Hima Das: స్టార్‌ అథ్లెట్ హిమా దాస్‌కు కరోనా... | Star athlete Hima Das tests Covid-19 positive | Sakshi
Sakshi News home page

Hima Das: స్టార్‌ అథ్లెట్ హిమా దాస్‌కు కరోనా...

Published Wed, Oct 13 2021 6:50 PM | Last Updated on Wed, Oct 13 2021 6:57 PM

Star athlete Hima Das tests Covid-19 positive - Sakshi

Hima Das Tests Covid-19 Positive:  భారత స్టార్‌ అథ్లెట్ హిమా దాస్ బుధవారం కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. తొడ కండరాల గాయం కారణంగా టోక్యో ఒలిపింక్స్‌కు ఆర్హత సాధించలేకపోయిన హిమా.. ప్రస్తుతం పాటియాలాలోని నేషనల్ స్పోర్ట్స్‌ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందుతుంది. ఈ క్రమంలో ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణైంది

'నాకు కరోనా పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం ఐసోలేషన్​లో ఉన్నాను. ఆరోగ్యం బాగానే ఉంది. మునుపటి కంటే బలంగా తిరిగి రావడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలని నేను ఎదురుచూస్తున్నాను. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి. సురక్షితంగా ఉండండి." అని హిమదాస్ ట్వీట్‌ చేసింది. హిమాదాస్‌ 2018లో అండర్‌-20 ప్రపంచ చాంపియన్‌ షిప్‌లో 400 మీటర్ల ఈవెంట్‌లో విజయం సాధించింది. దాంతో ఈ ఈవెంట్‌లో ప్రపంచ టైటిల్‌ గెలిచిన తొలి భారతీయ స్ప్రింటర్‌గా రికార్డుల్లో నిలిచింది. ఈక్రమంలోనే హిమా దాస్‌ను అస్సాం ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగంతో గౌరవించింది.

చదవండి: T20 World Cup 2021: టీమిండియాలో అనూహ్య మార్పు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement