రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లాక్రీడాకారులు | playersto state level competition | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లాక్రీడాకారులు

Published Tue, Jan 17 2017 12:44 AM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM

రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లాక్రీడాకారులు

రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లాక్రీడాకారులు

నేటి నుంచి  ఖేలో ఇండియా పోటీలు
సిరిసిల్ల : జిల్లా క్రీడాకారులు ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో సోమ, మంగళవారాల్లో జరిగే రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా పోటీల్లో వారు పాల్గొంటారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్‌ పోటీల్లో క్రీడాకారులు వివిధ జిల్లాల జట్లతో పోటీ పడనున్నారు.వీరికి ఆదివారం స్పోర్ట్స్‌ డ్రెస్‌లను వ్యాయామ ఉపాధ్యాయులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు గొట్టె అంజయ్య, రాందాస్, మౌనిక, శిరీష, వీరస్వామి, టీఆర్‌ఎస్‌వీ నాయకులు గజ్జెల దేవరాజు  తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement