
కేవలం మూడు వారాల వ్యవధిలో భారత స్ర్పింటర్ హిమదాస్ ఐదు గోల్డ్ మెడల్స్‌ను కొల్లగొట్టి దేశానికి గర్వకారణంగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా తాను స్వయంగా తయారు చేసిన 'అస్సామి దాల్' వంటకం వీడియో ట్విటర్ ద్వారా బయటికి రావడం సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది.
యూరప్‌లో జరిగిన చాంపియన్‌షిప్‌లో భాగంగా ఓ హోటల్ రూమ్‌లోనే ఈ వంటకాన్ని తయారు చేసినట్లు హిమదాస్ తెలిపారు. ఆరోజు ఆదివారం కావడం, ప్రాక్టీస్ కూడా లేకపోవడంతో 'అస్సామి దాల్'ను వండడం ద్వారా తన ఖాళీ సమయాన్ని ఆస్వాదించినట్లు దాస్ పేర్కొన్నారు. తనతో పాటు మరో భారతీయ అథ్లెట్ సరితాబెన్ గైక్వాడ్ కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు. దేశం కాని దేశంలో తానే స్వయంగా వంట చేయడం నాకు మధురానుభుతి కలిగించిందని వెల్లడించారు. నాతో పాటు ఉన్నవారు అస్సామి దాల్ వంటకాన్ని తిని ఎంతో రుచిగా ఉందని చెప్పడం తనకు ఎంతో సంతోషం కలిగించినట్లు పేర్కొంది.
ఇప్పటికే వరుసగా ఐదు గోల్డ్ మెడల్స్‌ను కొల్లగొట్టిన హిమదాస్ శనివారం పరాగ్వేలో జరగనున్న నోవ్‌మాస్టో అథ్లెటిక్స్‌లో పోటీ పడనుంది. 52.09 సెకన్లలో 400మీటర్ల రేసును పూర్తి చేసిన హిమదాస్ తాజాగా ఆ రికార్డును సవరిస్తుందేమో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment