berlin
-
‘సిక్‌లీవ్’ పెడుతున్నారా..?
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులకు సిక్ లీవ్ (ఎస్ఎల్) అనేది ఒక హక్కు అన్నది తెలిసిందే. ఒక్కోసారి ఎలాంటి అనారోగ్యం లేకపోయినా, సెలవు తీసుకోవాలంటే ‘ఎస్ఎల్’ అనేది ఓ తిరుగులేని ఆయుధంగా మారిన సందర్భాలు కూడా అనేకం. ఎంతటి కఠిన హృదయుడైన కంపెనీ యజమాని లేదా ఉన్నతస్థానంలో ఉన్న మేనేజర్లయినా.. ఉద్యోగుల ‘సిక్‌లీవ్’ను తోసిపుచ్చే అవకాశాలు చాలా తక్కువ. కానీ, ఇక ముందు సిక్‌లీవ్ పెట్టాలంటే.. ఉద్యోగులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జర్మనీలోని బెర్లిన్ ఫ్యాక్టరీ ఉద్యోగులు ఎదుర్కొన్న అనుభవాన్ని చూశాక.. ఇతర ఉద్యోగులు సైతం సిక్‌లీవ్ పెట్టాలంటే ఆలోచించాల్సిందే. ఇక్కడ ఎదురైన అనుభవాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. ఈ సెలవు పెట్టేందుకు తప్పకుండా ఆలోచించ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి ఇప్పటికిప్పుడు భారత్‌లో కూడా వస్తుందా? అనే విషయం మాత్రం.. వివిధ కార్పొరేట్ కంపెనీల తీరును బట్టి ఉంటుందనే అంచనాలకు ఇక్కడి ఉద్యోగులు వస్తున్నారు. అసలేం జరిగిందంటే..జర్మనీలోని బెర్లిన్‌లో టెస్లా కంపెనీ గిగా ఫ్యాక్టరీలో సిక్‌లీవ్ పెట్టిన ఉద్యోగుల ఇళ్లకు ఆ సంస్థ మేనేజర్లు వెళ్లి.. అసలు వారు నిజంగానే అనారోగ్యంతో ఉన్నారా? లేక ఎస్ఎల్ పెట్టేందుకు ఆ విధంగా అబద్ధం ఆడుతున్నారా? అని పరిశీలించారట.. దీంతో ఈ సంస్థ మేనేజ్మెంట్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. తమకు పనిఒత్తిళ్లు పెరగడంతో పాటు అధిక పని గంటలతో తరచూ అనారోగ్యం బారిన పడడంతో సిక్ లీవ్‌లు పెట్టక తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయని కార్మిక సంఘాలు గట్టిగా వాదిస్తున్నాయి.సిక్‌లీవ్‌లు తీసుకున్న ఉద్యోగులను తనిఖీ చేసేందుకు మేనేజర్లు వారి ఇళ్ల తలుపులు తట్టినపుడు, అధికారుల మొహాలపైనే తలుపులు మూసేయడమో, తిట్ల దండకం అందుకోవడమో లేదా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించడమో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎస్ఎల్లు తీసుకుంటున్నవారి సంఖ్య ఏకంగా 17 శాతానికి చేరుకోవడంతో.. ఈ పద్ధతికి అడ్డుకట్ట వేసేందుకు ఉద్యోగుల ఇళ్లకు మేనేజర్లు వెళ్లడాన్ని తప్పుపట్టనవసరం లేదని యాజమాన్య ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. మరింత మెరుగైన పని సంస్కృతిని, ఉత్పాదకతను పెంచేందుకు సిక్‌లీవ్‌లు పెట్టే విషయంలో ఉద్యోగుల్లో తగిన మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని వారు స్పష్టం చేస్తున్నారు.లీవు తీసుకోకుంటే వెయ్యి యూరోల బోనస్లీవ్లు తీసుకోని వారికి వెయ్యి యూరోలు బోనస్‌గా చెల్లించేందుకు కూడా టెస్లా సంసిద్ధత వ్యక్తం చేసింది. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సైతం.. సిక్లీవ్లతో తలెత్తిన పరిస్థితిని, అందుకు దారితీసిన పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టుగా ఎక్స్ వేదికగా స్పష్టం చేయడం గమనార్హం. ఉద్యోగులు అత్యంత కఠినమైన పని సంస్కృతిని అలవరుచుకోవాలని, డెడ్లైన్లు, ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు పనిచేసే చోటే కొంతసేపు కునుకేసినా పరవాలేదని మస్క్ గతంలో పేర్కొనడాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఐతే సిక్లీవ్లకు సంబంధించి టెస్లా వివాదాస్పద విధానాలను అవలంబిస్తోందనే విమర్శలు మరోవైపు ఉండనే ఉన్నాయి. జర్మన్ కార్ల ప్లాంట్‌లో ఏటా పదిలక్షల కార్లు ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. కానీ సప్లయ్ చెయిన్ సమస్యలు, ఉత్పత్తి నిలిచిపోవడం, డిమాండ్ తగ్గుదల వంటి కారణాలతో అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోవడం అక్కడ సమస్యగా మారింది. ఐతే టెస్లా తన విధానాలను గట్టిగా సమర్థిస్తూనే.. సెలవు తీసుకున్న ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి తనిఖీ చేయడం అనేది జవాబుదారీతనం పెంపుదలకు అవసరమని నొక్కి చెబుతోంది. కానీ ఇలాంటి విధానాల వల్ల ఇప్పటికే అధిక పనివత్తిడితో బాధపడుతున్న ఉద్యోగులను మరింత ఆందోళనకు, చిరాకుకు గురిచేయడమే అవుతుందని యూనియన్లు, వర్కర్లు వాదిస్తున్నారు. -
జర్మనీలో ఘనంగా ఉగాది వేడుకలు!
జర్మనీలోని శ్రీ గణేష్ ఆలయంలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో దాదాపు 200 కుటుంబాలు దాక పాల్గొన్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జర్మనీ రాయబారి హెచ్ఈ పర్వతనేని హరీష్ విచ్చేశారు. ఈ ఉగాది కార్యక్రమాలు తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రఘు చలిగంటి సారథ్యంలో జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యక్షులు వెంకట రమణ బోయినపల్లి, కార్యదర్శి అలేక్య బోగ, సాంస్కృతిక కార్యదర్శులు శరత్ రెడ్డి, యోగానంద్, కోశాధికారి బాలరాజ్ అందె, సోషల్ మీడియా కార్యదర్శులు నరేష్, నటేష్ గౌడ్, వాలంటీర్ టీమ్ సహాయ సహకారాలతో జయప్రదం చేశామని డాక్టర్ రఘు అన్నారు. ఈ సంప్రదాయ కార్యక్రమం, సాంస్కృతిక ప్రదర్శనలు సమాజా స్ఫూర్తికి అర్థానిచ్చేలా విజయవంతంగా జరిగాయని నిర్వాహకులు వెల్లడించారు. అంతేగాదు ఈ ఉగాది కార్యక్రమాలు ఇంతలా గుర్తుండిపోయేలా విజయవంతం చేసినందుకు వాలంటీర్లకు, సహకరించిన వారికి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుక కొత్త ఏడాదిని మాత్రమే కాకుండా, బెర్లిన్‌లో తెలుగు ప్రవాసులలో బలమైన సమాజ బంధాలను, సాంస్కృతిక వారసత్వాన్ని హైలెట్ చేసిందని నిర్వాహకులు కొనియాడారు. (చదవండి: సింగపూర్‌లో తమిళ భాష వైభవం.. ప్రోత్సహిస్తున్న ఆ దేశ మంత్రి!) -
ఓటీటీకి రియల్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రస్తుతం ఓటీటీ వచ్చాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్‌ను సినీ ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా సబ్ టైటిల్స్‌తోనే చూసేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే రోజు రోజుకు కొత్త కొత్త కంటెంట్‌ను ఓటీటీలు అందిస్తున్నాయి. అదే సమయంలో క్రైమ్ థ్రిల్లర్ లాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తాజాగా కంటెంట్‌తోనే యధార్థ సంఘటనల ఆధారంగా సరికొత్త క్రైమ్ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. క్రైమ్ సీన్ బెర్లిన్: నైట్ లైఫ్ కిల్లర్ అనే పేరుతో బెర్లిన్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించారు. ఈ డాక్యుమెంటరీ సిరీస్ రహస్యమైన, విచిత్రమైన హత్యల కేసుల ఆధారంగా తెరకెక్కించారు. ఈ రియల్ క్రైమ్ కథకు జాన్ జాబీల్, కరోలిన్ షాపర్ దర్శకత్వం వహించారు. ఈ ఆసక్తికర డాక్యుమెంటరీ సిరీస్ త్వరలోనే ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే 2012లో జరిగిన చీకటి సంఘటనల గురించి అవగాహన కల్పించడానికి ఈ సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మేకర్స్. క్రైమ్ సీన్ బెర్లిన్: నైట్‌లైఫ్ కిల్లర్‌లో కేవలం మూడు సీజన్లు మాత్రమే ఉన్నాయి. ఈ సిరీస్‌లో రిక్ హబ్నర్, ట్రిస్టన్ బమ్, కార్నెలియా వెర్నర్ ప్రధాన పాత్రలు పోషించారు. -
బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు బన్నీ
-
ఎర్ర సముద్రంలో అలజడి.. టెస్లాకు గట్టి దెబ్బ!
గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని నిరసిస్తూ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. హౌతీల ఆగడాలకు అడ్డుకట్టవేయడానికి అమెరికా సహా 12 మిత్ర దేశాలు ఏకమయ్యాయి. ఎర్రసముద్రంలో గస్తీ నిర్వహిస్తున్నాయి. వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. ఎర్ర సముద్రంలో హౌతీలు సృష్టిస్తున్న అలజడుల దెబ్బ అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా (Tesla)కు గట్టిగా తగిలింది. తన బెర్లిన్ ఫ్యాక్టరీలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 11 వరకు చాలా కార్ల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టెస్లా ప్రకటించినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ఎర్ర సముద్రంలోని నౌకలపై జరుగుతున్న దాడుల ప్రభావం సరకు రవాణాపై తీవ్రంగా పడింది. దీంతో కంపెనీకి విడిభాగాల సరఫరా తగ్గిపోయింది. ఫలితంగా ఉత్పత్తిని నిలిపేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇరాన్-మద్దతుగల హౌతీ మిలిటెంట్లు గాజాలోని హమాస్‌కు సంఘీభావంగా ఎర్ర సముద్రంలో నౌకలు లక్ష్యంగా చేస్తున్న దాడులకు పర్యవసానంగా తగిలిన గట్టి దెబ్బగా దీన్ని భావిస్తున్నారు. ఎర్ర సముద్రంలో జరుగుతున్న సాయుధ దాడుల కారణంగా కేప్ ఆఫ్ గూడ్ హోప్ ద్వారా యూరప్, ఆసియా మధ్య రవాణా మార్గాలలో మార్పులు జరగడం తమ బెర్లిన్ ఫ్యాక్టరీలో ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నట్లు టెస్లా ఒక ప్రకటనలో తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఉత్పత్తి నిలిపోవడానికి నిర్దిష్ట కారణాలను వెల్లడించనప్పటికీ ఫిబ్రవరి 12న పూర్తి ఉత్పత్తిని పునఃప్రారంభించనున్నట్లు టెస్లా పేర్కొంది. ఎర్ర సముద్రంలో అలజడి కారణంగా ఇతర వాహన తయారీదారులు ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవచ్చని ఆటో పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టెస్లాతోపాటు చైనీస్ ఆటోమొబైల్ కంపెనీ గీలీ, అతిపెద్ద ఫర్నీచర్ కంపెనీ ఐకియా సహా అనేక కంపెనీలు డెలివరీ ఆలస్యం గురించి ఇప్పటికే హెచ్చరించాయి. -
ఓటీటీలో దూసుకెళ్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. మీరు చూశారా?
ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ విషయానికొస్తే ఒకరకంగా ఓటీటీల యుగమనే చెప్పుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా తెరకెక్కిస్తోన్న చిత్రాలు సైతం ఇంట్లో కూర్చోనే చూసేస్తున్నాం. ఇక వెబ్ సిరీస్‌ల సంగతి చెప్పాల్సిన పనిలేదు. గంటల తరబడి ఎపిసోడ్స్ ఉన్నప్పటికీ ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఓటీటీలు సైతం ఆసక్తికరమైన స్టోరీలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఓటీటీలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాక ఎక్కువ మంది యువత ఆసక్తిగా చూసిన సిరీస్‌లలో మనీ హైస్ట్ ఒకటి. స్పానిష్‌లో రూపొందిన ఈ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్రేజ్ దక్కించుకుంది. యువతను విశేషంగా ఆకట్టుకున్న ఈ సిరీస్ పలు స్థానిక భాషల్లోనూ అలరించింది. ఈ సిరీస్ మొదటి రెండు పార్టుల్లో కనిపించే కీలక పాత్ర బెర్లిన్. అయితే మనీ హైస్ట్కు ముందు అతడు చేసిన మరో దోపిడీతో తాజాగా బెర్లిన్ అనే వెబ్ సిరీస్‌ను రూపొందించారు. అయితే తాజాగా ఈ సిరీస్‌కు ప్రీక్వెల్‌గా తెరకెక్కించిన బెర్లిన్ అనే వెబ్ సిరీస్ ఇటీవలే రిలీజైంది. ఓటీటీలో రిలీజైన ఈ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన వస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎందుకంటే ఇలాంటి సిరీస్‌లు ఇష్టపడే ప్రేక్షకులకు మంచి కిక్‌ను అందిస్తాయి. మరీ ముఖ్యంగా మనీహైస్ట్ అభిమానులు ఇలాంటి వాటికి బాగా కనెక్ట్ అవుతారు. మీలో ఎవరైనా మనీ హైస్ట్ లాంటి సిరీస్‌లు నచ్చేవారుంటే తప్పకుండా బెర్లిన్ సిరీస్ ఓసారి ట్రై చేయండి. ఇందులో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉండగా.. సిరీస్ తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. అసలేంటి బెర్లిన్ స్టోరీ.. మనీ హెయిస్ట్ సిరీసులో చూపించే దొంగతనాల వెనుక ఫ్రొఫెసర్, అతని సోదరుడు బెర్లిన్ ఇద్దరూ మాస్టర్ మైండ్స్ ఉంటారు. వీరిలో ఇద్దరికి సూపర్ క్రేజ్ వచ్చింది. వీరిలో ఒకరైన బెర్లిన్ మనీ హైస్ట్ కన్నా ముందు చేసిన దోపిడీ ఏంటి? అనే విషయాన్ని ఈ సిరీస్‌లో తెరకెక్కించారు. కాగా బెర్లిన్ పాత్రలో పెడ్రో అలోన్సో అద్భుతంగా నటించాడు. ఆయనతో పాటు సమంత సిక్వోరోస్, ట్విస్టన్ ఉల్లోవా, మిచెల్ జెన్నర్, బెగోనా వర్గాస్, జూలియో పెనా ఫెర్నోండోజ్, జోయెల్ శాంఛైజ్ కీలక పాత్రలు పోషించారు. -
చరిత్ర సృష్టించిన భారత మహిళా ఆర్చర్లు.. జ్యోతి సురేఖకు హ్యాట్సాఫ్!
World Archery Championships 2023- Berlin: భారత మహిళా ఆర్చర్లు జ్యోతి సురేఖ వెన్నం, పర్ణీత్ కౌర్, అదితి గోపీచంద్ చరిత్ర సృష్టించారు. ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్ మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. తద్వారా.. వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో దేశానికి తొలి పసిడి పతకం అందించిన ఆర్చర్లుగా రికార్డులకెక్కారు. కాగా జర్మనీలోని బెర్లిన్‌లో శుక్రవారం జరిగిన టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత జట్టు మెక్సికన్ టీమ్‌పై 235-229తో గెలిచింది. డఫ్నే క్వింటెరో, అనా సోఫా హెర్నాండెజ్ జియోన్, ఆండ్రియా బెసెర్రాలపై పైచేయి సాధించి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. దీంతో ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో భారత్ పతకాల సంఖ్య 11కు చేరింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇక బుధవారం నాటి ఈవెంట్లో రెండో సీడ్‌గా నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన జ్యోతి సురేఖ బృందం 230–228తో తుర్కియే జట్టుపై గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో 228–226తో చైనీస్ తైపీపై గెలిచి సెమీస్ చేరింది. సెమీఫైనల్లో 220–216తో కొలంబియాపై నెగ్గి ఫైనల్లోకి అడుగు పెట్టి.. మెక్సికోను ఓడించి టైటిల్ విజేతగా నిలిచింది. మన అమ్మాయి బంగారం కాగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన జ్యోతి సురేఖకు ఈ మెగా ఈవెంట్ చరిత్రలో ఇది ఆరో పతకం కావడం విశేషం. 27 ఏళ్ల జ్యోతి సురేఖ ఇప్పటి వరకు టీమ్ విభాగంలో రెండు రజతాలు (2021, 2017), ఒక కాంస్యం (2019)... వ్యక్తిగత విభాగంలో ఒక రజతం (2021), ఒక కాంస్యం (2019) తన ఖాతాలో జమచేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా జ్యోతి పసిడి పతకం గెలవడంతో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. HISTORIC win for India 🇮🇳🥇 New world champions at the Hyundai @worldarchery Championships.#WorldArchery pic.twitter.com/8dNHLZJkCR — World Archery (@worldarchery) August 4, 2023 -
క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన జ్యోతి సురేఖ
బెర్లిన్ (జర్మనీ): గురి తప్పని ప్రదర్శనతో భారత స్టార్ ఆర్చర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. క్వాలిఫయింగ్‌లో రెండో ర్యాంక్‌లో నిలిచిన జ్యోతి సురేఖకు నేరుగా మూడో రౌండ్‌కు ‘బై’ కేటాయించారు. మూడో రౌండ్ మ్యాచ్‌లో జ్యోతి సురేఖ 139–136తో లికోఅరెలో (అమెరికా)పై, నాలుగో రౌండ్లో 148–145తో ఓ యూహున్ (దక్షిణ కొరియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ధీరజ్ పరాజయం పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 4–6తో రికార్డో సాటో (చిలీ) చేతిలో పరాజయం చవిచూశాడు. -
రెండో సీడ్‌గా జ్యోతి సురేఖ, ధీరజ్
World Archery Championship Qualifications- బెర్లిన్ (జర్మనీ): ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, బొమ్మదేవర ధీరజ్ మెరిశారు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ ర్యాంకింగ్ రౌండ్లో మహిళల కాంపౌండ్ విభాగంలో జ్యోతి సురేఖ 701 పాయింట్లు... పురుషుల రికర్వ్ విభాగంలో ధీరజ్ 683 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచారు. ఫలితంగా నాకౌట్ దశలో రెండో సీడింగ్ పొందిన జ్యోతి సురేఖ, ధీరజ్లకు నేరుగా మూడో రౌండ్‌కు ‘బై’ లభించింది. ప్రిక్వార్టర్స్‌లో గాయత్రి జోడీ సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీ తొలి రౌండ్లో... సిక్కి రెడ్డి–ఆరతి సారా సునీల్ జంట క్వాలిఫయింగ్‌లో నిష్క్రమించాయి. తొలి రౌండ్ మ్యాచ్‌లో గాయత్రి–ట్రెసా జాలీ 21–16, 21–17తో కేథరీన్ చోయ్–జోసెఫిన్ వు (కెనడా)లపై గెలిచారు. అశి్వని–తనీషా 11–21, 21–14, 17–21తో ఫెబ్రియానా కుసుమ–అమాలియా ప్రతవి (ఇండోనేసియా) చేతిలో... సిక్కి రెడ్డి–ఆరతి 14–21, 17–21తో సు యిన్ హుయ్–లీ చి చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయారు. -
ఆమె పోరాడింది.. టాప్‌లెస్ సమానత్వం సాధించింది
జర్మనీ రాజధాని నగరం బెర్లిన్‌లోని బహిరంగ ప్రదేశాల్లోని స్విమ్మింగ్ పూల్స్‌లో ఇకపై ఆడామగా తేడా లేకుండా టాప్‌లెస్‌గా ఈత కొట్టొచ్చు. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేశారు అధికారులు. దీనికి ఓ మహిళ చేసిన పోరాటమే కారణం. తాజాగా నగరంలోని ఓ స్విమ్మింగ్ పూల్ వద్ద టాప్‌లెస్‌గా సన్‌బాత్ చేసింది ఒకావిడ. అది గమనించిన నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆమెను బలవంతంగా బయటకు పంపించేశారు. దీంతో ఆమె సెనేట్ ఆంబుడ్స్పర్సన్ ఆఫీస్‌ను సంప్రదించింది. మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లను చూడాలని.. టాప్‌లెస్‌గా ఈతకు అనుమతించాలని పోరాటానికి దిగింది. ఆమె డిమాండ్‌కు అధికారులు దిగొచ్చారు. వివక్షకు పుల్‌స్టాప్ పెడుతున్నట్లు బెర్లిన్ అధికారులు ప్రకటించారు. బెర్లిన్‌లో స్మిమ్మింగ్ పూల్స్ నిర్వాహణ చూసుకునే బెర్లినర్ బేడర్బెట్రీబే.. తమ నిబంధనలను సవరిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశాయి. అయితే ఆ మహిళ వివరాలను మాత్రం బయటకు వెల్లడించలేదు. జర్మనీ సాధారణంగా న్యూడిటీ విషయంలో పెద్దగా పట్టింపులు లేని దేశం. కాకపోతే పూర్తి నగ్నత్వాన్ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ప్రోత్సహించదు. -
నగరంలో కిచెన్ గార్డెనింగ్ ప్రయోజనాలివే.. ఇలా చేశారంటే..
బెర్లిన్.. జర్మనీ రాజధాని నగరం. యూరోపియన్ యూనియన్లోకెల్లా జనసమ్మర్దం ఎక్కువగా ఉండే నగరం. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు పంటలు సాగు చేసుకోవడానికి అనువైన కాలం. మిగతా నెలల్లో మంచుకురుస్తూంటుంది. అర్బన్ అగ్రికల్చర్ కార్యకలాపాల సంప్రదాయం బెర్లిన్ నగరానికి కొత్తేమీ కాదు. కమ్యూనిటీ గార్డెన్లు, కిచెన్ గార్డెన్లలో కూరగాయలు, పండ్ల సాగు సుదీర్ఘకాలంగా జరుగుతున్నదే. అయితే, నగరవాసులకు అవసరమైన కూరగాయలు మాత్రం ఎక్కడి నుంచో నగరానికి తరలించక తప్పటం లేదు. ఈ పరిస్థితిని మార్చలేమా? వ్యాపకంగా సాగుతున్న అర్బన్ అగ్రికల్చర్‌ను మరింత సీరియస్‌గా తీసుకొని ఖాళీ జాగాల్లో పండిస్తే నగర కూరగాయల అవసరాలు ఎంత మేరకు తీరుతాయి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నంలో భాగంగా మొట్ట మొదటిసారిగా ఇటీవల సమగ్ర అధ్యయనం జరిగింది. బెర్లిన్ కూరగాయల వినియోగంలో 82 శాతం వరకు నగరంలోనే పండించుకోవచ్చని ఈ అధ్యయనంలో తేలింది! 200 కమ్యూనిటీ గార్డెన్లు.. పోట్స్‌డ్యామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్‌లో పరిశోధకుడిగా ఉన్న డియెగో రిబ్స్కీ బృందం ఈ అధ్యయనం చేసింది. నివాస ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాల్లో కూరగాయల సాగుకు పేదలకు కేటాయించిన తోటలు, భవనాలపై బల్లపరుపుగా ఉన్న పై కప్పులు, సూపర్ మార్కెట్ పార్కింగ్ స్థలాలతో పాటు మూసివేసిన శ్మశానవాటిక స్థలాల్లో ఎంత మేరకు కూరగాయలు సాగు చేయొచ్చో అధ్యయనం చేశారు. బెర్లిన్‌లో ఇప్పటికే 200 కంటే ఎక్కువ కమ్యూనిటీ గార్డెన్లు ఉన్నాయి. పేదలు కూరగాయలు పండించుకోవడానికి ప్రభుత్వ స్థలాల్లో కేటాయించిన చిన్న ప్లాట్లు 73,000 కంటే ఎక్కువగానే ఉన్నాయి. వీటికి తోడుగా, భవనాల పైకప్పులు, నివాస ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు, పెద్ద గృహ సముదాయాల మధ్య పచ్చటి ప్రదేశాలలో కూడా కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేసే గొప్ప అవకాశం ఉందని ఈ అధ్యయనం ద్వారా గుర్తించారు. కార్ల సంఖ్యను తగ్గించే ప్రణాళికలు రచిస్తున్నందున పార్కింగ్ స్థలాలను కూడా కూరగాయలు పండించడానికి ఉపయోగించుకోవచ్చని రిబ్స్కీ అన్నారు. తక్కువ స్థలంలో ఎక్కువ కూరగాయలు.. బెర్లిన్‌లోని మొత్తం 4,154 హెక్టార్లలో కూరగాయలు పండించవచ్చని అధ్యయనంలో తేలింది. నగర వైశాల్యంలో ఇది దాదాపు 5 శాతం. ఈ భూమి మొత్తంలో కూరగాయలు పండిస్తే బెర్లిన్ కూరగాయల డిమాండ్‌లో 82 శాతం స్థానికంగా తీరిపోతుందని రబ్స్కీ పేర్కొన్నారు. అయితే, ఈ కల సాకారమవ్వాలంటే నీరు, మానవ వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. 75.3 కోట్ల యూరోల పెట్టుబడి అవసరం. వినటానికి అంతా డబ్బా అనిపిస్తుంది గానీ.. 2020వ సంవత్సరంలో బెర్లిన్ స్థూల దేశీయోత్పత్తిలో ఇది దాదాపు 0.5 శాతం మాత్రమే. సవాళ్లు అనేకం.. నగరంలో తోట పనిని ప్రోత్సహించి ఈ కలను సాకారం చేయాలంటే అధిగమించాల్సిన సవాళ్లు తక్కువేమీ కాదు. ‘స్థలం ఉంది, కానీ ఇంకా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు, తోట పనిని ఎవరు చేయబోతున్నారు? ప్రైవేట్ తోటమాలులను నియమించి సాగు చేయిస్తామా? లేదా వ్యాపార నమూనా అవసరమా? పేదలకు కేటాయించిన తోటల్లో ఉత్పత్తిని పెంచగలమా? నగరంలో వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఎటువంటి పరిస్థితులను సృష్టించగలం? వంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సి ఉంటుందని అధ్యయనకారులు అంటున్నారు. ‘స్థానికంగా కూరగాయల సాగు బహుశా చాలా ఖరీదైన పని కావచ్చు. అయితే, సేంద్రియంగా పండిస్తాం. కాబట్టి, కొత్త బ్రాండ్‌ను సృష్టించుకోవచ్చు. అందుకని సూత్రప్రాయంగా ఇది సానుకూల పరిణామమని నేను నమ్ముతున్నాను’ అన్నారు పోట్స్‌డ్యామ్ ఇన్స్టిట్యూట్కు చెందిన మారియన్ డి సిమోన్. నగరంలో కిచెన్ గార్డెనింగ్ ప్రయోజనాలు.. సేంద్రియ కూరగాయల లభ్యత పెరగడంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి. ఎవరికి వారుగా ఉండిపోయిన నగర ప్రజలను కమ్యూనిటీ గార్డెన్లు ఒకచోటకు చేర్చుతాయి. పచ్చని ప్రదేశాలు ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణం, జీవవైవిధ్యానికి మేలు చేస్తాయి. స్థానిక ఆహార ఉత్పత్తితో దూరం నుంచి కూరగాయల రవాణా వల్ల వెలువడే కర్బన ఉద్గారాలు కూడా తగ్గుతాయి. ఇన్ని ప్రయోజనాలున్న అర్బన్ గార్డెనింగ్పై సీరియస్‌గా దృష్టి పెట్టడం బెర్లిన్కే కాదు, మన నగరాలకూ ఎంతో అవసరం. కానీ, మన పాలకులు గుర్తించేదెన్నడో కదా?! -పంతంగి రాంబాబు చదవండి: ఫంగల్ వ్యాధుల్ని నివారించే తెల్లముల్లంగి! -
బెర్లిన్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
-
బెర్లిన్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
బెర్లిన్: సంక్రాంతి పండుగను దేశదేశాల్లోని తెలుగువారు ఘనంగా జరుపుకుంటున్నారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో సంక్రాంతి పర్వదినాన్ని తెలుగువారు సంప్రదాయబద్దంగా నిర్వహించుకున్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ (టాగ్) ఆధ్వర్యంలో స్థానిక శ్రీ గణేష్ ఆలయంలో జరిగిన ఈ వేడుకలకు భారత రాయబారి పర్వతనేని హరీష్, ఆయన సతీమణి నందిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ఆట పాటలతో సాగిన వేడుకల్లో పిల్లాపాపలతో కలిసి పెద్ద సంఖ్యలో తెలుగువారు పాల్గొన్నారు. అమికల్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు అంజనా సింగ్ ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శార్వరి పనంగిపల్లి కూచిపూడి నృత్య ప్రదర్శన, సర్వాణి గురజాడ శాస్త్రీయ గానం సభికులను అలరించాయి. పిల్లల కోసం డ్రాయింగ్ పోటీలు.. మహిళలకు రంగోళి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పర్వతనేని హరీష్ మాట్లాడుతూ.. బెర్లిన్‌లో సంక్రాంతి సంబరాలు జరపడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు వారికి దౌత్యపరంగా ఎటువంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధమని కరతాళధ్వనుల మధ్య ప్రకటించారు. వేడుకల నిర్వహణలో మద్దతుగా నిలిచిన శివమ్ భాయ్, కృష్ణ మూర్తి, జైరాం నాయుడు, శ్రీనివాస్‌లకు ‘టాగ్’ కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది. ‘టాగ్’ అధ్యక్షుడు డాక్టర్ రఘు చలిగంటి, ఉపాధ్యక్షుడు రామ్ బోయినపల్లి, కార్యదర్శి అలేఖ్య భోగ, కోశాధికారులు బాల్‌రాజ్ అందె, యోగానంద్ నాంపల్లి, సాంస్కృతిక కార్యదర్శులు శరత్ కమిడి, నరేష్ తౌతం, సోషల్ మీడియా సెక్రటరీలు శ్రీనాథ్, శివరామ్.. కార్యక్రమ నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. (క్లిక్ చేయండి: వొరే సీనయ్యా, యాడికి బోతుండవా?; అమెరికాలో నెల్లూరోళ్ల కబుర్లు) -
అక్వేరియం బద్దలైంది..!
బెర్లిన్: గిన్నిస్ రికార్డులకెక్కిన ప్రపంచంలోకెల్లా అతి పెద్ద అక్వేరియం ఉన్నట్టుండి బళ్లున బద్దలైంది. అందులోని 1,500 చేపలు చనిపోవడంతో పాటు ఏకంగా 10 లక్షల లీటర్ల పై చిలుకు నీళ్లు అక్వేరియమున్న హోటల్‌తో పాటు పరిసర వీధులనూ ముంచెత్తాయి! అక్వాడాం అని పిలిచే సిలిండర్ ఆకృతిలోని ఈ 46 అడుగుల ఎల్తైన అక్వేరియం జర్మనీలోని బెర్లిన్‌లో రాడిసన్ బ్లూ హోటల్లో ఉంది. 2003 నుంచీ సందర్శకులను అలరిస్తోంది. దీని నిర్మాణానికి రూ.100 కోట్లకు పైగా రూపాయలు ఖర్చయింది. ఇది బెర్లిన్‌లో అతి పెద్ద పర్యాటక ఆకర్షణగా మారింది. ఇందులో 10 నిమిషాల లిఫ్ట్ ప్రయాణం అద్భుతమైన అనుభూతి అని సందర్శకులు చెబుతుంటారు. రెండేళ్ల క్రితం దీన్ని ఆధునీకరించారు. ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 10 డిగ్రీలకు పడిపోయినందుకే అక్వేరియం బద్దలై ఉంటుందని భావిస్తున్నారు. -
మిర్చీ భార్గవి.. పరుగుల రాణీ..!
హాయ్.. హలో అంటూ సాక్షి టీవీలో బ్యాండ్ బాజా ప్రోగ్రాంను పరుగులెత్తించిన మిర్చీ భార్గవి నిజ జీవితంలో పరుగుల రాణీగా మారింది. హైదరాబాద్‌లో రేడియో జాకీగా బిజీగా ఉంటూనే వివిధ ప్రాంతాల్లో మారథాన్లలో పాల్గొంటోంది భార్గవి. ఫిట్నెస్ అంటే తనకు ప్రాణమని చెప్పుకునే భార్గవి.. మన జీవితం ఒకే సారి ఉంటుందని, ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవన విధనాంతో మరింత సంతోషంగా ఉండవచ్చని చెబుతోంది. మెరుగైన ఫిట్ నెస్ కోసం పరుగెత్తడం మొదలెట్టిన భార్గవి కొన్నాళ్లలోనే ప్రొఫెషనల్ రన్నర్‌గా మారిపోయింది. భార్గవి ఖాతాలో మూడు ప్రపంచంలోనే మూడు అతి పెద్ద మారథాన్లుగా పేరుపడ్డ బెర్లిన్ (జర్మనీ), న్యూయార్క్ (అమెరికా)లలో పాల్గొన్న భార్గవి.. ఈ నెలలో షికాగో (అమెరికా) మారథాన్లోనూ పాల్గొన్నారు. "ఒక్కసారి మారథాన్‌లో పాల్గొనడమనేది జీవితానికి సరిపడా అనుభవాలను, పాఠాలను నేర్పిస్తుంది. నువ్వు మారథాన్‌ను పూర్తి చేయగలిగితే జీవితంలో ఏదైనా సాధిస్తావన్న ఆత్మవిశ్వాసం కలిగిస్తుందంటారు" భార్గవి. వణికించే ఛాలెంజ్ షికాగో ఇటీవల షికాగోలో జరిగింది 44వ ఎడిషన్ మారథాన్. ఇందులో 40 వేల మంది వేర్వేరు దేశాల రన్నర్లు పాల్గొన్నారు. షికాగోను విండ్ సిటీ అని కూడా అంటారు. వణికించే చల్లటి ఈదురుగాలుల మధ్య మారథాన్‌లో పాల్గొనడమంటే మాటలు కాదు. గ్రాంట్ పార్క్ వద్ద ఎండ్ పాయింట్‌ను చేరుకున్న విజేతలు తమ స్వప్నాన్ని పూర్తి చేసుకున్నందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ప్లానింగ్ వర్సెస్ సక్సెస్ "ఇంత బిజీగా ఉంటావు, పరుగులెలా తీస్తున్నావని నన్ను అందరూ అడుగుతారు, ఒక రోజును మనం ఏ రకంగా ప్లాన్ చేసుకుంటున్నామన్న దాంట్లోనే ఉంది. ఫిట్నెస్ కోసం ప్రతీ రోజు కొంత సమయం కేటాయించుకోగలిగితే.. మనలో తేడా మనకే తెలుస్తుంది" అంటారు భార్గవి. ఆల్ ది బెస్ట్ పరుగుల రాణీ. -
దెబ్బతిన్న గుండెకు జీబ్రా ఫిష్ వైద్యం!
జీబ్రా ఫిష్ అనే ఈ చేపలు చాలా అందంగా ఉంటాయి. అవి ఎంత అద్భుతమైన జీవులంటే తమలోని కొన్ని దేహ భాగాలను అవి మళ్లీ పుట్టించుకోగల ప్రత్యేకత వాటి సొంతం. అవి తమ కంటిలోని రెటీనా కణజాలాన్ని మళ్లీ ఉత్పత్తి చేసుకోగలవు. ఏదైనా దెబ్బతగిలినప్పుడు గాయపడ్డ తమ గుండె కణజాలాన్ని మళ్లీ ఉత్పత్తి చేసుకోగలవని తాజాగా తేలింది. మనుషుల గుండె కండరాల్లోని కణాలను కార్డియోమయోసైట్స్ అంటారు. అవి జీబ్రాఫిష్లోలా పునరుత్పత్తి చెందలేవు. గుండె కండరానికి తగినంత ఆక్సిజన్ సరఫరా కాని సందర్భాల్లో... గుండెపోటు వస్తుంది. అప్పుడు మన గుండె తాలూకు కణాలు అంటే కార్డియోమయోసైట్స్ దెబ్బతింటాయి. ఫలితంగా దెబ్బతిన్న చోట గుండెపై చార/గాటు (స్కార్) లాంటిది ఏర్పడుతుంది. దీన్నే ‘ఫైబ్రోసిస్’అంటారు. ఇలా జరిగిన సందర్భాల్లో గుండె మునుపటి కంటే బలహీనమవుతుంది. అయితే జీబ్రాఫిష్‌లో గుండె కణాల ప్రవర్తన కాస్త విభిన్నంగా ఉంటుంది. ఏదైనా కారణంతో గుండె కణజాలం లేదా కణాలు దెబ్బతింటే కేవలం రెండు నెలల వ్యవధిలోనే.. ఒక మిల్లీమీటరు సైజులో ఉండే దాని గుండె కణాల్లో 20 శాతం మళ్లీ పుడతాయి. ఈ అధ్యయనం ద్వారా ఫైబ్రోబ్లాస్ట్స్ అనే కనెక్టివ్ కణజాలం తాలూకు కణాలు కండక్టర్లుగా పనిచేసి, రిపేరుకు తోడ్పడే సిగ్నల్స్ పంపే ప్రోటీన్ల సహాయంతో.. ఇలా కణాలు మళ్లీ పుట్టేలా చేస్తాయని తెలుస్తోంది. ఈ కొత్త అధ్యయనం ద్వారా జీబ్రా ఫిష్‌లో మాదిరిగా గుండె కణజాలం మళ్లీ పుట్టేలా చేసేందుకు... కణ ఆధారిత చికిత్సలు, మందులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. దెబ్బతిన్న భాగంలోని కణాలు మళ్లీ పుట్టేలా చేయడానికిగానీ లేదా దెబ్బతిన్న గుండె వద్ద పూర్తిగా రిపేరు చేసేందుకు గానీ వీలవుతుందన్న అద్భుతమైన విషయం తెలియవస్తోంది. ‘‘ఈ చిన్నచేప తమ అవయవాలను ఎలా పునరుత్పత్తి చేసుకోగులుతోందో తెలుసుకోవాలనుకుంటున్నాం’’అన్నారు జర్మనీలోని బెర్లిన్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సిస్టమ్స్ బయాలజీకి చెందిన ఫిలిప్ జంకర్. ఆయన తన పరిశోధనను సెంటర్ ఫర్ మాలెక్యులార్ మెడిసిన్‌కు చెందిన మాక్స్ డెల్బ్రక్తో పాటు కొనసాగించారు. పరిశోధన ఫలితాలు ‘నేచర్ జెనెటిక్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. మునుపు ఈ ఏడాదే మొట్టమొదటిసారిగా ఓ పంది గుండెను తీసి, మనిషికి అమర్చిన విషయం తెలిసిందే. (అయితే ఆ బాధితుడు ఈ చికిత్స జరిగిన రెండు నెలల్లోనే మరణించాడు). అలాగే ఈ ఏడాది మేలో గుండెపోటు తర్వాత దెబ్బతిన్న కణాలు వాటంతట అవే కొంతవరకు రిపేరు చేసుకుంటాయన్న విషయాన్ని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇక జూన్ లో ఎమ్ ఆర్ఎన్ఏ ప్రక్రియ ద్వారా జన్యుపరమైన సూచనలిస్తూ గుండెపోటుకు గురైన ఓ ఎలుక గుండె రిపేరు జరిగేలా ప్రయత్నించి, విజయం సాధించారు. తాజాగా ఈ అధ్యయనంలో ఓ అల్ట్రా కోల్డ్ నీడిల్‌తో మనుషుల్లో గుండెపోటు ఎలా వస్తుందో ఓ ఎలుకకూ అలాగే జరిగేలా చూశారు. అప్పుడు ఏం జరుగుతుందో పరిశీలించారు. ‘‘గుండెపోటుతో మనిషిలో ఏం జరుగుతుందో... ఎలుక గుండెకూ అదే జరిగింది. అయితే గుండెపోటుతో మనిషి ఆగిపోవచ్చు. కానీ జీబ్రాషిప్లో మాత్రం కొత్త ‘కార్డియోమయోసైట్స్’అనే కణాలు ఉద్భవిస్తుంటాయి. వాటితో దాని గుండె తాలూకు రిపేరు ప్రక్రియ కొనసాగుతుంది. కొత్తగా ఉద్భవించిన ఆ కణాలు స్పందనలనూ కొనసాగిస్తున్నాయి’’అని తెలిపారు ఫిలిప్ జుంకర్స్. ఆశాజనకమే కానీ.. జీబ్రాఫిష్ గుండెకు ఎలాంటి గాయం కానప్పుడు దాని నుంచి దాదాపు 2,00,000 కణాలను వేరుచేసి, సింగిల్ సెల్ సీక్వెన్సింగ్ అనే ప్రక్రియ ద్వారా వాటిని స్కాన్ చేశారు ఈ పరిశోధన బృందంలోని అధ్యయనవేత్తలు. ఆ కణాలను గుండెపోటు తర్వాత దెబ్బతిన్న కణాలతో పోల్చి చూశారు. వాటిలోని ఏ అంశాలు దెబ్బతిన్న తర్వాత చురుగ్గా మారి, రిపేరుకు తోడ్పడుతున్నాయనే విషయాలను పరిశీలించారు. మూడు రకాల ఫైబ్రోబ్లాస్ట్స్ రంగంలోని దూకి, కండరాల్లోని కణాలు తిరిగి పుట్టేలా పురిగొల్పే ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తున్నాయనీ... తిరిగి అవి కనెక్టివ్ కణజాలాన్ని ఉద్భవించేలా చేస్తున్నాయని వారి పరిశీలనలో తెలిసింది. మళ్లీ ఆ జన్యువులను పని జరగకుండా ఆపినప్పుడు.. ఈ పునరుత్పత్తి ప్రక్రియ జరగడం లేదని కూడా తెలుసుకున్నారు. తద్వారా ఈ పునరుత్పత్తి /రిపేరు ప్రక్రియలో ఫైబ్రోబ్లాస్ట్స్ కీలకమైన భూమిక పోషిస్తున్నట్లు తెలుసుకున్నారు. గుండెపోటు వచ్చినప్పుడు పుట్టే ఇన్ఫ్లమేటరీ కణాలైన ‘మ్యాక్రోఫేజెస్’కు వ్యతిరేకంగా ఈ ఫైబ్రోబ్లాస్ట్స్ పనిచేస్తూ, ఈ రిపేరు ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఎపీకార్డియమ్ అనే గుండె తాలూకు బయటిపొర సైతం ఈ పునరుత్పిత్తి ప్రక్రియలో చాలా చురుగ్గా పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. ప్రస్తుతానికి ఈ పరిశోధన కాస్త ఆశాజనకంగానే ఉన్నప్పటికీ మానవుల విషయంలో ఈ ఫైబ్రోబ్లాస్ట్ మెకానిజమ్ ఏ మేరకు పూర్తి సత్ఫలితాలు ఇస్తుందనే విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. కాకపోతే గుండెపోటుతో దెబ్బతిన్న గుండెను సమర్థంగా రిపేరు చేసేందుకు జరిగే ప్రయత్నాల్లో భవిష్యత్తులో ఈ పరిశోధన చాలా వరకు తోడ్పడే అవకాశమున్నట్లు పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
వెరైటీగా.. స్కర్టులో స్టార్ హీరో.. ఫోటోలు వైరల్
సినిమా ప్రమోషన్స్ కోసం హీరో, హీరోయిన్స్ రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. సినిమాను ఆడియెన్స్‌కు దగ్గర చేసేందుకు ఢిపరెంట్ కాన్సెప్ట్స్‌తో ప్రమోషన్స్ చేస్తుంటారు. హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్ కూడా తన సినిమాను ప్రమోట్ చేసేందుకు వెరైటీ గెటప్‌లో దర్శనమిచ్చాడు. తన మోస్ట్ అవైటెడ్ మూవీ 'బుల్లెట్ ట్రైన్' త్వరలోనే రిలీజ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్‌తో మాంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా బెర్లిన్ ప్రీమియర్‌కు వచ్చిన బ్రాడ్ పిట్ లినెన్ స్కర్ట్‌తో కనిపించి అందరికి షాకిచ్చాడు. మ్యాచింగ్ బ్రౌన్ జాకెట్, పింక్ షర్ట్‌తో స్టైలిష్ గెటప్‌లో సందడి చేశాడు. అంతేకాకుండా ఈ గెటప్‌లో తన కాలిపై ఉన్న టాటూలతో మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఒక కాలికి ఖడ్గమృగం, మరో కాలికి పుర్రె టూటూలతో బ్రాడ్ పిట్ స్పెషల్ లుక్‌లో కనిపించారు. ఇక ఈ ప్రీమియర్ షోకి జోయి కింగ్, ఆరోన్ టేలర్-జాన్సన్, బ్రియాన్ టైరీ హెన్రీతో సహా మిగిలిన తారాగణం సందడి చేసింది. -
మార్ఫింగ్ వీడియోతో కమెడియన్‌కు బిగుస్తున్న ఉచ్చు
ఢిల్లీ: ప్రముఖ కమెడియన్ కునాల్ కమ్రా మరోసారి వివాదంలో నిలిచాడు. యూరప్ దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. తొలుత జర్మనీలో పర్యటించిన విషయం తెలిసిందే. బెర్లిన్‌లో ప్రవాస భారతీయులతో ముఖాముఖి జరిపిన వేళ.. ఓ చిన్నారి దేశ భక్తి గేయం అలరించగా.. మోదీ కూడా హుషారుగా ఆ చిన్నారితో గొంతు కలిపారు. హే జన్మభూమి భారత్ అంటూ ఆ చిన్నారి వీడియో వైరల్ కాగా.. దానిని ‘మెహెన్గయి దాయన్ ఖాయే జాట్ హై’ అంటూ మరో ఆడియో క్లిప్‌తో మార్ఫింగ్ చేశారు ఎవరో. ఈ వీడియో కమెడియన్ కునాల్ కమ్రా తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. అయితే ఆ పోస్ట్ చూసిన.. ఆ చిన్నారి తండ్రి తీవ్రంగా స్పందించాడు. #WATCH PM Narendra Modi in all praises for a young Indian-origin boy as he sings a patriotic song on his arrival in Berlin, Germany pic.twitter.com/uNHNM8KEKm — ANI (@ANI) May 2, 2022 చెత్త అంటూ కునాల్‌ను తిట్టిపోశాడు ఆ చిన్నారి తండ్రి గణేష్ పోల్. ఏడేళ్ల తన కొడుకు మాతృదేశం కోసం పాట పాడానని, అంత చిన్న వయసులో ఉన్నా చెత్త వెధవ అయిన నీ కంటే తన దేశాన్ని ప్రేమిస్తున్నాడంటూ ఆయనొక ట్వీట్ చేశాడు. అంతేకాదు చిన్నపిల్లలతో కామెడీ ఏంటంటూ మండిపడ్డాడు. He is my 7 year old son, who wanted to sing this song for his beloved Motherland . Though he is still very young but certainly he loves his country more than you Mr. Kamra or Kachra watever u are Keep the poor boy out of your filthy politics & try to work on your poor jokes https://t.co/ECnBFSIWkI — GANESH POL (@polganesh) May 4, 2022 అయితే ఈ జోక్ అతని కొడుకు మీద వేసింది కాదంటూ కునాల్ కమ్రా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇదిలా ఉండగా.. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) ఈ విషయమై కునాల్ మీద చర్యలకు సిద్ధమైంది. ట్వీట్ డిలీట్ చేయించడంతో పాటు కునాల్ మీద చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను గురువారం ఆదేశించింది. అయితే విమర్శలు తారాస్థాయికి చేరడంతో ఆ వీడియోను డిలీట్ చేశాడు కునాల్ కమ్రా. చదవండి: ‘రాజద్రోహం’పై విస్తృత ధర్మాసనం అనవసరం -
‘నా కొడుకుని మీ నీచ రాజకీయాలకు దూరంగా ఉంచండి’
ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీ పర్యటన సందర్భంగా బెర్లిన్‌లో ఏడేళ్ల కుర్రాడు దేశభక్తి గీతాన్ని ఆలపించిన సంగతి తెలిసిందే. అయితే దానికి సంబంధించిన ఎడిట్ వీడియ కమెడీయన్ కునాల్ కుమ్రా షేర్ చేశాడు. దీంతో కుర్రాడి తండ్రి గణేష్ పౌల్ కుమ్రా పై మండిపడుతూ ఓ ట్వీట్‌ని షేర్ చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా 2010లో వచ్చి పిప్లీలైవ్ సినిమాలోని ‘హే జన్మభూమి భారత్’, మెహెంగయి దాయన్ ఖాయే జాత్ హై పాటను ఏడేళ్ల కుర్రాడు పాడారు. దీనికి సంబంధించిన ఎడిట్ వీడియో బయటకు రావడంతో ఆ కుర్రాడి తండ్రి గణేష్ పౌల్‌పై షేర్ చేసిన హస్యనటుడు కునాల్ కుమ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి బదులుగా గణేష్ పౌల్ ట్విట్టర్లో స్పందిస్తు ఏడేళ్ల వయసున్న నాబిడ్డ మాతృభూమి కోసం పాట పాడారని, ఇప్పటికి భారతదేశాన్ని మీ అందరి కంటే తన కొడుకు ఎక్కువగా ప్రేమిస్తున్నట్లు తెలిపారు. మిస్టర్ కుమ్రా లాంటి వాళ్లు ఏమనుకున్నా ఫర్వాలేదన్నారు. తన కుమారుడిని నీచ రాజకీయాలకు దూరంగా ఉంచి మీ జోకులకు పని చెప్పుకోండంటూ ఫైర్ అయ్యారు. He is my 7 year old son, who wanted to sing this song for his beloved Motherland . Though he is still very young but certainly he loves his country more than you Mr. Kamra or Kachra watever u are Keep the poor boy out of your filthy politics & try to work on your poor jokes https://t.co/ECnBFSIWkI — GANESH POL (@polganesh) May 4, 2022 #WATCH PM Narendra Modi in all praises for a young Indian-origin boy as he sings a patriotic song on his arrival in Berlin, Germany pic.twitter.com/uNHNM8KEKm — ANI (@ANI) May 2, 2022 చదవండి: పెళ్లి రోజు వరుడు సర్ప్రైజ్.. గిఫ్ట్ చూసి ఏడ్చేసిన వధువు! -
జర్మనీలో మోదీకి ఘనస్వాగతం... పాటతో అలరించిన బాలుడు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ యూరప్‌లో తన మూడు దేశల పర్యటన సందర్భంగా మొదటగా బెర్లిన్-బ్రాండెన్‌బర్గ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు భారత సంతతికి చెందిన ప్రజలు భారీగా ఘనస్వాగతం పలికారు. ఈ మేరకు ఒక యువ విద్యార్థి దేశభక్తి పాటతో మోదీకి ఘన స్వాగతం పలకగా.. మాన్యా అనే అమ్మాయి పెన్సిల్-స్కెచ్‌తో గీసిన ప్రధాని మోదీ చిత్రాన్ని బహుకరించింది. మోదీ ఈ పర్యటన భారత్, జర్మనీ ఇరు దేశాల మధ్య స్నేహాన్ని మరింతగా పెంపొందింప చేస్తోందన్నారు "నేను జర్మనీకి కొత్తగా నియమితులైన ఓలాఫ్ స్కోల్జ్‌తో చర్చలు జరుపుతాను. ఈ సమావేశంలో వ్యాపార ప్రముఖులతో కూడా సంభాషిస్తాను." అని మోదీ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఒక యువ విద్యార్థి తన పాటతో మోదీకి ఘనస్వాగతం పలికిన వీడియోతో పాటు, విద్యార్థులు మోదీ కాళ్లకు పాదాభివందనం చేస్తున్న వీడియోలు ట్విట్టర్లో వైరల్ అవుతున్నాయి. నార్డిక్ దేశాల నాయకులతో చర్చలు జరపడానికి మోదీ డెన్మార్క్‌ను కూడా సందర్శించాల్సి ఉంది. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన ఫ్రెంచ్ అధ్యక్షడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను కలవడానికి భారత ప్రధాని పారిస్‌కు వెళ్తారు. ఇది ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత ఈ ఏడాది మోదీ చేసిన తొలి విదేశీ పర్యటన. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా పలు సవాళ్లు ఎదుర్కొంటున్న యూరప్‌లో తాను పర్యటించబోతున్నాని మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే. #WATCH PM Narendra Modi in all praises for a young Indian-origin boy as he sings a patriotic song on his arrival in Berlin, Germany pic.twitter.com/uNHNM8KEKm — ANI (@ANI) May 2, 2022 #WATCH Indian diaspora extends a warm welcome to PM Modi in Berlin, Germany (Source:DD) pic.twitter.com/H0yX5LWut4 — ANI (@ANI) May 2, 2022 (చదవండి: తండ్రి కూతురికి సరిపోయే మ్యాచ్ తీసుకువస్తే...ఆమె ఏం చేసిందో తెలుసా?) -
‘ఫటో’నా మజాకా
ఈ చిత్రంలో కనిపిస్తున్న గొరిల్లా తీక్షణంగా చూస్తున్న వస్తువు ఏమిటబ్బా అని అనుకుంటున్నారా? ఇదో రైస్ కేక్. బియ్యం, వెన్న, పలు రకాల పండ్లు, కూరగాయలతో దీన్ని తయారు చేశారు. జర్మనీలోని బెర్లిన్‌లో ఉన్న ఓ జూలో ఫటో అనే ఈ ఆడ గొరిల్లా ఆరగించేందుకు ఇలా తెచ్చిపెట్టారు. ఇందులో ప్రత్యేకత ఏముందని అనుకుంటున్నారా? ఉందిలేండి.. తాజాగా ఈ గొరిల్లా 65 ఏళ్లు పూర్తి చేసుకుంది మరి! ప్రపంచంలోకెల్లా జీవించి ఉన్న అత్యంత వృద్ధ గొరిల్లాగా ఇది రికార్డులకెక్కింది. పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొనే కేక్‌పై ఎరుపు, నలుపు రంగులతో కూడిన జెమ్స్‌ను 65 అంకె ఆకారంలో ఉంచారు. ఇన్ని పదార్థాలతో చేసిన కేక్‌ను కళ్లెదుట ఉంచితే గొరిల్లా ఊరుకుంటుందా? పిసరంత కూడా మిగల్చకుండా మొత్తం కేక్‌ను గుటుక్కుమనిపించింది. జూ నిర్వాహకుల కథనం ప్రకారం పశ్చిమ ఆఫ్రికా అడవుల్లో 1957లో పుట్టిన ఈ గొరిల్లాను ఫ్రాన్స్‌కు చెందిన ఓ నావికుడు తన దేశానికి తీసుకెళ్లాడు. 1959లో దీన్ని జర్మనీ తీసుకొచ్చిన అతను.. మద్యానికి నగదు లేక గొరిల్లాను ఇచ్చేశాడు. దీంతో అప్పటి నుంచి ఈ గొరిల్లా జూలోనే జీవిస్తోంది. అడవుల్లోని గొరిల్లాల జీవితకాలం సుమారు 40 ఏళ్లు ఉంటుందని, జూలో ఉంటుండటంతో ఫటో ఇంత దీర్ఘకాలంపాటు జీవించగలుగుతోందని జూ నిర్వాహకుడు క్రిస్టియన్ ఆస్ట్ పేర్కొన్నాడు. వృద్ధాప్యం మీదపడ్డా నేటికీ ఫటో ఎంతో ఆరోగ్యంగా ఉందని, ఆకలి మందగించడం వంటి సమస్యలేవీ దీనికి లేవని చెప్పాడు. సుమారు 200 కేజీల బరువు ఉండే గొరిల్లాలు రోజూ 15 నుంచి 20 కిలోల వరకు గడ్డి, ఆకులు, బెరళ్లు, పండ్లు ఆరగిస్తాయని వివరించాడు. -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. మత్తిచ్చి చంపి తినేశాడు!
టెక్నాలజీ పరంగా ప్రపంచ దేశాలు అభివృద్ధి పథంలోకి సాగుతుంటే మరోవైపు మనుషులు తమ వికృత ఆలోచనలకు తెరలేపుతున్నారు. ఇది వరకు నేరాలు చేసేవాళ్లంతా కేవలం చదువుకోకపోవడంతో మూర్ఖంగానో లేక క్షణికావేశంలో అజ్ఞానంతో చేసేవారు. కానీ ఇప్పుడూ బాగా చదువుకుని ఏది మంచో, ఏది చెడో కూడా తెలిసి మంచి ఉన్నత స్థితిలో ఉండి కూడా విశృంఖలపు ఆలోచనలతో విచిత్రమైన నేరాలు చేస్తున్నవారే కోకొల్లలు. అయితే ఇక్కడోక వ్యక్తి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అత్యంత దారుణమైన నేరానికి ఒడిగట్టాడు. (చదవండి: చిప్స్ ప్యాకెట్లతో నులి వెచ్చటి దుప్పట్లు!) అసలు విషయంలోకెళ్లితే...జర్మనీ మాజీ ఉపాధ్యాయుడు స్టెఫాన్ ఆర్ స్వలింగ సంపర్కుడు. ఈ మేరకు స్టెఫాన్ ఆర్ నరమాంస భక్షణ నిమిత్తం ఆన్లైన్లో డేటింగ్ యాప్ ద్వారా ఒక వ్యక్తిని పరిచయం చేసుకున్నాడు. అంతేకాదు కలుద్దామని ఇంటికి పిలిపించి మరీ డ్రగ్స్ ఇచ్చి మత్తులోకి జారుకున్న తర్వాత గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత అతని జననాంగాలను కోసి తినేశాడు. ఈ మేరకు ఆ టీచర్ అతని శవాన్ని ముక్కలుగా కోసి బెర్లిన్‌లో ఈశాన్య పాంకో జిల్లాలో చెల్లా చెదురుగా పడేశాడు. అయితే పోలీసులు బెర్లిన్ పార్కులో మానవ అవశేషాలను గుర్తించడంతో నవంబర్ 2020న ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఇంతకి ఆ అవశేషాలను తప్పిపోయిన స్టెఫాన్ టీకి సంబంధించినవిగా పోలీసులో గుర్తించారు. ఆ తర్వాత బాధితుడి ఫోన్లోని కాల్‌డేటా ఆధారంగా నిందుతుడు స్టెఫాన్ ఆర్గా గుర్తించి అరెస్టు చేశారు. అయితే బెర్లిన్ కోర్టు తాజాగా ఈ కేసు పూర్వాపరాలను విచారిస్తూ ఇది అత్యంత అమానవీయమైన కేసుగా అభివర్ణించింది. ఈ మేరకు ప్రిసైడింగ్ జడ్జీ మాథియాస్ షెర్ట్జ్ మాట్లాడుతూ..." 30 ఏళ్లుగా న్యాయమూర్తిగా నా సర్వీస్‌లో ఎన్నో కేసులు చవిచూశాను కానీ ఇంతటి అమానుషమైన కేసు ఇంతవరకు చూడలేదు" అని అన్నారు. అంతేకాదు నరమాంస భక్షణలో భాగంగానే స్టిఫాన్ టీని చంపి శరీరాన్ని కోసి తిన్నట్లు నిర్ధారించారు. ఈ మేరకు ఇంత భయంకరమైన అమానుష చర్యకు పాల్పడినందుకు గానూ అతనికి జీవిత ఖైదు విధించారు. పైగా నింధితుడి తరుపు న్యాయవాదులు బాధితుడు తన ఇంట్లోనే సహజ కారణాలతో చనిపోయాడని, తమ స్వలింగ సంపర్కం గురించి ప్రజలు తెలుసుకుంటారనే భయంతోనే స్టిఫాన్ ఆర్ అతని మృతదేహాన్ని నరికి పారవేశాడని వాదించారు. కానీ కోర్టు వాటన్నింటిని తిరస్కరించి ఆ నిందితుడి కఠిన శిక్ష విధించింది. అయితే నిధింతుడు శిక్ష విధించే క్రమంలో మౌనంగా ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. (చదవండి: ‘టైం కి డ్రోన్ రాకపోయుంటే నా ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి’) -
నీ కుక్కను సరిగ్గా ట్రైన్ చేసుకో.. నా కుక్కనే అంటావా!
బెర్లిన్: సాధారణంగా కొందరు శునకాలను చాలా ఇష్టంగా పెంచుకుంటారు. వాటిని తమ ఇంట్లో మనుషుల మాదిరిగా చూసుకుంటారు. వాటిని ఎవరు ఏమన్నా.. ఆగ్రహంతో ఊగిపోతుంటారు. తాజాగా, ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. జర్మనీలోని తురింజియా పట్టణంలో 27 ఏళ్ల మహిళ, 51 ఏళ్ల మరో మహిళ తమ పెంపుడు కుక్కలను తీసుకుని స్థానికంగా ఉన్న పార్కులో వాకింగ్‌కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఒక శునకం.. మరో శునకాన్ని చూస్తు అరుస్తూ దాడికి తెగబడింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన 51 ఏళ్ల మహిళ.. మరో మహిళపై వాగ్వాదానికి దిగింది. శునకాన్ని సరిగ్గా ట్రైన్ చేసుకోవాలని చెప్పింది. దీంతో వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవ పెరిగి.. ఒకరిపై మరొకరు దాడిచేసుకోవడం వరకు వెళ్లింది. ఒకరిని మరోకరు కొరుక్కుంటూ గాయపర్చుకున్నారు. పాపం.. మహిళలిద్దరు కొట్టుకోవడాన్ని వారి శునకాలు చూస్తూ ఉండిపోయాయి. ఆ ప్రదేశంలో ఉన్న స్థానికులు వారి గొడవను ఆపటానికి సాహసించలేదు. ఈ సంఘటన తర్వాత ఇరువురు స్థానిక పోలీసుస్టేషన్ వెళ్లి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘మీ కన్నా.. శునకాలే నయం..’, ‘వామ్మో.. ఇలా కరుచుకున్నారేంటీ..’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. -
చిత్తూరు అబ్బాయి, కశ్మీర్ అమ్మాయి.. బెర్లిన్‌లో ప్రేమ..
సాక్షి, పీలేరు(చిత్తూరు): బెర్లిన్‌లో ప్రేమించుకున్న ప్రేమజంటకు పీలేరులో వివాహం జరిగింది. పీలేరు మండలం కాకులారంపల్లెకు చెందిన కాకులారం మోహన్‌రెడ్డి కుమారుడు కుమార్‌రెడ్డి గత మూడేళ్లుగా బెర్లిన్‌లోని చార్టీ రాష్ట్రంలో ఓ సైన్స్ పరిశోధనా కేంద్రంలో సైంటిస్ట్‌గా పని చేస్తున్నాడు. అక్కడే కశ్మీర్‌కు చెందిన రూఫ్‌కిషన్ రైనా కుమార్తె షికా రైనా కూడా బెర్లిన్‌లో సైంటిస్ట్‌గా పని చేస్తుంది. ఈ క్రమంలో కుమార్‌రెడ్డి, షికా రైనాలు ప్రేమలో పడ్డారు. ఇద్దరూ తమ పెద్దలను ఒప్పించడంతో ఆదివారం స్థానిక పీలేరు ఎంఎన్ఆర్ కల్యాణమండపంలో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. చదవండి: (ట్రైనింగ్‌లో మొగ్గతొడిగిన ప్రేమ.. పెద్దల సమక్షంలో ఎస్ఐల పెళ్లి) -
మరో మహిళతో భర్త ఫోటోలు: ఐదుగురు పిల్లలను బాత్‌టబ్‌లో ముంచి
బెర్లిన్: పిల్లలు పుట్టాలని తల్లిదండ్రులు ఎంతో పరితపిస్తుంటారు. ఒకవేళ ఏదైన సమస్యలుంటే.. వారు ఆసుపత్రుల చుట్టు.. ఆలయాల చుట్టు తిరుగుతుంటారు. మనుషులే కాదు.. నోరులేని మూగజీవాలు కూడా తమ పిల్లల పట్ల ఎనలేని ప్రేమను కనబరుస్తాయి. ఒకవేళ పిల్లలకు ఏదైన ఆపద సంభవిస్తే.. తమ ప్రాణాలను కూడా లెక్కచేయవు. ప్రస్తుతం క్షణికావేశంలో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తిన్నారు. ఇలాంటి ఎన్నో ఘటనలు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. జర్మనీలో కూడా ఈ కోవకు చెందిన ఘటన ఒకటి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. జర్మనీలోని సోలెంగెన్ పట్టణానికి చెందిన ఒక మహిళ, తన భర్తతోపాటు కలిసి జీవిస్తుంది. వీరికి ఆరుగురు పిల్లలున్నారు. ఈ క్రమంలో.. ఒక రోజు తన భర్త.. మరో మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను చూసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైంది. దీంతో.. విచక్షణను కోల్పోయి తన ఇంట్లో ఉన్న బాత్‌టబ్‌లో ఐదుగురు పిల్లలను ముంచి ఊపిరాడకుండాచేసి అతి క్రూరంగా హత్యచేసింది. చనిపోయిన పిల్లలంతా.. 18 నెలల నుంచి 8 ఏళ్ల వయసులోపు వారున్నారు. సంఘటన జరిగినప్పుడు.. తన భర్త, పెద్దకొడుకు లేకపోవడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన గతేడాది సెప్టెంబరులో జరిగింది. ఆ తర్వాత సదరు మహిళ.. ట్రైన్‌ఎదుట వెళ్లి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ తర్వాత స్థానికులు ఆమెను కాపాడారు. పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో విచారించిన ఆమెను జీవితఖైదు విధిస్తు జడ్జి తీర్పునిచ్చారు. తాజాగా, ఆమె తరపు న్యాయవాది.. నిందితురాలి మానసిక స్థితి సరిగ్గాలేదని ఆమెకు బెయిల్ ఇవ్వాలని, శిక్షాకాలాన్ని 8 సంవత్సరాలకు తగ్గించాలని కోర్టులో వాదనలు వినిపించారు. దీనిపై జడ్జి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన చాలా అమానుషమని, అరుదైన ఘటన అని విచారం వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన తర్వాత.. నిందితురాలు భర్తకు.. ఇకమీదట నీవు నా పిల్లలను చూడలేవని మెసెజ్ చేసింది. దీని అర్థం ఏంటని ప్రశ్నించారు?.. అదే విధంగా నిందితురాలి మానసిక పరిస్థితిని అధ్యయనం చేయడానికి ప్రత్యేక వైద్యుడిని నియమించారు. అతను.. ఆమెను విచారించారు. ఆమె ఆరోగ్యంగా ఉందని , ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికావడంలేదని కోర్టు వారికి తెలిపారు. దీంతో ఆమెకు బెయిల్ మంజూరును న్యాయమూర్తి నిరాకరించారు. కాగా, ఈ ఘటనలో మృతి చెందిన పిల్లల ఆత్మకు శాంతి కలగాలని స్థానికులు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేశారు.