
కొరియాలో జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో అంజుమ్ మౌద్గిల్ కాంస్య పతకం నెగ్గగా... పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ విభాగంలో చెయిన్ సింగ్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్, సంజీవ్ రాజ్‌పుత్‌లతో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది. ఫైనల్లో అంజుమ్ 402.9 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. పురుషుల టీమ్ ఫైనల్లో భారత్ 12–16తో చెక్ రిపబ్లిక్ జట్టు చేతిలో ఓడిపోయింది.
చదవండి: Zouhaier Sghaier wrestling: భారత రెజ్లర్ల పసిడి పట్టు