Athletics
-
నడిపించేది నాన్న
కల నిజం అయ్యేది కష్టంతోనే. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆఫ్రీన్ కుటుంబానికి కలలు కనేంత వెసులుబాటు లేకపొవచ్చు. అయినా సరే.... ఆ తండ్రి కల కన్నాడు. ఆయన కూతురు కల కన్నది. ఆ కల సాకారం అయింది. ఖమ్మంకు చెందిన షేక్ ఆఫ్రీన్ జాతీయ స్థాయిలో అథ్లెట్‌గా రాణిస్తోంది....‘ఇది వేరే ప్రపంచం’ అనుకున్నారు అక్కాచెల్లెళ్లు సమ్రీన్, ఆఫ్రీన్. ఆ ప్రపంచం పేరు....స్టేడియం. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో కొందరు రన్నింగ్ చేస్తున్నారు. కొందరు జంపింగ్ చేస్తున్నారు. ఒకవైపు క్రికెట్ ఆడుతున్నారు. కొందరు వాలీబాల్ ఆడుతున్నారు. వారి ఒంటికి పట్టిన చెమటల మాట ఎలా ఉన్నా...అందరి కళ్లల్లోనూ అంతులేని ఉత్సాహం పొంగిపొర్లుతుంది.ఆ ఉత్సాహమే పద్నాలుగు సంవత్సరాల ఆఫ్రీన్‌ను ఆ స్టేడియంకు దగ్గర చేసింది. ‘పప్పా... మేము నీతో పాటు రోజూ స్టేడియంకు వస్తాం’ అని అడిగారు. ఆఫ్రీన్ తండ్రి రహీమ్ హోంగార్డ్. స్పోర్స్›్టపర్సన్ కూడా. రోజూ తప్పకుండా స్టేడియంకు వచ్చి ఎక్సర్సైజ్లు చేయడం ఆయన దినచర్యలో భాగం. కుమార్తె విన్నపాన్ని విన్న రహీమ్... ‘అలాగే’ అన్నాడు. దీనికి ముందు ‘ఇక్కడికి వచ్చి ఏంచేస్తారు?’ అన్నాడు నవ్వుతూ. ‘మీలాగే ఎక్సర్సైజ్లు చేస్తాం’ అన్నారు సీరియస్‌గా.‘వీరిది ఒకటి రెండు రోజుల ఉత్సాహం. ఆ తరువాత అంతా మామూలే!’ అనుకున్నాడు రహీమ్. కానీ, అతడి అంచనా తప్పయింది. రకరకాల ఎక్సర్సైజ్లు చేయడం నుంచి ఆటల వరకు ఆఫ్రీన్‌కు స్టేడియం ప్రాణం అయింది. స్టేడియంకు రాని రోజూ అంటూ ఉండేది కాదు. ‘ఎప్పుడూ స్టేడియంలోనే కనిపిస్తావు. ఎప్పుడు చదువుకుంటావు!’ అని అడిగే వాళ్లు కొందరు.‘స్టేడియంలో కూడా చదువుకుంటూనే ఉన్నాను’ అని ఆఫ్రీన్ అన్నదో లేదు తెలియదుగానీ స్టేడియంలో తాను ఆటల ప్రపంచాన్ని చదువుతోంది. కట్ చేస్తే... షేక్ అఫ్రీన్ ప్రస్తుతం ఖమ్మంలోని ‘కవిత మెమోరియల్ డిగ్రీ కాలేజ్’లో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. చదువుతో పాటు అథ్లెటిక్స్‌లోనూ రాణిస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పొటీల్లో ఎన్నో పతకాలు సాధించింది. ఎంతో మంది పేదింటి అమ్మాయిలకు రోల్‌మోడల్‌గా నిలుస్తోంది. మొదట్లో కుమార్తెల ఉత్సాహానికి సంతోషపడిపొయిన రహీం ఆ ఇద్దరికి పరుగు పందెం నిర్వహించాడు. రన్నింగ్‌లో వారి ప్రతిభను చూసి ‘ఈ వజ్రాలకు సానబెట్టాల్సిందే’ అనుకున్నాడు. అదే సమయంలో కోచ్ గౌస్.... ‘ఆఫ్రీన్‌కు శిక్షణ ఇస్తే మంచి అథ్లెట్ అవుతుంది’ అన్నాడు. అతడి నోటి వాక్కు ఫలించింది. ఆఫ్రీన్ తో పాటు సమ్రీన్ కూడా అథ్లెటిక్స్‌లో రాణించింది. జాతీయ, రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో పాల్గొంది. ఆఫ్రీన్ ట్రాక్ రికార్డ్2016లో మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ 600 మీటర్ల పరుగులో మూడో స్థానం, 2017లో హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పొటీల్లో 800 మీటర్ల పరుగులో మొదటిస్థానం, 400 మీటర్లలో రెండోస్థానంలో నిలిచింది. (నో జిమ్.. నో డైటింగ్ : ఏకంగా 20 కిలోల బరువు తగ్గింది!)2022లో జరిగిన తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో 300 మీటర్ల పరుగులో ద్వితీయస్థానం, లాంగ్‌జంప్‌లో ద్వితీయస్థానం సాధించింది. 2023లో వరంగల్‌లో నిర్వహించిన సౌత్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పొటీల్లో ట్రిపుల్‌జంప్‌లో 5వ స్థానంలో నిలిచింది. 2023లో కరీంనగర్లో జరిగిన తెలంగాణ సౌత్‌జోన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పొటీల్లో ట్రిపుల్ జంప్‌లో ద్వితీయస్థానంలో నిలిచింది. ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి 19 వరకు గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించినసౌత్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పొటీల్లో మిడిల్రిలేలో 3వ స్థానం సాధించింది.ఇంకా ఎన్నో సాధించాలి...సాధిస్తానుపొటీల్లో పాల్గొనేటప్పుడు ఆటపైనే ధ్యాస ఉంటుంది. ఫలితం గురించి ఆలోచించను. మా నాన్న కూడా అదే చెబుతారు. నీ వంతుగా శ్రమిస్తే ఓడిపొయినా ఫర్వాలేదని ధైర్యం చెబుతారు. నేను పొటీల్లో రాణించడానికి నాన్న, అమ్మ కష్టపడుతున్నారు. అమ్మ జమీలా అసలు చదువుకోలేదు. నేను అథ్లెటిక్స్‌లో పాల్గొన్న వీడియోలు చూస్తూ నన్ను అభినందిస్తోంది. దేశం తరుపున పొటీల్లో పాల్గొని ఎన్నో పతకాలు సాధించాలనేదే లక్ష్యం. – షేక్ ఆఫ్రీన్– బొల్లం శ్రీనివాస్, సాక్షి, ఖమ్మంఫొటోలు: రాధారపు రాజు -
‘డైమండ్’ మెరుపులకు ‘సై’
బ్రసెల్స్ (బెల్జియం): అథ్లెటిక్స్ ప్రపంచంలో ప్రతిష్టాత్మక ఈవెంట్ అయిన డైమండ్ లీగ్ మీట్ ఫైనల్స్‌కు రంగం సిద్ధమైంది. శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో అగ్రశ్రేణి అథ్లెట్లంతా తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఇటీవల పారిస్ ఒలింపిక్స్ పతకాలతో మెరిసిన ఆటగాళ్లంతా మళ్లీ తమ స్థాయిని ప్రదర్శించాలని పట్టుదలగా ఉన్నారు. పోటీ పడేందుకు ఈ ఏడాది మొత్తం 14 డైమండ్ లీగ్ సిరీస్‌లు అందుబాటులో ఉండగా... తాము ఎంచుకున్న సిరీస్‌లలో పాల్గొనడం ద్వారా సాధించిన పాయింట్లతో ఆటగాళ్లు ఫైనల్‌కు అర్హత సాధించారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లు కలిపి మొత్తం 32 అంశాల్లో పతకాలు గెలిచేందుకు అవకాశం ఉంది. పోల్‌వాల్ట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన అర్మాండ్ డుప్లాంటిస్ (స్వీడన్), అమెరికా స్ప్రింటర్ ష కారీ రిచర్డ్సన్, స్టార్ హర్డ్లర్ సిడ్నీ మెక్‌లాలిన్, లాంగ్ డిస్టెన్స్ రన్నర్ ఫెయిత్ కిపైగాన్ లాంటి టాప్ ప్లేయర్లు ఫైనల్లో బరిలోకి దిగుతున్నారు. లెట్సిల్ టె»ొగో (బోట్స్వానా), ర్యాన్ క్రూజర్, యరస్లొవా మహుచుక్ తదితరులు కూడా తుది సమరంలో పోటీ పడుతున్నారు.ఓవరాల్‌గా 18 మంది ఒలింపిక్ విజేతలు ఇక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండటం విశేషం. 50 వేల సామర్థ్యం గల కింగ్ బౌదిన్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తారు. ఇక్కడ విజేతగా నిలిచిన వారికి డైమండ్ లీగ్ ట్రోఫీతో 30 వేల డాలర్ల ప్రైజ్‌మనీ, వచ్చే ఏడాది జపాన్‌లో జరిగే వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్‌కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభిస్తుంది. అగ్రశ్రేణి అథ్లెట్ల ఆటతో రెండు రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు మరింత వినోదం ఖాయం. నేడు సాబ్లే... రేపు నీరజ్ డైమండ్ లీగ్ ఫైనల్లో భారత్ నుంచి ఇద్దరు అథ్లెట్స్ పోటీ పడుతుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. 3000 మీటర్ల స్టీపుల్ చేజ్లో జాతీయ రికార్డు సాధించిన అవినాశ్ సాబ్లే ఈ పోటీల్లో బరిలో నిలిచాడు. నేటి రాత్రి 12.30 గంటలకు అతని ఈవెంట్ మొదలవుతుంది. ఈ ఏడాది పారిస్, సిలేసియాలలో జరిగిన సిరీస్‌లలో పాల్గొన్న సాబ్లే మొత్తం 3 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచాడు. ఫైనల్లో 12 మంది మాత్రమే పోటీ పడే అవకాశం ఉంది. అయితే తనకంటే మెరుగైన స్థానంలో నిలిచిన నలుగురు అథ్లెట్లు తప్పుకోవడంతో సాబ్లేకు చాన్స్ లభించింది. మరోవైపు భారత దిగ్గజ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఫైనల్‌కు అర్హత సాధించడంలో ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. దోహా, లుసాన్ సిరీస్‌లలో పాల్గొన్న అతను మొత్తం 14 పాయింట్లు సాధించి ఓవరాల్‌గా నాలుగో స్థానం సాధించాడు. గత ఏడాది డైమండ్ లీగ్‌లో చోప్రా రన్నరప్‌గా నిలిచాడు. రేపు అర్ధరాత్రి 12 గంటల నుంచి నీరజ్ చోప్రా ఈవెంట్ జరుగుతుంది. జ్యూరిక్ (స్విట్జర్లాండ్)లో జరిగిన 2022 డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా విజేతగా... యూజీన్ (అమెరికా)లో జరిగిన 2023 డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో నీరజ్ రన్నరప్‌గా నిలిచాడు. -
‘టోక్యో’ను దాటేసి...
ఊహించినట్లుగానే భారత పారాలింపియన్లు గత విశ్వ క్రీడలకంటే మరింత మెరుగైన ప్రదర్శనతో సత్తా చాటారు. 2020 టోక్యో కీడల్లో ఓవరాల్‌గా 19 పతకాలు గెలుచుకున్న మన బృందం ఇప్పుడు దానిని అధిగమించింది. బుధవారం పోటీలు ముగిసేసరికి భారత్ ఖాతాలో మొత్తం 22 పతకాలు చేరాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక హైజంప్‌లో శరద్ కుమార్, తంగవేలు మరియప్పన్ వరుసగా రజత, కాంస్య పతకాలు గెలుచుకోగా... ఆ తర్వాత జావెలిన్ త్రోలో ఇలాగే అజీత్ సింగ్, సుందర్ సింగ్ లకు వరుసగా రజత, కాంస్యాలు లభించాయి. దీంతో మన బృందం టోక్యో ప్రదర్శనను దాటగా... షాట్‌పుట్‌లో సచిన్ సాధించిన రజతంతో, ఆర్చరీలో హర్విందర్ సింగ్ గెలిచిన స్వర్ణంతో ఈ సంఖ్య మరింత పెరిగింది. వరుసగా మూడో పారాలింపిక్స్‌లోనూ పతకం గెలిచిన తమిళనాడు ప్లేయర్ తంగవేలు ప్రదర్శన ఈ క్రీడల్లో హైలైట్‌గా నిలిచింది. పారిస్: పారాలింపిక్స్‌లో భారత్‌కు అథ్లెటిక్స్ క్రీడాంశంలో పతకాల పంట పండింది. ఇప్పటికే జట్టుకు ఇందులో 11 మెడల్స్ లభించాయి. పురుషుల హైజంప్ టి63 ఈవెంట్లో ఇద్దరు భారత ఆటగాళ్లు పోడియంపై నిలిచారు. 1.88 మీటర్ల ఎత్తుకు జంప్ చేసిన శరద్ కుమార్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకున్నాడు. సీనియర్ అథ్లెట్ మరియప్పన్ తంగవేలుకు ఈ ఈవెంట్లోనే కాంస్యం దక్కింది. అతను 1.85 మీటర్ల ఎత్తుకు ఎగిరాడు. మరో భారత ప్లేయర్ శైలేష్ కుమార్‌కు నాలుగో స్థానం (1.85 మీటర్లు) దక్కింది. ఇద్దరి స్కోర్లూ సమానంగానే ఉన్నా... తక్కువసార్లు విఫలమైన తంగవేలుకు పతకం ఖరారైంది. ఈ పోటీలో ఎజ్రా ఫ్రెంచ్ (అమెరికా; 1.94 మీటర్లు) స్వర్ణ పతకం సాధించాడు. ఆ తర్వాత పురుషుల జావెలిన్ త్రో ఎఫ్46 ఈవెంట్లో భారత అథ్లెట్ అజీత్ సింగ్ రజత పతకం సొంతం చేసుకున్నాడు.అతను తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేస్తూ జావెలిన్‌ను 65.62 మీటర్ల దూరం విసిరాడు. అతని తర్వాత మూడో స్థానంలో నిలిచి సుందర్ సింగ్ గుర్జర్ కాంస్యం గెలుచుకున్నాడు. సుందర్ విసిరిన జావెలిన్ 64.96 మీటర్లు వెళ్లింది. ఇందులో క్యూబాకు చెందిన గిలెర్మో గొంజాలెజ్ (66.14 మీటర్లు) స్వర్ణం గెలుచుకున్నాడు. హర్విందర్ ‘పసిడి’ గురి పురుషుల ఆర్చరీ రికర్వ్ వ్యక్తిగత విభాగంలో హర్విందర్ సింగ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫైనల్లో హర్విందర్ 6–0తో (28–24, 28–27, 29–25) లుకాస్ సిస్జెక్ (పోలాండ్)పై గెలుపొందాడు. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో హరి్వందర్ కాంస్య పతకాన్ని గెలిచాడు. సత్తా చాటిన సచిన్... పురుషుల షాట్‌పుట్ ఎఫ్46 ఈవెంట్లో భారత ఆటగాడు సచిన్ ఖిలారి రజత పతకంతో మెరిశాడు. ఈ ఈవెంట్లో ప్రపంచ చాంపియన్ అయిన సచిన్ తన రెండో ప్రయత్నంలో ఇనుప గుండును అత్యుత్తమంగా 16.32 మీటర్లు విసిరాడు. స్కూల్లో చదివే రోజుల్లోనే జరిగిన ప్రమాదం తర్వాత నుంచి సచిన్ ఎడమచేయి పని చేయలేదు. పలు శస్త్రచికిత్సల తర్వాత కూడా పరిస్థితి మారలేదు. 2015లో ఆటల్లోకి ప్రవేశించి ముందుగా జావెలిన్‌లో ప్రయత్నం చేసిన అతను ఆ తర్వాత షాట్పుట్కు మారాడు. గత ఆసియా పారా క్రీడల్లో అతను స్వర్ణం సాధించాడు. మెకానికల్ ఇంజినీర్ అయిన సచిన్ ప్రస్తుతం పలు విద్యా సంస్థల్లో విజిటింగ్ ఫ్యాకల్టీగా పని చేస్తున్నాడు. మరోవైపు టేబుల్ టెన్నిస్‌లో భవీనాబెన్ పటేల్ పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. టోక్యోలో రజతం సాధించిన భవీనా ఈసారి క్వార్టర్స్‌లో 12–14, 9–11, 11–8, 6–11 స్కోరుతో యింగ్ జూ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. షూటింగ్లో 50 మీటర్ల మిక్స్డ్ పిస్టల్ ఈవెంట్ (ఎస్‌హెచ్1)లో భారత ఆటగాళ్లు నిహాల్ సింగ్, రుద్రాంశ్ ఖండేల్వాల్ క్వాలిఫయింగ్‌లోనే విఫలమైన ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. -
కల్లెడ నుంచి ‘పారిస్’ దాకా... మా దీప్తి ’బంగారం’!
పారాలింపిక్స్‌లో తమ అత్యుత్తమ ప్రదర్శనను అధిగమించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. సోమవారం ఏకంగా ఎనిమిది పతకాలతో భారత క్రీడాకారులు అదరగొట్టగా... మంగళవారం కాంస్యం రూపంలో ఒక పతకం లభించింది. మహిళల అథ్లెటిక్స్ 400 మీటర్ల టి20 రేసులో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి దీప్తి జివాంజి కాంస్య పతకం సాధించింది. ప్రపంచ పారా చాంపియన్, పారా ఆసియా గేమ్స్ చాంపియన్ హోదాలో తొలిసారి పారాలింపిక్స్‌లో అడుగుపెట్టిన దీప్తి మూడో స్థానాన్ని సంపాదించింది. దీప్తి కాంస్యంతో పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 16కు చేరుకుంది. మరిన్ని మెడల్ ఈవెంట్స్‌లో మన క్రీడాకారులు పోటీపడాల్సి ఉండటంతో ఈసారి భారత్ పతకాల సంఖ్య 20 దాటే అవకాశముంది. మూడేళ్ల క్రితం టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ 19 పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. పారిస్: పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో 16వ పతకం చేరింది. మంగళవారం జరిగిన మహిళల అథ్లెటిక్స్ 400 మీటర్ల టి20 కేటగిరి ఫైనల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అథ్లెట్ దీప్తి జివాంజి కాంస్య పతకాన్ని సాధించింది. ఎనిమిది మంది పోటీపడ్డ ఫైనల్లో 20 ఏళ్ల దీప్తి 55.82 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానాన్ని దక్కించుకుంది. యూలియా షులియర్ (ఉక్రెయిన్; 55.16 సెకన్లు) స్వర్ణం సంపాదించగా... టర్కీ అథ్లెట్ ఐసెల్ ఒండెర్ (55.23 సెకన్ల) రజత పతకాన్ని గెల్చుకుంది. ఈ ఏడాది మేలో జపాన్‌లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో 55.07 సెకన్లతో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకం నెగ్గిన దీప్తి అదే ప్రదర్శనను ‘పారిస్’లో పునరావృతం చేయలేకపోయింది. ఒకవేళ ఇదే టైమింగ్‌ను దీప్తి ‘పారిస్’లో నమోదు చేసి ఉంటే ఆమెకు స్వర్ణ పతకం లభించేది. ఫైనల్ రేసు ఆరంభంలో చివరి వరకు రెండో స్థానంలో ఉన్న దీప్తి ఆఖరి పది మీటర్లలో వెనుకబడిపోయి మూడో స్థానంలో నిలిచింది. సోమవారం రాత్రి జరిగిన హీట్స్‌లో 54.96 సెకన్లతో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించిన టర్కీ అథ్లెట్ ఐసెల్ ఒండెర్ చివరి పది మీటర్లలో వేగంగా పరుగెత్తి దీప్తిని దాటేసి రజత పతకాన్ని ఖరారు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి తర్వాత ముగిసిన మహిళల బ్యాడ్మింటన్ ఎస్‌హెచ్6 సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి నిత్యశ్రీ శివన్ కాంస్య పతకాన్ని సాధించింది. కాంస్య పతక మ్యాచ్‌లో నిత్యశ్రీ 21–14, 21–6తో రీనా మార్లిన్ (ఇండోనేసియా)పై గెలిచింది. మహిళల షాట్‌పుట్ ఎఫ్34 కేటగిరీలో భారత అథ్లెట్ భాగ్యశ్రీ జాధవ్ ఇనుప గుండును 7.28 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. అవనికి ఐదో స్థానం తన పారాలింపిక్స్ కెరీర్లో మూడో పతకం సాధించాలని ఆశించిన భారత మహిళా షూటర్ అవని లేఖరాకు నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఎస్‌హెచ్1 ఈవెంట్ ఫైనల్లో 22 ఏళ్ల అవని ఐదో స్థానంలో నిలిచింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అవని 420.6 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానాన్ని దక్కించుకుంది. అంతకుముందు క్వాలిఫయింగ్‌లో అవని 1159 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. ముగిసిన పూజ పోరు మహిళల ఆర్చరీ రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత ప్లేయర్ పూజ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో పూజ 4–6 (28–23, 25–24, 27–28, 24–27, 24–27)తో వు చున్యాన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. వరుసగా రెండు సెట్లు గెలిచిన పూజ 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మరో సెట్లో స్కోరును సమం చేసినా పూజ సెమీఫైనల్‌కు చేరుకునేది. కానీ పూజ తడబడి మూడు సెట్లను కోల్పోయి ఓటమి పాలైంది. తొలి రౌండ్లో పూజ 6–0 (27–24, 26–22, 272–6)తో యాగ్ముర్ (టరీ్క)పై నెగ్గింది.కల్లెడ నుంచి ‘పారిస్’ దాకా...పారా అథ్లెటిక్స్‌లో టి20 కేటగిరీ అంటే ‘మేధోలోపం’ ఉన్న క్రీడాకారులు ప్లేయర్లు పాల్గొనే ఈవెంట్. దీప్తి స్వస్థలం వరంగల్ జిల్లా లోని కల్లెడ గ్రామం. తల్లిదండ్రులు యాదగిరి, ధనలక్ష్మి రోజూవారీ కూలీలు. ఒకవైపు పేదరికం ఇబ్బంది పెడుతుండగా... మరోవైపు దీప్తిని ‘బుద్ధిమాంద్యం’ ఉన్న అమ్మాయిగా గ్రామంలో హేళన చేసేవారు. ఇలాంటి తరుణంలో భారత అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ ఆమెకు అన్ని విధాలా అండగా నిలిచారు. ఒక స్కూల్ టోర్నీలో దీప్తి రన్నింగ్ ప్రతిభ గురించి తన స్నేహితుడి ద్వారా రమేశ్‌కు తెలిసింది. దాంతో రమేశ్ ఆ అమ్మాయిని హైదరాబాద్‌కు రప్పించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రంలో ట్రెయినింగ్ అందించే ఏర్పాట్లు చేశారు. మానసికంగా కొంత బలహీనంగా ఉండటంతో దీప్తికి శిక్షణ ఇవ్వడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. భారత బ్యాడ్మింటన్ హెడ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా ‘మైత్రా ఫౌండేషన్’తో కలిసి దీప్తికి ఆర్థికంగా సహకారం అందించారు. కెరీర్ ఆరంభంలో దీప్తి అందరూ పాల్గొనే సాధారణ అథ్లెటిక్స్ ఈవెంట్లలోనూ పోటీ పడి విజయాలు సాధించడం విశేషం. 2019 ఆసియా అండర్–18 చాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2021 సీనియర్ నేషనల్స్‌లో కాంస్యం సాధించిన దీప్తి 2022లో చివరిసారిగా రెగ్యులర్ పోటీల బరిలోకి దిగింది. రెండు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడం ద్వారా దీప్తికి ‘పారా క్రీడల’ లైసెన్స్ లభించింది. దాంతో పూర్తిగా పారా పోటీలపైనే ఆమె దృష్టి పెట్టింది. గత ఏడాది జరిగిన గ్వాంగ్జూ ఆసియా పారా క్రీడల్లో 400 మీటర్ల ఈవెంట్లోనే దీప్తి స్వర్ణం గెలుచుకుంది. ఆర్థిక సమస్యలతో ఒకదశలో తమ భూమిని అమ్ముకున్న తల్లిదండ్రులు దీప్తి ‘ఆసియా’ స్వర్ణ ప్రదర్శనతో ప్రభుత్వం ఇచ్చిన రూ. 30 లక్షలతో మళ్లీ భూమి కొనుక్కోగలిగారు. ఈ ఏడాది మే నెలలో జపాన్‌లో జరిగిన ప్రపంచ పారా చాంపియన్‌షిప్‌లో దీప్తి 55.07 సెకన్లతో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించి పారాలింపిక్స్‌లో మెడల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ పతకం సాధించింది. -
‘ఆరు’లో అదరగొట్టి...
సరిగ్గా రెండు వారాల క్రితం భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకంతో మెరిశాడు. ఆరు ప్రయత్నాల్లో ఐదుసార్లు అతను ఫౌల్ అయినా ఒక్క మంచి త్రో అతనికి ‘పారిస్’లో రెండో స్థానాన్ని అందించింది. ఇప్పుడు వేదిక మారింది. సమరం ఒలింపిక్స్ నుంచి డైమండ్ లీగ్‌కు మారింది... కానీ అగ్రస్థానంలో నిలవాలనే ఒత్తిడి అతనిలో తగ్గినట్లు కనిపించలేదు... ఫలితంగా అదే తడబాటు. తొలి ఐదు ప్రయత్నాల్లో ఆశించిన దూరం జావెలిన్ వెళ్లలేదు... కానీ ఎట్టకేలకు ఆరో ప్రయత్నంలో నీరజ్ తన స్థాయిని ప్రదర్శించాడు. ఒక్క త్రోతో రెండో స్థానానికి దూసుకెళ్లి మీట్‌ను ముగించాడు. లుసాన్ (స్విట్జర్లాండ్): ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ లుసాన్ మీట్లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ మీట్లో నీరజ్ జావెలిన్‌ను 89.49 మీటర్ల దూరం విసిరాడు. ఈ సీజన్లో అతనికి ఇది అత్యుత్తమ ప్రదర్శన కాగా... మొత్తం కెరీర్ లో రెండో అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. రెండేళ్ల క్రితం స్టాక్‌హోమ్‌లో జరిగిన డైమండ్ లీగ్ పోటీల్లో జావెలిన్‌ను నీరజ్ 89.94 మీటర్ల దూరం విసిరాడు. ఈ ఈవెంట్లో 90.61 మీటర్ల దూరంతో ప్రపంచ మాజీ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనడా) మొదటి స్థానంలో నిలవగా... జూలియన్ వెబర్ (జర్మనీ; 87.08 మీటర్లు) మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకున్న పాకిస్తాన్ ఆటగాడు అర్షద్ నదీమ్ ఈ మీట్లో పాల్గొనలేదు. పారిస్ ఒలింపిక్స్‌లో 89.45 మీటర్ల దూరంతో నీరజ్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. గజ్జల్లో గాయంతో బాధపడుతున్న అతను ఒకదశలో డైమండ్ లీగ్ నుంచి తప్పుకోవాలని భావించినా... చివరకు బరిలోకి దిగాడు. ఇప్పుడు పక్షం రోజుల తేడాతో కాస్త మెరుగైన ప్రదర్శన అతడి నుంచి వచ్చింది. తొలి నాలుగు ప్రయత్నాల్లో అతని త్రో ఒక్కటీ కనీసం 85 మీటర్లు కూడా వెళ్లలేదు. నీరజ్ వరుసగా 82.10 మీటర్లు... 83.21 మీటర్లు... 83.13 మీటర్లు... 82.34 మీటర్లు మాత్రమే జావెలిన్‌ను విసరగలిగాడు. వీటి తర్వాత అతను నాలుగో స్థానంలో ఉన్నాడు. అయితే ఐదో ప్రయత్నం అతడిని మూడో స్థానానికి తీసుకెళ్లింది. ఇందులో జావెలిన్ 85.58 మీటర్లు వెళ్లింది.ఆఖరి ప్రయత్నంలో అండర్సన్ ఏకంగా 90.61 మీటర్లతో కొత్త మీట్ రికార్డు నెలకొల్పి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. అనంతరం నీరజ్ తన శక్తిని మొత్తం ఉపయోగించి విసిరిన ఆరో అస్త్రం ఎట్టకేలకు సానుకూల ఫలితాన్ని అందించింది. 89.49 మీటర్లతో అతనికి రెండో స్థానం దక్కింది. అయితే చాలా కాలంగా నీరజ్ ఆశిస్తున్న 90 మీటర్ల మైలురాయిని మాత్రం అతను మరోసారి అందుకోలేకపోయాడు! ఫైనల్‌కు అర్హత సాధించినట్లేనా! తాజా ఈవెంట్లో రెండో స్థానంలో నిలవడంతో నీరజ్‌కు 7 పాయింట్లు దక్కాయి. దోహా డైమండ్ లీగ్‌లో కూడా రెండో స్థానం సాధించడం ద్వారా వచి్చన 7 పాయింట్లు కలిపి ప్రస్తుతం నీరజ్ ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. ఓవరాల్‌గా ప్రస్తుతం వెబర్‌తో సమానంగా అతను మూడో స్థానంలో ఉన్నాడు. అండర్సన్ (21), జాకబ్ వలెచ్ (16) తొలి రెండు స్థానాలతో ఇప్పటికే ఫైనల్‌కు అర్హత సాధించారు. ఫైనల్‌కు మొత్తం ఆరుగురు అర్హత పొందుతారు. సెపె్టంబర్ 5న జ్యూరిచ్‌లో జరిగే చివరి మీట్లోనూ నీరజ్ పాల్గొనబోతున్నాడు. అక్కడా రాణిస్తే అతను ఫైనల్‌కు అర్హత సాధించడం లాంఛనమే కానుంది. బ్రసెల్స్‌లో సెప్టెంబర్ 14 నుంచి ఫైనల్ పోటీలు జరుగుతాయి. ఈవెంట్ ఆరంభంలో కొంత నిరాశ కలిగింది. అయితే ఫలితం తర్వాత చూస్తే నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. ముఖ్యంగా చివరి ప్రయత్నంలో నా కెరీర్లో రెండో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలిగాను. సరిగ్గా మొదలు పెట్టకపోయినా ఆ తర్వాత నేను కోలుకోగలగడం, పోరాటస్ఫూర్తి కనబర్చడం ఆనందాన్నిచ్చింది. తొలి నాలుగు ప్రయత్నాలు 80–83 మీటర్ల మధ్యే ఉన్నా ఆఖరి రెండు త్రోలలో నా పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించాను. ఈ స్థాయి పోటీల్లో మానసికంగా కూడా దృఢంగా ఉండి చివరి వరకు పోరాడటం ముఖ్యం. అండర్సన్ 90 మీటర్ల త్రో విసిరాక నాపై ఒత్తిడి పెరిగింది. ఎలాగైనా దానిని దాటాలని అనుకున్నా. అయితే నా మిత్రుడైన కెన్యా ప్లేయర్ జూలియస్ యెగో నా వద్దకు వచ్చి తగిన సలహా ఇచ్చాడు. ప్రశాంతంగా ఉండు, నువ్వు ఎక్కువ దూరం విసరగలవు అని చెబుతూ నా ఆందోళనను తగ్గించాడు. దాంతో ఒత్తిడి లేకుండా జావెలిన్‌ను విసరగలిగాను. –నీరజ్ చోప్రా -
ఏడు నుంచి ఆరుకు...48 నుంచి 71కి..!
టోక్యో ఒలింపిక్స్ ముగిసిన వెంటనే భారత ఆటగాళ్ల సన్నాహాలు మొదలయ్యాయి. సాధారణంగా ఉండే నాలుగేళ్లతో పోలిస్తే ఒక ఏడాది తక్కువ సమయం ఉండటంతో అన్ని క్రీడల్లోనూ పారిస్ లక్ష్యంగానే హడావిడి కనిపించింది. అధికారులు, ప్రభుత్వం కూడా రెండంకెల పతకాలు ఖాయమంటూ నమ్మకం పెట్టుకున్నాయి. అందుకు తగినట్లుగా ఈసారి కేంద్ర ప్రభుత్వం కూడా అండగా నిలిచింది. అథ్లెట్ల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాకుండా ఒలింపిక్స్ సన్నద్ధత కోసమే 16 క్రీడాంశాల్లో సౌకర్యాల కల్పన, విదేశాల్లో ప్రత్యేక శిక్షణ, పోటీల్లో పాల్గొనేందుకు రూ. 470 కోట్లు ఖర్చు కూడా చేసింది. 117 మందితో మన బృందం బరిలోకి దిగింది. అద్భుతాల గురించి కాకపోయినా ఎక్కువ మంది కచ్చితంగా బాగా ఆడతారనే అంచనాలు, ఆశలు మాత్రం అందరిలోనూ ఉన్నాయి. కానీ ఒక్కో రోజు కరుగుతున్న కొద్దీ పరిస్థితి మారిపోతూ వచ్చింది. పతకం కోసం ఎంతో ఎదురు చూడాల్సిన స్థితి. చివరకు ఒక రజతం, ఐదు కాంస్యాలతో మన టీమ్ ముగించింది. గత ఒలింపిక్స్‌తో పోలిస్తే పతకాల సంఖ్య తగ్గడమే కాదు... స్వర్ణం కూడా లేకపోవడంతో పతకాల పట్టికలో కూడా భారత్ చాలా దిగువకు పడిపోయింది. –సాక్షి క్రీడా విభాగంపారిస్: అథ్లెటిక్స్‌లో భారత మహిళల 4్ఠ400 రిలే జట్టు పారిస్ ఒలింపిక్స్‌లో 3 నిమిషాల 32.51 సెకన్ల టైమింగ్ నమోదు చేసింది... ఇదే ఈవెంట్లో 1984 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో భారత బృందం టైమింగ్ 3 నిమిషాల 32.49 సెకన్లు మాత్రమే! అంటే 40 సంవత్సరాల తర్వాత కూడా మన జట్టు టైమింగ్ మెరుగుకాకపోగా, అంతకంటే పేలవంగా రిలే టీమ్ ముగించింది. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు, విదేశాల్లో శిక్షణ, మంచి డైట్ వంటివి మాత్రమే ఫలితాన్ని ఇవ్వలేవనే దానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. నిజాయితీగా చెప్పాలంటే అథ్లెటిక్స్‌లో మన ఆటగాళ్ల విషయంలో పెద్దగా అంచనాలు లేవు కానీ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో మేమూ ఉన్నామని గుర్తు చేసే కనీస స్థాయి ప్రదర్శన కూడా రాలేదు. మొత్తం 29 మంది అథ్లెట్లు పాల్గొంటే జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఒక్కడే తన స్థాయిని ప్రదర్శించాడు. భారత ప్రదర్శన విషయంలో ఈ ఒక్క క్రీడాంశాన్నే విమర్శించడానికి లేదు. ఓవరాల్‌గా కూడా టోక్యో ఒలింపిక్స్ ప్రదర్శనను దాటలేకపోగా, అది పునరావృతం కూడా కాలేదు. ప్రతీ ఒలింపిక్స్ తర్వాత జరిగే సమీక్ష తరహాలోనే ఈసారి కూడా దాదాపు అవే కారణాలు. మన ప్రమాణాలు బాగా పెరిగాయని చెప్పుకోవడమే తప్ప అసలైన సమయంలో పోటీకి దిగినప్పుడు ఇంకా మనం చాలా అంశాల్లో వెనుకబడి ఉన్నామని తేలిపోయింది. చాలా మంది భారత ఆటగాళ్లకు ఒలింపిక్స్‌లో పాల్గొనడమే ఒక ఘనతగా కనిపిస్తోంది తప్ప అంతకు మించి ముందుకు వెళ్లడం సాధ్యం కావడం లేదు. 20 కిలోమీటర్ల రేస్‌వాక్‌లో 43 మంది పాల్గొంటే 41వ స్థానంలో నిలిచిన ప్రియాంక గోస్వామి గేమ్స్ విలేజ్ గదిలో సరదాగా ‘రీల్స్’ చేస్తున్న వీడియో చూస్తే ఆమె తన ఆట పట్ల ఎంత సీరియస్‌గా ఉందో అర్థమవుతుంది.తాము అడిగిన కోచ్‌లు, ఫిజియోలు... తాము కోరిన చోట శిక్షణ... ఇలా ఒక్కటేమిటి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలిచింది. అయినా మెడల్స్ విషయంలో మన రాత మారలేదంటే లోపం ఆటగాళ్లలోనే ఉన్నట్లు అర్థం. తమకు సౌకర్యాలు లేవనే మాట ఇకపై ఆటగాళ్ల నుంచి రాకూడదని... ప్లేయర్లు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పడుకోన్ చేసిన వ్యాఖ్య ఈ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత అథ్లెట్లందరికీ వర్తిస్తుంది. పతకవీరులు... టోక్యోలో 19 ఏళ్ల టీనేజర్‌గా బరిలోకి దిగి తీవ్రంగా నిరాశపర్చిన షూటర్ మనూ భాకర్ ఈసారి నాటి తప్పులను సరిదిద్దుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్డ్ విభాగాల్లో రెండు కాంస్యాలు గెలిచి తనను తాను నిరూపించుకుంది. మిక్స్‌డ్‌లో ఆమె భాగస్వామిగా సరబ్జోత్ సింగ్ కూడా కాంస్యాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో అనూహ్యంగా స్వప్నిల్ కుసాలే మూడో స్థానంలో నిలవడంతో భారత్ ఖాతాలో మూడో కాంస్యం చేరింది.భారత పురుషుల హాకీ జట్టు వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ కాంస్యం సాధించడం మన అభిమానులకు ఊరట కాగా... యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ కూడా కంచు మోత మోగించి తానేంటో చూపించాడు. అయితే పట్టికలో భారత్ స్థానాన్ని పైకి చేర్చగల స్వర్ణం మాత్రం మనకు రాలేదు. ‘టోక్యో’ పసిడితో సత్తా చాటిన నీరజ్ చోప్రా గత మూడేళ్ల ప్రదర్శనను చూస్తే ఈసారి గోల్డ్ ఖాయమనిపించింది.అయితే దురదృష్టవశాత్తూ అది చేజారినా... రజతంతో కాస్త మెరుగైన పతకం మన ఖాతాలో చేరింది. వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో మెడల్స్ గెలిచిన అరుదైన జాబితాలో నీరజ్ చేరగా... ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో మనూ భాకర్ తన కీర్తిని పెంచుకుంది. అంచనా తప్పారు... టోక్యో ఒలింపిక్స్ ముగిసిన తర్వాతి నుంచి ప్రదర్శన, తాజా ఫామ్, ఆటగాళ్ల స్థాయిని బట్టి చూసుకుంటే కొందరు ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపర్చారు. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు విఫలం కాగా... కచ్చితంగా పతకం సాధిస్తారనుకున్న డబుల్స్ జోడీ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్లోనే పరాజయంపాలయ్యారు. బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్, వరల్డ్ రికార్డు ఉన్న షూటర్ సిఫ్ట్ కౌర్ సామ్రా కనీసం పతకానికి చేరువగా కూడా రాలేకపోవడం గమనార్హం. బాక్సింగ్‌లో నిశాంత్ దేవ్, అమిత్ పంఘాల్ కూడా అంచనా తప్పగా... గత ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ కూడా క్వార్టర్ ఫైనల్లోనే ఓడింది. ఇక ఆర్చరీ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. నాలుగో ఒలింపిక్స్‌లో కూడా దీపిక కుమారి ఉత్త చేతులతోనే తిరిగొచ్చింది. ఇక టేబుల్ టెన్నిస్, జూడో, స్విమ్మింగ్, రోయింగ్, సెయిలింగ్, గోల్ఫ్, ఈక్వె్రస్టియన్లు మనం పతకాలు ఆశించే క్రీడలు కావు. టెన్నిస్‌లో రోహన్ బోపన్న తన ఏటీపీ టోర్నీల స్థాయి ఆట ఇక్కడ ప్రదర్శించలేకపోయాడు. నాలుగో స్థానాలతో సరి... విజయం సాధించిన వాడినే ప్రపంచం గుర్తుంచుకుంటుంది. రెండో స్థానానికి కూడా విలువుండదు... స్పోర్ట్స్‌లో మోటివేషనల్ స్పీచ్‌లు ఇచ్చేటప్పుడు చాలా మంది తరచుగా వాడే మాట ఇది. కానీ మన భారతీయులు ఇప్పుడు నాలుగో స్థానాన్ని చూసి కూడా అయ్యో... కొద్దిలో చేజారిందే అనుకుంటున్నాం. ఇది ఏదో ఆత్మ సంతృప్తి కోసమే తప్ప ఒలింపిక్స్‌లో నాలుగో స్థానానికి ఎలాంటి విలువ లేదు. అదృష్టం కలిసొస్తే మరో ఆరు పతకాలు మన ఖాతాలో చేరేవేమో కానీ అలాంటి వాటికి ఆటల్లో చోటు లేదు. మనూ భాకర్, అర్జున్ బబూతా, మహేశ్వరి–అనంత్‌జీత్ జోడీ (షూటింగ్), మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్), బొమ్మదేవర ధీరజ్–అంకిత జోడీ (ఆర్చరీ) అసలు సమయంలో తమ ఆట స్థాయిని పెంచలేకపోయారు. చివరగా... గెలుపు కూడా ఓటమిగా మారిన వైనం వినేశ్ ఫొగాట్ విషయంలో జరిగింది. ఫైనల్ చేరిన తర్వాత వచ్చిన పతకం బరువు ఎక్కువై చేజారడం వినేశ్‌కే కాదు భారతీయులందరికీ వేదన కలిగించింది. -
Paris Olympics 2024: చిన్న దేశాలు... పెద్ద విజయాలు
మహిళల 100 మీటర్ల పరుగులో సెయింట్ లూసియాకు చెందిన అల్ఫ్రెడ్ జూలియన్ 10.72 సెకన్లలో లక్ష్యానికి చేరి స్వర్ణం గెలిచింది. మహిళల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో డొమెనికాకు చెందిన లెఫాండ్ థియా 15.02 మీటర్ల దూరం దూకి పసిడి పతకం కైవసం చేసుకుంది. ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా.. సెయింట్ లూసియా జనాభా 1,80,000 కాగా.. డొమెనికా జనాభా 73 వేలు మాత్రమే. కరీబియన్ దీవుల్లోని అతి చిన్న దేశాలు విశ్వక్రీడల్లో సత్తా చాటుతున్నాయనడానికి ఇది నిదర్శనం. ఒలింపిక్స్ చరిత్రలో పసిడి గెలిచిన అతి తక్కువ జనాభా గల దేశంగా డొమినికా రికార్డుల్లోకెక్కింది. ఇవే కాకుండా.. పట్టుమని 10 లక్షల జనాభా కూడా లేని పదికి పైగా దేశాలు ఒలింపిక్స్‌లో చక్కటి ప్రదర్శన కనబరిచాయి. –సాక్షి క్రీడా విభాగం ఒలింపిక్స్ అథ్లెటిక్స్ చరిత్రలో ఇప్పటి వరకు వందకు పైగా దేశాలు పతకాలు సాధించాయి. వాటిలో జనాభా పరంగా స్వర్ణం గెలిచిన అతిచిన్న దేశంగా డొమెనికా నిలిచింది. విశ్వక్రీడల్లో ఆ దేశానికి ఇదే తొలి పతకం కావడం మరో విశేషం. ఇప్పటి వరకు తమ దేశానికి అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా గుర్తింపు లేకున్నా... ఈ మెడల్ అనంతరం డొమినికాను ప్రపంచ చాంపియన్‌గా అందరూ గుర్తిస్తారని... ఆ దేశానికి తొలి పతకం అందించిన ట్రిపుల్ జంపర్ లెఫాండ్ థియా ఆశాభావం వ్యక్తం చేసింది. భిన్న భౌగోళిక పరిస్థితులు ఉండే డొమెనికాలో... క్రీడలకు ఇచ్చే ప్రాధాన్యం అంతంత మాత్రమే. అలాంటి చోటు నుంచి ‘పారిస్’ క్రీడలకు నలుగురు అథ్లెట్లు అర్హత సాధించగా అందులో లెఫాండ్ థియా సాధించిన బంగారు పతకం... ఆ దేశానికి కీర్తి ప్రతిష్టలు కట్టబెట్టింది. 1996 అట్లాంటా ఒలింపిక్స్ నుంచి డొమెనికా విశ్వక్రీడల్లో ప్రాతినిధ్యం వహిస్తుండగా.. 28 ఏళ్ల తర్వాత ఆ దేశానికి మొదటి పతకం దక్కింది. ఈ ఏడాది ప్రపంచ ఇండోర్ చాంపియన్íÙప్లో పతకం నెగ్గి ఆశలు రేపిన లెఫాండ్... ‘పారిస్’ క్రీడల్లోనూ అదే జోరు కొనసాగించింది. మహిళల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో 15.02 మీటర్ల దూరం లంఘించి పసిడి పతకం కైవసం చేసుకుంది. ‘ఇప్పుడు మేం కూడా ప్రపంచ చాంపియన్లమే. డొమెనికాకు ఒలింపిక్స్‌లో తొలి పతకం. అది కూడా పసిడి. చాలా గొప్పగా అనిపిస్తోంది. ఈ ఫలితంతో మా దేశంలో క్రీడలకు మరింత ప్రాధాన్యత దక్కుతుందనే నమ్మకం పెరిగింది. మా దేశ జనాభా సుమారు 73 వేలు. దేశానికి తొలి స్వర్ణం అందించడం మాటల్లో చెప్పలేని అనుభూతి. దేశం తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి మహిళా అథ్లెట్‌గా నిలవడం... అందులోనూ పతకం గెలవడం చాలా గర్వంగా ఉంది. చిన్న దేశం అంటే... పరిమిత వనరులు ఉంటాయనుకుంటారు. అయితే సంఖ్య కన్నా నాణ్యత ముఖ్యం అని నా ఉద్దేశం. ఈ విజయాన్ని దేశమంతా ఆస్వాదిస్తుంది. డొమెనికా స్టేడియంలో అథ్లెటిక్స్ కోసం మెరుగైన ట్రాక్ కూడా లేదు. ఇప్పుడు ఈ పతకం వల్ల దేశంలో క్రీడా మౌలిక వసతులు మెరుగు పడతాయని ఆశిస్తున్నా. భవిష్యత్తు తరాలు క్రీడలను కెరీర్‌గా ఎంచుకునేందుకు నా వంతు కృషి చేస్తా’ అని పతకం గెలిచిన అనంతరం లెఫాండ్ వివరించింది. జూలియన్ కథే వేరు... పారిస్ ఒలింపిక్స్ మహిళల 100 మీటర్ల పరుగులో స్వర్ణం, 200 మీటర్లలో రజతం నెగ్గిన సెయింట్ లూసియా అథ్లెట్ జూలియన్ అ్రల్ఫెడ్ కథే వేరు! అమెరికా అథ్లెట్లు షకారీ రిచర్డ్సన్, జెఫెర్సన్ మెలీస్సాలతో పోటీపడి అగ్రస్థానం దక్కించుకున్న జూలియన్... ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరింది. ప్రాక్టీస్ చేసేందుకు షూస్ కాదు కదా... కనీసం చెప్పులు కూడా లేని నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన జూలియన్... చిన్నతనంలో ఎక్కువగా స్కూల్ యూనిఫామ్‌లోనే పరుగు పెట్టేది. రన్నింగ్ కోసం ప్రత్యేక దుస్తులు కొనే స్థోమత లేని జూలియన్... చిన్నప్పటి నుంచే పరుగును ప్రేమించింది. ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించాలని ఊహ తెలిసినప్పటి నుంచి లక్ష్యంగా పెట్టుకున్న జూలియన్... పారిస్‌లో తన కల సాకారం చేసుకుంది. ‘ఇది నాకు, నా దేశానికి ఎంతో విలువైంది. యావత్ దేశం సంబరాలు జరుపుకోవడం ఖాయం. చిన్నప్పుడు కాళ్లకు చెప్పులు లేకుండా పరుగులు తీసే దాన్ని. కనీస వసతులు లేకుండానే ఈ స్థాయికి వచ్చా. ఈ ప్రదర్శన అనంతరం మా దేశంలో స్టేడియం నిర్మాణం జరుగుతుందనుకుంటున్నా. యువత క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవడం పెరుగుతుందని భావిస్తున్నా. దేశానికి అంబాసిడర్ అనే భావన కలుగుతోంది. ప్రపంచంలో చాలా మందికి సెయింట్ లూసియా గురించి తెలిసి ఉండకపోవచ్చు. అదెక్కడ ఉంది అని నన్ను ఎంతో మంది అడిగారు. కాని ఇప్పుడు ఒలింపిక్ చాంపియన్ కాబట్టి... ప్రజలు సెయింట్ లూసియా గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. దేశం కోసం పరుగెత్తడాన్ని గౌరవంగా భావిస్తా. ఇంటికి వెళ్లాక ప్రజలతో కలిసి సంబరాలు చేసుకుంటా’అని జూలియన్ చెప్పింది.వీరిద్దరే కాదు... 1,25,000 జనాభా ఉన్న గ్రెనెడా అథ్లెట్లు ‘పారిస్’ క్రీడల్లో రెండు కాంస్యాలు సాధించగా... 2,82,000 జనాభా ఉన్న బార్బడోస్ ఒక పతకం నెగ్గింది. ఇక సుమారు 4 లక్షల జనాభా గల బహామస్ ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో ఇప్పటి వరకు 8 స్వర్ణాలు, 2 రజతాలు, 6 కాంస్యాలతో మొత్తం 16 పతకాలు గెలిచింది. -
అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు
పారిస్: ఒలింపిక్స్ అథ్లెటిక్స్ విభాగంలో ఆసక్తికర ఈవెంట్లలో ఒకటైన పురుషుల 200 మీటర్ల పరుగులో కొత్త చాంపియన్ అవతరించాడు. బోట్స్వానాకు చెందిన లెట్సిల్ టెబోగో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 21 ఏళ్ల టెబోగో 19.46 సెకన్లలో పరుగు పూర్తి చేశాడు. టోక్యోలో రజతం సాధించిన బెడ్నారెక్ (అమెరికా; 19.62 సెకన్లు) ఈసారి కూడా రజతంతో సరి పెట్టుకున్నాడు. 100 మీటర్ల పరుగు విజేత అయిన మరో అమెరికా అథ్లెట్ నోవా లైల్స్‌కు (19.70 సెకన్లు) కాంస్యం దక్కింది. గత ఒలింపిక్స్‌లోనూ లైల్స్‌కు కాంస్యమే లభించింది. కోవిడ్‌తో బాధపడుతూనే బరిలోకి దిగిన లైల్స్ అంచనాలకు తగినట్లుగా రాణించలేకపోయాడు. ఆఫ్రికా ఖండంలో దక్షిణాఫ్రికాకు పొరుగున బోట్స్వానా ఉంది. 26 లక్షల జనాభా కలిగిన ఈ దేశ చరిత్రలో ఇదే తొలి ఒలింపిక్ స్వర్ణ పతకం కావడం విశేషం. గత ఏడాది బుడాపెస్ట్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్íÙప్లో టెబోగో 100 మీటర్లలో రజతం, 200 మీటర్ల పరుగులో కాంస్యం సాధించాడు. అతని కెరీర్ ఎదుగుదలలో తల్లి ఎలిజబెత్ సెరాతివా పాత్ర ఎంతో ఉంది. అయితే అతను ఒలింపిక్ సన్నాహాల్లో ఉన్న సమయంలో 44 ఏళ్ల వయసులో ఆమె బ్రెస్ట్ క్యాన్సర్‌తో మరణించింది.తన చేతి వేలి గోర్లపై తల్లి పేరు రాసుకొని అతను రేస్‌లో పాల్గొన్నాడు. పరుగు పూర్తి కాగానే జాతీయ పతాకాన్ని ఒంటిపై కప్పుకున్న టెబోగో భుజాలపై తన రెండు షూస్ వేసుకొని భావోద్వేగంతో కన్నీళ్ల పర్యంతమయ్యాడు. అందులో ఒక షూను తీసి అతను కెమెరాకు చూపించాడు. దానిపై అతని తల్లి పేరు, పుట్టిన తేదీ రాసి ఉన్నాయి. ప్రేక్షక సమూహంలో ఉన్న అతని చెల్లెలు కూడా అన్న ప్రదర్శనకు జేజేలు పలకింది. ‘నేను ఒలింపిక్ పతకం గెలవాలని ఆమె ఎంతో కోరుకుంది’ అని టెబోగో చెప్పాడు. మరోవైపు టెబోగో విజయంతో బోట్స్వానా దేశంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ విజయంపై ప్రజలంతా సంబరాలు చేసుకోవాలంటూ దేశాధ్యక్షుడు మాగ్వీట్సీ మసీసీ శుక్రవారం ‘హాఫ్ డే’ సెలవు ప్రకటించడం విశేషం. -
Olympics: జ్యోతికి మళ్లీ నిరాశ.. సెమీస్ చేరకుండానే..
ప్యారిస్ ఒలింపిక్స్-2024 అథ్లెటిక్స్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ నిరాశ పరిచింది. గురువారం మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రెపిచాజ్ రేసులో జ్యోతి నాలుగో స్థానంతో సరి పెట్టుకుంది. అంతకుముందు బుధవారం హీట్స్‌లో ఏడో స్థానంలో నిలిచిన జ్యోతి... రెపిచాజ్‌లోనూ ఆకట్టుకోలేకపోయింది.ఫలితంగా జ్యోతి సెమీస్ ఫైనల్ అవకాశాలు గల్లంతయ్యాయి. ఈ విభాగంలో పోటీ పడుతున్న తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందిన జ్యోతి 13.17 సెకన్లలో గమ్యానికి చేరింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన 24 ఏళ్ల జ్యోతి గతంలో 12.78 సెకన్లతో 100 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు నెలకొల్పింది.వెనుకంజలో గోల్ఫర్లు ప్యారిస్ ఒలింపిక్స్ గోల్ఫ్ మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో భారత గోల్ఫర్లు ఆకట్టుకోలేకపోయారు. గురువారం రెండు రౌండ్లు ముగిసేసరికి దీక్ష డాగర్, అదితి అశోక్ చెరో 143 పాయింట్లతో మరో ముగ్గురు గోల్ఫర్లతో కలిసి సంయుక్తంగా 14వ స్థానంలో ఉన్నారు. అంతిమ్‌పై నిషేధం.. ఖండించిన ఐఓఏభారత యువ రెజ్లర్ అంతిమ్ పంఘాల్‌పై మూడేళ్ల నిషేధం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పారిస్ ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్ 53 కేజీల విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన అంతిమ్ తొలి రౌండ్ బౌట్‌లోనే టర్కీ రెజ్లర్ యెట్గిల్ జెనెప్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడటంతో భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) 19 ఏళ్ల అంతిమ్‌పై కఠిన నిర్ణయం తీసుకునే చాన్స్ కనిపిస్తోంది. కాగా.. ఇప్పటికే అంతిమ్‌పై నిషేధం విధించినట్లు వస్తున్న వార్తలను గురువారం ఐఓఏ ఖండించింది. -
పారుల్... రెండో‘సారీ’
పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో మనవాళ్లు ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే మహిళల 5000 మీటర్ల పరుగులో నిరాశ పరిచిన పారుల్ చౌధరీ 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లోనూ హీట్స్‌లోనే వెనుదిరిగింది. ఆదివారం జరిగిన పోటీల్లో పారుల్ 9 నిమిషాల 23.39 సెకన్లలో లక్ష్యాన్ని చేరి హీట్స్‌లో 9వ స్థానంలో నిలిచింది.ఒక్కో హీట్‌లో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధించారు. గమ్యాన్ని చేరేందుకు తన అత్యుత్తమ టైమింగ్ (9 నిమిషాల 15.31 సెకన్లు) కంటే ఎక్కువ సమయం తీసుకున్న పారుల్ ఓవరాల్‌గా 21వ స్థానంతో సరిపెట్టుకుంది. గత ఏడాది ఆసియా క్రీడల్లో పారుల్ 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో రజతం, 5000 మీటర్లలో స్వర్ణం సాధించింది. అయితే తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొన్న పారుల్ నిరాశపరిచింది. ఇక పురుషుల లాంగ్‌జంప్‌లో జెస్విన్ అల్డ్రిన్ గ్రూప్ ‘బి’లో 13వ స్థానంలో నిలిచాడు. 7.61 మీటర్ల దూరం లంఘించిన జెస్విన్ మొత్తంగా 26వ స్థానంతో ‘పారిస్’ క్రీడల నుంచి ని్రష్కమించాడు. ఈ విభాగంలో 8.15 మీటర్లు దాటిన అథ్లెట్లు ఫైనల్‌కు అర్హత సంపాదించారు. -
10 వేల మీటర్ల రేసులో చెప్తెగాయ్‌కు స్వర్ణం
పారిస్: అథ్లెటిక్స్ పురుషుల 10,000 మీటర్ల రేసులో ఉగాండా రన్నర్ జోషువా చెప్తెగాయ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. శనివారం జరిగిన ఫైనల్లో జోషువా 26 నిమిషాల 43.14 సెకన్లలో అందరికంటే వేగంగా 10,000 మీటర్లను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో కొత్త ఒలింపిక్ రికార్డును నమోదు చేయడంతోపాటు ‘పారిస్’ గేమ్స్‌లో ఉగాండాకు తొలి పసిడి పతకాన్ని అందించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కెనెనిసా బెకెలె (ఇథియోపియా; 27ని:01.17 సెకన్లు) నెలకొల్పిన రికార్డును జోషువా ‘పారిస్’లో సవరించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన జోషువా గత మూడు ప్రపంచ చాంపియన్íÙప్లలో 10,000 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకాలు గెలిచాడు. 2020 వాలెన్సియా మీట్లో చెప్తెగాయ్ 10,000 మీటర్లను 26 నిమిషాల 11 సెకన్లలో పూర్తి చేసి తన పేరిట ప్రపంచ రికార్డును నమోదు చేసుకున్నాడు. నాలుగేళ్లుగా ఈ ప్రపంచ రికార్డు చెప్తెగాయ్ పేరిటే ఉంది. -
Olympics 2024: నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్
పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు వరుసగా రెండో రోజు నిరాశ తప్పలేదు. మహిళల 5000 మీటర్ల పరుగులో పారుల్ చౌధరీ, అంకిత దయాని హీట్స్‌లోనే వెనుదిరిగారు. భారత్ నుంచి రెండు ఈవెంట్లలో విశ్వక్రీడలకు అర్హత సాధించిన పారుల్ చౌధరీ.. శుక్రవారం జరిగిన రెండో హీట్‌లో 15 నిమిషాల 10.68 సెకన్లలో లక్ష్యాన్ని చేరి 14వ స్థానంతో సరిపెట్టుకుంది.తొలి హీట్‌లో పోటీపడిన భారత మరో రన్నర్ అంకిత దయాని 20వ స్థానంలో నిలిచింది. అంకిత 16 నిమిషాల 19.38 సెకన్లలో గమ్యాన్ని చేరుకుంది. ఒక్కో హీట్ నుంచి తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన వాళ్లు ఫైనల్‌కు అర్హత సాధించారు. నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్ఆర్చరీ మహిళల వ్యక్తిగత ఎలిమినేషన్ రౌండ్: దీపికా కుమారి ్ఠ మిచెల్లి క్రాపెన్ (జర్మనీ) (మధ్యాహ్నం గం. 1:52 నుంచి), భజన్ కౌర్ ్ఠ దినంద చోరునిసా (ఇండోనేసియా) (మధ్యాహ్నం గం. 2:05 నుంచి) షూటింగ్ మహిళల స్కీట్ క్వాలిఫికేషన్ రౌండ్: రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి). మహిళల 25 మీటర్ల పిస్టల్ (పతక పోరు): మనూ భాకర్ (మధ్యాహ్నం గం. 1:00 నుంచి) బాక్సింగ్ పురుషుల 71 కేజీల క్వార్టర్ ఫైనల్: నిశాంత్ మార్కో వెర్డె (మెక్సికో) (అర్ధరాత్రి గం. 12:18 నుంచి) సెయిలింగ్పురుషుల డింగీ రేసులు: విష్ణు (మధ్యాహ్నం గం. 3:45 నుంచి). మహిళల డింగీ రేసులు: నేత్ర కుమానన్ (సాయంత్రం గం. 5:55 నుంచి) -
వరల్డ్ అథ్లెటిక్స్ గుర్తింపుపై సీఎం హర్షం
సాక్షి, సిటీబ్యూరో: ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్‌కు వరల్డ్ అథ్లెటిక్స్ నుంచి గుర్తింపు రావడంపై సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం మారథాన్ డైరెక్టర్ రాజేశ్ వెచ్చ, తెలంగాణ స్పోర్ట్స్ ఫెడరేషన్ చైర్మన్ స్టాన్లీ జోన్స్, హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ కమిటీ మెంబర్ రామ్ కటికనేని సీఎం రేవంత్‌రెడ్డిని సెక్రటేరియట్లో మర్యాదపూర్వకంగా కలిశారు.ఆగస్టు 24న జరగనున్న ఈ కార్యక్రమానికి అవసరమైన మద్దతు ఇస్తామని, మారథాన్‌లో పాల్గొనే వారందరికీ సీఎం 'ఆల్ ది బెస్ట్' చెప్పారు.ఇవి చదవండి: సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు! -
నడకలో నిరాశ
పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ పోటీల తొలి రోజు భారత్‌కు నిరాశ తప్పలేదు. 20 కిలోమీటర్ల రేస్ వాక్‌లో మన అథ్లెట్లు ఆకట్టుకోలేకపోయారు. మహిళల విభాగంలో ప్రియాంక గోస్వామి 1 గంటా 39 నిమిషాల 55 సెకన్లలో లక్ష్యాన్ని చేరి 41వ స్థానంతో సరిపెట్టుకుంది. ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించి ఆశలు రేపిన ప్రియాంక... ‘పారిస్’ క్రీడల్లో అదే ప్రదర్శన కనబర్చలేకపోయింది. 28 ఏళ్ల ప్రియాంక తన అత్యుత్తమ ప్రదర్శన (1 గంట 28 నిమిషాల 45 సెకన్లు) కంటే 11 నిమిషాలు వెనుకబడింది. పురుషుల విభాగంలో వికాస్ సింగ్ 30వ స్థానంతో, పరమ్‌జీత్ సింగ్ 37వ స్థానంతో రేసును ముగించారు. మరో వాకర్ అ„Š దీప్ అనారోగ్యం కారణంగా రేసు పూర్తి చేయలేకపోయాడు. -
నీరజ్ చోప్రా పైనే భారత్ ఆశలు
పారిస్: విశ్వ క్రీడల్లో అందరూ ఆసక్తితో ఎదురుచూసే అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలకు నేడు తెర లేవనుంది. ఒలింపిక్స్ మొదలై ఐదు రోజులు దాటినా.. అసలు సిసలు మజా ఇచ్చే అథ్లెటిక్స్ ఈవెంట్ నేటి నుంచి జరుగుతుంది. భారత అభిమానుల విషయానికొస్తే స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపైనే అందరి దృష్టి ఉంది. టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకంతో భారత అథ్లెటిక్స్ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించిన నీరజ్ మరోసారి అదే స్థాయి ప్రదర్శన చేసేందుకు సిద్ధమవుతుండగా.. భారత్ నుంచి మొత్తం 29 మంది అథ్లెట్లు ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో సత్తా చాటేందుకు రెడీ అయ్యారు. ‘టోక్యో’ క్రీడల్లో పసిడి పతకం సాధించిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో అదే నిలకడ కొనసాగిస్తూ వస్తున్న నీరజ్ వరుసగా రెండో స్వర్ణం నెగ్గాలని తహతహలాడుతున్నాడు. ఆగస్టు 6న పురుషుల జావెలిన్‌త్రో క్వాలిఫికేషన్ రౌండ్... రెండు రోజుల తర్వాత 8న ఫైనల్ జరగనుంది. నీరజ్ టైటిల్ నిలబెట్టుకుంటే.. ఒలింపిక్స్‌లో ఆ ఘనత సాధించిన ఐదో జావెలిన్ త్రోయర్ కానున్నాడు. విశ్వక్రీడల చరిత్రలో ఎరిక్ లామింగ్ (స్వీడన్; 1908, 1912), జానీ మైరా (ఫిన్లాండ్; 1920, 1924), జాన్ జెలెన్జీ (చెక్ రిపబ్లిక్; 1992, 1996, 2000), ఆండ్రీస్ థోర్కిల్డ్సెన్ (నార్వే; 2004, 2008) స్వర్ణాన్ని నిలబెట్టుకున్నారు. రేస్ వాక్‌తో మొదలు.. అథ్లెటిక్స్‌లో భాగంగా తొలి రోజు మహిళల, పురుషుల 20 కిలోమీటర్ల రేస్ వాక్ పోటీలు ప్రారంభం కానున్నాయి. భారత్ నుంచి పురుషుల విభాగంలో అ„Š దీప్ సింగ్, వికాస్ సింగ్, పరమ్‌జీత్ సింగ్ బిష్త్ పోటీలో ఉన్నారు. ఇక మహిళల విభాగం నుంచి ప్రియాంక గోస్వామి బరిలోకి దిగనుంది. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో అవినాశ్ సాబ్లేపై భారీ అంచనాలు ఉండగా... 4–400 మీటర్ల పురుషుల ఈవెంట్లో మన జట్టు పతక ఆశలు రేపుతోంది. ఇటీవల పారిస్ డైమండ్ లీగ్‌లో అవినాశ్ జాతీయ రికార్డు బద్దలు కొట్టి 8 నిమిషాల 9.91 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఆరో స్థానంలో నిలిచాడు. హర్డిల్స్‌లో జ్యోతి...రిలేలో జ్యోతిక శ్రీ ఇక ఒలింపిక్స్ చరిత్రలో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో పాల్గొంటున్న తొలి భారత అథ్లెట్‌గా ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ గుర్తింపు పొందనుంది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న జ్యోతి... ‘పారిస్’ క్రీడల్లోనూ అదే జోరు కనబర్చాలని చూస్తోంది. మహిళల 4్ఠ400 మీటర్ల రిలే జట్టులో కీలక సభ్యురాలైన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి దండి జ్యోతిక శ్రీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మహిళల 3000 మీటర్ల స్టీపుల్చేజ్తో పాటు 5000 మీటర్ల పరుగులో పాల్గొంటున్న పారుల్ చౌదరి, మహిళల జావెలిన్‌త్రోలో అన్ను రాణి, పురుషుల షాట్‌పుట్‌లో తజిందర్ పాల్‌సింగ్ తూర్, ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రావేల్, అబూబాకర్ నుంచి కూడా మెరుగైన ప్రదర్శన ఆశించవచ్చు. కొత్తగా రెపిచాజ్ రౌండ్.. రెజ్లింగ్, రోయింగ్ మాదిరిగానే ఈసారి నుంచి ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లోనూ రెపిచాజ్ విభాగాన్ని ప్రవేశ పెట్టనున్నారు. 200 మీటర్ల నుంచి 1500 మీటర్ల పరుగు వరకు వ్యక్తిగత విభాగాల్లో దీన్ని అమలు చేయనున్నారు. హర్డిల్స్‌కు కూడా ఇది వర్తించనుంది. గతంలో హీట్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన అథ్లెట్లతో పాటు వేగవంతమైన టైమింగ్ నమోదు చేసుకున్న అథ్లెట్లు సెమీఫైనల్‌కు చేరేవారు. తాజా రెపిచాజ్ రౌండ్‌తో హీట్స్‌లో ముందు నిలిచిన వారు మాత్రమే సెమీస్‌కు అర్హత సాధిస్తారు. మిగిలిన వాళ్లందరూ రెపిచాజ్ రౌండ్లో పాల్గొంటారు. అందులో సత్తా చాటితే సెమీఫైనల్‌కు చేరేందుకు రెండో అవకాశం దక్కనుంది. అసలేంటీ రెపిచాజ్ఫ్రెంచ్ భాషలో రెపిచాజ్.. అంటే రెండో అవకాశం అని అర్థం. నిజంగానే ఇది అథ్లెట్లకు సెకండ్ చాన్స్ వంటిదే. ‘పారిస్’ క్రీడల ద్వారా అథ్లెటిక్స్‌లో ఈ రౌండ్‌ను మొదటిసారి ప్రవేశ పెట్టనున్నారు. గతంలో మార్షల్ ఆర్ట్స్, రోయింగ్, రెజ్లింగ్ క్రీడల్లో మాత్రమే ఈ అవకాశం ఉండేది. ఇప్పుడు రన్నింగ్, హర్డిల్స్‌లో 200 మీటర్ల నుంచి 1500 మీటర్ల వరకు దీన్ని అమలు చేయనున్నారు. దీంతో తొలి హీట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేకపోయిన వారికి సెమీఫైనల్ చేరడానికి మరో అవకాశం దక్కనుంది.3000 మీటర్ల స్టీపుల్‌చేజ్, 5000 మీటర్ల పరుగులో రెపిచాజ్ రౌండ్‌ను అనుమతించడం లేదు. ఈ ఈవెంట్లలో పాల్గొన్న అథ్లెట్లు తేరుకునేందుకు మరింత సమయం అవసరమవనుండటంతో.. 1500 మీటర్ల వరకే దీన్ని పరిమితం చేశారు. ఇక పురుషుల, మహిళల 10,000 మీటర్లు, మారథాన్స్‌లో కేవలం ఫైనల్ మాత్రమే నిర్వహించనున్నారు. మహిళల 4 X400 మీటర్ల రిలే దండి జ్యోతిక శ్రీతొలి రౌండ్: ఆగస్టు 9 మధ్యాహ్నం గం 2:10 నుంచి ఫైనల్: ఆగస్టు 11 అర్ధరాత్రి గం. 12.44 నుంచి మహిళల 100 మీటర్ల హర్డిల్స్ జ్యోతి యర్రాజీతొలి రౌండ్: ఆగస్టు 7 మధ్యాహ్నం గం. 1:45 నుంచి రెపిచాజ్ రౌండ్: ఆగస్టు 8 మధ్యాహ్నం గం. 2:05 నుంచి సెమీఫైనల్: ఆగస్టు 9 మధ్యాహ్నం గం. 3:35 నుంచి ఫైనల్: రాత్రి గం. 11:05 నుంచిజావెలిన్ త్రో షెడ్యూల్ నీరజ్ చోప్రా,కిషోర్ జేనా క్వాలిఫయింగ్: ఆగస్టు 6 మధ్యాహ్నం గం. 1:50 నుంచి ఫైనల్: ఆగస్టు 8 రాత్రి గం. 11:55 నుంచి -
విజయోస్తు!.. పారిస్ ఒలింపిక్స్‌కు భారత్ బలగం సిద్ధం
గత మూడేళ్లుగా భారత క్రీడాకారులు ఏ లక్ష్యంతోనైతే సాధన చేస్తున్నారో... ఆ ప్రయత్నాలను పతకాల రూపంలో మార్చేందుకు సమయం ఆసన్నమైంది. విశ్వ క్రీడా సంరంభం పారిస్ ఒలింపిక్స్‌కు రంగంసిద్ధమైంది. శుక్రవారం జరిగే ప్రారం¿ోత్సవం తర్వాత పారిస్ ఒలింపిక్స్ క్రీడలు అధికారికంగా మొదలవుతాయి. అయితే ఫుట్‌బాల్, రగ్బీ సెవెన్స్ పోటీలు మాత్రం బుధవారమే ఆరంభమయ్యాయి. భారత్ విషయానికొస్తే నేడు ఆర్చరీలో పురుషుల, మహిళల వ్యక్తిగత రికర్వ్ ర్యాంకింగ్ రౌండ్‌తో మనోళ్ల సమరానికి తెర లేస్తుంది. ర్యాంకింగ్ రౌండ్లో ఆయా ఆర్చర్లు సాధించిన పాయింట్లు, ర్యాంక్ ఆధారంగానే ఆర్చరీ ప్రధాన పోటీల ‘డ్రా’ను ఖరారు చేస్తారు. కరోనా మహహ్మరి కారణంగా 2020 టోక్యో ఒలింపిక్స్ ఒక ఏడాది వాయిదాపడి 2021లో జరగ్గా... భారత్ నుంచి 18 క్రీడాంశాల్లో 127 మంది బరిలోకి దిగారు. 1 స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి 7 పతకాలు నెగ్గి తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత్ పతకాల పట్టికలో 48వ ర్యాంక్‌లో నిలిచింది. మూడేళ్లు ముగిశాయి. మళ్లీ పారిస్ వేదికగా ఒలింపిక్స్ వచ్చాయి. ఈసారి భారత్ నుంచి 16 క్రీడాంశాల్లో మొత్తం 117 మంది పోటీపడుతున్నారు. అథ్లెటిక్స్‌లో అత్యధికంగా 29 మంది అర్హత సాధించగా... షూటింగ్లో 21 మంది తమ గురికి పదును పెట్టనున్నారు. ఒలింపిక్స్ సన్నాహాల కోసం కేంద్ర ప్రభుత్వం క్రీడాకారులపై ఏకంగా రూ. 470 కోట్లు ఖర్చు చేసింది. ఈసారి భారత క్రీడాకారులు ‘టోక్యో’ ప్రదర్శను అధిగమించి ‘పారిస్’ను చిరస్మరణీయంగా చేసుకోవాలని, పతకాల పంట పండించి స్వదేశానికి తిరిగి రావాలని ఆశిస్తూ... ఆల్ ద బెస్ట్! అథ్లెటిక్స్ (29) పురుషుల విభాగం (18): నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో), అవినాశ్ సాబ్లే (3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్), కిశోర్ జేనా (జావెలిన్ త్రో), అ„Š దీప్ సింగ్ (20 కిలోమీటర్ల రేస్ వాక్), పరమ్‌జీత్ సింగ్ బిష్త్ (20 కిలోమీటర్ల రేస్ వాక్), తజీందర్ పాల్ (షాట్‌పుట్), అబ్దుల్లా అబూబాకర్ (ట్రిపుల్ జంప్), ప్రవీణ్ చిత్రావెల్ (ట్రిపుల్ జంప్), అజ్మల్ (4్ఠ400 మీటర్ల రిలే), అనస్ (4్ఠ400 మీటర్ల రిలే), అమోజ్ జేకబ్ (4్ఠ400 మీటర్ల రిలే), సంతోష్ తమిళరాసన్ (4్ఠ400 మీటర్ల రిలే), రాజేశ్ రమేశ్ (4్ఠ400 మీటర్ల రిలే), మిజో చాకో కురియన్ (4్ఠ400 మీటర్ల రిలే), జెస్విన్ ఆ్రల్డిన్ (లాంగ్‌జంప్), సర్వేశ్ కుషారే (హైజంప్, సూరజ్ పన్వర్ (మారథాన్ మిక్స్డ్ రేస్ వాక్, వికాశ్ సింగ్ (20 కిలోమీటర్ల రేస్ వాక్), మహిళల విభాగం (11): జ్యోతి యర్రాజీ (100 మీటర్ల హర్డిల్స్; ఆంధ్రప్రదేశ్), పారుల్ చౌధరీ (3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్, 5000 మీటర్లు), అన్నురాణి (జావెలిన్ త్రో), విత్యా రాంరాజ్ (4్ఠ400 మీటర్ల రిలే), పూవమ్మ రాజు (4x400 మీటర్ల రిలే), దండి జ్యోతిక శ్రీ (4x400 మీటర్ల రిలే; ఆంధ్రప్రదేశ్), శుభా వెంకటేశన్ (4x400 మీటర్ల రిలే), కిరణ్ పహల్ (400 మీటర్లు, 4x400 మీటర్ల రిలే), ప్రాచి (4x400 మీటర్ల రిలే), అంకిత ధ్యాని (5000 మీటర్లు), ప్రియాంక గోస్వామి (20 కిలోమీటర్ల రేస్ వాక్, మిక్స్డ్ మారథాన్). షెడ్యూల్: ఆగస్టు 1 నుంచి 11 వరకుషూటింగ్ (21)పురుషుల విభాగం (10): సరబ్జోత్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్), అర్జున్ సింగ్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్), అర్జున్ బబూటా (10 మీటర్ల ఎయిర్ రైఫిల్, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్), సందీప్ సింగ్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్), ఐశ్వర్య ప్రతాప్ తోమర్ (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్), స్వప్నిల్ (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్), విజయ్‌వీర్ (25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్), అనంత్ జీత్ (స్కీట్, స్కీట్ మిక్స్డ్ టీమ్), పృథ్వీరాజ్ (ట్రాప్). మహిళల విభాగం (11): మనూ భాకర్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్), ఇలవేనిల్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్), సిఫ్ట్ కౌర్ సమ్రా (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్), అంజుమ్ (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్), రిథమ్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్), ఇషా సింగ్ (25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్; తెలంగాణ), రమిత (10 మీటర్ల ఎయిర్ రైఫిల్, మిక్స్డ్ టీమ్), శ్రేయసి సింగ్ (ట్రాప్), రైజా ధిల్లాన్ (స్కీట్ల్), రాజేశ్వరి (ట్రాప్), మహేశ్వరి (స్కీట్, స్కీట్ మిక్స్డ్ టీమ్). షెడ్యూల్: జూలై 27 నుంచి ఆగస్టు 5 వరకు హాకీ (16) పురుషుల విభాగం (16): శ్రీజేశ్, హర్మన్‌ప్రీత్æ, మన్‌ప్రీత్, హార్దిక్, జర్మన్‌ప్రీత్, షంషేర్, మన్దీప్, గుర్జంత్, సుఖ్జీత్, కృష్ణ బహదూర్, జుగ్రాజ్, అమిత్ రోహిదాస్, సుమిత్ , వివేక్ ప్రసాద్, అభిõÙక్ , లలిత్, రాజ్‌కుమార్, సంజయ్, నీలకంఠ శర్మ . షెడ్యూల్: జూలై 27 నుంచి ఆగస్టు 9 వరకు టేబుల్ టెన్నిస్ (8)మహిళల విభాగం (4): ఆకుల శ్రీజ (సింగిల్స్, టీమ్; తెలంగాణ), మనిక బత్రా (సింగిల్స్, టీమ్), అర్చన (టీమ్), ఐహిక (టీమ్). పురుషుల విభాగం (4): శరత్ కమల్ (సింగిల్స్, టీమ్), హరీ్మత్ (సింగిల్స్, టీమ్), మానవ్ (టీమ్), సత్యన్ (టీమ్). షెడ్యూల్: జూలై 27 నుంచి ఆగస్టు 10 వరకు బ్యాడ్మింటన్ (7)పురుషుల విభాగం (4): సాతి్వక్ సాయిరాజ్ (డబుల్స్; ఆంధ్రప్రదేశ్), చిరాగ్ శెట్టి (డబుల్స్), ప్రణయ్ (సింగిల్స్), లక్ష్య సేన్ (సింగిల్స్). మహిళల విభాగం (3): పీవీ సింధు (సింగిల్స్), అశ్విని పొన్నప్ప (డబుల్స్), తనీషా (డబుల్స్). షెడ్యూల్: జూలై 27 నుంచి ఆగస్టు 5 వరకు ఆర్చరీ (6)పురుషుల విభాగం (3): బొమ్మదేవర ధీరజ్ (సింగిల్స్, టీమ్, మిక్స్డ్ టీమ్; ఆంధ్రప్రదేశ్), తరుణ్‌దీప్ (టీమ్), ప్రవీణ్ (టీమ్). మహిళల విభాగం (3): దీపిక (టీమ్), అంకిత (టీమ్), భజన్ (సింగిల్స్, టీమ్, మిక్స్డ్ టీమ్). షెడ్యూల్: జూలై 28 నుంచి ఆగస్టు 4 వరకుబాక్సింగ్ (6)పురుషుల విభాగం (2): నిశాంత్ దేవ్ (71 కేజీలు), అమిత్ (51 కేజీలు). మహిళల విభాగం (4): నిఖత్ జరీన్ (50 కేజీలు; తెలంగాణ), లవ్లీనా (75 కేజీలు), ప్రీతి (54 కేజీలు), జైస్మిన్ (57 కేజీలు). షెడ్యూల్: జూలై 27 నుంచి ఆగస్టు 10 వరకు రెజ్లింగ్ (6)పురుషుల విభాగం (1): అమన్ (57 కేజీలు). మహిళల విభాగం (5): వినేశ్ ఫొగాట్ (50 కేజీలు), అంతిమ్ (53 కేజీలు), అన్షు (57 కేజీలు), నిషా (68 కేజీలు), రీతిక హుడా (76 కేజీలు). షెడ్యూల్: ఆగస్టు 5 నుంచి 11 వరకు స్విమ్మింగ్ (2)పురుషుల విభాగం (1): శ్రీహరి నటరాజ్ (100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్). మహిళల విభాగం (1): ధీనిధి (200 మీటర్ల ఫ్రీస్టయిల్) షెడ్యూల్: జూలై 28 నుంచి 30 వరకు సెయిలింగ్ (2) పురుషుల విభాగం (1): విష్ణు శరవణన్ (ఐఎల్సీఏ–7). మహిళల విభాగం (1): నేత్రా కుమనన్ (ఐఎల్సీఏ–6). షెడ్యూల్: జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు ఈక్వె్రస్టియన్ (1)పురుషుల విభాగం (1): అనూశ్ అగర్వల్లా (డ్రెసాజ్). షెడ్యూల్: ఆగస్టు 4 ూడో (1)మహిళల విభాగం (1): తులికా మాన్ (ప్లస్ 78 కేజీలు). షెడ్యూల్: ఆగస్టు 2రోయింగ్ (1)పురుషుల విభాగం (1): బల్రాజ్ (సింగిల్ స్కల్స్). షెడ్యూల్: జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకుటెన్నిస్ (3)పురుషుల విభాగం (3): రోహన్ బోపన్న (డబుల్స్), శ్రీరామ్ బాలాజీ (డబుల్స్), సుమిత్ నగాల్ (సింగిల్స్) షెడ్యూల్: జూలై 27 నుంచి ఆగస్టు 4 వరకుగోల్ఫ్ (4)పురుషుల విభాగం (2): శుభాంకర్, గగన్ జీత్ . మహిళల విభాగం (2): అదితి, దీక్షా . షెడ్యూల్: ఆగస్టు 1 నుంచి 10 వరకువెయిట్లిఫ్టింగ్ (1) మహిళల విభాగం (1): మీరాబాయి చాను (49 కేజీలు). షెడ్యూల్: ఆగస్టు 7 -
వీళ్ల ఆటను చూడాల్సిందే!
జీవితంలో ఒక్కసారి ఒలింపిక్స్‌లో పోటీపడితేనే తమ జీవితాశయం నెరవేరినట్లు చాలా మంది క్రీడాకారులు భావిస్తారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని కొందరు జాతీయ హీరోలుగా ఎదుగుతారు. ఒలింపిక్స్ పేరును ఎప్పుడు ప్రస్తావించినా తమ పేరును కూడా స్మరించుకునే విధంగా చరిత్రకెక్కుతారు. తమ అది్వతీయమైన ప్రదర్శనతో తమకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖిస్తారు. ఒలింపిక్స్‌లో పోటీపడటాన్ని... పతకాలను సాధించడాన్ని... ప్రపంచ రికార్డులు సృష్టించడాన్ని అలవాటుగా మార్చుకొని ఎవరికీ అందనంత ఎత్తులో నిలుస్తారు. మరో రెండు రోజుల్లో మొదలయ్యే పారిస్ ఒలింపిక్స్‌లోనూ పలు క్రీడాంశాల్లో దిగ్గజాలు మరోసారి తమ విన్యాసాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. అందులో కొందరి గురించి క్లుప్తంగా... –సాక్షి క్రీడా విభాగంసిమోన్ బైల్స్ (జిమ్నాస్టిక్స్) మెరుపు తీగలా కదులుతూ... అలవోకగా పతకాలు గెలుస్తూ... ప్రపంచ జిమ్నాస్టిక్స్‌లో తనదైన ముద్ర వేసింది అమెరికాకు చెందిన సిమోన్ బైల్స్. 27 ఏళ్ల బైల్స్ వరుసగా మూడో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగనుంది. 4 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న బైల్స్ ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో 4 స్వర్ణాలు, 1 రజతం, 2 కాంస్యాలు గెలిచింది. ప్రపంచ చాంపియన్íÙప్లో 23 స్వర్ణాలు, 4 రజతాలు, 3 కాంస్యాలు కైవసం చేసుకుంది. ‘పారిస్’లో బైల్స్ మరో పతకం నెగ్గితే ఒలింపిక్స్ చరిత్రలో అత్యధిక పతకాలు నెగ్గిన అమెరికన్ జిమ్నాస్ట్‌గా రికార్డు నెలకొల్పుతుంది. బైల్స్ ఐదు పతకాలు గెలిస్తే... ఒలింపిక్స్ చరిత్రలోనే 12 పతకాలతో అత్యధిక పతకాలు నెగ్గిన జిమ్నాస్ట్‌లలో లారిసా లాతినినా (రష్యా; 18 పతకాలు) తర్వాత రెండో స్థానానికి చేరుకుంటుంది. మిజైన్ లోపెజ్ నునెజ్ (రెజ్లింగ్) గ్రీకో రోమన్ స్టయిల్లో ఎదురులేని దిగ్గజ రెజ్లర్. క్యూబాకు చెందిన 41 ఏళ్ల నునెజ్ వరుసగా ఆరో ఒలింపిక్స్‌లో పోటీపడుతున్నాడు. ఇప్పటికే వరుసగా నాలుగు ఒలింపిక్స్‌లలో స్వర్ణ పతకాలను సాధించాడు. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తున్న నునెజ్ పురుషుల గ్రీకో రోమన్ 130 కేజీల విభాగంలో మరోసారి టైటిల్ ఫేవరెట్‌గా ఉన్నాడు. 2004 ఏథెన్స్లో 120 కేజీల విభాగంలో ఐదో స్థానంలో నిలిచిన నునెజ్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు.2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లలో 120 కేజీల విభాగంలో స్వర్ణ పతకాలు సాధించాడు. 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లలో 130 కేజీల విభాగంలో స్వర్ణ పతకాలను గెల్చుకున్నాడు. పారిస్ గేమ్స్‌లోనూ నునెజ్ పతకం సాధిస్తే... ఒలింపిక్స్ రెజ్లింగ్ చరిత్రలో ఐదు స్వర్ణాలు లేదా ఐదు పతకాలు నెగ్గిన ఏకైక రెజ్లర్‌గా ఘనత వహిస్తాడు. ఎలూడ్ కిప్‌చోగి (అథ్లెటిక్స్) లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్‌లో ఆఫ్రికా అథ్లెట్లకు తిరుగులేదు. పారిస్ ఒలింపిక్స్‌లో కెన్యాకు చెందిన 39 ఏళ్ల ఎలూడ్ కిప్‌చోగి గతంలో మారథాన్‌లో ఎవరికీ సాధ్యంకాని రికార్డును సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు. ఐదోసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతున్న కిప్‌చోగి 2004 ఏథెన్స్ గేమ్స్‌లో 5000 మీటర్లలో కాంస్యం, 2008 బీజింగ్ గేమ్స్‌లో 5000 మీటర్లలో రజతం సాధించాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌కు అర్హత పొందలేకపోయిన కిప్‌చోగి ఆ తర్వాత మారథాన్ (42.195 కిలోమీటర్లు) వైపు మళ్లాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కిప్‌చోగి విజేతగా నిలిచి రెండు స్వర్ణాలు సాధించాడు. ఈ క్రమంలో అబెబె బికిలా (ఇథియోపియా), వాల్దెమర్ (జర్మనీ) తర్వాత ఒలింపిక్స్ మారథాన్ చరిత్రలో రెండు స్వర్ణాలు నెగ్గిన మూడో అథ్లెట్‌గా నిలిచాడు. పారిస్‌లోనూ కిప్‌చోగి పతకం లేదా స్వర్ణం నెగ్గితే ఒలింపిక్స్ మారథాన్ చరిత్రలో అత్యధికంగా మూడు పతకాలు నెగ్గిన ఏకైక అథ్లెట్‌గా చరిత్ర సృష్టిస్తాడు. లెబ్రాన్ జేమ్స్ (బాస్కెట్‌బాల్) ఒలింపిక్స్‌లో బాస్కెట్‌బాల్‌ను 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ క్రీడాంశంలో అమెరికాయే తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 1980 మాస్కో ఒలింపిక్స్‌ను బహిష్కరించిన అమెరికా జట్టు ఇప్పటి వరకు బాస్కెట్‌బాల్‌లో 16 స్వర్ణాలు, 1 రజతం, 2 కాంస్యాలు గెలిచింది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన అమెరికా ఆ తర్వాత వరుసగా నాలుగు ఒలింపిక్స్‌లలో స్వర్ణాలు సాధించింది. మరో స్వర్ణమే లక్ష్యంగా అమెరికా పారిస్ గేమ్స్‌లో అడుగు పెడుతుంది. నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) లీగ్ చరిత్రలో టాప్ స్కోరర్‌గా ఉన్న లెబ్రాన్ జేమ్స్ నాలుగోసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్ తర్వాత మళ్లీ విశ్వ క్రీడల్లో ఆడుతున్న లెబ్రాన్ జేమ్స్ తన సహజశైలిలో ఆడితే ఈసారీ అమెరికాకు ఎదురుండదు. టెడ్డీ రైనర్ (జూడో) పురుషుల జూడో క్రీడాంశంలో 12 సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఫ్రాన్స్ దిగ్గజం టెడ్డీ రైనర్ సొంతగడ్డపై రికార్డుపై గురి పెట్టాడు. వరుసగా ఐదోసారి ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న 35 ఏళ్ల టెడ్డీ రైనర్ ఒలింపిక్స్‌లో 3 స్వర్ణాలు, 2 కాంస్యాలు సాధించాడు. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న టెడ్డీ పారిస్ ఒలింపిక్స్‌లో మిక్స్డ్ టీమ్‌తోపాటు హెవీ వెయిట్ విభాగంలో బరిలోకి దిగుతాడు. ఈ రెండు విభాగాల్లోనూ టెడ్డీ స్వర్ణాలు సాధిస్తే ఫ్రాన్స్ తరఫున ఒలింపిక్స్ క్రీడల్లో అత్యధికంగా ఐదు స్వర్ణాలు గెలిచిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఫ్రాన్స్ ఫెన్సర్లు లూసియన్ గాడిన్, క్రిస్టియన్ డోరియోలా గతంలో ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాల చొప్పున సాధించారు. బైల్స్, లెబ్రాన్ జేమ్స్, కెప్చోగి, టెడ్డీ రైనర్, నునెజ్లే కాకుండా పోల్‌వాల్టర్ డుప్లాంటిస్ (స్వీడన్), టేబుల్ టెన్నిస్‌లో మా లాంగ్ (చైనా), స్విమ్మింగ్‌లో సెలెబ్ డ్రెసెల్ (అమెరికా), కేటీ లెడెకీ (అమెరికా) కూడా పారిస్ ఒలింపిక్స్‌లో కొత్త చరిత్రను లిఖించే దారిలో ఉన్నారు. వారందరికీ ఆల్ ద బెస్ట్! -
నాన్నకు మెడల్ గిఫ్ట్ గా ఇవ్వాలని..
అమ్మాయి అని వెనకడుగు వేయలేదు. తండ్రి కల నెరవేర్చాలనే తపనతో 11 ఏళ్లుగా కఠోర శ్రమ చేసింది. రన్నింగ్ ట్రాక్‌లో చీతాలా పరుగు పెట్టింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించింది. ఇప్పుడు ఒలింపిక్స్ పతకానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది దండి జ్యోతిక శ్రీ. ఉమెన్స్ 400 మీటర్ల రిలే జట్టులో భారత్ తరఫున పోటీ పడటానికి పారిస్ పయనమైంది. తను పుట్టిన తణుకు ప్రాంతానికి ప్రపంచ గుర్తింపు తెచ్చేందుకు సిద్ధమైంది. తణుకు అర్బన్: అథ్లెటిక్స్‌లో రాణించి అందరి మన్ననలు పొందుతున్న దండి జ్యోతికశ్రీ ఈ నెల 26 నుంచి పారిస్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో భారతదేశం తరఫున పోటీ పడుతోంది. ఆగస్టు తొమ్మిదిన జరిగే మహిళల 400 మీటర్ల రిలేలో జ్యోతికశ్రీ సత్తా చాటనుంది. ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన జ్యోతికశ్రీ అసామాన్య ప్రతిభతో ఒలింపిక్స్ వరకూ ఎదగడం ఒక స్ఫూర్తిగా నిలుస్తోంది. తమ ప్రాంతానికి చెందిన అమ్మాయి ఒలింపిక్స్ వరకూ వెళ్లడంతో తణుకు ప్రాంతంలోని ప్రజల ఆనందానికి అవధుల్లేవు. ఒలింపిక్స్‌లో మెడల్ సాధించి రాష్ట్రానికే కాకుండా దేశానికి పేరు తీసుకువస్తుందని వారంతా ఆకాంక్షిస్తున్నారు. ఇక ఒలింపిక్స్‌కు ఎంపికైన వెంటనే ఆమెకు రాష్ట్రం నలుమూలల నుంచి శుభాకాంక్షల సందేశాలు వెల్లువెత్తాయి. ప్రస్థానమిలా.. బాడీ బిల్డర్‌గా రాణించాలనుకున్న జ్యోతికశ్రీ తండ్రి శ్రీనివాసరావు కోరిక అప్పట్లో వారి కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా నెరవేరలేదు. తనకు కుమారుడు జన్మిస్తే మిస్టర్ ఇండియాగా తీర్చి దిద్దాలని అనుకున్నారు. అయితే ఇద్దరు కుమార్తెలు జన్మించారు. పెద్ద కుమార్తె కీర్తి సత్యశ్రీ చదువు పట్ల ఆసక్తి చూపగా.. చిన్న కుమార్తె జ్యోతికశ్రీ చదువు పట్ల మక్కువ చూపిస్తూనే తండ్రి కోరిక మేరకు పాఠశాల స్థాయిలోనే అథ్లెట్‌గా మారింది. 13 సంవత్సరాల వయసులో తణుకులోని చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో ప్రాక్టీస్ మొదలు పెట్టింది.అక్కడ కీర్తిశ్రీ స్పోర్ట్స్ అకాడమీ కోచ్ కట్లపర్తి సీతారామయ్య తరీ్ఫదులో రాటుదేలింది. స్థానిక మాంటిస్సోరీ స్కూలులో 10వ తరగతి పూర్తిచేసేలోగా జిల్లాస్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో పలు పతకాలు సాధించింది. విజయవాడ సిద్ధార్థ మహిళా కళాశాలలో ఇంటర్ చదువుతూ అప్పటి ఆంధ్ర చీఫ్ కోచ్ వినాయక ప్రసాద్ కోచింగ్‌లో అండర్–18 జాతీయ చాంపియన్íÙప్ పోటీల్లో పాల్గొంది. కెన్యాలో నిర్వహించిన యూత్ వరల్డ్ అథ్లెటిక్ చాంపియన్íÙప్లో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. 2020లో హైదరాబాద్‌లో ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్ కోచింగ్‌లో బ్యాంకాక్, కెన్యాల్లో జరిగిన పోటీలతో పాటు భారతదేశ పలు ప్రాంతాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సత్తా చాటి పలు స్వర్ణ, రజత పతకాలు సాధించింది. 2022లో ఇండియన్ క్యాంప్‌లో తర్ఫీదు పొందేలా అర్హత సాధించింది. తాజాగా 2024 మే నెలలో బహమాస్‌లో నిర్వహించిన వరల్డ్ ఉమెన్స్ రిలేలో అత్యుత్తమ ప్రదర్శన ద్వారా ఒలింపిక్స్‌కి అర్హత సాధించి యావత్ దేశాన్ని తన వైపు చూసేలా చేసింది. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 34 మెడల్స్ సాధించగా రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పోటీల్లో 50 వరకు మెడల్స్ సాధించింది.నాన్న కోసమే నా పరుగు.. నాన్న కల నెరవేర్చేందుకే నా పరుగు మొదలుపెట్టాను. ఒక కొడుకు ఉంటే తనను క్రీడాకారుడిగా తీర్చిదిద్దేవాడిని అనే నాన్న మాటలు నాలో పట్టుదలను పెంచాయి. దీంతో అథ్లెట్‌గా ఎదగాలనే దృఢ నిశ్చయంతో సాధన చేశాను. నాన్నతో పాటు మా అమ్మ, అక్క ఇచ్చిన సహకారం, కోచ్‌లు అందించిన అత్యున్నతమైన సూచనలు, సలహాలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించాను. ఈ క్రమంలో ఎప్పటికైనా ఒలింపిక్స్‌కి అర్హత సాధించాలనే సంకల్పంతో ప్రయత్నించాను. భారతదేశం తరఫున ఒలింపిక్స్‌కు అర్హత సాధించాననే ప్రకటన నాకు చాలా సంతోషాన్నిచ్చి0ది. ఒలింపిక్స్‌లో పతకం సాధించి నాన్నకు గిఫ్ట్‌గా ఇవ్వాలని సిద్ధమవుతున్నాను. – దండి జ్యోతికశ్రీ, అథ్లెట్ నా కల నెరవేరింది.. నేను సాధించలేకపోయిన గుర్తింపును నా కుమార్తె సాధించాలనే కృషి, పట్టుదల నాలో పెరిగింది. జ్యోతికశ్రీకి ఐఏఎస్, ఐపీఎస్ వైపు వెళ్లాలని చిన్ననాటి నుంచి ఆశ పడింది. నాకు ఇష్టమైన క్రీడారంగంలోకి వచ్చి నా కోరిక నెరవేర్చేందుకు పట్టుదలతో కృషి చేసింది. దేశం మెచ్చే క్రీడాకారిణిలా తనను తీర్చిదిద్దే క్రమంలో నాకు ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా నేనెప్పుడూ బెదరలేదు. ఆర్థిక సమస్యలను జయిస్తూ ముందుకు వెళ్లాను. నా కుమార్తె ప్రపంచంతో పోటీపడే స్థాయికి వెళ్లడం ద్వారా నేను కన్న కలలు నిజమయ్యాయి. ఒక తండ్రిగా నాకు ఇంతకంటే తృప్తి ఇంకేం కావాలి. – దండి శ్రీనివాసరావు, జ్యోతికశ్రీ తండ్రి -
విశ్వ క్రీడలకు భారత్ నుంచి 117 మంది.. ఏ విభాగంలో ఎందరు?
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పాల్గొననున్న భారత క్రీడాకారుల సంఖ్య ఖరారైంది. దేశం నుంచి 117 మంది అథ్లెట్లు విశ్వ క్రీడల్లో భాగం కానున్నారని భారత క్రీడా శాఖ అధికారికంగా వెల్లడించింది.క్రీడాకారులతో పాటు 140 మంది సహాయక సిబ్బంది కూడా ప్యారిస్‌కు వెళ్లనున్నట్లు తెలిపింది. కాగా ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడాకారుల జాబితాలో షాట్ పుట్టర్ అభా కతువా పేరు లేకపోవడం గమనార్హం.అభా పేరు మాయంవరల్డ్ ర్యాంకింగ్ కోటాలో ఆమె ప్యారిస్ ఒలింపిక్స్ బెర్తు ఖరారైంది. అయితే, అనూహ్య రీతిలో వరల్డ్ అథ్లెటిక్స్ , ఒలింపిక్ పార్టిసిపెంట్స్ లిస్టు నుంచి అభా పేరు మాయమైంది. అయితే, ఇందుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.కాగా ప్యారిస్ క్రీడల్లో పాల్గొననున్న భారత అథ్లెటిక్స్ బృందంలో 29 మంది ఉండగా.. ఇందులో 11 మంది మహిళా, 18 మంది పురుష క్రీడాకారులు ఉన్నారు. షూటింగ్ టీమ్‌లో 21 మంది ఉండగా.. హాకీ జట్టులో 19 మంది పేర్లు ఉన్నాయి.ఇక టేబుల్ టెన్నిస్ విభాగంలో ఎనిమిది మంది, బ్యాడ్మింటన్‌లో ఏడుగురు, రెజ్లింగ్, ఆర్చరీ, బాక్సింగ్ విభాగాల్లో ఆరుగురు చొప్పున, నలుగురు గోల్ఫ్ క్రీడాకారులు, ముగ్గురు టెన్నిస్ ప్లేయర్లు, సెయిలింగ్, స్విమ్మింగ్ నుంచి ఇద్దరు చొప్పున..నాటి పసిడి ప్రత్యేకంఅదే విధంగా.. ఈక్వెస్ట్రియన్, జూడో, రోయింగ్ , వెయిట్‌లిఫ్టింగ్ విభాగం నుంచి ఒక్కొక్కరు భారత్ తరఫున విశ్వ క్రీడల్లో పాల్గొననున్నారు. కాగా టోక్యో ఒలింపిక్స్-2020లో భారత్ నుంచి 119 మంది క్రీడాకారులు ప్రాతినిథ్యం వహించారు. అత్యధికంగా ఏడు పతకాలతో తిరిగి వచ్చారు. ఇందులో జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా పసిడి పతకం అత్యంత గొప్ప జ్ఞాపకం.చదవండి: Paris Olympics:ఆంధ్రా టు పారిస్.. ఆడుదాం ఒలింపిక్స్ -
ప్రవీణ్‌కు నిరాశ
గ్లాస్గో (స్కాట్లాండ్): ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత ట్రిపుల్ జంపర్ ప్రవీణ్ చిత్రావెల్ తన అత్యుత్తమ ప్రదర్శన కూడా నమోదు చేయలేకపోయాడు. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో 22 ఏళ్ల ప్రవీణ్ 16.45 మీటర్ల దూరం దూకి 11వ స్థానంలో నిలిచాడు. ఫాబ్రిస్ జాంగో (బుర్కినఫాసో; 17.53 మీటర్లు) స్వర్ణం, యాసిర్ మొహమ్మద్ ట్రికీ (అల్జీరియా; 17.35 మీటర్లు), టియాగో పెరీరా (పోర్చుగల్; 17.08 మీటర్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించాడు. 17.37 మీటర్లతో తన పేరిట ఉన్న జాతీయ రికార్డు ప్రదర్శనను ప్రవీణ్ గ్లాస్గోలో పునరావృతం చేసి ఉంటే అతని ఖాతాలో రజత పతకం చేరేది. గత ఏడాది ఆసియా క్రీడల్లో ప్రవీణ్ (17.68 మీటర్లు) కాంస్య పతకాన్ని సాధించాడు. -
జ్యోతి యర్రాజీకి స్వర్ణం
టెహ్రాన్ (ఇరాన్): ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకం గెలుచుకుంది. మహిళల 60 మీటర్ల హర్డిల్స్‌ను 8.12 సెకన్లలో పూర్తి చేసి జ్యోతి మొదటి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో గత ఏడాది తానే నెలకొల్పిన 8.13 సెకన్ల జాతీయ రికార్డును జ్యోతి బద్దలు కొట్టడం విశేషం. ఈ ఈవెంట్ హీట్స్‌ను 8.22 సెకన్లతో అగ్రస్థానంతో ముగించిన జ్యోతి ఫైనల్లో మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చింది. అసుకా టెరెడా (జపాన్ – 8.21సె.), లుయి లై యు (హాంకాంగ్ – 8.21 సె.) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి భువనేశ్వర్‌లోని రిలయన్స్ ఫౌండేషన్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో శిక్షణ పొందుతోంది. ఈ చాంపియన్‌షిప్‌లో శనివారం మరో రెండు స్వర్ణాలు భారత్ ఖాతాలో చేరాయి. పురుషుల షాట్‌పుట్‌లో తజీందర్‌పాల్ సింగ్ తూర్ పసిడి గెలుచుకున్నాడు. తన రెండో ప్రయత్నంలో అతను గుండును 19.71 మీటర్లు విసిరి అగ్ర స్థానం సాధించాడు. మహిళల 1500 మీటర్ల పరుగులో హర్మిలన్ బైన్స్ కనకం మోగించింది. రేస్‌ను హర్మిలన్ 4 నిమిషాల 29.55 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణం గెలుచుకుంది -
అంతర్జాతీయ వుషు ‘ఉత్తమ క్రీడాకారిణి’గా రోషిబినా దేవి
భారత సీనియర్ వుషు క్రీడాకారిణి నరోమ్ రోషిబినా దేవికి అరుదైన గౌరవం లభించింది. 2023 సంవత్సరానికి ఈ మణిపూర్ అమ్మాయి ‘సాండా’ కేటగిరీలో ‘అంతర్జాతీయ ఉత్తమ క్రీడాకారిణి’ పురస్కారం గెల్చుకుంది. పబ్లిక్ ఓటింగ్‌లో రోషిబినాకు అత్యధికంగా 93,545 ఓట్లు లభించాయని అంతర్జాతీయ వుషు సమాఖ్య తెలిపింది. 2023 జాతీయ క్రీడా పురస్కారాల్లో ‘అర్జున’ అవార్డు గెల్చుకున్న 23 ఏళ్ల రోషిబినా 2018 ఆసియా క్రీడల్లో కాంస్యం, 2022 ఆసియా క్రీడల్లో రజతం సాధించింది. -
ఈ రాంబాబు కథ స్పూర్తిదాయకం.. దినసరి కూలీ నుంచి ఏషియన్ గేమ్స్ పతాకధారిగా..!
హాంగ్ఝౌ వేదికగా జరిగిన 2023 ఏషియన్ గేమ్స్‌లో భారత్ గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 107 పతకాలు సాధించి, పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రీడల్లో భారత్ అథ్లెటిక్స్ విభాగంలో మెజార్టీ శాతం పతకాలు సాధించి ఔరా అనిపించింది. ఈసారి పతకాలు సాధించిన వారిలో చాలామంది దిగువ మధ్యతరగతి, నిరుపేద క్రీడాకారులు ఉన్నారు. ఇందులో ఓ అథ్లెట్ కథ ఎంతో సూర్తిదాయకంగా ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన రామ్ బాబు దినసరి కూలీ పనులు చేసుకుంటూ ఏషియన్ గేమ్స్ 35కిమీ రేస్ వాక్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మంజూ రాణితో కలిసి కాంస్య పతకం సాధించాడు. రెక్క ఆడితే కానీ డొక్క ఆడని రామ్ బాబు తన అథ్లెటిక్స్ శిక్షణకు అవసరమయ్యే డబ్బు సమీకరించుకోవడానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దినసరి కూలీగా పనులు చేశాడు. కూలీ పనుల్లో భాగంగా తన తండ్రితో కలిసి గుంతలు తవ్వే పనికి వెళ్లాడు. ఈ పని చేసినందుకు రామ్ బాబుకు రోజుకు 300 కూలీ లభించేది. Daily wage worker to Asian Games Medallist. Unstoppable courage & determination. Please give me his contact number @thebetterindia I’d like to support his family by giving them any tractor or pickup truck of ours they want. pic.twitter.com/ivbI9pzf5F — anand mahindra (@anandmahindra) October 14, 2023 ఈ డబ్బులో రామ్ బాబు సగం ఇంటికి ఇచ్చి, మిగతా సగం తన ట్రైనింగ్‌కు వినియోగించుకునే వాడు. రామ్ బాబు తల్లితండ్రి కూడా దినసరి కూలీలే కావడంతో రామ్ బాబు తన శిక్షణ కోసం ఎన్నో ఆర్ధిక కష్టాలు ఎదుర్కొన్నాడు. ఈ స్థాయి నుంచి ఎన్నో కష్టాలు పడ రామ్ బాబు ఆసియా క్రీడల్లో పతకం సాధించే వరకు ఎదిగాడు. ఇతను పడ్డ కష్టాలు క్రీడల్లో రాణించాలనుకున్న ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. ఏషియన్ గేమ్స్‌లో పతకం సాధించడం ద్వారా విశ్వవేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించిన రామ్ బాబు.. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది ఉండదని నిరూపించాడు. లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి పేదరికం అడ్డురాదని రుజువు చేశాడు. అతి సాధారణ రోజువారీ కూలీ నుంచి ఆసియా క్రీడల్లో అపురూపమైన ఘనత సాధించడం ద్వారా భారతీయుల హృదయాలను గెలుచుకుని అందరిలో స్ఫూర్తి నింపాడు. తాజాగా ఈ రన్నింగ్ రామ్ బాబు కథ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రను కదిలించింది. రామ్ బాబు కథ తెలిసి ఆనంద్ మహీంద్ర చలించిపోయాడు. అతని పట్టుదలను సలాం కొట్టాడు. నీ మొక్కవోని ధైర్యం ముందు పతకం చిన్నబోయిందని అన్నాడు. రామ్ బాబు ఆర్ధిక కష్టాలు తెలిసి అతన్ని ఆదుకుంటానని ప్రామిస్ చేశాడు. అతని కుటుంబానికి ట్రాక్టర్ లేదా పికప్ ట్రక్కును అందించి ఆదుకోవాలనుకుంటున్నానని ట్వీట్ చేశాడు. Follow the Sakshi TV channel on WhatsApp: -
Asian Games 2023: పతకాల శతకం
కోరినది నెరవేరింది. అనుకున్నట్టే... ఆశించినట్టే... ఆసియా క్రీడోత్సవాల్లో మన దేశం పతకాల శతకం పండించింది. చైనాలోని హాంగ్జౌలో జరిగిన 19వ ఏషియన్ గేమ్స్‌లో 655 మంది సభ్యుల భారత బృందం 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలతో మొత్తం 107 పతకాలు గెలిచింది. మునుపు 2018లో జకార్తా ఏషియన్ గేమ్స్‌లో సాధించిన 70 పతకాల రికార్డును తిరగరాసింది. ఆసియా క్రీడల పతకాల వేటలో మూడంకెల స్కోరుకు మన దేశం చేరడం ఇదే ప్రప్రథమం. శతాధిక పతకాల సాధనలో ఎప్పుడూ ముందు వరుసలో ఉండే చైనా, జపాన్, దక్షిణ కొరియాల సరసన అగ్ర శ్రేణి క్రీడాదేశంగా మనం కూడా స్థానం సంపాదించడం గర్వకారణం. ఈ క్రమంలో అతి సామాన్య స్థాయి నుంచొచ్చి అంతర్జాతీయ వేదికపై చెరగని ముద్ర వేసిన మనవాళ్ళ కథలు స్ఫూర్తిదాయకం. ఈ క్రీడోత్సవాల్లో 201 స్వర్ణాలతో సహా మొత్తం 383 పతకాలతో తిరుగులేని ప్రథమ స్థానంలో చైనా నిలిచింది. 188 మెడల్స్‌తో జపాన్, 190తో దక్షిణ కొరియా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. కరోనా వల్ల ఏడాది ఆలస్యంగా 2021లో జరిగిన టోక్యో–2020 వేసవి ఒలింపిక్స్ లోనూ చైనా, జపాన్‌లు ఇలాగే పతకాల సాధనలో రెండు, మూడు స్థానాల్లోనే ఉన్నాయి. ప్రపంచస్థాయి ఒలింపిక్స్‌లోనే అంతటి విజయాలు నమోదు చేసుకున్న ఆ దేశాలు ఇప్పుడు ఆసియా క్రీడోత్సవాల్లోనూ ఇలా ఆధిక్యం కనబరచడం ఆశ్చర్యమేమీ కాదు. అయితే, ఒలింపిక్స్ పతకాల ర్యాంకింగుల్లో ఆసియా దేశాల కన్నా వెనకాల ఎక్కడో 48వ ర్యాంకులో ఉన్న భారత్, తీరా ఏషియాడ్‌లో మాత్రం వాటన్నిటినీ వెనక్కి నెట్టి, నాలుగో ర్యాంకులోకి రావడం గణనీయమైన సాధన. మొత్తం 107 పతకాల్లో అత్యధిక పతకాలు (6 స్వర్ణాలతో సహా 29) మనకు అథ్లెటిక్స్‌లోనే వచ్చాయి. ఆపైన అత్యధికంగా షూటింగ్లో (22 మెడల్స్), ఆర్చరీలో (9), అలాగే బ్యాడ్మింటన్, రెజ్లింగ్, బాక్సింగ్, హాకీల్లో మనవాళ్ళు ప్రపంచ శ్రేణి ప్రతిభ కనబరిచారు. హాంగ్జౌలోని ఈ తాజా ఆసియా క్రీడోత్సవాల్లో మన దేశానికి మరో విశేషం ఉంది. ఈ క్రీడల పోరులో సాంప్రదాయికంగా తనకు బలమున్న హాకీ, రెజ్లింగ్, కబడ్డీ, షూటింగ్ లాంటి వాటిల్లోనే కాదు... అనేక ఇతర అంశాల్లో జమాజెట్టీలైన ఇతర దేశాల జట్లకు ఎదురొడ్డి భారత్ పతకాలు సాధించింది. పట్టున్న హాకీ, కబడ్డీ లాంటి క్రీడల్లో ప్రతిష్ఠ నిలబెట్టుకుంటూనే, ఆటల్లోని ఆసియా అగ్రరాజ్యాలను ఢీ కొని, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి ప్రపంచ శ్రేణి ఆటల్లోనూ పతకాలు గెలుచుకుంది. ఇది గమనార్హం. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఆదివారం ముగిసిన ఈ ఆసియా క్రీడా సంబరంలో మన ఆటగాళ్ళ విజయగీతిక భారత క్రీడారంగంలో అత్యంత కీలక ఘట్టం. కేవలం పతకాల గెలుపు లోనే కాక, క్రీడాజగతిలో మన వర్తమాన, భవిష్యత్ పయనానికీ ఇది స్పష్టమైన సూచిక. క్రీడాంగణంలోనూ మన దేశం వేగంగా దూసుకుపోతూ, రకరకాల ఆటల్లో విశ్వవిజేతల సరసన నిలవాలన్న ఆకాంక్షను బలంగా వ్యక్తం చేస్తున్న తీరుకు ఇది నిలువుటద్దం. 2018 నాటి ఏషియన్ గేమ్స్‌లో పతకాల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచిన భారత్ ఇవాళ నాలుగో స్థానానికి ఎగబాకిందంటే, దాని వెనుక ఎందరు క్రీడాకారుల కఠోరశ్రమ, దృఢసంకల్పం ఉందో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, క్రీడా ప్రాధికార సంస్థలు ఆటలకు అందించిన ప్రోత్సాహమూ మరువలేనిది. ఆతిథ్యదేశమైన చైనా వైఖరి అనేక అంశాల్లో విమర్శల పాలైంది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆటగాళ్ళకు తన వీసా విధానంతో అడ్డం కొట్టి, డ్రాగన్ తన దుర్బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. జావెలిన్ త్రో సహా కొన్ని అంశాల్లో చైనా అధికారిక రిఫరీలు భారత ఆటగాళ్ళ అవకాశాల్ని దెబ్బ తీసేలా విచిత్ర నిర్ణయాలు తీసుకోవడమూ వివాదాస్పదమైంది. తొండి ఆటతో బీజింగ్ తన కుత్సితాన్ని బయటపెట్టుకున్నా, స్థానిక ప్రేక్షకులు ఎకసెక్కాలాడుతున్నా భారత ఆటగాళ్ళ బృందం సహనంతో, పట్టుదలతో ఈ విజయాలను మూటగట్టుకు వచ్చింది. ఆ విషయం విస్మరించలేం. అందుకే కొన్ని అంశాల్లో అసంతృప్తి ఉన్నా, కొందరు క్రీడాతారలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఆటతీరులో నిలకడ చూపలేక పోయినా తాజా ఆసియా క్రీడోత్సవాల్లో భారత ప్రదర్శనను అభినందించి తీరాలి. వచ్చే ఏటి ప్యారిస్ ఒలింపిక్స్‌కు దీన్ని ఉత్ప్రేరకంగా చూడాలి. మునుపటితో పోలిస్తే, క్రీడాజగత్తులో మనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం సంతో షకర పరిణామం. అలాగని సాధించినదానితో సంతృప్తి పడిపోతేనే ఇబ్బంది. ఇప్పటికీ జనాభాలో, అనేక ఇతర రంగాల్లో మనతో పోలిస్తే దిగువనున్న దేశాల కన్నా ఆటల్లో మనం వెనుకబడి ఉన్నాం. అది మర్చిపోరాదు. ఆర్థిక, సామాజిక ఇబ్బందులతో పాటు క్రీడావ్యవస్థలోని సవాలక్ష రాజకీయాలు, పెత్తందారీ విధానాలు, క్రీడా సంఘాలను సొంత జాగీర్లుగా మార్చుకున్న నేతలు – గూండాలు మన ఆటకు నేటికీ అవరోధాలు. మహిళా రెజ్లర్లతో దీర్ఘకాలంగా అనుచితంగా వ్యవహరిస్తున్నట్టు అధికార పార్టీ ఎంపీపై అన్ని సాక్ష్యాలూ ఉన్నా ఏమీ చేయని స్వార్థ పాలకుల దేశం మనది. అలాంటి చీకాకులు, చిక్కులు లేకుంటే మన ఆటగాళ్ళు, మరీ ముఖ్యంగా ఇన్ని ఇబ్బందుల్లోనూ పతకాల పంట పండిస్తున్న పడతులు ఇంకెన్ని అద్భుతాలు చేస్తారో! ఏషియాడ్‌లో మనం గెల్చిన 28 స్వర్ణాల్లో 12 మాత్రమే ఒలింపిక్స్ క్రీడాంశాలనేది గుర్తు చేసుకుంటే చేయాల్సిన కృషి, సాధించాల్సిన పురోగతి అవగతమవుతుంది. మహారాష్ట్రలోని దుర్భిక్ష ప్రాంతంలోని రైతు కొడుకు, ముంబయ్‌లో కూరలమ్మే వాళ్ళ కూతురు లాంటి మన ఏషియాడ్ పతకాల వీరుల విజయగాథలెన్నో ఆ లక్ష్యం దిశగా మనకిప్పుడు ఆశాదీపాలు! -
భళా భారత్...
పతకాల్లో తొలిసారి ‘సెంచరీ’ దాటాలనే లక్ష్యంతో చైనా గడ్డపై అడుగుపెట్టిన భారత క్రీడా బృందం ఈ క్రమంలో ఆసియా క్రీడల చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఈ క్రీడలు ముగియడానికి మరో నాలుగు రోజులు ఉండగా... ఇప్పటికే భారత్ ఖాతాలో 81 పతకాలు చేరాయి. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో భారత్ అత్యధికంగా 70 పతకాలు సాధించింది. పోటీల 11వ రోజు భారత్ మూడు స్వర్ణాలు, ఐదు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి 12 పతకాలు సొంతం చేసుకుంది. మారథాన్ రేసుతో నేడు అథ్లెటిక్స్ ఈవెంట్స్‌కు తెరపడనున్న నేపథ్యంలో... ఆర్చరీ, క్రికెట్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, స్క్వా‹ష్, బ్రిడ్జ్, చెస్ క్రీడాంశాల్లో భారత్ ఎన్ని పతకాలు సాధిస్తుందో వేచి చూడాలి. హాంగ్జౌ: భారత అథ్లెటిక్స్ ‘పోస్టర్ బాయ్’ నీరజ్ చోప్రా ఆసియా క్రీడల్లో పసిడి పతకంతో మెరిశాడు. సహచరుడు కిశోర్ కుమార్ జేనా నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురుకావడంతో నీరజ్ చోప్రా నుంచి ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన బయటకు వచ్చింది. బుధవారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో స్వర్ణ, రజత పతకాలు భారత్ ఖాతాలోకి వెళ్లాయి. డిఫెండింగ్ చాంపియన్ నీరజ్ చోప్రా నాలుగో ప్రయత్నంలో జావెలిన్‌ను 88.88 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. కిశోర్ కుమార్ జేనా జావెలిన్‌ను తన మూడోప్రయత్నంలో 86.77 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానానికి వచ్చాడు. అయితే నీరజ్ చోప్రా తన నాలుగో ప్రయత్నంలో జావెలిన్‌ను 88.88 మీటర్ల దూరం విసిరి ఈ సీజన్లో తన అత్యుత్తమ త్రో నమోదు చేశాడు. అంతేకాకుండా స్వర్ణ పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. కిశోర్ నాలుగో ప్రయత్నంలో జావెలిన్‌ను 87.54 మీటర్ల దూరం విసిరి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందినా నీరజ్ దూరాన్ని దాటలేకపోయాడు. తర్వాతి రెండు ప్రయత్నాల్లో కిశోర్ ఫౌల్ చేసి పాల్గొన్న తొలి ఆసియా క్రీడల్లోనే రజత పతకం గెలిచి సంబరపడ్డాడు. మరోవైపు ఈ ప్రదర్శనతో నీరజ్ వరుసగా రెండు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు గెలిచిన రెండో జావెలిన్ త్రోయర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో పాకిస్తాన్‌కు చెందిన మొహమ్మద్ నవాజ్ (1951, 1954) ఈ ఘనత సాధించాడు. రజత పతకం నెగ్గిన ఒడిశా ప్లేయర్ కిశోర్ కుమార్‌కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రూ. ఒక కోటీ 50 లక్షలు నజరానా ప్రకటించారు. 61 ఏళ్ల తర్వాత రిలేలో స్వర్ణం పురుషుల 4్ఠ400 మీటర్ల రిలే ఈవెంట్లో మొహమ్మద్ అనస్, అమోజ్ జేకబ్, అజ్మల్, రాజేశ్ రమేశ్‌లతో కూడిన భారత బృందం స్వర్ణ పతకం గెలిచింది. భారత బృందం 3ని:01.58 సెకన్లలో అందరికంటే వేగంగా గమ్యానికి చేరి ఈ విభాగంలో 61 ఏళ్ల తర్వాత భారత్‌కు మళ్లీ పసిడి పతకాన్ని అందించింది. 1962 ఆసియా క్రీడల్లో మిల్కా సింగ్, మఖన్ సింగ్, దల్జీత్ సింగ్, జగదీశ్ సింగ్ బృందం చివరిసారి 4్ఠ400 మీటర్ల రిలేలో భారత్‌కు బంగారు పతకాన్ని అందించింది. మరోవైపు ఐశ్వర్య మిశ్రా, శుభ వెంకటేశ్, ప్రాచీ, విత్యా రామ్‌రాజ్‌లతో కూడిన భారత మహిళల జట్టు 4్ఠ400 మీటర్ల రిలేలో రజత పతకంతో (3ని:27.85 సెకన్లు) సరిపెట్టుకుంది. పురుషుల 5000 మీటర్ల విభాగంలో అవినాశ్ సాబ్లే (13ని:21.09 సెకన్లు) రజత పతకం గెలిచాడు. మహిళల 800 మీటర్ల ఫైనల్ రేసును భారత అథ్లెట్ హర్మిలన్ బైన్స్ 2ని:03.75 సెకన్లలో పూర్తి చేసి రజత పతకంకైవసం చేసుకుంది. 35 కిలోమీటర్ల నడక మిక్స్డ్ విభాగంలో మంజు రాణి, రాంబాబు జోడీ భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది. సురేఖ–ఓజస్ జోడీకి స్వర్ణం ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ–ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలే (భారత్) జోడీ స్వర్ణ పతకాన్ని సాధించింది. ఫైనల్లో జ్యోతి సురేఖ–ఓజస్ ప్రవీణ్ జంట 159–158తో సో చేవన్–జేహూన్ జూ (దక్షిణ కొరియా) ద్వయంపై గెలిచింది. అంతకుముందు సురేఖ–ఓజస్ సెమీఫైనల్లో 159–154తో కజకిస్తాన్ జోడీపై, క్వార్టర్ ఫైనల్లో 158–155తో మలేసియా జంటపై విజయం సాధించింది. మరోవైపు బ్రిడ్జ్ క్రీడాంశంలో పురుషుల టీమ్ విభాగంలో భారత జట్టు ఫైనల్‌కు చేరి కనీసం రజత పతకాన్ని ఖాయం చేసుకోగా... చెస్‌లో భారత పురుషుల, మహిళల జట్లు రెండో స్థానంలో కొనసాగుతూ పతకాల రేసులో ఉన్నాయి.