‘టోక్యో’లో పాల్గొంటా: స్ప్రింటర్‌ శ్రాబణి | Sprinter‌ Shrabani Speaks About Her Entry in Tokyo Olympics | Sakshi
Sakshi News home page

‘టోక్యో’లో పాల్గొంటా: స్ప్రింటర్‌ శ్రాబణి

Published Mon, Jul 27 2020 2:53 AM | Last Updated on Mon, Jul 27 2020 12:41 PM

Sprinter‌ Shrabani Speaks About Her Entry in Tokyo Olympics - Sakshi

న్యూఢిల్లీ: ఎలాగైనా టోక్యో ఒలింపిక్స్‌ 100, 200 మీటర్ల ఈవెంట్‌లలో పాల్గొనడమే తన లక్ష్యమంటోంది భారత స్ప్రింటర్‌ శ్రాబణి నందా. ఈ ఏడాది ఆరంభం నుంచే జమైకాలో తన శిక్షణను కొనసాగిస్తోన్న శ్రాబణి... రియో ఒలింపిక్స్‌లో 200 మీటర్ల పరుగులో హీట్స్‌లో ఆరో స్థానంతో నిష్క్రమించింది. 100, 200 మీటర్ల పరుగు ఈవెంట్‌లకు టోక్యో అర్హత ప్రమాణం వరుసగా 11.15 సెకన్లు; 22.80 సెకన్లు కాగా... శ్రాబణి అత్యుత్తమ ప్రదర్శన ఈ రెండింట్లో వరుసగా 11.45 సెకన్లు, 23.07 సెకన్లుగా ఉంది. 29 ఏళ్ల శ్రాబణి ఈ వారం మొదట్లో కింగ్‌స్టన్‌లో జరిగిన వెలాసిటీ ఫెస్ట్‌ ఈవెంట్‌లో 100 మీటర్లలో పోటీపyì  మూడో స్థానం పొందింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement