
ఆ క్రమశిక్షణే..
మాది నిడమనూరు. 8వ తరగతి వరకు మిర్యాలగూడలో చదువుకున్నా.. అప్పటికే సెయింట్ ఆల్పోన్సెస్ హైస్కూల్‌కు మంచి పేరుంది. ఇందులో చదవాలనే 9వ తరగతి కోసం నల్లగొండకు వచ్చా. ఇక్కడే హాస్టల్‌లో ఉండేవాడిని. ఉదయం ఐదు గంటలకే నిద్రలేపేవాళ్లు. వ్యాయామం, స్టడీ అవర్స్, చల్లని నీటితో స్నానం..
ఎంతో క్రమశిక్షణ ఉండేది.
ఆ క్రమశిక్షణే నా ఎదుగుదలకు తోడ్పడింది. తెలుగులో వెనుకబడేవాడిని. తెలుగు సార్ హనుమంతరావు ఎంతో నిక్కచ్చిగా ఉండేవారు.
- హైకోర్టు అదనపు జడ్జి
ఎ.రాజశేఖర్‌రెడ్డి