
న్యూఢిల్లీ: భారత యువ అథ్లెట్ గుల్వీర్ సింగ్ 5000 మీటర్ల ఇండోర్ రేసులో ఆసియా రికార్డు నెలకొల్పుతూ... ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌నకు అర్హత సాధించాడు. అమెరికా బోస్టన్‌లో జరిగిన ఇండోర్ ఈవెంట్‌లో గుల్వీర్ 12 నిమిషాల 59.77 సెకన్లలో లక్ష్యాన్ని చేరి నాలుగో స్థానంలో నిలిచాడు. తద్వారా 5000 మీటర్ల ఇండోర్ రేసును 13 నిమిషాల లోపు పూర్తిచేసిన తొలి భారతీయుడిగా రికార్డుల్లోకెక్కాడు.
ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన గుల్వీర్... ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ అర్హత మార్క్ (13 నిమిషాల 1 సెకన్)ను దాటాడు. ‘నా ప్రదర్శనతో ఆనందంగా ఉన్నా . ఓవరాల్‌గా టైమింగ్ మెరుగు పరుచుకోవడంపై దృష్టి పెడుతున్నా.
ఈ క్రమంలో ఇండోర్‌లో ఆసియా రికార్డు టైమింగ్ నమోదు చేయడం గర్వంగా ఉంది. నేరుగా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించడంతో సంతృప్తిగా ఉన్నా’ అని గుల్వీర్ పేర్కొన్నాడు. 5000 మీటర్ల ఔట్‌డోర్ రేసులోనూ జాతీయ రికార్డు (13 నిమిషాల 11.82 సెకన్లు) గుల్వీర్ సింగ్ పేరిటే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment