
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తాను పదో తరగతి పరీక్షలు బాగా రాయలేకపోతున్నా అనే కారణంగా ఆవేదనకు గురైన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దీంతో, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలిపిస్తున్నారు. మార్కులే జీవితమా బిడ్డా.. ఎందుకు ఇలా చేశావ్ బిడ్డా.. అంటూ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నారు.
వివరాల ప్రకారం.. నల్లగొండలోని కట్టంగూరులో విద్యార్థిని పూజిత భార్గవి స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఇప్పటికే పదో తరగతి పరీక్షలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పరీక్షలు రాసింది. మూడు పరీక్షలు సరిగా రాయలేదని ఆందోళన చెందింది. ఈ క్రమంలో తాను పరీక్షలు రాయలేకపోతున్నాని ఆవేదనకు గురైంది. తాను ఫేయిల్ అవుతానేమో అనుకుని.. భయాందోళనతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతితో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.