'ఆమె'నే పెళ్లి చేసుకుంటా.. మహిళా అథ్లెట్‌ సంచలన వ్యాఖ్యలు | Might Get Married With Same Gender Partner After Paris Olympics Says Dutee Chand | Sakshi
Sakshi News home page

Dutee Chand: 'ఆమె'నే పెళ్లి చేసుకుంటా.. మహిళా అథ్లెట్‌ సంచలన వ్యాఖ్యలు

Published Wed, Jul 13 2022 1:20 PM | Last Updated on Wed, Jul 13 2022 1:20 PM

Might Get Married With Same Gender Partner After Paris Olympics Says Dutee Chand - Sakshi

భారత స్టార్‌ మహిళా స్ప్రింటర్‌ ద్యుతీచంద్‌ సంచలన విషయాలు వెల్లడించింది. ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. పెళ్లికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రిలేషన్షిప్‌లో ఉన్న తన భాగస్వామిని (మహిళ) 2024 పారిస్ ఒలింపిక్స్ తర్వాత పెళ్లి చేసుకుంటానని వివాదాస్పద ప్రకటన చేసింది. తన శారీరక తత్వం కారణంగా సమాజంలో దారుణమైన వివక్షను ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా వాపోయింది. 

తన లాంటి వాళ్లు ట్రాక్‌తో పాటు సమాజంతో కూడా పోరాడాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. భారత్‌లో సేమ్ సెక్స్ మ్యారేజ్‌ చట్ట వ్యతిరేకమన్న ప్రశ్నపై సమాధానం దాటవేసింది. కాగా, మరో మహిళతో (మోనాలిసా) సహజీవనం చేస్తున్న విషయాన్ని ద్యుతీ గతంలోనే ప్రకటించింది. 

ద్యుతీ శరీరంలో మగవాళ్లకు ఉండాల్సిన టెస్టోస్టిరాన్ లక్షణాలు అధికంగా ఉన్నాయన్న కారణంగా ఆమెపై 2014 కామన్వెల్త్ క్రీడల్లో అనర్హత వేటు పడింది. ఐదేళ్ల న్యాయపోరాటం అనంతరం ఈనెల (జులై) 28 నుంచి బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనేందుకు ఆమెకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. ఈ మెగా ఈవెంట్‌లో ద్యుతీ 200 మీటర్ల రేసులో బరిలోకి దిగనుంది. 
చదవండి: భారత్‌ గురి కుదిరింది.. ప్రపంచకప్‌ షూటింగ్‌లో రెండో పతకం ఖాయం
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement