Discipline
-
యోగా ఇలా చేస్తే...ఎన్నో ప్రయోజనాలు
ఏ రకమైన వ్యాయామం చేసినా పాటించాల్సిన ముఖ్య లక్షణం స్వీయ క్రమ శిక్షణ. వ్యక్తి, శారీరక, మానసిక శ్రేయస్సును మెరుగు పరచడంలో దాని సొంత ప్రాముఖ్యత, ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా యోగా వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీంతో పాటు యోగా లక్ష్యాలలో స్వీయ క్రమశిక్షణ పాటిస్తూ, అవగాహనను పెంచుకుంటే సానుకూల ఫలితాలు లభిస్తాయి. ప్రయోజనాలువ్యక్తిగత సంబంధాలలో సానుకూలత, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, కొత్త అభిరుచిని అలవరచు కోవడం, కోపాన్ని, భావోద్వేగాలను నియంత్రించడం, లక్ష్యంపై దృష్టి పెట్టడం, ఫలితాలను సాధించడానికి సహాయపడుతుంది. మొదట యోగా సాధన చేయాలనుకుంటున్న కారణం, నిర్దేశించుకున్న వ్యవధి, శారీరక, మానసిక ఆరోగ్యంలో చూడాలనుకుంటున్న సానుకూల మార్పులను అర్థం చేసుకోవాలి. ఎలా చేయాలంటే... క్రమం తప్పకుండా యోగసాధన చేయడం వల్ల మానసిక క్రమశిక్షణ కలగడం తోపాటు దినచర్యలో భాగం అవుతుంది. జీవనశైలిలో సానుకూల మార్పు గమనించవచ్చు. స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి...నిద్రించడానికి కనీసం 2–3 గంటల ముందు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి ∙క్రమం తప్పకుండా 7–8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను రాత్రిపూట ఎక్కువ సేపు ఉపయోగించకుండా చూసుకోవాలి నిర్ణీత సమయం, ప్రదేశంలో యోగసాధన చేయాలి యోగాభ్యాసాన్ని నిలిపివేయకుండా ఉండటానికి, ఒక గ్రూప్‌తో లేదా స్నేహితులతో కలిసి సాధన చేయాలి. జట్టుగా కలిసి చేసే యోగా వల్ల మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.చదవండి: ఒక్క సోలార్ బోట్ కోసం అధిక జీతమిచ్చే ఉద్యోగం, అన్నీ వదిలేశారు!Sleep Divorce నయా ట్రెండ్: కలిసి పడుకోవాలా? వద్దా?! -
తప్పుల మీద తప్పులు... అప్పుల మీద అప్పులు
సంపాదించని వ్యక్తిని సమాజమే కాదు... ఇంట్లో వాళ్ళు కూడా లోకువగా చూస్తారన్నది ఒక నానుడి. సంపాదిస్తేనే సరిపోదు... అది సద్వినియోగం అయితేనే సార్ధకత. గత ఆర్టికల్ లో ఆర్ధిక క్రమశిక్షణ (Financial discipline) పాటించే వ్యక్తి జీవితం పూలపానుపు గా ఎలా మారుతుందో విశ్లేషించుకున్నాం..గాడి తప్పితే ఏమవుతుందో ఇప్పుడు సోదాహరణంగా చూద్దాం.శివకుమార్ చిన్నప్పటినుంచి ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చిన వ్యక్తి. చదువు పూర్తి కాగానే బతుకు తెరువు వెతుక్కుంటూ హైదరాబాద్ లో అడుగు పెట్టాడు. చిన్న ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు. తన ఖర్చులు పోగా కొంత మొత్తం ఇంటికి కూడా పంపేవాడు. కొన్నాళ్ళకు కొత్త జాబ్ ఆఫర్ వచ్చింది. గతంలో 20000 వచ్చే జీతం ఇప్పుడు 50000 అయింది. ఇంతకుముందు ఆర్టికల్ లో చెప్పుకున్న రాహుల్ మాదిరిగానే కుమార్ కు కూడా పాతికేళ్ల వయసులోనే 50000 ఉద్యోగం దొరికింది.అంతలోనే పెళ్లి కుదిరి ఓ ఇంటివాడయ్యాడు కూడా. భార్య రాకతో సింగిల్ రూమ్ ఖాళీ చేసి.. సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. అప్పటిదాకా కడుతున్న 3000 రెంట్ కాస్తా 8000 కు పెరిగింది. తప్పదుగా.. కొత్త కాపురం కావడంతో తను దాచుకున్న డబ్బులు ఖర్చు పెట్టి ఇంటికి అవసరమైన ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, బీరువా, ఓ పెద్ద టీవీ కొన్నాడు. పెళ్ళికి ముందే లక్షన్నర పెట్టి కొన్న బైక్ కి ఈఎంఐ (EMI) కడుతున్నాడు. అతనికున్న భారం ఏదైనా ఉందంటే ఇదొక్కటే. మరోపక్క అతనికున్న పెద్ద భరోసా క్రెడిట్ కార్డులు (Credit card) ... జీతం పెరిగాక పడి ఉంటాయిలే అని ఓ నాలుగైదు బ్యాంకుల క్రెడిట్ కార్డులు తీసుకున్నాడు. వాటి లిమిట్ కూడా దాదాపు 3 లక్షల దాకా ఉంది. క్రెడిట్ కార్డు మీద 30000 ఖర్చు పెట్టి ఓ మొబైల్ కొనుక్కున్నాడు. పెళ్లి అయ్యి ఏడాది కావడంతో వివాహ వార్షికోత్సవానికి భార్యకు లక్ష రూపాయలు పెట్టి ఓ నెక్లెస్ కొన్నాడు. రోజులు గడుస్తున్నాయి. ఇద్దరు పిల్లలు పుట్టుకు రావడమే కాదు, వాళ్ళను స్కూల్లో చేర్పించాల్సిన టైం కూడా వచ్చింది. ఫీజులు కాస్త ఎక్కువైనా వెనకాడక కొంచెం 'ఖరీదైన' స్కూల్లోనే చేర్పించాడు.మరోపక్క జీతం 80000 కు పెరగడం, బైక్ బాకీ తీరిపోవడంతో పెద్దగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులేవీ రాలేదు. ఒకవేళ వచ్చినా క్రెడిట్ కార్డులు వాడుతూ.. నెలనెలా కనీస మొత్తం కడుతూ వస్తున్నాడు. ఈనేపథ్యంలోనే సొంత ఇల్లు ప్లాన్ చేసి.. దాదాపు 70 లక్షలు పెట్టి ఓ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొన్నాడు. నెలకు 40000 రూపాయలు ఈఎంఐ పడుతోంది. ఇది పోను జీతంలో ఇంకో 40000 మిగులుతున్నా... ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులు, క్రెడిట్ కార్డు వాయిదాలు, ఊళ్ళో తల్లిదండ్రులకు పంపాల్సి ఉండటం.. ఇలా మొత్తం మీద వచ్చిన జీతం బొటాబొటీగా సరిపోతోంది. అయినా క్రెడిట్ కార్డులు ఉన్నాయన్న ధైర్యం అతన్ని పెద్దగా ఆందోళన పరచలేదు. ఇంతలో ఊహించని సంఘటన...ఓరోజు ఆఫీస్ నుంచి వస్తూండగా.. దారిలో ఆక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయ్యింది. హాస్పిటల్ లో వారం రోజులు ఉండి ఇంటికొచ్చాడు. హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ తీసుకోకపోవడంతో హాస్పిటల్ బిల్లు రెండున్నర లక్షలు అప్పోసొప్పో చేసి కట్టక తప్పలేదు. మరోపక్క నాలుగు నెలల పాటు బెడ్ రెస్ట్. ఎర్న్డ్ లీవ్ లు ఓ రెండు నెలల పాటు ఆదుకున్నా... మిగతా రెండు నెలలపాటు లాస్ అఫ్ పే తప్పలేదు. చేతికి రూపాయి వచ్చే మార్గం లేదు. క్రెడిట్ కార్డుల్లో బాలన్స్ కూడా వాడేశాడు.4 నెలల తర్వాత జాబ్ లో తిరిగి జాయిన్ అయ్యాడు. ఐదో నెల నుంచి శాలరీ రావడం మొదలయింది. కానీ జీవితం ఇదివరకటిలా లేదు. వచ్చే శాలరీ కి మించి కమిట్మెంట్స్ ఉండనే ఉన్నాయి. ఇప్పుడు అదనంగా క్రెడిట్ కార్డు బాకీల రూపంలో (మూడు లక్షలూ వాడేయడం వల్ల) నెలకు 15000 భారం (కనీస మొత్తమే కడుతున్నాడు అనుకుంటే) పడింది. మరోపక్క గోటి చుట్టు మీద రోకటి పోటులా ఇద్దరు పిల్లలకూ తలో 50000 చొప్పున ట్యూషన్ ఫీజు కట్టాల్సి వచ్చింది గతంలో చేసిన అప్పుకు ఇది మరింత ఆజ్యం పోసింది. అప్పులు.. వడ్డీలు.. ఖర్చులు.. రానురాను భారం పెరిగిపోతూ వచ్చింది.తట్టుకునే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించడం లేదు. బ్యాంకుల్లో పర్సనల్ లోన్ కోసం ప్రయత్నించాడు. అప్పటికే ఇంటి లోన్, క్రెడిట్ కార్డు బకాయిలు ఎక్కువగా ఉండటం వల్ల లోన్ రాలేదు. అయితే తన ఇంటి మీద టాప్ అప్ లోన్ వచ్చే అవకాశం ఉండటం తో దాన్ని ఆశ్రయించాడు. ఓ రెండు లక్షలు వచ్చాయి. దాంతో చిన్న చిన్న అప్పులు తీర్చేశాడు. అయినా భారం తగ్గకపోగా... కొత్త లోన్ తో ఈఎంఐ మరింత పెరిగింది. కష్టాలు కూడబలుక్కుని వస్తాయి అన్నట్లు తండ్రి ఆరోగ్యం దెబ్బతిని హాస్పిటల్ లో జాయిన్ చేయడంతో మరో 2 లక్షల దాకా ఖర్చయ్యాయి. ఇది కూడా అప్పే.ఇక పిల్లలు క్లాస్ మారడంతో పెరిగిన ఫీజు తట్టుకోలేక.. అలాగని వాళ్ళని ఆ స్కూల్ మాన్పించలేక (ప్రెస్టేజ్ ఇష్యూ) అప్పుల మీద అప్పులు చేస్తూ పోయాడు. బాకీలు తీర్చే పరిస్థితి లేకపోవడంతో మెల్లగా క్రెడిట్ కార్డులు డిఫాల్ట్ అవ్వడం మొదలైంది. ఇది అక్కడితో ఆగలేదు. ఇంటి లోన్ కూడా బకాయి పడే దుస్థితి ఎదురైంది. మొదట భార్య నెక్లెస్ కుదువ పెట్టాడు. తర్వాత బండి అమ్మేశాడు. ఆనక ఇల్లు అమ్ముకునే పరిస్థితి దాపురించింది.ఎన్నో కష్టాలుపడి జీవితంలో ఎదిగిన శివ కుమార్ చేసిన తప్పల్లా... ఆర్ధిక క్రమశిక్షణ పాటించకపోవడమే. దీనికి దారి తీసిన కారణాల గురించి విశ్లేషించుకుంటే...* ముందుచూపుతో వ్యవహరించకపోవడం * సరైన ఆర్ధిక ప్రణాళిక లేకపోవడం * తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోవడం* పెట్టుబడులపై దృష్టి పెట్టకపోవడం* ఆరోగ్య, జీవిత బీమా ల గురించి ఆలోచించకపోవడం * జీవితంలో పూర్తిగా స్థిరపడక మునుపే వివాహ బంధంలోకి అడుగుపెట్టడం * పిల్లల చదువుల విషయంలో స్థాయికి మించి పరుగులు తీయడం * చేతిలో కాసిని డబ్బులు కనబడగానే తనకు లోటు లేదనుకునే భ్రమలో బతికేయడం * ఎక్కువగా క్రెడిట్ కార్డు ల మీద ఆధారపడటం* క్రెడిట్ కార్డుల విషయంలో కనీస మొత్తాలు మాత్రమే చెల్లిస్తూ రావడం వల్ల బాకీ ఎప్పటికీ తీరకపోవడం* అప్పుల మీద అప్పులు చేస్తూ అధిక వడ్డీలు చెల్లించాల్సి రావడం... లోన్ ల కోసం ఎగబడటం * భవిష్యత్‌లో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకునే విధంగా పొదుపుపై దృష్టి పెట్టకపోవడం * స్థాయికి మించి ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడం...కష్టాలన్నవి చెప్పి చెప్పి రావు. అవి ఎప్పుడొచ్చినా తట్టుకునే విధంగా జీవితంలో ఆర్ధిక క్రమశిక్షణ అలవరచుకుంటేనే ఎలాంటి ఒడుదొడుకులనైనా తట్టుకునే సామర్ధ్యం కలుగుతుంది. మొదట్లో కాస్త కష్టపడ్డా... పక్కా ప్లానింగ్ తో ముందుకు సాగితే రాహుల్ మాదిరిగా చీకూ చింతా లేని జీవితం గడపగలుగుతాడు. లేదంటే శివకుమార్ లా అప్పుల ఊబిలో చిక్కుకుపోయి విలవిలలాడుతాడు.రాహుల్ లాంటి సుఖమయ జీవితం కావాలా.. శివకుమార్ లాంటి కష్టాల ప్రవాహం కావాలా... అన్నది మన చేతుల్లోనే ఉంది.-బెహరా శ్రీనివాస రావుపర్సనల్ ఫైనాన్స్ విశ్లేషకులు -
కలసి ఉంటేనే కలదు విజయం
ఈ భూమి మీద విజయం సాధించిన వారంతా కేవలం తామొక్కరుగానే ఆ విజయాన్ని సాధించలేదు. వారందరికీ ఏదో సమయంలో అనేక మంది సహకరించడం వల్లనే ఆ విజయం సం్రపాప్తించిందన్నది జగమెరిగిన సత్యం. ఏ మనిషైనా ఎన్ని ప్రతిభా సామర్ధ్యాలున్నప్పటికీ, ఎంతటి పండితులైనప్పటికీ, అపారమైన మేధో సంపత్తి ఉన్నప్పటికీ, ఆయా సామర్థ్యాలను సాధించడానికి వారు చేసిన కృషి ఒక ఎత్తయితే, ఆ కృషి చేయడానికి సహకరించిన చేతులు అనేకం అని చెప్పక తప్పదు.ఉన్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తి గురించి మాట్లాడినపుడు వారు పడిన శ్రమను, కష్టం గురించి మాట్లాడడం జరుగుతుంది తప్ప, వారికి అంతర్లీనంగా సహకరించిన పెద్దలను, మహనీయులను, గురువులను, స్నేహితులను, మిత్రులను గాలికి వదిలేస్తాం. నిజానికి వారందరి సహకారం లేనిదే ఆ వ్యక్తి అంతటి ఉన్నత శిఖరాలకు చేరుకుని ఉండేవారు కాదన్నది వాస్తవం. ఒకవేళ ఆ వ్యక్తి తనకు తానుగా గొప్పవాడిగా భావించుకుని అందరినీ దూరంగా జరిపితే ఆయా విజయాల దరిదాపుల్లోకి వెళ్ళేవాడు కాదన్నది అక్షరాల నిజం. అందుకే కలిసుంటే కలదు సుఖమే కాదు... అది జీవిత సత్యంగా కూడా ఆకళింపు చేసుకోవాలి. మన పురాణాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ ఏ ఒక్క యుగ పురుషుడు కూడా ఐకమత్యం సాధించకుండా విజయ బావుటా ఎగురవేయలేదన్న విషయంలో ఎంత వాస్తవం ఉందో, ఐకమత్యం లేకపోతే ఆ విజయాలు సాధ్యం కావన్న విషయంలోనూ అంతే నిజం ఉంది.అందువల్ల ఏదైనా ముఖ్యమైన విజయాన్ని సాధించడానికి, అత్యంత అవసరమైన అంశం ఐకమత్యం. మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఐకమత్యం అండగా నిలుస్తుంది. కనుక మన భవిష్యత్ స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి అన్ని శక్తులు, సామర్థ్యాలు, వనరులు వాడుకోవాలి. ఇవన్నీ ఏ ఒక్కరిలోనో ఉండవు. సహాయం, సహకారం అవసరమున్నప్పుడు అర్ధించడం బలహీనతకు సూచన కాదు. అది వివేకవంతుల లక్షణం కూడా.దుష్టశిక్షణ శిష్ట రక్షణ చేయడానికి సాక్షాత్తు ఆ జగన్మాతే ఐకమత్యంతో అసురులపై విజయం సాధించింది. చండ, ముండాసురులను, మహిషాసురుని సంహరించి జగజ్జేతగా నిలిచింది. ఆ జగన్మాతకు విజయం దక్కడానికి ముక్కోటి దేవతలు ఒక్కటయ్యారు. తమకు కంటకంగా మారిన అసురులను సంహరించడానికి ఆ తల్లికి సహకరించారు. సృష్టి స్థితి, లయాలకు కారకులైన బ్రహ్మ విష్ణు పరమేశ్వరులతో పాటు, ముక్కోటి దేవతలు ఆ తల్లికి తమకున్న శక్తులన్నింటినీ ధారపోశారు. తమకున్న అపార యంత్ర, తంత్ర, అద్వితీయ శక్తులను జగన్మాతకు ఇచ్చి, ఆ తల్లిని శక్తి స్వరూపిణిగా నిలబెట్టారు. చివరకు అసుర సంహారం చేశారు. అందువల్ల మన నిజమైన సామర్థ్యాలు మన ఒక్కరిలో ఉన్నవే కాదు. మన తోటి వాళ్ళందరితో కలిసి ఉంటేనే అవి సర్వశక్తిమంతులుగా మార్చుతాయి. ఇది ఐకమత్యంతోనే సాధ్యమవుతుందన్న వాస్తవాన్ని గుర్తెరిగి మసలుకుని విజయులమవుదాం.ఐకమత్యమే మహాబలం, మహాభాగ్యం అన్నారు పెద్దలు. అవును నిజమే.. మన పెద్దలు చెప్పినట్టు ఐకమత్యంగా ఉంటే ఎన్నో పనులు చెయ్యచ్చు.. శత్రువులను సైతం తరిమి తరిమి కొట్టచ్చు. ఎలాంటి దుస్సాధ్యమైన పనైనా సునాయాసంగా చేయచ్చు. ఐకమత్యం బలాన్ని, ప్రేమను, అనురాగాలను పెంచుతుంది. ఇది నమ్మకాన్ని ఏర్పరుస్తుంది. ఏకత్వాన్ని సూచిస్తుంది, ఆనందాన్నిస్తుంది. కష్టాలలో పాలు పంచుకునే అవకాశాన్నిస్తుంది. శక్తిని, విశ్వాసాన్ని పెంచుతుంది. ఏకత్వాన్ని కలిగిస్తుంది. వ్యక్తుల మధ్య అంతరాలను తగ్గిస్తుంది. జీవితంలోని సంతోషకరమైన క్షణాలను ఆస్వాదించడానికి ఇది మనకు ఎంతగానో దోహదం చేస్తుంది. – దాసరి దుర్గా ప్రసాద్ -
‘వారిపై చర్యలు తీసుకోండి’.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. లోక్‌సభలో ప్రతిపక్షనేత, ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాహుల్‌పై అభ్యంతరకరమైన, హింసాత్మక ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరారు.బీజేపీ, తమ అనుబంధ పార్టీల నేతలు ఉపయోగించే అసభ్యకరమైన భాష భవిష్యత్తు తరాలకు ప్రమాదకరమని ఖర్గే తెలిపారు. ఇది ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి సంబంధించిన సమస్యగా పేర్కొన్నారు. ‘బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక మంత్రి, రాహుల్‌ను ‘నంబర్ వన్ టెర్రరిస్ట్’గా పలిచారు. మహారాష్ట్రలోని మీ ప్రభుత్వంలోని ఓకూటమి పార్టీకి చెందిన ఎమ్మెల్యే(శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్) రాహుల్ నాలుక కోస్తే వారికి రూ.11 రివార్డును ప్రకటిస్తున్నారు. ఢిల్లీలోని ఓ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాహుల్‌పై దాడి చేస్తామని బహరంగంగా బెదిరిస్తున్నారు.చదవండి:అతిషీ మర్లీనా ‘డమ్మీ సీఎం’: స్వాతి మాలీవాల్భారత సంస్కృతి అహింస, సామరస్యం, ప్రేమకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మన లీడర్లు రాజకీయాల్లో ఈ పాయింట్లను ప్రమాణాలుగా స్థాపించారు. బ్రిటీష్ పాలనలోనే గాంధీజీ ఈ ప్రమాణాలను రాజకీయాల్లో ముఖ్యమైన భాగంగా చేశారు. స్వాతంత్య్రానంతరం పార్లమెంటరీ రంగంలో అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య గౌరవప్రదమైన ఒప్పందాలు కుదిరిన చరిత్ర ఉంది. ఇది భారత ప్రజాస్వామ్య ప్రతిష్టను పెంచడానికి పనిచేసింది.ఈ విషయంపై కోట్లాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి విద్వేషపూరిత శక్తుల వల్ల జాతిపిత మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు తమ ప్రాణాలను త్యాగం చేయాల్సి వచ్చింది. అధికార పార్టీ ఈ రాజకీయ ప్రవర్తన ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత దారుణమైన ఉదాహరణ. మీ నేతలు వెంటనే హింసాత్మక ప్రకటనలు చేయడం మానేయాలి. ఇందుకు మీరు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు -
స్వీయ క్రమశిక్షణ..
మనం అభివృద్ధి చేయగల అత్యంత ముఖ్యమైన జీవన నైపుణ్యాలలో స్వీయ–క్రమశిక్షణ ఒకటి. ఏదైనా ఒక పనిని మనం చేస్తున్నపుడు ఆ మార్గంలో ఎలాంటి ప్రలోభాలు, ఆకర్షణలు ఎదురైనా వాటికి ఏ మాత్రం ప్రభావితం కాకుండా మనస్సుని నియంత్రించుకుని.. చేస్తూన్న పనిపైనే సంపూర్ణమైన దృష్టిని కేంద్రీకరించడమే‘ స్వీయ క్రమశిక్షణ‘. స్వీయ–క్రమశిక్షణ ఆత్మవిశ్వాసాన్ని పెం΄÷ందిస్తుంది. నమ్మకమైన వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది. ఇది సమయపాలన కూడా నేర్పుతుంది. అలాగే, తనను తాను మలచుకోవడానికి, అభివృద్ధి సాధించడానికి ఇంధనంగా పనిచేస్తుంది. ఇది ఏకాగ్రతను పెంచుతుంది. పరధ్యానాన్ని నివారించడానికి సహాయపడుతుంది. అలాగే, ఒత్తిడిని దూరం చేస్తూ, కష్టతరమైన పరిస్థితుల్లో ప్రశాంతంగా... ధైర్యంగా ఎలా ఉండవచ్చో అవగతం చేస్తుంది.వివిధ కార్యకలాపాలకు ఎలాంటి ప్రణాళికలు అవలంబించాలో, ఎలా నిర్వహించాలో నేర్పుతుంది. స్వీయ–క్రమశిక్షణ కలిగిన వారు తమ లక్ష్యాలపై దృష్టిసారిస్తే, పరీక్షలలో బాగా రాణించడానికి, వారి అభ్యాస లక్ష్యాలను సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అధ్యయనాలు వెల్లడించాయి. ఇతర జీవిత నైపుణ్యాల మాదిరిగానే, స్వీయ–క్రమశిక్షణలో ్రపావీణ్యం సంపాదించడానికి చాలా సంవత్సరాల అభ్యాసం అవసరం. అయితే ఇది బాహ్యంగా ఎవరో మనల్ని అదుపు చేస్తుంటే అలవరచుకునేదిలా కాకుండా మనకు మనమే పరి చేసుకునేలా ఉండాలి. గాంధీజీ, అబ్దుల్ కలామ్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, థామస్ ఆల్వా ఎడిసన్, అబ్రహాం లింకన్, హెన్రీఫోర్డ్, ఆండ్రో కార్నెగీ, వాల్ట్ డిస్నీ, బరాక్ ఒబామా వంటి మహనీయులంతా తమ తమ జీవితాలలో పాటించిన ‘ స్వీయ క్రమశిక్షణ వల్లే ఉన్నత శిఖరాలకు చేరుకుని, జననీరాజనాలందుకున్నారు.కనుక స్వీయ క్రమశిక్షణను సరైన వయస్సులో నేర్పించి అలవాటు చేసినట్లయితే అది జీవితాంతం మన వ్యక్తిగత అభివృద్ధికి, విజయ సాధనకు సహాయపడుతుంది. స్వీయ క్రమశిక్షణను అలవరచుకోవడానికి ఎప్పటికప్పుడు మనల్ని ప్రేరేపించుకుని సాధన చేస్తే స్వీయ క్రమశిక్షణ మన సొంతమై, అనేక విజయాలను సంపాదించి పెడుతుంది. ఇది మన భవిష్యత్ గమ్యాన్ని దిశానిర్దేశం చేయడంతో పాటు, మన జీవితానికి ఓ అర్ధాన్ని, పరమార్థాన్ని అందించి పెడుతుంది. కనుక ఏ మనిషైతే స్వీయ క్రమశిక్షణను అలవరచుకుంటాడో, అలాంటి వారు జీవితంలో అత్యంత సులువుగా ఉన్నత శిఖరాలను చేరుకుంటారనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి అనిపించుకోదు."స్వీయ క్రమశిక్షణ అనేది ఓ గొప్ప వ్యక్తిత్వపు లక్షణం. ఇది నిరంతరం చేయాల్సిన తపస్సు లాంటిది. ఒకానొక విద్యార్థి తన జీవితంలో పాటించే స్వీయ క్రమశిక్షణ ఆ విద్యార్థి పూర్తి జీవితానికి బంగారు బాట అవుతుంది." – దాసరి దుర్గా ప్రసాద్ -
మెట్రో ఇలా ఎక్కితే ఎంతో హాయి..!
మన దేశంలోని పలు నగరాల్లో మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. మెట్రో రైలు ప్రయాణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వీటిలో ఒకరిని ఒకరు తోసుకుంటూ మెట్రోలోనికి ఎక్కడం లాంటి వీడియోలను మనం చూసే ఉంటాం. అయితే ఇలాంటి తీరుకు భిన్నమైన వీడియోను చూసిన చాలామంది తెగ ఆశ్యర్యపోతున్నారు. ఎంతో క్రమశిక్షణతో మెట్రో ఎక్కుతున్నవారిని చూసి ముచ్చట పడిపోతున్నారు.ఈ వీడియో చైనాలోని మెట్రోకు సంబంధించినది. వీడియోలో మెట్రో స్టేషన్లో రద్దీ అధికంగా ఉండటాన్ని మనం గమనించవచ్చు. అయితే అక్కడున్నవారంతా వరుసలో నిలుచుని, తమ వంతు వచ్చిన తరువాతనే మెట్రో లోనికి ఎక్కుతున్నారు. ఏమాత్రం తొందరపాటు లేకుండా క్రమశిక్షణ పాటిస్తూ రైలు ఎక్కుతున్నారు. రైలు ప్రయాణికుల క్రమశిక్షణను చూసినవారంతా మెట్రోలోకి ఇలా ఎక్కితో ఎంతో హాయిగా ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్‌లో @RVCJ_MEDIA పేరుతో షేర్ చేశారు. ఈ వీడియోకు లక్షకు మించిన వ్యూస్ దక్కాయి. వేయిమందికిపైగా యూజర్స్ దీనిని లైక్ చేశారు. Scenes From China 😯pic.twitter.com/hetaLNXA9U— RVCJ Media (@RVCJ_FB) May 9, 2024 -
భక్తి అంటే..?
భక్తి అంటే ఏమిటి? వేదాంత గ్రంథాలిచ్చే నిర్వచనాల జోలికి వెళ్లవద్దు మనం. మామూలు మాటల్లో అర్థం కావటానికి భక్తి అంటే ఏమిటి? చాలామంది అభిప్రాయంలో ఫోటో పెట్టి, దండలు వేసి, పూలు, అగరొత్తులు, దీపాలు పెట్టి నివేదన చెయ్యటం, దణ్ణం పెట్టటం అనుకుంటారు. అది భక్తా? ఒకరకంగా తను మారకుండా ఉండటాన్ని సమర్థించుకునే ప్రయత్నం. ‘‘ఆయన మహానుభావుడు కనుక అట్లా చేయగలిగాడు. మనవంటి సామాన్యులకి సాధ్యమా?’’ అని తప్పించుకునే మార్గం. అట్లా పూజ చెయ్యటం తప్పు అని కాని, చెయ్య కూడదని కాని చెప్పటం లేదు. అది ఒకరకం. దానివల్ల ఒరిగేది ప్రత్యేకంగా ఏమీ లేదు. అది ఒక క్రమశిక్షణ. చిత్త శుద్ధిని కలిగిస్తుంది. ఇది మొదటిమెట్టు అని చెప్పవచ్చు. కానీ చాలా మంది ఇదే పరమార్థం అనుకుంటారు. కొంతమంది అనుకరించటమే భక్తి అనే భ్రమలో ఉంటారు. అనుకరించటానికి, అనుసరించటానికి చాలా వ్యత్యాసం ఉంది. వారిలాగా ఉండే ప్రయత్నం అనుకరణ. ఇది భౌతికంగా తమ ఆదర్శమూర్తుల లాగా ఉండేట్టు చేస్తుంది. చూడగానే ఫలానా వారి అభిమానులని తెలియ చేస్తుంది. కాని వారిస్థాయికి చేర్చదు. అయితే అనుకరణ పనికి రానిదని చెప్పటానికి వీలు లేదు. అది రెండవ మెట్టు. ఒకరిపట్ల భక్తి ఉన్నది అంటే వారు చెప్పిన దానిని చెప్పినట్టు అనుసరించటమే. భక్తిలో ప్రశ్నలకు, సందేహాలకు, వాదోపవాదాలకు తావుండదు. నోటితోనే చెప్పనక్కరలేదు. వారి ప్రవర్తనను చూసి అనుసరించవలసి ఉంటుంది. ‘‘మీ బొమ్మకి పూజ చేస్తాం, కాని, మీరు చెప్పినట్టు చెయ్యటం మావల్ల కాదు, మీరు ఉన్నట్టు ఉండటం అసాధ్యం’’ అంటే అది భక్తి అనిపించుకోదు. భగవంతుడివిషయంలోనైనా అంతే! దేవుణ్ణి గదికే పరిమితం చేసి, పూజచేసిన కొద్దిసేపు మాత్రం ఆయన్ని తలచుకొని, తరువాత దుర్మార్గంగా లోకకంటకంగా ప్రవర్తిస్తే అది భక్తి అనిపించుకోదు. పరమాత్మ నిర్దేశించిన విధంగా, ఆయన మెప్పు వడసే పద్ధతిలో ప్రవర్తిస్తే అది నిజమైన భక్తి. సాటిమనిషి మీద సానుభూతి, జాలి చూపించలేని వాడు, ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రేమించ లేని వాడు, తనకి హాని చేసిన శత్రువుని కాక పోయినా కనీసం ఎదుటివాడిని క్షమించలేనివాడు విశ్వాసి ఎలా అవుతాడు? పొరుగువారిని తనవలే ప్రేమించమని చెప్పిన ఏసు క్రీస్తు అంటే భక్తి ఉంటే ఆయన చెప్పిన మాటలని పాటించాలి, ఆయనలాగా ప్రవర్తించాలి. ఆయన మార్గాన్ని అనుసరించాలి. ఎక్కువసేపు వాళ్ళతో ఉండటం వల్లనో, పోలికలు రావటం వల్లనో మనవలు, మనవరాళ్ళు తరచుగా తాతానాయనమ్మల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. తాతలకి నాయనమ్మలకి, అమ్మమ్మలకి మనవలు, మనవరాళ్ళు అంటే ఇష్టం ఉండటానికి కూడా ఇదే కారణం. మనుషుల విషయంలోనే ఇలా ఉంటే భగవంతుడి విషయంలో ఆయన చెప్పినట్టు ప్రవర్తిస్తే ఫలితం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. భగవంతుడికి, భక్తుడికి ఉండే సంబంధాన్ని భ్రమరకీట న్యాయంగా చెప్పటం ఈ కాణంగానే. తన చుట్టూ తిరుగుతున్న భ్రమరం చేసే ఝుమ్మనే నాదం విని గూటిలో సుప్తావస్థలో ఉన్న కీటకం దానిని అనుసరిస్తూ తాను కూడాఅటువంటి నాదం చేసే ప్రయత్నంలో భ్రమరం లాగా రూపాంతరం చెందుతుంది. ఈ అనుసరణ అన్నది తానే లక్ష్య వస్తువు అయ్యేట్టు చెయ్యగలదు. ఒక గురువునో, నాయకుణ్ణో అనుకరించేవారు వారి వలె తయారౌతారే కాని, వారుగా అయిపోరు. వారుగా, కనీసం వారంతటి వారుగా అయిపోవటానికి కావలసినది అనుసరణ మాత్రమే. భగవత్తత్త్వాన్ని అందుకోవాలంటే కూడా అంతే! శ్రీరాముడు పితృభక్తి కలవాడు అని చెపుతాం. అంటే అర్థం తండ్రి చెప్పిన విధంగా జీవించాడు అని. ఆయన మాట జవదాట లేదు. ఆయన తనతోచెప్పిన మాటనే కాదు ఆయన ఎవరికిచ్చిన మాటనైనా పాటించాడు. రాముడిపితృభక్తి, గురుభక్తి విశ్వామిత్రుడు తాటకను సంహరించమన్నప్పుడు మారు మాటాడక సంహరించటంలో వ్యక్తమౌతాయి. తల్లితండ్రులని వృద్ధాశ్రమాలలో ఉంచి ‘‘మేము రామభక్తులం’’ అంటే రాముడిపట్ల అపచారం చేసినట్టే. ఆయనలో ఉన్న కొన్నిగుణాలనైనా అలవరచుకుంటే రామభక్తులు అనిపించుకోగలుగుతారు. – డా. ఎన్. అనంత లక్ష్మి -
సరైన ఆచరణతోనే సంపద సృష్టి!
సంపద సృష్టికర్తల్లో ఎవరి జీవితాన్ని పరిశీలించి చూసినా.. సమయానికి ఎంతో ప్రాధాన్యత కనిపిస్తుంది. ప్రణాళిక, ఆచరణ, క్రమశిక్షణ కనిపిస్తాయి. సంపద సృష్టించాలంటే కాలం విలువ తెలిసి ఉండాలి. ఇవాళ కాకపోతే రేపు, ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది ఇలాంటి ధోరణి అస్సలు పనికిరాదు. దీనివల్ల కేలండర్లో సంవత్సరాలు మారుతుంటాయే కానీ, ఆశించిన ఫలితాలు కానరావు. కొత్త సంవత్సరం తనకు అనుకూలంగా ఉండాలని, అనుకున్నవి సాధించాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ, ఆచరణ లోపంతో దానికి దూరంగా ఉండిపోతుంటారు. అన్నీ ఒకేసారి సాధించేద్దామని అనుకుంటే, ఫలితాలు ఆలస్యం అవుతాయి. అందుకుని ప్రణాళిక మేరకు అడుగులు వేయాలి. నూతన సంవత్సరంలో ఏం సాధించాలనుకుంటారో, అవి వాస్తవికంగా ఉండాలి. అప్పుడే చక్కని ఫలితాలు కనిపిస్తాయి. ఏడాది కాలానికి కార్యాచరణ ప్రణాళిక అంటే, అందుకు తగినంత సమయం కేటాయించాలి. సంపద సృష్టించాలనే ఆకాంక్ష కలిగిన వారు కొత్త సంవత్సరంలో ఆ దిశగా అమల్లో పెట్టాల్సిన ఆచరణ ఎలా ఉండాలో నిపుణులు తెలియజేస్తున్నారు. మనీ ఒక్కటేనా..? అందరికీ ధనం కావాల్సిందే. అందులో సందేహం లేదు. కానీ, మనిషి ఎప్పుడూ డబ్బు చుట్టూ పరుగెత్తడం సరైనది అనిపించుకోదు. తండ్రి లేదా తల్లి కావచ్చు. కుమారుడు లేదా కుమార్తె కావచ్చు. జీవిత భాగస్వామి, స్నేహితులు, సహోద్యోగులు, శ్రేయోభిలాషులు.. ఇలా మన చుట్టూ పెద్ద ప్రపంచమే ఉంది. దాన్ని కూడా పట్టించుకోవాలి. సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపూ అవసరమే. మనీ లైఫ్‌తోపాటు ఇతరత్రా అన్నీ మేళవించినప్పుడే నిజమైన ఆనందం లభిస్తుంది. అస్తమానం డబ్బు గురించే ఆలోచిస్తూ, వేదన చెందుతుంటే అదొక వైరల్ వ్యాధిగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే జీవితంలో అన్నింటికీ సమతుల్యత అవసరం. దీర్ఘ ప్రయాణం సంపద సృష్టించడం అన్నది ఇన్స్టంట్ నూడుల్స్ చేసుకున్నంత ఈజీ కాదు. అదొక దీర్ఘకాలిక పరుగు. దశాబ్దాల పాటు స్థిరమైన పెట్టుబడులతో సాగిపోయేది. ప్రణాళిక మేరకు అడుగులు వేసేది. కొత్త సంవత్సరంలో సంపద సృష్టికి బీజం వేసుకోవాలే కానీ, సంపద సృష్టిని ఏడాదిలోనే సాధించేయాలంటే అది ఆచరణసాధ్యం కాదు. క్రమం తప్పకుండా ఆదాయం నుంచి పొదుపు చేస్తూ, ఆ పొదుపును ఏటా పెంచుకుంటూ, మెరుగైన రాబడినిచ్చే సాధనాల్లోకి పెట్టుబడిగా మళ్లిస్తూ సాగిపోవాల్సిన సుదీర్ఘ ప్రయాణం. కనుక షార్ట్ కట్స్, ఇన్స్టంట్స్ అంటూ ఇందులో దారులు వెతుక్కోవడం వల్ల ఫలితం ఉండదు. ఎంత వీలైతే అంత మొత్తంతో మొదట పెట్టుబడిని ఆరంభించాలి. దాన్ని కొనసాగించాలి. సంపద అంటే..? సంపద అంటే డబ్బు, బంగారం, పెట్టుబడులు, ప్రాపరీ్టలే కాదు. మంచి ఆరోగ్యం కూడా గొప్ప సంపదే అవుతుంది. సంపద కోసం ఆరోగ్యం పాడు చేసుకుంటే, ఆ తర్వాత అదే సంపదతో ఆరోగ్యం కొనుక్కుందామంటే సాధ్యపడకపోవచ్చు. ఆరోగ్యంగా ఉంటేనే సంపద సృష్టి కోసం సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించగలరు. తద్వారా మరింత సంపదను సమకూర్చుకోగలరు. అనారోగ్యకర అలవాట్లను విడిచి పెట్టాలి. ఆరోగ్యకరమైన, పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. యోగ, మెడిటేషన్, వ్యాయామాలు వంటి వాటికి రోజూ కొంత సమయం కేటాయించాలి. ఆదాయం.. వ్యయం.. ఆదాయం కంటే వ్యయానికి ఆర్థిక శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. చాలా మంది ఎలాంటి ప్రణాళిక లేకుండా ఖర్చు చేస్తుంటారు. మంచి డిస్కౌంట్ ఆఫర్లు కనిపించిన వెంటనే కొనుగోలు చేస్తుంటారు. క్రెడిట్ కార్డ్‌పై చాలా తక్కువకే వస్తుందని కొనుగోలు చేస్తుంటారు. ఇవన్నీ విక్రయాలు పెంచుకోవడానికి కంపెనీలు చేసే మార్కెటింగ్ వ్యూహాలు. వాటి ఆకర్షణలో పడకుండా చూసుకోవాలి. సంపద సృష్టించాలనే పట్టుదల ఉన్న వారు మొదట వ్యయాలపై అదుపు సాధించాలి. వస్తున్న ఆదాయంలో వ్యయాలను 60–80 శాతానికి మించకుండా అదుపు చేసుకోవాలి. ఎంత సంపాదించామన్నది కాకుండా, ఎంత పొదుపు చేశామనే తత్వంతో ముందుకు సాగాలి. అవసరాలకే కొనుగోళ్లు పరిమితం కావాలి. అంటే ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజు, కిరాణా, పాలు, కూరగాయలు, యుటిలిటీ బిల్లులు ఇవన్నీ అవసరాలు. రెస్టారెంట్లో తినడం, సినిమాలు, టూర్లు ఇవన్నీ కోరికలు. వెసులుబాటు ఉంటేనే కోరికలకు బడ్జెట్లో కేటాయింపులు చేయాలి. అవసరాలు, కోరికలకు కేటాయింపుల తర్వాత కూడా ఆదాయంలో 40 శాతాన్ని పెట్టుబడిగా మళ్లించారంటే సంపద సృష్టి అనుకున్నదానికంటే ముందే సాధ్యపడుతుంది. సరైన సాధనాలు సంపాదనలో పొదుపుతోనే ఆగిపోకూడదు. ఆ పొదుపు మదుపుగా మారినప్పుడే సంపద సాధ్యపడుతుంది. ఈ మార్గంలో ఎంపిక చేసుకునే పెట్టుబడి సాధనాలు కీలక పాత్ర పోషిస్తాయి. జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లను పెట్టుబడి సాధనాలుగా చూడకూడదు. ద్రవ్యోల్బణం తరుగు తీసిన తర్వాత ఈ సాధనాల్లో మిగిలేదీ ఏమీ ఉండదు. రాబడితోపాటు, అవసరమైనప్పుడు నగదుగా మార్చుకునే లిక్విడిటీ కూడా మెరుగ్గా ఉండాలి. ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ మేలైనవి. వీటితోపాటు వెసులుబాటును బట్టి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లలోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీలతోపాటు, రియల్ఎస్టేట్, బంగారం దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని తెచ్చి పెట్టినట్టు గణాంకాలు చెబుతున్నాయి. పెట్టుబడుల్లో స్థిరత్వం కోసం కొంత డెట్ సాధనాలకూ చోటు ఇవ్వొచ్చు. గ్యారంటీడ్ రాబడి అనే ఉత్పత్తుల ఆకర్షణలో పడొద్దు. పన్ను ఆదా కోరుకునే వారు సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల కోసం ఈఎల్ఎస్ఎస్, ఎన్పీఎస్ వంటి పథకాలను పరిశీలించొచ్చు. పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజులు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, రుణంపై ఇల్లు కొనుగోలు చేస్తే, అసలు, వడ్డీపైనా పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందొచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో వేలాది పథకాలున్నాయి. నిపుణుల సాయంతో నాలుగైదు పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ఫండ్స్‌లో ఎన్‌ఎఫ్‌వోల కంటే ట్రాక్ రికార్డు ఉన్న పథకాలను ఆశ్రయించడమే మెరుగైనది అవుతుంది. లిస్టింగ్ రోజున లాభాల కాంక్షతో ఐపీవోను ఎంపిక చేసుకోవద్దు. మంచి కంపెనీ, ఆకర్షణీయమైన వ్యాల్యూషన్లలో వస్తే దీర్ఘకాలానికి ఐపీవో మార్గంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అప్పుడు లిస్టింగ్‌లో లాభం వస్తే విక్రయించుకోవచ్చు. రాకపోతే పెట్టుబడిని కొనసాగించుకోవచ్చు. ఇతరులను అనుసరించడం ట్రేడింగ్‌తో రోజులో రూ.10వేలు, రూ.లక్ష సంపాదించుకోవచ్చనే ప్రకటనలు చూసి మోసపోవద్దు. తాము నేరి్పంచే స్ట్రాటజీతో ట్రేడింగ్‌లో రూ.లక్షలు సంపాదించొచ్చనే సోషల్ మీడియా ప్రకటనలకు ఆకర్షితులు కావొద్దు. స్వీయ అధ్యయనంతో పెట్టుబడి సాధనాలను అర్థం చేసుకోవాలి. లేదంటే ఫైనాన్షియల్ ప్లానర్లు లేదా అడ్వైజర్ల సాయం తీసుకోవాలి. సంపన్న ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోని అనుకరించడం సరికాదు.తోటి ఇన్వెస్టర్ల సలహా, సూచనలను గుడ్డిగా అనుసరించొద్దు. ప్రతి ఇన్వెస్టర్ రిస్క్, ఆకాంక్షలు వేర్వేరుగా ఉంటాయి. ఆర్థిక రక్షణ మెరుగైన కవరేజీతో కుటుంబం అంతటికీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మొదట చేయాల్సిన పని. దీనివల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, పొదుపు, పెట్టుబడులకు విఘాతం కలగకుండా, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీతో గట్టెక్కొచ్చు. నలుగురు సభ్యుల కుటుంబానికి కనీసం రూ.10 లక్షల కవరేజీ, అపరిమిత రీస్టోరేషన్ సదుపాయంతో తీసుకోవాలి. ఇక అనుకోనిది జరిగితే కుటుంబం ఆర్థిక కష్టాల పాలు కాకుండా ఉండేందుకు, మెరుగైన కవరేజీతో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కూడా తీసుకోవాలి. కనీసం 20 ఏళ్ల కుటుంబ అవసరాలను తీర్చే స్థాయిలో కవరేజీ ఉండాలి. ప్రమాదం కారణంగా ఏర్పడే నష్టాన్ని భర్తీ చేసే కవరేజీ కూడా ఉండాలి. ఇంటికి, ఇంట్లోని విలువైన వాటికి బీమా ప్లాన్ తీసుకోవాలి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా కనీసం ఆరు నెలల అవసరాలను తీర్చే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. రాబడి ఒక్కటే కాదు.. పెట్టుబడి కోసం ఎంపిక చేసుకునే సాధనం విషయంలో రాబడి ఒక్కటే ప్రామాణికం కాకూడదు. సంబంధిత ఉత్పత్తిలో ఉండే రిస్‌్కను కూడా మదింపు వేయాలి. తమ రిస్క్ సామర్థ్యానికి తగినట్టుగానే ఉందా? అని విశ్లేషించుకోవాలి. ఉదాహరణకు 2020 మార్చి కరోనా విపత్తు సమయంలో ఈక్విటీ మార్కెట్ 40 శాతానికి పైగా పతనమైంది. విడిగా కొన్ని స్టాక్స్ 80–90 శాతం వరకు పడిపోయాయి. అలాంటి సమయాల్లో పెట్టుబడుల విలువ గణనీయంగా పడిపోతుంది. ఆ నష్టాన్ని చూసి భయపడిపోకూడదు. ఈక్విటీలకు ఆటుపోట్లు సహజం. కాలవ్యవధి అనేది సాధనాలను ఎంపిక చేసుకోవడానికి కీలకం. ఆటుపోట్లు ఎదురైనా, ధైర్యంగా కొనసాగించే వారే వీటిని ఎంపిక చేసుకోవాలి. ఈక్విటీల్లో అస్థిరతలు ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో మెరుగైన రాబడి వస్తుంది. రిస్క్ వద్దనుకుంటే, రాబడిలో రాజీపడి డెట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. తప్పులకు దూరంగా.. పెట్టుబడుల్లో వీలైనంత వరకు తప్పులకు చోటు లేకుండా చూసుకోవాలి. అయినా కానీ తప్పులు జరగవన్న గ్యారంటీ ఏమీ ఉండదు. ఫండ్ మేనేజర్లు సైతం తమ ప్రయాణంలో తప్పులు చేస్తుంటారు. కాకపోతే చేసిన తప్పును వేగంగా గుర్తించి, దాన్ని సరిదిద్దుకోవడం తెలియాలి. ఫండ్స్‌లో మానవ తప్పిదాలకు చోటు లేకుండా ఉండాలంటే ఇండెక్స్ ఫండ్స్ ఉత్తమమైనవి. నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు ఎంతో ఆచితూచి వ్యవహరించాలి. మెరుగైన స్ట్రాటజీ, చక్కని అవగాహన, స్థూల ఆర్థిక అంశాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రభుత్వ, ఆర్బీఐ పాలసీలు, కరెన్సీ మారకం తదితర ఎన్నో అంశాలను వేగంగా అర్థం చేసుకునే నైపుణ్యాలు అవసరం. అంత సమయం లేకపోతే ఆ భారం ఫండ్ మేనేజర్లపై వేయాలి. లక్ష్యం.. ప్రణాళిక ప్రతి లక్ష్యానికీ విడిగా ప్రణాళిక అవసరం. సొంతిల్లు, కారు, రిటైర్మెంట్, పిల్లల విద్య, వివా హం ఇవన్నీ అందరికీ ఉండే ముఖ్యమైన భవిష్యత్ లక్ష్యాలు. తమ ఆదాయం నుంచి విడిగా ఒక్కో దానికి ఎంత చొప్పున కేటాయిస్తే, వాటిని చేరుకోవచ్చన్న దానికి స్పష్టత ఉండాలి. అవసరమైతే ఈ విషయంలో నిపుణుల సాయం తీసుకోవాలి. రుణాలు–చెల్లింపులు తప్పనిసరి అయితేనే రుణం తీసుకోవాలి. తీసుకుంటే దాన్ని తీర్చివేయడానికే మొదట ప్రాధాన్యం ఇవ్వాలి. రుణ చెల్లింపుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైఫల్యం లేకుండా చూసుకోవాలి. నామినేషన్ చివరిగా అన్ని ఆర్థిక సాధనాలకూ నామినేషన్ ఇవ్వడం తప్పనిసరి. బ్యాంక్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్, బీమా పథకాలు, డీమ్యాట్ ఖాతాలు, ఈపీఎఫ్ ఇలా ప్రతి సాధనానికీ నామినేషన్ లేకపోతే వెంటనే నమోదు చేయాలి. మార్గమిది... లక్ష్యాల్లో వాస్తవికత: జనవరి 1 నుంచే రోజూ 5 కిలోమీటర్ల నడక లేదా పరుగు ఆచరణలో పెట్టాలని కోరుకోవచ్చు. మొదటి రోజే 5 కిలోమీటర్లు సాధ్యం కానప్పుడు ఒక కిలోమీటర్‌తో ఆరంభిస్తే, క్రమంగా కొన్ని రోజుల్లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. సామర్థ్యాలకు తగినట్టుగా కార్యాచరణ అవసరం. ఎంత వీలైతే, అంత మొత్తంతో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించాలి. స్థిరత్వం: పెట్టుబడుల ప్ర పంచంలో ప్రేరణ కంటే స్థిర త్వానికే ప్రాముఖ్యం ఇస్తారు. ప్రేరణ అనేది కొన్ని రోజులు, నెలల పాటే ఉండొచ్చు. కానీ, స్థిరత్వం అన్నది విజయానికి కీలకం . ఇన్స్టంట్ సక్సెస్: స్వల్ప కాలంలో సంపద పోగేయాలన్నట్టుగా కొందరు ఇన్వెస్టర్ల ధోరణి ఉంటుంది. కానీ, జీవితం అందరికీ ఒకే విధంగా నడవదు. ఫలితాలకు తగినంత వ్యవధి ఇచి్చనప్పుడే సాధన సులభమవుతుంది. ఇక్కడ ఓపిక, క్రమశిక్షణ, అంకితభావం కీలకం అవుతాయి. కృషి: ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులు అవుతారు’అని ఓ సినీ కవి చెప్పినట్టు.. చేసుకున్న తీర్మానాలను విజయవంతంగా చేరుకోవడం కంటే కూడా, దాన్ని సాధించడానికి మీరు చేసిన ప్రయత్నాలు, కృషి ఇక్కడ కీలకం అవుతాయి. ప్రతి నెలా ఆదాయంలో 50 శాతాన్ని ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ, అది సాధ్యం కావ డం లేదని దాన్ని పక్కన పెట్టేయడం విజయానికి చేరువ చేయదు. కనీసం 20–30–40 శాతం మేర అయినా ఆదాతో మొదలుపెట్టి, ఆ తర్వాత దాన్ని మరింత పెంచుకోవచ్చు. ఆర్థిక అంశాలపై పట్టు: ఆర్థికంగా విజయం సాధించాలని కోరుకునే వారికి అందుకు సంబంధించి ప్రాథమిక అంశాలు తప్పకుండా తెలిసి ఉండాలి. ఆర్థిక అంశాలను అర్థం చేసుకోవడం, వాటిని అమలు చేయడం, వ్యక్తిగత ఆర్థిక అంశాల నిర్వహణ, బడ్జెట్, పొదుపు, పెట్టుబడులు, రుణాలు వీటన్నింటి గురించి తెలియాలి. ఆర్థిక, పెట్టుబడి సూత్రాలపై అవగాహన ఉండాలి. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, ఈల్డ్స్ తెలిసి ఉండాలి. -
గురువాణి: శ్రమకు నమస్కారం
నైతిక విలువలు పతనమయిన జీవితాన్ని గడపడం... అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అవుతుంది. దానికి మూడవది కొనసాగింపుగా మనసు కూడా తోడయితే... దానిని దంభం అంటారు. అంటే మనసులో ఒకటి అనుకుంటాడు. పైకి ఒకటి మాట్లాడతాడు, చేసేది మరొకటి అయి ఉంటుంది. అంటే ఈ మూడూ ఒక సరళరేఖలో ఉండవు. అలా లేకుండా ఉండడమే నైతిక భ్రష్టత్వం. ఏ పని చేయకుండా సంపద కలిగి ఉండడం ప్రమాదం. మనిషి సంపదను ΄పొంది ఉండడంలో తప్పు లేదు. అనువంశికంగా, పిత్రార్జితంగా పెద్దలనుండి వచ్చిన ఆస్తి కలిగి ఉండడం అంతకన్నా దోషం కాదు. కానీ వాళ్ళు ఈ సంపదను సమకూర్చడానికి ఎంత కష్టపడ్డారో, ఎంత చెమట చిందించారో అర్థం అయితే తప్ప ఆ డబ్బు ఖర్చుపెట్టడానికి యోగ్యత ΄పొందలేడు. కారణం.. డబ్బు సంపాదించేటప్పడు మనిషి పడే కష్టం అనుభవాన్ని ఇస్తుంది. అది డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టనీయదు. చెమటకు ఉన్న శ్వాస ఏమిటో అర్థం అవుతుంది. అప్పుడు వ్యసనాలకు వశులు కారు. కష్టపడి సంపాదించుకున్న ద్రవ్యం క్రమశిక్షణను నేర్పుతుంది. నీతి శాస్త్రం ఏమంటుందంటే... మనిషి ఎంత సంపాదించాడనే దానికంటే ఏ మార్గంలో సంపాదించాడన్నది ప్రధానం. ఎంత ఖర్చు పెట్టావు అనేదానికన్నా ఏ ప్రయోజనానికి ఖర్చుపెట్టావన్నది అత్యంత ప్రధానం. ప్రతివారికి ద్రవ్యసముపార్జనలోని కష్టం తెలియాలి... అంటుంది రఘువంశం కావ్యంలో... పట్టాభిషిక్తుడైన ప్రతి రాజు కూడా వంశపారంపర్యంగా రాజ్యం అందినా... జీవితంలో ఒకసారి దండయాత్రకు వెడతాడు. రాజులందర్నీ గెలిచి వస్తాడు. ఎందుకు... అంటే తనకు పూర్వం ఉన్న రాజులు దండయాత్రలు చేయడానికి, రాజుల్ని గెలవడానికి, చక్రవర్తిత్వాన్ని నిలుపుకోవడానికి ఎంత కష్టపడ్డారో, ఎలా కోశాగారాన్ని నింపగలిగారో, ఎలా మంచిపనులు చేసి కీర్తిమంతులు కాగలిగారో తెలియాలంటే వారు కూడా కష్టపడాలి.. అందుకే ఆ దండయాత్రలు. ఒక వ్యక్తి జీవితంలో ఎంతో కష్టపడి సంపాదిస్తే, ఆ ద్రవ్యం ఎంత మంది ఉద్ధరణకో ఉపయోగిస్తాడు తప్ప నిష్కారణంగా దాచుకుందామన్న ఆలోచనను రానీయడు. నీరు, విద్య, ద్రవ్యం నిలబడి ఉండకూడదు. ప్రవహిస్తూ ఉండాలి. అప్పుడే వాటి ప్రయోజనం సిద్ధిస్తుంది. కష్టపడి సంపాదించడంలో గౌరవం ఉంది. అది ఎంతయినా కావచ్చు. అసలు సంపాదించినది ఏదీ లేక΄ోవచ్చు. అందువల్ల నీతిబద్ధంగా శ్రమించడం ప్రతి వ్యక్తికీ ప్రధానం. -
సభా విలువలు కాపాడాలి
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని అఖిలపక్ష నేతలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా విజ్ఞప్తి చేశారు. సభలో సభ్యత, క్రమశిక్షణ పాటించాలని కోరారు. సభా సంప్రదాయాలను, విలువలను కాపాడాలన్నారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓం బిర్లా శనివారం అఖిలపక్ష భేటీ నిర్వహించారు. అగ్నిపథ్ పథకం, నిరుద్యోగం, రైతుల సమస్యలపై ఉభయ సభల్లో చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, డీఎంకే, ఐయూఎంఎల్, ఎల్జేపీ, ఆప్నాదళ్ తదితర పార్టీల నేతలు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తరపున పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ, సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. -
రిషభ్ పంత్‌కు భారీ జరిమానా
శుక్రవారం రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ‘నో బాల్’ వివాదంలో తమ బ్యాటర్లను మైదానం నుంచి వెనక్కి పిలిచే ప్రయత్నం చేసి క్రమశిక్షణను ఉల్లంఘించిన ఢిల్లీ క్యాపిటల్స్ బృందంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చర్య తీసుకుంది. కెప్టెన్ రిషభ్ పంత్ మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా (సుమారు రూ. కోటీ 14 లక్షలు) విధించింది. అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేపై కూడా 100 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా, ఒక మ్యాచ్ నిషేధం విధించిన కౌన్సిల్... శార్దూల్‡ను కూడా 50 శాతం జరిమానాతో శిక్షించింది. -
విశ్రాంత జీవనానికి ఏబీసీడీలు.. డాక్టర్ కిరణ్ చద్దా
‘పదవీ విరమణ తర్వాత సృజనాత్మకమైన నిధిని కనుక్కొన్నాను’ అంటున్నారు రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డాక్టర్ కిరణ్ చద్దా. ఏడుపదుల వయసు విశ్రాంత జీవనాన్ని అర్థవంతంగా మార్చుకుంటూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పెట్రోలియం, ఇనుప ఖనిజం సబ్జెక్టులలో రెండు పీహెచ్‌డీలు చేసి డాక్టరేట్ పొందారు. రచయితగా, మోటివేషనల్ స్పీకర్‌గానూ కొనసాగుతున్న కిరణŠ చద్దా ముప్పై ఆరేళ్ల్ల ఉద్యోగ జీవితాన్నీ, ఆ తర్వాత విశ్రాంత జీవనాన్ని మన కళ్లకు కడుతున్నారు. పెట్రోలియం, వాణిజ్యం, రక్షణ, మహిళా–శిశు సంక్షేమ శాఖలలో పనిచేసిన అనుభవం ఆమె సొంతం. ఆడపిల్లలకు పెద్దగా ఉపాధి అవకాశాలు లేని కాలంలో కేంద్ర ప్రభుత్వ అధికారిగా రాణించింది. ఉద్యోగ నిర్వహణలో ఉన్నప్పుడు తన జీవన విధానం గురించి వివరిస్తూ – ‘పర్వతారోహణ అంటే చాలా ఇష్టం. కానీ, ఒంటరిగా వెళ్లలేను. నా భర్త హర్ష్ చద్దా పోలీస్ అధికారి అవడంతో నాతో వచ్చేంత సమయం అతనికి లేదు. కానీ, హిమాలయాలపై ఉన్న ప్రేమతో బృందాలతో కలిసి ట్రెక్కింగ్ చేశాను. పిల్లలు హాస్టల్లో చదివేవారు. సెలవులు ఉన్నప్పుడు వారితో గడిపేంత సమయం నాకు ఉండేదికాదు. ఎన్నో అభిరుచులుండేవి. కానీ, విధి నిర్వహణలో వాటన్నింటినీ పక్కన పెట్టేయాల్సి వచ్చింది’ అంటూ తీరిక లేకుండా విధులను నిర్వర్తించిన రోజులను గుర్తుకుతెచ్చుకుంటారు ఆమె. పేదను కాను... పదవీ విరమణ తీసుకున్నాక పరిస్థితులను వివరిస్తూ ‘రిటైర్ అయ్యాక ఢిల్లీ నుంచి డల్హౌసీకి కుటుంబంతో పాటు వెళ్లిపోయాం. పిల్లలు వారి జీవితాల్లో స్థిరపడ్డారు. నేనూ, నా భర్త హిమాచల్ ప్రదేశ్‌లోని డల్హౌసీలో స్థిరపడ్డాం. అక్కడే చదవును కొనసాగించి రెండు పీహెచ్‌డీలు చేశాను. 2017లో ‘డల్హౌసీ త్రూ మై ఐస్’ పుస్తకం రాశాను. ‘క్లీన్ డల్హౌసీ క్లీన్ డల్హౌసీ’ పేరుతో ఎన్జీవో ఏర్పాటుచేశాను. దీని ద్వారా నేనున్న ప్రాంతంలో పరిశుభ్రత కోసం పనిచేశాను. రెండేళ్ల క్రితం నా భర్త గుండెపోటుతో మరిణించాడు. దాంతో చాలా కుంగిపోయాను. నా జీవితంలో అవి చాలా చెడు దినాలు. అయితే, ఈ ప్రపంచంలో నాకేమాత్రం నచ్చని పదాలు రెండు.. వితంతువు, పేదరికం. నేను దేంట్లోనూ ‘పేద’ కాదని నిరూపించుకోవాలనుకున్నాను. సాధనతోనే సాధ్యం వారానికి రెండు సార్లు యోగా, పియానో క్లాసులు తీసుకుంటాను. పంజాబీ పాటలు పాడతాను. యూ ట్యూబ్‌లో మోటివేషనల్ వీడియోలను తయారుచేసి అప్లోడ్ చేస్తాను. నా కవితలను చదువుతాను. నేను ఇప్పుడు ఎబిసిడి లను అమలులో పెడుతున్నాను. ఎ– (ఎబిలిటీ) సామర్థ్యం, బి–(బింజ్ అలెర్ట్) అప్రమత్తం, సి–(కమిట్మెంట్) నిబద్ధత, డి–(డిసిప్లీన్) క్రమశిక్షణ. ఈ నియమాలను ఆచరణలో పెడితే ఏమైనా సాధించవచ్చు. ఈ నాలుగు విషయాలను అస్సలు అలక్ష్యం చేయను. అందువల్లే చదవాలనే నా అభిరుచిని కొనసాగించాను. ఈ కొత్త సంవత్సరంలో కూడా చాలా పుస్తకాలు చదవాలని, రాయాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటికీ వార్తాపత్రికలు చదువుతుంటాను. లాక్డౌన్ సమయంలో 23 రోజుల్లో 150 కవితలు రాశాను. రోజూ నాకు తెలుసున్నవారితో కొంత సమయమైనా గడపడానికి కేటాయిస్తాను. లేటెస్ట్గా వస్తున్న డ్రెస్సులను ధరిస్తున్నాను. నాకు నచ్చిన లిపిస్టిక్ వేసుకుంటున్నాను. నా గోళ్లకు రంగురంగుల పాలిష్ వేసుకుంటున్నాను. నా వయసు ఏడుపదులు దాటి ఉండవచ్చు. కానీ, నా అభిరుచులన్నీ 17 ఏళ్ల అమ్మాయికి తక్కువేమీ లేవు. టీవీ చూస్తూ సమయాన్ని వృథా చేసుకోను. ఏదైనా ఉపయుక్తమైన పని చేయాలనుకుంటున్నాను. నాకు పంజాబీ సంగీతం, గజల్స్, జోక్స్ అంటే చాలా ఇష్టం. విచారంగా ఉండటానికి సమయమే లేదు’’ అని వివరిస్తారు ఈ విశ్రాంత ఉద్యోగి. విధి నిర్వహణలో ఉన్నవారూ ఆచరణలో పెట్టదగిన అమూల్యమైన విషయాలను కిరణ్ చద్దా తన జీవితం ద్వారా కళ్లకు కడుతున్నారు. నా వయసు ఏడుపదులు దాటి ఉండవచ్చు. కానీ, నా అభిరుచులన్నీ 17 ఏళ్ల అమ్మాయికి తక్కువేమీ లేవు. టీవీ చూస్తూ సమయాన్ని వృథా చేసుకోను. ఏదైనా ఉపయుక్తమైన పని చేయాలనుకుంటున్నాను. నాకు పంజాబీ సంగీతం, గజల్స్, జోక్స్ అంటే చాలా ఇష్టం. విచారంగా ఉండటానికి సమయమే లేదు. – కిరణ్ చద్దా -
నీ కుక్కను సరిగ్గా ట్రైన్ చేసుకో.. నా కుక్కనే అంటావా!
బెర్లిన్: సాధారణంగా కొందరు శునకాలను చాలా ఇష్టంగా పెంచుకుంటారు. వాటిని తమ ఇంట్లో మనుషుల మాదిరిగా చూసుకుంటారు. వాటిని ఎవరు ఏమన్నా.. ఆగ్రహంతో ఊగిపోతుంటారు. తాజాగా, ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. జర్మనీలోని తురింజియా పట్టణంలో 27 ఏళ్ల మహిళ, 51 ఏళ్ల మరో మహిళ తమ పెంపుడు కుక్కలను తీసుకుని స్థానికంగా ఉన్న పార్కులో వాకింగ్‌కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఒక శునకం.. మరో శునకాన్ని చూస్తు అరుస్తూ దాడికి తెగబడింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన 51 ఏళ్ల మహిళ.. మరో మహిళపై వాగ్వాదానికి దిగింది. శునకాన్ని సరిగ్గా ట్రైన్ చేసుకోవాలని చెప్పింది. దీంతో వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవ పెరిగి.. ఒకరిపై మరొకరు దాడిచేసుకోవడం వరకు వెళ్లింది. ఒకరిని మరోకరు కొరుక్కుంటూ గాయపర్చుకున్నారు. పాపం.. మహిళలిద్దరు కొట్టుకోవడాన్ని వారి శునకాలు చూస్తూ ఉండిపోయాయి. ఆ ప్రదేశంలో ఉన్న స్థానికులు వారి గొడవను ఆపటానికి సాహసించలేదు. ఈ సంఘటన తర్వాత ఇరువురు స్థానిక పోలీసుస్టేషన్ వెళ్లి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘మీ కన్నా.. శునకాలే నయం..’, ‘వామ్మో.. ఇలా కరుచుకున్నారేంటీ..’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. -
ఉపాధ్యాయుడి మందలింపు.. ఆత్మహత్యకు ప్రేరేపితం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: పాఠశాలలో ఉపాధ్యాయుడు మందలించినంత మాత్రాన దాన్ని విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి కారణంగా చూడలేమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 306 వర్తించజాలదని పేర్కొంది. రాజస్థాన్‌లోని నేవ్‌త్ గ్రామంలో సెయింట్ గ్జేవియర్స్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి 26.4.2018న ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడు రోజుల అనంతరం స్కూలు పీఈటీ వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ విద్యార్థి తల్లి పోలీసులను ఆశ్రయించారు. స్కూలు పీఈటీ జియో వేధింపుల కారణంగానే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని, సూసైడ్ నోట్లో ఈ విషయాన్ని పేర్కొన్నాడని ఫిర్యాదులో తెలిపారు. మూడు పేజీల సూసైడ్ నోట్లో తొలి పేజీలో తన వస్తువులు సోదరుడుకి ఇవ్వాలని, రెండో పేజీలో న్యాయం కావాలని, మూడో పేజీలో జియో సార్‌కు ధన్యవాదాలు అని విద్యార్థి రాసినట్లు తెలిపారు. పోలీసులు ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. దీంతో ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు పిటిషన్ కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం మంగళవారం జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ కృష్ణమురారిలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. చదవండి: (కోవిడ్ విధుల్లోని అంగన్ వాడీలకు 50 లక్షల బీమా) ‘‘దేశంలో ఆత్మహత్య నేరం కాదు. కానీ ఆత్మహత్యాయత్నం సెక్షన్ 309 ప్రకారం నేరంగా పరిగణిస్తాం. ఆత్మహత్యకు ప్రేరణ కూడా ఐపీసీ సెక్షన్ 306 కింద నేరంగా పరిగణిస్తాం. సెక్షన్ 306 ప్రకారం... ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తికి పదేళ్ల వరకూ జైలు, జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రస్తుత విద్యావిధానంలో విద్యార్థిని మందలించడంపై ఎలాంటి చట్టాలు లేవు.. కానీ విద్యార్థి క్రమశిక్షణారాహిత్యాన్ని ఉపాధ్యాయుడు, పాఠశాల అథారిటీలు ఉపేక్షించజాలవు. ఇది ఉపాధ్యాయుడి బాధ్యత మాత్రమే కాదు విద్యా హక్కు చట్టం సెక్షన్ 24 (ఈ) ప్రకారం తల్లిదండ్రులు, గార్డియన్లతో ఉపాధ్యాయుడు విద్యార్థి హాజరు, క్రమశిక్షణ, చదువు గురించి సమావేశం కావాలి. విద్యార్థి తరచూ తరగతులకు గైర్హాజరు కావడాన్ని గుర్తించిన ఉపాధ్యాయుడు మందలించడంతోపాటు ప్రిన్సిపల్ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. అంతకుమించి ఏమీ చేయలేదు. అందువల్ల సూసైడ్‌నోట్‌ను దీనికి ఆపాదించాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొంటూ హైకోర్టు ఆదేశాలు కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పు సందర్భంగా అర్నాబ్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రస్తావించింది. సూసైడ్ అనే పదానికి ఐపీసీలో నిర్వచనం లేదని, సాధారణ నిఘంటువులో మాత్రం స్వీయహత్య (సెల్ఫ్ కిల్లింగ్ ) అని ఉంటుందని పేర్కొంది. అంటే తననుతాను చంపుకొనే లక్ష్యాన్ని సాధించడానికి అనుసరించిన మార్గాలతో సంబంధం లేకుండా చేపట్టిన చర్యగా ధర్మాసనం అభివర్ణించింది. చదవండి: ('సరిహద్దుల్లో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటాం') -
నా మనసు విరిగిపోయింది.. ఇక: వినేశ్ ఫొగాట్
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పతకావకాశం ఉన్న రెజ్లర్‌గా బరిలోకి దిగి విఫలం కావడంతో పాటు క్రమశిక్షణ తప్పిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మౌనం వీడింది. తనపై వస్తున్న ఆరోపణలకు స్పందించడంతోపాటు ఒలింపిక్స్ ముందు, పోటీలు జరిగే సమయంలో తాను మానసికంగా ఎంత వేదన అనుభవించిందో వెల్లడించింది. ఒలింపిక్స్ ముగిసిన తర్వాత వినేశ్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) తాత్కాలిక నిషేధం విధించింది. ‘మన దేశంలో ఎంత వేగంగా పైకి ఎదుగుతామో అంతే వేగంగా కింద పడిపోతాం. ఒక్క పతకం రాలేదంటే ఇక అంతా అయిపోయినట్లే. ఇప్పుడూ అదే జరుగుతోంది. అంతా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఓటమికి కారణాలేమిటో నాకు బాగా తెలుసు. ఒలింపిక్స్ కోసం అన్ని రకాలుగా సిద్ధమై వచ్చాను. కానీ నన్ను దురదృష్టం వెంటాడింది’ అని వినేశ్ పేర్కొంది. రెజ్లింగ్‌పై అవగాహనలేని, షూటింగ్‌తో సంబంధం ఉన్న ఫిజియోను తనకు కేటాయించారని, బౌట్‌కు ముందు తన బరువు తగ్గించుకునే విషయంలో తానే ఆమెకు వివరించాల్సి వచ్చిందని వినేశ్ ఆరోపించింది. రెండుసార్లు కరోనా సోకడంతో తన శరీరంలో అసలు ప్రొటీన్ లేకుండా పోయిందని ఆమె చెప్పింది. తన వల్ల భారత రెజ్లర్లు కోవిడ్ బారిన పడకూడదనే విడిగా ఉన్నానని, ఇందులో తప్పేముందని ప్రశ్నించిన వినేశ్... గత రెండేళ్లుగా చాలాసార్లు డిప్రెషన్‌కు గురయ్యానని వెల్లడించింది. ‘నేను మానసికంగా సన్నద్ధంగా లేను కాబట్టి పోటీ పడలేను అని అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ చెబితే నిజమే కదా అంటూ మనోళ్లూ సానుభూతి పలుకుతారు. బరిలోకి దిగకపోవడం సంగతి తర్వాత, నేను మానసికంగా సన్నద్ధంగా లేనని ఒక్కసారి చెప్పి చూడండి. ఏం జరుగుతుందో’ అని వినేశ్ గుర్తు చేసింది. తన ఓటమి గురించి కనీసం తాను కూడా బాధపడే అవకాశం ఇవ్వకుండా అంతా కత్తులతో సిద్ధమయ్యారని వినేశ్ ఆవేదన వ్యక్తం చేసింది. ‘స్వర్ణం గెలిచే అవకాశం ఉన్నవారిలో నన్నూ చేర్చండి అని నేను అడిగానా? ఓడితే అందరికంటే ఎక్కువగా బాధ పడేది నేనే కదా. నేను మళ్లీ రెజ్లింగ్‌లోకి ఎప్పుడు అడుగు పెడతానో, అసలు ఆడతానో కూడా తెలీదు. 2016 ‘రియో’లో కాలు విరిగినప్పుడే బాగుంది. కనీసం దేనికి చికిత్స చేయాలో తెలిసింది. కానీ ఇప్పుడు నా మనసు విరిగి పోయింది’ అని ఆమె బాధను ప్రదర్శించింది. నోటీసుకు స్పందించాల్సిందే! వినేశ్‌పై చర్య తీసుకునే విషయంలో ఆమెకు పంపిన నోటీసు విషయంలో స్పందన కోసం ఎదురు చూస్తున్నామని డబ్ల్యూఎఫ్ఐ వెల్లడించింది. ‘వినేశ్ నుంచి మాకు ఇంకా సమాధానం రాలేదు. ఆమె తన సమస్య గురించి ఏం రాసుకుందనేది మాకు అనవసరం. నోటీసు ఇచ్చిన మరో రెజ్లర్ సోనమ్ స్పందించింది. క్షమాపణ కోరిన ఆమె ఇకపై తప్పు చేయనని హామీ ఇచ్చింది’ అని డబ్ల్యూఎఫ్ఐ అధికారి ఒకరు వెల్లడించారు. చదవండి: మేయర్ అత్యుత్సాహం.. పంటి గాట్లతో గోల్డ్ మెడల్ రీప్లేస్ -
మనోబలమే మహౌషధం
దేశ రక్షణకు ప్రాణాలను సైతం లెక్క చేయక పోరాడే వీర సైనికులలో వున్నది ఈ మనోబలమే! శత్రువులు మూకుమ్మడిగా చుట్టూముట్టినా, శరీరాన్ని ఛిద్రం చేస్తున్నా ప్రతిఘటించాలన్న కాంక్షవారికుండటానికి కారణం అబ్బురపరిచే వారి మానసిక స్థైర్యమే. కష్టాలు ఒక్కసారిగా చుట్టిముట్టినప్పుడు మనిషి నిబ్బరంగా ఉండగలగటమే ధీరత్వం అంటే! క్లిష్ట పరిస్థితులలో నిరాశ, నిస్పృహలు ఆవరిస్తాయి. ఆశ సన్నగిల్లుతుంది. మనసు నిలకడను కోల్పోతుంది. ఏదో తెలియని భీతి మనసులో తిష్ఠ వేస్తుంది. దాంతో కుంగిపోతాడు. మానసిక ప్రశాంతతకు దూరమవుతాడు. ఆశాæకిరణం కనుచూపు మేరలో లేదని, తను ఈ గడ్డుకాలం నుంచి బైట పడలేననే భయం ఏర్పడుతుంది. తన జీవితాన్ని అర్ధంతరం గా ముగించే ప్రయత్నం కూడా చేస్తాడు. ఈ కరోనా కష్ట కాలంలో మనలో చాలామంది ఈ స్థితిలోనే ఉన్నాం. శారీరక వ్యాయామం వల్ల శరీరం మాత్రమే దృఢమవుతుంది. కాని ప్రశాంతతకు దూరమైన మనసు బలహీనమవుతుంది. అది మన లోని శక్తిని నీరుకారుస్తుంది. అసహనంతో అకారణమైన, అసమంజసమైన కోపాన్ని కుటుంబ సభ్యుల మీద చూపి, వారి ప్రేమకు దూరమయేలా చేస్తుంది. వారిది కూడ తనలాంటి మానసిక స్థితేనా? అన్న ఆలోచన, విచక్షణ వివేచనలు కోల్పోయిన మనసుకు తోచదు. అది తన కుటుంబానికే కాక సమాజానికి, దేశానికి చేటు చేస్తుంది. మరెలా దీన్ని అధిగమించాలి? ఓర్పుతో మాత్రమే దీన్ని అలవరుచుకోవాలి. ఓర్పే నేటి గడ్డు కాలంలో గొప్ప రక్షణ కవచం. ‘దుర్దశే మనిషి వ్యక్తిత్వానికి గీటురాయి ‘ అన్నాడు ప్రపంచ విఖ్యాత నాటకకర్త షేక్సి్పయర్. అదే మనిషిలోని ధీ శక్తిని వెలికి తీసే అవసరాన్ని, అవకాశాన్ని కల్పిస్తుంది. మనిషి వ్యక్తిత్వానికి పరీక్ష పెట్టే కష్టాలు, అననుకూలతలు ఏర్పడినప్పుడు మనిషి కి మనోబలం అవసరం. మనోబలమున్న ధీరులలో స్వీయ క్రమశిక్షణ, స్వీయ ఆదేశాలు, ఆచరణ అంతర్వాహినిగా ఉంటాయి. మనోబలం వల్ల ఈ కష్టాల ఊబి నుండి బైట పడగలిగే శక్తి చేకూరుతుంది. సాధారణంగా మనోబలం కలవారు తక్కువ మాట్లాడతారు. ఎక్కువ పని చేస్తారు. కొందరయితే మౌనంగా, గంభీరంగా వుంటారు. నిరంతరం కార్యనిర్వహణలో నిమగ్నమై వుంటారు. ఎంత మనోబలం వున్నా బాగా శ్రమించి పనిచేస్తేనే ఆశించిన ఫలితం దక్కుతుంది. మనం కూడా మంచి ఆలోచనలతో, పట్టుదలతో కృషి చేయాలి. మానసికంగా బలంగా వున్నప్పుడు, శారీరకంగా శక్తిమంతుడు కాకపోయినా ఏమైనా చేయగలనన్న ధీమా ఉంటుంది. ఎవరినైనా, దేన్నైనా ఎదుర్కొనే సంసిద్ధత వస్తుంది. ఆ మానసిక సంసిద్ధతే నేడు కావలసింది. దానిని అందరూ అలవరచుకుంటూ, పెంచుకుంటూ మానసికంగా బలోపేతులు కావాలి. ఎవరు కాలం కంటే ముందు పరుగులు తీయగలరో, ఎవరు సంకల్పంతో కాల పరిధుల్ని, అవధుల్ని అధిగమించగలరో వారే విజేతలు. పరిమిత జీవిత కాలంలో అపరిమిత కృషితో అద్భుత ఫలితాలు సొంతం చేసుకున్నవారే కాలాతీతవ్యక్తులు. వారే శాస్త్రజ్ఞులు, సంస్కర్తలు, దేశభక్తులు, త్యాగమూర్తులు, దేశరక్షణలో ప్రాణత్యాగాలు చేసే పరమ యోధులు. మన కృషి తీవ్రతను బట్టి గమ్యం సమీపమో, సుదూరమో నిర్ణయమవుతుంది. సమీప గమ్యమే మన లక్ష్యమైనపుడు సంకల్పబలం దాన్ని తప్పకుండా సుసాధ్యం చేస్తుంది. మనోబలం అందుకు దన్నుగా నిలుస్తుంది. సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలను రూపుమాపటానికి, అభ్యుదయ మార్గంలో సమాజాన్ని నడిపించటానికి రాజా రామమోహన రాయ్, కందుకూరి వీరేశలింగం, జ్యోతి రావు ఫూలే వంటి అనేక మంది సంస్కర్తలు తమ జీవితాన్ని సమాజం కోసం ధార పోశారు. సమాజం నుంచి ఎన్నో ప్రతికూలతలు, అవమానాలు, బెదిరింపులు ఎదుర్కొన్నారు. అయినా, మొక్కవోని మనోబలంతో అనుకున్న లక్ష్యాలను సాధించారు. ఈ తరం న్యూటన్‌గా ప్రపంచం కొనియాడిన స్టీఫెన్ విలియం హాకింగ్స్ నరాలకు సంబంధించిన వ్యాధి పీడితుడై, శరీరం చచ్చుబడినా, తన అమోఘమైన మేధస్సుతో అనేక పరిశోధనలు, ఆవిష్కరణలు చేసాడు. మనోబలానికి ఇంతకన్నా నిలువెత్తు నిదర్శనం ఏముంటుంది? దేశ రక్షణకు ప్రాణాలను సైతం లెక్క చేయక పోరాడే వీర సైనికులలో వున్నది ఈ మనోబలమే! శత్రువులు మూకుమ్మడిగా చుట్టూముట్టినా, శరీరాన్ని ఛిద్రం చేస్తున్నా ప్రతిఘటించాలన్న కాంక్ష వారికుండటానికి కారణం అబ్బురపరిచే వారి మానసిక స్థైర్యమే. అనేక ప్రకృతి వెపరీత్యాలకు, మానవ ప్రేరిత విధ్వంసాలకు, ప్రజ అతలాకుతలమైంది. కాని, గుండె దిటవు చేసుకుంటూ తునాతునకలైన ఆశను మనోబలంతో ప్రోది చేసుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూనే ఉంది. ఇన్ని విపత్తులను దాటటానికి మనోబలమే కారణం. మనోబలమే మనిషికి నిజమైన శక్తి! ప్రస్తుత కాలంలో జనాన్ని వణికిస్తూ, భయభ్రాంతులను చేస్తున్న కరోనాను సులభంగా జయించటానికి అవసరమైనది ఈ మనోబలమే! కాబట్టి మనోబలాన్ని రక్షణ కవచంగా చేసుకుని ధైర్యంగా ముందుకు వెళదాం. కరోనా మహమ్మారి బారిన పడకుండా కాపాడుకుందాం. – బొడ్డపాటి చంద్రశేఖర్ -
శ్రీ శివకుమారస్వామి
సామాన్యప్రజల సేవయే పరమార్థంగా మఠాన్ని నడిపిన మానవతావాది. నిరక్షరాస్యులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన విద్యాప్రదాత. మనుషుల్లో దేవుడిగా పూజలందుకున్న ఈ ధార్మికవేత్త తుమకూరు సిద్ధగంగ మఠాధిపతి డాక్టర్ శ్రీశివకుమార స్వామి. 111 ఏళ్ల తమ సుదీర్ఘజీవనంలో ఆధ్యాత్మిక బోధలతో జాతిని చైతన్యవంతం చేసి అభినవ బసవణ్ణగా అందరి మన్ననలను పొందారు. ఆధ్యాత్మిక శక్తి పుంజం 1908 సంవత్సరంలో పటేల్ హోనప్ప, గంగమ్మ దంపతులకు చివరి సంతానంగా జన్మించిన ఒక సామాన్యుడు ఆధ్యాత్మిక బాటపట్టి ఉద్ధాన శివయోగి వద్ద శిష్యుడిగా చేరాడు. తన సాధనాసంపత్తిని ధారపోసి అతనిని ఆధ్యాత్మిక శక్తిపుంజంగా తయారు చేసి ‘శివకుమార స్వామి’గా లోకానికి అందించారు గురువులైన శ్రీ ఉద్ధాన శివయోగి. గురువుల ఆదేశానుసారంగా తుమకూరులో సిద్ధగంగ మఠాన్ని స్థాపించారు శివకుమారస్వామి. భక్తినావ–సామాజిక తోవ 9 దశాబ్దాల పాటు సిద్ధగంగ మఠాధిపతిగా బాధ్యతలు నిర్వహించిన శివకుమారస్వామి ఆధ్యాత్మిక, భక్తి బోధలకే పరిమితం కాకుండా సమాజసేవనూ బాధ్యతగా స్వీకరించి సంఘసేవకుడిగానే ఎక్కువ ప్రాచుర్యం పొందారు. కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో విద్యాసంస్థల్ని నెలకొల్పి లక్షలాదిమంది విద్యార్థులకు ఉచితంగా విద్యనందించి గొప్ప విద్యాదాతగా పేరుగాంచారు. విద్యతోపాటు క్రమశిక్షణను, సత్ప్రవర్తనను పెంపొందించేందుకు కృషి చేసిన ఈ మహనీయుడు లక్షలాదిమంది అభాగ్యుల ఆకలి బాధలు తీర్చిన అన్నదాత కూడా. వరించిన పురస్కారాలు శ్రీ శివకుమారస్వామిని వివిధ పురస్కారాలు కోరి వరించాయి. వీరి సేవలకు గుర్తింపుగా 2007లో కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక రత్న అవార్డునిచ్చి గౌరవించగా, భారత ప్రభుత్వం 2015లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. సామాన్యుడే మాన్యుడు వీరి ఆశీస్సుల కోసం ఉన్నత పదవులలో ఉన్న రాజకీయ నాయకులు, ప్రభుత్వాధినేతలు సైతం పరితపించేవారు. వీరిమాటను శిరోధార్యంగా భావించేవారు. కానీ వీరు అతి సామాన్యుడిలా శతాధిక వయసులో కూడా రోజూ శిష్యులను కలుసుకుని మాట్లాడేవారు. వారి దైనందిన సమస్యలకు ఆధ్యాత్మిక మార్గంతో పరిష్కారాలను సూచించేవారు. ఆధ్యాత్మికతతో క్రమశిక్షణ ‘వ్యక్తిగత క్రమశిక్షణ ఎవరికైనా అవసరం. వ్యక్తిగత క్రమశిక్షణకు బాటలు వేసేది ఆధ్యాత్మిక మార్గం. అదే మన జీవితాలను సరైన దారిలో నిలబెడుతుంది. సమాజంలోని ప్రతీ వ్యక్తి సత్యనిష్టాగరిష్టుడైతే సమస్యలన్నవే ఎదురుకావు. సమాజం ఉన్నతంగా పురోగమించాలంటే మనిషి సరైన దారిలో నడవాలి‘ అంటూ అలాంటి మార్గాన్ని ఆచరణలో చూపించి చైతన్యజ్యోతులను ప్రసరింపజేసిన మహనీయుడు శివగంగస్వామి. – అప్పాల శ్యామప్రణీత్ శర్మ అవధాని, వేదపండితులు -
ఆఫీసులో పర్సనల్ ఫోన్?!
ఉద్యోగాలు చేసేవారు కొన్ని అంశాలను విధిగా పాటించాలి. పదిమందితో కలిసి పనిచేసేటప్పుడు, పక్కన ఉన్నవారికి ఇబ్బంది కలుగకుండా చూసుకోవడం ప్రతి ఉద్యోగి బాధ్యత. వ్యక్తిగత క్రమశిక్షణ చాలా అవసరం. ఇటీవలికాలంలో సెల్ ఫోన్లు ఎక్కువయ్యాయి. అందువల్ల పని మధ్యలో కూడా ఫోను మాట్లాడవలసి వస్తుంది. ఆఫీసులో ఉన్నప్పుడు అలా మీకు పర్సనల్ కాల్ వస్తే, వీలైనంతవరకు సహోద్యోగులకు కాస్త దూరంగా వెళ్లి మాట్లాడాలి. ఒకవేళ ఆ అవకాశం లేకపోతే, ‘నేను మళ్లీ ఫోన్ చేస్తాను’ అని నెమ్మదిగా చెప్పి ఫోన్ కట్ చేసేయాలి. అత్యవసరమనుకుంటే ఆఫీసు బయటకు వెళ్లి, లాంజ్‌లో కాని, ఆరుబయట కాని మాట్లాడుకోవాలి. ఆఫీసులో ఉన్నప్పుడు వృత్తికి సంబంధించిన ఫోన్లు వస్తుంటాయి కాబట్టి వాటికి ప్రాధ్యాన్యం ఇస్తూ వ్యక్తిగతంగా ఫోన్ చేసినవారితో, ఇంటికి వచ్చాక మాట్లాడతాను అని చెప్పాలి. అలాగే కంప్యూటర్ని, ఫోన్‌ను మ్యూట్ లేదా సైలెంట్ మోడ్‌లో ఉంచుకోవాలి. అందువల్ల ఇమెయిల్ వచ్చినా, మెసేజ్ వచ్చినా అవి చేసే శబ్దాల వల్ల మిగతావారికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీరు మంచి క్రమశిక్షణ ఉన్న ఉద్యోగిగా కూడా గుర్తింపు పొందుతారు. -
కబడ్డీ క్రీడాకారిణిలపై వేటు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలోని ముగ్గురు కబడ్డీ క్రీడాకారిణులపై క్రమశిక్షణా రాహిత్యం కింద అసోసియేషన్ ఏడాది కాలం సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే మేనేజర్‌గా వ్యవహరించిన వ్యక్తికి కూడా ఇదే శిక్ష విధించింది. ప్రస్తుతం జిల్లా క్రీడావర్గాల్లో ఇదే విషయం హాట్‌టాపిక్‌గా మారింది. సంఘం ప్రతినిధులు, కోచ్‌లు తెలిపి న వివరాల ప్రకారం.. గత కొద్దికాలంగా ముద్దా డ గౌరి(శ్రీకూర్మం), జుత్తు భవానీ(దేశమంతుపు రం, జమ్ము), కరగాన సంధ్య (శ్రీకూర్మం, గొల్లవీధి) జిల్లా కబడ్డీ అసోసియేషన్ విధి విధానాల కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. శిక్షణ సమయంలో కోచ్‌లను అగౌరవపరుస్తూ లేనిపోని దు్రçష్పచారం చేస్తున్నారు. అలాగే ఈనెల 18 నుంచి 20 వరకు విజయనగరం వేదికగా జరిగిన 66వ ఏపీ రాష్ట్ర సీనియర్స్(పురుషులు, మహిళ ల) కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీల్లో అవమానకర రీతిలో ప్రవర్తించారు. అన్ని జిల్లాల క్రీడాకారులు, సంఘాల బాధ్యుల సమక్షంలో శ్రీకాకుళం జిల్లా పరువు ప్రతిష్టలను మంటగలిపే విధంగా వ్యవహారించడంతో సస్పెన్షన్‌కు గురయ్యారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో! పరిస్థితి చేయి దాటిపోవడంతో తీవ్రంగా పరిగణించిన జిల్లా కబడ్డీ అసోసియేషన్ పెద్దలు క్రీడాకారిణులపై వేటుకు రంగం సిద్ధమయ్యారు. అలాగే ఇదే పోటీలకు మేనేజర్‌గా వ్యవహరించి న సీనియర్ క్రీడాకారిణి పి.ఝాన్సీ(చిన్నాపురం)ని సైతం ఏడాది పాటు సస్పెండ్ చేశారు. ఇదే విషయమై శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదా నంలోని డీఎస్ఏ కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లా కబడ్డీ అసోసియేషన్ సమావేశంలో వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సస్పెన్షన్ విషయాన్ని కబడ్డీ సంఘం నాయకులు ధ్రువీకరించారు. ఈ సస్పెన్షన్ ఏడాదిపాటు ఉంటుందని కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకేని చిరంజీవిరావు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన కాపీలను డీఎస్ఏ జిల్లా కార్యాలయం, జిల్లా ఒలింపిక్ సంఘం, రాష్ట్ర కబడ్డీ సంఘం, సంఘం జిల్లా అధ్యక్షుడు గౌతు శ్యామ్‌సుందర్‌శివాజీ, స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యాలయం, జిల్లా పీఈటీ సంఘానికి చేరవేసినట్లు ఆయన తెలిపారు. వీరంతా ఎటువంటి అధికారిక కబడ్డీ పోటీలు, ఎంపికల్లో పాల్గొనేం దుకు వీలులేదని పేర్కొన్నారు. భవిష్యతులో క్రీడాకారుల్లో మార్పు కనిపించినట్లయితే సం ఘం కార్యవర్గ సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు క్రీడాకారిణుల సస్పెన్షన్ విధానాన్ని పలువురు పీఈటీలు వ్యతి రేకించినా.. కబడ్డీ సంఘం ఉనికికే విఘాతం కలిగేలా వ్యవహరించడం ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని మెజారిటీ సభ్యులు పట్టుబట్టినట్లు సమాచారం. సమావేశంలో డీఎస్ఏ కోచ్ ఎస్. సింహాచలం, సాధు శ్రీనివాసరావు, ఎం.నీలా ద్రి, టి.ఈశ్వర్రావు, రవి, రమేష్, లోకేశ్వర్‌రావు, నారాయణ, వివిధ జోన్ల ప్రతినిధులు, పీఈటీలు పాల్గొన్నారు. -
పార్టీ మారితే మంత్రి పదవులా?
సాక్షి, న్యూఢిల్లీ: భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణ నేతలపై కాకుండా రాజకీయ పార్టీలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఒక పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులను ఇంకో పార్టీలో మంత్రులను చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. చట్టసభల పనితీరు పట్ల ప్రజల్లో నమ్మకం పునరుద్ధరించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో సమగ్రమైన ప్రవర్తనా నియమావళిని రూపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా ఏడాది కాలంలో తన అనుభవాలు, చేపట్టిన కార్యక్రమాలతో ‘మూవింగ్ ఆన్, మూవింగ్ ఫార్వర్డ్: ఎ ఇయర్ ఇన్ ఆఫీస్’ పేరుతో రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. పారదర్శకత, జవాబుదారీతనం కోసమే తన ఏడాది ప్రయాణానికి పుస్తక రూపం కల్పించినట్లు వెంకయ్య తెలిపారు. ‘ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలో చేరేవారు ముందుగా రాజీనామా చేసి పార్టీ వీడాలి. లేదంటే అలాంటి వారిపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలి. నేను దీన్నే అనుసరించి ఇలాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నా. ఒక పార్టీ నుంచి ప్రజాప్రతినిధిగా గెలుపొంది ఇంకో పార్టీలో మంత్రులవ్వడం ఏంటి? ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. చట్టసభలపై ప్రజల్లో నమ్మకం కలిగేలా రాజకీయ పార్టీలు సమగ్ర నియమావళిని రూపొందించుకోవాలి’ అని వెంకయ్య పిలుపునిచ్చారు. వివక్షరహిత భారతమే లక్ష్యంగా.. లింగ, కుల, మత వివక్షను ఏ జాతీయవాదీ ఉపేక్షించబోరని, ప్రతి ఒక్కరూ ఇదే విధానాన్ని అవలంబించాలని వెంకయ్య సూచించారు. ‘మరింత సమగ్రమైన సమాజాన్ని నిర్మించే ప్రయత్నంలో అన్ని వర్గాలకు సరైన ప్రాతినిధ్యం దక్కాలి. మరీ ముఖ్యంగా ఇంతవరకు ప్రాతినిధ్యానికి దూరంగా ఉన్న వారికి అవకాశం ఇవ్వాలి. రాజకీయాలను ప్రక్షాళన చేసుకుని.. వ్యవసాయ రంగం, యువ భారతం ఆకాంక్షలకు అనుగుణంగా పార్లమెంటరీ, పాలనా వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నా దృష్టిలో భారత్‌మాతాకీ జై అంటే జాతీయవాదమే. ఇది కుల, మతాలకు అతీతంగా 130 కోట్ల మందికి జై కొట్టినట్లే’ అని వెంకయ్య పేర్కొన్నారు. భారత ఆర్థిక రంగంలో వస్తున్న మార్పులు, అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను చూసి సంబరాలు చేసుకోవాల్సిన సమయమిది. అయితే పార్లమెంటు నడుస్తున్న విధానంతోనే కాస్త అసంతృప్తి ఉంది’ అని వెంకయ్య చెప్పారు. రాష్ట్రాల్లో ఎగువసభల ఆవశ్యకతపై.. రాష్ట్రాల్లో ఎగువసభల ఆవశ్యకతపై ఓ జాతీయ విధానం అవసరం ఉందని వెంకయ్య పేర్కొన్నారు. సభ లోపల, బయట సభ్యుల ప్రవర్తనా నియమావళిపై అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో ముందుకెళ్లాలని సూచించారు. కులం, మతం ఆధారంగా ఎవరిపైనైనా వివక్ష చూపడాన్ని ఏ జాతీయవాదీ సహించబోరన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తదితరులు పాల్గొన్నారు. క్రమశిక్షణ నిరంకుశత్వమా?: మోదీ న్యూఢిల్లీ: దేశంలో నియంతృత్వం పెరిగిపోతోందంటూ విమర్శలు చేస్తున్న విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణతో ఉండమంటే నిరంకుశుడనే ముద్రవేస్తున్నారని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ.. ‘వెంకయ్యనాయుడు క్రమశిక్షణతో నడుచుకునే వ్యక్తి. కానీ క్రమశిక్షణను అప్రజాస్వామికం అని విమర్శించేలా డిక్షనరీలో అర్థాలు వెతుకుతున్నారు. ఓ వ్యక్తి క్రమశిక్షణగా ఉండాలని పిలుపునిస్తే.. ఆయన్ను నిరంకుశుడిగా ముద్రవేస్తున్నారు. కానీ వెంకయ్యనాయుడు మాత్రం ఆయన చెప్పే క్రమశిక్షణను ఆచరించి చూపిస్తారు’ అని ప్రధాని పేర్కొన్నారు. వెంకయ్య బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనతో కలసి ఒక కార్యకర్తగా పనిచేశానని, లక్ష్య సాధనలతో స్పష్టమైన ప్రణాళికలతో పనిచేస్తారని ప్రశంసించారు. ‘వెంకయ్య నాయుడుతో కలిసి ప్రయాణం చేస్తుంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆయన వాచీ పెట్టుకోరు. జేబులో పెన్ను, డబ్బులు పెట్టుకోరు. కానీ సరైన సమయానికి కార్యక్రమాలకు హాజరవుతారు. ఆయన స్వభావంలోనే క్రమశిక్షణ ఉంది’ అని మోదీ పేర్కొన్నారు. ‘వెంకయ్యకు కీలకమైన శాఖను అప్పజెప్పేందుకు నాటి ప్రధాని వాజ్‌పేయి సిద్ధమైతే.. గ్రామీణాభివృద్ధి శాఖను వెంకయ్య ఎంచుకున్నారు. అదే ప్రజలపై ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనం’ అని గుర్తుచేశారు. ‘సభ సజావుగా జరుగుతున్నప్పుడు స్పీకర్ స్థానంలో ఎవరున్నారనే దానిపై పెద్దగా దృష్టిపెట్టం. కానీ వారు ఆ స్థానంలో ఉన్నందుకే సభ ప్రశాంతంగా సాగుతుందనే విషయాన్ని మరవొద్దు’ అని మోదీ అన్నారు. -
రిటైర్మెంట్కు ఎంత అవసరం?
ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు పదవీ విరమణ దశకు చేరుకునేవారే. ఆ తర్వాత జీవితం గురించి ప్లాన్ చేసుకునే వారు కొద్ది మందే కనిపిస్తారు. ఇక విశ్రాంత జీవిత అవసరాల పట్ల శద్ధ లేకపోవడం, ప్రస్తుత అవసరాలే ప్రాధాన్యంగా భావించే వారు చాలా మంది ఉన్నారు. కొందరిలో ఆసక్తి ఉన్నా, ఎంత మొత్తం కావాలన్న దానిపై సంశయం ఉండి ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత సాఫీ జీవనం కోసం జీవితంలో వివిధ దశల్లో ఏ మేరకు ఆదా చేయాలో నిపుణుల సూచనల ఆధారంగా తెలియజేసే కథనం ఇది. రిటైర్మెంట్ నాటికి ఎంత నిధి సమకూర్చుకోవాలి, జీవితంలో ఏ వయసులో ఎంత పొదుపు చేయాలి అన్నది ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగానే ఉంటుంది. పలు రకాల వ్యయాలు, తమపై ఆధారపడిన వారి అవసరాలు, లక్ష్యాలు, ఇతర అవసరాలను ఇందుకు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తుల ఆర్థిక క్రమశిక్షణ అన్నది కూడా వేర్వేరుగానే ఉంటుందని తెలిసిందే. ఉదాహరణకు 25 ఏళ్ల వ్యక్తి తన వేతనంలో రిటైర్మెంట్ జీవితం కోసం 5 శాతం కేటాయిస్తుంటే, ఆ తర్వాత పెరుగుతున్న వేతనం స్థాయిలో రిటైర్మెంట్ కోసం కేటాయింపులు పెంచాల్సిన అవసరం లేదని లాడర్7 ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు సురేష్ సెడగోపన్ సూచించారు. ముందుగానే సేవింగ్స్ ప్రారంభించినందున కాంపౌండింగ్ ప్రయోజనంతో మంచి నిధి సమకూరుతుందని వివరించారు. అదే తొలినాళ్లలో రిటైర్మెంట్ నిధి గురించి పట్టించుకోకుండా చాలా ఆలస్యంగా పొదుపు ప్రారంభిస్తే చాలా పెద్ద మొత్తంలో పొదుపు చేయాల్సి ఉంటుందన్నారు. చిన్న వయసులో ఉన్న వారి జీవన శైలి నేడు వినియోగమయంగా మారిపోయింది. దీంతో సేవింగ్స్ పట్ల వారిలో శ్రద్ధ తక్కువే. ఖరీదైన గ్యాడ్జెట్లు, రెస్టారెంట్ విందులు, ప్రతీ దానికీ రుణాలు ఇలా ఉంటోంది వారి తీరు. ఇక ఇల్లు కొనుగోలు, లేదా కారు కొనుగోలు లేదా పెళ్లిని వైభవంగా జరుపుకోవాలన్న ఆకాంక్షల కోసంఉద్యోగ తొలి దశలో ఎక్కువ ఖర్చు చేసే వారున్నారు. దీంతో రిటైర్మెంట్ ప్రణాళిక వారి ఎజెండాలో ఉండడం లేదు. అందుకే ఎంతన్న? సందేహాన్ని పక్కన పెట్టేసి వెంటనే వేతనంలో ఎంతో కొంత మొత్తాన్ని రిటైర్మెంట్ కోసం పొదుపు చేయడం ప్రారంభించాలని సురేష్ సెడగోపన్ సూచన. 25 ఏళ్ల వయసులో కనీసం 5 శాతం మేర రిటైర్మెంట్ కోసం పొదుపు చేయడం మొదలు పెట్టాలన్నది ఓ సూత్రం. అయితే, ఈ 5 శాతాన్ని పొదుపు చేయడం కంటే ఇన్వెస్ట్ చేయడం ముఖ్యమైన అంశంగా సెడగోపన్ పేర్కొన్నారు. చిన్న మొత్తమైనా చిన్న వయసులోనే మొదలు పెటాలి. కాంపౌండింగ్ పవర్‌తో రిటైర్మెంట్ నాటికి పెద్ద మొత్తంగా మారుతుందన్నది వాస్తవం. మధ్య వయసులో: ఈ వయసులో బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. దీంతో బడ్జెట్‌పై ఒత్తిళ్లు పెరిగిపోతాయి. 35–45ఏళ్ల మధ్య వయసులో ఉన్నవారు మంచి జీవన శైలిని కొనసాగించాలన్న ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఈ తరహా ఆలోచనలు, అవసరాల ప్రాధాన్యతలకు ప్రాముఖ్యం ఇవ్వడంతో, రిటైర్మెంట్కు ప్రాధాన్యం పక్కకు వెళ్లిపోతుంటుంది. ఆదాయంలో 20 శాతం పొదుపుతో ప్రారంభించి, వారి వారి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా దాన్ని 40–50 శాతానికి క్రమంగా పెంచుకోవడం ఉత్తమం. వ్యయాలకు తగిన ప్రణాళికలు... 35ఏళ్ల వయసులో ఉన్నవారు తమ రిటైర్మెంట్కు కనీసం 10 శాతం కేటాయించుకోవాలని సెడగోపన్ సూచించారు. 25 ఏళ్ల వయసులో 5 శాతంతో మొదలు పెట్టి 35 ఏళ్ల నాటికి 10 శాతానికి పెంచుకుంటే మంచిదని, ఈ పొదుపు శాతాన్ని కనీసం 50 ఏళ్ల వరకు అయిన కొనసాగించడం ద్వారా మంచి నిధిని సమకూర్చుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈపీఎఫ్ చందాలను ఇందులోకి పరిగణనలోకి తీసుకోరాదని, అవి కాకుండానే ఈ మాత్రం రిటైర్మెంట్ కోసం పొదుపు చేసుకోవాలని సూచించారు. నిజానికి మధ్య వయసు నాటికి వేతనంలో గణనీయంగా పెరుగుదల ఉన్నప్పటికీ, ఆ వయసులో గృహ రుణం, పిల్లల విద్యా వ్యయాలు, బీమా ప్రీమియం చెల్లింపుల వంటి ఇతర అవసరాలు కూడా ఉంటాయి. అందుకే పెరిగే వేతనం స్థాయిలో రిటైర్మెంట్ కోసం పెంచుకోకపోయినా కనీసం 10 శాతమైన పక్కన పెట్టుకోవాలి. వేతనంలో రిటైర్మెంట్కు కేటాయింపులు పోను మిగిలిన మొత్తంలో 30 శాతాన్ని లక్ష్యాల కోసం పొదుపు చేసి, మిగిలిన మొత్తాన్ని ఇతర అవసరాల కోసం వినియోగించుకోవాలి. పలు లక్ష్యాల కోసం ఎంత మేర ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకుని లార్జ్‌క్యాప్ లేదా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్‌లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేసుకోవాలని నిపుణుల సూచన. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన అవసరాలు, లక్ష్యాలు ఉంటాయి. ఆ మేరకు వారివారి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని పొదుపు ప్రణాళి కలు రూపొందించుకోవాలి. వేసుకున్న ప్రణాళికకు కట్టుబడి ఉండాలి. ఇక రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్న వారికి వారి పిల్లల విద్యా సంబంధిత బాధ్యతలు కూడా ముగిసిపోవడం లేదా ముగింపులో ఉండడం చూడొచ్చు. దీంతో రిటైర్మెంట్ కోసం కొంచెం ఎక్కువ కేటాయించుకోవచ్చు. ఇది కూడా వ్యక్తులను బట్టి వేర్వేరుగానే ఉంటుంది. 30 చివర్లో లేదా 40కు సమీపంలో పెళ్లయిన వారికి పిల్లల విద్యా బాధ్యతలు ఇంకా ముగిసిపోయి ఉండవు. కొందరిలో రిటైర్మెంట్ తర్వాత బాధ్యతలు కొనసాగొచ్చు. అందుకే 50 ఏళ్లు దాటిన తర్వాత రిటైర్మెంట్ కోసం పొదుపును 15 శాతానికి పెంచుకోవాలని సెడగోపన్ సూచించారు. రిటైర్మెంట్ అయ్యే వరకు దీన్నే కొనసాగించాలన్నారు. దీనివల్ల మంచి నిధి సమకూరుతుంది. -
కాంగ్రెస్‌లో క్రమ‘శిక్ష’ణ
సాక్షి, హైదరాబాద్: పార్టీపరంగా అంతర్గత దిద్దుబాటు చర్యలకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. సార్వత్రిక ఎన్నికల నాటికి నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు, నాసిరకం నాయకత్వం లేకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా తాజాగా ఇద్దరు అధికార ప్రతినిధులపై వేటు వేసింది. పీసీసీ అధికార ప్రతినిధులు సీహెచ్ ఉమేశ్‌రావు(సిరిసిల్ల), కొనగాల మహేశ్(వేములవాడ)ను పార్టీ పదవుల నుంచి తొలగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. అధికార టీఆర్ఎస్తో లాలూచీ వ్యవహారాలు నడిపిస్తున్నారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ నియోజకవర్గాల్లో గ్రూపులను పెంచి పోషిస్తున్నారనే ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. వీరిద్దరే కాక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చాలా మంది నేతలపై పార్టీ నాయకత్వం నిఘా ఉంచిందని, పార్టీ లైన్ తప్పి వ్యవహరిస్తున్న వారందరికీ ఇదే నిర్ణయం వర్తిస్తుందని హెచ్చరికలు పంపింది. 15 రోజుల క్రితమే ఫిర్యాదులు ఉమేశ్, మహేశ్‌పై 15 రోజుల క్రితమే పార్టీ క్రమశిక్షణా సంఘానికి ఫిర్యాదులు వచ్చాయి. నియోజకవర్గంలో గ్రూపు తగాదాలకు పాల్పడుతున్నారని, డీసీసీ నిర్ణయాలకు కట్టుబడి ఉండకుండా స్వతంత్ర కార్యాచరణతో గందరగోళం సృష్టిస్తున్నారని సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత మృత్యుంజయం ఉమేశ్‌పై ఫిర్యాదు చేసినట్టు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకులతో సత్సంబంధాలను కొనసాగిస్తూ వారి వద్దకు మహేశ్ కాంగ్రెస్ నేతలను తీసుకెళుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరిపై విచారణ జరిపిన క్రమశిక్షణా సంఘం ప్రాథమిక ఆధారాలున్నాయంటూ పార్టీకి నివేదిక ఇచ్చింది. దీంతో వీరిని పార్టీ పదవుల నుంచి తొలగిస్తూ పార్టీ ఉపాధ్యక్షుడు మల్లు రవి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమగ్ర విచారణలో వీరిపై వచ్చిన ఫిర్యాదులు నిజమని తేలితే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తప్పిస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి. చాలామందిపై కూడా.. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నేతలపై పార్టీపరంగా నిఘా పెట్టామని పీసీసీ నేతలు చెబుతున్నారు. పార్టీ నియమావళికి కట్టుబడని నేతలను గుర్తించే పనిలో ఉన్నామని, త్వరలోనే వారిపైనా చర్యలుంటాయని ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు చెప్పారు. ఉమేశ్, మహేశ్ తరహాలోనే కొందరిపై ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నాటికి పార్టీపరంగా నేతలంతా ఒక్కతాటిపై ఉండేలా అవసరమైతే ఎలాంటి చర్యలకైనా సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలను పార్టీ పదవుల నుంచి తప్పించడం ఇతరులకు హెచ్చరికలు పంపడమేననే చర్చ పార్టీలో అంతర్గతంగా సాగుతోంది. -
క్రమశిక్షణతో చదవాలి
పెద్దపల్లిరూరల్ : చదువుకోసం దూర, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని మున్సిపల్ చైర్మన్ ఎల్.రాజయ్య, ఏసీపీ హబీబ్‌ఖాన్ అన్నారు. రంగంపల్లి గిరిజన వసతిగృహంలో అనాథ విద్యార్థులకు కేసీఆర్ సేవాదళ్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన అన్నదానంకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులతో సహపంక్తి భోజనం చేశారు. బీసీ, ఎస్టీ హాస్టల్లో ఉంటూ చదివే విద్యార్థులు తాము పెద్దపల్లిలోని పాఠశాలకు వెళ్లి› రావడానికి ఇబ్బందులు పడుతున్నామని చైర్మన్ రాజయ్య దృíష్టికి తెచ్చారు. ఆయన సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సీఐ నరేందర్, ఎస్సై జగదీశ్, వార్డెన్లు స్వర్ణలత, రమేశ్, కేసీఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ తదితరులున్నారు. -
లిప్ లాక్ చేస్తే ఊరుకోను!
‘దేశానికి రాజైనా తల్లితండ్రులకు కొడుకే. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఎంత పెద్ద స్టార్ అయినా పిల్లలకు మాత్రం తండ్రే. తన కుమార్తె సుహానా, కుమారుడు ఆర్యన్ క్రమశిక్షణ విషయంలో షారుక్ చాలా కఠినంగా ఉంటారు. సుహానా బాయ్‌ఫ్రెండ్‌తో, ఆర్యన్ గర్ల్‌ఫ్రెండ్‌తో క్లోజ్‌గా ఉండే ఫొటోలు గతంలో వైరల్ అయిన విషయం తెలిసిందే. పిల్లల ఫ్రెండ్షిప్, ప్రేమ వ్యవహారాలపై బాద్షా బహిరంగంగా స్పందిస్తూ ఉంటారు. ఇటీవల కూడా ఓ ఇంటర్వూ్యలో పిల్లల క్రమశిక్షణపై స్పందించి, కూతురు, కొడుక్కి హెచ్చరికలు జారీ చేశారీ కింగ్ ఖాన్. ‘‘సుహానే పెదవులను తన బాయ్ ఫ్రెండ్ ముద్దు పెట్టుకుంటే వాడి పెదాలు కోసేస్తా. ఆర్యన్ తన గర్ల్‌ఫ్రెండ్‌కి లిప్ కిస్ ఇచ్చినా, లేక గర్ల్‌ఫ్రెండే ఆర్యన్‌కు లిప్ కిస్ ఇచ్చినా వాడి పెదాలు(ఆర్యన్) కోసేస్తా’’ అని బహిరంగంగా తన పిల్లలకు వార్నింగ్ ఇచ్చారు. ‘లిప్ కిస్’ పై షారుక్ ఎందుకంత సీరియస్ అయ్యారని కొందరు విమర్శించినా, పిల్లల మంచీ.. చెడూ ఆలోచించే బాధ్యత గల తండ్రిగా ఆయన కరెక్ట్‌గానే చెప్పారని మెజారిటీ వర్గం షారుక్‌ని అభినందిస్తోంది. -
సమయపాలన... సమష్టితత్వం...
రమజాన్ కాంతులు రోజా పాటించే వారు ఉదయం వేళ నిద్ర లేచి సహర్ భుజించాలి. రోజువారీ పనులు చేసుకుంటూనే ఐదుపూటలా నమాజ్ అచరించాలి. సాయంత్రం వేళ ఇఫ్తార్‌తో ఉపవాస దీక్ష విరమించాలి. భోజనంతరం రాత్రి బాగా పొద్దుపోయే వరకు తరావీ నమాజ్‌లో పాల్గొనాలి. దీనివల్ల సహనం, సమయపాలన, క్రమశిక్షణ అలవడతాయి. రోజా అచరించే వ్యక్తి ఉదయం తాను సహర్ చేయడంతో పాటు పదిమందికీ చేయిస్తాడు. అందరితోనూ కలుపుగోలుగా వ్యవహరిస్తాడు. ఒకపెద్ద సమూహంతో ధనికుడు, పేద అనే తారతమ్యాలు లేకుండా నమాజ్ చదువుతాడు. సాయంత్రం దీక్షకులందరితో కలిసి ఉపవాసం విరమిస్తాడు. ఈ సందర్భంగా ఒకరికొకరు విందులు ఇచ్చిపుచ్చుకుంటారు. పేదలకు అన్నదానం చేస్తారు. దీన్నివల్ల సమాజంలో సమష్టితత్వం అలవడుతుంది. – మహమ్మద్ మంజూర్ -
సీపీఎంలో అసంతృప్తి సెగలు
మహేశ్వరి గార్డెన్లో అర్బన్ జిల్లా పార్టీ సభ్యుల భేటీ స్థానికత, సామర్థ్యానికి తిలోదకాలిచ్చారని విమర్శ అర్బన్ జిల్లాకు ప్రాధాన్యం లేదని నిరసన రాష్ట్ర కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం నామినేటెడ్ కమిటీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ వరంగల్ : క్రమశిక్షణ కలిగిన పార్టీగా పేరునున్న సీపీఎం (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు))లో జిల్లాల పునర్విభజన ముసలం పుట్టించింది. కొత్త జిల్లాలకు ఇటీవల నియమించిన కమిటీలపై పార్టీ సభ్యులు, కార్యకర్తలు నిరసన గళం విప్పారు. వరంగల్‌లోని మహేశ్వరీ గార్డెన్లో సమావేశమై కొత్త కమిటీల నియామకాన్ని, పార్టీలోని పరిస్థితులను తీవ్రంగా తప్పుబట్టారు. స్థానికేతరులకు, ఉద్యమ చరిత్రలేని వారికి నాయకత్వ బాధ్యతలు అప్పగించారని కార్యకర్తలు మండిపడుతున్నారు. రాష్ట్ర కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రత్యేక సమావేశం అనంతరం పార్టీ సభ్యులు స్వయంగా పత్రిక ప్రకటన జారీ చేశారు. పార్టీలోని ప్రస్తుత పోకడలను విమర్శిస్తూ లేఖలో పేర్కొన్నారు. ‘వరంగల్ అర్బన్ జిల్లా ప్రజలతో సంస్థలో జమ చేయకుండా నొక్కేశారని తెలుస్తోంది. వరంగల్ రీజియన్ పరిధి, ఆర్టీసీ వరంగల్ రూరల్ డివిజన్లోని తొర్రూరు డిపోలో సంవత్సరకాలంగా అద్దెను జమచేయకుండా నొక్కేశారని సమాచారం. తొర్రూరు డిపోలో 31 స్టాల్స్‌ను అద్దెకు ఇచ్చారు. ఈ స్టాల్స్ కేటాయించే ముందు నిబంధనల మేరకు ఆరు నెలల అద్దెను అడ్వాన్స్‌గా డిపాజిట్ చేయించుకుంటారు. ఏదేని పరిస్థితుల్లో స్టాల్స్ నిర్వాహకులు సంవత్సర కాలంగా అద్దె చెల్లించనట్లు రికార్డుల్లో చూపుతున్నా డిపో అధికారులు, బాధ్యలైన ఉద్యోగులు ఎందుకు పట్టించుకోలేదన్నది ప్రధాన ప్రశ్న. అయినా స్టాల్స్ నిర్వహిస్తున్న నిర్వాహకులపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో అద్దెను వసూలు చేసే బా«ధ్యులైన ఉద్యోగులే ఈ సొమ్ము కాజేశారని అనుమానాలు కలుగుతున్నాయి. అద్దె సొమ్మును కాజేసిన అధికారులు, ఉద్యోగులు స్టాల్స్ నిర్వాహకులను మచ్చిక చేసుకుని ఉన్నతాధికారులకు తప్పుడు సాక్ష్యం ఇప్పించేందుకు యత్నిస్తున్నారని సమాచారం. తమపై వేటు పడకుండా ఉండేందుకు అధికారులు, ఉద్యోగులు చేసిన తప్పులు కప్పి పుచ్చుకోవడానికి ఆ తప్పులను స్టాల్స్ నిర్వాహకులపై నెట్టివేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. తొర్రూరు డిపో స్టాల్స్‌కు సంబందించిన అద్దె రూ.దాదాపు 4 లక్షలు సంస్థ ఖాతాలో జమ కాకపోవడంపై ఆర్టీసీ వరంగల్ రీజియన్ అధికారులు విచారణ జరుపుతున్నారు. విచారణ సందర్భంగా తప్పుడు సాక్ష్యం ఇచ్చి తమ ఉద్యోగాలను కాపాడుకునే ప్రయత్నాలను బాధ్యులైన ఉద్యోగులు ముమ్మరం చేశారు. ఈ అక్రమాల్లో దాదాపుగా ఆరు నుంచి ఏడుగురు ఉద్యోగులపై వేటు పడనుంది. రీజియన్ అధికారుల సొమ్ము కాజేతను సీరియస్‌గా తీసుకున్నారు. అయితే అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులు.. స్టాల్స్ నిర్వాహకులచే తామే అద్దె చెల్లించలేదని చెప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సొమ్ము కాజేసిన ఉద్యోగుల్లో కొందరు సెలవులు తీసుకుని విచారణకు ఆటంకాలు కలిగిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తప్పుడు మెడికల్ సర్టిఫికెట్ తీసుకెళ్లి సెలవులు పెడుతున్నారని ఆర్టీసీ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది. ఈ మెడికల్ సర్టిఫికెట్లు ఇప్పించడంలో కొంత మంది యూనియన్ నాయకులు సహకరిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఆరు నెలలు అద్దె చెల్లించకపోతే డిపాజిట్‌గా ఉన్న సొమ్ము అద్దెగా జమ చేసుకుని స్టాల్స్ మూసి వేయాలి. అయితే ఇక్కడ మాత్రం సంవత్సర కాలంగా అద్దె చెల్లించకున్నా ఎలాంటి చర్యటూ తీసుకోలేదు. -
ఎన్‌సీసీతో క్రమశిక్షణ
- కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ కర్నూలు(హాస్పిటల్): ఎన్సీసీలో చేరితే క్రమశిక్షణ గల జీవితం అలవడుతుందని కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ అన్నారు. ఆదివారం స్థానిక బి.క్యాంపులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల మైదానంలో 68వ ఎన్సీసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ కేడెట్లు డ్రిల్, పెరేడ్ చేశారు. అనంతరం టీజీ వెంకటేష్ కళ్యాణమండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీఐజి మాట్లాడుతూ.. తాను కూడా విద్యార్థి దశలో ఎన్సీసీ కేడెట్‌గా ఉన్నానని గుర్తు చేశారు. ఎన్సీసీలో చేరడం వల్ల వ్యక్తిత్వం ఇనుమడిస్తుందని, భావవ్యక్తీకరణ, పర్సనాలిటి డెవలప్మెంట్, నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్సీసీ ఆధ్వర్యంలో నిర్వహించే సామాజిక కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఓర్వకల్లు వద్ద ఎన్సీసీ క్యాంపు కోసం 20 ఎకరాల కోసం తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సి. హరికిరణ్ మాట్లాడుతూ.. తాను చదువుకునే రోజుల్లో ఎన్సీసీ కేడెట్‌గా ఉన్నానని తెలిపారు. ఏ ఆపద, అవసరం వచ్చినా ఎన్సీసీ కేడెట్లు ముందుండి సేవ చేస్తారని కొనియాడారు. ప్రతి విద్యార్థి ఎన్సీసీలో చేరాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కర్నూలు గ్రూప్ ఎన్సీసీ కమాండర్ కల్నల్ పీజీ కృష్ణ, లెఫ్ట్‌నెంట్ కల్నల్ గౌస్‌బేగ్, సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ రాచయ్య, ఎస్టిబిసి కళాశాల ప్రిన్సిపల్ మనోరమ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ఎన్సీసీడే
-
ప్రతి రోజూ ఓ కొత్త రోజే: కోహ్లి
న్యూఢిల్లీ: ప్రతి మ్యాచ్‌లో ఎంతో కొంత మెరుగుపడాలన్న బలమైన కోరికే తనకు స్ఫూర్తిగా నిలుస్తోందని స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి అన్నాడు. ‘ప్రతి రోజూ ఓ కొత్త రోజే. ప్రతి మ్యాచ్‌లో ఎంతో కొంత మెరుగుపడటానికి అవకాశం ఉందని భావిస్తా. కష్టపడటానికి, క్రమశిక్షణకు ప్రత్యామ్నాయం లేదు’ అని కోహ్లి పేర్కొన్నాడు. ఐపీఎల్లో నిలకడగా రాణించడంపై మాట్లాడుతూ... ‘అందరు క్రికెటర్లలాగే నేను కూడా బాగా ఆడాలని కోరుకుంటా. అయితే జట్టులో స్థానంపై అభద్రతభావం ఏర్పడితే ఆ నిరాశలో తప్పులు చేస్తాం. కానీ బాగా ఆడాలని బలంగా కోరుకుంటే మాత్రం మైదానం లోపలా, బయటా ఒకే రకమైన దూకుడు చూపెట్టాలి. సమయం గడుస్తున్నకొద్ది మనం కుదురుకోవడంతో పాటు ఆటలోనూ నిలకడ వస్తుంది’ అని వ్యాఖ్యానించాడు. -
గీత దాటితే వేటే
♦ టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో కఠిన నిర్ణయం ♦ పార్టీ సీనియర్లు క్రమశిక్షణ ఉల్లంఘించినా అంతే.. ♦ పార్టీ నిర్ణయాలకు పీసీసీ అధ్యక్షుడే సర్వాధికారి ♦ ఈ నెలాఖరులోగా మండల స్థాయి దాకా కమిటీలు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ విధానానికి, క్రమశిక్షణకు వ్యతిరేకంగా ఎంత సీనియర్ నాయకుడు మాట్లాడినా వేటు వేయాల్సిందేనని టీపీసీసీ నిర్ణయించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ నూతన కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం శనివారం హైదరాబాద్‌లోని ఒక హోటల్లో జరిగింది. సమావేశానికి ఏఐసీసీ ప్రతినిధిగా ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు ప్రత్యేకంగా హాజరయ్యారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, నూతనంగా నియమితులైన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. సుమారు 6 గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పార్టీలో నెలకొన్న శూన్యత, బహునాయకత్వంతో సమస్యలు, పార్టీ నేతల ఇష్టారాజ్య ప్రకటనలు, పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం, ప్రభుత్వ వ్యవహారశైలి, పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహం వంటి అంశాలపై నేతలు అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశం వివరాలను పార్టీ ఉపాధ్యక్షులు మల్లు రవి, నాగయ్య, ప్రధాన కార్యదర్శి మహేశ్‌కుమార్ గౌడ్ గాంధీ భవన్లో మీడియాకు వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై లోతుగా అధ్యయనం చేసి భవిష్యత్ వ్యూహాన్ని ఖరారు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నా పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్లీనరీ అంటూ బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తోందని మల్లు రవి విమర్శించారు. టీఆర్ఎస్ తీరుపై ఈ నెల 27న అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. భేటీలో తీసుకున్న నిర్ణయాలివీ... ♦ ఇకపై రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన అన్ని నిర్ణయాలకు టీపీసీసీ అధ్యక్షుడే సర్వాధికారి. ♦ పార్టీ నియమాలు, నిబంధనలు, జాతీయస్థాయి విధానం, వైఖరికి వ్యతిరేకంగా ఎంత పెద్ద నాయకుడు మాట్లాడినా కఠినంగా వ్యవహరించాలి. ♦ పార్టీలో క్రమశిక్షణా సంఘాన్ని పునర్వ్యవస్థీకరించి క్రమశిక్షణారాహిత్యంపై చర్యలు తీసుకునే అధికారాలు అప్పగించాలి. ♦ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడే నేతలపై దృష్టిపెట్టాలి. ♦ నియోజకవర్గాలవారీగా కార్యకర్తల బ్యాంకును ఏర్పాటు చేయాలి. నియోజకవర్గానికి 30 మంది చురుకైన కార్యకర్తల జాబితాను రూపొందించాలి. ♦ ఒక్కో జిల్లాకు ఉపాధ్యక్షుడు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, ఆరుగురు కార్యదర్శులు ఇన్చార్జులుగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. ♦ ప్రతి మూడు నెలలకోసారి సమన్వయ, కార్యనిర్వాహక కమిటీలు సమావేశాలు నిర్వహించాలి. ♦ ఈ నెలాఖరులోగా ఖాళీగా ఉన్న జిల్లా, మండల కమిటీలను ఏర్పాటు చేయడంతోపాటు అవసరమైన ప్రాంతాల్లో వాటిని పునర్వ్యవస్థీకరించాలి. ♦ ఇప్పటిదాకా ఉన్న కార్యదర్శులు, అధికార ప్రతినిధులను రద్దు చేస్తూ కొత్తగా ఐదారు రోజుల్లోగా నియమించడానికి చర్యలు చేపట్టాలి. -
శునకాలు కావు... అంతకు మించి!
విశ్వాసం వాటి గుణం, సాహసం వాటి నైజం, క్రమశిక్షణ వాటికి అలంకారం... నేర నిరూపణ ప్రక్రియలో నిత్యం పోలీసుల వెన్నంటి ఉండి దొంగల పాలిట సింహ స్వప్నాలవి. యూనిఫాం వేసుకోని ఈ రక్షక శునకాల గురించి... వాటికి మాటలు రాకపోవచ్చు... కానీ ‘సావధన్’ అని గట్టిగా వినిపిస్తే చాలు రెండు కాళ్లపై నించుని సంసిద్ధమయ్యే సంస్కారం వాటి సొంతం. వాటికి మనంత ఆలోచన లేకపోవచ్చు... ఖాకీ చొక్కా వెనుక పరిగెత్తి చనిపోయేందుకు కూడా సిద్ధపడే తెగువ వాటికే సొంతం. ఆయుధాలు వాడడం తెలియకపోవచ్చు... దొంగల నుంచి బాంబుల వరకు ఏదైనా సరే పసిగట్టేందుకు వెనుకాడని తత్వం వాటికి మాత్రమే సొంతం. అవినీతి మకిలి అంటని పోలీసుల సరసన వాటికీ చోటు ఉంటుంది. దేశం కోసం ఊపిరి వదిలిన వీరుల సరసన ఆ దళానికీ గౌరవం ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి పోలీసు అధికారీ ఒప్పుకుంటారు. ఎందుకంటే శాఖలోని శునకాలు అంటే కేవలం జంతువులు కాదు. అంతకు మించి... - ఎచ్చెర్ల ఇదే మన దళం... టైగర్, రాణి, డాన్, లిమో, ఝూన్సీ... మన పోలీసులకు నేర నిరూపణ ప్రక్రియలో సాయపడుతున్న శునకాల పేర్లు. పేర్ల లాగానే వీటి సంరక్షణ కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. ఇవి హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందిన లే బ్రా, డాబన్మెన్ జాతి కుక్కలు. వీటిలో ఝూన్సీ నేర విభాగంలో పనిచేస్తుంది. క్లూస్ టీమ్‌లో కీలకంగా సేవలు అందిస్తుంది. దొంగతనాలు జరిగేటప్పుడు, హత్యలు, అల్లర్లు, ఇతర తీవ్ర నేరాలు జరిగేటప్పుడు నిందితులు గాలింపుల్లో పోలీసులకు సాయపడుతుంది. మిగతా నాలుగు డాగ్‌లు బాంబులు స్క్వాడ్‌తో పని చేస్తాయి. వీటికి బాంబులు నిర్వీర్యం చేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీఐపీలు సదస్సులు జరిగేటప్పుడు సభావేదికలు, ఇతర ప్రాంతాలు, వంతెనలు, కల్వర్టులు, బాంబు బెదిరింపు ఉన్న ప్రారంతాల్లో తనిఖీల్లో ఈ డాగ్ స్క్వా డ్స్ కీలకం. శిక్షణ+క్రమశిక్షణ ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వు కార్యాలయంలో వీటి కోసం ప్రత్యేకంగా ఒక బ్లాక్ నిర్వహిస్తున్నారు. నిష్ణాతులైన పోలీసులు వీటికి రోజూ శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణలో డాగ్‌లు మర్యాదగా నడుచుకోవటం, ఎదుటి వారిని గౌరవించటం, కూర్చోవటం, నిల్చోవటం, ఫైర్ జంప్, హడిల్ జంప్, గోడలు గెంతటం వంటి అంశాలపై తర్పీదునిస్తారు. ఆర్మ్డ్ రిజర్వు పోలీసులు సూరపునాయుడు, సురేష్, వీవీ రమణ, సీహెచ్ ప్రసాద్, ఆదినారాయణ ఈ డాగ్లకు నిత్యం శిక్షణ ఇస్తారు. వీరి శిక్షణ శునకాలు చూపే క్రమశిక్షణలో స్పష్టంగా తెలుస్తుంది. ఏటా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం స్థాయిలో రేంజ్ మీట్ నిర్వహిస్తారు. అందులో మూడు జిల్లాలు డాగ్‌ల పనితీరు సమీక్షిస్తారు. వెనుక బడ్డ డాగ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఎనిమిదేళ్లు గ్యారెంటీ శునకాలు రక్షణ శాఖలో కనీసం ఎనిమిదేళ్లు చురుగ్గా సేవలు అందిస్తాయి. ఈ లోపుగా కొత్త బృందాలను తయారు చేస్తూ ఉంటారు. వీటికి బీమా కూడా చేయిస్తారు. బీమా కంపెనీలు ఎనిమిదేళ్లు పాలసీలు ఇస్తాయి. ఆహారమూ ప్రత్యేకమే... వీటికి ప్రత్యేక ఆహారం ఇస్తారు. ఒక కుక్కకు నెలకు రూ. 5800 ఆహారం కోసం ఖర్చు చేస్తారు. ప్రత్యేకంగా తయారు చేసిన యాక్సీ ఆడాల్ట్, రోయల్ కెనాల్ కంపెనీలకు చెందిన ఆహారం ఇస్తారు. ఈ ఆహారం ద్వారా కుక్కలకు సరిపడే విటమిన్స్, ప్రొటీన్స్ లభిస్తాయి. -
ఎక్కం చెప్పలేదని చావబాదాడు...
ఉపాధ్యాయుడిపై కేసు నమోదు తుర్కయంజాల్: చిన్నారులను సొంతబిడ్డల్లా లాలిస్తూ.. వారికి అర్థం అయ్యేలా విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు క్రమశిక్షణ పేరుతో చావబాదుతున్నారు. క్లాసు లో అల్లరి చేశారనో, హోంవర్క్ చేయలేదనో.. తమ మాట వినలేదనో చేయి చేసుకుంటున్నారు. చదువు పేరుతో విద్యార్థులను దండిస్తే కఠిన చర్యలు తప్పవని విద్యాశాఖ హెచ్చరిస్తున్నా... ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు మాత్రం పట్టించుకోవడంలేదు. ఎక్కం చెప్పలేదని గణిత ఉపాధ్యాయుడు కొట్టడంతో విద్యార్థిని ఆసుపత్రి పాలైన ఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో జరిగింది. బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం... హయత్‌నగర్ మండలం ఇంజాపూర్ గ్రామం తుల్జాభవానీనగర్ కాలనీ నివాసి వడ్త్యా శ్రీను, సునీతల కుమార్తె అరుణ శ్రీకృష్ణదేవరాయనగర్ కాలనీ లోని కార్తికేయ కాన్సెప్ట్ స్కూల్లో 5వ తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం గణిత ఉపాధ్యాయుడు రాజు.. అరుణను 18వ ఎక్కం చెప్పమన్నాడు. తాను 18వ ఎక్కం కంఠస్థం చెయ్యలేదని... 19వ ఎక్కం నేర్చుకొచ్చానని చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన ఉపాధ్యాయుడు అరుణ మెడపై కట్టెతో కొట్టాడు. దీంతో అరుణ మెడ ఒక వైపునకు వంగి సరిగ్గా రావడం లేదు. అనంతరం తల్లిదండ్రులకు చెప్పవద్దని బెదిరించి.. నొప్పి తగ్గడానికి మాత్రలు తెచ్చి ఇచ్చాడు. రెండు రోజుల నుంచి ఇలా నొప్పిని భరిస్తూనే అరుణ పాఠశాలలో జరుగుతున్న పరీక్షలకు హాజరవుతోంది కాని తల్లిదండ్రులతో చెప్పలేదు. బుధవారం మధ్యాహ్నం నొప్పి తీవ్రం కావడంతో భరించలేక ఏడుస్తూ తండ్రి శ్రీనుకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే శ్రీను ఏఐఎస్ఎఫ్ విద్యార్థి విభాగం నాయకుడు గ్యార క్రాంతికుమార్ని తీసుకుని పాఠశాలకు వెళ్లి.. తమ పాపను ఎందుకు కొట్టారని నిల దీశాడు. దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం అరుణను హస్తినాపురంలోని డెల్టా ఆసుపత్రిలో చేర్పిం చింది. డాక్టర్లు బాలికకు పలు పరీక్షలు చేసి చికిత్సలందిస్తున్నారు. అనంతరం డాక్టర్ రమేష్ మాట్లాడుతూ.. కట్టెతో కొట్టడం వల్ల అరుణ మెడ నరం పట్టుకుందని, ఆమెకు ఎలాంటి అపాయం లేదన్నారు. కాగా బాలికను కొట్టిన ఉపాధ్యాయుడు రాజు పాఠశాలకు సెలవుపెట్టి, ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. పూర్తి వైద్యం చేయించాలి: ఏఐఎస్ఎఫ్ విద్యార్థిని అరుణకు పూర్తి వైద్య ఖర్చులను పాఠశాల యాజమాన్యం భరించాలి. అదే విధంగా విద్యార్థినిని కొట్టి, వెకిలి చేష్టలతో దూషించిన ఉపాధ్యాయుడు రాజుపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకుడు గ్యార క్రాంతి కుమార్ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుడిపై క్రిమినల్ కేసులు పెట్టాలి సిటీబ్యూరో: ఎక్కం చెప్పలేదని విద్యార్థినిని చితకబాదిన ఉపాధ్యాయుడు రాజును అరెస్టు చేయాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధరావు బుధవారం డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుడిపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎందుకిలా ఉన్నావ్ ... ‘నువ్వు ఎందుకిలా బండలా ఉన్నావ్..... 5వ తరగతిలోనే నా అంత ఎత్తు పెరిగావు’... అంటూ గణితం టీచర్ రాజు అసభ్యంగా వెకిలి చేష్టలతో దూషించే వాడని బాధిత విద్యార్థిని అరుణ తెలిపింది. -
లావుగా ఉన్నా...నవ్వక పోయినా తప్పే
ప్రజల్ని క్రమశిక్షణా మార్గంలో నడిపించేందుకు ప్రపంచంలోని అన్ని దేశాలూ చట్టాల్ని అమలు చేస్తాయి. ఒక్కో దేశంలో ఒక్కో రకమైన చట్టం అమల్లో ఉంటుంది. స్థానిక అవసరాలు, సంస్కృతి, సంప్రదాయాల దృష్ట్యా అనేక దేశాలు తమ చట్టాల్ని రూపొందించుకుంటాయి. చట్టాల్లోని ఈ వైవిధ్యం మూలంగా ఒక దేశంలో నేరం కాని పని, మరో దేశంలో శిక్షార్హమైనది కావొచ్చు. అందుకే కొన్ని దేశాల్లోని చట్టాలు వింతగా అనిపిస్తాయి. అలా ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న కొన్ని వింత చట్టాల గురించి తెలుసుకుందాం.. అధిక బరువూ తప్పే.. సుమో రెజ్లింగ్‌కు ప్రసిద్ధి చెందిన దేశం జపాన్. అధిక బరువు కలిగిన వారితో సుమో రెజ్లింగ్ నిర్వహించే జపాన్ ఓ కొత్త చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం 45-74 ఏళ్లు కలిగిన పౌరులు ఎవరైనా అధిక బరువు కలిగి ఉండడం నేరం. ఈ వయసున్న ప్రజల నడుము చుట్టు కొలత 32 అంగుళాలు దాటితే నేరంగా పరిగణిస్తారు. అయితే ఇలాంటివాటికి అధికారులు పెద్దగా జరిమానాలు, శిక్షలు విధించడం లేదు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చట్టం తెచ్చినట్లు జపాన్ వెల్లడించింది. మధుమేహం, రక్తపోటు వంటి అనేక వ్యాధులకు స్థూలకాయం కారణమవుతున్న దృష్ట్యా ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో జపాన్ ఈ చట్టం చేసింది. పెట్రోల్ అయిపోతే జరిమానే.. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు మధ్యలో ఇంధనం అయిపోవడం, వాహనాలు ఆగిపోవడం మన దేశంలో సర్వ సాధారణం. కానీ జర్మన్‌లోని ఆటోబాన్ హైవేపై మాత్రం ఇంధనం అయిపోయి వాహనాలు ఆగిపోతే జరిమానా చెల్లించాల్సిందే. నిత్యం ఎక్కువ వాహనాలు ప్రయాణించే ఈ హైవేపై ఎలాంటి స్పీడ్ లిమిట్ లేదు. వాహనదారులు తమకు నచ్చిన వేగంలో వెళ్లొచ్చు. అతివేగంతో వాహనాలు వెళ్తుంటాయి కాబట్టి రహదారిపై ఎలాంటి వాహనమూ ఆపడానికి వీల్లేదు. అత్యవసర పరిస్థితుల్లోనే ఈ మార్గంలో వాహనాల్ని నిలిపి వేయాలి. ఇంధనం అయిపోయి వాహనాల్ని నిలిపి ఉంచినా నేరంగానే పరిగణిస్తారు. నవ్వుతూ ఉండాల్సిందే.. సంతోషం కలిగినప్పుడు నవ్వుతూ ఉండడం, బాధలో ఉన్నప్పుడు విచార వదనంతో ఉండడం మనుషుల సహజ స్వభావం. ఎవరికైనా సమస్యలుంటే వారు మూడీగానే ఉంటారు. మీ మూడ్ బాగోలేకపోతే మూడీగా ఉండడం ఎక్కడైనా కుదురుతుందేమో కానీ ఇటలీలోని మిలాన్ నగరంలో మాత్రం కుదరదు. ఎందుకంటే అక్కడి చట్టం ప్రకారం మిలాన్ నగరంలో ఉన్న వారెవరైనా నిత్యం నవ్వుతూ ఉండాల్సిందే. పెదవులపై ఎప్పుడూ చిరునవ్వుని చెదరనివ్వకూడదు. ఒకవేళ ఎవరైనా మూడీగా ఉన్నట్లు కనిపిస్తే వారికి అక్కడి అధికారులు జరిమానా విధిస్తారు. అంత్యక్రియల సందర్భంగా, ఆసుపత్రులకు వెళ్లినప్పుడు మాత్రమే అక్కడ విచార వదనంతో ఉండవచ్చు. అంతకుమించి మరెక్కడైనా మూడీగా కనిపిస్తే స్థానిక చట్టాల ప్రకారం జరిమానా చెల్లించాల్సిందే. బల్బు మార్చాలన్నా... మీ ఇంట్లో విద్యుత్ బల్బు పాడైతే ఏం చేస్తారు? వెంటనే మీరే ఇంకో బల్బు మార్చేస్తారు కదూ. సాధారణంగా ఇలాంటి చిన్న పనులకు ఎలక్ట్రిషియన్‌ను పిలవరు. అనవసర ఖర్చు కాబట్టి. మనదేశంలోనైతే పర్లేదు కానీ ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో మాత్రం ఇలా ఎవరికి వారే ఇంట్లోని బల్బును మార్చేస్తామంటే కుదరదు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో విద్యుత్ బల్బును మార్చాలన్నా సరే సుశిక్షితులైన ఎలక్ట్రిషియన్‌ను పిలవాల్సిందే. స్థానిక చట్టం ప్రకారం లెసైన్స్ కలిగిన ఎలక్ట్రిషియన్ మాత్రమే విద్యుత్ బల్బును మార్చాల్సి ఉంటుంది. పొరపాటున చిన్న పనే కదా అని సాధారణ ప్రజలు ఎవరైనా బల్బును మారిస్తే వారికి పది ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా విధిస్తారు. ఇది ఎప్పటినుంచో అమలవుతున్న చట్టం. దీన్ని అక్కడి ప్రజలు తప్పనిసరిగా అనుసరిస్తున్నారు. విద్యుత్ సంబంధిత పనులను లెసైన్స్ ఉన్న ఎలక్ట్రిషియన్లే చేపట్టాలనేది అక్కడి చట్టం. నో బిల్.. ప్రపంచంలోని అనేక దేశాల్లో హొటళ్లు, రెస్టారెంట్లలో భోజనం చేసిన తర్వాత బిల్లు చెల్లించడం మామూలే. వడ్డించిన ఆహారం తక్కువైనా, కడుపునిండా తిన్నా, తినకున్నా అడిగినంత బిల్లు చెల్లించాల్సిందే. కానీ డెన్మార్క్‌లో మాత్రం ఇందుకు భిన్నమైన విధానం అమల్లో ఉంది. స్థానిక చట్టం ప్రకారం అక్కడి రెస్టారెంట్లలో భోజనం చేసిన వారెవరైనా తమకు వడ్డించిన ఆహారం చాల్లేదనిపిస్తే బిల్లు చెల్లించనవసరం లేదు. ఒకవేళ కడుపునిండా తిని సరిపోలేదని చెప్పినా ఎవరూ ఏమీ పట్టించుకోరు. ఆయా రెస్టారెంట్లలో ఎవరికి వారు తమకు ఆహారం సరిపోలేదనిపిస్తే బిల్లు చెల్లించకుండానే వెళ్లిపోవచ్చు. ఆతిథ్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే దేశం కాబట్టి డెన్మార్క్‌లో ఈ చట్టం అమల్లో ఉంది. పిల్లలు ఎవరైనా కార్లో నిద్రపోతున్నారో లేదో చూసుకోకుండా అక్కడ కార్ స్టార్ట్ చేస్తే దాన్ని కూడా డెన్మార్క్‌లో నేరంగానే పరిగణిస్తారు. -
చనిపోతానని బెదిరిస్తున్నాడు... ఎలా?
కిడ్స మైండ్‌స మా బాబు మూడో తరగతి చదువు తున్నాడు. చాలా తెలివైనవాడు. కాకపోతే చాలా తిక్క. చిన్న మాట అంటే చాలు... ఉక్రోషం వచ్చేస్తుంది. ఓ మూలకు పోయి ఏడుస్తుంటాడు. ఎంత బతిమాలినా ఆపడు. దగ్గరకు రాడు. మాట్లాడడు. తినమంటే తినడు. గంటల పాటు అలాగే బిగుసుకుపోతాడు. మళ్లీ తనంతట తను రావాలే తప్ప, మేం ఏం చేసినా మామూలవడు. ఈ పద్ధతి ఎలా మార్చాలో చెప్పండి ప్లీజ్. - సునంద, రైల్వే కోడూరు బాబు అలిగినప్పుడు బతిమాలడం బాగా అలవాటయినట్టుగా ఉంది. మీరు డిసిప్లిన్ నేర్పుతున్నప్పుడు తనకి ఇంత ఉక్రోషం రావడం మంచిది కాదు. ఇకపై కొన్నాళ్లు బతిమాలడం మానెయ్యండి. తను అలిగినప్పుడు ఇక చాలు రమ్మని పిలవండి. రాకపోతే మళ్లీ పిలవం అని కూడా చెప్పండి. అయినా తను అలానే ఉంటే... ఎవరూ తనని లక్ష్యపెట్టకుండా మీ పని మీరు చేసుకోండి. మొదట్లో మీరలా చేయడం చూసి ఇంకా ఎక్కువ అలగొచ్చు. ఎక్కువ బిగుసుకుపోవచ్చు. అయినా మీరు కంగారు పడకుండా అలాగే వదిలెయ్యండి. కొన్ని రోజులకు తనలో తప్పక మార్పు వస్తుంది. అలిగినా అటెన్షన్ దొరకదని అర్థమై నెమ్మదిగా మానేస్తాడు. ఇలా జరగడానికి ఒకట్రెండు నెలలు పట్టవచ్చు. కానీ మీరు ఓపిగ్గా ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది. మా పాప వయసు నాలుగేళ్లు. విపరీతమైన అల్లరి చేస్తోంది. ఆ వయసులో అల్లరి మామూలే కానీ తను చేసే పనులు మరీ ఇబ్బందికరంగా ఉంటున్నాయి. లేని పోని ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీ ఎక్కి, టేబుల్ మీద ఉన్న వంటకాల్లో అవీ ఇవీ కలిపేస్తుంది. కిందకి ఉన్న స్విచ్‌బోర్డుల దగ్గరకు వెళ్లి, ప్లగ్ హోల్స్‌లో వేళ్లు పెడుతుంది. మొన్న బొమ్మలో ఉండే చిన్న బ్యాటరీలు మింగేసింది. ఇంకోసారి మా అత్తయ్యగారి బీపీ ట్యాబ్లెట్ మింగేసింది. ఎంత జాగ్రత్తగా చూసినా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. తనని ఎలా అదుపు చేయాలి? - కృష్ణజ్యోతి, రామచంద్రపురం పాప బాగా హైపర్ యాక్టివ్‌గా ఉంది. ముందు ఇంటిని చైల్డ్ ప్రూఫ్ చెయ్యడానికి ప్రయత్నించండి. ప్లగ్స్కి కవర్స్ దొరకుతాయి. వాటితో మూసేయండి. మందులు తనకు అందనత్త ఎత్తులో పెట్టండి. వీలైతే అల్మరాలో పెట్టి తాళం వేసేయండి. కత్తులు, చాకులు లాంటి పదునైన వస్తువుల్ని కూడా పైన ఎక్కడైనా పెట్టుకోండి. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి పిల్లలు వాటిని చేజిక్కించు కుంటారు. కాబట్టి తన మీద ఓ కన్నేసి ఉంచడం మంచిది. మరీ ఇబ్బందిగా, భయంగా ఉంటే... చైల్డ్ సైకియాట్రిస్తు దగ్గరకు తీసుకెళ్లండి. వాళ్లు కౌన్సెలింగ్ ఇస్తారు. తద్వారా తన యాక్టివిటీ నిదానంగా తగ్గుతుంది. అప్పటికీ తగ్గకపోతే కనుక, తనకి అటెన్షన్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఉందేమో పరీక్షించాల్సి ఉంటుంది. మా బాబు ఏడో తరగతి చదువుతున్నాడు. ఇంతకు ముందు చక్కగా చదివేవాడు. కానీ ఈమధ్య సరిగ్గా చదవడం లేదు. ఏమైనా అంటే ఇంట్లోంచి వెళ్లిపోతాను, చచ్చిపోతాను అని బెదిరిస్తున్నాడు. దాంతో చిన్నమాట అనాలన్నా భయమేస్తోంది. కూర్చోబెట్టి చాలాసార్లు కూల్‌గా మాట్లాడి చూశాను. అప్పుడు నువ్వు చెప్పినట్టే వింటానమ్మా అన్నాడు. కానీ మళ్లీ మామూలే. ఇంత చిన్న వయసులో బెదిరించాలన్న ఆలోచన వచ్చిందంటే, నిజంగానే ఏమైనా చేసుకుంటాడేమోనన్న భయం పీడిస్తోంది. ఇప్పుడు నేనేం చేయాలి? - మురళీశర్మ, బెంగళూరు పిల్లలు చదవలేదని కంగారు పడిపోతాం తప్ప దానికి కారణం ఏమిటో చాలాసార్లు ఆలోచించం. ఎప్పుడూ చదివే వాడు ఇప్పుడు సడెన్‌గా మానేశాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. స్కూల్లో టీచర్స్‌తో కానీ, ఫ్రెండ్స్‌తో కానీ ఏదైనా ఇబ్బంది ఉండవచ్చు. ఏదైనా ఒత్తిడి ఉండవచ్చు. లేదంటే క్లాస్ పెరిగింది కాబట్టి పాఠాలు కష్టంగా అనిపిస్తూ ఉండవచ్చు. కారణం తెలుసుకోకుండా ఫోర్స్ చేస్తే పిల్లలు మరింత ఒత్తిడికి లోనవుతారు. కాబట్టి ముందు కారణం తెలుసుకునే ప్రయత్నం చేయండి. తన సమస్యను తీరిస్తే బాగా చదువుకో గలుగుతాడు. ఇక బెదిరించడం గురించి. నిజంగా చనిపోవాలని ఉందా లేకపోతే కోపంలో తెలియకుండా ఆ మాట అనేస్తున్నావా అని ఓసారి తనని అడగండి. ఏం చెబుతాడో చూడండి. జవాబు ఏదైనా కూడా ఓసారి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే, తనలో సూసైడల్ టెండెన్సీ ఏమైనా ఉందేమో చూసి, అవసరమైతే కౌన్సెలింగ్ ఇస్తారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే తీసుకెళ్లండి. -
ఎంత వినయం ! ఎంత సంస్కారం !
-
పతకాల ‘పల్లె’
క్రమశిక్షణకు వారు మారుపేరుగా నిలుస్తారు. సోదరభావంతో మెలుగుతారు. సేవా కార్యక్రమాలలో ముందుంటారు. ఆ విద్యార్థులు మారుమూల గ్రామం నుంచి జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభను చూపుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. దీనతంటికి కారణం వారు స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో చేరడమే. ఉపాధ్యాయుల నిర్వి రామ కృషి, గ్రామస్తుల సహకారంతో విద్యార్థులు రాజ్యపురస్కార్ అవార్డును అందుకున్నారు. సేవామూర్తుల ముల్లె - స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో రాణిస్తున్న ‘గిద్ద’ విద్యార్థులు - క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్న హైస్కూల్ సదాశివనగర్: సదాశివనగర్ మండలంలోని ‘గిద్ద’ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు స్కౌట్స్ అండ్ గైడ్స్‌గా చేరి ‘ఉత్తములు’గా రూపొందుతున్నారు. ఈ పా ఠశాలలో మొదటగా 2009లో స్కౌట్స్ అండ్ గైడ్స్‌ను ప్రారంభించారు. ప్రారంభంలో విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. కార్యక్రమాలు కూడా మొక్కుబడి గా సాగేవి. ఈ క్రమంలో సౌజన్యకుమా ర్ అనే ఉపాధ్యాయుడు 2008-2009లో పాఠశాలకు వచ్చారు. ఆయన స్కౌట్ మాస్టర్ కూడా కావడంతో విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. దేవుళ అనే మరో ఉపాధ్యాయుడు అసిస్టెంట్ స్కౌట్ మా స్టర్‌గా వ్యవహరించారు. వీరిద్దరు కలిసి బాలబాలికలను మెరికలుగా తీర్చిదిద్దా రు. వారి చేత నిత్య సాధన చేయిస్తూ, జా తీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచేలా చేశారు. జంబోరీలో గ్యాడ్జెట్స్ నిర్మాణం, కలర్ పార్టీ, మార్చ్ ఫాస్ట్, అడ్వెంచర్ యాక్టివిటీ, సిగ్నలింగ్, టవర్ విల్డింగ్, యూత్ కాంగ్రెస్, భారత్ నిర్మాణ్, ఫుడ్‌ప్లాజా, స్కిల్ ఓ-రమ వంటి అంశాలలో విద్యార్థులు తిరుగులేని నైపుణ్యాన్ని సాధించారు. చిరస్మరణీయమైన విజయాలనెన్నింటినో అందుకున్నారు. పతకాల మీద పతకాలను సాధించారు. ఊరి పేరు ను నిలిపి, జిల్లా ప్రతిష్టను సరిహద్దులు దాటించారు. సామాజిక కార్యక్రమాలతో మొక్కల పెంపకం, పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ ని షేధం, పార్థీనియం మొక్కల నివారణ, మరుగుదొడ్ల నిర్మాణం, వాడకంపై ప్రచారం, వయోజన విద్య, నీటి పారిశుధ్యంపై అవగాహన తదితర సేవా కార్యక్రమాలలో స్కౌట్లు, గైడ్లు పాలుపంచుకుంటున్నారు. సాధించిన విజయాలు ⇒ 2009 నవంబర్ 22న హైదరాబాద్‌లోని జీడిమె ట్ల ‘పెట్రో లీడర్ క్యాంప్ స్టేట్ ట్రైనింగ్ సెంటర్’ నిర్వహించిన శిబిరంలో నరేశ్, శ్రీకాంత్ ప్రతిభను చూపారు. ⇒ 2010 జనవరి 26న రిపబ్లిక్‌డే పరేడ్‌లో పాఠశాల నుంచి నలుగురు స్కౌట్లు, నలుగురు గైడ్స్ పాల్గొన్నారు. ⇒ 2010 నవంబర్ 15నుంచి 19వరకు పాఠశాలలో 120మంది స్కౌట్స్, 10మంది గైడ్స్‌తో, స్కౌట్ మాస్టర్లతో సన్నాహక శిబిరం నిర్వహించారు. ⇒ 2010 డిసెంబర్ 22న హైదరాబాద్‌లో జరిగిన జంబోరీకి గిద్ద పాఠశాల నుంచి 21 మంది గైడ్స్, 25మంది స్కౌట్స్, ఇద్దరు స్కౌట్ మాస్టర్లు హాజరయ్యారు. ⇒ 2010 ఫిబ్రవరిలో నిర్వహించిన రాజ్యపురస్కార్ టెస్టింగ్ శిబిరంలో నలుగురు విద్యార్థులు గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ⇒ అడ్వెంచర్ విభాగంలో 36 అంశాలలో పోటీ పడి 25 మంది బంగారు పతకాలు, 20 మంది వెండి పతకాలు సాధించారు. ⇒ జాతీయ స్థాయి మార్చింగ్ కాంపిటేషన్‌లో రాష్ట్రం నుంచి 45 మంది ఎంపిక కాగా, అందులో 25 మంది స్కౌట్స్, గైడ్స విద్యార్థులు గిద్ద పాఠశాలకు చెందినవారే. ⇒ పీస్ మార్చ్‌లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వేషధారణలో విద్యార్థులు ఆకట్టుకున్నారు. ⇒ ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా మద్ధికుంట జాతర, పోసానిపేట్ జాతరలో సేవలు అందిస్తారు. -
కొండమల్లెల నడుమ కొత్త పరిమళం...
కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. కొన్ని సంఘటనలు మనలోకి మనం ప్రయాణించేలా చేసి కొత్తదారిని కనుక్కునేలా చేస్తాయి. రోడ్డు ప్రమాదానికి గురైన డా.మాలా శ్రీకాంత్...ఆ ప్రమాదాన్ని గుర్తు తెచ్చుకొని బాధ పడ్డారో లేదో తెలియదుగానీ... తనలోకి తాను ప్రయాణించారు. కొత్తదారిలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. పుట్టింది బెంగాల్లో అయినా తండ్రి వృత్తిరీత్యా దేశంలోని వివిధ ప్రాంతాలలో చదువుకున్నారు. మిలిటరీ అధికారి కుమార్తె అయిన మాల తండ్రి నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నారు. తల్లి చెప్పే కథల్లో నుంచి దయాగుణాన్ని అలవర్చుకున్నారు. రకరకాల ప్రాంతాలలో చదువుకోవడం వల్ల రకరకాల వ్యక్తులతో, సంస్కృతి, సంప్రదాయాలతో పరిచయం ఏర్పడింది. వైద్యవిద్యను అభ్యసించిన మాల వృత్తిలో భాగంగా ఒమన్ వెళ్లారు. అక్కడి ఎడారి గ్రామాల్లో ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రజలతో మరింతగా కలిసిపోవడానికి అరబిక్ నేర్చుకొని దానిలో పట్టు సాధించారు. ‘ప్రజల డాక్టర్’గా పేరు తెచ్చుకున్నారు. పుష్కరం తర్వాత మన దేశానికి తిరిగివచ్చి ‘వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్’లో ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా చేరారు. ఢిల్లీలో ‘క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా’ ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా పని చేస్తున్న సమయంలో మాల రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తృటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదం వల్ల ఆమె శారీరకంగా, మానసికంగా దెబ్బ తిన్నారు. జ్ఞాపకశక్తి దూరమై పోయింది. మెల్లగా కోలుకోవడం ప్రారంభమైన తరువాత- ‘‘ఇది నాకు రెండో జీవితం’’ అనుకున్నారు. జీవితం అంటే ఏదో ఒక రకంగా జీవించడం కాదని, ఒక మంచి పని కోసం జీవించడమనే తత్వాన్ని గుర్తు తెచ్చుకున్నారు. ఈ సరికొత్త జీవితంలో తన గురించి, పిల్లల గురించి, బంధువుల గురించి ఆలోచించడం కాకుండా పదిమందికి ఉపయోగపడే పనుల గురించి ఆలోచించాలనుకున్నారు. తన ఇంటిని ఢిల్లీ నుంచి ఉత్తరఖండ్ రాష్ట్రం ఆల్మోరా జిల్లాలో ఉన్న రాణిఖేత్ అనే హిల్‌స్టేషన్‌కి మార్చారు. ‘‘ఈ వయసులో ఒంటరిగా ముక్కూముఖం తెలియని వారి మధ్య...’’ అని సన్నిహితులు నసిగారు. కానీ ఆ అభ్యంతరాలను మాల పట్టించుకోలేదు. కొత్త ప్రదేశాలకు వెళ్లడం, వారితో కలిసిపోవడం ఆమెకు కొత్త ఏమీ కాదు. అందుకే ధైర్యంగా ముందడుగు వేశారు. రాణిఖేత్ కొండ ప్రాంతంలో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. చిన్నప్పటి నుంచి రకరకాల అల్లికలు అంటే మాలకు ఎంతో ఇష్టం. ఆ అల్లికలే చాలామంది జీవితాల్లో వెలుగు నింపుతాయని ఆమె ఊహించి ఉండరు. కొండ ప్రాంత మహిళలకు చాలా అల్లికలు వచ్చు. వారి ఉత్పత్తులకు మార్కెట్ కలిపించడానికి గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగినా మార్కెట్లో వాటికి ‘‘నాణ్యత లేదు’’ అనే మాట తరచుగా వినిపించేది. ఈ నేపథ్యంలో సరికొత్త అల్లికలను నేర్చుకొని, తాను నేర్చుకున్న వాటిని అక్కడి మహిళలకు చెప్పడం మొదలుపెట్టారు మాల. దీంతో మునపటి కంటే ఎక్కువ ఉత్సాహం, నైపుణ్యంతో రాణిఖేత్ మహిళలు రకరకాల అల్లికలు చేపట్టేవారు. మార్కెట్లో వాటికి డిమాండ్ పెరగడం మొదలైంది. ‘‘ఇక్కడి ప్రజలకు కష్టపడే తత్వం ఉంది. దానికి నైపుణ్యం తోడైతే తిరుగేముంది? అనుకున్నాను. అందుకే అల్లికలలో కొత్తవి, నాణ్యమైనవి నేర్చాను. నేర్పాను’’ అంటారు మాల. ‘‘ఆమె రావడానికి ముందు చాలా విషయాలు తెలిసేవి కావు. ఇప్పుడు చాలా విషయాల మీద అవగాహన పెరిగింది’’ ‘‘డాక్టర్‌గారు ఇక్కడికి రావడానికి ముందు అల్లిక అనేది అభిరుచిగానే ఉండేది. దాన్ని ఆర్థికంగా ఉపయోగపడేటట్లు చేశారు. స్వయం సహాయక గ్రూపులు స్థాపించారు’’ రాణిఖేత్ మహిళలను కదిలిస్తే మాల గురించి ఇలాంటి ప్రశంసలు ఎన్నో వినిపిస్తాయి. అల్లికలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను కూడా ఆమె అందరికీ అర్థమయ్యేలా చెబుతారు. రాణిఖేత్ వాసులలో ఆరోగ్యస్పృహ కలిగించడానికి తన వంతుగా ప్రయత్నిస్తున్నారు మాల. పట్టణాలలో రణగొణ ధ్వనులకు అలవాటు పడిన ఆమె చెవులకు రాణిఖేత్‌లోని ప్రశాంతత, పచ్చదనం అంటే ఎంతో ఇష్టం.ప్రకృతి అందాలే కాదు స్థానిక ప్రజలతో బాగా కలిసి పోవడం, వారు చెప్పే విషయాలు వినడం అంటే కూడా ఆమెకు ఎంతో ఇష్టం. ప్రస్తుతం తన మనసులో ఒక నవల రూపుదిద్దుకుంటుంది. అది అక్షరాల్లోకి వస్తే...వైద్యురాలిగా, నలుగురికి దారి చూపే వ్యక్తిగా పరిచయమైన మాల శ్రీకాంత్ రచయిత్రిగా కూడా పరిచయమవుతారు. -
కూతురు అల్లరి చేస్తోందని పోలీసులకు ఫోన్
ఫ్లోరిడా: పిల్లలు అల్లరి చేస్తే పెద్దలు ఏం చేస్తారు. అల్లరి చేయొద్దని మందలిస్తారు. ఇంకా మాట వినకుంటే నాలుగు తగిలిస్తారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ వ్యక్తి ఇందుకు భిన్నంగా వ్యవహరించాడు. తన కూతురు అల్లరి మాన్పించాలంటూ ఏకంగా పోలీసులకు ఫోన్ చేశాడు. క్రమశిక్షణతో మెలిగేలా చూడాలని అభ్యర్థించాడు. 12 ఏళ్ల తన కుమార్తె చెప్పిన మాట వినడడం లేదని, ప్రతివిషయానికి గొడవ పడుతోందని పోలీసులకు చెప్పాడు. గతవారం సోదరితో వాగ్వాదానికి దిగిందని వాపోయాడు. పిల్లలను హింసిస్తే నేరం అవుతుందన్న ఉద్దేశంతో పోలీసులకు ఫోన్ చేసినట్టు వెల్లడించాడు. తన కుమార్తెను క్రమశిక్షణలో పెట్టాలని కోరాడు. ఈ విషయంలో ఏం చేయాలో తెలియక పోలీసులు తెల్లమొహం వేశారు. -
లాలనగా... పాలనగా..!
కొంతమంది తల్లితండ్రులు పిల్లలను బాల్యం నుంచి చాలా క్రమశిక్షణతో పెంచాలనుకుంటారు. వాళ్లు కదిలితే తప్పు, మెదిలితే తప్పు అన్నట్టుగా చూస్తుంటారు. వారు ఏ మాత్రం అల్లరి చేసినా, కాల్చేసేలా చూస్తారు. అవసరమైతే నాలుగు తగిలిస్తారు. అయితే చిన్నప్పటి నుంచి తలిదండ్రుల దండనతో పెరిగిన పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలలో లోపాలు చోటు చేసుకుంటాయని మానసిక శాస్త్రవేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణులు హెచ్చరిస్తున్నారు. బడిలో ఉపాధ్యాయుల కర్రపెత్తనం వచ్చిన పిల్లలు అమ్మానాన్నలను చూడగానే ఆనందంతో ఎగిరి గంతులు వేసేలా ఉండాలి కానీ, పెద్దపులిని చూసి భయపడినట్లు ఉండటం అటు పిల్లలకే కాదు, ఇటు పెద్దలకూ మంచిది కాదని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా వారు తలిదండ్రుల ప్రవర్తన- పిల్లల ఎదుగుదలపై చేసిన సర్వేలు వెల్లడిస్తున్నాయి. పిల్లలను ప్రేమగా చూస్తూ, వారిని ఆప్యాయంగా అక్కున చేర్చుకునే తల్లితండ్రులను చూసి ‘స్ట్రిక్ట్ పేరెంట్స్’ తప్పు పడుతుం టారు. పిల్లలకు చనువిస్తే చంకనెక్కి కూచుంటారని, చెప్పిన మాట వినరని అంటుంటారు. కానీ, వారి వాదన తప్పని విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. చైనాలోని ప్రతిష్ఠాత్మక సర్వే సంస్థ హంగ్జువా ఏమి చెబుతోందంటే - తల్లితండ్రులు పిల్లలను క్రమశిక్షణతో పెంచాలని కోరుకోవటంలో తప్పు లేదు, అయితే అది మోతాదు మించి, పిల్లల పాలిట క్రమ‘శిక్ష’ణలా పరిణమించకూదు. దాని మూలంగా వారి లేత మనస్సులు తీవ్రమైన ఒత్తిడి కి గురై, పక్కతడపటం, నత్తిగా, నంగి నంగిగా మాట్లాడటం, పక్కచూపులు చూడటం, బిక్కచచ్చిపోవటం వంటి ప్రవర్తనా లోపాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి తల్లితండ్రులు తమ పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకోవాలి తప్పితే, కోపంతో దండించకూడదు. అల్లరి చేసినప్పుడు సున్నితంగా హెచ్చరించాలి. మారాం చేసినప్పుడు మెల్లగా బుజ్జగించాలి. దానివల్ల క్రమంగా పిల్లలే తమ తప్పును తెలుసుకుని దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. అలా పెరిగిన పిల్లలు తాము పెద్దయ్యాక తోటివారితో కూడా ప్రేమగా మెలగుతారని సర్వేలు చెబుతున్నాయి. -
లక్ష్యం+క్రమశిక్షణ=ఎన్సీసీ
ఖమ్మం స్పోర్ట్స్: యువతకు క్రమశిక్షణ నేర్పి వారి జీవన విధానంలో మంచి మార్పులు తెస్తున్న అంశాల్లో ఎన్సీసీ(నేషనల్ క్యాడెట్ క్యాప్స్)ది ప్రముఖ స్థానం. విద్యార్థుల్లో దేశాభక్తి, జాతీయ భావం. ధైర్య సాహసాలు పెంపొందించే లక్ష్యంతో ఇది ఏర్పాటైంది. లక్ష్యంతో కూడుకున్న జీవన విధానానికి బాటలు చూపడం ఎన్సీసీ ప్రత్యేకత. ప్రతి సంవత్సరం నవంబర్ నాలుగో ఆదివారం రోజును ఎన్సీసీ దినోత్సవంగా పాటిస్తున్నాం. 1917లో ఆవిర్భవించిన ఎన్సీసీకి 1949 నుంచి దేశంలో అధికార హోదా పొందింది. 1980లో జిల్లాకు పరిచయమైన నాటి నుంచి నేటి వరకు 30వేల మందికి పైగా క్యాడెట్లను సమకూర్చింది. ప్రతిష్టాత్మక రిపబ్లిక్ డేలో పాల్గొనే జిల్లా క్యాడెట్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2015లో జరిగే రిపబ్లిక్ వేడుకల్లో ఖమ్మంలోని హార్వెస్ట్ స్కూల్ విద్యార్థులు ఈసారి కూడా ఎంపికయ్యూరు. -
ఆ వార్తలో నిజం లేదు!
లైఫ్ బుక్ 'లేడీ వర్సెస్ రికీ బాల్’ సినిమాలో సహాయక పాత్రలో నటించిన పరిణితీ చోప్రా ‘ఇష్క్‌జాదే’ ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘హసీతో ఫసీ’ మొదలైన సినిమాలలో హీరోయిన్గా తన ప్రతిభ చాటుకున్నారు. ఆమె మనసులోని మాటలు... కాలమే నిర్ణయిస్తుంది... ‘నేను గ్లామరస్ పాత్రలు మాత్రమే చేయాలనుకుంటున్నాను’ ‘గ్లామరస్ పాత్రలు చేయడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు’ ఇలా అనుకొని ఎవరూ సినిమాల్లోకి అడుగు పెట్టరు. గ్లామరస్ పాత్రలు చేయడం, చేయకపోవడం అనేది కాలమే నిర్ణయిస్తుంది తప్ప మన ఇష్టానిష్టాలు నిర్ణయించవు. అందుకే, గ్లామరస్ పాత్రలు చేయడానికి ఎంతగా ఇష్టపడతానో, సహజత్వానికి దగ్గర ఉండే గ్లామర్ లేని పాత్రలనూ అంతే ఇష్టపడతాను. ఒత్తిడిని వదులుకోవాలి... డైలాగులను తేలిగ్గా చెప్పడం కోసం ఒకటికి రెండు సార్లు మననం చేసుకోవడం నా అలవాటు. ఇది మంచి అలవాటే కావచ్చుగానీ మననం చేసుకునే క్రమంలో ఒత్తిడికి లోనవుతుంటాను. దీని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. క్రమశిక్షణ ముఖ్యం... సినిమా రంగంలో ఉన్నంత మాత్రాన క్రమశిక్షణకు దూరంగా ఉండాలనేమీ లేదు. ఏ కొద్దిమందినో చూసి ‘సినిమా వాళ్లకు క్రమశిక్షణ ఉండదు’ అనుకోవద్దు. సినిమా అనే కాదు ఏ రంగంలోనైనా క్రమశిక్షణ అనేది ముఖ్యమని నమ్ముతాను. ఆ వార్తలో నిజం లేదు... ‘హ్యాపీ న్యూ ఇయర్’ తరువాత షారుక్ ఖాన్ చేయబోయే సినిమాలో కథానాయికగా నటిస్తున్నాను అనే వార్తలు వచ్చాయి. ఇక అప్పటి నుంచి పరిచితులు, అపరిచితులు, అభిమానుల నుంచి అభినందన సందేశాల వరద మొదలైంది. నిజానికి ఆ వార్తల్లో ఎలాంటి నిజమూ లేదు. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే షారుక్‌ను అడిగిచూడండి! - పరిణితీ చోప్రా, హీరోయిన్ -
ఈ కన్నీళ్లు నా పాపాన్ని తుడిచేయగలవా?
మా నాన్నగారు స్కూల్ హెడ్మాస్టర్. ఆయనంటే అందరికీ చాలా భయం. ఎప్పుడూ క్రమశిక్షణ గురించే మాట్లాడేవారు. నిజాయతీగా ఉండాలనేవారు. నిజమే చెప్పాలనేవారు. అయితే అవన్నీ మంచికే చెప్తున్నారని అర్థం చేసుకునే వయసు, పరిణతి నాకు లేకపోయాయి. దాంతో ఆయన కంటపడకుండా తప్పించుకునేదాన్ని. ఐదోతరగతి చదువుతున్నప్పుడు అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. అప్పట్నుంచీ నాన్నతో మాట్లాడటమే తగ్గించేశాను. నేను టెన్త్‌క్లాస్ చదువుతున్నప్పుడు మా దూరపు బంధువు ఒకరు భార్యాసమేతంగా వచ్చారు మా ఇంటికి. వాళ్లని చూస్తూనే అరుగు మీద కూర్చుని హోమ్‌వర్క్ చేస్తున్న నన్ను లోపలికి వెళ్లిపొమ్మన్నారు. దాంతో నాకేదో అనుమానం వచ్చింది. లోపల నిలబడి కిటికీలోంచి జరిగేది చూడసాగాను. ఆ వచ్చినావిడ అంటోంది... ‘నా కూతుర్ని నాకు ఇచ్చేయండి’ అని. నాన్న అంటున్నారు... ‘మొదటే చెప్పాం తననిక ఇవ్వడం కుదరదని, తనిప్పుడు నా కూతురు, మీరు వెళ్లిపోండి’ అని. నాకు ఎప్పటికో అర్థమైంది... వాళ్లు మాట్లాడుకుంటున్నది నా గురించే అని. నాకు కోపం, దుఃఖం కలిసొచ్చేశాయి. అంటే నేను ఆయన కన్న కూతురిని కాదు. అందుకే ఆయనకు నా మీద ప్రేమ లేదు. అలా అనుకోగానే ఇక ఉండలేకపోయాను. పరుగు పరుగున మా అమ్మ దగ్గరకు వెళ్లిపోయాను. నన్నూ తీసుకుపొమ్మని అడిగాను. తను సంతోషంగా నన్ను దగ్గరకు తీసుకుంది. అంతవరకూ వాళ్లతో వాదించిన నాన్న సెలైంట్ అయిపోయారు. వస్తానంటే తీసుకెళ్లండి అన్నారు. దాంతో నేను మా అమ్మానాన్నలతో వెళ్లిపోయాను. కానీ నేనెంత తప్పు చేశానో తర్వాత తెలిసింది. నేను వెళ్లిన నాలుగోరోజునే కబురొచ్చింది... నాన్న గుండెనొప్పితో చనిపోయారని. అమ్మానాన్నలు నన్ను తీసుకు వెళ్లారు. వాకిట్లో నాన్న శవం ఉంది. చనిపోయాక కూడా ఆ ముఖంలో కాఠిన్యమే కనిపించింది నాకు. అందుకే ఏడుపు రాలేదు. అంతలో పక్కింటాయన నాకో ఉత్తరం తెచ్చి ఇచ్చారు. చనిపోయేముందు నాన్న ఇచ్చారట, నాకు ఇవ్వమని. అది చదివిన నాకు నాన్నంటే ఏమిటో తెలిసి వచ్చింది. నేను పుట్టేటప్పటికి నా కన్నతల్లితండ్రులకు తినడానికి తిండి కూడా ఉండేది కాదట. దాంతో నన్ను ఎవరికో అమ్మేయబోతే నాన్న తాను పెంచుకుంటానని చెప్పి నన్ను ఇంటికి తీసుకొచ్చేశారట. కేవలం నాకోసమే పిల్లల్ని కనకూడదని నాన్న అనుకున్నారట. అమ్మకూడా అందుకు సరేనందట. ‘నిన్ను తొలిసారి చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఇక జీవితమంతా నీకోసమే బతకాలనుకున్నాను, కానీ నువ్వు నన్ను వదిలి వెళ్లిపోయావు, అందుకే వెళ్లిపోతున్నాను తల్లీ, జాగ్రత్త’ అన్న నాన్న మాటలు మనసును పిండేశాయి. నాన్న పాదాల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చాను. కానీ ఏం లాభం? నా కన్నీళ్లు నా పాపాన్ని తుడిచేయగలవా? నా తండ్రిని నాకు తీసుకొచ్చి ఇవ్వగలవా? - ప్రశాంతి, మామిడికుదురు -
క్రమశిక్షణతో ముందడుగు
సుప్రీంకోర్టు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మచిలీపట్నం: విద్యార్థి దశలో క్రమశిక్షణ అలవరుచుకుంటే ఉన్నత స్థానానికి ఎదిగేందుకు మార్గం సుగమం అవుతుందని సుప్రీంకోర్టు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, సెంట్రల్ బోర్డు ఆఫ్ డెరైక్ట్ టాక్సెస్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ చైర్మన్ కేవీ చౌదరి అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని హిందూ కళాశాల ఆడిటోరియంలో వారిద్దరినీ సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తామిద్దరం హిం దూ కళాశాలలోనే చదువుకున్నామన్నారు. అప్ప ట్లో పాఠ్యాంశాలు బోధించిన రామచంద్రశాస్త్రి, వైజేఎల్ లక్ష్మణస్వామి, ఎం.హనుమంతరావు తదితర ఉపాధ్యాయుల ప్రభావం తమపై ఎంతగానో పడిందన్నారు. హిందూ హైస్కూల్, కళాశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు, అధ్యాపకు లు తమకు విద్యతో పాటు మంచి నడవడికను నేర్పారన్నారు. విద్యార్థులు కష్టపడేతత్వంతో పాటు క్రమశిక్షణ అలవరుచుకుని ముందడుగు వేయాలని సూచించారు. కార్యక్రమంలో బంద రు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, బీసీ సంక్షేమ శాఖ, ఎక్సైజ్, చేనేత శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అసెంబ్లీ డెప్యూటీ స్పీకరు మండలి బుద్ధప్రసాద్, హిందూ అనుబంధ సంస్థల కార్యదర్శి దైతా రామచంద్రశాస్త్రి, కృష్ణా యూనివర్సిటీ వీసీ వున్నం వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్, కేవీ చౌదరి దంపతులను పట్టణ ప్రముఖులు ఘనంగా సత్కరించారు. -
ఆ నలుగురిదీ ఒకే బాట!
అక్కాచెల్లెళ్లు అన్న తర్వాత గిల్లికజ్జాలాడుకోవడం, వాదనలకు దిగడం మామూలే. కానీ ‘శాస్త్రీ సిస్టర్స్’ అలా కాదు. ఆ నలుగురు అక్కాచెల్లెళ్లదీ ఒకే మాట, ఒకే బాట! ఓ మధ్య తరగతి తండ్రికి నలుగురు ఆడపిల్లలు. భార్య పోయాక అల్లారుముద్దుగా పెంచుతాడు. క్రమశిక్షణ, మంచితనం అల వడేలా చేస్తాడు. వాళ్లు పెద్దవాళ్లయ్యాక కొన్ని కారణాల వల్ల ఉన్న ఊరు వదిలి పట్టణానికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఆ నలుగురు పిల్లలకీ రకరకాల అనుభవాలు ఎదురవుతాయి. సమస్యలు ఏర్పడతాయి. వాటిని వాళ్లు ఎలా ఎదుర్కొన్నారు, తండ్రికి బాధ కలగకుండా నలుగురూ కలిసి సమస్యల్ని ఎలా పరిష్కరించుకున్నారు అనేదే కథ. ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో మెలగాలని తెలిపే ఈ సీరియల్‌ని అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు తప్పక చూడాలి. చక్కని వినోదంతో పాటు, విలువలను కూడా నేర్పే సీరియల్ ఇది! -
నర్తనం జీవితం పరివర్తనం!
ఈ తరంవారు దూరమవుతున్న సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేసేందుకు, నడవడిక, క్రమశిక్షణ అలవర్చేందుకు ఒక చక్కటి అవకాశం శాస్త్రీయ నృత్యం. మానసిక పరివర్తన మెరుగుపడేందుకు, ఏకాగ్రత పెరిగేందుకూ ఇది ఎంతో ఉపయోగకరం. మదిలోని హావాభావాలన్నీ కళ్లల్లో ఒలకబోస్తూ చేసే నృత్యరూపకాలు.. చూసే వారి మదికి ఎంతో ప్రశాం తతనిస్తాయి. ప్రతి భంగిమలో ఓ నేపథ్యం, ఓ యోగాసనం ఇలా ఎన్నో దాగున్నాయి. అందుకేనేమో తల్లిదండ్రులంతా వారి పిల్లలను శాస్త్రీయ నృత్యం అభ్యసించేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ ఆసక్తిని గమనించి పలు ప్రైవేటు పాఠశాలల్లోనూ ప్రత్యేకంగా నృత్యశిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. - క్రమశిక్షణకు కేరాఫ్ శాస్త్రీయ నృత్యం - నేటితరం పిల్లల్లో పెరుగుతున్న ఆసక్తి - ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు న్యూఢిల్లీ: భారతీయ నాట్యం ఒక కళే కాదు... క్రమశిక్షణ గల జీవితానికి ఒక ఒక కొలమానం. కూచి పూడి, భరతనాట్యం, జానపదాలు ఏవైనా సరే ఏకాగ్రత, క్రమశిక్షణతో చేయడం వల్ల పిల్లల భవిష్యత్ బంగారు బాటకు అవి పునాది అవుతాయి. శాస్త్రీయ నృత్యకళపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. తాము నేర్వని కళను పిల్లలకు నేర్పించాలన్న తపన పెరుగుతోంది. ఇటీవల పలు విద్యాసంస్థల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలే ఇందుకు తార్కాణాలు. విద్యార్థులు కూడా ఈ నృత్యాలను నేర్చుకోవడానికే ఇష్టపడుతున్నారు. నగరంలోని పలు విద్యాసంస్థలు ప్రత్యేకంగా డ్యాన్స్మాస్టర్లను ఏర్పాటు చేసి నృత్యశిక్షణ కోసం తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలేకాదు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాల ల్లోనూ విద్యార్థులు, తల్లిదండ్రుల ఆసక్తిమేరకు డ్యాన్స్ క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. పేద, మధ్య తరగతి పిల్లలకు తరగతి గదుల్లో నిర్వహిస్తున్న డ్యాన్స్ క్లాస్‌లు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. సంపన్నవర్గాల పిల్లల డ్యాన్స్ మాస్టర్లు నిర్వహించే ప్రత్యేక తరగతులకు హాజరై విద్య నేర్చుకుంటున్నా రు. అందుకు కారణం డ్యాన్స్ వల్ల ఎన్నో ప్రయోజనాలుండడమే... అందుకే ఇప్పుడు అందరిలో భారతీయ నృత్యంపై ఆసక్తి పెరిగింది. ఇందుకు కారణాలేమిటనే విషయమై పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు వారి మాటల్లోనే... దేవతలంతా మెచ్చిన కళ నాట్యం భగవంతుడు మెచ్చిన కళ. 64 కళలల్లో ప్రతి ఒక్క దేవతా స్వరూపం ఈ కళను ఎంతో ఇష్టపడ్డారని పురాణ ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. నేను 1997 లో నృత్యశిక్షణా తరగతులు ప్రారంభించాను. ఇప్పటిదాకా 200 మందికి పైగా శిక్షణ అందించాను. వారు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ రాణించారు. ప్రస్తుతం నా వద్ద ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థినీ విద్యార్థులు, 86 మంది బాల బాలికలు శిక్షణ పొందుతున్నారు. పిల్లలతో పాటు పెద్దలూ నేర్చుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు శాస్త్రీయ నృత్యం నేర్పిస్తే ఉపయోగం ఉంటుందని వైద్యులూ సూచిస్తున్నారు. - భార్గవకుమార్, నృత్యజ్యోతి ఫైన్ ఆర్ట్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ వ్యక్తిత్వం అలవడుతుంది శాస్త్రీయ నృత్యం వల్ల భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురిం చి అవగాహన పెరుగుతుంది. ఫలితంగా మంచి నడవడిక, క్రమశిక్షణ గల జీవితం అలవడుతుంది. నేను 2000 సంవత్సరం నుంచి శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఇస్తున్నాను. సెయింట్ జోసఫ్ స్కూల్లో ఇప్పటి వరకు 400 మంది పిల్లలకు నృత్యరీతులలో శిక్షణ ఇచ్చాను. ఇంటి వద్ద కూడా పిల్లలతో పాటు పెద్దలు కూడా నృత్యంలో శిక్షణ తీసుకుంటున్నారు. పలువురు డాక్టర్లు, గృహిణిలు సైతం నృత్యం నేర్చుకోవడానికి వస్తున్నారు. నాట్యం వల్ల పిల్లల్లో మానసిక పరివర్తన వస్తుంది. - ఎస్. కరీముల్లా, నటరాజ నృత్య కళామందిరం ప్రయోజనాలివీ... పిల్లల్లో మానసిక పరివర్తన వస్తుంది.భారతీయ ఇతిహాసాలను నృత్యరూపక ప్రదర్శన చేయడం వల్ల సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుస్తుంది.తల్లిదండ్రులు, పెద్దలపై గౌరవభావం పెరుగుతుంది.నాట్యంలో యోగా దాగుంది, తద్వారా ఆరోగ్యం సిద్దిస్తుంది.శారీరక,మానసిక వ్యాయా మం చేకూరుతుంది. ఏకాగ్రత పెరిగి చదువులో రాణిస్తారు.కళలు, సంప్రదాయంపై అభిరుచి పెరుగుతుంది. -
గురువేనమః
‘‘గురు బ్రహ్మ..గురు విష్ణు.. గురు దేవో మహేశ్వర గురుసాక్ష్యాత్ పరబ్రహ్మ తస్మయిశ్రీ గురువేనమః’’ తపస్వి మాష్టారు పాఠాలు చాలా ఇష్టం ‘వ్యక్తికి క్రమ శిక్షణ నేర్పేది గురువు. తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రభావం గురువుదే ఉంటుంది. విద్యార్థి దశలో నేర్చుకున్న క్రమశిక్షణ భవిష్యత్‌కు బాటలు వేస్తుంది. ఇది గురువు వల్లనే సాధ్యం. కరీంనగర్ జిల్లాలోని మా సొంత గ్రామమైన మంథనిలో 5వ తరగతి వరకూ చదువుకున్న పాఠశాల, అప్పట్లో పాఠాలు చెప్పిన తపస్వి మాస్టారు అంటే ఎంతో ఇష్టం. ఆ రోజుల్లో అన్ని సబ్జెకులు కూడా తపస్వి మాస్టారే చెప్పేవారు. ఒక మనిషికి కుటుంబం తర్వాత క్రమ శిక్షణ నేర్పేది పాఠశాల, అక్కడి గురువులే. విద్యార్థి అభ్యున్నతికి పాఠాలు నేర్పిన గురువును గౌరవించుకోవటం మన బాధ్యత.’ - ప్రకాష్‌రెడ్డి, భద్రాచలం ఏఎస్పీ నా తండ్రే నా ప్రథమ గురువు నా ప్రాథమిక విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాలలోనే జరిగింది. నా మొదటి గురువు మా నాన్నే. నల్లగొండ జిల్లాలోని చిన్నకొండూరు, తుమ్మలగూడెం, చెరువుమాదారం గ్రామాల్లోని పాఠశాలల్లో నేను ఏడో తరగతి వరకు చదువుకున్నాను. అక్కడే మా నాన్న పద్మయ్య కూడా ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఆయన నాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. ప్రభుత్వ పాఠశాల కనుక అన్ని క్లాసుల్లో అన్ని సబ్జెక్టులకు టీచర్లుండేవారు కాదు. అప్పుడు నేను చదువుతున్న క్లాసులో ఏ సబ్జెక్టుకు టీచర్లు లేరో ఆ సబ్జెక్టు చెప్పేందుకు ఆయన డ్యూటీ వేయించుకునేవారు. తన బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత అదనంగా ఆ సబ్జెక్టు చెప్పేవారు. సర్వేల్ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో నేను చేరేందుకు కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సర్వేల్ గురుకులంలో లెక్కల సార్ వీజీ.కృష్ణమూర్తి ఉండేవారు. ఆయనంటే నాకెంతో గౌరవం. నేనంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్లే నేను ఇంతటి స్థాయికి వచ్చాను. ఆయన కొడుకు రవీంద్ర కూడా నా క్లాస్మేట్. పరీక్షలయిన తర్వాత ఆయన ముందు దిద్దేది నా పేపరే. ఆయన కొడుకు కన్నా నాకు ఎక్కువ మార్కులు వస్తే హ్యాపీగా ఫీలయ్యేవారు. గ్రూప్స్‌లో కూడా నాకు లెక్కల సబ్జెక్టే ఉపకరించింది. రెండు పేపర్లలో కలిపి 300 మార్కులకు గాను 290 మార్కులు వచ్చాయి. అదే మిగిలిన సబ్జెక్టుల్లో 100కు మించి రావడం కష్టం. ఆ రోజు కృష్ణమూర్తి సారు చెప్పిన లెక్కలే ఇప్పుడు నన్ను ఇక్కడ కూర్చోబెట్టాయి. మరో ముఖ్యమైన విషయమేమిటంటే... గురుకులం హాస్టల్లో కరెంటు లేకపోతే మమ్మల్ని వాళ్లింటికి తీసుకెళ్లి మాకు ఓ రూం ఇచ్చి చదువుకునేందుకు అవకాశం ఇచ్చేవారు కృష్ణమూర్తి సార్. ఎప్పుడైనా సర్వేల్ పాఠశాలకు వెళ్లి ఆయన ఉన్న క్వార్టర్‌ను చూస్తే ఇందులోనా మనం ఉండి చదువుకుంది... ఇంత చిన్న ఇంట్లో మాకు ఎలా అవకాశం ఇచ్చారో కృష్ణమూర్తి సార్ అనిపిస్తుంది. అందుకే గురుదేవోభవ అంటారు. - కడవేరు. సురేంద్రమోహన్, జాయింట్‌కలెక్టర్, ఖమ్మం. -
ఆ క్రమశిక్షణే..
మాది నిడమనూరు. 8వ తరగతి వరకు మిర్యాలగూడలో చదువుకున్నా.. అప్పటికే సెయింట్ ఆల్పోన్సెస్ హైస్కూల్‌కు మంచి పేరుంది. ఇందులో చదవాలనే 9వ తరగతి కోసం నల్లగొండకు వచ్చా. ఇక్కడే హాస్టల్లో ఉండేవాడిని. ఉదయం ఐదు గంటలకే నిద్రలేపేవాళ్లు. వ్యాయామం, స్టడీ అవర్స్, చల్లని నీటితో స్నానం.. ఎంతో క్రమశిక్షణ ఉండేది. ఆ క్రమశిక్షణే నా ఎదుగుదలకు తోడ్పడింది. తెలుగులో వెనుకబడేవాడిని. తెలుగు సార్ హనుమంతరావు ఎంతో నిక్కచ్చిగా ఉండేవారు. - హైకోర్టు అదనపు జడ్జి ఎ.రాజశేఖర్‌రెడ్డి -
టైమ్‌ను మేనేజ్ చేయండి!
జాబ్ స్కిల్స్: ప్రపంచంలో ప్రతి మనిషికి ఒకరోజులో ఉండే సమయం 24 గంటలే. కొందరు ఈ సమయాన్ని చక్కగా ఉపయోగించుకొని అనుకున్న పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. మరికొందరి కి ఏ చిన్న పని చేద్దామన్నా సమయం సరిపోదు. ఎందుకిలా? టైమ్ మేనేజ్మెంట్ తెలియక పోవడం వల్లే ఫిర్యాదులతో కాలం గడిపేస్తుంటారు. కెరీర్లో ముందుకెళ్లలేక ఉన్న చోటే ఉండిపోతారు. సమయం అనేది అత్యంత విలువైన వనరు. గడిచిపోయిన కాలం ఎప్పటికీ తిరిగిరాదు. సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసినవారే జీవిత సమరంలో విజయం సాధిస్తారు. టైమ్‌ను మీరు నియంత్రించాలి కానీ, టైమ్ మిమ్మల్ని నియంత్రించకుండా జాగ్రత్త పడండి. ఆఫీస్‌లో చేయాల్సిన పనులు ఎన్నో మిగిలిపోయాయి, పూర్తి చేద్దామంటే టైమ్ దొరకడం లేదు అని హైరానా పడుతున్నారా? అయితే ఈ సూచనలు మీలాంటి వారి కోసమే.. క్రమశిక్షణ పాటించండి మొదట ఆ రోజు చేయాల్సిన పనులపై స్పష్టత ఉండాలి. ప్రాధాన్యతలవారీగా వాటిని విభజించుకోవాలి. పూర్తిచేయడానికి డెడ్లైన్లను పెట్టుకోవాలి. గడువులోగా కచ్చితంగా పూర్తయ్యేలా ప్రయత్నించాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ డెడ్‌లైన్ దాటకుండా జాగ్రత్తపడాలి. దీన్ని అలవాటుగా మార్చుకోవాలి. ప్రారంభంలో కొంత కష్టంగానే అనిపించినా రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే గడువులోగా కార్యాచరణ పూర్తిచేయడం సులువుగా మారుతుంది. అనుకున్న సమయంలోగా పనులు చేయలేకపోతే ఎక్కువ సమయం కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల అలసిపోతారు. ఆశించిన ఫలితం రాదు, పనిపట్ల సంతృప్తి కూడా ఉండదు. ఫోన్‌కాల్స్‌కు నో చెప్పండి కార్యాలయాల్లో ఉద్యోగుల కార్యకలాపాలకు అంతరాయం కలిగించేది.. తరచుగా మోగే సెల్‌ఫోన్. దీనివల్ల చాలా సమయం వృథా అవుతుంది. ప్రొఫెషనల్ వరల్డ్‌లో ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవా లంటే ఫోన్‌కాల్స్ ముఖ్యమే. కానీ, చేస్తున్న పనిని వదిలేసి ఫోన్లో మాట్లాడుతూ కూర్చుంటే చాలా నష్టం జరుగుతుంది. ఉద్యోగంలో గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నవారికి ఇది మంచిది కాదు. టైమ్‌ను ఆదా చేయాలంటే అనవసరమైన ఫోన్‌కాల్స్‌కు నో చెప్పాల్సిందే. పని, సెల్‌ఫోన్.. దేని దారి దానిదే అన్నట్లుగా ఉండాలి. ఫోన్లో మాట్లాడడానికి కచ్చితమైన టైమ్ నిర్దేశించుకోవాలి. ఆఫీస్ నుంచి బయటి కొచ్చాక సెల్‌ఫోన్ స్విచ్ఛాన్ చేయడం ఉత్తమం. మార్నింగ్.. ప్రొడక్టివ్ టైమ్ ఉదయం పూట వాతావరణం, మనసు ప్రశాంతంగా ఉంటాయి. అది ప్రొడక్టివ్ టైమ్ అని అనేక సర్వేల్లో తేలింది. అంటే ఉదయం చేసే పనులు మంచి ఫలితాన్నిస్తాయి. కాబట్టి ఆఫీస్‌లో ముఖ్యమైన కార్యాలను ఉదయమే పూర్తిచేసేలా వర్క్ షెడ్యూల్ రూపొందించు కోండి. త్వరగా పనులు జరిగితే ఎంతో టైమ్ మిగులుతుంది. ఈ-మెయిల్స్ చూసుకోవడం లాంటి వాటిని మధ్యాహ్నం తర్వాత చేసేలా ప్రణాళిక రూపొందించుకోండి. పనిలో విరామం.. ఎంతసేపు కార్యాలయంలో సహచరులతో కలిసి కాఫీలు, టీలు తాగుతూ కబుర్లు చెప్పుకుంటే తెలియకుండానే చాలా సమయం హరించుకుపోతుంది. ఇలాంటి వాటికి ఫుల్స్టాప్ పెట్టడమే మంచిది. పనిలో ఏదైనా సమస్య తలెత్తి, ఎంతసేపు ఆలోచించినా దానికి పరిష్కారం మార్గం దొరక్కపోతే.. కొంతసేపు విరామం తీసుకోవాలి. దీనివల్ల మైండ్ రిఫ్రెష్ అవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటేనే కొత్త ఆలోచనలు వస్తాయి. విరామం అనేది ఎక్కువ టైమ్‌ను మింగేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. టెక్నాలజీని వాడుకోండి టైమ్ మేనేజ్మెంట్లో టెక్నాలజీ చాలా కీలకం. ఒకప్పుడు సమావేశాల కోసం చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేది. ఇప్పుడంతా వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రాకతో సమయం ఆదా అవుతోంది. తక్కువ టైమ్‌లో ఎక్కువ కార్యాలు చేయగలుగుతున్నారు. టైమ్ సేవ్ కావడంతోపాటు ఆఫీస్‌లో ఉత్పత్తి పెరగాలంటే టెక్నాలజీని వాడుకోండి. -
కొత్తగా ఉద్యోగంలో చేరారా?
అయితే ఒకసారి ఇది చదవండి.... చదువు పూర్తయిన వెంటనే కొత్తగా ఉద్యోగంలో చేరారా? అయితే మీరు ఈ సూచనలు పాటిస్తే ఉద్యోగంలో కూడా బ్రహ్మాండంగా రాణించవచ్చు. టైమ్ విషయంలో కచ్చితత్వాన్ని పాటించండి. ఉద్యోగంలో క్రమశిక్షణకు ఇదే మొదటి మెట్టు. ఎలా పడితే అలా కాకుండా సీట్లో హుందాగా కూర్చోవాలి. ఆఫీసులో అడుగు పెట్టిన తరువాత వ్యక్తిగత ఫోన్లు మాట్లాడడం తగ్గించండి. ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ‘‘ఆఫీసు నుంచి వచ్చిన తరువాత చేస్తాను’’ అని నిర్మొహమాటంగా చెప్పండి. మీరు పని చేస్తున్న డెస్క్ చిందరవందరగా కాకుండా నీట్‌గా కనిపించాలి. టేబుల్ గందరగోళంగా ఉంటే, అది మీ మూడ్‌ను కూడా ప్రభావితం చేస్తుంది. ఆఫీసులో గట్టిగా మాట్లాడడం, చెడు మాటలు మాట్లాడం లాంటివి చేయవద్దు. పనికి సంబంధించి మీలో ఏ కొత్త ఐడియా వచ్చినా మీ పై అధికారితో పంచుకోండి. ‘ఇది నా డ్యూటీ కాదు’ అనే మాట ఎప్పుడూ నోటి నుంచి రానివ్వవద్దు. రిజర్వ్‌గా ఉండడం అనేది మీ అలవాటైతే కావచ్చుగానీ, ఎంత కలుపుగోలుగా ఉంటే అంత మంచిది. {పతి విషయానికీ పక్క వారి మీద ఆధారపడకూడదు. సొంతంగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఉద్యోగరీత్యా అప్పగించిన బాధ్యతలు అస్పష్టంగా ఉంటే, సందేహాలు నివృత్తి చేసుకోవాలి. ‘అడిగితే ఏమనుకుంటారో’ అనుకుంటే ఇబ్బందుల్లో పడతారు. గాసిప్‌లకు దూరంగా ఉండండి. పని మీద మాత్రమే ఎక్కువ దృష్టి పెట్టండి. ‘ఈ పని నేను చేయగలను’ అనే ఆత్మవిశ్వాసం కళ్లలో ఎప్పుడూ కనబడాలి. -
ఇదేం క్రమశిక్షణ?!
విడ్డూరం పిల్లలను క్రమశిక్షణలో ఉంచడానికి పాఠశాలల్లో పలు రకాల నియమాలు పెడుతుంటాయి యాజమాన్యాలు. అయితే అమెరికాలోని కొన్ని స్కూళ్లలో ఉన్న రూల్స్ చిట్టా కాస్త విచిత్రంగా ఉంది. మీరే చూడండి... ఆస్ట్రేలియా, బ్రిటన్‌లలోని కొన్ని పాఠశాలల్లో పిల్లల పరీక్ష పేపర్లను పచ్చ ఇంకుతో దిద్దుతారు. ఎరుపురంగు విప్లవభావాలకు ప్రతీక కాబట్టి ఆ రంగు సిరాని వాడరు. దీన్ని ఈ మధ్య అమెరికాలోని కొన్ని పాఠశాలలు కూడా అవలంబిస్తున్నాయి! న్యూయార్కలోని ఓ పాఠశాలకి బస్సులు ఉండవు. మరీ చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు దింపవచ్చు కానీ, కాస్త ఎదిగాక కచ్చితంగా సైకిల్ మీదే రావాలి. స్థూలకాయం రాకుండా నివారించడానికి ఈ రూల్ పెట్టారట! మిచిగన్‌లో ఉన్న ఓ స్కూల్లో ప్రతి విద్యార్థికీ ఓ లాకర్ ఇస్తారు. క్యాంటీన్‌కి, తరగతి గదులకు మధ్య ఉండే ఈ లాకర్లలో పుస్తకాలు, లంచ్ బాక్సులు పెట్టుకోవాలి. ప్రతి పీరియడ్‌కి ముందు అక్కడికి వెళ్లి కావలసిన పుస్తకాలు తెచ్చుకోవాలి. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ఏర్పాటు చేశారట! మసాచుసెట్స్‌లోని ఓ పాఠశాలలో బేక్ చేసిన ఫుడ్ అమ్మరు. పిల్లలు ఇళ్ల నుంచి తెచ్చుకోవడానికి కూడా వీల్లేదు! కొలరాడోలోని ఓ స్కూల్లో పిల్లలు 18వ అంకె ప్రింట్ చేసి ఉన్న దుస్తులు వేసుకోకూడదు. ఎందుకంటే అక్కడ ‘ఎయిటీన్త స్ట్రీట్ గ్యాంగ్’ అనే రౌడీ మూక ఉంది. కాబట్టి ఆ అంకెకు దూరంగా ఉండాలనే నియమం పెట్టారు! ఫ్లారిడాలోని ఓ స్కూల్లో విద్యార్థులు ఒకరినొకరు వాటేసుకోకూడదు. అలా చేస్తే శిక్ష తప్పదు. పోయినేడు నిక్ మార్టినెజ్ అనే అమ్మాయి ఫ్రెండ్‌ని హగ్ చేసుకుందన్న కారణంతో సస్పెండ్ చేశారు! సౌత్ కరొలినాలోని పాఠశాలలకు పిల్లలు వెరైటీ హెయిర్ స్టయిల్స్‌తో రాకూడదు. జుత్తుకి రంగులు కూడా వేయకూడదు. స్కూలువాళ్లు ఒక హెయిర్‌స్టయిల్ చెబుతారు. కచ్చితంగా పిల్లలంతా అలాగే దువ్వుకోవాలి! వర్జీనియాలో కాల్వర్ట హైస్కూల్లో స్కర్టులు ధరిస్తే ఇష్టపడరు. ఒకవేళ స్కర్కులు వేసుకోవాలని ఉంటే యాజమాన్యం చెప్పిన కొలతలతో కుట్టించుకుని వేసుకోవాలి! పెన్సిల్వేనియాలో విద్యార్థులు చేతులకు బ్యాండ్స పెట్టుకోకూడదు. పెట్టుకున్నారో... స్కూల్లోంచి తీసేస్తారు! -
వివరం: నడిపించే దైవం
తన ప్రతిరూపం పురుడు పోసుకోబోతుంటే... ఆ రూపం కళ్ల ముందు కదలాడుతుంటే... తన వారసత్వానికి కొనసాగింపు కలుగుతోందంటే... తాను కొన్నియుగాల వరకు జీవించి ఉంటాననుకుంటే... ఆ ఊహే ఎంతో తియ్యగా మరెంతో మధురంగా ఉంటుంది. అలా ఆ తండ్రి జన్మజన్మలకీ చిరంజీవే... అంతటి జీవితసారం తెలిసిన తండ్రి... కన్నకూతురు అల్లుడి చేయి పట్టుకుని అత్తవారింటికి బయలుదేరుతుంటే... కన్న కొడుకు విద్యాభ్యాసం కోసం సుదూరప్రదేశాలకు పయనమవుతుంటే... బాధకు లోనవుతాడు... బేలగా మారతాడు... కన్నీరుమున్నీరవుతాడు... బయటకు శబ్దం వినపడకుండా...లోలోపలే కుమిలిపోతాడు... తండ్రి అంతరంగాన్ని మరో తండ్రి మాత్రమే వర్ణించగలడేమో... ఇవాళ ఫాదర్స్ డే. ఈ సందర్భంగా... పురాణాలలోని కొందరు తండ్రుల గురించి ఈవారం ‘వివరం’. పిల్లలను గారం చేయడం తల్లి లక్షణం. క్రమశిక్షణలో ఉంచడం తండ్రి బాధ్యత. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటాడు తండ్రి. జన్మనిచ్చినవాడు జనకుడు మాత్రమే. జన్మనివ్వటమే కాక రక్షణ కల్పిస్తేనే తండ్రి. ‘పాతీతి పితా’ అని నిర్వచనం. కన్న సంతానం యొక్క వ్యక్తిత్వ నిర్మాణ విషయంలో తండ్రిది ప్రథమ స్థానం. పసితనం నుంచి పిల్లల మీద కన్ను వేసి ఉంచుతాడు తండ్రి. పిల్లలు సక్రమంగా పెరగకపోవడానికి పూర్తి బాధ్యత తండ్రిదే. పాలయేత్ పంచవర్షాణి దశవర్షాణి తాడయేత్ ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్ర వదాచరేత్... అని శాస్త్రం చెబుతోంది. పదహారు సంవత్సరాలు వచ్చిన పిల్లలు పరిపక్వత సాధించినవారితో సమానం. ఎదిగిన పిల్లలకు బాధ్యతలన్నీ అప్పగించి, దూరం నుంచి గమనించే స్థితికి చేరుకోవాలి తండ్రి. పిల్లలకు ఎన్ని సంవత్సరాలు వచ్చినా ‘నా మాటే చెల్లాలి’ అనుకోకుండా, బాధ్యతలన్నీ వారికి వదిలేసినప్పుడు మాత్రమే తండ్రికి గౌరవం దక్కుతుంది. ‘తండ్రి హరి చేరుమనియెడి తండ్రి తండ్రి’ అని భాగవతంలో ప్రహ్లాదుడు పలుకుతాడు. ‘నేను హరి లేడ న్నాను కాబట్టి, నువ్వు కూడా హరి లేడనే పలుకు’ అన్నాడు ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు. అందుకే ఆయనకు తండ్రి స్థానం దక్కలేదు. మంచి పనులు చేయమని చెబుతూ, పిల్లలను సక్రమమార్గంలో నడపగల పరిపక్వ స్థితిలో ఉండాలి తండ్రి. ధర్మవ్యాధుని కథలో కౌశికుడు మహర్షి అయి ఉండీ, కోపిష్టిగా మారి కొంగను శపించాడు. అందుకు ఆయనను ‘నువ్వు ఎందుకిలా అయ్యావు’ అని ప్రశ్నిస్తే... ‘తండ్రికి పెద్దవాడి మీద, తల్లికి చిన్నవాడి మీద ప్రేమ ఉంటుంది. మధ్యముడనైన నా మీద వారికి ప్రేమ లేదు. తల్లిదండ్రుల ప్రేమలో పెరుగనివారు ఎలా మారినా మారవచ్చని చెబుతాడు. ‘తనయుడు దుష్టయిన తండ్రి తప్పు’ కొడుకు దుర్మార్గుడు కావడానికి కారణం తండ్రి... అని నృసింహ శతకకారుడు చెబుతున్నాడు. వసుదేవుడు గృహ నిర్బంధం నుంచి వసుదేవుడు పిల్లవాడిని రక్షించడం కోసం శిశువును బుట్టలో ఉంచుకుని, పరవళ్లు తొక్కుతున్న యమునా నదిని నడిరేయి వేళ దాటి, గోకులానికి వె ళ్లి నందుడికి అప్పగించాడు. తన కుమారుడు క్షేమంగా, సుఖంగా పెరగాలనే ఉద్దేశ్యంతోనే అంతటి కష్టానికి సిద్ధమయ్యాడు వసుదేవుడు. అంతేనా... పిల్లవాడి సంరక్షణార్థం గాడిద కాళ్లు పట్టుకున్నట్లుగా ప్రాంతీయ కథ ఒకటి ప్రచారంలో ఉంది. వసుదేవుడు ‘అంతటి వాడు’ అయిన శ్రీకృష్ణుడిని రక్షించడం కోసం గాడిద కాళ్లు పట్టుకున్నాడట. ‘పిల్లలు ఏమైతే నాకేం’ అని తండ్రులు ఏమీ పట్టనట్లు ఉండకుండా, అవసరమనుకుంటే ఆ పిల్లల సంరక్షణ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడాలంటూ తండ్రి బాధ్యతలను గుర్తు చేస్తుంది ఈ కథ. రామాయణంలో... రాముడి ముఖ కవళికలను బట్టి అతడి ధర్మాన్ని కనిపెట్టేవాడట దశరథుడు. అందుకే రాముడి దగ్గర... మాట తేడా రాకుండా, జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం కోసం దశరథుడు బాగా ఆలోచించేవాడట. పిల్లల పెంపకం విషయంలో తండ్రి ఆధిపత్యం చలాయించాలనుకోకూడదు. పిల్లలతో పెద్దలు జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే దశరథుడు అంత ఆలోచించి మాట్లాడాడట రాముడితో. అదీ పితాపుత్రానుబంధం. అందుకే - అంతటి శ్రీరామచంద్రుడు... శివుని విల్లు విరిచి జానకిని పరిణయమాడే సమయంలో, తండ్రి అయిన దశరథ మహారాజుకి విషయం తెలియచేయమన్నాడు. ‘నా వివాహం నా ఇష్టం’ అనలేదు. పెంపకాన్ని బట్టి వారి మనోవికాసం ఏర్పడుతుంది. చిన్ననాటి నుంచి దశరథుడు అలా ఉన్నాడు కనుకనే, రాముడికి తండ్రి మీద గౌరవం ఏర్పడింది. అంతేకాదు... జానకి ని వివాహం చేసుకోవడానికి, ఆమె మీద అంత ప్రేమానురాగాలు ఉండటానికి కారణం... జానకి తన తండ్రి అయిన దశరథుడు అంగీకరించిన అమ్మాయి కావడమే. ‘దారాః పితృకృతా ఇతి.. సీతను తన భార్యగా తండ్రి నిశ్చయించాడు’ అనిపిస్తాడు వాల్మీకి రాముడి చేత. వృద్ధాః శిష్యాః గురుర్యువాః అని దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరాచార్యులు చెప్పారు. గురువు అంటే తండ్రి. తండ్రి యొక్క ఆలోచన యువతరం వైపు ఉంటూ, వాళ్ల ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాలి. అప్పుడు ఇరువురి మధ్య అనుబంధం కొనసాగుతుంది. ‘పితాశ్రుతం’ అంటున్నాయి శాస్త్రాలు. శ్రుతం అంటే విద్య, జ్ఞానం అని అర్థం. అంటే... తండ్రి స్థానంలో ఉండేవారు ముందుగా ఆలోచించవలసింది పిల్లలకు జ్ఞానం, విద్య నేర్పడం అని. భారవి కథ భారవి రచనలు చూసినవారంతా ప్రశంసలతో ముంచెత్తుతుంటే, తండ్రి మాత్రం భారవిని పొగడలేదు. దాంతో భారవికి తండ్రి మీద కోపం ఏర్పడి, ఆయనను చంపేయాలనుకుని, అటక మీద కూర్చుని ఆయన రాక కోసం ఎదరుచూస్తూ ఉంటాడు. తండ్రి అదే అటక కింద కూర్చుని భోజనం చేస్తుండగా, భార్య కొడుకు ప్రస్తావన తీసుకు వస్తుంది. ‘పిల్లలను పెద్దలు పొగిడితే వారి అభివృద్ధి ఆగిపోతుంది’ అని తండ్రి చెప్పడంతో, తాను తండ్రిని తప్పుగా అర్థం చేసుకుని, ఆయనను హతమార్చడానికి కూడా వెనకాడకుండా పెద్ద తప్పు చేశానని బాధపడతాడు. అందుకు తగిన శిక్ష విధించమని తండ్రిని కోరతాడు. ‘ఆరు నెలలు అత్తవారింటికి వెళ్లు’ అంటాడు తండ్రి. అత్తవారింట్లో కొన్నిరోజులు మర్యాదలు, భోగాలు అనుభవించాడు. ఆ తరువాత నుంచి అవమానాలు మొదలయ్యాయి. తీవ్ర మనస్తాపంతో భారవి ‘కిరాతార్జునీయం’ వ్రాశాడని ప్రతీతి. ఆ కావ్యంలోని సహసా విదధీత నక్రియాం అవివేకః పరమాపదాం పదం (తొందరపడి ఏ పనీ చేయకూడదు, అవివేకం ఆపదలకు మూలం) అన్న వాక్యానికి భారవికి ప్రపంచమంతా నీరాజనం పలికింది. ముందుచూపు ఉన్నవాడు కావడం వల్లే, భారవికి అత్తవారి ఇంట ఉండమని శిక్ష విధించాడు తండ్రి. తన బిడ్డ క్షేమం కోసం గుండెను రాయి చేసుకుని, కఠినంగా ప్రవర్తిస్తాడు తండ్రి. కన్న సంతానాన్ని రక్షిస్తూ, వారిని సక్రమ మార్గంలో నడపడమే తండ్రి గొప్పదనం. ప్రజాతంతుం మావ్యవత్సేత్సీః ... అని వేదం చెబుతోంది. అంటే ఒక తరం నుంచి ఒక తరానికి వంశం తాడులా కొనసాగాలని అర్థం. సంతానాన్ని కనిపారేస్తే సరి కాదు. పితాపుత్ర అనుబంధం కొనసాగాలి. అది పితృత్వంలో బాధ్యత. ఆ పరంపరకు మూలం వ్యాసుని వంశం. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ పరాశరాత్మజమ్ వందే శుకతాతం తపోనిధిం॥ వశిష్ఠుడు, శక్తి, పరాశరుడు, వ్యాసుడు, శుకుడు... ఈ వంశంలో ఇంతమందీ పితృపరంపరను కొనసాగించారు. తండ్రిగా వారి వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు. ఒక వంశంలో ఈ పరంపరను కొనసాగించడం విశేషం. రఘువంశంలోని వారు కూడా ఆ పరంపరను కొనసాగించారు. రఘువంశీయుల రాజ్యంలో తండ్రులు ‘కేవలం జన్మ హేతవః’ అన్నట్లుగా ఉండేవారట. అంటే తండ్రులు సంతానానికి జన్మను మాత్రమే ఇచ్చేవారట. వారి పోషణపాలనలంతా రాజులే భరించేవారట. ఆ విధంగా ఆ వంశంలోని రాజులందరూ ప్రజలకు తండ్రులయ్యారు. అలా కూడా వారు పితృపరంపర కొనసాగించారు. ద్రోణుడు జాతి పిత... ద్రోణుడి కుమారుడు అశ్వత్థామ, ప్రియశిష్యుడు అర్జునుడు. అశ్వత్థామ కంటె అర్జునుడి మీదే ద్రోణాచార్యుడు ప్రేమ చూపడానికి కారణం అర్జునుడిలో ఉన్న ఏకాగ్రత. ‘అర్జునుడిని అందరికంటె ఉత్తముడిగా తీర్చుతానన్న ప్రమాణాన్ని నిలబెట్టుకున్నాడు. అదీ గురువు లక్షణం. ‘జాతి పిత’ అనే పదం అందుకే వచ్చింది. పరిపాలకుడు, విద్యను నేర్పే గురువు... తండ్రి స్థానంలో ఉండాలి. సంతానం పట్ల పక్ష పాతం ప్రదర్శించకూడదు. మరి ద్రోణుడు గొప్ప తండ్రి అవుతాడా! గొప్ప తండ్రి కనుకనే అశ్వత్థామలో ఉండే ఆవేశాన్ని గుర్తించి, అశ్వత్థామకు అవసరమైన మేరకే విద్య నేర్పాడు. ఆయన పుత్ర ప్రేమ కురుక్షేత్ర యుద్ధ సమయంలో బయట పడుతుంది. అశ్వత్థామ చిరంజీవి అని తెలిసినప్పటికీ, ధర్మరాజు ‘అశ్వత్థామ హతః’ అనగానే ద్రోణుడు ప్రాణత్యాగం చేసేశాడు. అదీ తండ్రి హృదయం అంటే. పితృవాత్సల్యం... మహాభారతంలోని ధర్మవ్యాధుడు (మాంసం అమ్ముకునే వ్యక్తి) తన తల్లిదండ్రుల వల్లే తనకు జ్ఞానం కలిగిందని కౌశిక మహామునికి చెబుతూ తల్లిదండ్రుల ఔన్నత్యాన్ని వివరిస్తాడు. వీరె దైవమ్ము వీరి సేవించుకొనుటె దైవసేవ వీరు వసించు తావె దైవ మందిరమ్మన్న భక్తితోనుందునయ్య నాదు సంపత్తికిదె కారణమ్ము నిజము - పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ (ధర్మభిక్ష ,ఉపదేశ ఖండం) తండ్రి ఔన్నత్యం యాశ్యత్యద్య శకుంతలే తి హృదయం సంస్పృష్టముత్కంఠయా కంఠస్తంభిత బాష్పవృత్తి కలుషశ్చింతాజడం దర్శనం వైక్లబ్యం మమ తావ దీదృశమహో స్నేహాదరణ్యౌకసః పీడ్యంతే గృహిణః కథం ను తనయావిశ్లేషదుఃఖై ర్నవైః (కాళిదాస విరచిత అభిజ్ఞాన శాకుంతలం, చతుర్థాంకం) ఈరోజు శకుంతల అత్తవారింటికి వెళ్లిపోతోందంటే నా హృదయం ద్రవిస్తోంది. కన్నీరు ఏకధాటిగా వస్తూండటం వల్ల గొంతు గాద్గదికమవుతోంది. నా చూపుకి జడత్వం వచ్చింది. ఆ బాధతో నా శరీరం పనిచేయడం లేదు. వీరూ తండ్రులే తనర జనకుండు అన్నప్రదాతయును భయత్రాతయును ననగ నింతులకు మువ్వురొగిన గురువులు వీరలనఘ యుపనేత కియ్యేవురుననయంబును గురువులు... అని ఐదుగురికి తండ్రి స్థానం ఉందని శకుంతల దుష్యంతుడికి చెబుతుంది. (మహాభారతం) (ఇక్కడ గురువు అంటే తండ్రి అని అర్థం) జన్మనిచ్చినవారు, అన్నం పెట్టినవారు, భయాన్ని పోగొట్టినవారు... స్త్రీలకు ఈ ముగ్గురూ తండ్రులతో సమానం. పాపం చేయకుండా కాపాడేవాడు, ఉపనయనం చేసినవాడు... వీరిద్దరూ మగవారికి తండ్రితో సమానం. హరిశ్చంద్రుడికి లేక లేక కలిగిన సంతానానికి మరణ భయం ఏర్పడడంతో, అతడిని కాపాడటానికి విశ్వామిత్రుడు తన తపశ్శక్తినంతా ధారపోసి అతడికి భయాన్ని పోగొట్టి భయత్రాత అయ్యాడు. అలా విశ్వామిత్రుడు తండ్రి అయ్యాడు. రఘువంశీయులు ప్రజలను కన్నబిడ్డలుగా చూసి, వారూ తండ్రులే అయ్యారు. సీతకు జనకుడు జన్మనివ్వకపోయినా, ఆమెను పెంచి పోషించి, విద్యాబుద్ధులు నేర్పి... తండ్రి అయ్యాడు. పితృస్వభావం పుత్రుల్ నేర్చిన నేరకున్న జనకుల్ పోషింతురెల్లప్పుడున్ మిత్రత్వంబున బుద్ధి శక్తి దురితోన్మేషంబు వారింతురే శత్రుత్వంబు దలంపరు... (భాగవతం సప్తమ స్కంధం - 126ప)పిల్లలు చదివినా, చదవకున్నా తండ్రి వారిని పోషిస్తాడు. స్నేహంగా ఉంటూ వారికి బుద్ధి నేర్పుతాడు. కష్టం కలగకుండా కాపాడతాడు. శత్రుత్వం వహించడు... ఇవి తండ్రి లక్షణాలని భాగవతం చెబుతోంది. ఆమె మీద పెంచుకున్న ప్రేమ కారణంగా నేనిలా అయిపోతున్నాను. ఆశ్రమవాసిని, సన్యాసిని అయిన నేనే ఇలా బాధపడుతున్నానంటే, కన్నతండ్రి పరిస్థితి ఎలా ఉంటుందో కదా! అంటాడు కణ్వుడు. తండ్రి హృదయాన్ని ఎంతో సున్నితంగా చిత్రించాడు ఈ శ్లోకంలో కాళిదాసు. భారతీయ సాహిత్యంలో తండ్రి ఔన్నత్యాన్ని చిత్రించే శ్లోకం ఇంతకు మించినది మరొకటి లేదని విమర్శకారులు అంటారు. ఎంత గంభీరంగా ఉండేవారైనా, ఎంతటి వేదాంతి అయినా సంతానం దగ్గర లొంగిపోతారనడానికి ఇదే నిదర్శనం. ఉండదగినవి... తండ్రి విషయంలో... ఉత్తమ తండ్రుల పరంపర కొనసాగాలి. పాలకుల విషయంలో... రఘువంశ మహారాజులలాగ ప్రజలను కన్నబిడ్డలుగా చూసేవారు ఉండాలి. ఋషుల విషయంలో... ఋషి అంటే జ్ఞానాన్ని బోధించి శిష్యులను తండ్రిలా కాపాడేవారు ఉండాలి. అలా ఈ పరంపరలన్నీ కొనసాగాలి. ఇలా ఉండకూడదు... ధృతరాష్ర్టుడు... తన సంతానం ఎన్నిఅరాచకాలు చేస్తున్నా వారి తప్పులను సమర్థించడంతో కౌరవులు తప్పులు చేస్తూ, వంశనాశనానికి కారకులయ్యారు. ఆదిలోనే ధృతరాష్ర్టుడు వారి తప్పులను ఖండించి, శిక్షించి ఉంటే ఆ వంశ పరంపర కొనసాగేది. గుణనిధి తండ్రి అయిన యజ్ఞదత్తుడు రాచకార్యాలలో మునిగిపోయి, పిల్లవాడి బాగోగులు పట్టించుకోలేదు. గుణనిధి దులవాట్లకు బానిసయ్యాడు. పిల్లవాడి మీద వాత్సల్యంతో గుణనిధి తల్లి, పిల్లవాడి తప్పులను కప్పిపుచ్చింది. తండ్రులు ఎన్ని బాధ్యతలలో తలమునకలైనా, పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించాలని ఈ వృత్తాంతం చెబుతోంది.తండ్రి అంటే డబ్బు సంపాదించి, అవసరాలు తీర్చేవాడు మాత్రమే కాదు. పిల్లలను ఎప్పటికప్పుడు సంరక్షించేవాడని అర్థం చేసుకోవాలి. ముగింపు జరుగుతున్న మార్పుని సహజమని భావించాలే గాని, గతంతో పోల్చడం సరికాదు. ‘మా రోజుల్లో ఇలా ఉండేది కాదు’ అంటూ, పిల్లలను నిందించకూడదు. జరుగుతున్న దానిని పరిణామంగా భావించాలి. పతనం అనుకోకూడదు పెద్దలు. సంతానానికి ఒక వయసు వచ్చాక బాధ్యతలను అప్పగించి, దూరం నుంచీ వారిని గమనిస్తూ వానప్రస్థ ఆశ్రమాన్ని పెద్దలు ఆచరించాలని శాస్త్రం చెబుతోంది. - డా. పురాణపండ వైజయంతి -
సత్యసాయి విద్యా విహార్‌లో సన్నీ
పూర్ణకుంభంతో యాజమాన్యం స్వాగతం ఉప్పొంగిన విద్యార్థులు బాబా ఆశీస్సులతో ఏదైనా సాధ్యమని ఉద్బోధ విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ఎంవీపీ కాలనీ సెక్టార్-8లోని సత్యసాయి విద్యావిహార్ స్కూల్‌ను భారత మాజీ కెప్ట్‌న్ సునీల్ గవాస్కర్ శుక్రవారం సందర్శించారు. పాఠశాల యాజమాన్యం ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికింది. సత్యసాయి సదన్‌లోని బాబాకు ఆయన పూజ లు చేశారు. తరగతికి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. జీవి తంలో ఒడిదుడుకులు ఎదురవుతుంటాయని, వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలన్నారు. విద్యార్థులు సానుకూల దృక్పథం అలవర్చుకోవాలని సూచించారు. భగవాన్ సత్యసాయి ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలిపారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. క్రికెట్లో మధుర జ్ఞాపకాలను వారితో పంచుకున్నారు. విద్యార్థులు తెచ్చిన క్రికెట్ బ్యాట్, బంతిపై సంతకం చేశారు. ఓ విద్యార్థిని సత్యసాయి విగ్రహాన్ని ఆయనకు అందజేసింది. కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు వి.ఆర్.నాగేశ్వరరావు, నగర కన్వీనర్ పి.ఆర్.ఎస్.ఎన్.నాయుడు, ప్రసన్నకుమార్, బోత్ర షిప్పింగ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ రాం గోపాల్, విజయ నిర్మాణ్ సంస్థ అధినేత విజయకుమార్, న్కూల్ ప్రిన్సిపాల్ ఎ.కౌసల్య పాల్గొన్నారు. -
శ్రద్ధ+సాధన=నవ విజయం
ఉత్తమ విద్యకు.. మంచి క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచాయి నవోదయ విద్యాలయాలు. వీటిలో సీటు సాధించిన వారికి 6 నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్యనందించనున్నారు. అంతేకాకుండా కాకుండా భోజనం, వసతి సదుపాయం కూడా అందుతుంది. జిల్లాలో బనవాసి జవహర్ నవోదయ విద్యాలయం ఎమ్మిగనూరు సమీపంలో వెలిసింది. ఇందులో ప్రవేశానికి ఈనెల 8న పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 6,500 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు చదవాల్సిన పాఠ్యాంశాలపై సూచనలు, సలహాలు.. - న్యూస్‌లైన్, ఎమ్మిగనూరు రూరల్ ఇవి నిషేధం.. నవోదయ పరీక్షకు హాజరయ్యే విద్యార్థి తప్పనిసరిగా బ్లాక్/బ్లూ బాల్‌పాయింట్ పెన్ను వెంట తీసుకెళ్లాలి. పరీక్ష కేంద్రంలో అందజేసే ఓఎంఆర్ షీట్‌లోని జవాబులను ఆ పెన్నుతోనే నింపాలి. పెన్సిల్, రబ్బర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించొద్దు. సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువులను వెంట తీసుకెళ్లరాదు. వెంట ప్యాడ్ తెచ్చుకోవడం మర్చిపోవద్దు. గంట ముందే చేరుకోవాలి.. ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలి. హాల్‌టికెట్ అందిన విద్యార్థులు ముందస్తుగా ఏ ప్రాంతంలో పరీక్ష కేంద్రం కేటాయించారో తెలుసుకోవాలి. సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవడం వల్ల ఎలాంటి ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉండవు. ఈ పరీక్షకు అరగంట ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. అయినా.. నిర్ణీత సమయంలోనే పరీక్ష పూర్తిచేయాల్సి ఉంటుంది. గ్రూపు చర్చలతోప్రయోజనం.. నవోదయ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు గ్రూపు చర్చలకు ప్రాధాన్యమివ్వాలి. ఇలాంటి చర్చలతో సబ్జెక్టులను ఎక్కువగా అవగతం చేసుకోవచ్చు. తద్వారా పరీక్షల్లో మెరిట్ మార్కులు సాధించడానికి వీలుంటుంది. రిజర్వేషన్లు.. ఎక్కువ మార్కులు వచ్చిన వారికి విద్యాలయంలో సీటు దక్కుతుంది. ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్, ఎస్టీలకు ఏడున్నర శాతం, పీహెచ్‌సీలకు 2, బాలికలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. పట్టణ విద్యార్థులకు 25 సీట్లు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 సీట్లు భర్తీ చేస్తారు. పాత ప్రశ్నపత్రాలను గమనించాలి.. విద్యార్థులు పూర్వ పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నపత్రాలను నిశితంగా గమనించాలి. కనీసం మూడేళ్ల నుంచి ప్రశ్నపత్రం ఏ విధంగా రూపొందిస్తున్నారో, ఏయే చాప్టర్ల నుంచి ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారో గుర్తుపెట్టుకోవాలి. ఏ చాప్టర్ కీలకమో గమనించాలి. భాష భాగంలో కొద్దిపాటిగా తర్ఫీదు తీసుకుంటే మార్కులు సాధించడం కష్టమేమి కాదు. ముఖ్యంగా విద్యార్థులు సమయంతో పోటీపడాలి. తక్కువ సమయంలోనే జవాబులు గుర్తించగలగాలి. తొలుత తెలిసిన సమాధానాన్ని పూర్తిచేయాలి. తదుపరి మిగతా ప్రశ్నలపై ఆలోచించాలి. జవాబుపత్రంలో కొట్టివేతలు లేకుండా నీట్‌గా సమాధానం రాయాలి. భాషపై పట్టు తప్పనిసరి... విద్యార్థుల భాష, పఠనాశక్తిని అంచనా వేసేందుకు భాష పరీక్ష ఉంటుంది. మెజార్టీ విద్యార్థులు తెలుగునే ఎంచుకుంటారు. 25 మార్కులు కేటాయిస్తారు. ఏదేని మూడు పాఠ్యాంశాలను ఇస్తారు. ఒక్కో పాఠ్యాంశంలో ఐదు ప్రశ్నలుంటాయి. వ్యాకరణం, లేఖన నైపుణ్యం, పరీక్షించేందుకు మరో పది ప్రశ్న లుంటాయి. పాఠ్యాంశాల ఆధారంగా వచ్చే ప్రశ్నకు సమాధానాలు దాదాపు అన్నీ ఒకే విధంగా ఉంటాయి. పాఠ్యాంశాల ఆధారంగా ప్రశ్నలకు జవాబులను ఎంచుకోవాలి. వ్యాకరణంలో ప్రశ్నలకు సమాధానాలు రాయాలన్నా అభ్యాసమే అత్యంత ప్రాధాన్యం. రోజూ ఓ గంట వ్యాకరణం చదవడం మేలు. పరీక్ష జరిగే విధానం.. నవోదయ ప్రవేశ పరీక్ష ఎలాంటి విరామం లేకుండా ఏకధాటిగా రెండు గంటలపాటు ఉంటుంది. నిర్ధేశించిన సమయంలోనే విద్యార్థులు పరీక్ష రాయాలి. మేధాశక్తి, గణితం, భాషా సంబంధిత పరీక్షలు (మూడు విభాగాలుగా) ఉంటాయి. వంద మార్కులకు వంద ప్రశ్నలు ఉంటాయి. ప్రతి విభాగంలో ఐచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ఒక ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మేధా శక్తి(రీజనింగ్)లో 50 మార్కులు, గణితంలో 25 మార్కులు, తెలుగు/ఆంగ్లం పఠనాంశంలో 15 మార్కులు, వ్యాకరణంలో 10 మార్కులు ఉంటాయి. పరీక్షకు హాజరయ్యే విద్యార్థి వీలైనంత మేరకు ప్రశ్నలన్నింటికీ జవాబురాయడం ఉత్తమం. -
ఉత్తరం: నష్టం గొడవ వల్ల కాదు...
నవ వధువు... ఎలా ఉండాలి? ఈ ప్రశ్నకు సమాధానాలు పురాణాలు వేరుగా చెబుతాయి. సమాజం ఒకలా చెబుతుంది. ఆధునికులు ఇంకోలా చెబుతారు. బయటి వారు ఎన్నైనా చెబుతారు. పాటించేవారే వాటిని క్రోడీకరించుకోవాలి. ఎందుకంటే పాత్ర కొత్త.. మనిషి పాత. ప్రతిఒక్కరికి కొన్ని లక్షణాలు కామన్‌గా ఉంటాయి. అందుకే మన సహజ లక్షణాలు ఎలా ఉన్నా కొత్త చోట, కొత్త వ్యక్తులతో ఉన్నపుడు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఇంకొన్ని మార్చుకోవాలి. ముఖ్యంగా నవ వధువు పాత్ర జీవితంలో అతి క్లిష్టమైన ప్రశ్నలను రేకెత్తించే పాత్ర. ‘ఇష్టానుసారం’ అన్నది ఏ రూపంలో అయినా కనిపిస్తుంది గానీ క్రమశిక్షణ ఒకే రూపంలో ఉంటుంది అన్న స్పష్టత ఉంటే పరిస్థితులు నెగ్గుకు రావడం చాలా సులువు. క్రమశిక్షణ అంటే అణగిమణిగి ఉండటం కాదు. పద్ధతిగా ఉండటం. జీవితాన్ని మరింత ఆహ్లాదంగా మార్చుకునే ఓ మార్గం. ప్రతి భర్త తన భార్యకు హీరోలానే కనిపించాలనుకుంటాడు. ఆమె నుంచి తన సమర్థతకు సంబంధించిన ప్రతికూల వ్యాఖ్యలను భరించలేడు. ఆ విషయం ఇద్దరిలో ఇగోలను, ఫ్రస్ట్రేషన్‌ను పెంచుతుంది. కాబట్టి అలాంటి కామెంట్లకు దూరంగా ఉండడం మంచిది. ఒకరి బంధువులపై మరొకరి కామెంట్లు చాలా ఈజీ గోయింగ్ ఉన్న వారికి తప్ప అస్సలు పనికిరావు. ఇలాంటి జంటలు చాలా తక్కువ. పైగా ఇటీవలి కాలంలో వీటిని సరదాగా తీసుకోవడం తగ్గిపోయింది. ఇవి మొత్తం జీవితాన్నే డిజప్పాయింట్ చేస్తాయి. సాధారణంగా గొడవలన్నీ పరిష్కరించుకోగలిగినవే ఉంటాయి... కానీ వాటిలోకి కోపంతో ఇతర విషయాల ప్రస్తావన తేవడం వల్ల గొడవ పడిన కారణం చిన్నదయినా గొడవ పెద్దది అవుతుంది. అసలు... కాపురాన్ని చెడగొడితే... కొసరు... కాపురాన్ని కూలుస్తుంది. కాపురంలో గొడవలు చాలా సాధారణం... కానీ అవి దారితప్పడం వల్లే విషమిస్తాయి. జీవితాలను శాసించే స్థాయికి తీసుకెళ్తాయి. గొడవపడండి కానీ... వాటిని ఆ గొడవకే పరిమితం చేయండి. ఎంత ఫ్రస్ట్రేషన్లోనూ అనవసర విషయాలను గొడవల్లోకి తేకండి. మీ భాగస్వామి అలా తెస్తే స్పష్టంగా హెచ్చరించండి. వీలైతే మౌనంగా ఉండండి. కొన్ని సార్లు మౌనం కూడా శాంతిని ఇస్తుంది. రోగం కాదు... కానీ ఇబ్బంది! పౌష్టికాహారం అసలైన రోగ నివారణి. ఇది 99 శాతం మాత్రమే నిజం. స్వచ్ఛమైన పాలు కూడా కాలవ్యవధి మించిన తర్వాత విషపూరితమే. పౌష్టికాహారం అన్నది ఎంత అత్యవసరమో దాన్ని సమయానికి తీసుకోవడం అంతే అవసరం. ఎందుకంటే మిగతా ఏ అనారోగ్యమూ కలిగించని అసౌకర్యాన్ని కలిగించేది గ్యాస్ట్రబుల్. దీనికి అతిపెద్ద కారణం...సమయానికి ఆహారం తీసుకోకపోవడం. ఇది ఎవరికీ మంచిది కాదు, స్త్రీలకు అసలు మంచిది కాదు. సమయానికి తినకపోతే మన శరీరం విడుదల చేసే కొన్ని జీర్ణవాయువులు కడుపులో ఆహారం వున్నా లేకున్నా తమ పని అవిచేసుకుంటూ పోతాయి. ఇది ఎక్కువ రోజులు కొనసాగితే గ్యాస్‌ట్రబుల్‌గా పరిణమిస్తుంది. ఇప్పటికే మీకు ఈ సమస్య వచ్చి అది ప్రాథమిక దశలో ఉంటే...ఇప్పటినుంచి అయినా సమయానికి భోజనం చేయడం ద్వారా అదుపులో ఉంచవచ్చు. ఉదయం లేస్తూనే రెండు గ్లాసుల నీళ్లు తాగండి. రోజులో ఏదో సమయంలో జామ పళ్లు, బొప్పాయి, మజ్జిగ తీసుకోండి. దీంతో కొంతకాలానికి మీ సమస్య బాగా తగ్గుతుంది. -
వికాసం: నాలుగు రకాల తండ్రులు
పరీక్షలు ఇంకో వారం రోజుల్లో ఉన్నాయనగా ఒక కొడుకు ‘పక్క ఊరి గుడికి మా స్నేహితులందరూ వెళ్తున్నారు. అక్కడ గుండు గీయించుకొని, చెరువులో మునిగి, దేవుడికి దండం పెట్టుకుంటే ఫస్టు ర్యాంకు వస్తుందట’ అని చెప్పాడనుకుందాం. వివిధ రకాల తండ్రులు ఏ విధంగా ప్రవర్తిస్తారో చూద్దాం. హిరణ్యకశ్యపులు: ‘పరీక్షలు ఇంకో వారం రోజుల్లో పెట్టుకొని గుళ్లకీ గోపురాలకీ తిరుగుతావా? (మధ్యలో భార్య అడ్డొస్తే) నోర్ముయ్! నీ మూలానే వీడిలా తయారయ్యాడు.’ పిల్లల్ని సొంతగా ఆలోచించనివ్వకుండా ప్రతి చిన్న విషయంలోనూ వేలుపెట్టడం, క్రమశిక్షణ పేరుతో కొట్టడం, తిట్టడం, తాము సాధించలేని పెద్ద పెద్ద ఆశలు పిల్లవాడి మీద పెట్టుకోవడం, అవి తీరకపోతే నిరాశతో మరింత రాక్షసులుగా మారటం, తమ మాటే వేదవాక్కులా నడవాలి అనుకోవటం ఈ టైపు తండ్రుల లక్షణాలు. వీళ్లకి తమ మీద, తమ మేధస్సు మీద గొప్ప నమ్మకం. పై ఉదాహరణలో ఆ పిల్లవాడు గాని పరీక్ష ఫెయిల్ అయితే ‘నా తప్పేమీ లేదు. గుడికి వెళ్తానంటే నాన్న వద్దన్నాడు. అందువల్ల భగవంతుడు నా తండ్రిపై ఈ విధంగా కక్ష తీర్చుకున్నాడు’ అని ఎస్కేప్ అయిపోతాడు. దృతరాష్టులు: ‘తప్పకుండా వెళ్దాం నాయినా! రేపే వెళ్దాం! నీతో పాటు నేను, మీ అమ్మ, అక్కయ్య కూడా గుండు కొట్టించుకుంటాం. నువ్వు పాసైతే మాకదే చాలు. నీ కోరిక మేమెప్పుడైనా కాదన్నామా?’ వీళ్లకి సంతానం ఏది చెప్తే అదే వేదం. ఆ తరువాత పిల్లవాడు ఫెయిల్ అయితే, ‘భగవంతుడి మీద (చదవటం మానేసి) భారం మోపాను. నేనేం చెయ్యను’ అని సమర్థించుకుంటాడు. చాలామంది తాగుబోతులు, క్లబ్బుల్లో జూదగాళ్లు, రాజకీయ నాయకులు తమ తమ రంగాల్లో చాలా బిజీగా ఉన్నాం అనుకొనేవారు ఈ విభాగంలోకి వస్తారు. పిల్లల మానసిక అవసరాలను పట్టించుకోకపోవటం, దాన్ని కప్పిపుచ్చుకోవటానికి పిల్లవాడు ఏది అడిగితే అది ఇవ్వటం ఈ రకపు తల్లిదండ్రుల అవలక్షణాలు. మరికొందరు పెద్దలు ‘నే చిన్నప్పుడు ఇవన్నీ అనుభవించలేదు. మా పిల్లలైనా అనుభవించనీ’ అన్న ఉద్దేశంతో పిల్లల్ని విపరీతమైన గారాబంతో పెంచుతూ వారి భవిష్యత్తుని పాడుచేస్తారు. చిన్న వయసులోనే పిల్లలు హుక్కా హౌసుల్లో గంజాయికి అలవాటు పడటానికి, కారు ఆక్సిడెంట్లలో మరణించటానికి ఇలాంటి తల్లిదండ్రులే కారణం. జనకులు: ‘నేను నీ నమ్మకాన్ని కాదనను. కానీ పరీక్షలు ఇంకో వారం రోజుల్లో పెట్టుకొని ఇప్పుడు ఈ ప్రయాణాల్తో చదువు పాడుచేసుకోకు. పరీక్షలయ్యాక, తప్పకుండా వెళ్దాం. కానీ కేవలం చెరువులో మునిగి గుండు గీయించుకుంటే ఫస్ట్ ర్యాంక్ వస్తే ఈ పాటికి చాలామందికి రావాలి కదా? తార్కికంగా ఆలోచించు. చదువుకోవటం ముఖ్యం. నమ్మకం తరువాత.’ పిల్లల్ని చిన్నతనంలోనే గురుకులానికి పంపించి వేయటం వల్ల పురాణాల్లో (పిల్లల్ని బాగా పెంచటానికి ఉదాహరణగా నిలిచే) మంచి తండ్రులు తక్కువ కనపడతారు. ఒకవైపు స్త్రీ ధర్మాన్ని, మరొకవైపు ఆత్మగౌరవాన్ని సీతకు బోధించిన జనకుడు, ఇంకా కొంతవరకూ... దశరథుడు, అర్జునుడు వగైరా మంచి జనకులు. బాధ్యత తెలిసిన తల్లిదండ్రులు పిల్లలకి చేదోడు వాదోడుగా నిలిచి, వాళ్ల గమ్యాన్ని నిర్దేశించుకోవటానికి సహాయపడతారు. దుర్యోధనులు: పిరికితనానికి మరోపేరైన లక్ష్మణ కుమారుడు ఇతడి కొడుకు. ఇతడి ప్రస్తావన ఉదాహరణకే తప్ప వాదనకి కాదు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల పట్ల చాలా భయంతోను, బలహీనతతోను ఉంటారు. కూతురికి ఐఐటీ సీటు వస్తే, ‘తాము నివసించే ప్రాంతానికి అది దూరం’ అని వదులుకున్న తల్లిదండ్రులు కూడా నాకు తెలుసు. ఒక అమ్మాయి ఎం.ఎస్.సుబ్బలక్ష్మి స్వరంతో కర్ణాటక సంగీతం అద్భుతంగా పాడుతుంది. చదువు పాడవుతుందన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు బలవంతంగా ఆ ట్రైనింగ్ మాన్పించారు. ఒక చెట్టు కింద ఒకామె ఏడుస్తుంటే గమనించాను. ఆ తరువాత తెలిసిన విషయమేమిటంటే, ఆమె కొడుకు లోపల ఎల్.కె.జి. ప్రవేశ పరీక్ష రాస్తున్నాడు. ఇది టెన్షన్‌కి పరాకాష్ట.అమ్మ మమకారం అందిస్తే, నాన్న ధైర్యం ఇస్తాడు. అమ్మలా అక్కున చేర్చుకోకపోవచ్చు. కానీ వెన్నెముక బలంగా అయ్యేందుకు తోడ్పడ్తాడు. తండ్రి అవటం సులభం. మంచి సంతానానికి తండ్రి అవటం కష్టం. భగవంతుడు అన్నిచోట్లా దీపం పట్టుకుని నిలబడి దారి చూపించలేడు. అందుకే తండ్రుల్ని సృష్టించాడు. - yandamoori@hotmail.com యండమూరి వీరేంద్రనాథ్ -
‘యువ కిరణాలు’ అమలులో కొత్త నిబంధనలు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ యువకిరణాలు పథకం అమలులో కొత్త నిబంధనలు చేర్చారు. ఉచిత శిక్షణ కావడంతో చాలామంది యువతీ యువకులు క్రమశిక్షణ పాటించకపోవటంతో ప్రభుత్వం అవసరమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులు మధ్యలోనే డ్రాపౌట్ అవుతుండడంతో శిక్షణ ఇచ్చే సంస్థలు ప్రభుత్వ నిధులు రాక ఇబ్బందులు పడుతున్నాయి. ఈ పథకంలో 18 నుంచి 35 ఏళ్లలోపు వయసు గల నిరుద్యోగ నిరుపేద యువతీ యువకులకు ప్రైవేట్ శిక్షణ సంస్థలలో పలు కోర్సులలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. గతంలో విద్యార్థులు తరచూ గైర్హాజరై, డ్రాపౌట్ అయ్యేవారు. వీటికి చెక్ పెట్టడంలో భాగంగా కొద్దినెలలుగా హాజరు నమోదు నిమిత్తం బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు శిక్షణ సంస్థకు వచ్చినపుడు, తిరిగి వెళ్లేటపుడు హాజరు తీసుకుంటారు. ఈ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నిక్షిప్తం కావడంతో గైర్హాజరయ్యేవారి పేర్లను హైదరాబాద్‌లో రాజీవ్ యువ కిరణాలు ఉన్నతాధికారులు తొలగించే ఏర్పాట్లు చేశారు. కోర్సు ప్రారంభం తరువాత, మధ్యలోను, శిక్షణ పూర్తయ్యాక, అభ్యర్థులకు ఉపాధి కల్పించిన తరువాత ప్రభుత్వం విడతల వారీగా శిక్షణ సంస్థలకు నిధులు విడుదల చేస్తుంది. శిక్షణ తీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో జిల్లాగ్రామీణాభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జీవీఎంసీ పరిధిలో యూసీడీ అధికారులు పథమం అమలు పర్యవేక్షిస్తున్నారు.. అనకాపల్లి, భీమిలి, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీలలో పట్టణ ఐకేపీ పర్యవేక్షణ సాగిస్తోంది. ఆయా శిక్షణ సంస్థలు పత్రికా ప్రకటనల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. ఒక అభ్యర్థికి ఈ పథకం కింద ఒక్క కోర్సులో మాత్రమే శిక్షణ అవకాశం కల్పిస్తారు.