Shooting Tourney
-
అంజుమ్ మౌద్గిల్‌కి కాంస్య పతకం
కొరియాలో జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో అంజుమ్ మౌద్గిల్ కాంస్య పతకం నెగ్గగా... పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ విభాగంలో చెయిన్ సింగ్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్, సంజీవ్ రాజ్‌పుత్‌లతో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది. ఫైనల్లో అంజుమ్ 402.9 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. పురుషుల టీమ్ ఫైనల్లో భారత్ 12–16తో చెక్ రిపబ్లిక్ జట్టు చేతిలో ఓడిపోయింది. చదవండి: Zouhaier Sghaier wrestling: భారత రెజ్లర్ల పసిడి పట్టు -
టోక్యో ఒలింపిక్స్‌కు భారత షూటింగ్ జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత షూటింగ్ జట్టును నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత షూటర్లు 10 కేటగిరీలకుగాను 15 బెర్త్‌లు సంపాదించారు. అయితే ఎన్ఆర్ఏఐ నిబంధనల ప్రకారం బెర్త్ అనేది దేశానికి చెందుతుందికానీ అర్హత సాధించిన షూటర్‌కు కాదు. ఫలితంగా టోక్యో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత పొందకపోయినా మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, తమిళనాడు షూటర్ ఇలవేనిల్ వలారివన్‌కు టోక్యోలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. గత మూడేళ్లుగా జాతీయ, అంతర్జాతీయ టోర్నీలలో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా ఎన్ఆర్ఏఐ 15 మందితో జట్టును ఎంపిక చేసింది. ఇక 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో టోక్యో బెర్త్ సాధిం చిన చింకీ యాదవ్‌ను కాదని మనూ భాకర్‌కు అవకాశం ఇచ్చారు. చింకీని రిజర్వ్‌గా ఎంపిక చేశారు. పురుషుల విభాగం: 10 మీటర్ల ఎయిర్ రైఫిల్: దివ్యాంశ్, దీపక్. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్: సంజీవ్ రాజ్‌పుత్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్: సౌరభ్ చౌధరీ, అభిషేక్ వర్మ. స్కీట్ ఈవెంట్: అంగద్‌వీర్, మేరాజ్ అహ్మద్‌ఖాన్. మహిళల విభాగం: 10 మీటర్ల ఎయిర్ రైఫిల్: అపూర్వీ, ఇలవేనిల్. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్: అంజుమ్, తేజస్విని. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్: మనూ భాకర్, యశస్విని. 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్: రాహీ, మనూ. 10 మీటర్ల రైఫిల్ మిక్స్డ్ టీమ్: దివ్యాంశ్, ఇలవేనిల్. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్: సౌరభ్, మనూ భాకర్. -
తెలంగాణ రాష్ట్ర షూటింగ్ టోర్నీ షురూ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర షూటింగ్ చాంపియన్‌షిప్ సోమవారం ప్రారంభమైంది. గచ్చిబౌలిలోని ‘శాట్స్’ షూటింగ్ రేంజ్లో తెలంగాణ రాష్ట్ర రైఫిల్ సంఘం (టీఎస్ఆర్ఏ) అడ్మినిస్ట్రేటర్ అలెగ్జాండర్ ఫ్రాన్సిస్ ఈ పోటీలను ప్రారంభించారు. దాదాపు 700లకు పైగా షూటర్లు ఇందులో పాల్గొన్నారు. ప్రి–నేషనల్స్ చాంపియన్‌షిప్‌కు క్వాలిఫయింగ్ టోర్నీగా నిర్వహిస్తోన్న ఈ పోటీలు శనివారంతో ముగుస్తాయి. సోమవారం 10మీ. ఎయిర్ రైఫిల్, పిస్టల్, 25మీ. పిస్టల్, 50మీ. రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ ఈవెంట్లలో క్రీడాకారులకు ప్రాక్టీస్ సెషన్ జరిగింది. నేటి నుంచి శనివారం వరకు మెయిన్ డ్రా పోటీలను నిర్వహిస్తారు.