నీ కుక్కను సరిగ్గా ట్రైన్‌ చేసుకో.. నా కుక్కనే అంటావా! | Germany: Woman Bites Woman In Fight Over Dog Discipline | Sakshi
Sakshi News home page

నీ కుక్కను సరిగ్గా ట్రైన్‌ చేసుకో.. నా కుక్కనే అంటావా!

Dec 28 2021 5:54 PM | Updated on Dec 28 2021 5:58 PM

Germany: Woman Bites Woman In Fight Over Dog Discipline - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బెర్లిన్‌: సాధారణంగా కొందరు శునకాలను చాలా ఇష్టంగా పెంచుకుంటారు. వాటిని తమ ఇంట్లో మనుషుల మాదిరిగా చూసుకుంటారు. వాటిని ఎవరు ఏమన్నా.. ఆగ్రహంతో ఊగిపోతుంటారు. తాజాగా, ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. జర్మనీలోని తురింజియా పట్టణంలో 27 ఏళ్ల మహిళ, 51 ఏళ్ల మరో మహిళ తమ పెంపుడు కుక్కలను తీసుకుని స్థానికంగా ఉన్న పార్కులో వాకింగ్‌కు తీసుకెళ్లారు.

ఈ క్రమంలో ఒక శునకం.. మరో శునకాన్ని చూస్తు అరుస్తూ దాడికి తెగబడింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన 51 ఏళ్ల మహిళ.. మరో మహిళపై వాగ్వాదానికి దిగింది. శునకాన్ని సరిగ్గా ట్రైన్‌ చేసుకోవాలని చెప్పింది. దీంతో వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ  గొడవ పెరిగి.. ఒకరిపై మరొకరు దాడిచేసుకోవడం వరకు వెళ్లింది. ఒకరిని మరోకరు కొరుక్కుంటూ గాయపర్చుకున్నారు. పాపం.. మహిళలిద్దరు కొట్టుకోవడాన్ని వారి శునకాలు చూస్తూ ఉండిపోయాయి.

ఆ‍ ప్రదేశంలో ఉన్న స్థానికులు వారి గొడవను ఆపటానికి సాహసించలేదు. ఈ సంఘటన తర్వాత ఇరువురు  స్థానిక పోలీసుస్టేషన్‌ వెళ్లి  ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త క్లిప్పింగ్‌లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘మీ కన్నా.. శునకాలే నయం..’, ‘వామ్మో.. ఇలా కరుచుకున్నారేంటీ..’ అంటూ ఫన్నీగా కామెంట్‌లు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement