సమయపాలన... సమష్టితత్వం...
రమజాన్ కాంతులు
రోజా పాటించే వారు ఉదయం వేళ నిద్ర లేచి సహర్ భుజించాలి. రోజువారీ పనులు చేసుకుంటూనే ఐదుపూటలా నమాజ్ అచరించాలి. సాయంత్రం వేళ ఇఫ్తార్‌తో ఉపవాస దీక్ష విరమించాలి. భోజనంతరం రాత్రి బాగా పొద్దుపోయే వరకు తరావీ నమాజ్‌లో పాల్గొనాలి. దీనివల్ల సహనం, సమయపాలన, క్రమశిక్షణ అలవడతాయి. రోజా అచరించే వ్యక్తి ఉదయం తాను సహర్ చేయడంతో పాటు పదిమందికీ చేయిస్తాడు. అందరితోనూ కలుపుగోలుగా వ్యవహరిస్తాడు.
ఒకపెద్ద సమూహంతో ధనికుడు, పేద అనే తారతమ్యాలు లేకుండా నమాజ్ చదువుతాడు. సాయంత్రం దీక్షకులందరితో కలిసి ఉపవాసం విరమిస్తాడు. ఈ సందర్భంగా ఒకరికొకరు విందులు ఇచ్చిపుచ్చుకుంటారు. పేదలకు అన్నదానం చేస్తారు. దీన్నివల్ల సమాజంలో సమష్టితత్వం అలవడుతుంది.
– మహమ్మద్ మంజూర్