Sprinter
-
'ఆమె'నే పెళ్లి చేసుకుంటా.. మహిళా అథ్లెట్ సంచలన వ్యాఖ్యలు
భారత స్టార్ మహిళా స్ప్రింటర్ ద్యుతీచంద్ సంచలన విషయాలు వెల్లడించింది. ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. పెళ్లికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రిలేషన్షిప్లో ఉన్న తన భాగస్వామిని (మహిళ) 2024 పారిస్ ఒలింపిక్స్ తర్వాత పెళ్లి చేసుకుంటానని వివాదాస్పద ప్రకటన చేసింది. తన శారీరక తత్వం కారణంగా సమాజంలో దారుణమైన వివక్షను ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా వాపోయింది. తన లాంటి వాళ్లు ట్రాక్‌తో పాటు సమాజంతో కూడా పోరాడాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. భారత్‌లో సేమ్ సెక్స్ మ్యారేజ్ చట్ట వ్యతిరేకమన్న ప్రశ్నపై సమాధానం దాటవేసింది. కాగా, మరో మహిళతో (మోనాలిసా) సహజీవనం చేస్తున్న విషయాన్ని ద్యుతీ గతంలోనే ప్రకటించింది. ద్యుతీ శరీరంలో మగవాళ్లకు ఉండాల్సిన టెస్టోస్టిరాన్ లక్షణాలు అధికంగా ఉన్నాయన్న కారణంగా ఆమెపై 2014 కామన్వెల్త్ క్రీడల్లో అనర్హత వేటు పడింది. ఐదేళ్ల న్యాయపోరాటం అనంతరం ఈనెల (జులై) 28 నుంచి బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనేందుకు ఆమెకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మెగా ఈవెంట్లో ద్యుతీ 200 మీటర్ల రేసులో బరిలోకి దిగనుంది. చదవండి: భారత్ గురి కుదిరింది.. ప్రపంచకప్ షూటింగ్లో రెండో పతకం ఖాయం -
పెద్దల సభకు పరుగుల రాణి
ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ప్రపంచ వేదికలపై భారత్ సత్తా చాటిన అథ్లెట్ పీటీ ఉష. చిరుత కూడా చిన్నబోయే వేగం ఉష సొంతం. ట్రాక్‌పై ఆమె అడుగు పెట్టిందంటే పందెం కోడె! అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో ఉష ప్రతిభ ఎన్నో పతకాలను తెచ్చిపెట్టింది. అమ్మాయిలకు చదువెందుకనే ఆ రోజుల్లో ఆటల పోటీల్లోకి వెళ్లడమంటే సాహసం. అలాంటి పరిస్థితుల్లో ‘పయ్యోలి’అనే పల్లెటూరులో నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది. ప్రపంచవేదికపై ‘పరుగుల రాణి’గా నిలిచింది. పతకాలతో ‘గోల్డెన్ గర్ల్’గా మారింది. ‘పయ్యోలి ఎక్స్‌ప్రెస్’గా ఎదిగింది. ఆమె పరుగు ఎందరో అమ్మాయిలకు ప్రేరణ. ఊరి పేరునే.. ఇంటిపేరుగా మార్చుకున్న పయ్యోలి తెవరపరంపిల్ ఉష (పీటీ ఉష) 1976 నుంచి 2000 వరకు రెండున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘంగా ‘పరుగు’ప్రయాణాన్ని కొనసాగించింది. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 4–400 మీటర్ల రిలే, 400 మీటర్ల హర్డిల్స్‌లో అలుపెరగని పరుగుతో దిగ్గజ అథ్లెట్‌గా ఎదిగింది. 25 ఏళ్ల కెరీర్లో జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో ఉష మొత్తం 102 పతకాలను గెలుచుకుంది. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ (1984)లో 400 మీటర్ల హర్డిల్స్‌లో త్రుటిలో కాంస్యం కోల్పోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. The remarkable PT Usha Ji is an inspiration for every Indian. Her accomplishments in sports are widely known but equally commendable is her work to mentor budding athletes over the last several years. Congratulations to her on being nominated to the Rajya Sabha. @PTUshaOfficial pic.twitter.com/uHkXu52Bgc— Narendra Modi (@narendramodi) July 6, 2022 కానీ అంతకుముందు... ఆ తర్వాత జరిగిన ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్‌లలో ఎదురేలేని స్ప్రింటర్‌గా ఎదిగింది. ప్రత్యేకించి 1985 నుంచి 1989 వరకు కువైట్, జకార్తా, సియోల్, సింగపూర్, న్యూఢిల్లీల్లో జరిగిన ఆసియా పోటీల్లో ఆమె 16 స్వర్ణాలు (ఓవరాల్‌గా 18 బంగారు పతకాలను) సాధించింది. కెరీర్ తదనంతరం అకాడమీ నెలకొల్పి.. తన జీవితాన్నే భారత అథ్లెటిక్స్‌కి అంకితం చేసింది. ఆమె సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం 1984లో ‘అర్జున అవార్డు’తో పాటు ‘పద్మశ్రీ’పురస్కారాన్ని అందజేసింది. 58 ఏళ్ల ఉష తాజాగా రాజ్యసభకు నామినేట్ అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ ఉష పేరును ఎగువసభకు ప్రతిపాదించారు. ఉష ప్రతి భారతీయుడికి స్ఫూర్తిప్రదాత అని మోదీ స్వయంగా ట్వీటర్ వేదికగా శుభాకంక్షలు తెలిపారు. ఉష (కేరళ) సహా తమిళనాడు నుంచి ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయారాజా, కర్ణాటక నుంచి ధర్మస్థల ఆలయ పాలక మండలి అధినేత, సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్గడే, ఆంధ్రప్రదేశ్ నుంచి సినీ కథా రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్‌లను బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ ఎగువసభకు నామినేట్ చేసింది. -
మసాజ్ చేయమని బెదిరించేవారు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన మహిళా అథ్లెట్
భువనేశ్వర్‌లోని (ఒడిశా) స్పోర్ట్స్ హాస్టల్లో సీనియర్ల వేధింపులు తాళలేక డిగ్రీ విద్యార్ధిని రుచిక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై భారత స్టార్ మహిళా స్ప్రింటర్, ఒలింపిక్ అథ్లెట్, స్పోర్ట్స్ హాస్టల్ మాజీ విద్యార్ధిని ద్యుతీ చంద్ స్పందించింది. స్పోర్ట్స్ హాస్టల్లో తాను ర్యాగింగ్ బాధితురాలినే సంచలన విషయాలను వెల్లడించింది. సీనియర్లు ర్యాగింగ్ పేరుతో తనతో అసభ్యంగా ప్రవర్తించేవారని, బాడీ మసాజ్ చేయమని బెదిరించేవారని ఆరోపించింది. వారు చెప్పిన విధంగా చేయకపోతే టార్చర్ పెట్టేవారని వాపోయింది. రుచిక లాగే తాను కూడా హాస్టల్లో దుర్భర అనుభవాలను ఎదుర్కొన్నానని తెలిపింది. స్పోర్ట్స్ హాస్టల్లో గడిపిన రెండేళ్లు నిద్రలేని రాత్రులు గడిపానని, తన బాధను హాస్టల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేకపోయేదని, సీనియర్లపై కంప్లైంట్ చేసినందుకు అధికారులు తననే రివర్స్‌లో తిట్టేవాళ్లని గత అనుభవాలను గుర్తు చేసుకుంది. హాస్టల్ అధికారులు తన పేదరికాన్ని చూసి హేళన చేసే వారని, తనతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా అవమానించేవారని సోషల్‌మీడియా వేదికగా తన అనుభవాలను పంచుకుంది. క్రీడాకారులు ఇలాంటి ఘటనల వల్ల చాలా డిస్టర్బ్ అవుతారని, తాను కూడా హాస్టల్లో గడిపిన రోజుల్లో మానసికంగా కృంగిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, రుచిక ఆత్మహత్య చేసుకున్న హాస్టల్లోనే ద్యుతీ 2006 నుంచి 2008 వరకు గడిపింది. చదవండి: గీతిక, అల్ఫియా ‘పసిడి’ పంచ్ -
డోపింగ్‌లో పట్టుబడ్డ జాతీయ స్ప్రింట్ చాంపియన్..
అండర్–23 విభాగంలో భారత జాతీయ స్ప్రింట్ మహిళా చాంపియన్ తరణ్‌జీత్ కౌర్ డోపింగ్ పరీక్షలో విఫలమైందని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తెలిపింది. ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల తరణ్‌జీత్ గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన జాతీయ అండర్–23 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్లు, 200 మీటర్ల విభాగాల్లో స్వర్ణ పతకాలు నెగ్గింది. ‘నాడా’ క్రమశిక్షణ కమిటీ విచారణలోనూ తరణ్‌జీత్ దోషిగా తేలితే ఆమెపై నాలుగేళ్ల నిషేధం విధిస్తారు. చదవండి: రషీద్ ఖాన్ కుటంబంలో తీవ్ర విషాదం.. -
వయసు సెంచరీ దాటినా.. ఒలింపిక్స్ రికార్డు బ్రేక్!
ఒక్క నిమిషం అనుకుంటే చిన్నసంఖ్య.. అదే కాలాన్ని అరవై సెకన్లు.. అరవై వేల మిల్లీ సెకన్లు.. అనుకుంటే పెద్ద సంఖ్య.. ఇలా అనుకుంది కాబట్టే ఈ బామ్మ భళాభళి అనిపించింది. వందేళ్లకు పైబడిన వయసులోని వాళ్లకు నిర్వహించిన వంద మీటర్ల రేసును కేవలం అరవై రెండు సెకన్లలోనే ముగించి రికార్డు సృష్టించింది. ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ‘లూసియానా సీనియర్ గేమ్స్’లో నమోదైన ఈ రికార్డు.. ఒలింపిక్స్ రికార్డునే బద్దలు కొట్టింది. ఈ బామ్మపేరు జూలియా హాకిన్స్. రన్నింగ్ ట్రాక్‌పై ఈమె దూకుడు చూసి, జనాలు ఆమెను ముద్దుగా ‘హరికేన్’గా పిలుచుకుంటున్నారు. ఇదివరకు 100–104 ఏళ్ల వయసు వారికి జరిగిన వందమీటర్ల ‘మిషిగాన్ సీనియర్ ఒలింపిక్స్’ రేసులో జూలియా హాకిన్స్ సాధించిన రికార్డును గత ఏడాది 101 ఏళ్ల డయానే ఫ్రీడ్మాన్ యెనభై తొమ్మిది సెకన్లలో ముగించింది. ఫ్రీడ్మాన్కు ‘ఫ్లాష్’ అనే ముద్దుపేరు ఉంది. ఇదిలా ఉంటే, జూలియా హాకిన్స్ గత రికార్డులు సామాన్యమైనవేమీ కావు. 2019లో 50 మీటర్ల రేసును 46.07 సెకన్లలో పూర్తి చేసిన మొదటి వంద ఏళ్ల వ్యక్తిగా రికార్డు సృష్టించింది. ఇంకో ఆసక్తికరమైన విషయమేమిటంటే, వచ్చే ఏడాది మే 10–23 తేదీల్లో ఫ్లోరిడాలో జరగనున్న నేషనల్ సీనియర్ గేమ్స్‌లో జూలియా హాకిన్స్, డయానే ఫ్రీడ్మాన్ ఒకేసారి రేసులో పాల్గొననున్నారు. హరికేన్ వర్సెస్ ఫ్లాష్ రేసును తిలకించడానికి ఫ్లోరిడా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
Hima Das: స్టార్ అథ్లెట్ హిమా దాస్‌కు కరోనా...
Hima Das Tests Covid-19 Positive: భారత స్టార్ అథ్లెట్ హిమా దాస్ బుధవారం కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. తొడ కండరాల గాయం కారణంగా టోక్యో ఒలిపింక్స్‌కు ఆర్హత సాధించలేకపోయిన హిమా.. ప్రస్తుతం పాటియాలాలోని నేషనల్ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందుతుంది. ఈ క్రమంలో ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణైంది 'నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాను. ఆరోగ్యం బాగానే ఉంది. మునుపటి కంటే బలంగా తిరిగి రావడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలని నేను ఎదురుచూస్తున్నాను. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి. సురక్షితంగా ఉండండి." అని హిమదాస్ ట్వీట్ చేసింది. హిమాదాస్ 2018లో అండర్-20 ప్రపంచ చాంపియన్ షిప్లో 400 మీటర్ల ఈవెంట్లో విజయం సాధించింది. దాంతో ఈ ఈవెంట్లో ప్రపంచ టైటిల్ గెలిచిన తొలి భారతీయ స్ప్రింటర్‌గా రికార్డుల్లో నిలిచింది. ఈక్రమంలోనే హిమా దాస్‌ను అస్సాం ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగంతో గౌరవించింది. చదవండి: T20 World Cup 2021: టీమిండియాలో అనూహ్య మార్పు.. -
సోదరి మరణ వార్త విని తల్లడిల్లిపోయిన భారత ఒలింపియన్
సాక్షి, చెన్నై: టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన తమిళనాడు మహిళా స్ప్రింటర్ ధనలక్షి శేఖర్.. తన సోదరి మరణ వార్త తెలిసి తల్లడిల్లిపోయింది. విశ్వక్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించి స్వస్థలమైన తిరుచ్చి గుండురుకు ఆదివారం తిరిగొచ్చిన ధనలక్ష్మి.. తన ప్రాణానికి ప్రాణమైన అక్క గాయత్రి లేదని తెలిసి బోరున విలపించింది. ధనలక్ష్మి టోక్యోలో ఉండగానే ఆమె సోదరి గుండెపోటుతో మరణించింది. అయితే ధనలక్ష్మి ఎక్కడ డిస్టర్భ్ అవుతుందోనని ఆందోళన చెందిన తల్లి ఉష.. ఆమెకు ఈ వార్తను తెలియనివ్వలేదు. ఒలింపిక్స్‌లో పాల్గొని స్వస్థలానికి తిరిగొచ్చిన సందర్భంగా అక్క రాలేదని ధనలక్ష్మి ఆరా తీయగా.. తల్లి చెప్పిన సమాధానం విని ఆమె దుఃఖాన్ని ఆపుకోలేక బోరున విలపించింది. చదువుల పరంగానే కాకుండా క్రీడా పరంగా కూడా అక్క తనను చాలా ప్రోత్సహించిందని కన్నీటి పర్యంతం అయ్యింది. కాగా, ధనలక్ష్మి.. టోక్యోకు వెళ్లిన 400మీ మిక్స్డ్ రిలే బృందంలో రిజర్వ్ సభ్యురాలిగా ఉన్నారు. ఇదిలా ఉంటే, టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొని స్వస్థలానికి తిరిగొచ్చిన తమిళ క్రీడాకారులకు అభిమానులు, కుటుంబ సభ్యులు సాదర ఆహ్వానం పలికారు. టోక్యో ఒలింపిక్స్‌కు రాష్ట్రానికి చెందిన 10 మంది క్రీడాకారులు అర్హత సాధించారు. అందులో ఐదుగురు అథ్లెటిక్స్ విభాగంలో ఎంపికయ్యారు. వీరంతా తమ శక్తి మేరకు సత్తా చాటినా పతకం మాత్రం దక్కలేదు. -
బూట్లు లేకుండా పరిగెత్తింది.. ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది
న్యూఢిల్లీ: ఐదేళ్ల వయసులో తల్లిదండ్రులను కోల్పోయి, తినడానికి తిండికూడా లేని దుర్భరస్థితిలో నుంచి తారా జువ్వలా దూసుకొచ్చిన తమిళనాడుకు చెందిన 23 ఏళ్ల స్ప్రింటర్ రేవతి వీరమణి.. త్వరలో ప్రారంభంకాబోయే టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆశాకిరణంలా మారింది. ఒలింపిక్స్ శిక్షణ శిబిరంలో ప్రియా మోహన్, పూవమ్మ, వీకే విస్మయ, జిస్నా మాథ్యూలు ఫామ్‌లో లేకపోవడంతో 400 మీటర్ల మిక్స్డ్ రిలే జట్టులో ముగ్గురు మహిళా రన్నర్ల కోసం అథ్లెటిక్స్ సమాఖ్య సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించింది. ఇందులో 53.55 సెకన్ల వ్యక్తిగత అత్యుత్తమ సమయంలో అగ్రస్థానంలో నిలిచిన రేవతి.. ఒలింపిక్స్ రిలే జట్టులో స్థానం దక్కించుకుంది. 2019 వరకు కన్నన్ వద్ద శిక్షణ పొందిన రేవతి అనంతరం పటియాలలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)లో జాతీయ శిబిరానికి ఎంపికైంది. అప్పటివరకు 100, 200 మీ.లలో పరిగెత్తిన ఆమె.. ఎన్ఐఎస్ కోచ్ గలినా బుఖారియా సలహాతో 400మీ.కు మారింది. 2019 ఫెడరేషన్ కప్‌లో 200 మీటర్ల విభాగంలో సిల్వర్ మెడల్ నెగ్గిన రేవతి.. ఇండియన్ గ్రాండ్ ప్రీ 5,6లో 400 మీ.లో స్వర్ణ పతకాలు గెలిచింది. అనంతరం 2021లో జరిగిన గ్రాండ్‌ప్రీ-4లో 400 మీ. విజేతగా నిలిచింది. ఇదిలా ఉంటే, రేవతి తల్లిదండ్రులు ఆమె చిన్నతనంలోనే అనారోగ్యంతో మరణించారు. దాంతో మధురైలో నివసించే అమ్మమ్మ వద్దకు రేవతి, ఆమె చెల్లెలు చేరారు. స్కూల్లో ఉన్న సమయంలో పరుగులో రేవతి ప్రతిభను గమనించిన తమిళనాడు స్పోర్ట్స్ డెవల్‌పమెంట్ అథారిటీ కోచ్ కన్నన్ ఆమె నైపుణ్యాలకు మెరుగులు దిద్దాడు. అంతేకాదు మధురైలోని లేడీ డాక్ కాలేజీలో ఆమెకు సీటుతోపాటు, హాస్టల్ వసతి లభించేలా సాయం చేశాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో బూట్లు లేకుండానే ప్రాక్టీస్ చేసిన రేవతి.. అనేక కాలేజీ మీట్లతో పాటు 2016 జూనియర్ నేషనల్స్‌లో ఉత్తి కాళ్లతోనే పరుగెత్తి విజయాలు సాధించింది. -
ఈ స్ఫూర్తితో టోక్యో బెర్త్ పట్టేస్తా: ద్యుతీ చంద్
న్యూఢిల్లీ: ‘అర్జున అవార్డు’ తనకు సరైన సమయంలో లభించిందని... ఈ పురస్కారం స్ఫూర్తితో వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ను పట్టేస్తానని భారత మహిళా స్ప్రింటర్ ద్యుతీ చంద్ ఆశాభావం వ్యక్తం చేసింది. గత శుక్రవారం కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ క్రీడా పురస్కారాల్లో ద్యుతీ చంద్ ‘అర్జున అవార్డు’కు ఎంపికైంది. ఒడిషాకు చెందిన 24 ఏళ్ల ద్యుతీ చంద్ ఇప్పటి వరకు మహిళల 100 మీటర్ల ఒలింపిక్ అర్హత మార్కును (11.15 సెకన్లు) అందుకోలేకపోవడంతో... ఆమె టోక్యో ఒలింపిక్స్ ఎంట్రీ అనుమానంగానే ఉంది. (చదవండి: ఇంగ్లండ్‌తో సిరీస్‌పై క్లారిటీ ఇచ్చిన దాదా) ‘అర్జున అవార్డు నాకు సరైన సమయంలో లభించింది. ప్రభుత్వం నుంచి లభించే ఏ గుర్తింపు అయినా సరే అథ్లెట్‌లోని అత్మవిశ్వాసాన్ని పెంచేలా ఉంటుంది. ప్రస్తుతం నా విషయంలోనూ అదే జరిగింది. ప్రభుత్వం నన్ను గుర్తించిందనే భావన నాలో కొత్త శక్తినిచ్చింది. ఒలింపిక్ అర్హత మార్కు కష్టంగా ఉన్నా సరే... నేను సాధించి తీరుతా’ అని ద్యుతీ పేర్కొంది. 2018 ఆసియా క్రీడల్లో 100 మీటర్లు, 200 మీటర్ల రేసుల్లో రజత పతకాన్ని సాధించిన ఆమె... 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినా హీట్స్‌ను దాటి ముందుకెళ్లలేకపోయింది. (చదవండి: బ్యాలెన్స్ నిల్) -
‘టోక్యో’లో పాల్గొంటా: స్ప్రింటర్ శ్రాబణి
న్యూఢిల్లీ: ఎలాగైనా టోక్యో ఒలింపిక్స్ 100, 200 మీటర్ల ఈవెంట్లలో పాల్గొనడమే తన లక్ష్యమంటోంది భారత స్ప్రింటర్ శ్రాబణి నందా. ఈ ఏడాది ఆరంభం నుంచే జమైకాలో తన శిక్షణను కొనసాగిస్తోన్న శ్రాబణి... రియో ఒలింపిక్స్‌లో 200 మీటర్ల పరుగులో హీట్స్‌లో ఆరో స్థానంతో నిష్క్రమించింది. 100, 200 మీటర్ల పరుగు ఈవెంట్లకు టోక్యో అర్హత ప్రమాణం వరుసగా 11.15 సెకన్లు; 22.80 సెకన్లు కాగా... శ్రాబణి అత్యుత్తమ ప్రదర్శన ఈ రెండింట్లో వరుసగా 11.45 సెకన్లు, 23.07 సెకన్లుగా ఉంది. 29 ఏళ్ల శ్రాబణి ఈ వారం మొదట్లో కింగ్‌స్టన్‌లో జరిగిన వెలాసిటీ ఫెస్ట్ ఈవెంట్లో 100 మీటర్లలో పోటీపyì మూడో స్థానం పొందింది. -
లాక్డౌన్: లగ్జరీ కారును అమ్మకానికి పెట్టిన అథ్లెట్
భువనేశ్వర్ : భారత అగ్రశేణి స్పింటర్ ద్యుతీ చంద్ విలువైన బీఎండబ్ల్యూ కారును అమ్మేందుకు సిద్ధపడ్డారు. కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా శిక్షణ ఖర్చులు తీర్చేందుకు బీఎండబ్ల్యూ కారును సోషల్ మీడియాలో అమ్మకానికి పెట్టారు. ఈ విషయాన్ని ద్యుతీనే ఫేస్బుక్లో వెల్లడించారు. ‘నా లగ్జరీ బీఎండబ్ల్యూ కారును అమ్మాలనుకుంటున్నాను. ఎవరైనా కొనాలి అనుకుంటే నాకు మెసేంజర్‌లో సంప్రదించండి’ అంటూ కారుకు చెందిన ఫోటోలను పోస్టులో పెట్టారు. అయితే ఫేసుబుక్‌లో పోస్ట్ పెట్టిన తర్వాత ఆమెకు సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో తరువాత ఆ పోస్టును స్పింటర్ రాణి డిలీట్ చేశారు. కాగా ద్యుతీ 2015 బీఎండబ్ల్యూ3- సిరీస్ మోడల్‌ను కలిగి ఉన్నారు. ఆమె దానిని 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. (‘నన్ను రావద్దనే సందేశం వచ్చింది’) ఈ విషయంపై ఓ జాతీయ మీడియా ముందు ద్యుతీ మాట్లాడుతూ.. ‘టోక్యో ఒలింపిక్స్ శిక్షణ కోసం ప్రభుత్వం రూ .50 లక్షలు మంజూరు చేసింది. కోచ్, ఫిజియోథెరపిస్ట్స్, డైటీషియన్‌తోపాటు ఇతర ఖర్చులు కలిపి నాకు నెలకు అయిదు లక్షల రూపాయలు ఖర్చు అవుతోంది. ఇప్పడు నా డబ్బులన్నీ అయిపోయాయి. కరోనా మహమ్మారి కారణంగా ఏ స్పాన్సర్ నా కోసం ఖర్చు చేయడానికి సిద్ధంగా లేడు. కానీ నేను టోక్యో ఒలింపిక్ కోసం సిద్ధమవుతున్నాను. నా ఫిట్నెస్, జర్మనీలో శిక్షణ కోసం నాకు డబ్బు కావాలి. నా శిక్షణ, డైట్ ఖర్చులను తీర్చడానికి దీనిని అమ్మేయాలని నిర్ణయించుకున్నాను. మా ఇంట్లో మూడు కార్లు ఉన్నాయి. కావున ఒక కారు అమ్మాలనుకుంటున్నాను’ అని తెలిపారు. అయితే ఆ కారు తనకు బహుమతిగా లభించిందా అని ప్రశ్నించగా. తను స్వయంగా కొనుగోలు చేసినట్లు ద్యుతీ వెల్లడించారు. (ఫుట్‌బాల్ లెజెండ్ కన్నుమూత) -
వివాదంలో వరల్డ్ చాంపియన్
న్యూయార్క్: ప్రపంచ 100 మీ. స్ప్రింట్ చాంపియన్, అమెరికన్ స్టార్ క్రిస్టియాన్ కోల్‌మన్‌పై సస్పెన్షన్ వేటు పడింది. డోపింగ్ టెస్టుకు పిలిచినపుడు అందుబాటులోకి రాకపోవడంతో అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) అతనిపై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ విషయంపై తుది విచారణ పూర్తయ్యే వరకు అతను ఎలాంటి పోటీల్లో పాల్గొనరాదని ఆదేశించింది. గత ఏడాదే అతను ‘ఎప్పుడు ఎక్కడ’ నిబంధనను పాటించకపోవడంతో చర్య తీసుకోవాలనుకున్నప్పటికీ ప్రపంచ చాంపియన్‌షిప్ కావడంతో ఏఐయూ కాస్త వెనుకంజ వేసింది. అయితే గడిచిన 12 నెలల కాలంలో మూడుసార్లు టెస్టులకు ప్రయత్నించినా...తాను ఎక్కడున్నాడనే సమాచారాన్ని కోల్మన్ ఇవ్వకపోవడంతో తాజాగా చర్యలు తీసుకున్నారు. దీనిపై కోల్మన్ స్పందిçస్తూ గత డిసెంబర్ 9న ఏఐయూ నుంచి ఫోన్ కాల్ వచ్చినప్పటికీ తను క్రిస్మస్ షాపింగ్‌లో బిజీగా ఉండటం వల్లే కాల్‌కు స్పందించలేకపోయానని ట్వీట్ చేశాడు. ఈ ఒక్క ఫోన్ కాల్కే తనను సస్పెండ్ చేయడం విడ్డూరమని అన్నాడు. దీనిపై ఏఐయూ మాట్లాడుతూ పలుమార్లు ప్రయత్నించినా టెస్టులు చేసుకునేందుకు అతను అందుబాటులో లేకపోవడంతోనే ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిబంధనల మేరకే చర్యలు తీసుకున్నామని తెలిపింది. -
‘ఖేల్‌రత్న’కు హిమదాస్
న్యూఢిల్లీ: భారత యువ స్ప్రింటర్ హిమదాస్ ప్రతిష్టాత్మక ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’ అవార్డు బరిలో నిలిచింది. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ‘ఖేల్‌రత్న’ కోసం 20 ఏళ్ల హిమదాస్ పేరును కేంద్ర క్రీడాశాఖకు అస్సాం ప్రభుత్వం సిఫారసు చేసింది. దీంతో ఈ ఏడాది ఈ అవార్డు బరిలో నిలిచిన పిన్న వయస్కురాలిగా హిమ ఘనత వహించింది. 2018లో అద్భుతంగా రాణించిన హిమ.... ఫిన్లాండ్లో జరిగిన అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్ 400మీ.ఈవెంట్లో స్వర్ణం గెలిచి అంతర్జాతీయ స్థాయిలో ఏ పోటీల్లోనైనా అగ్రస్థానం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచింది. ఇదే చాంపియన్‌షిప్‌లో 4్ఠ400 రిలేలో మరో స్వర్ణం, మిక్స్డ్ రిలేలో రజతం ఆమె ఖాతాలో చేరాయి. ఆ తర్వాత 2018 జకార్తా ఆసియా క్రీడల్లో 4్ఠ400మీ. మహిళల రిలేలో పసిడిని గెలుపొందింది. ప్రస్తుతం ఆమె ఈ అవార్డు కోసం నీరజ్ చోప్రా (జావెలిన్ త్రోయర్), వినేశ్ ఫొగాట్ (రెజ్లర్), మనికా బత్రా (టీటీ), రాణి రాంపాల్ (హాకీ), రోహిత్ శర్మ (క్రికెట్)లతో పోటీపడనుంది. -
ద్యుతీ యూఆర్ ట్రూ చాంపియన్: తెలుగు డైరెక్టర్
హైదరాబాద్ : అమ్మాయితో సహజీవనం చేస్తున్నాని ప్రకటించిన భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్‌పై టాలీవుడ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ప్రశంసలు కురిపించాడు. ద్యుతీ చంద్‌పై ప్రముఖ స్పోర్ట్స్ చానెల్ రాసిన కథనాన్ని ప్రస్తావిస్తూ రాహుల్.. ద్యుతీని కొనియాడాడు. అయితే మూడు రోజుల క్రితమే తన రిలేషన్ గురించి ద్యుతీ బాహటంగా ప్రకటించినప్పటికీ.. మూడేళ్ల క్రితమే ఈ విషయాన్ని తమకు తెలిపినట్లు సదరు స్పోర్ట్స్ చానెల్ పేర్కొంది. ప్రేమకు జెండర్‌తో పనిలేదని, మనసులు కలిస్తే చాలని 2016లోనే ద్యుతీ చెప్పినట్లు ఆ కథనంలో పేర్కొంది. అప్పటికి భారత్‌లో స్వలింగ సంపర్కం నేరమని, అయినా తన సహచర్యం గురించి తెలిపిందని ప్రస్తావించింది. ఆమె తన ఆట కోసం ఎదుర్కొన్న ఒడిదుడుకులను కూడా వివరించింది. ఈ కథనానికి ముగ్ధుడైన రాహుల్.. ట్విటర్ వేదికగా ద్యుతీని ఆకాశానికెత్తాడు. ఈ కథనం చాలా స్పూర్తిదాయకంగా ఉందని, ఆమె తనకు ఎదురైన సమస్యలను అధిగమించి పోటీలో నిలవడం గొప్ప విషయమని, ‘ద్యుతీ యూ ఆర్ ట్రూ చాంపియన్’ అంటూ రాహుల్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం రాహుల్.. కింగ్ నాగర్జున హీరోగా మన్మథుడు-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 2002లో కె. విజయభాస్కర్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన ‘మన్మథుడు’ చిత్రానికి ఇది సీక్వెల్ అని తెలిసిందే. ఇక ద్యుతీ సహజీవనాన్ని ఆమె కుటుంబీకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ద్యుతీ తల్లి, సోదరి మీడియా వేదికగా ఆమెను తప్పుబడుతూ కెరీర్ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ద్యుతీ మాత్రం ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, తన ప్రియురాలితో బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. If you’re reading something today.. let it be this. Very very inspiring. Imagine all that this girl has had to go through before the tender age of 23. And yet she found the resolve to step out and compete. Uncommon courage. You’re a true champion @DuteeChand 🙏🏽🙏🏽🙏🏽 https://t.co/xmZuICXzM1 — Rahul Ravindran (@23_rahulr) May 22, 2019 -
మా అక్కే బ్లాక్మెయిల్ చేసింది: ద్యుతీ చంద్
భువనేశ్వర్ : బంధువైన ఓ టీనేజర్‌తో సహజీవనం చేస్తున్నానని సంచలన ప్రకటన చేసిన భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్‌పై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆమె బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని, బిడ్డలాంటి అమ్మాయితో సహజీవనం ఏంటని ద్యుతీ తల్లి అఖోజీ చంద్ ప్రశ్నించగా.. ద్యుతీని భయపెట్టి, బ్లాక్మెయిల్ చేయడం వల్లే అలా మాట్లాడుతుందని ఆమె సోదరి సరస్వతి చంద్ ఆరోపించారు. అయితే తన కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయిన ఈ విషయంలో వెనక్కు తగ్గే ముచ్చటే లేదని ద్యుతిచంద్ మరోసారి స్పష్టం చేసింది. తన కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ మంగళవారం మీడియాతో మాట్లాడింది. తనను ఎవరు బ్లాక్మెయిల్ చేయలేదని, తన అక్కనే రూ.25లక్షలు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేసిందని బాంబుపేల్చింది. ‘నా సొంత అక్కనే నన్ను బ్లాక్ మెయిల్ చేసింది. రూ. 25 లక్షలు ఇవ్వాలని నన్ను అడిగింది. ఇవ్వకపోవడంతో కొట్టింది కూడా. ఈ విషయంపై నేను పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను. ఇప్పటికీ మా అక్క బెదిరిస్తూనే ఉంది. దీంతోనే నేను నా బంధాన్ని నలుగురికి చెప్పుకోవాల్సి వచ్చింది’ అని పేర్కొంది. ‘ఔను... నేను 19 ఏళ్ల టీనేజ్ అమ్మాయితో సహజీవనం చేస్తున్నా. ఆమె నా బంధువు. మా ఊర్లోనే ఉంటుంది. భువనేశ్వర్ కాలేజిలో బీఏ రెండో సంవత్సరం చదువుతోంది. నేనెప్పుడు ఊరెళ్లినా ఆమెతోనే గడుపుతాను. ఆమెకూ సహజీవనం ఇష్టం కాబట్టే మా బంధం కొనసాగుతోంది. భవిష్యత్తులోనూ ఆమెతోనే నా జీవితం ముడిపడుతుంది’ అని 23 ఏళ్ల ద్యుతీ బాహటంగా స్వలింగ సహజీవనంపై పెదవి విప్పింది. బిడ్డలాంటి ఆమెతో సహజీవనమా? ద్యుతీ తల్లి ఫైర్ అమ్మాయితో సహజీవనం చేస్తున్నా: ద్యుతీ చంద్ ‘ద్యుతీ చంద్ ప్రమాదంలో ఉంది’ -
బిడ్డలాంటి ఆమెతో సహజీవనమా? ద్యుతీ తల్లి ఫైర్
న్యూఢిల్లీ : బంధువైన ఓ టీనేజర్‌తో సహజీవనం చేస్తున్నానని సంచలన ప్రకటన చేసిన భారత రన్నర్ ద్యుతీ చంద్‌పై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ద్యుతీని బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి అలా చెప్పించారని ఆమె సోదరి ఆరోపించగా.. గే సెక్స్‌ను అంగీకరించేది లేదని ద్యుతీ తల్లి అఖోజీ చంద్ కరాఖండిగా చెప్పారు. ద్యుతీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి నాకు మనవరాలు అవుతుంది. నా మేనకోడలు కూతురు ఆమె. ఆ అమ్మాయికి ద్యుతీ తల్లిలాంటిది. అలాంటి ఆమెతో పెళ్లి ఎలా సాధ్యమవుతోంది. ఇది ఒడిశా సమాజం ఎలా అంగీకరిస్తోంది. ఈ బంధాన్ని అంగీకరించనని ద్యుతీకి నేను గట్టిగా చెప్పాను. దీనికి ఆమె హైకోర్టు అనుమతిచ్చిందని తెలిపింది. నేను బతికుండాగానే నీవు కోర్టు ఆదేశాలు పాటిస్తున్నావా?అని అడిగాను. దీనికి అవును.. కోర్టు అనుమతి ఉంది. నీవు సపోర్ట్ చేసినా చేయకపోయినా పర్లేదు.. నాకు సహాయక సిబ్బంది మద్దతు ఉందని పేర్కొంది. నేను ఏవరు సపోర్ట్ చేస్తున్నారని అడిగాను. దీనికి ఆమె వారి మద్దుతుతో ఏమైనా చేస్తానని చెప్పింది. నేను వారితో ఒకసారి మాట్లాడుతానని చెప్పాను. దీనికి ఆమె అంగీకరించలేదు. దీంతో నేను నా పెద్ద కూతురిని వారి దగ్గరకు తీసుకెళ్లమన్నాను. మేం వారి దగ్గరికి వెళ్లేసరికే వారు అక్కడ లేరు. ద్యుతీ ఆటపై దృష్టి పెట్టడమే నాకు ప్రభుత్వానికి కావాల్సింది. దేశం కోసం ఆడుతున్న ద్యుతీకి రాష్ట్ర ప్రభుత్వం చాలా డబ్బు ఇచ్చింది. ద్యుతీ వారి తల్లిదండ్రుల పేరు నిలబెట్టకపోయినా పర్లేదు.. కానీ తన ఆటద్వారా దేశ గౌరవాన్ని మాత్రం కాపాడాలి.’ అని అఖోజీ చంద్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చినప్పటికీ తమ గ్రామం మాత్రం ఇలాంటి బంధాలను అంగీకరించదని ద్యుతీ బంధువు ఒకరు అభిప్రాయపడ్డారు. అమ్మాయితో సహజీవనం చేస్తున్నా: ద్యుతీ చంద్ -
‘ద్యుతీ చంద్ ప్రమాదంలో ఉంది’
న్యూఢిల్లీ: ఓ టీనేజ్ అమ్మాయితో సహజీవనం చేస్తున్నట్లు భారత మహిళా రన్నర్ ద్యుతీ చంద్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో సహజీవనంపై బాహాటంగా అంగీకరించిన తొలి భారత అథ్లెట్‌గా ద్యుతీ నిలిచింది. ఈ విషయమై తన కుటుంబంలో కలతలు చెలరేగాయని కూడా ఆమె చెప్పింది. ‘ఔను... నేను 19 ఏళ్ల టీనేజ్ అమ్మాయితో సహజీవనం చేస్తున్నా. ఆమె నా బంధువు. మా ఊర్లోనే ఉంటుంది. భువనేశ్వర్ కాలేజిలో బీఏ రెండో సంవత్సరం చదువుతోంది. నేనెప్పుడు ఊరెళ్లినా ఆమెతోనే గడుపుతాను. ఆమెకూ సహజీవనం ఇష్టం కాబట్టే మా బంధం కొనసాగుతోంది. భవిష్యత్తులోనూ ఆమెతోనే నా జీవితం ముడిపడుతుంది’ అని బాహాటంగానే వెల్లడించింది. తమ సహజీవనం పట్ల తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా... అక్క మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందని, తనను ఇలాంటి పనులు మానుకోకపోతే జైలుకు పంపిస్తానని బెదిరించిందని వెల్లడించింది. ఆమె అన్నట్లుగానే ద్యుతీ సోదరి సరస్వతీ చంద్ మీడియా వేదికగా ద్యుతీ సహజీవనాన్ని వ్యతిరేకించింది. ద్యుతీ చంద్‌ను ఆ అమ్మాయి, వారి కుటింబీకులు బెదిరించారని, పెళ్లిచేసుకోవాలని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించింది. అంతేకాకుండా ఆమె ఆస్తిపై కన్నేశారని, ద్యుతీని ఆట నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొంది. ఈ వ్యవహారంతో ద్యుతీ జీవితం ప్రమాదంలో పడిందని అథ్లెట్ అయిన సరస్వతీ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రమాదంలో ఉన్న తన సోదరికి ప్రభుత్వమే రక్షణ కల్పించాలని కోరింది. ద్యుతీ బంధానికి మద్దతుగా నిలుస్తారా? అన్న ప్రశ్నకు .. ‘అమె అడల్ట్. ఏ నిర్ణయమైనే తీసుకునే హక్కు ద్యుతీకి ఉంది. అబ్బాయా? అమ్మాయా? ఎవరినైనా ఆమె ఇష్టం ప్రకారం పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఒకరు బలవంతం పెట్టడం వల్ల ద్యుతీ ఇదంతా మాట్లాడుతుంది. ద్యుతీ విజయం కోసం కృషి చేసిన వారంత ఆమెకు ఇప్పుడు ఆపరాధులుగా కనిపిస్తున్నారు. 2020 ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్‌లపై దృష్టి పెట్టకుండా ప్రత్యర్థులు పన్నిన కుట్రలో ద్యుతీ ఇరుక్కుంది. ఆమె విజయాలు సాధించినప్పుడు ద్యుతీతో పాటు కుటుంబసభ్యులు మన్ననలు పొందారు. పిల్లలు విజయాలు సాధిస్తే వారితో పాటు వారి తల్లిదండ్రులకు పేరు వస్తుంది. అదే తప్పుచేస్తే.. కుటుంబమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.’ అని సరస్వతి ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మాయితో సహజీవనం చేస్తున్నా: ద్యుతీ చంద్ -
ఆమెతో రిలేషన్షిప్లో ఉన్నా : ద్యుతీచంద్
భువనేశ్వర్ : తన స్నేహితురాలితో రిలేషన్షిప్లో ఉన్నానంటూ భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ సంచలన ప్రకటన చేశారు. తద్వారా స్వలింగ సంపర్కురాలిననే విషయాన్ని బయటపెట్టిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచారు. ఒడిశాలోని తన సొంత గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో జీవితాన్ని పంచుకోబోతున్నట్టు పేర్కొన్న ద్యుతీ.. కొన్ని అనివార్య కారణాల దృష్ట్యా ప్రస్తుతానికి ఆమె పూర్తి వివరాలు వెల్లడించలేనన్నారు. ఈ విషయం గురించి ద్యుతి మాట్లాడుతూ.. ‘ నా సోల్‌మేట్‌ను కనుగొన్నాను. తమకు నచ్చిన వ్యక్తిని ప్రేమించే, వారితో జీవితాన్ని పంచుకునే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంటుంది. స్వలింగ సంపర్కుల హక్కులు కాపాడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటా. ప్రేమను తప్పుబట్టే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పింది(సెక్షన్ 377ను ఉద్దేశించి). అథ్లెట్‌ను అయినంత మాత్రాన నా నిర్ణయాన్ని ఎవరూ జడ్జ్ చేయాల్సిన పనిలేదు. ఇది పూర్తిగా నా వ్యక్తిగత అంశం. అందరూ నా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నా. గత పదేళ్లుగా స్ప్రింటర్‌గా భారత్‌కు ఎన్నో విజయాలు అందించాను. మరో ఐదేళ్ల దాకా రాణిస్తాననే నమ్మకం ఉంది. నా క్రీడా ప్రయాణానికి సహకరిస్తూ.. జీవితాంతం తోడుండే వ్యక్తిని ఎంచుకున్నా. ప్రస్తుతం వరల్డ్ చాంపియన్‌షిప్, ఒలంపిక్ క్రీడలపైన దృష్టి సారించాను. ఆటల నుంచి విరామం తీసుకున్న తర్వాత పూర్తి సమయం తనకే కేటాయించి.. జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నాను అని పేర్కొంది. కాగా పేదరికాన్ని జయించి ‘ట్రాక్’ బాట పట్టిన ద్యుతిలో పురుషత్వ లక్షణాలున్నాయని నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తీవ్రంగా కలత చెందిన ఈ ఒడిషా అథ్లెట్ ఆర్బిట్రేషన్ కోర్టులో పోరాడి గెలిచింది. ఇక గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో ద్యుతీ 100 మీ., 200 మీ. పరుగులో రెండు రజతాలు నెగ్గిన సంగతి తెలిసిందే. సెక్షన్ 377..సంచలన తీర్పు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన సెక్షన్ 377పై గతేడాది సెప్టెంబరులో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. సమానత్వపు హక్కును హరిస్తున్న ఈ సెక్షన్‌లోని పలు వివాదాస్పద నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మైనార్టీ తీరిన ఇద్దరు పరస్పర అంగీకారంతో ప్రైవేటు ప్రదేశంలో స్వలింగ శృంగారంలో పాల్గొనడం ఇకపై ఏమాత్రం నేరం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ‘స్వలింగ సంపర్కం హేతుబద్ధం కాదని, సమర్థించలేమని, నిరంకుశమని ఐపీసీ సెక్షన్ 377లోని నిబంధనలు చెబుతున్నాయి. అయితే బ్రిటీష్ కాలంనాటి 158 ఏళ్ల నాటి ఈ నిబంధన సరికాదు. సమాజంలో ఎల్జీబీటీక్యూ (లెస్పియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వీర్)లు దేశంలోని మిగిలిన పౌరుల్లాగే అన్ని రాజ్యాంగబద్ధమైన హక్కులను పొందవచ్చు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. సెక్షన్ 377 సమాజంలో వేళ్లూనుకుపోయిన పాతతరం ఆలోచనలకు ప్రతిరూపమని జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాలు సభ్యులుగా ఉన్న ధర్మాసనం పేర్కొంది. -
హిమదాస్‌కు ఐఓసీలో ఉద్యోగం
గువాహటి: స్ప్రింట్ సంచలనం హిమదాస్‌కు ప్రభుత్వ చమురు కంపెనీ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఉద్యోగం ఇచ్చింది. అంతర్జాతీయ పోటీల్లో హిమ నిలకడగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే జరిగిన ఆసియా క్రీడల్లో రిలేలో స్వర్ణం సహా మూడు పతకాలు గెలుచుకుంది. ఆమె సాధించిన ఘన విజయాలకు ప్రోత్సాహంగా తమ సంస్థ మానవ వనరుల (హెచ్ఆర్) విభాగంలో గ్రేడ్ ‘ఎ’ ఆఫీసర్ ఉద్యోగం ఇచ్చినట్లు ఐఓసీ చీఫ్ జనరల్ మేనేజర్ ఉత్తియ భట్టాచార్య తెలిపారు. హిమదాస్‌కు ఉన్నతస్థాయి వేతన భత్యాలతో పాటు ఆమె పాల్గొనే ఈవెంట్ల కోసం ప్రయాణ, బస ఏర్పాట్లకయ్యే ఖర్చును తమ సంస్థే భరిస్తుందని ఆయన చెప్పారు. హిమ ఘనతను గుర్తించిన కేంద్రప్రభుత్వం ఇటీవల అర్జున అవార్డు కూడా బహూకరించింది. -
ఫుట్‌బాల్ ప్లేయర్‌గా షాకిచ్చిన బోల్ట్
సాక్షి, స్పోర్ట్స్ : జమైకా చిరుత.. స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ఫుట్‌బాల్ ఆటగాడిగా మారి అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చాడు. నెక్స్ట్జర్నీ హాష్‌ట్యాగ్‌తో బోల్ట్ చేసిన ట్వీట్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇంతకీ విషయమేమిటంటే.. జర్మన్ ఫుట్‌బాల్ టీమ్ బొరష్యా డార్ట్మండ్ చారిటీ కోసం ఉద్దేశించిన వార్మప్ మ్యాచ్‌లో బోల్ట్ పాల్గొన్నాడు. అనుభవమున్న ఆటగాడిలా రెండు గోల్స్ చేసి సహచరులను, అభిమానులను ఆశ్చర్యపరిచాడు. పెనాల్టీ కిక్, హెడర్ ద్వారా గోల్ చేసి ఫుట్‌బాల్ ఆటగాళ్లకి షాక్ ఇచ్చాడు. ప్రపంచ కప్ విన్నర్ మారియో గాట్జ్తో తలపడి మరీ గోల్ చేయడం విశేషం. తన ప్రదర్శన చూసి డార్ట్మండ్ టీమ్ క్లబ్ తనతో కాంట్రాక్ట్ చేసుకుంటుందోమో అంటూ బోల్ట్ సరాదాగా వ్యాఖ్యానించాడు. మ్యాచ్ అయిపోగానే అభిమానులతో పాటు, ఫుట్‌బాల్ ఆటగాళ్లు కూడా బోల్ట్ ఆటోగ్రాఫ్ కోసం పోటీపడ్డారు. డార్ట్మండ్ టీమ్ స్పాన్సర్ ‘పూమా’ తో ఉన్న ఒప్పందం కారణంగా ఈ మ్యాచ్‌లో పాల్గొని ప్రచారం కల్పించాల్సిందిగా కోరటంతో బోల్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా అవతారమెత్తాడు. జూన్‌లో జరిగే మరో చారిటీ మ్యాచ్‌లో కూడా బోల్ట్ పాల్గొననున్నాడు. ఎనిమిది ఒలంపిక్ స్వర్ణ పతకాలు సాధించిన బోల్ట్ వరల్డ్ చాంపియన్ షిప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. New Levels #NextJourney pic.twitter.com/aeOilbnSq9 — Usain St. Leo Bolt (@usainbolt) March 23, 2018 -
ద్యుతీ 'పరుగు' ముగిసింది!
రియో డీ జనీరో:దాదాపు మూడు దశాబ్దాల తరువాత ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఇటీవల సరికొత్త చరిత్ర సృష్టించిన స్ప్రింటర్ ద్యుతీచంద్.. రియో ఒలింపిక్స్ సెమీ ఫైనల్ రేసుకు క్వాలిఫై కావడంలో విఫలమైంది. తొలి రౌండ్ లో భాగంగా భారతకాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున జరిగిన 100 మీటర్ల రేసులో ద్యుతీ చంద్ ఏడో స్థానంలో నిలిచి రియో నుంచి నిష్క్రమించింది. హీట్ -5లో జరిగిన ఈ రేసును ద్యుతీచంద్ 11.69 సెకెండ్లలో ముగించి సెమీస్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఒక్కో హీట్ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే సెమీస్ కు అర్హత సాధించే అవకాశం ఉండటంతో భారత పెట్టుకున్న ఆశలకు ఆదిలోనే బ్రేక్ పడింది. అంతకుముందు పురుషుల 400 మీటర్ల ఈవెంట్లో భారత స్ప్రింటర్ మొహ్మద్ అనాస్ కూడా నిరాశపరిచాడు. ఈ రేసును 45. 95 సెకెండ్లలో పూర్తి చేసి ఆరోస్థానంలో నిలవడం ద్వారా సెమీస్‌కు అర్హత సాధించడంలో విఫలం చెందాడు. మరోవైపు లాంగ్ జంప్‌లో అంకిత్ శర్మ సైతం నిరాశపరిచాడు. ఈ ఈవెంట్లో 24వ స్థానంలో నిలిచిన అంకిత్ తదుపరి రౌండ్‌కు అర్హత సాధించలేకపోయాడు. -
చివర్లో వేగంపైనే దృష్టి: ద్యుతీ చంద్
బెంగళూరు: రేసు చివర్లో తన వేగాన్ని మరింతగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నానని రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్ చెప్పింది. ముఖ్యంగా ఆఖరి 40 మీటర్లలో వేగం పెంచుకోవడంపై ప్రత్యేకంగా దృష్టిసారించానని తెలిపింది. ‘తొలి 60 మీటర్లలో నా వేగం బాగుంది. కానీ చివరికి వచ్చేసరికి వేగం మందగిస్తోంది. ఇప్పుడు ఆ వేగాన్ని కూడా మెరుగుపర్చుకోవాలి. దాని కోసం బాగా శ్రమిస్తున్నా. మా కోచ్ రమేశ్ సర్ కూడా దీనిపై ఎక్కువగా దృష్టిపెట్టారు’ అని ద్యుతీ పేర్కొంది. కాలం మారుతున్న కొద్దీ ఒలింపిక్స్‌లో పతకం నెగ్గడం అంత సులువు కాదని వెల్లడించింది. అథ్లెట్ల ప్రదర్శన మెరుగుపడుతున్నా... పోటీ బాగా పెరిగిపోయిందని ఈ ఒడిషా అథ్లెట్ వెల్లడించింది. గతేడాది బీజింగ్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విక్టోరియా జైబికినా (కజకిస్తాన్)తో పోటీపడటం తనకు బాగా కలిసొచ్చిందని చెప్పింది. మరోవైపు ద్యుతీలో పోరాట స్ఫూర్తి అమోఘమని ఆమె కోచ్ నాగపూరి రమేశ్ అన్నారు. జీవితంలో ఎదుర్కొన్న ఎత్తుపల్లాలే ఆమెను ఉన్నత శిఖరాలకు చేర్చాయన్నారు. తన 20 ఏళ్ల కోచింగ్ కెరీర్లో ద్యుతీలాంటి అథ్లెట్‌ను చూడలేదని చెప్పిన కోచ్.. శిక్షణ కంటే పోటీల్లో బరిలోకి దిగడాన్నే ద్యుతీ ఎక్కువగా ఇష్టపడుతుందని చెప్పారు. -
రికార్డు పరుగుతో రియోకు గురి!
న్యూఢిల్లీ: భారత స్ప్రింటర్ మొహ్మద్ అనాస్ సరికొత్త రికార్డు సృష్టించాడు. పొలిష్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో భాగంగా రెండో రోజు జరిగిన పోరులో సత్తా చాటిన అనాస్ జాతీయ రికార్డు నెలకొల్పాడు. పురుషుల విభాగంలో 400 మీటర్ల రేసును 45.40 సెకండ్లలో పూర్తి చేసిన అనాస్ జాతీయ రికార్డు సాధించాడు. దీంతో తన రికార్డును అనాస్ సవరించుకోవడమే కాకుండా రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు. అంతకుముందు ఇదే ఈవెంట్లో తొలిరోజు జరిగిన పోటీలో అనాస్ 45.44 సెకెండ్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి జాతీయ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఇదే ఈవెంట్ లో మరో స్ప్రింటర్ రాజీవ్ అరోకియా (45.47 సెకెండ్లు) సాధించిన జాతీయ రికార్డు బద్దలైంది. గత ఏప్రిల్‌లో ఢిల్లీలో జరిగిన ఫెడరేషన్ కప్ జాతీయ అథ్లెట్ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల రేసును 45. 74 సెకెండ్లలో పూర్తి చేసిన అనాస్ రజత పతకం సాధించాడు. మరోవైపు మొహ్మద్ అనాస్‌తో పాటు అంకిత్ శర్మ, అతాను దాస్, శ్రబాణి నందాలు తమ విభాగాల్లో రియోకు అర్హత సాధించారు. మహిళల 200 మీటర్ల పరుగులో శ్రబాని నందా, లాంగ్ జంప్‌లో అంకిత్ శర్మ, ఆర్చరీలోలో అతాను దాస్‌లు రియోకు అర్హత సాధించిన వారిలో ఉన్నారు. భారత క్రీడాకారిణి ద్యుతీ చంద్ రియోకు అర్హత సాధించిన తరువాత రోజే మరో నలుగురు భారత అథ్లెట్స్ ఆ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించడం విశేషం. -
ద్యుతీ...మన చిరుత
► 100 మీటర్లలో ద్యుతీ చంద్‌కు రియో బెర్త్ ► 36 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ విభాగంలో ► బరిలోకి భారత క్రీడాకారిణి ► పీటీ ఉష తర్వాత మొదటి క్రీడాకారిణి ఒలింపిక్స్‌కు అర్హత సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. దీని వెనుక చాలా మంది ఆశీర్వాదాలు ఉన్నాయి. గతేడాది చాలా కష్టాలు పడ్డా. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చా. నా శ్రమకు తగిన ప్రతిఫలం ఇప్పుడు లభించింది. కోచ్ రమేశ్ అండ లేకపోతే ఇది సాధ్యమయ్యేదికాదు. నాకు మద్దతుగా నిలిచిన సాయ్, క్రీడాశాఖ, అథ్లెటిక్స్ సమాఖ్యలకు కృతజ్ఞతలు. దేశానికి పతకం తెచ్చేందుకు మరింత శ్రమిస్తా. - ద్యుతీ న్యూఢిల్లీ: కష్టాల కడలిని... కన్నీళ్ల సంద్రాన్ని కనురెప్ప దాటనీయకుండా పోరాటం చేసిన భారత అథ్లెట్ ద్యుతీ చంద్... మన అథ్లెటిక్స్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. సౌకర్యాలు కరువైనా... ఆర్థికంగా అండలేకపోయినా... పట్టుదలనే పెట్టుబడిగా పెట్టి ట్రాక్‌పై సంచలనాలు సృష్టించేలా పరుగెత్తిన ఈ ఒడిషా అమ్మాయి ప్రతిష్టాత్మక ‘రియో ఒలింపిక్స్’కు అర్హత సాధించింది. కజకిస్తాన్‌లో శనివారం జరిగిన ‘కొసనోవ్ మెమోరియల్’ మీట్లో భాగంగా జరిగిన మహిళల 100 మీటర్ల హీట్స్‌ను ద్యుతీ 11.30 సెకన్లలో ముగించింది. ఒలింపిక్ కటాఫ్ టైమ్ (11.32 సెకన్లు) కంటే 0.2 సెకన్లు ముందుగా లక్ష్యాన్ని చేరడంతో రియో టికెట్ ఖాయమైంది. ఫలితంగా దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత 100 మీటర్ల పరుగులో భారత క్రీడాకారిణి ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. అంచనాలకు మించి రాణించిన ద్యుతీ ఫెడరేషన్ కప్‌లో తాను నెలకొల్పిన జాతీయ రికార్డు (11.33 సెకన్లు)ను కూడా ఈ సందర్భంగా బద్దలు కొట్టింది. కష్టాలకు ఎదురీదుతూ... ఒడిశాలో గోపాల్పూర్ అనే ఓ చిన్న గ్రామం. అందులో ఓ నిరుపేద చేనేత కుటుంబం.. ఆరుగురు అక్కాచెల్లెళ్లు... ఓ సోదరుడు.. పుట్టినప్పట్నించీ అన్ని కష్టాలే... రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. కనీస వసతులకు కూడా నోచుకోలేని ఆ కుటుంబం నుంచి ద్యుతీ అంచలంచెలుగా ఎదిగింది. అడుగడుగునా వెక్కిరించే కష్టాలను ఓర్పుగా జయిస్తూ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో చిరుతలా మారింది. పరుగెత్తడానికి మైదానం కూడా లేని పరిస్థితుల్లో కొండలు, కోనలు, సెలయేళ్లు అంటూ ప్రకృతిని ఆసరాగా చేసుకొని నదుల వెంట పరుగు తీసింది. అయితే సాధన ఉన్నా... సరైన శిక్షణ లేకపోవడంతో ఆరంభంలో కొన్ని ప్రతికూల ఫలితాలు వచ్చాయి. కానీ కోచ్ రమేశ్ అండతో వీటన్నింటిని జయించి ప్రతి రోజూ తనకు తానుగా ఓ కొత్త అథ్లెట్‌గా రూపాంతరం చెందింది. జాతీయ స్థాయి టోర్నీలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ద్యుతీ... 2013 పుణేలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గి అందరి దృష్టిని ఆకర్షించింది. తర్వాత అండర్-18 వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్‌తో పాటు తైపీలో జరిగిన పోటీల్లో 200 మీటర్లలో చాంపియన్‌గా నిలిచి అంతర్జాతీయ స్టార్‌గా మారింది. ఇక స్ప్రింట్‌లో తిరుగులేని క్రీడాకారిణిగా మారుతున్న తరుణంలో 2014లో ద్యుతీకి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. తనలో ‘టెస్టోస్టిరాన్’ (పురుష హార్మోన్) స్థాయి అధికంగా ఉందని, మహిళా అథ్లెట్‌గా పరిగణించలేమని ఐఏఏఎఫ్ నిషేధం విధించింది. దీంతో ‘కామన్వెల్త్ గేమ్స్’లో పతకం సాధించాలన్న ఆమె ఆశలకు గండిపడింది. ఈ పరిణామంతో నిరాశకు లోనైన ద్యుతీ ఓ ఏడాది పాటు శిక్షణకు, పోటీలకు దూరమైంది. అయితే సన్నిహితులు ఇచ్చిన స్ఫూర్తితో తనపై విధించిన నిషేధాన్ని... స్విట్జర్లాండ్‌లోని ‘కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)’లో అప్పీల్ చేసింది. సుదీర్ఘ విచారణ, రిపోర్టుల పరిశీలన, వాదనలు విన్న తర్వాత గతేడాది జూలైలో పాక్షికంగా నిషేధాన్ని ఎత్తివేస్తూ కాస్ సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన ద్యుతీ కఠిన శిక్షణ, మొక్కవోని ఆత్మస్థైర్యంతో ట్రాక్‌పై సంచలనం సృష్టించింది. ఫలితంగా రియో బెర్త్ ఆమె ముంగిటకు చేరింది. - సాక్షి క్రీడావిభాగం భారత్ నుంచి ఐదో క్రీడాకారిణి ఓవరాల్‌గా భారత్ నుంచి 100 మీటర్ల రేసులో ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయిన ఐదో క్రీడాకారిణిగా ద్యుతీ రికార్డులకెక్కింది. 1952 హెల్సింకీ పోటీల్లో నీలిమా ఘోష్, మేరీ డిసౌజాలు భారత్‌కు ప్రాతినిధ్యం వహించినా... ఈ ఇద్దరూ హీట్స్ (1, 9)లో ఐదో స్థానంతో సరిపెట్టుకున్నారు. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత మెల్బోర్న్ (1956) ఒలింపిక్స్‌లో మేరీ లీలా రావు మళ్లీ దేశం తరఫున బరిలోకి దిగింది. కానీ రేసును పూర్తి చేయలేకపోయింది. ఎలాంటి అర్హత పోటీ లేకుండా మాస్కో (1980) ఒలింపిక్స్‌లో పాల్గొన్న పీటీ ఉష... హీట్స్‌తోనే సంతృప్తిపడింది. బరిలోకి దిగిన తొలి హీట్స్‌లో ఆమె ఆరో స్థానంతో సంతృప్తిపడింది. ఇక అప్పటి నుంచి 100 మీటర్లలో ఇంకెవ్వరూ భారత్‌కు ప్రాతినిధ్యం వహించలేదు. అయితే ఏథెన్స్ (2004) ఒలింపిక్స్‌లో సరస్వతి దేవ్ సాహా 200 మీటర్ల రేసులో పాల్గొంది. అండగా తెలుగు వ్యక్తులు కష్టాలను జయిస్తూ.. కెరీర్‌ను కొనసాగించిన ద్యుతీకి అడుగడుగునా తెలుగు వ్యక్తులు ముగ్గురు అండగా నిలిచారు. ఆరంభంలో అన్నీ తానై నిలబడ్డ కోచ్ నాగ్‌పూరి రమేశ్... ద్యుతీని జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి అథ్లెట్‌గా తీర్చిదిద్దారు. ఈ క్రమంలో ఇద్దరూ ఎన్నో త్యాగాలు చేశారు. ఉన్న వసతుల్లోనే అత్యుత్తమ శిక్షణను రమేశ్ ఇస్తే... అందుకు తగ్గ ఫలితాలను ద్యుతీ చూపెట్టింది. ఇక ప్రతి రోజూ శిక్షణ కోసం గోపీ చంద్ తన అకాడమీలో సౌకర్యాలు ఇచ్చారు. ద్యుతీ అక్కడే దాదాపు ఆరు గంటల పాటు శ్రమిస్తుంది. అయితే వసతుల పరంగా ఇబ్బందిలేకున్నా.. టోర్నీలకు, ఇతర అవసరాలకు ఆర్థిక సాయం తప్పనిసరి కావడంతో ద్యుతీని మళ్లీ కష్టాలు వెంటాడాయి. సాయ్ నుంచి కొద్దోగొప్పో సాయం అందినా అది ఏమూలకు సరిపోకపోయేది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ అండగా నిలిచారు. ద్యుతీకి లక్ష రూపాయలు ఆర్థికసాయం చేసి... ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తే మరో ఐదు లక్షల రూపాయలు ఇస్తానని మాట ఇచ్చారు. అన్నట్లుగానే ఇప్పుడు ద్యుతీకి ఆ డబ్బు ఇస్తున్నట్లు చెప్పారు. ద్యుతీయే కాకుండా తెలంగాణ క్రీడాకారులు ఎవ రు ఒలింపిక్స్‌లో ఏ పతకం సాధించినా వారికి బీఎండబ్ల్యూ కారు ఇస్తానని చాముండేశ్వరీనాథ్ ప్రకటించారు. -
రియో ఒలింపిక్స్ కు అర్హత సాధిస్తా!
కోల్ కతా: ఇటీవల జరిగిన జాతీయ ఓపెన్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన వివాదాస్పద అథ్లెట్ ద్యుతీ చంద్ తాను తప్పకుండా రియో ఒలింపిక్స్ కు అర్హత సాధిస్తానని అంటోంది. అయితే రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించాలంటే తనకు విదేశాల్లో శిక్షణ అవసరమని స్పష్టం చేసింది. తనను ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని.. ఈ క్రమంలోనే విదేశాల్లో శిక్షణ అవసరమని పేర్కొంది. అథ్లెటిక్స్ కు సంబంధించి ఇక్కడే శిక్షణ తీసుకుంటే కష్టమని తెలిపింది. సాంకేతిక పరిజ్ఞానం మన దేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ శిక్షణ తనకు అవసరమని పేర్కొంది. తాను ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకూ సాధన చేస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. గత శనివారం జాతీయ ఓపెన్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో భాగంగా రైల్వేస్ తరఫున 100మీ. బరిలోకి దిగిన ద్యుతీ 11.68 సెకన్ల టైమింగ్‌తో సత్తా చాటుకుంది. అనంతరం జరిగిన 200 మీ, 4/100 విభాగాల్లో కూడా ద్యుతీ స్వర్ణాలు గెలిచి ఉత్తమ స్ప్రింటర్ గా నిలిచింది. గతంలో పురుష హార్మోన్లు ఎక్కువగా ఉన్నాయనే కారణంగా ఈ ఒడిషా స్ప్రింటర్ కొంతకాలం నిషేధం ఎదుర్కొంది. అయితే గత జూలైలో ఆమెపై నిషేధాన్ని స్పోర్ట్స్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఎత్తేసింది.