిన వరాల వీలునామా. రమజాన్ వరాలు లెక్కకట్ట తరమా! రమజాన్ అంటే కాల్చివేయడం, దహించి వేయడం అని నిఘంటువు అర్థం చెబుతుంది. మంటల్లో ఏమి వేసినా భస్మీపటలం కావాల్సిందే. ఉపవాసంతో కలిగే ఆకలి మంటలో రోజేదార్ల పాపాలు, చెడుగులన్నీ దహించుకుపోతాయి. ఇలా ముఫ్పై రోజులూ గత ఏడాదిపాటు చేసిన పాపాలన్నీ దగ్ధం అవుతాయి. పాపాలన్నీ కాల్చివేసి రోజేదార్ను పునీతుడిని చేస్తాడు అల్లాహ్. ఈద్ వరకూ రోజేదార్లు తమ పాపాల నుంచి విముక్తి పొంది పవిత్రంగా రూపు దాల్చుతారు. ఇలాంటి పునీతులకు అల్లాహ్ ఈద్ రోజు ప్రసన్నమవుతాడు. అదే ఈద్ కానుక. అల్లాహ్ పట్ల ఎనలేని ప్రేమతో ఆకలి బాధతో వచ్చే ‘యా అల్లాహ్’ అనే ఒక్క పిలుపు సప్తాకాశాలపైన కొలువుదీరిన అల్లాహ్ సింహాసనం వరకు వెళుతుంది. సప్తాకాశాలన్నీ రోజేదార్ల పిలుపుతో మార్మోగుతాయి. రమజాన్ నెల సాంతం సప్తాకాశాలల్లో ఉన్న దైవదూతలంతా రోజేదార్ల మేలు కోసం, యోగక్షేమాల కోసం అల్లాహ్‌ను వేడుకుంటారు. రోజేదార్ల వేడుకోళ్లకు తథాస్తు పలకండని అల్లాహ్ దైవదూతలను పురమాయిస్తాడు. ఇంతటి మహత్తరమైన రమజాన్ వసంతం ముప్ఫై రోజుల పండువలా జరుపుకుంటున్నారు ముస్లిములు. ఇఫ్తార్ ఆనందాలు, సహెరీ శుభాలు తనివితీరా ఆస్వాదిస్తున్నారు. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడాలు, ఒకరినొకరు క్షమించుకోవడం, క్షమ, దాతృత్వం వంటి శుభలక్షణాలు, సుగుణాలు పాలలా ప్రవహిస్తాయి. మది నిండా ప్రేమ, దయ, క్షమతో పొంగిపొర్లుతుంది. ఘడియ ఘడియను అల్లాహ్‌ను మెప్పించేందుకే ప్రయత్నాలన్నీ. ఆ పరమ ప్రభువును ప్రసన్నం చేసుకుంటే చాలు భూమ్యాకాశాల కంటే కూడా విశాలమైన స్వర్గలోకానికి అర్హత సాధించవచ్చన్నదే రోజేదార్ల ఆరాటం. దురలవాట్లకు దూరంగా ఉంటూ నిర్మల మనస్సుతో అల్లాహ్ మెప్పుపొందడమే రోజేదర్ల తపనంతా. ప్రతివారూ తమతమ మనసు తరచి చూసుకుంటారు. మానవాళి సన్మార్గాన్ని పొందడమే రమజాన్ ఉద్దేశం. ఐహిక సుఖాల పిపాసను ఉపవాసం అంతమొందిస్తుంది. ఆధ్యాత్మిక వికాసం సొంతమవుతుంది. అపరిమిత ధనార్జన మనిషిని వినాశనంపాలు చేస్తే జకాత్, దానాలు ప్రేమభావాన్ని జనింపచేస్తాయి. మనసును జయించాలి.. మనసు చాలా విచిత్రమైనది. కోరికలు కళ్లెంలేని గుర్రాలు. మనసును జయించిన వారే ఆధ్యాత్మిక విజయాన్ని సాధిస్తారు. మనస్సును నిగ్రహించుకోవడంలో ఉపవాసం కీలకపాత్ర పోషిస్తుంది. లేవలేని సమయంలో లేచి అన్నపానీయాలు భుజించడం, తినే తాగే పగటి వేళలో పస్తులుండటం, హాయిగా పడుకునే వేళలో దైవం ముందు ఆరాధన చేయడం ఇవన్నీ మనోనిగ్రహానికి సాధనాలుగా పనిచేస్తాయి. ఈ నిగ్రహం లేకపోతే మనసు ప్రపంచ తళుకుబెళుకుల వెంట పరుగెడుతుంది. ఆకర్షణలకు బానిసవుతుంది. పతనానికి కారణమవుతుంది. అదే మనసును అదుపులో ఉంచుకుంటే ఎన్నో విజయాలు సాధించవచ్చు. ఆ పనే చేయిస్తుంది ఉపవాసదీక్ష. దైవభీతిని, ధర్మనిష్ఠను పెంపొందించడమే ఉపవాసం ఉద్దేశం అంటోంది ఖుర్ఆన్. రోజంతా ఆకలి దప్పులతో ఇఫ్తార్ వేళలో తన ముందు ఉన్న రుచికరమైన అన్నపానీయాలను ఇఫ్తార్ ఘడియకు క్షణం ముందు కూడా నోట్లో వేసుకోకపోవడానికి కారణం రోజేదార్లలో కలిగే పాపభీతి, వివేకవిచక్షణలే. అందుకే ముస్లిముల హృదయాలు నెలసాంతం ధర్మనిష్ఠతో, మంచి పనులతో పులకించిపోతారు. ప్రేమ, కరుణ, క్షమ, దానగుణం అనే సుగుణాలను పెంపొందించుకుంటారు.ఇఫ్తార్ చేసి నమాజ్ చేసుకుని ఇంటికొచ్చిన సగటు ముస్లిమ్ కాస్సేపు మేను వాల్చాడో లేదో ఇషా నమాజ్ కోసం మస్జిదు నుంచి పిలుపు వస్తుంది. ఆపై తరావీహ్ నమాజులో ఖుర్ఆన్ వినడం జరుగుతుంది. సుమారు 2గంటల నిడివితో మస్జిదులో అల్లాహ్ ముందు నిలబడి దైవారాధన చేస్తాడు. నిద్ర ముంచుకొస్తున్నా అల్లాహ్ మెప్పు పొందేందుకు హాయి నిద్రను త్యాగం చేస్తాడు. ఈ వాతావరణం ఒక్క రమజాన్ లోనే మనకు కనిపిస్తుంది. రాత్రి దైవారాధనలో గడిపి రాత్రి చాలా పొద్దుపోయాక నిద్రకు ఉపక్రమిస్తారు. తెల్లవారు జామున మూడున్నర గంటలవుతుంది. వేళకాని వేళ నిద్రమత్తు వదలదు. ఆ వేళలో మస్జిద్ నుంచి మోగే సైరన్‌కు ఠంచనుగా లేస్తాడు ఉపవాసి. పడుకునే వేళలో బ్రష్ చేసి భోజనం చేయాలి. కేవలం పరిమిత సమయంలోగా భోజనం ముగించాలి. ఇలా తెల్లవారు జామున భోజనం చేయడాన్నే సహెరీ అంటారు. సహెరీ తరువాత నిద్రపోదామంటే కుదరదు. వెంటనే పెందలకడ చదివే ఫజర్ నమాజ్ కోసం అజాన్ వాణి పిలుస్తుంటుంది. వేళకాని వేళలో లేవడం, సహెరీ భుజించడం, సహెరీ వంటలు ఇరుగు పొరుగు వారికి పంపడం, నమాజ్ కోసం వెళ్లడం ఈ దృశ్యాలు కేవలం మనకు రమజాన్ నెలలోనే ప్రత్యేకం. ఈ ఆధ్యాత్మిక వాతావరణం కేవలం మనకు రమజాన్ నెలలోనే కనపడుతుంది. సహెరీ, ఇఫ్తార్, నమాజులు, ఖుర్ఆన్ పారాయణం, జకాత్, సదకా దానాలతో ముస్లిముల మోములు మురిసిపోతుంటాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా పద్నాలుగు గంటల దాకా ఆకలిదప్పులతో గడుపుతాడు. మనిషిని మహోన్నతంగా తీర్చిదిద్దడమే రమజాన్ శిక్షణ ఉద్దేశం. ఇఫ్తార్ లో త్యాగభావం... ఇఫ్తార్‌లో నలువైపులా ప్రేమ, త్యాగభావం నిండిన వాతావరణమే కనిపిస్తుంది. స్వార్థం, ప్రలోభం అన్నీ ఇఫ్తార్‌లో చాప చుట్టేస్తాయి. ఉచ్ఛనీచాలు అస్సలే ఉండవు. పేదలు, ధనికులు ఇద్దరూ పక్కపక్కనే కూర్చునే ఆహ్లాదకరమైన వాతావరణం ఇఫ్తార్ వేళలో కనబడుతుంది. తమ పక్కన కూర్చున్న వ్యక్తి పరిచయస్తుడా కాదా అన్నది ఎవరూ పట్టించుకోరు. తన వద్ద ఉన్న తినుబండారాలు, ఆహార పదార్థాలను ఏమీలేని వ్యక్తికి ఎంతో ప్రేమతో అందించే అందమైన దృశ్యాలు రమజాన్‌లో కనపడతాయి. ఇఫ్తార్‌లో తినే ప్రతి వ్యక్తి మిగిలిన వారికి సరిపోతుందో లేదో అన్న ధ్యాసతోనే తింటారు. సామాజికంగా అందరం ఒక్కటే అనే అద్భుతమైన అందమైన భావన ఆచరణాత్మకంగా కనిపిస్తుంది. వీలయినంత ఎక్కువగా ఎదుటివారికి ప్రాధాన్యమివ్వాలనే త్యాగభావం జనిస్తుంది. దాదాపు పధ్నాలుగు గంటల పాటు అన్నపానీయాలకు దూరంగా ఉండడం వల్ల ఎంత సంపన్నుడైనా ఆకలి బాధ, దప్పిక బాధేమిటో అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. పేదల కష్టాలను అర్థం చేసుకుని ఆదుకుంటాడు. ఆహారాన్ని పంచుకు తినే అద్భుతమైన అందమైన దృశ్యాలు రమజాన్ మాసంలో కనువిందు చేస్తాయి. చివరి పదిరోజులు కీలకం రమజాన్ చివరి పదిరోజులు ఎంతో కీలకం. ఖుర్ఆన్ గ్రంథ సందేశాలు దివి నుంచి భువికి వచ్చింది ఈ చివరి పదిరోజుల్లోని ఒక బేసి రాత్రిలోనేనన్నది ప్రవక్త సూచన. అందుకే ఆ రాత్రిని అన్వేషించడం, ఆ రాత్రిలో దైవచింతనలో గడపడం వెయ్యి నెలలపాటు చేసిన పుణ్యకార్యాలతో సమానంగా ముస్లిముల విశ్వాసం. చివరి పది రోజులూ ఏతేకాఫ్ అనే ప్రత్యేక ఆరాధనను పాటిస్తారు. అల్ విదా రమజాన్.. రమజాన్ వసంతానికి బాధతో, ఆర్ద్రతతో వీడ్కోలు పలుకుతారు. దిల్ దిల్ రమజాన్ అని పాడుకున్న ముస్లిములు నెలరోజుల అతిథిని ఎంతో గౌరవ ప్రపత్తులతో చూసుకున్న ముస్లిములు 30 రోజుల ఉపవాసాలు ముగింపు దశకు చేరుకునే సరికి బాధతో వీడ్కోలు పలుకుతారు. అల్ విదా.. అల్ విదా.. కారుణ్యాన్ని కురిపించిన వసంతమా అల్ విదా అని ఆర్ద్రతతో పాడుకుంటారు. ప్రేమను కుండపోతలా కురిపింపచేసిన మాసమా నీకు మా వీడ్కోలు అని పాడుకుంటారు. షవ్వాల్ నెలవంక కనపడగానే ఈదుల్ ఫిత్ర్ రమజాన్ పండుగను ఆనందోహాత్సాహలతో జరుపుకుంటారు. ఈద్ రోజు ముస్లిముల çహృదయాల్లో, చేతల్లో కారుణ్య ఛాయలు రెట్టింపవుతాయి. అల్లాహ్ చూపిన కరుణా కటాక్షాలతో నెలరోజుల ఉపవాసాలు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు, ముప్ఫై రోజుల పాటు దేవుని సమక్షంలో తరావీహ్ నమాజు చేసినందుకుగాను పేదలకు ఫిత్రా దానం చేస్తారు. పండుగ నమాజ్‌కు వెళ్లేముందు ఫిత్రా దానం చేసి పేదలకు చేయూతనిస్తారు. ఈద్గాహ్కు వెళ్లి ఈద్ నమాజ్ చేస్తారు. అందరి ముఖాల్లో చిరునవ్వు తొణికిసలాడేలా చేయడమే ఈదుల్ ఫిత్ర్ ఉద్దేశం. ఈద్ రోజు చిన్నా పెద్దా, ఆడా మగా అందరిలోనూ అనంత సంతోషంతో హృదయాలు ఓలలాడుతాయి. వచ్చే ఏడాది వరకూ ఇదే స్ఫూర్తిని కొనసాగించేవారే నిజమైన సౌభాగ్యవంతులు. అప్పుడే నెలరోజుల రమజాన్ శిక్షణకు సార్థకత. – ముహమ్మద్ ముజాహిద్ -
నమాజ్‌తో ఆరోగ్యం
మద్దూరు (కొడంగల్లు): దివ్య ఖురాన్ గ్రంథం అవతరించిన పవిత్రమాసం రంజాన్. మనిషిలో క్రమశిక్షణ, ఐక్యత, సమానత్వం, సహనశీలం, భక్తిపరాయణత్వం, మనోనిశ్చలత, దానగుణాన్ని పెంపొందించే మహత్తరమైన నెల రంజాన్. ఈ నెలరోజుల పాటు ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాస దీక్షలు చేస్తుంటారు. ఆరోగ్య ప్రదాయినీ నమాజ్ ప్రతిరోజు ఐదు పూటల నమాజ్ చేస్తే ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యం కూడా వస్తుందని చెబుతున్నారు వైద్యనిపుణులు. నమాజ్ వల్ల దైవాన్ని కొలవడంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. చెడునుంచి కూడా దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా నమాజ్‌లోని ప్రతి క్రియలో వ్యాయామ గుణాలు ఉన్నాయి. వేకువజామున చేసే నమాజ్‌ను ఫజర్గా, మధ్యాహ్నం జోహర్, సాయంత్రం అసర్, సూర్యాస్తమయం వేళ మగ్రీబ్, రాత్రి ఇషా నమాజ్ అని అంటారు. నమాజ్‌లో తక్బీర్, ఖియాం, రుకూ, సజ్ధా, సలాం అనే క్రియలు ఉంటాయి. రుకూ.. రెండు చేతులూ మోకాళ్లపై ఉంచుతూ నడుమును సమానంగా వంచుతూ చూపును రెండు కాళ్ల బొటన వేళ్ల మధ్యన ఉంచాలి. ఈ క్రియ ఉదర భాగానికి మంచి వ్యాయామాన్ని ఇస్తుంది. చూపునకు ఉత్తేజం కలిగిస్తుంది. వెన్నముకకు మంచి వ్యాయామం. సజ్దా .. పాదాలు మోకాళ్లు, అరచేతులు, ముక్కు, నుదురు, నేలను తాకిస్తూ దైవం సమక్షంలో సాష్టాంగ ప్రణామం చేయడం. ఈ క్రియద్వారా శరీరంలోని ప్రతి అవయవానికి వ్యాయామం దొరుకుతుంది. సజ్ధా చేసే సమయంలోనూ, అందులోంచి లేచే సమయంలోనూ ఛాతికి మంచి వ్యాయామం లభిస్తుంది. భుజాలు బలోపేతమవుతాయి. సలాం... నమాజ్‌లో ఇది చివరి ఘట్టం. నమాజ్ పూర్తయ్యే సమయంలో తలను ఒకసారీ కుడివైపు తిప్పి సలాం చేస్తారు. అనంతరం ఎడమవైపునకు తిప్పి సలాం చేసి నమాజ్‌ను ముగిస్తారు. నేత్ర శక్తి పెరిగి, మొదడు ఉత్తేజితమవుతుంది. తక్బీర్... నమాజ్ ప్రారంభానికి సంకల్పం తర్వాత రెండు చేతులు చేవుల వరకు ఎత్తి కిందకు దించి నాభిపైన రెండు చేతులు కట్టుకోవాలి. ఈ క్రియ వల్ల చేతిబలం పెరుగుతుంది. ఆధ్యాత్మికం.. వ్యాయామం నమాజ్ చేస్తే ఆధ్మాత్మికంతోపాటు వ్యాయామం లభించి మంచి ఆరోగ్యంగా ఉంటారు. మామూలు రోజుల్లో ఐదు పూటల నమాజ్ చేయడం ఒక ఎత్తు.. రంజాన్‌లో చేయడం ఒక ఎత్తు. మిగితా రోజులతో పోల్చుకుంటే 70 రకాత్లు చేసిన పుణ్యం లభిస్తుంది. ఈ మాసంలోనే దివ్వ ఖురాన్ అవతరించింది. అందరు జకాత్, ఫిత్రా, విధిగా తీయాలి. – అబ్దుల్ ఖదీర్, జామా మసీదు ఇమామ్, మద్దూరు. -
ఆధ్యాత్మికతకు ‘నెల’వు
కల్హేర్(నారాయణఖేడ్) సిద్ధిపేట : నెలవంక తొంగిచూసింది.. సమతా మమతలకు స్ఫూర్తినిచ్చే రంజాన్ ముబారక్ మాసం వచ్చేసింది. ముస్లిం లోగిళ్లు ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. ఇస్లాం మతం ఆశయాలు, ఆదర్శాలను నూటికి నూరుపాళ్లు ఆచరించే మాసం రంజాన్. గ్రామాలు, పట్టణాల్లో సందడి నెలకొంది. ముస్లింలకు పవిత్రమైన రంజాన్ ముబారక్ మాసం ఇస్లామ్ క్యాలెండర్ ప్రకారం షాబాన్ నెల పూర్తికాగానే కనిపించే నెలవంక దర్శనంతో వస్తుంది. దీంతో ముస్లింలు ‘తరావీ’ నమాజ్‌ను ఆచరించి రోజా (ఉపవాస దీక్షలు) ప్రారంభిస్తారు. రాత్రి ‘ఇషా’ నమాజ్ అనంతరం సామూహికంగా తరావీ నమాజ్ చేస్తారు. తరావీ నమాజ్‌లో పవిత్ర ‘ఖురాన్’ శ్లోకాలను పఠిస్తారు. రంజాన్ నెల ప్రారంభంలోని మొదటి భాగం కారుణ్య భరితమని, మధ్యభాగం దైవ మన్నింపు లభిస్తుందని, చివరిభాగం నరకం నుంచి విముక్తి కలిగి సౌఫల్యం ఖురాన్లో పేర్కొన్నట్లు ముస్లిం మతపెద్దలు చెబుతారు. రంజాన్ నెలలో 29 లేదా 30 రోజులపాటు ముస్లింలు వేకువజామునే ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు. వేకువజామున ‘ఫజర్’ నమాజ్‌కు ముందు తీసుకునే ఆహారాన్ని ‘సహర్’ అంటారు. సాయంత్ర సూర్యాస్తమయం వేళ ‘మగ్రీబ్’ నమాజ్‌కు ముందు ఉపవాస దీక్ష ముగిస్తారు. దీక్ష విరమణ కోసం ‘ఇఫ్తార్’ చేస్తారు. ఉపవాస దీక్షలతోపాటు క్రమం తప్పకుండా ఐదు పూటలు నమాజ్, ప్రత్యేకంగా తరావీ నమాజ్ చేస్తారు. షవ్వాల్ నెల చంద్రున్ని చూసి మరుసటి రోజు యావత్తు ముస్లింలు ‘ఈద్ ఉల్ ఫితర్’.. నమాజ్ ఆచరించి చేసుకునే పండుగే రంజాన్. పవిత్ర గ్రంథం ‘ఖురాన్’ రంజాన్ నెలలోనే అవతరించింది. రంజాన్ మాసం ముస్లింలకు ఒక నైతిక శిక్షణలాంటిదని, ఉపవాస దీక్షలతోపాటు ఐదువేళల్లో నమాజ్ చేయడం వల్ల క్రమశిక్షణ, తల్లిదండ్రులు, పెద్దల పట్ల మర్యాదపూర్వకంగా, పిల్లల పట్ల ప్రేమాభిమానాలతో మెలగడం తెలుస్తుందని ముస్లింలు పేర్కొంటున్నారు. ఇస్లాం పయనం ఇలా.. ఇస్లాం మతం ఐదు ముఖ్య మూలస్తంభాలపై ప యనిస్తుంది. అందులో మొదటిది ‘కల్మా’ (దేవున్ని విశ్వసించడం), రెండోది ప్రతిరోజు ఐదువేళల్లో నమాజ్ ఆచరించడం, మూడోది రంజాన్ మా సంలో ఉపవాస దీక్షలు పాటించడం, నాలుగోది ‘జకాత్’ రూపంలో పేదలకు దానధర్మాలు చేయడం, ఐదోది ‘హజ్’ (మక్కా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం) యాత్ర చేయడం. ఈ ప్రధాన ఐదు సూత్రాలను ముస్లింలు పాటిస్తారు. రంజాన్ నెల లో పాటించే పద్ధతులు విజయవంతమైన జీవనానికి భరోసా ఇస్తాయి. ఉపవాస దీక్షల్లో ఉంటూ ఐదు వేళల్లో నమాజ్ చేస్తే మనోధైర్య, సహనం, ఆత్మస్థైర్యం, ధాతృత్వం పెంపొందుతుంది. ఇస్లామిక్ క్యాలెండర్లో రంజాన్ ‘సర్దార్’.. రంజాన్ మాసంలో నమాజ్ చదువుతూ భగవంతున్ని స్మరించుకుంటారు. పవిత్ర గ్రంథం ఖురాన్ పఠిస్తూ దేవుని స్మరణలో లీనమైపోతారు. ఇస్లామిక్ మాసాల్లో అన్నింటికంటే రంజాన్ నెల చాలా గొప్పది. భగవంతుడు అన్ని మాసాల్లో రంజాన్ మాసాన్ని సర్దార్ చేసినట్లు ముస్లిం మత పెద్దలు చెపుతున్నారు. రంజాన్ మాసం చాలా బర్కత్ ఇస్తుంది. పవిత్ర గ్రంథం ఖురాన్ రంజాన్ నెలలోనే ఆవిర్భవించింది. ప్రవక్త ‘హుజూర్పాక్ సల్లెల్లాహు అలైహి వసల్లాం’ రంజాన్ నెలలో ‘అల్లాహ్’కి బందెగి కర్నె కేలియే బహుత్ జ్యాదా తాకిర్ కరే.. అని ముస్లింలు భావిస్తున్నారు. రంజాన్ నెల 27న రాత్రి ‘షబ్ ఏ ఖదర్’ జరుపుకుంటారు. రాత్రి (ఇబాదత్) జాగరణ చేస్తూ భగవంతుడిని తలుచుకుంటారు. షబ్ ఏ ఖదర్ రోజు ఇబాదత్ చేస్తే వెయ్యి మాసాల ‘సవాబ్’ (దేవుడి ఆశీస్సులు) దొరుకుతుంది. సహర్‌తో రోజా ప్రారంభం.. రంజాన్ మాసంలో తెల్లవారు జామునలో ఫజర్ నమాజ్‌కు ముందు రోజా ఉండేందుకు ముస్లింలు ‘సహర్’ చేస్తారు. సహర్‌కు ముందు ఆహారం తీసుకుంటారు. అనంతరం ఉపవాస దీక్ష కఠిన ంగా పాటిస్తారు. కనీసం మంచి నీరు కూడా తీసుకోరు. రోజా ముగింపు సందర్భంగా సాయంత్రం ‘ఇఫ్తార్’తో దీక్షను విరమిస్తారు. ఇఫ్తార్‌లో పండ్లు, ఇతర తీపి పదార్థాలు తీసుకుంటారు. లేకుంటే కనీసం ఒక ఖజ్జూర పండు, కొంచెం నీరు తాగి ఇఫ్తార్ చేస్తారు. తరావి నమాజ్.. రంజాన్ మాసంలో ప్రత్యేకంగా తరావి నమాజ్ చ దువుతారు. ఫజర్, జోహర్, అసర్, మగ్రీబ్, ఇ షా నమాజులతో పాటు ప్రత్యేకంగా తరావి న మాజ్ చే యడం రంజాన్ మాసంలో ప్రత్యేకత. రంజాన్ ఆ రంభం కోసం నెల వంక దర్శనం అన ంతరం ఇషా నమాజ్ అనంతరం తరావి నమాజ్ చేస్తారు. తరా వి నమాజ్ సున్నాత్గా భావిస్తారు. 20 రకాత్లు తరావి నమాజ్ చదువుతారు. పవిత్ర గ్రంథం ఖురాన్.. మానవ జీవితం ఎలా ఉండాలో మార్గదర్శకాలను సూచించే ఇస్లాం మత పవిత్ర గ్రంథం ఖురాన్. రంజాన్ మాసంలో ‘లైలతుల్ ఖద్ర్’ (పవిత్రమైన రాత్రి) నాడు అరబ్బీ భాషలో ఖురాన్ గ్రంథం అవతరించింది. ఖురాన్లో 30 ‘పారాలు’ (భాగాలు) ఉన్నాయి. 114 సూరాలతో పాటు 14 సజ్ధాలు వస్తాయి. ఖురాన్ ఎంతో పవిత్రమైంది. ఖురాన్‌ను ఎక్కడ పడితే అక్కడ పెట్టరు. ప్రత్యేకించి ‘రెహల్’ (చెక్కతో తయారు చేసిన) ఉపయోగించి ఖురాన్ పఠనం చేస్తారు. ఖురాన్‌ను విశ్వసించి జీవితంలో దాన్ని అమలు చేయాలి. జీవితానికి సంబంధించిన దైవాజ్ఞలను తెలుసుకొనేందుకు ప్రతీ రోజు పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని పఠిస్తూ అవగాహన చేసుకోవాలి. రంజాన్ దీక్షలు కఠినం రంజాన్ మాసంలో రోజా చేపట్టేందుకు అత్యంత కఠినంగా వ్యవహరించాలి. రంజాన్ ముబారక్ నెల చాలా గొప్పది. రోజా ఉండడం, నమాజ్, ఖురాన్ చదవడం ప్రత్యేకత. ఉపవాస దీక్షలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేపట్టాం. సహర్ కోసం నిద్ర నుంచి లేపేందుకు సైరన్ ఏర్పాటు చేశాం. – ఎండి. ఖుద్బొద్దీన్, మసీద్ కమిటీ అధ్యక్షుడు, కల్హేర్ నియమాలు పాటించాలి రంజాన్ నెలలో అన్ని నియమాలు పాటించాలి. ‘ఇమాన్వాలో ఇస్ మహినేకో జాన్కర్ రోజా రఖో’ తరావి నమాజ్, ఖురాన్ చదివితే పూరే గుణా (పాపాలు) అల్లాహ్‌తాలా మాఫీ కరేగా’ రంజాన్ నెలలో అల్లాహ్ ఇబాదత్ కర్నా చాహియే. – మౌలనా లతీఫ్, ఇమాం, కల్హేర్ -
నమాజ్ చేయలేదని బాలికను చంపేశారు!
ముంబై: విధిగా నమాజ్ చేయడంలేదన్న కారణంగా ఓ బాలికను ఆమె కుటుంబీకులే హత్యచేశారు. ముంబైలోని అన్టాప్ హిల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది. బాలికను చంపిన అత్త, మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్టాప్ హిల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ పథాంకర్ చెప్పిన వివరాలిలా ఉన్నాయి.. ఏలా జరిగింది?: తల్లి చనిపోవడంతో 15 ఏళ్ల బాలిక గత కొంతకాలంగా దగ్గరి బంధువుల ఇంట్లో ఉంటోంది. పని ఒత్తిడి కారణంగా పాపను చూసుకునే అవకాశం లేకపోవడంతో తండ్రి ఆ ఏర్పాటుచేశాడు. వరుసకు అత్తయ్యే మహిళ.. విధిగా నమాజ్ చేయాల్సిందిగా బాలికను వత్తిడిచేసేది. ప్రార్థన పట్ల ఆసక్తిలేని ఆ బాలిక అత్తమాట వినేదికాదు. ఇదే విషయంలో మొన్న శుక్రవారం వాగ్వాదం జరిగింది. పట్టరాని కోపానికిగురైన అత్త.. చున్నీని బాలిక మెడకు బిగించి చంపేసింది. కప్పిపుచ్చేయత్నం: క్షణికావేశంలో చేసిన హత్యను కప్పిపుచ్చుకోవడానికి ఆ అత్త, ఆమె కుటుంబీకులు నానా తంటాలు పడ్డారు. బాత్రూమ్లో జారిపడిందంటూ బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాప మెడపై కమిలిన గుర్తులను గమనించిన డాక్టర్లు.. మరుక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. చివరికి ఇంటరాగేషన్‌లో నేరం చేసినట్లు అంగీకరించారు. బాలిక అత్తను, ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌చేశారు. షాక్‌కు గురైన తండ్రి: బాలిక మరణవార్త విన్న తండ్రి షాక్‌కు గురయ్యాడు. ‘‘బాగా చూసుకుంటారన్న నమ్మకంతోనే నా బిడ్డను వాళ్లింట్లో ఉంచాను. ఆ దుర్మార్గులు ఇంత పని చేస్తారనుకోలేదు. అయినా, నమాజ్ చెయ్యకుంటే ఆ విషయం నాకు చెప్పాలిగానీ చంపడమేంటి?’ అని భోరున విలపించాడా తండ్రి. -
నమాజ్ : మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
హర్యానా: మసీదులు, ఈద్గాలు, ఇతర గుర్తించిన ప్రాంతాల్లో మాత్రమే నమాజ్ చేయాలని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సీఎం ఇలా వ్యాఖ్యలు చేసి ఒక్క రోజు కూడా గడవకముందే ఆయన కేబినెట్లోని మరో మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖాళీ ప్రదేశాలను ఆక్రమించే పేరుతో నమాజ్ చేయడం సరికాదని, ఆ ఉద్దేశంతో నమాజ్ చేస్తే అనుమతించేదిలేదని మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యానించారు. గత రెండు వారాలుగా గుర్గావ్లో ముస్లింలు బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయడంపట్ల హిందూ సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయడం నిషేధించాలని ఆర్ఎస్ఎస్, భజరంగ్‌దళ్ లాంటి పలు సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అశోక్ తన్వార్ స్పందించారు. మతపరమైన, సాంఘిక కార్యక్రమాలు అనేక ప్రదేశాల్లో జరుగుతాయని, దానికి సరిపడ స్థలం లేని సందర్భంలో బహిరంగ ప్రదేశాలను ఉపయోగించుకోవడంలో తప్పులేదని అన్నారు. ముఖ్యమంత్రి అన్నివర్గాల ప్రజలను సమానంగా చూడట్లేదని, కుల, మత ప్రతిపాదికన విభజించి మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతపరమైన భావాలతో కులాల, మతాల మధ్య చిచ్చుపెట్టి, మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. -
11న గుర్గావ్లో ఏమవుతుంది?
సాక్షి, న్యూఢిల్లీ : హర్యానాలోని గుర్గావ్లోని సహారా మాల్ వద్ద గత శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు దాదాపు మూడు వందల మంది ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి ఉద్యుక్తులవుతుండగా, నాలుగు కార్లలో దాదాపు 20 మంది యువకులు కర్రలు ధరించి రయ్‌మంటూ దూసుకువచ్చారు. అక్కడ ముస్లింలు ప్రార్థనలు చేయవద్దంటూ ఆ యువకులు కర్రలు ఝుళిపిస్తుండగా అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డగించి, ముస్లింలను అక్కడి నుంచి తక్షణం వెళ్లిపోవాల్సిందిగా అదేశించారు. ముస్లింలు ఆరోజు అక్కడ ప్రార్థనలు చేయకుండానే ఎక్కడి వాళ్లు అక్కడికి వెళ్లిపోయారు. గత మూడేళ్లుగా సహారా మాల్ వద్ద ఖాళీగా ఉన్న ప్రదేశంలో ముస్లింలు నిరాటంకంగా ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఈసారి వారికి అనుకోకుండా అవాంతరం ఏర్పడింది. గుర్గావ్లో ప్రతి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో దాదాపు నగరంలోని దాదాపు 96 బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు జరుపుతారు. ఆ రోజు అంటే, శుక్రవారం నాలుగవ తేదీ నాడు దాదాపు పది బహిరంగ ప్రదేశాల్లో ముస్లింల ప్రార్థనలు జరుపుకోకుండా హిందూ యువకులు అడ్డుకున్నారు. వాటిలో సెక్టార్ 29, సెక్టార్ 53 ప్రాంతాలు కూడా ఉన్నాయి. సెక్టార్ 29లో గత 15 ఏళ్లుగా నిరాటంకంగా ముస్లింలు ప్రార్థనలు చేసుకుంటుండగా, సెక్టార్ 53లో గత 13 ఏళ్లుగా ముస్లిలు ప్రార్థనలు చేసుకుంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు జరపరాదని, ప్రార్థనలను మసీదులకే పరిమితం చేయాలని ‘సంయుక్త్ హిందూ సంఘర్ష్ సమితి’ ఇచ్చిన పిలుపు మేరకు ఆరోజు ప్రార్థనలను హిందూ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సంఘర్ష్ సమితిలో ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషద్, భజరంగ్ దళ్, శివసేన, హిందూ జాగారణ్ మంచ్, అఖిల భారతీయ హిందూ క్రాంతి దళ్ సహా 12 హిందూ సంఘాలు ఉన్నాయి. ముస్లింలు శుక్రవారం ప్రార్థనలు జరిపే బహిరంగ ప్రదేశాల్లో 500 నుంచి 1500 మంది ఒకేసారి ప్రార్థనలు జరపవచ్చు. గుర్గావ్లో మొత్తం 21 మసీదులు ఉన్నాయి. 300 మందికి మించి ఏ మసీదులో ఒకేసారి ప్రార్థనలు జరుపుకునే పరిస్థితి లేదు. సంయుక్త్ హిందూ సంఘర్ష్ సమితి ఆందోళనకు మద్దతుగా రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా మాట్లాడారు.మసీదులు, ఈద్గాలు, ఇతర గుర్తించిన ప్రాంతాల్లో మాత్రమే ముస్లింలు ప్రార్థనలు జరుపుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి సూచనను కూడా ఎందుకు పాటించరని 29వ సెక్టార్‌లోని 42 ఏళ్ల యువకుడు నౌషాద్ అలీని మీడియా ప్రశ్నించగా, తాము పనిచేసిన చోటుకు సమీపంలో మసీదు లేదని, ఎక్కడో ఉన్న మసీదు వద్దకు వెళ్లి తిరిగి రావడానికి తనకు మూడు గంటల సమయం పడుతుందని చెప్పారు. తన యజమాని మధ్యాహ్నం భోజనం కోసం గంటకు మించి సమయాన్ని అనుమతించరని, ఏ యజమాని మాత్రం మూడు గంటలు అనుమతిస్తారని అలీ వ్యాఖ్యానించారు. ఓ హిందూ యజమాని వద్దనే అలీ వెల్డర్‌గా పనిచేస్తున్నారు. ఆ ప్రాంతంలో చిన్నా, పెద్ద కంపెనీలన్నీ హిందువులవే. వారి వద్ద ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ముస్లిం యువకులే ఎక్కువగా పనిచేస్తున్నారు. ఫరీదాబాద్ చౌక్ వద్ద మొన్న ప్రార్థనలను పోలీసులు అనుమతించలేదని, అనుమతించకపోవే ఏం చేయాలో అర్థం కావడం లేదని మొహమ్మద్ గుల్షాద్ అనే యువకుడు ఆందోళన వ్యక్తం చేశారు. యూపీలోని మీరట్ నుంచి వచ్చిన ఆయన కూడా వెల్డింగ్ షాపులో పనిచేస్తున్నారు. ఎప్పుడైనా తాము పోలీసుల అనుమతితోనే బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు జరిపేవారమని, అయితే ఎప్పుడు లిఖితపూర్వకంగా అనుమతి ఇవ్వలేదని ఆయన అన్నారు. ఇదే విషయమై పోలీసు అధికారులను మీడియా సంప్రతించగా, లిఖితపూర్వక అనుమతి అంటూ తాము ఎప్పుడూ ఇవ్వమని, అలాంటి అనుమతి కావాలంటే పౌర ఉన్నతాధికారుల నుంచి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇదే విషయమై ఉన్నత పౌర అధికారలను ప్రశ్నిస్తే బహిరంగ ప్రదేశాల్లో ముస్లింలు ప్రార్థనలు జరపడం ముఖ్యమంత్రికే ఇష్టం లేనప్పుడు తాము మాత్రం ఎలా అనుమతి ఇవ్వగలమని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే శుక్రవారం ఏమవుతుందోనని పలువురు ముస్లిం యువకులు ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో హిందూ ఓటర్ల సమీకరణకు ఆరెస్సెస్ లాంటి సంస్థలు ఇలాంటి కుట్ర పన్ని ఉండవచ్చని కొందరు ముస్లిం యువకులు అనుమానం వ్యక్తం చేశారు. -
నమాజ్ రోడ్ల మీద చెయ్యడమేంటి?
ఛండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నమాజ్ అనేది మసీదుల్లో, ఈద్గాల్లో చేయాలని కానీ, బహిరంగ ప్రదేశాల్లో కాదని ఆయన వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని.. బహిరంగ ప్రదేశాల్లో నమాజు పేరిట ఉద్రిక్తతలను రేకెత్తిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. శనివారం ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, గురుగావ్ ప్రాంతంలో వారం క్రితం బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌లు చేస్తున్న వారిని హిందూ సంస్థలు అడ్డగించాయి. జై శ్రీరామ్ నినాదాలతో వారికి అంతరాయం కలిగించాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన చర్చనీయాంశంగా మారగా.. ఇప్పుడు సీఎం ఖట్టర్ స్పందించారు. ‘శాంతి భద్రతలను కాపాడటం ప్రభుత్వంగా మా బాధ్యత. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. అది మంచిది కాదు. రోడ్ల మీద కాకుండా మసీదుల్లోనే నమాజు చేసుకోవటం వారికి మంచిది. అలాకాకుండా వ్యవహరిస్తే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని ఖట్టర్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు హర్యానాలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. కాగా, గుర్గావ్ ఘటనకు కొన్ని రోజుల ముందు సెక్టార్ 53లోని రెండు గ్రామాల్లో కొందరు ముస్లింలను గ్రామస్థులు అడ్డుకున్నారు. ప్రభుత్వ స్థలాల్లో అనుమతి లేకుండా ప్రతీ శుక్రవారం పెద్ద సంఖ్యలో ముస్లింలు నమాజ్ చేస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే నమాజ్‌లను భగ్నం చేశారంటూ తమకు ఎక్కడా ఫిర్యాదు అందలేదని గుర్గావ్ పోలీసు అధికారులు తెలిపారు. శాంతిభద్రతలను పర్యవేక్షించడం తమ బాధ్యతని, ప్రార్థనలు ఎక్కడ నిర్వహించాలనేది జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయిస్తుందని వారు పేర్కొన్నారు. -
‘నమాజ్‌లను అడ్డుకున్న హిందూ సంస్థలు’
సాక్షి, న్యూఢిల్లీ : బహిరంగ ప్రదేశాల్లో ముస్లింలు నమాజ్‌లు చేయడాన్ని తాము పలుచోట్ల అడ్డుకున్నామని హర్యానాలోని గుర్గావ్కు చెందిన హిందూ సంస్థలు వెల్లడించాయి. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో గుర్గావ్ సమీపంలో 10 బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌లను సంయుక్త్ హిందూ సంఘర్ష్ సమితి కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సమితిలో భజరంగ్‌దళ్, విశ్వహిందూ పరిషత్, శివ్‌సేన, హిందూ జాగరణ్ మంచ్ తదితర పన్నెండు హిందూ సంస్థలున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు చేసుకునేందుకు ముస్లింలు అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని అఖిల భారత హిందూ క్రాంతి దళ్ జాతీయ సమన్వయకర్త రాజీవ్ మిట్టల్ పేర్కొన్నారు. అధికారుల నుంచి అనుమతి తీసుకుని ప్రార్థనలు జరుపుకోవాలని తాము కోరామని, ఈ సందర్భంగా శాంతిభద్రతల సమస్య ఎక్కడా తలెత్తలేదని చెప్పారు. కాగా, గుర్గావ్ సెక్టార్ 53లోని రెండు గ్రామాల్లో 700 మంది మస్లింలు ఇటీవల బహిరంగ ప్రదేశంలో నమాజ్ చేయడాన్ని స్ధానికులు నిలిపివేసిన నేపథ్యంలో తాజా ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. ప్రభుత్వ స్థలంలో ముస్లింలు ప్రతి శుక్రవారం ప్రార్థనలు చేసుకుంటున్నారని గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నమాజ్‌లను భగ్నం చేశారంటూ తమకు ఎక్కడా ఫిర్యాదు అందలేదని గుర్గావ్ పోలీసు అధికారులు తెలిపారు. శాంతిభద్రతలను పర్యవేక్షించడం తమ బాధ్యతని, ప్రార్థనలు ఎక్కడ నిర్వహించాలనేది జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయిస్తుందని వారు పేర్కొన్నారు. -
పాప ప్రక్షాళనకు మేరాజ్ నమాజ్
ముస్లిమ్ సముదాయానికి ‘నమాజ్’ (దైవప్రార్థన) ప్రాణం లాంటిది. నమాజులేని జీవితం అవిశ్వాసానికి చిహ్నం. అల్లాహ్ పిలుపు మేరకు ముహమ్మద్ ప్రవక్త(స)సప్తాకాశాల పర్యటన జరిపారు. అల్లాహ్‌తో నేరుగా సంభాషించారు. ఈసంఘటననే ‘మేరాజ్ ’ అంటారు. అల్లాహ్‌తో నేరుగా సంభాషించే అపూర్వ అవకాశం, మహా అదృష్టం ముహమ్మద్ ప్రవక్తకు మాత్రమే దక్కింది. ఆ శుభదినమే ‘షబే మేరాజ్’. ఈ శుభసందర్భంలో అల్లాహ్ తన ప్రియ ప్రవక్తకు కొన్ని కానుకలు అనుగ్రహించాడు. వాటిలో ప్రధానమైనది నమాజ్. ప్రవక్త వారి ‘మేరాజ్’ పర్యటనలో అల్లాహ్ ఆయనకు 50 పూటల నమాజ్‌తో పాటు, ‘బఖర’ సూరాలోని చివరి రెండు ఆయతులు, పాపక్షమాపణకు సంబంధించిన శుభవార్తనూ అందజేశాడు. మహదానందంగా బహుమతులతో తిరిగొస్తున్నప్రవక్త(స) వారికి మూసా ప్రవక్త (అ) ఎదురై, ‘మీ అనుచరులు రోజుకు యాభైపూటల నమాజు నెరవేర్చలేరు. వెళ్ళి ఆ సంఖ్యను తగ్గించుకు రండి’ అని సలహా ఇచ్చారు. దీంతో ప్రవక్త మహనీయులు పలుమార్లు అల్లాహ్ వద్దకు వెళ్ళి ఐదుకు తగ్గించుకు వచ్చారు. అయినా మూసా(అ) ‘మీ అనుచరులు ఐదు పూటలుకూడా చెయ్యలేరు. ఇంకా తగ్గించుకు రండి’ అనిసూచించారు. కాని ప్రవక్తమహనీయులు, ‘మాటిమాటికీ దైవం దగ్గరికి వెళ్ళి అడగడానికి సిగ్గుగా ఉంది. ఇక నావల్ల కాదన్నారు. ఈ ఐదు నమాజులు నాకు సమ్మతమే. సంతోషమే’ అని స్పష్టంచేశారు. ఎవరైతే హృదయ పూర్వకంగా, చిత్తశుధ్ధితో రోజూ ఐదుపూటల నమాజ్ ఆచరిస్తారో వారికి 50 పూటల నమాజు ఆచరించినంత పుణ్యఫలం ప్రసాదించ బడుతుంది. కనుక నమాజు ప్రాముఖ్యతను గుర్తెరిగి, ఆయన స్మరణలో హృదయాలను, ఆత్మను జ్యోతిర్మయం చేసుకోడానికి ప్రయత్నించాలి. ఎవరైతే క్రమం తప్పకుండా నమాజు చేస్తారో ప్రళయదినాన వారికది ఒకజ్యోతిగా, నిదర్శనంగా ఉపకరిస్తుంది. తద్వారా ప్రళయం నాటి గాఢాంధకారంలో వారికి వెలుగు లభిస్తుంది. వారివిశ్వాసానికి, దైవం పట్ల వారి విధేయతకు అది తార్కాణంగా నిలుస్తుంది. ముక్తిని ప్రసాదించే సాధనమవుతుంది.ముహమ్మద్ ప్రవక్త (స) నమాజు ప్రాముఖ్యతను వివరిస్తూ ఒక ఉపమానం చెప్పారు.‘మీ ఇంటిగుమ్మం ముందు ఒక కాలువ ప్రవహిస్తూ ఉండి, మీరందులో రోజూ ఐదుసార్లు స్నానం చేసినట్లయితే, ఒంటిపై ఏమైనా మురికిగాని, మాలిన్యం గాని ఉంటుందా? ఉండదు. ఐదుపూటల నమాజు విషయం కూడా ఇంతే. దైవం ఈప్రార్థనల ద్వారా పాపాలను కడిగి ప్రక్షాళన చేస్తాడు.’నమాజు(ప్రార్థన)ప్రాముఖ్యం, దాని వాస్తవికత తెలిసిన దైవ విశ్వాసులు ప్రార్థనలో నిమగ్నమైనప్పుడు, వారి ఆత్మ దేవుని మహిమాన్విత సౌందర్య సాగరంలో మునిగి తేలుతుంది. అల్లాహ్ మహోజ్వలమైన సౌందర్యకాంతుల అలలు దైవవిశ్వాసుల మురికిని ప్రక్షాళన చేసి, పరిశుభ్రపరుస్తాయి. రోజూ ఐదుసార్లు ఇలాంటి చర్య జరిగితే ఇక ఆదాసుల బాహ్యంలోగాని, ఆంతర్యంలో గాని మలినమనేది మచ్చుకైనా ఉండదు.కాబట్టి ‘మేరాజ్’ కానుకగా అల్లాహ్ అనుగ్రహించిన ఈ వరాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని ఆయన ప్రసన్నత పొందడానికి శక్తివంచన లేని ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ అందరికీ సద్బుద్ధిని ప్రసాదించాలని మనసారా కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్