‘ఖేల్‌రత్న’కు హిమదాస్‌ | Sprinter Hima Das Nominated For Rajeev Gandhi Khel Ratna Award | Sakshi
Sakshi News home page

‘ఖేల్‌రత్న’కు హిమదాస్‌

Published Tue, Jun 16 2020 4:12 AM | Last Updated on Tue, Jun 16 2020 5:01 AM

 Sprinter Hima Das Nominated For Rajeev Gandhi Khel Ratna Award - Sakshi

హిమదాస్‌

న్యూఢిల్లీ: భారత యువ స్ప్రింటర్‌ హిమదాస్‌ ప్రతిష్టాత్మక ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’ అవార్డు బరిలో నిలిచింది. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ‘ఖేల్‌రత్న’ కోసం 20 ఏళ్ల హిమదాస్‌ పేరును కేంద్ర క్రీడాశాఖకు అస్సాం ప్రభుత్వం సిఫారసు చేసింది. దీంతో ఈ ఏడాది ఈ అవార్డు బరిలో నిలిచిన పిన్న వయస్కురాలిగా హిమ ఘనత వహించింది. 2018లో అద్భుతంగా రాణించిన హిమ.... ఫిన్లాండ్‌లో జరిగిన అండర్‌–20 ప్రపంచ చాంపియన్‌షిప్‌ 400మీ.ఈవెంట్‌లో స్వర్ణం గెలిచి అంతర్జాతీయ స్థాయిలో ఏ పోటీల్లోనైనా అగ్రస్థానం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచింది. ఇదే చాంపియన్‌షిప్‌లో 4్ఠ400 రిలేలో మరో స్వర్ణం,  మిక్స్‌డ్‌ రిలేలో రజతం ఆమె ఖాతాలో చేరాయి. ఆ తర్వాత 2018 జకార్తా ఆసియా క్రీడల్లో 4్ఠ400మీ. మహిళల రిలేలో పసిడిని గెలుపొందింది. ప్రస్తుతం ఆమె ఈ అవార్డు కోసం నీరజ్‌ చోప్రా (జావెలిన్‌ త్రోయర్‌), వినేశ్‌ ఫొగాట్‌ (రెజ్లర్‌), మనికా బత్రా (టీటీ), రాణి రాంపాల్‌ (హాకీ), రోహిత్‌ శర్మ (క్రికెట్‌)లతో పోటీపడనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement