
బెర్లిన్ (జర్మనీ): పురుషుల అథ్లెటిక్స్‌లో అత్యంత క్లిష్టమైన రేసు మారథాన్‌లో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఆదివారం జరిగిన బెర్లిన్ మారథాన్‌లో కెన్యాకు చెందిన 33 ఏళ్ల ఎలియుడ్ కిప్‌చోగె ఈ ఘనత సాధించాడు. రియో ఒలింపిక్స్‌లో పసిడి పతకం నెగ్గిన కిప్‌చోగె 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల ఒక నిమిషం 39 సెకన్లలో పూర్తి చేసి... స్వర్ణ పతకం సొంతం చేసుకోవడంతోపాటు కొత్త ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 2014 బెర్లిన్ మారథాన్‌లోనే కెన్యాకు చెందిన డెన్నిస్ కిమెట్టో (2గం:02ని.57 సెకన్లు) నెలకొల్పిన ప్రపంచ రికార్డును కిప్‌చోగె తెరమరుగు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment