central sports ministry
-
భారత కబడ్డీ మాజీ ప్లేయర్ తేజస్వినికి క్రీడా శాఖ సాయం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారిన పడి భర్తను కోల్పోయిన భారత మహిళల కబడ్డీ జట్టు మాజీ సభ్యురాలు వి. తేజస్విని బాయికి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించింది. పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జాతీయ సంక్షేమ నిధి ద్వారా తేజస్వినికి సహాయం అందించారు. కర్ణాటకకు చెందిన తేజస్విని, ఆమె భర్త నవీన్ ఈనెల ఒకటిన కరోనా బారిన పడ్డారు. తేజస్విని ఇంటివద్దే కోలుకోగా... ఆమె భర్త నవీన్ (30 ఏళ్లు) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 11వ తేదీన తుదిశ్వాస విడిచాడు. నవీన్ తండ్రి కూడా కరోనా వైరస్‌తోనే మృతి చెందారు. 2011లో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘అర్జున అవార్డు’ పొందిన తేజస్విని 2010 గ్వాంగ్జూ, 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు గెలిచిన భారత మహిళల కబడ్డీ జట్టులో కీలక సభ్యురాలిగా వ్యవహరించింది. తేజస్వినికి ఐదు నెలల పాప ఉంది. ఆర్థిక సాయంగా లభించిన మొత్తాన్ని పాప భవిష్యత్తు కోసం ఉపయోగిస్తానని తేజస్విని పేర్కొంది. -
‘ఖేల్‌రత్న’కు హిమదాస్
న్యూఢిల్లీ: భారత యువ స్ప్రింటర్ హిమదాస్ ప్రతిష్టాత్మక ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’ అవార్డు బరిలో నిలిచింది. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ‘ఖేల్‌రత్న’ కోసం 20 ఏళ్ల హిమదాస్ పేరును కేంద్ర క్రీడాశాఖకు అస్సాం ప్రభుత్వం సిఫారసు చేసింది. దీంతో ఈ ఏడాది ఈ అవార్డు బరిలో నిలిచిన పిన్న వయస్కురాలిగా హిమ ఘనత వహించింది. 2018లో అద్భుతంగా రాణించిన హిమ.... ఫిన్లాండ్లో జరిగిన అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్ 400మీ.ఈవెంట్లో స్వర్ణం గెలిచి అంతర్జాతీయ స్థాయిలో ఏ పోటీల్లోనైనా అగ్రస్థానం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచింది. ఇదే చాంపియన్‌షిప్‌లో 4్ఠ400 రిలేలో మరో స్వర్ణం, మిక్స్డ్ రిలేలో రజతం ఆమె ఖాతాలో చేరాయి. ఆ తర్వాత 2018 జకార్తా ఆసియా క్రీడల్లో 4్ఠ400మీ. మహిళల రిలేలో పసిడిని గెలుపొందింది. ప్రస్తుతం ఆమె ఈ అవార్డు కోసం నీరజ్ చోప్రా (జావెలిన్ త్రోయర్), వినేశ్ ఫొగాట్ (రెజ్లర్), మనికా బత్రా (టీటీ), రాణి రాంపాల్ (హాకీ), రోహిత్ శర్మ (క్రికెట్)లతో పోటీపడనుంది. -
క్రీడా అవార్డుల నిబంధనల్లో మార్పులు!
వచ్చే ఏడాది నుంచి అమల్లోకి... న్యూఢిల్లీ: ప్రతీ ఏడాది జాతీయ క్రీడా అవార్డులు ప్రకటించడం... ఆ వెంటనే పలువురు క్రీడాకారుల నుంచి నిరసనలు వ్యక్తమవడం పరిపాటిగా మారింది. దీంతో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా, అర్హులైన వారందరికీ అన్యాయం జరగకుండా చూసేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నడుం బిగించింది. ఈ నేపథ్యంలో అవార్డుల కోసం ఆటగాళ్ల ఎంపిక పద్ధతిని మార్చాలని ఆలోచిస్తోంది. ఆయా క్రీడా సమాఖ్యల ద్వారా నామినేట్ అయిన వారికే ఇప్పటిదాకా అవార్డులను ప్రకటిస్తున్నారు. కానీ అర్హులై ఉండి అలా నామినేట్ కాని వారిని కూడా ఎంపిక కోసం పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈపాటికే కేంద్ర క్రీడా మంత్రి విజయ్ గోయల్ ఈ దిశగా చర్చలు ప్రారంభించారని సమాచారం. ‘వచ్చే ఏడాది నుంచి అవార్డుల పద్ధతిని మార్చాలనుకుంటున్నాం. త్వరలోనే కొత్త నిబంధనలు వస్తాయి. సమాఖ్యల ద్వారా నామినేట్ కానివారు... తాము సొంతంగా దరఖాస్తు పెట్టుకోని వారిలో కూడా నిజంగా అర్హులై ఉంటే వారినీ ఎంపిక చేస్తారు. ప్రతీ సెలక్షన్ కమిటీ సభ్యుడు కూడా నామినేట్ కాని అర్హుడైన అథ్లెట్‌పై నిర్ణయం తీసుకోవచ్చు. సభ్యుడి సలహా మేరకు ప్యానెల్ ఆ ఆటగాడి ప్రదర్శనపై ఓ అంచనాకు వస్తారు’ అని క్రీడా శాఖ అధికారి ఒకరు తెలిపారు. -
సుశీల్‌కు ఇంకా అవకాశం ఉంది
► తేల్చిన భారత రెజ్లింగ్ సమాఖ్య ► ప్రాబబుల్స్ జాబితాలో లేని రెజ్లర్ పేరు న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌కు క్రీడాకారుల అక్రిడిటేషన్ కోసం భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)కు వచ్చిన రెజ్లర్ల జాబితాలో సుశీల్ కుమార్ పేరు లేకపోవడం సంచలనం రేపింది. 74 కేజీల విభాగంలో రియోకు ఎవరు వెళ్లాలనే విషయంపై సుశీల్, నర్సిం గ్ల మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఐఓఏకు వచ్చిన జాబితాలో సుశీల్ పేరు లేదు. అయితే ఈ జాబితాను తాము పంపలేదని, సుశీల్‌కు అవకాశం ఉందని భారత రెజ్లింగ్ సమాఖ్య పంపింది. ‘ఒలింపిక్స్‌కు అర్హత పొందిన రెజ్లర్ల పేర్లను ప్రపంచ రెజ్లింగ్ సంఘం ఐఓఏకు పంపుతుంది. ఇది ప్రతిసారీ జరిగే ప్రక్రియ. అయితే ఏ విభాగంలో ఎవరు పాల్గొనాలో మా సమాఖ్య నిర్ణయించిన తర్వాత ఆ పేర్లను ఐఓఏ ఆమోదిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి దీనిపై వివాదం అవసరం లే దు’ అని భారత రెజ్లింగ్ సమాఖ్య పేర్కొంది. మరోవైపు రె జ్లర్ల వివాదంతో తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. -
కేంద్రం తీరుపై గుత్తా జ్వాల ఫైర్
క్రీడామంత్రిత్వ శాఖ తీరుపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల మండిపడింది. టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకం విషయంలో తనను పట్టించుకోకపోవడాన్ని ఆమె తీవ్రంగా పరిగణించింది. ఇంతకాలం దేశానికి సేవ చేసిన తర్వాత ప్రభుత్వం తనను ఇలా అవమానించిందని ఆవేదన వ్యక్తం చేసింది. తన పేరు గానీ, అశ్వని పేరు గానీ టాప్ పథకంలో లేవన్న విషయం తనకు ఇప్పుడే తెలిసిందని జ్వాల చెప్పింది. ఇన్నాళ్లూ తమకు కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు ఉందనుకున్నామని.. ఇప్పుడు అది కూడా కొడిగట్టిందని తెలిపింది. ఇప్పటికే కార్పొరేట్ వర్గాల నుంచి కావల్సినంత సపోర్ట్ ఉన్న క్రీడాకారుల పేర్లే అందులో ఉన్నాయి తప్ప, తనను.. అశ్వనిని పట్టించుకోలేదని వాపోయింది. ఇప్పుడు ఇక ఏంచేయాలో అర్థం కావట్లేదని, తాను బాగా అలిసిపోయానని చెప్పింది. డబుల్స్ గేమ్‌లో ఆడేందుకు తాము చాలా కష్టపడ్డామని, కానీ ఇలా చేస్తారని మాత్రం ఎప్పుడూ ఊహించలేదని తెలిపింది.