Indian athlete
-
5 వేల మీటర్లలో గుల్వీర్ సింగ్ కొత్త జాతీయ రికార్డు
యోగిబో అథ్లెటిక్స్ చాలెంజ్ కప్ టోర్నీలో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ 5000 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం నెగ్గడంతోపాటు కొత్త జాతీయ రికార్డును కూడా నెలకొల్పాడు. జపాన్ లో శనివారం జరిగిన ఈ రేసులో 26 ఏళ్ల గుల్వీర్ 5000 మీటర్ల దూరాన్ని 13 నిమిషాల 11.82 సెకన్లలో పూర్తి చేశాడు. తద్వారా 13 నిమిషాల 18.92 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును గుల్వీర్ బద్దలు కొట్టాడు. ఈ ఏడాది ఆరంభంలో పోర్ట్లాండ్ ట్రాక్ ఫెస్టివల్లో గుల్వీర్ ఈ సమయాన్ని నమోదు చేశాడు. -
World Para Championships: శభాష్ దీప్తి...
కోబే (జపాన్): ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్, తెలంగాణకు చెందిన దీప్తి జివాంజి పసిడి పతకంతో మెరిసింది. ప్రపంచ రికార్డుతో ఆమె స్వర్ణం సొంతం చేసుకోవడం విశేషం. సోమవారం జరిగిన మహిళల 400 మీటర్ల (టి20 కేటగిరీ) పరుగును దీప్తి 55.07 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది ఈ ఈవెంట్లో అమెరికాకు చెందిన బ్రియానా క్లార్క్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు (55.12 సెకన్లు)ను దీప్తి బద్దలు కొట్టింది. ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో 56.18 సెకన్లతో రేసును ముగించన 20 ఏళ్ల దీప్తి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఈ టోరీ్నలో ప్రస్తుతం భారత్ ఖాతాలో 4 పతకాలు ఉండగా, శనివారం వరకు పోటీలు జరుగుతాయి. పేదరికం నుంచి పైకెగసి... పారా అథ్లెటిక్స్‌లో టి20 కేటగిరీ అంటే ‘మేధోలోపం’ ఉన్న ప్లేయర్లు పాల్గొనే ఈవెంట్. ఆమె స్వస్థలం వరంగల్ జిల్లా కల్లెడ. తల్లిదండ్రులు యాదగిరి, ధనలక్ష్మి రోజూవారీ కూలీలు. ఒకవైపు పేదరికం ఉండగా, మరో వైపు దీప్తిని ‘బుద్ధిమాంద్యం’ ఉన్న అమ్మాయిగా ఊర్లో అందరూ హేళన చేసేవారు. ఇలాంటి సమయంలో భారత అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ ఆమెకు అన్ని విధాలా అండగా నిలిచారు. ఒక స్కూల్ మీట్లో దీప్తి రన్నింగ్ ప్రతిభ గురించి తన మిత్రుడి ద్వారా ఆయనకు తెలిసింది. దాంతో రమేశ్ ఆ అమ్మాయిని హైదరాబాద్‌కు రప్పించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) శిక్షణా కేంద్రంలో కోచింగ్ అందించే ఏర్పాట్లు చేశారు. మానసికంగా కొంత బలహీనంగా ఉండటంతో ఆమెకు శిక్షణ ఇవ్వడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చేది. భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా ‘మైత్రా ఫౌండేషన్’తో కలిసి ఆరి్థకంగా సహకారం అందించారు. తన ప్రతిభ కారణంగా కెరీర్ ఆరంభంలో ఆమె అందరూ పాల్గొనే సాధారణ అథ్లెటిక్స్ ఈవెంట్లలోనూ పోటీ పడి విజయాలు సాధించడం విశేషం. 2019 ఆసియా అండర్–18 చాంపియన్íÙప్లో కాంస్యం, 2021 సీనియర్ నేషనల్స్‌లో కాంస్యం సాధించిన దీప్తి 2022లో చివరిసారిగా రెగ్యులర్ పోటీల బరిలోకి దిగింది. రెండు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడం ద్వారా దీప్తికి ‘పారా క్రీడల’ లైసెన్స్ లభించింది. దాంతో పూర్తిగా పారా పోటీలపైనే ఆమె దృష్టి పెట్టింది. గత ఏడాది జరిగిన గ్వాంగ్జూ ఆసియా పారా క్రీడల్లో 400 మీటర్ల ఈవెంట్లోనే దీప్తి స్వర్ణం గెలుచుకుంది. ఆరి్థక సమస్యలతో ఒకదశలో తమ భూమిని అమ్ముకున్న తల్లిదండ్రులు దీప్తి ‘ఆసియా’ విజయం తర్వాత ప్రభుత్వం ఇచ్చిన రూ. 30 లక్షలతో మళ్లీ భూమి కొనుక్కోగలిగారు. ఇదే ప్రపంచ రికార్డు జోరులో మున్ముందు పారా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించగల సత్తా దీప్తిలో ఉంది. -
మన బంగారు కొండ
భారత క్రీడాభిమానులకు ఇది హృదయం ఉప్పొంగే క్షణం. అథ్లెటిక్స్‌లోనూ మన ఆటగాళ్ళు విశ్వ విజేతలుగా నిలుస్తున్న అపురూప సందర్భం. నిన్నటి దాకా ఒలింపిక్ ఛాంపియన్ మాత్రమే అయిన ఓ క్రీడా దిగ్గజం ఇవాళ ప్రపంచ ఛాంపియన్ కూడా అయిన అపూర్వ ఘట్టం. బుడాపెస్ట్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో పురుషుల జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించడం ద్వారా భారత అథ్లెట్ నీరజ్ చోప్రా ఆదివారం నాడు అక్షరాలా చరిత్ర సృష్టించారు. ప్రపంచ అథ్లెటిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. దేశం గర్వపడేలా చేశారు. ఆదివారం నాడు రెండో ప్రయత్నంలో గరిష్ఠంగా 88.17 మీటర్ల దూరం ఈటెను విసిరి, నీరజ్ సాధించిన ఈ స్వర్ణపతకం ఇక భారత క్రీడాచరిత్రలో సువర్ణాక్షర లిఖితం. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ఊరిలోని నీరజ్ ఇంట్లో ఆయన తండ్రి, బంధుమిత్రులు ఒక్కచోట కూడిన ఉత్కంఠగా చూసిన ఈ విజయఘట్టం వారికే కాదు... యావద్భారతావనికి కూడా ఉద్విగ్నభరితమైనది. ఆర్మీలో సుబేదార్ అయిన పాతికేళ్ళ నీరజ్ చోప్రా మాటల్లోనే చెప్పాలంటే, ఒలింపిక్స్ కన్నా వరల్డ్ ఛాంపియన్షిప్స్ కఠినమైనది. ఒలింపిక్స్ ప్రత్యేక మైనది అయితే, వరల్డ్ ఛాంపియన్ అనేది అతి పెద్ద కిరీటం. పోటీ పరంగా చూసినా, అథ్లెట్లు అవిశ్రాంత సాధన చేసి వచ్చే వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఎప్పుడూ కాస్తంత ఎక్కువ కఠినమే. అలాంటి వేదికపై స్వర్ణసాధనతో నీరజ్ ‘భారతదేశంలో ఆల్‌టైమ్ అతి గొప్ప అథ్లెట్’గా అవతరించారు. మొహమాటంగా ఆ పిలుపును పక్కనపెడుతూ, ఆయన వినయంగా వ్యవహరిస్తున్నప్పటికీ అది వాస్తవమే. అటు ఒలింపిక్స్ స్వర్ణం, ఇటు తాజా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ స్వర్ణం – రెండూ సాధించిన ఏకైక భారత అథ్లెట్ ఈ సైనికుడే. మధ్యతరగతి నుంచి వచ్చిన నీరజ్ ఈ స్థాయికి చేరడానికి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. మోచేతికి గాయం కావడంతో 2019లో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. అలా అప్పట్లో దోహాలో ప్రపంచ ఛాంపియన్షిప్స్కు హాజరు కాలేకపోయారు. తర్వాత రెట్టించిన ఉత్సాహంతో వచ్చి, 2020 జనవరిలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఆలస్యంగా ఆ మరుసటేడు జరిగిన ఆ ఒలింపిక్స్‌లో ఏకంగా స్వర్ణం సాధించారు. మన దిగ్గజ అథ్లెట్లైన మిల్ఖాసింగ్, పీటీ ఉషకు సైతం అందని ఆ స్వర్ణకీర్తిని అందుకున్నారు. అలా రెండేళ్ళ క్రితం 2021 ఆగస్ట్‌లో జరిగిన టోక్యో ఒలింపిక్స్– 2020లో స్వర్ణసాధన నాటి నుంచి అందరి దృష్టీ నీరజ్‌పై ఉంది. ఇప్పుడీ ప్రపంచ ఛాంపియన్ షిప్స్‌లోనూ బంగారు పతకం తెచ్చి, అథ్లెటిక్స్‌లో మన దేశానికి పతకాలు పండించే బంగారు కొండ అయ్యారు. సౌత్ ఏషియన్ గేమ్స్ (2016), ఏషియన్ ఛాంపియన్షిప్స్ (2017), కామన్వెల్త్ గేమ్స్ (2018), ఏషియన్ గేమ్స్ (2018), ఒలింపిక్స్ (2020), డైమండ్ లీగ్ (2022), ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్షిప్స్... ఇలా నీరజ్ సాధించిన స్వర్ణాలే అందుకు సాక్ష్యం. మొత్తం ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ చరిత్రలో భారత్‌కు ఇది మూడో పతకం. ఇంతకు మునుపు జరిగిన 18 ఛాంపియన్‌షిప్‌లలో మన దేశానికి వచ్చినవి రెండు పతకాలే. ఆ రెండింటిలో కూడా ఒకటి నిరుటి ఛాంపియన్‌షిప్స్‌లో నీరజ్ చోప్రా సాధించిన రజతమే. అంతకు ముందెప్పుడో 2003లో మహిళల లాంగ్‌జంప్‌లో అంజూ బాబీ జార్జ్ కాంస్యం గెలిచారు. అప్పుడలా విశ్వవేదికపై మొదలైన మన పతకాల లెక్క ఇప్పుడు మూడుకు చేరడం ఒక రకంగా ఆనందమే అయినా, మరోరకంగా ఇన్నేళ్ళకు గానీ ఆ స్థాయికి చేరకపోవడం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అంశం. ప్రపంచ స్థాయికి చేరేలా మన ఆటగాళ్ళను ప్రోత్సహించేందుకు మనం చేయవలసినంత చేస్తున్నామా అన్నది ఆలోచించాల్సిన విషయం. అయితే, ఒకప్పుడు అంతర్జాతీయ యవనికపై భారతీయ క్రీడ అంటే హాకీ. తర్వాత క్రికెట్, ఆ పైన చెస్, బ్యాడ్మింటన్, టెన్నిస్, రెజ్లింగ్ వగైరాల్లోనూ మన ప్రతిభకు తక్కువ లేదని నిరూపిత మవుతూ వచ్చింది. నిజానికి, జావెలిన్ త్రోలో సైతం ఒకప్పుడు విశ్వవేదికపై మనం ఎక్కడ ఉన్నామో కూడా ఎవరికీ తెలీదు. కానీ, ఇప్పుడు ఏకంగా ముందు వరుసలో నిలిచాం. అందులోనూ తాజా పోటీలో కిశోర్ జెనా, డీపీ మను అనే మరో ఇద్దరు భారతీయ జావెలిన్ త్రో వీరులు కూడా ఉండడం, వారిద్దరు 5వ, 6వ స్థానాల్లో నిలవడం... ఇవన్నీ మారుతున్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. భవిష్యత్తు పట్ల ఆశలు రేపుతున్నాయి. ఆ ఆశలు నెరవేరడానికి నీరజ్ అన్నట్టు మన దగ్గర కూడా కీలకమైన మోండో ట్రాక్స్ వగైరాలను అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ) సిద్ధం చేయడం అవసరం. చెక్ రిపబ్లిక్కు చెందిన దిగ్గజ అథ్లెట్ జెలెజ్నీ 98.48 మీటర్ల దూరం ఈటె విసిరి, ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు. మూడుసార్లు ఒలింపిక్స్‌లో, మరో 3 సార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకాలు గెలిచారు. అతనే తనకు స్ఫూర్తి అని చెప్పే నీరజ్ ఆ స్థాయికి చేరడానికి చేయాల్సిన శ్రమ, సాగించాల్సిన ప్రయాణం ఇంకా చాలానే ఉంది. ఆ ప్రయాణానికి మన ప్రభుత్వాలు, క్రీడా సంస్థలు అందించాల్సిన సహకారమూ అపారమే. నీరజ్ ఒలింపిక్స్ సాధన తర్వాత హరియాణాలోని పానిపట్ సహా అనేక గ్రామాల్లో పిల్లల్లో, ఇళ్ళల్లో క్రీడల పట్ల ఆసక్తి కొన్ని పదుల రెట్లు పెరిగింది. గుంపులుగా వచ్చి, ఆటలాడుతున్న ఆ భావి భారత ఆశాకిరణాలకు మైదానాలు, ఆస్పత్రుల లాంటి కనీస వసతులు కల్పించడం ప్రభుత్వ కర్తవ్యం. ఆ దిశగా కృషి చేస్తే, మరింత మంది నీరజ్‌లు ఈ గడ్డపై నుంచి వస్తారనడంలో సందేహం లేదు. -
World Athletics Championships: నీరజ్ స్వర్ణ చరిత్ర
నాలుగు దశాబ్దాల ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఏ భారతీయ అథ్లెట్‌కు సాధ్యంకాని ఘనతను జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సాధించాడు. ఈ మెగా ఈవెంట్ చివరిరోజు ఆదివారం నీరజ్ చోప్రా భారత అభిమానుల్లో పసిడి కాంతులు నింపాడు. అందరి అంచనాలను నిజం చేస్తూ నీరజ్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. తద్వారా ఈ ప్రతిష్టాత్మక చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా కొత్త చరిత్రను లిఖించాడు. బుడాపెస్ట్ (హంగేరి): భారతీయులు కూడా ఇక సగర్వంగా చెప్పవచ్చు... ప్రపంచ అథ్లెటిక్స్‌లో మాకు ఉన్నాడు ఒక ప్రపంచ చాంపియన్ అని... గత ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం నెగ్గిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈసారి పతకం రంగు మార్చాడు. ‘రజత’«దీరుడి నుంచి ‘పసిడి’వీరుడిగా మారాడు. ఆదివారం ముగిసిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సాధించాడు. నీరజ్ రెండో ప్రయత్నంలో విసిరిన జావెలిన్ అత్యధికంగా 88.17 మీటర్ల దూరం వెళ్లింది. మొత్తం ఆరు ప్రయత్నాల్లో ఈ దూరాన్ని మరో అథ్లెట్ అధిగమించలేకపోయాడు. ఫలితంగా నీరజ్‌కు బంగారు పతకం ఖరారైంది. పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ 87.82 మీటర్లతో రజత పతకం దక్కించుకోగా... జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్) 86.67 మీటర్లతో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. భారత్‌కే చెందిన కిశోర్ కుమార్ జేనా 84.77 మీటర్లతో ఐదో స్థానంలో, మనూ 84.14 మీటర్లతో ఆరో స్థానంలో నిలిచారు. ఫౌల్‌తో మొదలు... క్వాలిఫయింగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా ఫైనల్‌ను నిరాశాజనకంగా ప్రారంభించాడు. నీరజ్ తొలి ప్రయత్నమే ఫౌల్ అయింది. దాంతో భారత అభిమానులు కాస్త ఆందోళన చెందారు. కానీ నీరజ్ వెంటనే తేరుకున్నాడు. రెండో ప్రయత్నంలో నీరజ్ జావెలిన్‌ను ఏకంగా 88.17 మీటర్ల దూరం విసిరాడు. ఈ ప్రదర్శనతో నీరజ్ చివరిదైన 12వ స్థానం నుంచి అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. నిరీ్ణత ఆరు ప్రయత్నాల వరకు నీరజ్ అగ్రస్థానాన్ని కొనసాగించాడు. అన్నీ సాధించాడు... 2016లో ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచి వెలుగులోకి వచి్చన నీరజ్ ఈ ఏడేళ్ల కాలంలో ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగాడు. 2017 ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి పాల్గొని 15వ స్థానంలో నిలిచిన నీరజ్ ఆ తర్వాత రాటుదేలాడు. అదే ఏడాది భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలిచిన నీరజ్... 2018 ఆసియా క్రీడల్లో, 2018 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పసిడి పతకాలు సొంతం చేసుకున్నాడు. 2021లో టోక్యో ఒలింపిక్స్‌లో అందరి అంచనాలను తారుమారు చేస్తూ స్వర్ణ పతకం నెగ్గిన ఈ హరియాణా స్టార్ 2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం, 2022 ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో స్వర్ణంతో మరింత ఎత్తుకు ఎదిగాడు. అదే జోరును కొనసాగిస్తూ తాజా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకంతో యావత్ భారతాన్ని ఆనందడోలికల్లో ముంచాడు. తాజా స్వర్ణంతో నీరజ్ అథ్లెటిక్స్‌లోని అన్ని మేజర్ ఈవెంట్లలో పతకాలు నెగ్గిన జావెలిన్ త్రోయర్‌గా నిలిచాడు. భారత రిలే జట్టుకు ఐదో స్థానం ఆదివారమే జరిగిన పురుషుల 4్ఠ400 మీటర్ల రిలే ఫైనల్లో అనస్ యాహియా, అమోజ్ జేకబ్, అజ్మల్, రాజేశ్ రమేశ్‌లతో కూడిన భారత బృందం ఐదో స్థానాన్ని దక్కించుకుంది. భారత బృందం 2 నిమిషాల 59.92 సెకన్లలో గమ్యానికి చేరింది. మరోవైపు మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఫైనల్లో భారత అథ్లెట్ పారుల్ చౌధరీ 11వ స్థానంలో నిలిచింది. పారుల్ 9 నిమిషాల 15.31 సెకన్లలో గమ్యానికి చేరి కొత్త జాతీయ రికార్డు నెలకొలి్పంది. 3: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు లభించిన మొత్తం పతకాలు. 2003లో మహిళల లాంగ్‌జంప్‌లో అంజూ జార్జి కాంస్యం సాధించగా... 2022లో నీరజ్ రజతం, 2023లో నీరజ్ స్వర్ణం గెలిచాడు. 2: ఒలింపిక్స్‌తోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణ పతకాలు గెలిచిన రెండో భారతీయ క్రీడాకారుడు నీరజ్ చోప్రా. గతంలో షూటర్ అభినవ్ బింద్రా ఈ ఘనత సాధించాడు. అభినవ్ బింద్రా 2006 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పసిడి పతకాలు గెలిచాడు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
శైలీ సింగ్‌కు కాంస్య పతకం
సేకో గోల్డెన్ గ్రాండ్‌ప్రి అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో భారత యువ లాంగ్‌జంపర్ శైలీ సింగ్ కాంస్య పతకం సాధించింది. జపాన్‌లోని యోకోహామాలో ఆదివారం జరిగిన ఈ మీట్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల శైలీ 6.65 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ సీనియర్ స్థాయిలో శైలికిదే తొలి టోర్నీ. భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) హై పర్ఫార్మెన్స్ కోచ్ రాబర్ట్ బాబీ జార్జి వద్ద శిక్షణ తీసుకుంటున్న శైలీ 2021లో ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం దక్కించుకొని వెలుగులోకి వచ్చింది. హారిక గేమ్ ‘డ్రా’ నికోసియా (సైప్రస్): మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక నాలుగో ‘డ్రా’ నమోదు చేసింది. కాటరీనా లాగ్నో (రష్యా)తో ఆదివారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను హారిక 85 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ప్రస్తుతం హారిక నాలుగు పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉంది -
95 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్‌లో అద్భుతాలు
ఇండియాకు చెందిన భగవానీ దేవి డాగర్ 95 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్‌లో అద్భుతాలు చేస్తోంది. వయసు పెరుగుతున్నా..మెడల్స్ కొట్టాలన్న ఆమె ఆకాంక్ష మరింత ఎక్కువైంది. తాజాగా పోలాండ్లోని టొరున్లో జరిగిన తొమ్మిదో వరల్డ్ మాస్టర్ అథ్లెటిక్స్ ఇండోర్ చాంపియన్‌షిప్(World Master Athletics Indoor Championship)లో సత్తా చాటింది. 60 మీటర్ల రన్నింగ్, షాట్‌పుట్, డిస్క్‌త్రో ఈవెంట్స్‌లో భగవానీ దేవి డాగర్ స్వర్ణ పతకాలు సాధించింది.ఈ బామ్మ గతేడాది కూడా వరల్డ్ మాస్టర్ అథ్లెటిక్స్ ఇండోర్ చాంపియన్‌షిప్‌లో మెడల్స్ సాధించింది. 2022లో ఒక గోల్డ్, రెండు బ్రాంజ్ మెడల్స్ గెలుచుకుంది. హర్యానాలోని ఖేడ్కా గ్రామానికి చెందిన భగవానీ దేవి డాగర్‌కు 12 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. 30 ఏళ్ల వయసులో భర్తను కోల్పోయింది. ఆ తర్వాత రెండో వివాహం చేసుకోవడానికి ఆమె ఇష్టపడలేదు. అప్పటికే తన నాలుగేళ్ల కూతురు, కడుపులో పెరుగుతున్న మరో బిడ్డ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే నాలుగేళ్ల తర్వాత అనారోగ్యం తన ఎనిమిదేళ్ల కూతురిని బలి తీసుకుంది. అయితే తాను ధైర్యం కోల్పోకుండా కూలీ, వ్యవసాయ పనులు చేసి కొడుకును పెంచి పెద్ద చేసింది. ఆమె కొడుక్కి ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్లో క్లర్క్‌గా ప్రభుత్వం ఉద్యోగం రావడంతో ఆర్థిక పరిస్థితి మెరుగైంది. కొడుక్కి పెళ్లి చేసిన అనంతరం అథ్లెటిక్స్‌పై దృష్టి సారించింది. అక్కడి నుంచి తన ఫిట్నెస్ను కాపాడుకుంటూ వచ్చిన ఆమె 80 ఏళ్ల వయసులో తొలిసారి 100 మీటర్ల రన్నింగ్‌లో పాల్గొంది. అక్కడినుంచి ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ తాజాగా 95 ఏళ్ల వయసులో మూడు స్వర్ణ పతకాలు కొల్లగొట్టి ఔరా అనిపించింది. ఇక భగవానీ దేవి పెద్ద మనుమడు వికాస్ డాగర్ పారా అథ్లెట్‌గా రాణిస్తున్నాడు. ఇప్పటికే అథ్లెటిక్స్‌లో ఎన్నో పతకాలు సాధించిన వికాస్ డాగర్ ఖేల్‌రత్న అవార్డు గెలుచుకున్నాడు. India's 95-year-old Bhagwani Devi Dagar won 3 gold medals in the 9th World Master Athletics Indoor Championship 2023 at Toruń, Poland. She clinched the medals in 60-meter running, shotput and discus throw. pic.twitter.com/CaR6pj1PRW — ANI (@ANI) March 29, 2023 🙏🙏🙏🙏🙏 https://t.co/IUdldckOOc — ATHLETE BHAGWANI DEVI DAGAR (@BhagwaniDevi94) March 6, 2023 చదవండి: 70 కోట్ల విలువైన కారు.. కొన్నాడా లేక గిఫ్ట్‌గా వచ్చిందా? 'ఆడేది మెగాటోర్నీ.. అలా కుదరదు'; ప్లాన్ బెడిసికొట్టిందా? -
బీచ్‌లో పరిగెడితే ఆట పట్టించారు.. కట్‌చేస్తే 'పరుగుల రాణి'గా
దాదాపు నాలుగున్నర దశాబ్దాల కిందటి మాట.. పయ్యోలి బీచ్‌లో ఆ అమ్మాయి పరుగు తీస్తుంటే అంతా ఆశ్చర్యంగా చూసేవారు. ఆమె ఎటు వైపు వెళితే అటు వైపు వారు ఆమెను అనుసరించేవారు. కొందరు చిన్న పిల్లలయితే ఆట పట్టించేవారు కూడా. షార్ట్స్‌లో ఒకమ్మాయి పరుగెత్తడం అదో వింతగా అనిపించింది. అసలు ఆ సమయంలో ఎవరూ క్రీడలను సీరియస్‌గా పట్టించుకోనేలేదు. తర్వాతి రోజుల్లో ఆ అమ్మాయి భారత అథ్లెటిక్స్‌కు కొత్త దారి చూపించింది. ఎవరూ అందుకోలేని రీతిలో చిరస్మరణీయ ఘనతలు నమోదు చేసింది. దాదాపు ఇరవై ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో స్ప్రింటర్‌గా, హర్డ్‌లర్‌గా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టీనేజర్లు దూసుకొచ్చిన సమయంలోనూ 35 ఏళ్ల వయసులో కొత్త జాతీయ స్ప్రింట్ రికార్డును నెలకొల్పగలిగింది. అంటే ఆ ప్లేయర్ సత్తాను అర్థం చేసుకోవచ్చు. ఆ స్టార్ పేరే పిళవుళకంది తెక్కెరపరంబిల్ ఉష.. అందరికీ తెలిసిన పీటీ ఉష. పరుగెత్తుతూ కనిపించిన ప్రతి అమ్మాయికి ఒక దశలో సర్వనామంగా మారిపోయిన పేరు. అథ్లెటిక్స్‌లో ప్రతిభావంతులను గుర్తించడంలో కోచ్ మాధవన్ నంబియార్‌కు మంచి పేరుంది. ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసిన ఆయన వద్ద క్రమశిక్షణ కూడా అదే తరహాలో ఉండేది. అలాంటి వ్యక్తి ఒక అమ్మాయిలో అపార, సహజ ప్రతిభ ఉందని గుర్తించాడు. దానికి తన శిక్షణ, క్రమశిక్షణ తోడైతే అద్భుతాలు సాధించవచ్చని గ్రహించాడు. నిజంగా కూడా అదే జరిగింది. ఆయన ఎంపిక చేసిన పీటీ ఉష ఆయన అంచనాను వాస్తవంగా మార్చింది. నంబియార్–ఉషల కోచ్–ప్లేయర్ జోడీ సూపర్ సక్సెస్‌గా నిలిచింది. ఆ సమయంలో ఉష వయసు తొమ్మిదేళ్లు. పాఠశాలలో జరిగిన రన్నింగ్ రేస్‌లో తనకంటే మూడేళ్లు పెద్ద అయిన సహచర విద్యార్థులను అలవోకగా ఓడించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. రాబోయే కొన్నేళ్లలో ఈ అమ్మాయి దేశం గర్వించదగ్గ అథ్లెట్ అవుతుందన్న విషయం అప్పుడు ఎవరికీ తెలీదు. కానీ కొద్ది రోజుల తర్వాత కేరళ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ స్కూల్ మొదటి మ్యాచ్‌లో చేరిన ఉష రివ్వుమని దూసుకుపోయింది. కోళికోడ్ జిల్లా కూతలిలో పుట్టిన ఉష ఆ తర్వాత సమీపంలోనే పయ్యోలిలో స్థిర పడింది. అక్కడి నుంచే అగ్రస్థానానికి ఎదిగిన ఆమె ‘పయ్యోలి ఎక్స్‌ప్రెస్’ పేరుతో తన పేరుకు, ఊరి పేరుకు శాశ్వత కీర్తిని కల్పించుకుంది. అవార్డులు, రివార్డులు, డాక్టరేట్లు ఎన్ని అందుకున్నా ఏనాడూ వివాదంగా మారకుండా, దరిచేరనివ్వకుండా అందరికీ ఆత్మీయురాలిగా, స్ఫూర్తిగా నిలుస్తూనే ఆమె కెరీర్‌ను ముగించింది. అలా మొదలు.. రాష్ట్రస్థాయి విజయాల తర్వాత ఉష ఆట స్థాయి మరింత పెరిగింది. 14 ఏళ్ల వయసులో ఇంటర్ స్టేట్ జూనియర్ మీట్లో పాల్గొన్న ఉష 4 స్వర్ణ పతకాలు గెలుచుకొని అందరి దృష్టి తనపై పడేలా చేసింది. కేరళ కాలేజ్ మీట్లోనైతే ఏకంగా 14 పతకాలు ఆమె ఖాతాలో చేరాయంటే ఆధిపత్యం ఎలాంటిదో ఊహించవచ్చు. మరో ఏడాది తర్వాత జాతీయ క్రీడల్లో రెండు స్వర్ణాలతో ఉష మెరిసింది. ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఏ పోటీలు ఉన్నా సరే.. అది ఇంటర్ స్టేట్ మీట్ కానీ, ఓపెన్ నేషనల్ చాంపియన్‌షిప్ కానీ.. అథ్లెట్లు ఇక రెండో స్థానం కోసమే పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చేసిందంటే ఉష ఆధిపత్యం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఉష సన్నిహితులు, కోచ్‌లు ఎట్టకేలకు ఎదురు చూసిన క్షణం 1980లో వచ్చింది. మాస్కో ఒలింపిక్స్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో 16 ఏళ్ల ఉషకు చోటు దక్కింది. తద్వారా ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా ఆమె నిలిచింది. ఈ మెగా ఈవెంట్లో 100 మీటర్ల పరుగులో ఉష ఫైనల్స్‌కు చేరడంలో విఫలమైనా.. తొలి ఒలింపిక్స్‌లో తగినంత అనుభవాన్ని ఆమె దక్కించుకుంది. ఆసియా క్వీన్‌గా.. అంతర్జాతీయ వేదికపై ఉష గొప్పగా చెప్పుకోగలిగే తొలి విజయం 1983లో వచ్చింది. 19 ఏళ్ల వయసులో అమితోత్సాహంతో ఆసియా చాంపియన్‌షిప్ (కువైట్ సిటీ)లో పాల్గొన్న ఉష 400 మీటర్ల పరుగులో స్వర్ణపతకంతో మెరిసింది. అది మొదలు 1998 (ఫుకోకా) వరకు దాదాపు 15 ఏళ్ల పాటు ఆసియా చాంపియన్‌షిప్‌లో ఉష హవా కొనసాగింది. ఈ మధ్య కాలంలో ఆమె ఈ ఈవెంట్లో ఏకంగా 14 స్వర్ణ పతకాలు గెలుచుకోవడం విశేషం. దీంతో పాటు మరో 6 రజతాలు, 3 కాంస్యాలు కూడా సాధించడంలో ఉష సఫలమైంది. మొత్తం 23 పతకాలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఆమె నిలిచింది. ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో వరుసగా నాలుగు పర్యాయాలు ఉష పతకాలు గెలుచుకోవడంలో సఫలమైంది. కెరీర్ ఆరంభ దశలో 1982 ఢిల్లీ ఆసియా క్రీడల్లో 100 మీ., 200 మీ. పరుగులో రెండు రజత పతకాలు సాధించి ఉష ఆసియా వేదికపై మొదటి సారి తన ముద్రను చూపించింది. 1990 బీజింగ్ ఆసియా క్రీడల్లో మూడు రజతాలు గెలుచుకున్న ఉష.. కెరీర్ చివర్లో 1994 హిరోషిమా ఏషియాడ్‌లో కూడా మరో రజతాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే వీటన్నింటినీ మించి ఉష పేరును భారత్‌లో ఇంటింటికీ చేర్చిన ఘనత, అథ్లెటిక్స్‌లో అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచిన ఘట్టం 1986 సియోల్ ఆసియా క్రీడలే. ఈ పోటీల్లో ఉష ఏకంగా నాలుగు స్వర్ణ పతకాలు సాధించి సంచలనం సృష్టించింది. 200 మీ., 400 మీ. పరుగుతో పాటు 400 మీ. హర్డిల్స్, 4X400 మీ. రిలేలో ఆమె పరుగు పసిడి కాంతులు అందించింది. 100 మీటర్ల పరుగులో త్రుటిలో స్వర్ణం చేజారగా వచ్చిన రజతంతో ఐదో పతకం ఉష మెడలో వాలింది. ముగింపు ప్రస్థానం.. లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ ప్రదర్శనను మరో నాలుగేళ్ల తర్వాత 1988 సియోల్ ఒలింపిక్స్‌లో ఉష పునరావృతం చేయలేకపోయింది. ఆ తర్వాత వరుస గాయాలు ఇబ్బంది పెట్టడంతో 1990లోనే ఆమె రిటైర్మెంట్ ప్రకటించింది. అయితే కబడ్డీ మాజీ ఆటగాడైన భర్త శ్రీనివాసన్ ప్రోత్సాహంతో మళ్లీ ప్రాక్టీస్ చేసి ట్రాక్‌పై అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్స్‌లో పతకాలతో తనేంటో చూపించింది. చివరకు 2000 సిడ్నీ ఒలింపిక్స్‌కు కొద్ది రోజుల ముందు ఆటకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పింది. ఒలింపిక్స్ పతకం మినహా తాను అన్నీ సాధించానని, వాటితో సంతృప్తి చెందానని ఉష వెల్లడించింది. సెకన్ లో 1/100 వంతు తేడాతో.. ఉష కెరీర్లో ఎప్పటికీ మరచిపోలేని క్షణం 1984 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో వచ్చింది. సరిగ్గా చెప్పాలంటే ఒక వైపు ఆనందం, మరో వైపు బాధ కలగలిసిన సమయం అది. ఆ సమయంలో ఉష అత్యుత్తమ ఫామ్‌లో, అద్భుతమైన ఫిట్నెస్తో ఉంది. ఒలింపిక్స్‌లో ఆమెకు పతకం ఖాయం అనిపించింది. 400 మీటర్ల హర్డిల్స్‌లో 55.42 సెకన్లతో ఆమె భారత్ తరఫున అత్యుత్తమ టైమింగ్ నమోదు చేసింది. అయితే సెకనులో వందో వంతు తేడాతో కాంస్యపతకం చేజారింది. ఫాల్స్ స్టార్ట్ చేసినా దానిని అధిగమించి చివరి 100 మీటర్ల పరుగును స్ప్రింట్ తరహాలో పరుగెత్తినా, ఫినిష్ లైన్ వద్ద తన ఛాతీ భాగాన్ని ముందుకు వంచడంలో విఫలం కావడంతో ‘ఫోటో ఫినిష్’లో నాలుగో స్థానమే దక్కింది. ‘అది నా అత్యుత్తమ ప్రదర్శన. అతి స్వల్ప తేడాతో నేను ఒలింపిక్స్ పతకం కోల్పోయానంటే నమ్మలేకపోతున్నాను. ఆ రేస్ తర్వాత చాలా ఏడ్చేశాను’ అని ఉష తర్వాత చెప్పుకుంది. చెరగని రికార్డు 1985లో జకార్తాలో జరిగిన ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్‌షిప్‌లో ఉష ఏకంగా ఐదు స్వర్ణాలు (100మీ., 200మీ., 400మీ., 400మీ.హర్డిల్స్, 4X400మీ. రిలే) గెలుచుకుంది. ఒకే ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో అత్యధిక స్వర్ణాలు గెలిచిన మహిళగా ఉష రికార్డు నమోదు చేసింది. అది ఇప్పటికీ ప్రపంచ రికార్డుగానే ఉండటం విశేషం. - మహమ్మద్ అబ్దుల్ హాది -
డోపింగ్‌లో పట్టుబడిన ద్యుతీచంద్.. తాత్కాలిక నిషేధం
భారత టాప్ అథ్లెట్ క్రీడాకారిణి ద్యుతీచంద్ డోపింగ్ టెస్టులో పట్టుబడింది. ద్యుతీకి నిర్వహించిన శాంపిల్- ఏ టెస్టు రిజల్ట్ పాజిటివ్‌గా వచ్చింది. నిషేధిత సార్స్(SARS) ఉత్ప్రేరకం వాడినట్లు తేలడంతో వరల్డ్ యాంటీ డోపింగ్ ఎజెన్సీ(WADA) ఆమెను తాత్కాలికంగా బ్యాన్ చేస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ''ద్యుతీ శరీరంలో సార్స్ ఎస్-4 Andarine, ఓ డెఫినిలాండ్రైన్, సార్మ్స్ (ఎన్బోర్సమ్), మెటాబోలైట్ లాంటి నిషేధిత పదార్థాలు కనిపించాయి. ఇవి ఆమె శరీరానికి తగినంత శక్తి సామర్థ్యాలు ఇస్తూ పురుష హార్మోన్ లక్షణాలను ఉత్పత్తి చేయడంలో తోడ్పడుతాయి. ఇది నిషేధిత ఉత్ప్రేరకం. ప్రస్తుతం ద్యుతీ అబ్జర్వేజన్‌లో ఉందని.. శాంపిల్-బి టెస్టు పరిశీలించాకా ఒక నిర్ణయం తీసుకుంటాం'' అని వాడా తెలిపింది. ఇక గతేడాది సెప్టెంబర్-అక్టోబర్‌లో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ద్యుతీచంద్ 200 మీటర్ల ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఇక 100 మీటర్ల ఫైనల్స్‌లో ఆరో స్థానంలో సరిపెట్టుకుంది. అంతకముందు 2018లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో 100, 200 మీటర్ల విభాగాల్లో రజత పతకాలు సొంతం చేసుకుంది. ఇక 2013, 2017, 2019 ఏషియన్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాలు సాధించింది. ఇక 2019లో యునివర్సైడ్ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల విభాగంలో స్వర్ణం సాధించిన తొలి మహిళా స్ప్రింటర్‌గా రికార్డులకెక్కింది. Dutee Chand has been temporarily suspended following a positive analytical finding by WADA. The sample B test and hearing have not yet been released. pic.twitter.com/de0Blbsdnm — Doordarshan Sports (@ddsportschannel) January 18, 2023 చదవండి: Australian Open: బిగ్‌షాక్.. రఫేల్ నాదల్ ఓటమి -
గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న ద్యుతీచంద్!
భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ ద్యుతీచంద్ తన గర్ల్‌ఫ్రెండ్ మోనాలీసాను పెళ్లి చేసుకున్నట్లు వార్తలు రావడం ఆసక్తి కలిగించింది. గతంలోనే ద్యుతీచంద్ తనను తాను గే(GAY)గా ప్రకటించుకుంది. భారత్ నుంచి స్వలింగ సంపర్కాలిగా ప్రకటించుకున్న తొలి భారత అథ్లెట్‌గా ద్యుతీచంద్ నిలిచింది. గర్ల్‌ఫ్రెండ్ మోనాలీసాతో లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నట్లు 2019లో తెలిపింది. తాజాగా డిసెంబర్ 4న(శుక్రవారం) తన గర్ల్‌ఫ్రెండ్ మోనాలిసాతో కలిసి దిగిన ఫోటోలను ద్యుతిచంద్ తన ట్విటర్లో షేర్ చేసుకుంది. ‘నిన్ను ప్రేమించా. ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నా. ఈ ప్రేమ ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది’ అని ట్యాగ్ లైన్ ఇచ్చింది. అయితే వీరిద్దరు పెళ్లి చేసుకున్నారన్న వార్తల్లో నిజం లేదు. ద్యుతీచంద్ తన సోదరి పెళ్లి వేడుకలో గర్ల్‌ఫ్రెండ్ మోనాలీసాతో ఈ ఫోటో దిగినట్లు తెలుస్తోంది. తాను ‘గే’ అని 2019లో వెల్లడించిన ద్యుతీచంద్ స్వలింగ సంపర్కులకు మద్దతుగా ఇటీవలే కామన్వెల్త్ క్రీడల్లో ఎల్జీబీటీక్యూ జెండాతో నడుస్తూ కనిపించింది. తాను స్వలింగ సంపర్కురాలిని అని వెల్లడించినప్పుడు తన కుటుంబం ఒప్పుకోలేదని ద్యుతీ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ ప్రకటన తర్వాత కుటుంబం నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నానని వెల్లడించింది. ‘ఎల్జీబీటీక్యూ అథ్లెట్లు సురక్షితంగా, సుఖంగా ఉండాలి. హింస లేదా మరణం భయం లేకుండా వాళ్లు సాధారణ వ్యక్తులుగా ఉండాలి’ పేర్కొంది. “Loved you yesterday, love you still, always have, always will.” pic.twitter.com/1q3HRlEAmG — Dutee Chand (@DuteeChand) December 2, 2022 చదవండి: ఎలిమినేటర్ మ్యాచ్.. గల్లీ క్రికెట్‌లా ఈ ఆటలేంటి! -
డైమండ్ లీగ్ అథ్లెటిక్స్.. శ్రీశంకర్‌కు ఆరో స్థానం
మొనాకో: భారత లాంగ్‌జంపర్, కామన్వెల్త్ గేమ్స్ రజత పతక విజేత మురళీ శ్రీశంకర్‌కు ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ కలిసి రాలేదు. బర్మింగ్‌హామ్ మెగా ఈవెంట్ ముగియగానే తన తొలి డైమండ్ లీగ్‌లో పోటీ పడేందుకు మొనాకో వెళ్లిన అతనికి నిరాశే ఎదురైంది. అక్కడి వాతావరణం, గాలి వేగం అతని ప్రదర్శనకు ప్రతికూలంగా మారింది. 23 ఏళ్ల మురళీ తన ఐదు ప్రయత్నాల్లో మెరుగైన ప్రదర్శనగా 7.94 మీటర్ల దూరం దూకాడు. ఈ సీజన్లో 8.36 మీ. ప్రదర్శనతో పోలిస్తే ఇది పేలవమైన జంప్. కామన్వెల్త్ గేమ్స్‌లో అతను 8.08 మీ. జంప్ చేసి రజతం నెగ్గాడు. కానీ డైమండ్ లీగ్‌లో మాత్రం 8 మీటర్ల దూరమైన దూకలేకపోవడంతో ఆరో స్థానంలో నిలిచాడు. డైమండ్ లీగ్ నిబంధనల ప్రకారం ఇక్కడ పోటీలో ఉన్నవారందరికీ ఆరు ప్రయత్నాలు ఉండవు. కేవలం టాప్–3 అథ్లెట్లకు మాత్రమే ఆరో జంప్‌కు అవకాశమిస్తారు. మిగతావారంతా ఐదు జంప్లకే పరిమితం అవుతారు. 23 ఏళ్ల శ్రీశంకర్ ఇప్పుడు రాబోయే మరో ఈవెంట్‌పై ఆశలు పెట్టుకున్నాడు. ఈ నెల 30 నుంచి స్విట్జర్లాండ్‌లోని లూసానేలో వరల్డ్ అథ్లెటిక్స్ టూర్ పోటీల్లో అతను పోటీ పడతాడు. చదవండి: Canadian Open: తొలి రౌండ్లోనే సెరెనా అవుట్ -
వారం కిత్రం పేరు లేదు.. కుక్కలతో హై జంప్ ప్రాక్టీస్
తేజస్విన్ శంకర్.. వారం క్రితం కామన్వెల్త్ గేమ్స్‌కు ఎంపికయిన భారత బృందంలో పేరు లేదు. హై జంప్ విభాగంలో క్వాలిఫై స్టాండర్డ్స్ అందుకోలేదన్న కారణంగా చూపి భారత్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ అధికారులు అతన్ని ఎంపిక చేయలేదు. దీంతో కోర్టు మెట్లు ఎక్కి విజయం సాధించిన తేజస్విన్ శంకర్ ఆఖరి నిమిషంలో కామన్వెల్త్ గేమ్స్‌కు వెళ్లనున్న భారత బృందంలో బెర్త్ దక్కించకున్నాడు. తనను ఎంపిక చేయలేదన్న కోపమో లేక బాధో తెలియదు కానీ.. ఇవాళ 30వేల మంది ప్రేక్షకుల సమక్షంలో హై జంప్ విభాగంలో కాంస్య పతకం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. తన రికార్డును బ్రేక్ చేయలేదన్న బాధ ఉన్నప్పటికి కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ తరపున హై జంప్ విభాగంలో పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా తేజస్విన్ శంకర్ చరిత్ర సృష్టించాడు. మరి బర్మింగ్హమ్లో కాంస్యం సాధించిన తేజస్విన్ శంకర్ హై జంప్ ప్రాక్టీస్ ఎలా చేశాడో తెలిస్తే షాకవుతారు. తాను రోజు ప్రాక్టీస్ చేసే జేఎల్ఎన్ గ్రౌండ్లో మూడు కుక్కలు ఉండేవి. వాటిని మచ్చిక చేసుకున్న శంకర్ హై జంప్ ప్రాక్టీస్ చేసేవాడు. రోజు వాటికి ఆహారం అందిస్తూ స్టిక్స్ ఏర్పాటు చేసి వాటి వెనకాల పరిగెత్తుతూ హై జంప్ చేసేవాడు. అలా హైజంప్‌లో మరింత రాటు దేలే ప్రయత్నం చేశాడు. అయితే భారత్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ అతనికి షాక్ ఇచ్చింది. అయితే కోర్టు మెట్లు ఎక్కడం ద్వారా విజయం సాధించిన తేజస్విన్ శంకర్ కామెన్వెల్త్ గేమ్స్‌లో అడుగుపెట్టాడు. వాస్తవానికి అథ్లెట్ల సంఖ్య కోటా ఎక్కువగా ఉన్నందున శంకర్ పేరును పరిగణలోకి తీసుకోలేదని తర్వాత తేలింది. కట్‌చేస్తే.. కామన్వెల్త్ గేమ్స్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. బుధవారం హైజంప్ విభాగంలో జరిగిన ఫైనల్లో తేజస్విన్ శంకర్ 2.22 మీటర్ల ఎత్తు దూకి కాంస్యం ఒడిసిపట్టాడు. అయితే జూన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో శంకర్ 2.27 మీటర్ల దూరం జంప్ చేయడం గమనార్హం. శంకర్ గత రికార్డుతో పోల్చితే కామన్వెల్త్లో కొంత నిరాశ పరిచినా ఇది కూడా గొప్ప ఘనత కిందే లెక్కించొచ్చు. ఇక ఈ విభాగంలో న్యూజిలాండ్‌కు చెందిన హమీష్ కెర్ 2.25 మీటర్ల జంప్‌చేసి మొదటి స్థానంలో నిలిచి స్వర్ణం సాధించగా, ఆస్ట్రేలియాకు చెందిన బ్రండన్ స్టార్క్ సిల్వర్ సాధించాడు. A week back Tejaswin Shankar was practising in front of 3 dogs at JLN Stadium, after not being named to the CWG squad despite meeting the AFI QF standard. Included at the last minute after taking the fed to court, today in front of 30000, he wins a high jump bronze in Birmingham. pic.twitter.com/1YDiEsvjE3 — jonathan selvaraj (@jon_selvaraj) August 3, 2022 ☑️First-ever high jump medal for India at CWG ☑️First track and field medal for India in this CWG edition Tejaswin Shankar🙌🏻#CommonwealthGames2022 pic.twitter.com/la6a6APpD5 — The Bridge (@the_bridge_in) August 3, 2022 చదవండి: CWG 2022: హైజంప్‌లో భారత్‌కు కాంస్యం.. తొలి అథ్లెట్‌గా రికార్డు CWG 2022: వైరల్‌గా మారిన నిఖత్ జరీన్ చర్య.. ఏం జరిగింది? -
అంజుమ్ మౌద్గిల్‌కి కాంస్య పతకం
కొరియాలో జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో అంజుమ్ మౌద్గిల్ కాంస్య పతకం నెగ్గగా... పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ విభాగంలో చెయిన్ సింగ్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్, సంజీవ్ రాజ్‌పుత్‌లతో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది. ఫైనల్లో అంజుమ్ 402.9 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. పురుషుల టీమ్ ఫైనల్లో భారత్ 12–16తో చెక్ రిపబ్లిక్ జట్టు చేతిలో ఓడిపోయింది. చదవండి: Zouhaier Sghaier wrestling: భారత రెజ్లర్ల పసిడి పట్టు -
వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లోభారత లాంగ్ జంపర్‌కు నిరాశ
Sreeshankar: అమెరికాలోని యుజీన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో సంచలన ప్రదర్శనతో అందరి మన్ననలు అందుకున్న భారత లాంగ్ జంప్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో అతను కేవలం 7.96 మీటర్లు మాత్రమే జంప్ చేసి ఉసూరుమనిపించాడు. ఫలితంగా ఏడో స్థానంతో సరిపెట్టుకుని పతకం లేకుండానే టోర్నీ నుంచి వైదొలిగాడు. శ్రీశంకర్ ప్రస్తుత ప్రదర్శన ఈ ఏడాది ఫెడరేషన్ కప్ ప్రదర్శనతో (8.36 మీటర్లు) పోలిస్తే చాలా తక్కువ. మరోవైపు పురుషుల 400 మీటర్ల హర్డిల్స్ హీట్స్‌లో భారత ఆటగాడు ఎం.పి. జబిర్ 50.76 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ఏడో స్థానంలో నిలిచాడు. ఫలితంగా అతను ఫైనల్‌కు కూడా చేరుకుండానే నిష్క్రమించాడు. చదవండి: World Athletics Championships: ఫైనల్‌కు చేరిన శ్రీశంకర్.. తొలి భారతీయుడిగా రికార్డు! -
'ఆమె'నే పెళ్లి చేసుకుంటా.. మహిళా అథ్లెట్ సంచలన వ్యాఖ్యలు
భారత స్టార్ మహిళా స్ప్రింటర్ ద్యుతీచంద్ సంచలన విషయాలు వెల్లడించింది. ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. పెళ్లికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రిలేషన్షిప్లో ఉన్న తన భాగస్వామిని (మహిళ) 2024 పారిస్ ఒలింపిక్స్ తర్వాత పెళ్లి చేసుకుంటానని వివాదాస్పద ప్రకటన చేసింది. తన శారీరక తత్వం కారణంగా సమాజంలో దారుణమైన వివక్షను ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా వాపోయింది. తన లాంటి వాళ్లు ట్రాక్‌తో పాటు సమాజంతో కూడా పోరాడాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. భారత్‌లో సేమ్ సెక్స్ మ్యారేజ్ చట్ట వ్యతిరేకమన్న ప్రశ్నపై సమాధానం దాటవేసింది. కాగా, మరో మహిళతో (మోనాలిసా) సహజీవనం చేస్తున్న విషయాన్ని ద్యుతీ గతంలోనే ప్రకటించింది. ద్యుతీ శరీరంలో మగవాళ్లకు ఉండాల్సిన టెస్టోస్టిరాన్ లక్షణాలు అధికంగా ఉన్నాయన్న కారణంగా ఆమెపై 2014 కామన్వెల్త్ క్రీడల్లో అనర్హత వేటు పడింది. ఐదేళ్ల న్యాయపోరాటం అనంతరం ఈనెల (జులై) 28 నుంచి బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనేందుకు ఆమెకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మెగా ఈవెంట్లో ద్యుతీ 200 మీటర్ల రేసులో బరిలోకి దిగనుంది. చదవండి: భారత్ గురి కుదిరింది.. ప్రపంచకప్ షూటింగ్లో రెండో పతకం ఖాయం -
World Masters Athletics: 94 ఏళ్ల వయసులో స్వర్ణం సాధించిన భారత అథ్లెట్
ఫిన్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్-2022లో భారత అథ్లెట్ భగవానీ దేవీ సంచలనం సృష్టించింది. 94 ఏళ్ల వయసులో 100 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం సాధించి ఔరా అనిపించింది. 35 ఏళ్లు పైబడిన వారు పోటీ పడిన ఈ రేసును భగవానీ దేవీ 24.74 సెకన్లలో పూర్తి చేసి బంగారు పతకం సాధించింది. India's 94-year-old #BhagwaniDevi Ji has yet again proved that age is no bar! She won a GOLD medal at the #WorldMastersAthleticsChampionships in Tampere in the 100m sprint event with a timing of 24.74 seconds.🥇She also bagged a BRONZE in Shot put. Truly commendable effort!👏 pic.twitter.com/Qa1tI4a8zS — Dept of Sports MYAS (@IndiaSports) July 11, 2022 లేటు వయసులో సాధించిన ఘనతకు గాను భగవానీ దేవీకి విశ్వం నలుమూలల నుంచి నీరాజనాలు అందుతున్నాయి. ఏదైనా సాధించేందుకు వయసుతో సంబంధం లేదని భగవానీ దేవీ మరోసారి నిరూపించిందని అభినందనలు అందుతున్నాయి. భగవానీ దేవీ సాధించిన ఘనతను కొనియాడుతూ భారత క్రీడా మంత్రిత్వ శాఖ ట్విట్ చేసింది. నెటిజన్లు భగవానీ దేవీని ఆకాశానికెత్తుతున్నారు. సోషల్‌మీడియాలో భగవానీ దేవీ పేరు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. చదవండి: ప్రపంచకప్ బరిలో నుంచి టీమిండియా ఔట్ -
Commonwealth Games: భారత హైజంపర్ తేజస్విన్ శంకర్‌కు షాక్!
న్యూఢిల్లీ: కోర్టు ఉత్తర్వులతో కామన్వెల్త్ క్రీడలకు వెళ్లేందుకు సిద్ధమైన భారత హైజంపర్ తేజస్విన్ శంకర్‌కు చివరకు నిరాశే ఎదురైంది. భారత్‌నుంచి అతని ఎంట్రీని తిరస్కరిస్తున్నట్లు కామన్వెల్త్ నిర్వాహకులు ప్రకటించారు. నిబంధనల ప్రకారం తేజస్విన్ ఎంట్రీ ఆలస్యం కావడమే అందుకు కారణం. అర్హత మార్క్ సాధించినా... భారత్‌లో జరిగిన జాతీయ అథ్లెటిక్స్‌లో పాల్గొనలేదనే కారణంతో తేజస్విన్ పేరుకు భారత అథ్లెటిక్స్ సమాఖ్య పంపలేదు. అయితే తేజస్విన్ కోర్టుకెక్కడంతో 400 మీటర్ల రన్నర్ అయిన అరోకియా రాజీవ్ స్థానంలో తేజస్విన్‌ను ఎంపిక చేశారు. అయితే సీడబ్ల్యూజీ నిబంధనల ప్రకారం ఒకరికి బదులుగా మరొకరిని ఎంపిక చేస్తే అదే ఈవెంట్‌కు చెందిన ఆటగాడు అయి ఉండాలి. రన్నర్‌కు బదులుగా హైజంపర్ను అనుమతించేది లేదని నిర్వాహకులు భారత ఒలింపిక్ సంఘానికి సమాచారమందించారు. చదవండి: IND vs ENG 1st T20: హార్దిక్ ఆల్‌రౌండ్ షో.. టీమిండియా ఘన విజయం -
మసాజ్ చేయమని బెదిరించేవారు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన మహిళా అథ్లెట్
భువనేశ్వర్‌లోని (ఒడిశా) స్పోర్ట్స్ హాస్టల్లో సీనియర్ల వేధింపులు తాళలేక డిగ్రీ విద్యార్ధిని రుచిక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై భారత స్టార్ మహిళా స్ప్రింటర్, ఒలింపిక్ అథ్లెట్, స్పోర్ట్స్ హాస్టల్ మాజీ విద్యార్ధిని ద్యుతీ చంద్ స్పందించింది. స్పోర్ట్స్ హాస్టల్లో తాను ర్యాగింగ్ బాధితురాలినే సంచలన విషయాలను వెల్లడించింది. సీనియర్లు ర్యాగింగ్ పేరుతో తనతో అసభ్యంగా ప్రవర్తించేవారని, బాడీ మసాజ్ చేయమని బెదిరించేవారని ఆరోపించింది. వారు చెప్పిన విధంగా చేయకపోతే టార్చర్ పెట్టేవారని వాపోయింది. రుచిక లాగే తాను కూడా హాస్టల్లో దుర్భర అనుభవాలను ఎదుర్కొన్నానని తెలిపింది. స్పోర్ట్స్ హాస్టల్లో గడిపిన రెండేళ్లు నిద్రలేని రాత్రులు గడిపానని, తన బాధను హాస్టల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేకపోయేదని, సీనియర్లపై కంప్లైంట్ చేసినందుకు అధికారులు తననే రివర్స్‌లో తిట్టేవాళ్లని గత అనుభవాలను గుర్తు చేసుకుంది. హాస్టల్ అధికారులు తన పేదరికాన్ని చూసి హేళన చేసే వారని, తనతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా అవమానించేవారని సోషల్‌మీడియా వేదికగా తన అనుభవాలను పంచుకుంది. క్రీడాకారులు ఇలాంటి ఘటనల వల్ల చాలా డిస్టర్బ్ అవుతారని, తాను కూడా హాస్టల్లో గడిపిన రోజుల్లో మానసికంగా కృంగిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, రుచిక ఆత్మహత్య చేసుకున్న హాస్టల్లోనే ద్యుతీ 2006 నుంచి 2008 వరకు గడిపింది. చదవండి: గీతిక, అల్ఫియా ‘పసిడి’ పంచ్ -
3000 మీ. స్టీపుల్‌చేజ్‌లో పారుల్ జాతీయ రికార్డు
భారత అథ్లెట్ పారుల్ చౌదరీ 3వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో కొత్త జాతీయ రికార్డు సృష్టించింది. లాస్‌ఏంజెలిస్‌లో జరిగిన సౌండ్ రన్నింగ్ మీట్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 27 ఏళ్ల పారుల్ ఈ ఘనత సాధించింది. పారుల్ 3వేల మీటర్లను 8ని:57.19 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో తమిళనాడు అథ్లెట్ సురియా (9ని: 04.5 సెకన్లు; 2016లో) సాధించిన జాతీయ రికార్డును పారుల్ బద్దలు కొట్టింది. ఈనెలలో అమెరికాలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆమె బరిలోకి దిగనుంది. -
‘అడ్డంకులు’ దాటిన ఆట
సైప్రస్, నెదర్లాండ్స్, బెల్జియం... మూడు వేర్వేరు దేశాల వేదికలు... మూడు చోట్లా జాతీయ రికార్డులు... 16 రోజుల వ్యవధిలో 100 మీటర్ల హర్డిల్స్‌లో భారత అథ్లెట్ జ్యోతి యర్రాజి సాధించిన ఘనత ఇది. దాదాపు ఏడాది క్రితం మోకాలి గాయంతో బాధపడుతూ కనీసం ఒక హర్డిల్‌ను కూడా దాటలేని పరిస్థితుల్లో ఆందోళన చెందిన ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, ఇప్పుడు రికార్డులను తిరగరాస్తోంది. విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి ఇప్పుడు భారత అథ్లెటిక్స్‌లో కొత్త సంచలనం. సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ఆమె తాజా ప్రదర్శనతో అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ విజయాలే లక్ష్యంగా శ్రమిస్తోంది. –సాక్షి క్రీడా విభాగం 13.23 సెకన్లు... 13.11 సెకన్లు... 13.04 సెకన్లు... మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో ఇటీవల జ్యోతి వేగం ఇది! ఇరవై ఏళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టిన తర్వాత ఆమె అంతటితో ఆగిపోలేదు. మరింత వేగంగా, మరింత బలంగా దూసుకుపోయింది. మరో రెండుసార్లు చెలరేగి తన రికార్డును తానే సవరించుకుంది. ‘పరుగులో వేగం మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం ఏకాగ్రత, మానసిక దృఢత్వం కూడా జ్యోతి విజయాలకు కారణం. యూరోప్‌లో రేసు ప్రారంభానికి వాడే స్టార్టర్ గన్లు కొంత భిన్నంగా ఉంటాయి. సైప్రస్ రేస్‌లో ఆమెకు గన్ శబ్దం సరిగా వినిపించలేదు. దాంతో ఆరంభం ఆలస్యమైంది. అయినా సరే ఏకైక లక్ష్యంతో దూసుకుపోయి రికార్డు సాధించగలిగింది. మున్ముందూ ఆమె మరిన్ని ఘనతలు సాధిస్తుంది’ అని కోచ్ జేమ్స్ హిలియర్ జ్యోతి గురించి చేసిన వ్యాఖ్య ఆమె ఆట ఏమిటో చెబుతుంది. గాయం కారణంగా దాదాపు సంవత్సరం పాటు ఆటకు దూరంగా ఉన్నా, మళ్లీ ట్రాక్‌పైకి వచ్చి జ్యోతి సత్తా చాటగలిగింది. పరుగుపై ఆసక్తితో... జ్యోతి స్వస్థలం వైజాగ్. తండ్రి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. తల్లి ప్రోత్సాహంతో చిన్నప్పుడు స్కూల్ స్థాయిలో పరుగు పందాల్లో పాల్గొన్న ఆసక్తే ఆమెను ఇప్పుడు ప్రొఫెషనల్ అథ్లెట్‌గా మార్చింది. జూనియర్ స్థాయిలో తన అథ్లెటిక్ నైపుణ్యంతో ఆకట్టుకున్న జ్యోతి ఆటకు మరింత పదును పెట్టేందుకు సరైన వేదిక లభించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొని అర్హత సాధించడంతో గచ్చిబౌలి అథ్లెటిక్స్ స్టేడియంలో ఆమె శిక్షణ మొదలైంది. తొలిసారి అథ్లెట్స్ ‘స్పైక్స్’ను అక్కడే వేసుకునే అవకాశం లభించిన జ్యోతి... భారత కోచ్ నాగపురి రమేశ్ పర్యవేక్షణలో దాదాపు నాలుగేళ్ల పాటు సాధన చేసి హర్డిల్స్‌లో రాటుదేలింది. 2019 ఆగస్టులో లక్నోలో జరిగిన ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్ జ్యోతి కెరీర్లో తొలి సీనియర్ టోర్నీ. మొదటి ప్రయత్నంలోనే 13.91 సెకన్ల టైమింగ్‌తో హర్డిల్స్ విజేతగా నిలవడంతో ఆమె అందరి దృష్టిలో పడింది. జాతీయ స్థాయి విజయాల కారణంగా పటియాలా ‘సాయ్’ కేంద్రంలో భారత క్యాంప్‌లో జ్యోతికి అవకాశం లభించింది. రెండు సార్లు రికార్డు కొట్టినా... కెరీర్లో దూసుకుపోయే అవకాశం లభిస్తున్న తరుణంలో ‘కరోనా’ దెబ్బ జ్యోతిపై కూడా పడింది. ‘సాయ్’ కేంద్రాన్ని మూసివేయాల్సి రావడంతో సాధనకు ఆటంకం కలిగింది. కొంత కాలం ప్రాక్టీస్ కూడా ఆగిపోయింది. అయితే కీలక సమయంలో ఆమెకు మరో రూపంలో శిక్షణకు అవకాశం లభించింది. భువనేశ్వర్‌లో ఒడిషా ప్రభుత్వంతో కలిసి రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘హై పెర్ఫార్మెన్ సెంటర్’లో జ్యోతికి అవకాశం లభించింది. దీనిని ఆమె సమర్థంగా వాడుకుంది. అక్కడి హెడ్ కోచ్ జేమ్స్ హిలియర్ పర్యవేక్షణలో జ్యోతి పరుగు మరింత మెరుగైంది. ట్రాక్‌పైకి వచ్చి రెండు సార్లు జాతీయ రికార్డు టైమింగ్‌లు (13.03 సెకన్లు, 13.08 సెకన్లు) నమోదు చేసినా... సాంకేతిక కారణాల వల్ల వాటికి భారత అథ్లెటిక్స్ సమాఖ్య గుర్తించలేదు. అయితే ఆమె నిరాశ చెందలేదు. ‘ట్రైనింగ్ కమ్ కాంపిటీషన్’ కోసం యూరోప్ వెళ్లిన 22 ఏళ్ల జ్యోతి ఏకంగా మూడు సార్లు రికార్డు బద్దలు కొట్టి తానేమిటో చూపించింది. జాతీయ రికార్డు టైమింగ్‌ను దృష్టిలో ఉంచుకొని నేనెప్పుడూ పరుగెత్తలేదు. పరుగు మొదలెట్టాక అమిత వేగంగా లక్ష్యాన్ని చేరడమే నా పని. అందుకే రెండుసార్లు రికార్డు నమోదు కాకపోవడం బ్యాడ్‌లక్‌గా భావించానే తప్ప బాధపడలేదు. ఇప్పుడు కెరీర్లో మంచి దశలో ఉన్నాను. అయితే ప్రతిష్టాత్మక ఈవెంట్లలో భారత్ తరఫున ఇంకా పతకాలు సాధించలేదు. ప్రస్తుతం ఆ సవాల్ నా ముందుంది. రాబోయే కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలకు ఇప్పటికే అర్హత సాధించాను కాబట్టి వాటిలో పతకాలు సాధించడంపైనే దృష్టి పెట్టి ప్రాక్టీస్ చేస్తున్నా. ఒలింపిక్ అర్హత టైమింగ్ 12.90 సెకన్లు. నేను నా ఆటను మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉంది. 12.60 సెకన్ల టైమింగ్ సాధించడమే నా లక్ష్యం. –‘సాక్షి’తో జ్యోతి యర్రాజి -
జ్యోతి ‘రికార్డు’ పరుగు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయస్థాయిలో సత్తా చాటుకుంటున్న భారత యువ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ రెండు వారాల వ్యవధిలో రెండోసారి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. ఇంగ్లండ్‌లోని లాగ్బరవ్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో వైజాగ్‌కు చెందిన 22 ఏళ్ల జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రేసును 13.11 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో జ్యోతి ఈనెల 10న సైప్రస్ అంతర్జాతీయ మీట్లో 13.23 సెకన్లతో తానే నెలకొల్పిన జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. జ్యోతి తాజా ప్రదర్శనతో ఆమె కామన్వెల్త్ గేమ్స్‌కు కూడా అర్హత సాధించింది. భువనేశ్వర్‌లోని రిలయెన్స్ ఫౌండేషన్ ఒడిశా అథ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో జేమ్స్ హిలియర్ వద్ద జ్యోతి శిక్షణ తీసుకుంటోంది. 2002లో అనురాధా బిస్వాల్ 13.38 సెకన్లతో నెలకొల్పిన జాతీయ రికార్డును గత నెలలో ఫెడరేషన్ కప్ సందర్భంగా జ్యోతి (13.09 సెకన్లు) సవరించింది. అయితే రేసు జరిగిన సమయంలో మైదానంలో గాలి వేగం నిబంధనలకు లోబడి లేకపోవడంతో భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) జ్యోతి రికార్డును గుర్తించలేదు. 2020లో కర్ణాటకలో జరిగిన ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ అథ్లెటిక్స్ మీట్లో జ్యోతి 13.03 సెకన్ల సమయాన్ని నమోదు చేసింది. అయితే యూనివర్సిటీ మీట్లో జ్యోతికి డోపింగ్ టెస్టు చేయకపోవడంతోపాటు ఏఎఫ్ఐ సాంకేతిక అధికారులెవరూ హాజరుకాకపోవడంతో అప్పుడు కూడా జ్యోతి రికార్డును గుర్తించలేదు. అయితే మూడో ప్రయత్నంలో జ్యోతి శ్రమ వృథా కాలేదు. సైప్రస్ మీట్లో జ్యోతి నమోదు చేసిన సమయానికి గుర్తింపు లభించింది. దాంతో 20 ఏళ్లుగా ఉన్న జాతీయ రికార్డు బద్దలయింది. -
Shaili Singh: సెంటి మీటర్ తేడాతో స్వర్ణం చేజారె!
నైరోబి: ఒకే ఒక సెంటిమీటర్ దూరం భారత అథ్లెట్ శైలీ సింగ్‌ను స్వర్ణానికి దూరం చేసింది. ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ (అండర్–20) చాంపియన్‌షిప్‌లో ఆమె రజతం గెలిచినా... వెంట్రుకవాసిలో పసిడి దక్కకపోవడమనేది అథ్లెట్‌ను బాగా నిరాశపరిచే అంశం. కెన్యా రాజధానిలో ఆదివారం ముగిసిన ఈ జూనియర్ మెగా ఈవెంట్లో లాంగ్‌జంపర్ శైలీ ఆదివారం ఫైనల్స్‌లో అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన కనబరిచింది. మొత్తం 12 మంది పోటీపడిన మహిళల లాంగ్‌జంప్ ఫైనల్లో స్వీడన్‌కు చెందిన మజ అస్కగ్ 6.60 మీటర్ల దూరం దూకి బంగారు పతకం సాధించింది. (మీకు మేమున్నాం, చెలరేగి ఆడండి.. అఫ్గాన్ క్రికెటర్లకు తాలిబన్ల భరోసా) భారత లాంగ్‌జంపర్ శైలీ కూడా తానేం తక్కువ కాదని 6.59 మీటర్ల దూరం దూకింది. అర అంగుళం కంటే తక్కువ తేడాతో బంగారాన్ని కోల్పోయింది. తొలి, రెండో ప్రయత్నంలో ఆమె 6.34 మీ. దూరాన్ని నమోదు చేసింది. రెండో ప్రయత్నం ముగిసే సరికి హొరియెలొవా (6.50 మీ.; ఉక్రెయిన్) ఆధిక్యంలో నిలువగా, ఎబొసెలె (6.46మీ.; స్పెయిన్), శైలీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మూడో ప్రయత్నం (6.59 మీ.) శైలీని స్వర్ణావకాశానికి దగ్గర చేసింది. అప్పటికి అస్కగ్ (6.44 మీ.) పతకం బరిలోకి రానేలేదు. కానీ నాలుగో ప్రయత్నం అస్కగ్ (6.60 మీ.)ను చాంపియన్‌గా చేస్తే, భారత అథ్లెట్ 4, 5 ప్రయత్నాలు ఫౌల్ అయ్యాయి. ఆఖరి ఆరో ప్రయత్నం సఫలమైనా... 6.37 మీటర్ల దూరమే దూకింది. దీంతో చివరకు రజతమే ఖాయమైంది. ఉక్రెయిన్ అథ్లెట్ మరియా హొరియెలొవా (6.50 మీ.) కాంస్యం గెలిచింది. చదవండి: ప్రముఖ ఫుట్‌బాల్ దిగ్గజం కన్నుమూత మహిళల రిలేలో నాలుగో స్థానం తెలుగమ్మాయి కుంజా రజిత భాగంగా ఉన్న 4 X 400 మీటర్ల రిలేలో భారత జట్టుకు నాలుగో స్థానం దక్కింది. మహిళల ఫైనల్లో రజిత, ప్రియా మోహన్, పాయల్ వోహ్రా, సమ్మీలతో కూడిన జట్టు పోటీని 3 నిమిషాల 40.45 సెకన్లలో పూర్తి చేసింది. ఇందులో నైజీరియా అమ్మాయిలు 3 ని.31.46 సెకన్ల టైమింగ్‌తో విజేతగా నిలిస్తే, జమైకా జట్టు (3ని.36.57 సె.) రజతం, ఇటలీ బృందం (3ని.37.18 సె.) కాంస్యం గెలుపొందింది. పురుషుల ట్రిపుల్ జంప్‌లో స్వల్పతేడాతో భారత అథ్లెట్ డొనాల్డ్ మకిమయిరాజ్ (15.82 మీ.) కాంస్య పతకం కోల్పోయాడు. ఇతని కంటే మూడు సె.మీ.దూరం దూకిన సైమన్ గోర్ (15.85 మీ.; ఫ్రాన్స్)కు కాంస్యం లభించగా, మకిమయిరాజ్‌కు నాలుగో స్థానం దక్కింది. ఇందులో గాబ్రియెల్ (16.43 మీ.; స్వీడెన్), హిబెర్ట్ (16.05 మీ.; జమైకా) వరుసగా స్వర్ణ, రజతాలు గెలిచారు. మహిళల 5000 మీ. ఫైనల్లో అంకిత నిరాశపరిచింది. పది మంది పాల్గొన్న ఈ ఈవెంట్లో ఆమె (17 ని.17.68 సెకన్లు) ఎనిమిదో స్థానంలో నిలిచింది. జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో 1 రజతం, 2 కాంస్యాలతో భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి పోటీలను ముగించింది. నేను 6.59 మీటర్ల తర్వాత ఇంకాస్త దూరాన్ని నమోదు చేయాల్సింది. స్వర్ణం గెలిచే అవకాశాలు ఇంకా మూడు ప్రయత్నాల రూపంలో ఉన్నా... అనుకున్నది సాధించలేకపోయాను. నా తల్లి పసిడిపైనే కన్నేయాలి. జాతీయ గీతాన్ని వినిపించాలని చెప్పింది. అలా కుదరకపోవడం నన్ను బాధించింది. నాకు ఇంకా 17 ఏళ్లే. మరో జూనియర్ ఈవెంట్లో తలపడే అవకాశం ఉంది. ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ కూడా జరగనుండటంతో మరింత మెరుగైన ప్రదర్శనతో స్వర్ణాన్ని సాకారం చేసుకుంటా’ – శైలీ సింగ్ -
అమిత్ ఖత్రీకి రజతం
నైరోబి: భారత అథ్లెట్ అమిత్ ఖత్రీ సుదీర్ఘ పరుగులో సత్తా చాటుకున్నాడు. ప్రపంచ జూనియర్ (అండర్–20) అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 10,000 మీ. పరుగులో అతను రజత పతకం సాధించాడు. మహిళల 400 మీ. పరుగులో ప్రియా మోహన్ తృటిలో కాంస్యం గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. రోహ్టక్కు చెందిన 17 ఏళ్ల టీనేజ్ అథ్లెట్ అమిత్ ఖత్రీ ఓ రకంగా అద్భుతమే చేశాడు. సాధారణంగా ఆఫ్రికా అథ్లెట్లకు మాత్రమే సాధ్యమయ్యే సుదీర్ఘ పరుగులో భారత అథ్లెట్ పతకం గెలవడం విశేషం. శనివారం జరిగిన పురుషుల పదివేల మీటర్ల రేస్‌వాక్‌లో అతను పోటీని 42 నిమిషాల 17.94 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. కెన్యాకు చెందిన హెరిస్టోన్ వాన్యోని 42 ని.10.84 సెకన్ల టైమింగ్‌తో బంగారు పతకం సాధించగా, స్పెయిన్ అథ్లెట్ పాల్ మెక్‌గ్రాత్ (42ని.26.11 సె.) కాంస్యం గెలుపొందాడు. నిజానికి ఖత్రీ స్వర్ణం గెలిచే అవకాశాలు చివరి వరకు కనిపించాయి. వేగంగా దూసుకెళ్లిన అతను 8 ల్యాపులు ముగిసే సరికి అందరికంటే ముందున్నాడు. దాదాపు 9000 మీటర్ల దాకా ఇదే వేగం నమోదు చేయగా... స్థానిక అథ్లెట్ వాన్యోని అనూహ్యంగా ఆఖరి ల్యాపులో అమిత్ ఖత్రీని అధిగమించి స్వర్ణం సొంతం చేసుకున్నాడు. కెన్యా రాజధాని నైరోబి సముద్ర మట్టానికి 1800 మీ. ఎత్తులో ఉంటుంది. ఇది భారతీయులకు ప్రతికూల ప్రదేశం. ఇలాంటి చోట భారత అథ్లెట్ సుదీర్ఘ పరుగులో స్వర్ణానికి చేరువగా వెళ్లడం ఆషామాషీ విషయం కాదు. పరుగు ముగిసిన అనంతరం ఖత్రీ మాట్లాడుతూ ‘నేను ఆశించిన ఫలితం కాదిది. అయినా సరే రజతంతో తృప్తిగా ఉన్నాను. ఐదు రోజుల ముందు ఇక్కడికొచ్చిన నన్ను ప్రతికూల వాతావరణం ఇబ్బంది పెట్టింది. ఒక ల్యాప్‌లో అయితే శ్వాస తీసుకోవడం కూడా కష్టమైంది’ అని అన్నాడు. పాల్గొన్న తొలి అంతర్జాతీయ పోటీలో రజతం గెలిచిన తన శిష్యుడి ప్రదర్శన పట్ల కోచ్ చందన్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. మహిళల 10వేల మీటర్ల రేస్‌వాక్‌లో బల్జీత్‌కౌర్ (48 ని.58.17 సె) ఏడో స్థానంలో నిలిచింది. ప్రియకు చేజారిన పతకం... మహిళల 400 మీటర్ల పరుగులో అనేక అంచనాల మధ్య బరిలోకి దిగిన ప్రియా మోహన్‌కు నిరాశే ఎదురైంది. దురదృష్టవశాత్తూ ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. ఫైనల్ పోటీని ప్రియ 52.77 సెకన్లలో ముగించింది. ఈ ఈవెంట్లో ఇమావోబంగ్ (నైజీరియా; 51.55 సె.), కార్నెలియా (పోలండ్; 51.97 సె.), కెన్యా అథ్లెట్ సిల్వియా చెలన్‌గట్ (52.23 సె.) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు గెలిచారు. పురుషుల 400 మీ. హర్డిల్స్‌లో రోహన్ గౌతమ్ కాంబ్లి ఫైనల్ చేరడంలో విఫలమయ్యాడు. సెమీస్‌లో అతను 52.88 సెకన్ల టైమింగ్‌తో ఏడో స్థానంలో నిలిచాడు. పురుషుల 4్ఠ400 మీటర్ల హీట్స్‌లో అబ్దుల్ రజాక్, సుమిత్ చహల్, కపిల్, భరత్ శ్రీధర్‌లతో కూడిన జట్టు హీట్స్‌తోనే సరిపెట్టుకుంది. -
Corona: ఆసుపత్రిలో చేరిన దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్
చండీగఢ్: కరోనా వైరస్ బారిన పడ్డ భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్‌ను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆసుపత్రిలో చేర్పించామని ఆయన కుమారుడు, స్టార్ గోల్ఫర్ జీవ్ మిల్కాసింగ్ తెలిపారు. గత బుధవారం ‘పాజిటివ్’గా రావడంతో 91 ఏళ్ల మిల్కా సింగ్ చండీగఢ్‌లోని తన ఇంట్లో చికిత్స తీసుకుంటున్నారు. మిల్కా సింగ్ 1958 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం, 1958 టోక్యో, 1962 జకార్తా ఆసియా క్రీడల్లో నాలుగు స్వర్ణాలు నెగ్గారు. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల విభాగంలో నాలుగో స్థానంలో నిలిచారు. అయినప్పటికీ ట్రాక్‌పై ఆయన చూపిన తెగువతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కాగా కోవిడ్ బారిన పడిన అనంతరం మిల్కా సింగ్ మాట్లాడుతూ.. తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని, అయితే జాగింగ్ నుంచి తిరిగి వచ్చాక కాస్త అలసటగా ఉండటంతో కోవిడ్ పరీక్ష చేయించుకున్నానని తెలిపారు, తనకు పాజిటివ్‌గా నిర్ధారణగా కావడం ఆశ్చర్యానికి గురిచేసిందని, త్వరలోనే కోలుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. చదవండి: కరోనా కాటు: ఇటుకల బట్టీలో ఫుట్‌బాల్ కెప్టెన్ -
భారత అథ్లెట్ గోమతిపై నాలుగేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ స్వర్ణ పతక విజేత గోమతి మరిముత్తు డోపీగా తేలింది. దీంతో ఆమెపై నాలుగేళ్ల నిషేధాన్ని విధించినట్లు సోమవారం వరల్డ్ అథ్లెటిక్స్ ప్రకటించింది. తమిళనాడుకు చెందిన గోమతి నుంచి సేకరించిన నాలుగు నమూనాల్లోనూ నిషేధిత ఉత్ప్రేరకం ‘19 నార్ ఆండ్రోస్టెరోన్’ స్టెరాయిడ్ ఆనవాళ్లు ఉండటంతో... అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) నాలుగేళ్ల సస్పెన్షన్ వేటు వేసింది. 2019 మే 17 నుంచి 2023 మే 16 వరకు ఆమెపై ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఏఐయూ పేర్కొంది. 2019 దోహా ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 800 మీటర్ల పరుగును తన అత్యుత్తమ టైమింగ్‌తో (2ని: 2.70 సెకన్లు) పూర్తిచేసిన గోమతి విజేతగా నిలిచింది. ఈ క్రీడల సెలక్షన్స్ సందర్భంగా గతేడాది ఏప్రిల్‌లో, ఫెడరేషన్ కప్ సందర్భంగా పాటియాలాలో గోమతి నుంచి శాంపిల్స్ సేకరించారు. ఇవి పాజిటివ్‌గా రావడంతో ఆమె ఆసియా చాంపియన్‌షిప్‌లో సాధించిన పసిడి పతకాన్ని కూడా ఆమె కోల్పోనుంది. దీంతో పాటు ఆమె ఏఐయూకు లక్ష రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే జాతీయ డోపింగ్ టెస్టు ల్యాబ్ (ఎన్‌డీటీఎల్)లో పరీక్షించిన తన నమూనాల పరిమాణంపై ఆమె సందేహాలు వ్యక్తం చేసింది. కానీ ఇవేవీ ఆమెను శిక్ష నుంచి తప్పించలేకపోయాయి. -
పతకానికి చేరువై.. అంతలోనే దూరమై..
రెప్పపాటులో... వెంట్రుకవాసి తేడాతో... అర క్షణంలో...ఈ మాటలు అప్పుడప్పుడు అలవోకగా మనం వాడేస్తుంటాం. కానీ వాస్తవంలో వచ్చే సరికి వీటి విలువ ఎంత? ఇదే ప్రశ్న మిల్కా సింగ్‌ను అడిగితే ‘జీవిత కాలమంత’ అనే సమాధానం వస్తుందేమో! ఎందుకంటే ఒలింపిక్స్‌లో పతకం సాధించేందుకు చేరువై... అంతలోనే దూరమైన విషాదానికి నిలువెత్తు నిదర్శనం మిల్కా సింగ్. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగులో మిల్కా నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకం కోల్పోయిన క్షణాన్ని భారత అభిమానులు మరచిపోలేరు. ఆ తర్వాత ఒలింపిక్స్‌లో మన అథ్లెట్ల ప్రదర్శనను బట్టి చూస్తే... పతకం దక్కకపోయినా నాటి ఘటనకు భారత క్రీడా చరిత్రలో ఉన్న ప్రాతినిధ్యం ఏమిటో అర్థమవుతుంది. ఆ జ్ఞాపకాలన్నీ... రోమ్ ఒలింపిక్స్‌కు ముందే మిల్కా సింగ్ భారత అథ్లెటిక్స్‌కు సంబంధించి తనదైన ప్రత్యేక ముద్ర వేశాడు. దేశ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో కళ్ల ముందే తల్లిదండ్రులను కోల్పోవడంతో పాటు అనేక కష్టాలను ఎదుర్కొన్న మిల్కా ఎంతో పోరాటంతో వాటిని అధిగమించాడు. భారత సైన్యంలో చేరడంతో అతని జీవితానికి ఒక దిశ లభించింది. అక్కడే అథ్లెట్‌గా పాఠాలు నేర్చుకున్న అతను కొన్నాళ్లకు పూర్తి స్థాయిలో 400 మీటర్ల పోటీని తన ప్రధాన ఈవెంట్‌గా మార్చుకున్నాడు. 1958 కటక్ జాతీయ క్రీడల్లో 200 మీ., 400 మీ. విభాగాల్లో స్వర్ణాలతో వెలుగులోకి వచ్చిన మిల్కా... అదే ఏడాది టోక్యోలో జరిగిన ఆసియా క్రీడల్లో ఈ రెండు విభాగాల్లోనే స్వర్ణ పతకాలు గెలుచుకొని తన సత్తా చాటాడు. కొద్ది రోజులకే కార్డిఫ్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో కూడా 400 మీటర్ల పరుగు (440 గజాలు)లో అగ్ర స్థానంలో నిలవడంతో మిల్కా పేరు మారుమోగిపోయింది. దాంతో దేశవ్యాప్తంగా అతనికి పెద్ద సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. ఎక్కడకు వెళ్లినా మిల్కాకు జనం బ్రహ్మరథం పట్టారు. అయితే దురదృష్టవశాత్తూ ఒలింపిక్ వేదికకు వచ్చే సరికి అతను అంచనాలు అందుకోలేకపోయారు. ఫలితంగా 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో మిల్కా 200 మీ., 400 మీ. రెండింటిలో పాల్గొన్నా... హీట్స్ దశను దాటి ముందుకు వెళ్లలేకపోయాడు. గుండె పగిలిన క్షణం... గత ఒలింపిక్స్ నుంచి పాఠాలు నేర్చుకున్న మిల్కా నాలుగేళ్ల పాటు తీవ్రంగా శ్రమించాడు. మెల్బోర్న్లో 400 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన చార్లెస్ జెన్కిన్స్ను కలిసి తన గురించి చెప్పుకున్నాడు. అతని నుంచి ప్రాక్టీస్‌కు సంబంధించి కొత్త తరహా టెక్నిక్‌లు, శిక్షణలో పద్ధతుల గురించి తెలుసుకున్నాడు. దాంతో 1960 రోమ్‌లో పోటీలకు పూర్తి స్థాయిలో సన్నద్ధమై వచ్చాడు. ఒలింపిక్స్‌కు ముందు సన్నాహకంగా జరిగే రేసులలో అతను అద్భుతమైన టైమింగ్‌లు నమోదు చేయడంతో మళ్లీ అందరి దృష్టి మిల్కాపై పడింది. హీట్స్‌లో, క్వార్టర్ ఫైనల్లో, సెమీ ఫైనల్లో మెరుగైన ప్రదర్శనతో మిల్కా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. గన్ పేలింది... పరుగు ప్రారంభమైంది. ఐదో లేన్‌లో ఉన్న మిల్కా వేగంగా దూసుకుపోయాడు. ఒటిస్ డేవిస్ తర్వాత రెండో స్థానంలో అతను కొనసాగుతున్నాడు. 100 మీ., 200 మీ., 250 మీటర్లు ముగిశాయి. మిల్కాకు మంచి అవకాశం కనిపించింది. అంతలో అనూహ్యం జరిగింది! తన పోటీదారులు ఎక్కడ ఉన్నారో అన్నట్లుగా పరుగెడుతూనే లిప్తకాలం పాటు అతని దృష్టి పక్కకు పడింది. అంతే... ఆ అర క్షణంలోనే వేగం మందగించింది. ఈ చిన్న పొరపాటు మిల్కాసింగ్‌కు జీవిత కాలం బాధను మిగిల్చింది. అప్పటి వరకు వెనుకంజలో ఉన్న ఇద్దరు అథ్లెట్లు దూసుకుపోయారు. కోలుకొని శక్తిమేరా పరుగెత్తేలోపే రేసు ముగిసిపోయింది. ఫలితంగా నాలుగో స్థానంలో నిలవాల్సి వచ్చింది. ఒటిస్ డేవిస్ (అమెరికా –44.9 సె.), కార్ల్ కాఫ్ మన్ (జర్మనీ– 44.9 సె.) తొలి రెండు స్థానాల్లో నిలవగా... కాంస్యం సాధించిన మాల్కమ్ స్పెన్స్ (దక్షిణాఫ్రికా – 45.5 సె.)కు మిల్కా సింగ్ (45.6 సె.) మధ్య తేడా చూస్తే ఆ బాధ ఏమిటో అర్థమవుతుంది. 38 ఏళ్ల పాటు... ‘అధికారికంగా ఫలితాలు ప్రకటించక ముందే నేను చేసిన తప్పేమిటో నాకు అర్థమైపోయింది. 250 మీటర్లు అద్భుతంగా పరుగెత్తిన తర్వాత నెమ్మదించడం నాకు చేటు చేసింది. నేను ఆ వ్యత్యాసాన్ని సరి చేయలేకపోయాను. మా అమ్మానాన్నలు చనిపోయిన తర్వాత నేను ఇంతగా ఎప్పుడూ బాధపడలేదు. కొన్ని రోజుల పాటు ఏడుస్తూనే ఉండిపోయాను’ అని మిల్కా సింగ్ స్వయంగా చెప్పుకున్నాడు. మ్యాన్యువల్‌గా లెక్కించిన టైమింగ్‌లను ముందుగా ఈ ఈవెంట్లో ఫలితాల సమయంలో ప్రకటించారు. కానీ ఎలక్ట్రానిక్ స్కోరు బోర్డు ప్రకారం ఆ తర్వాత వాటిని సవరించారు. దీని ప్రకారం మిల్కా 400 మీటర్ల టైమింగ్ అధికారికంగా 45.73 సెకన్లుగా నమోదైంది. భారత్ తరఫున ఇదే అత్యుత్తమ ప్రదర్శన కాగా... 1998లో పరమ్‌జీత్ సింగ్ 45.70 సెకన్లలో (జాతీయ చాంపియన్‌షిప్‌లో) రేసు పూర్తి చేయడంతో మిల్కా రికార్డు కనుమరుగైంది. అయితే ఇన్నేళ్ల ఒలింపిక్ చరిత్రలో భారత అథ్లెట్లు ఎవరూ దీనికి సమమైన ప్రదర్శనను ఇవ్వలేకపోయారు. ఒక్క పతకం గెలుచుకోలేకపోగా... మిల్కా తరహాలో కనీసం నాలుగో స్థానం వరకు కూడా వెళ్లలేకపోయారు. ఇది చాలు మిల్కా ఘనత ఏమిటో చెప్పడానికి. –సాక్షి క్రీడా విభాగం