Rajiv Gandhi Khel Ratna Award
-
ఖేల్ రత్న అవార్డులు అందుకున్న గుకేశ్, హర్మన్‌ప్రీత్ సింగ్, మనూ బాకర్, ప్రవీణ్ కుమార్
భారత దేశపు అత్యున్నత క్రీడా పురస్కారం అయిన "మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు" గతేడాది (2024) నలుగురిని వరించింది. చెస్‌లో డి గుకేశ్, పురుషుల హాకీలో హర్మన్‌ప్రీత్ సింగ్, మహిళల షూటింగ్లో మనూ బాకర్, పారా-అథ్లెట్ (హై జంప్) ప్రవీణ్ కుమార్ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ నలుగురు ఇవాళ (జనవరి 17) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డులు అందుకున్నారు. అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో జరిగింది.A historic moment for 🇮🇳 Indian chess! 🏆Congratulations to 🇮🇳 GM Gukesh on receiving the prestigious Major Dhyan Chand Khel Ratna Award from Hon’ble President Droupadi Murmu👏Your hard work and passion continue to inspire us all—onward and upward 🥳👏@DGukesh📹Doordarshan pic.twitter.com/4AMZ8ClZD9— Chess.com - India (@chesscom_in) January 17, 2025గుకేశ్ అతి చిన్న వయసులో (18) ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన రెండవ భారతీయుడు గుకేష్. గుకేశ్ గత నెలలో చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌ను ఓడించి వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు.హర్మన్‌ప్రీత్ సింగ్ భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్. హర్మన్ సారథ్యంలో భారత్ గతేడాది ఒలింపిక్స్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. భారత్ పతకం సాధించడంలో హర్మన్ కీలకపాత్ర పోషించాడు.మనూ భాకర్ .. ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పింది. మనూ బాకర్ గతేడాది ఆగస్టులో జరిగిన విశ్వక్రీడల్లో రెండు కాంస్య పతకాలు (10మీ ఎయిర్ పిస్తోల్, 10మీ ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ టీం ఈవెంట్లలో) గెలుచుకుంది.ప్రవీణ్ కుమార్.. గతేడాది జరిగిన పారాలింపిక్స్‌లో పురుషుల హై జంప్ విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు.పై నలుగురు భారత క్రీడా రంగంలో చేసిన విశేష కృషికి గాను ఖేల్ రత్న అవార్డులు అందుకున్నారు. -
రాజీవ్‌ఖేల్‌రత్న రేసులో అశ్విన్, మిథాలీ రాజ్
ఢిల్లీ: 2021 ఏడాదికి సంబంధించి క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్‌ఖేల్ రత్న అవార్డుకు టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌లను సిఫార్సు చేస్తున్నట్లు బీసీసీఐ బుధవారం వెల్లడించింది. వీరితో పాటు కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, శిఖర్ ధావన్‌ల పేర్లను అర్జున అవార్డుకు సిఫార్సు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు బీసీసీఐ కేంద్ర క్రీడాశాఖకు సిఫార్సు చేస్తు దరఖాస్తును పంపించింది. కాగా అశ్విన్, మిథాలీ రాజ్‌లు రాజీవ్‌ఖేల్‌రత్న అవార్డుకు అన్ని అర్హతలు ఉన్నాయని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా రవిచంద్రన్ అశ్విన్ కొన్ని రోజులుగా టెస్టుల్లో మంచి ఫామ్‌ను కనబరుస్తున్నాడు. 2019-21 డబ్ల్యూటీసీ టోర్నీలో భాగంగా అశ్విన్ 71 వికెట్లు తీసి తొలిస్థానంలో నిలిచాడు. టెస్టుల్లో టీమిండియా తరపున 400 వికెట్లకు పైగా తీసిన మూడో స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇక మిథాలీ రాజ్ 22 ఏళ్ల క్రికెట్ కెరీర్‌ను ఇటీవలే పూర్తి చేసుకుంది. ఐసీసీ ప్రకటించిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లోనూ మిథాలీ రెండేళ్ల తర్వాత టాప్-5లోకి అడుగుపెట్టింది. కాగా గతేడాది రాజీవ్‌ఖేల్ రత్న అవార్డును టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ గెలుచుకున్న సంగతి తెలిసిందే. -
చరిత్రలో తొలిసారి...
న్యూఢిల్లీ: గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా పురస్కారాల విషయంలో విశాల హృదయం చాటుకుంది. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న’ను ఒకేసారి అత్యధికంగా ఐదుగురికి అందజేయాలని నిర్ణయించింది. 2019 సంవత్సరానికిగాను రోహిత్ శర్మ (క్రికెట్), వినేశ్ ఫొగాట్ (మహిళల రెజ్లింగ్), రాణి రాంపాల్ (మహిళల హాకీ), మనిక బత్రా (మహిళల టేబుల్ టెన్నిస్), మరియప్పన్ తంగవేలు (పారా అథ్లెటిక్స్) ‘ఖేల్‌రత్న’ పురస్కారాలకు ఎంపికయ్యారు. గతంలో 2016లో ఒకేసారి అత్యధికంగా నలుగురికి ‘ఖేల్‌రత్న’ అవార్డును ఇచ్చారు. 2016 రియో ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన షట్లర్ పీవీ సింధు, రెజ్లర్ సాక్షి మలిక్, నాలుగో స్థానం పొందిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఫైనల్ చేరిన షూటర్ జీతూ రాయ్‌లకు ఈ అవార్డు అందజేశారు. దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మరణానంతరం ఆయన స్మారకార్థం 1991లో ‘ఖేల్‌రత్న’ అవార్డును ప్రవేశపెట్టారు. గతంలో ‘ద్రోణాచార్య’ అవార్డును ఒకేసారి అత్యధికంగా ఎనిమిది మందికి... ‘ధ్యాన్‌చంద్’ అవార్డును అత్యధికంగా ఐదుగురికి ఇచ్చారు. గత సోమ, మంగళవారాల్లో రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్ ముకుందకం శర్మ సారథ్యంలోని 12 మంది సభ్యుల అవార్డుల సెలెక్షన్ కమిటీ ‘ఖేల్‌రత్న’ కోసం ఐదుగురిని, ఉత్తమ క్రీడాకారులకు అందించే ‘అర్జున’ అవార్డు కోసం 29 మందిని... కోచ్‌లకు ఇచ్చే ‘ద్రోణాచార్య’ అవార్డు కోసం 13 మందిని... ప్లేయర్ ఉన్నపుడు, ఆట నుంచి రిటైరయ్యాకా క్రీడాభివృద్ధికి తోడ్పడుతున్న వారికి అందించే ‘ధ్యాన్‌చంద్’ జీవితకాల సాఫల్య అవార్డు కోసం 15 మందిని ఎంపిక చేసి కేంద్ర క్రీడా శాఖకు పంపించింది. ఇందులో ‘అర్జున’ అవార్డు కోసం దరఖాస్తు చేసుకున్న 2016 ‘ఖేల్‌రత్న’ అవార్డీ సాక్షి మలిక్... 2018 ‘ఖేల్‌రత్న’ అవార్డీ మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్) నామినేషన్స్‌ను కేంద్ర క్రీడా శాఖ తిరస్కరించి మిగతా అందరి పేర్లకు ఆమో దం తెలిపింది. ఇప్పటికే అత్యున్నత పురస్కారం ‘ఖేల్‌రత్న’ అందుకున్నందున సాక్షి మలిక్, మీరాబాయి చాను పేర్లను ఉత్తమ క్రీడాకారులకు అందించే ‘అర్జున’ కోసం పరిగణించలేదు. ఆన్లైన్లో... ప్రతి యేటా జాతీయ క్రీడా పురస్కారాలను జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు 29న రాష్ట్రపతి భవన్లో ఘనంగా నిర్వహిస్తారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ఈసారి ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి జాతీయ క్రీడా పురస్కారాలు లభించాయి. యువ బ్యాడ్మింటన్ ఆటగాడు సాత్విక్ సాయిరాజ్‌కు ‘అర్జున’, మాజీ బాక్సర్ నగిశెట్టి ఉషకు ‘ధ్యాన్‌చంద్’ జీవితకాల సాఫల్య పురస్కారం లభించాయి. 2019లో షట్లర్ సాత్విక్ సాయిరాజ్ తన భాగస్వామి చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర)తో కలిసి విశేషంగా రాణించాడు. థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో టైటిల్ నెగ్గిన ఈ ద్వయం ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఈ క్రమంలో పురుషుల డబుల్స్ ప్రపంచ చాంపియన్ జోడీని, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న జంటను సాత్విక్–చిరాగ్ ద్వయం ఓడించింది. -
ఖేల్ రత్నకు రోహిత్ శర్మ నామినేట్
ఢిల్లీ : క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డుకు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పేరును క్రీడా మంత్రిత్వశాఖ కేంద్రానికి సిఫార్సు చేసింది. అతనితో పాటు రెజ్లర్ వినేశ్ ఫోగట్, టేబుల్ టెన్నిస్ సంచలనం మనిక బాత్రా, రియో పారా ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ మరియప్పన్ తంగవేలు పేర్లను ప్రతిష్టాత్మక పురస్కారానికి సిఫార్సు చేశారు. క్రీడాశాఖ ఆధ్వర్యంలో మొత్తం 12 మంది సెలక్షన్ కమిటీ సభ్యులు ప్రతిష్టాత్మక అవార్డుకు వీరిని నామినేట్ చేసినట్లు మంగళవారం పేర్కొంది. అత్యున్నత క్రీడా అవార్డుకు నలుగురు క్రీడాకారులు నామినేట్ కావడం ఇది రెండవసారి. 2016లో కూడా నలుగురు క్రీడాకారుల్ని ఈ అవార్డు కోసం నామినేట్ చేశారు. (చదవండి : ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్ డ్రీమ్ 11 2019 ఏడాదిలో రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాడు. ఆ సీజన్లో రోహిత్ వన్డేల్లో ఏడు సెంచరీలతో మొత్తం 1490 రన్స్ చేశాడు. కాగా 2019 ఏడాది క్రికెట్లో అత్యున్నత ప్రదర్శనకు గానూ రోహిత్ శర్మను ప్రతిష్టాతక్మ అవార్డుకు సిఫార్సు చేసినట్లు కమిటీలో సభ్యుడైన మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. 2018లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్, ఎషియన్ గేమ్స్‌లో బంగారు పతకాలు, 2019 ఏసియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో క్యాంస్య పతకం సాధించి వినేశ్ ఫోగట్ చరిత్ర సృష్టించారు. మరియప్పన్ తంగవేలు.. 2016లో రియో పారాఒలింపిక్స్‌లో టి42 హై జంప్ కేటగిరి విభాగంలో బంగారు పతకం సాధించి దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పాడు. టేబుల్ టెన్నిస్ సంచలనంగా పేరు పొందిన మనిక బాత్రా 2018 నుంచి అత్యద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం, ఏసియన్ గేమ్స్‌లో క్యాంస్య పతకం సాధించి తన సత్తాను చాటింది.(కోహ్లి.. అప్పుడే 12 ఏళ్లయిందా!) కాగా ఇండియన్ క్రికెట్లో రోహిత్ శర్మ కంటే ముందు ముగ్గురు మాత్రమే రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. వారిలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(1998), టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని(2007), ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి(2018)లో ఎంపికయ్యారు. -
‘ఖేల్‌రత్న’కు హిమదాస్
న్యూఢిల్లీ: భారత యువ స్ప్రింటర్ హిమదాస్ ప్రతిష్టాత్మక ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’ అవార్డు బరిలో నిలిచింది. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ‘ఖేల్‌రత్న’ కోసం 20 ఏళ్ల హిమదాస్ పేరును కేంద్ర క్రీడాశాఖకు అస్సాం ప్రభుత్వం సిఫారసు చేసింది. దీంతో ఈ ఏడాది ఈ అవార్డు బరిలో నిలిచిన పిన్న వయస్కురాలిగా హిమ ఘనత వహించింది. 2018లో అద్భుతంగా రాణించిన హిమ.... ఫిన్లాండ్లో జరిగిన అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్ 400మీ.ఈవెంట్లో స్వర్ణం గెలిచి అంతర్జాతీయ స్థాయిలో ఏ పోటీల్లోనైనా అగ్రస్థానం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచింది. ఇదే చాంపియన్‌షిప్‌లో 4్ఠ400 రిలేలో మరో స్వర్ణం, మిక్స్డ్ రిలేలో రజతం ఆమె ఖాతాలో చేరాయి. ఆ తర్వాత 2018 జకార్తా ఆసియా క్రీడల్లో 4్ఠ400మీ. మహిళల రిలేలో పసిడిని గెలుపొందింది. ప్రస్తుతం ఆమె ఈ అవార్డు కోసం నీరజ్ చోప్రా (జావెలిన్ త్రోయర్), వినేశ్ ఫొగాట్ (రెజ్లర్), మనికా బత్రా (టీటీ), రాణి రాంపాల్ (హాకీ), రోహిత్ శర్మ (క్రికెట్)లతో పోటీపడనుంది. -
‘ఖేల్‌రత్న’ బరిలో జ్యోతి సురేఖ
న్యూఢిల్లీ: భారత అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’ రేసులోకి తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ, భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్, భారత మహిళా టేబుల్ టెన్నిస్ స్టార్ మనిక బత్రా వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సురేఖ పేరును... హాకీ ఇండియా (హెచ్ఐ) రాణి పేరును... టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) మనిక బత్రాను నామినేట్ చేశాయి. క్రీడా అవార్డుల నామినేషన్లకు గడువు నేటితో ముగియనుంది. విజయవాడకు చెందిన 23 ఏళ్ల సురేఖకు 2017లో ‘అర్జున’ అవార్డు లభించింది. తన పదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో సురేఖ ప్రపంచ, ఆసియా చాంపియన్‌షిప్, వరల్డ్‌కప్‌లలో కలిపి 33 పతకాలను సాధించింది. హాకీ నుంచి ‘అర్జున’ కోసం వందన కటారియా, మోనిక, హర్మన్‌ప్రీత్ సింగ్‌లను హెచ్ఐ సిఫారసు చేసింది. ‘ఖేల్‌రత్న’ పురస్కారానికి గడిచిన నాలుగేళ్ల ప్రదర్శనను పరిగణిస్తారు. జనవరి 1, 2016 నుంచి డిసెంబర్ 31, 2019 వరకు ఆటగాళ్ల ప్రతిభను అవార్డుల కమిటీ పరిశీలిస్తుంది. రాణి రాంపాల్ 2017లో మహిళల ఆసియా కప్ విజయంలో, 2018 ఆసియా క్రీడల్లో రజతం గెలిచేందుకు కీలకపాత్ర పోషించింది. టోక్యో ఒలింపిక్స్‌కు జట్టు అర్హత పొందడంలో రాణి పాత్ర ఎంతో ఉంది. ఆమె ఇదివరకే 2016లో అర్జున, ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాల్ని అందుకుంది. టేబుల్ టెన్నిస్‌లో మనిక బత్రా కూడా నిలకడగా రాణిస్తోంది. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో ఆమె 2 స్వర్ణాలు సహా 4 పతకాలు గెలిచింది. మధురిక, మానవ్ ఠక్కర్, సుతీర్థ ముఖర్జీలను ‘అర్జున’కు టీటీఎఫ్ఐ సిఫారసు చేసింది. ‘అర్జున’కు సాత్విక్... మరోవైపు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, సమీర్ వర్మ పేర్లను ‘అర్జున’కు ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్ తన భాగస్వామి చిరాగ్‌తో కలిసి గతేడాది థాయ్‌లాండ్ ఓపెన్‌లో డబుల్స్ టైటిల్ గెలిచాడు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో టీమ్ విభాగంలో స్వర్ణం, డబుల్స్‌లో రజతం సాధించారు. ‘ద్రోణాచార్య’ అవార్డు కోసం హైదరాబాద్‌కు చెందిన ‘సాయ్’ కోచ్ భాస్కర్ బాబుతోపాటు ఎస్.మురళీధరన్ (కేరళ) పేర్లను సిఫారసు చేశారు. -
‘ఖేల్‌రత్న’కు వినేశ్
న్యూఢిల్లీ: భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’ బరిలో వరుసగా రెండో ఏడాది నిలవనుంది. వినేశ్ పేరును గతేడాదే ఈ అవార్డుకు నామినేట్ చేసినప్పటికీ బజరంగ్ పూనియాను అదృష్టం వరించింది. ఈ మూడేళ్లలో జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణం, ప్రపంచ చాంపియన్‌షిప్ (2019)లో కాంస్యం, ఈ ఏడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన వినేశ్... టోక్యో ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్న ఏకైక భారత మహిళా రెజ్లర్ కావడం విశేషం. దీంతో ఆమె పేరును భారత రెజ్లింగ్ సమాఖ్య ‘ఖేల్‌రత్న’ కోసం క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫారసు చేయాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ ‘అర్జున అవార్డు’ కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం. 2016లోనే కేంద్రం ఆమెను ‘ఖేల్‌రత్న’తో సత్కరించింది. ఇతర రెజ్లర్లు దీపక్ పూనియా, రాహుల్ అవారే, సందీప్ తోమర్ ‘అర్జున అవార్డు’ను ఆశిస్తున్నారు. ఈ మేరకు సమాఖ్యకు దరఖాస్తులు సమర్పించారు. -
‘ఖేల్‌రత్న’కు రోహిత్ శర్మ పేరు సిఫారసు
ముంబై: భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మను దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీ) సిఫారసు చేసింది. ఇషాంత్ శర్మ, శిఖర్ ధావన్, మహిళా క్రికెటర్ దీప్తి శర్మ పేర్లను ‘అర్జున అవార్డు’ కోసం బీసీసీఐ నామినేట్ చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి 2019 సంవత్సరానికి ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు పొందిన 33 ఏళ్ల రోహిత్... ఒకే ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ టి20ల్లో నాలుగు సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా నిలిచిన రోహిత్ టెస్టు అరంగేట్రంలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేశాడు. ఓవరాల్‌గా రోహిత్ ఇప్పటివరకు 224 వన్డేలు, 108 టి20 మ్యాచ్‌లు, 34 టెస్టులు ఆడాడు. 2010లో అరంగేట్రం చేసిన శిఖర్ ధావన్ 136 వన్డేలు, 61 టి20 మ్యాచ్‌లు, 34 టెస్టులు ఆడాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన 31 ఏళ్ల ఇషాంత్ శర్మ భారత్ తరఫున 97 టెస్టులు ఆడి 297 వికెట్లు... 80 వన్డేలు ఆడి 115 వికెట్లు తీశాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల ఆల్‌రౌండర్ దీప్తి శర్మ భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు (188 పరుగులు) చేసిన మహిళా క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. దీప్తి వన్డేల్లో 64 వికెట్లు, టి20ల్లో 53 వికెట్లు పడగొట్టింది. -
ప్రతిష్టాత్మక అవార్డుకు రవీంద్ర జడేజా నామినేట్
నూఢిల్లీ : భారత క్రికెటర్ రవీంద్ర జడేజాను అర్జున అవార్డుకు సెలక్షన్ కమిటీ నామినేట్ చేసింది. 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్ ఓడిపోయినా, రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్‌షోతో అందరి మనస్సులు గెలుచుకున్న విషయం తెలిసిందే. హేమాహేమీలు వెనుదిరిగినా తన బ్యాటింగ్ నైపుణ్యంతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 59 బంతుల్లో 77 పరుగులు, రెండు వికెట్లు పడగొట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు. కానీ ఆఖర్లో జడేజా, ధోనీ ఔటవ్వడంతో ప్రపంచకప్ నుంచి టీమిండియా నిష్క్రమించిన విషయం విదితమే. భారత్ తరఫున జడేజా 156 వన్డేలు, 41 టెస్టులు, 42 టీ20లు ఆడాడు. జస్టిస్ (రిటైర్డ్) ముకుందకమ్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జడేజాతో పాటు మరో 18 మంది క్రీడాకారులను అర్జున అవార్డుకు నామినేట్ చేసింది. బీసీసీఐ ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు రవీంద్ర జడేజాతో పాటు, జస్ప్రిత్ బూమ్రాను, మహ్మద్ షమీలను కూడా సిఫార్సు చేసింది. జడేజాతో పాటు, మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ స్టార్స్ తేజేందర్ పాల్సింగ్తూర్, మహ్మద్ అనాస్, స్వప్నా బార్మన్, ఫుట్‌బాల్ క్రీడాకారుడు గుర్ప్రీత్ సింగ్ సంధు, హాకీ ప్లేయర్ చింగ్లెన్సానా సింగ్ కంగుజమ్, షూటర్ అంజుమ్ మోద్గిల్ తదితరులను సెలక్షన్ కమిటీ నామినేట్ చేసింది. మరోవైపు దేశ అత్యున్నత క్రీడా అవార్డు.. రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్నకు దీపా మాలిక్ నామినేట్ అయ్యారు. ఈమె రియో పారాలింపిక్స్‌లో షాట్‌పుట్ విభాగంలో వెండి పతకాన్ని సాధించారు. దీపా మాలిక్ 2017లో పద్మశ్రీ, 2012లో అర్జున అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన బాక్సర్ మేరీ కోమ్ తన వ్యక్తిగత కోచ్ చోతేలాల్ యాదవ్‌కు ద్రోణాచార్య అవార్డు రానందున తనంతట తానే ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనలేదు. మరోవైపు రెజ్లర్ బజ్రంగ్ పునియా ఖేల్‌రత్న అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ అవార్డు మార్గదర్శకాల ప్రకారం.. ఓ క్రీడాకారుడు అంతర్జాతీయ స్థాయిలో నాలుగు సంవత్సరాలుగా స్థిరమైన ప్రదర్శన కనబరచాలి. అవార్డు సిఫారసు చేసే సంవత్సరంలో అత్యుత్తమంగా రాణించి ఉండాలి. వీటితో పాటు నాయకత్వ లక్షణాలు, క్రీడా నైపుణ్యం, క్రమశిక్షణను పరిగణనలోకి తీసుకుని అవార్డుకు నామినేట్ చేస్తారు. -
‘ఖేల్ రత్న’ తిరస్కరణ: భజ్జీ ఆవేదన
న్యూఢిల్లీ: ‘ఖేల్ రత్న’ అవార్డు కోసం టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పెట్టుకున్న నామినేషన్‌ను ఇటీవల కేంద్ర క్రీడలు, యువజన వ్యవహరాల మంత్రిత్వశాఖ తిరస్కరించిన సంగతి తెలిసిందే. హర్భజన్ నామినేషన్ పత్రాలు ఆలస్యంగా రావడంతో ఆయన నామినేషన్‌ను కేంద్రం తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 39 ఏళ్ల ఈ క్రికెటర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశాడు. దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారమైన ‘ఖేల్ రత్న’ కోసం తాను గడువులోపలే అన్ని పత్రాలు సమర్పించానని, ఈ విషయంలో ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుందని, ఈ అంశాన్ని మరోసారి పరిశీలించాలని పంజాబ్ క్రీడాశాఖ మంత్రి రాణా గుర్మీత్ సింగ్ సోధీని భజ్జీ ఈ వీడియోలో కోరారు. తన నామినేషన్ పత్రాలు కేంద్రానికి ఆలస్యంగా అందడంతో తన పేరును ఈసారి ‘ఖేల్ రత్న’ కోసం పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలిసిందని పేర్కొన్నారు. ఇలాంటి పరిణామాలు క్రీడాకారులను నిరుత్సాహపరుస్తాయని, తమను పట్టించుకోవడం లేదన్న భావన కలిగిస్తాయని భజ్జీ పేర్కొన్నారు. నిజానికి మార్చి 20నే తన ప్రతాలను సమర్పించానని, తన పత్రాలు కేంద్రానికి ఎందుకు ఆలస్యంగా వెళ్లాయో అర్థం కావడం తెలిపారు. తమ సేవలను గుర్తించి అవార్డులు ఇవ్వడం.. క్రీడాకారులకు గొప్ప ప్రోత్సాహం కల్పిస్తుందని, పంజాబ్ క్రీడాశాఖ ఇప్పటికైనా తన పత్రాలను కేంద్రానికి పంపాలని కోరారు. -
నీ ప్రేమతో నన్ను పూర్తిగా మార్చావ్ : కోహ్లి
సోషల్ మీడియా సాక్షిగా.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, తన భార్య అనుష్క శర్మ మీద ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. బుధవారం కోహ్లి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్‌రత్న’ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్‌లో, అనుష్క ఫోటోను షేర్ చేస్తూ ‘అడ్డంకులను ఎదుర్కొంటూ.. మంచి పనులు చేసుకుంటూ ముందుకు నడిచేలా నిరంతరం నన్ను ప్రోత్సాహించే వ్యక్తి.. నిజమైన ప్రేమలోని శక్తిని తెలియజేసి.. నన్ను పూర్తిగా మార్చిన వ్యక్తి.. నా బలం.. నా సోల్మెట్’ అంటూ అనుష్క శర్మ గురించి ట్వీట్ చేశారు. View this post on Instagram The person that inspires me to push forward despite all obstacles. The person that guides me to do the right thing in life against all odds. The person that has changed me inside out and made me realise the power of true love. My strength. My soulmate ❤️ A post shared by Virat Kohli (@virat.kohli) on Sep 26, 2018 at 2:56am PDT బుధవారం కోహ్లి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ‘ఖేల్ రత్న’ పురస్కారం అందుకున్నారు. ఈ పురస్కారం అందుకున్న మూడో భారత క్రికెటర్‌గా కోహ్లి నిలిచారు. గతంలో సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోని ఈ అత్యున్నత క్రీడా పురస్కారాన్ని అందుకున్నారు. తాజాగా కోహ్లి మూడో వ్యక్తిగా వారి సరసన చేరాడు. -
దీపా మలిక్ అప్పీల్...
రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తన పేరును ఖేల్‌రత్న అవార్డు కోసం మరోసారి పరిశీలించాలంటూ పారాలింపియన్ దీపా మలిక్ ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. ఒలింపిక్స్ జరిగిన ఏడాది ఎక్కవ మందికి ఈ అవార్డు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి తాను మళ్లీ అప్పీల్ చేస్తున్నట్లు ఆమె చెప్పింది. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా ఆమెకు మద్దతుగా కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పటి వరకైతే అవార్డుల కమిటీ ఇచ్చిన జాబితాకు కేంద్ర క్రీడా శాఖ ఇంకా ఆమోద ముద్ర వేయలేదు. అయితే దీప పేరును పరిశీలించే అవకాశం లేదని కమిటీలో ఒక సభ్యుడు వెల్లడించినట్లు సమాచారం. రియోలో పతకం సాధించిన పారాలింపియన్లు అందరికీ అవార్డు ఇవ్వలేమని చెప్పిన ఆయన, దేవేంద్ర జజరియాకు ఇది రెండో ఒలింపిక్ స్వర్ణమనే విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు తమకు శిక్షణ ఇచ్చారంటూ ఒకరికంటే ఎక్కువ మంది కోచ్‌ల పేర్లను ద్రోణాచార్య అవార్డుకు సిఫారసు చేసే ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బాక్సర్ అఖిల్ కుమార్ అభిప్రాయపడ్డాడు. వారిపై 420 కేసు పెట్టాలని అతను ఘాటుగా వ్యాఖ్యానించాడు. మహిళల బాక్సింగ్‌లో ముగ్గురు అర్జున అవార్డీలు ఉండగా, ఐదుగురు ద్రోణాచార్యలు ఎలా ఉంటారని అతను ప్రశ్నించాడు. మారాల్సిందే.. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఖేల్‌రత్న అవార్డును అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఒక్క ఆటగాడికి మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు ఇది ముగ్గురు, నలుగురికి ఇస్తున్నారు. మున్ముందు ఆరుగురి దాకా వెళుతుందేమో? గడువు ముగిసిన తర్వాత కూడా ఆటగాళ్ల పేర్లను సిఫారసు చేయడాన్ని క్రీడా శాఖ మానుకోవాలి. 1960 నుంచి 1980 దశకం వరకు అర్జున అవార్డు విజేతలు వీటిని చాలా గొప్పగా భావించేవారు. ఇప్పటి పరిస్థితుల్లో అర్జున, ద్రోణాచార్య అవార్డులకు విలువ లేకుండా పోయింది. త్వరలోనే ఖేల్‌రత్న కూడా ఇదే ఒరవడిలోకి వస్తుందేమో. ‘తమ’వారికి సడలింపులు 2003లో ఖేల్‌రత్న కోసం ముందుగా అంజూ బాబీ జార్జి ఎంపికయ్యింది. అయితే డబుల్ ట్రాప్ షూటర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఏథెన్స్ ఒలింపిక్స్‌లో దేశం నుంచి తొలి వ్యక్తిగత రజతం సాధించడంతో అంజూకు బదులు రాథోడ్‌కు ఈ అవార్డు ఇచ్చారు. నిజానికి నాలుగేళ్ల కోసారి జూలై–ఆగస్టు మధ్య ఒలింపిక్స్ జరుగుతాయి. అయితే అప్పటికే జాతీయ క్రీడా అవార్డుల ప్రతిపాదన గడువు కూడా ముగుస్తుంది. కానీ ప్రభుత్వం అత్యుత్సాహంతో నిబంధనలను పక్కనబెట్టి రాథోడ్‌కు ఇచ్చింది. ఆ తర్వాతి ఏడాదికి అంజూను ఎంపిక చేశారు. తదనంతరం కూడా ఇలాంటి వ్యవహారాలు జరిగాయి. -
అయ్యో..అర్జున!
∙ వివాదాస్పదమవుతున్న జాతీయ క్రీడా పురస్కారాలు ∙ ఎంపికలో లోపించిన పారదర్శకత ∙ నిరాశలో నిజమైన అర్హులు దీపా మలిక్... రియో పారాలింపిక్స్ షాట్‌పుట్‌లో రజతం నెగ్గి వార్తల్లో నిలిచిన అథ్లెట్. అంతేకాదు పారాలింపిక్స్ చరిత్రలో పతకం సాధించిన తొలి భారత మహిళగానూ ఖ్యాతికెక్కింది. అయితే ఇటీవలి రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డుల జాబితాలో తన పేరు లేకపోవడం ఆమెను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. ఎందుకంటే ఆమెతో పాటే రియోలో పతకం నెగ్గిన దేవేంద్ర జజరియాకు ఇప్పుడు అవార్డు దక్కబోతోంది మరి. ఇక భారత అగ్రశ్రేణి మోటార్ రేసింగ్ డ్రైవర్ గౌరవ్ గిల్ అయితే ఏకంగా ప్రభుత్వంపైనే విమర్శల బాణాన్ని ఎక్కుపెట్టాడు. అర్జున అవార్డుల కోసం తన క్రీడను పరిగణలోకి తీసుకోకపోవడం దారుణమంటున్నాడు. ఓ క్రికెటర్ పది మంచి బంతులు వేయగానే అతనికి ‘అర్జున’ దక్కుతుందని.. ఇదో పెద్ద జోక్ అని రెండు సార్లు ఆసియా పసిఫిక్ ర్యాలీ చాంపియన్‌గా నిలిచిన గిల్ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఇక టెన్నిస్ డబుల్స్ ఆటగాడు రోహన్ బోపన్న ఎంతగా పేరు గడించినా ఇప్పటికీ అతనికి అర్జున దక్కలేదు. ఈసారి కూడా అతడి పేరును అఖిల భారత టెన్నిస్ సంఘం నామినేట్ చేయకపోవడం అతడిని ఆగ్రహానికి గురిచేసింది. అసలు దేశంలోని ఆటగాళ్లంతా గర్వించదగ్గ స్థాయిలో ఉండాల్సిన ఈ క్రీడా అవార్డులపై ఏడాదికేడాది ఇలా విమర్శలు ఎందుకు పెరుగుతున్నాయి? అవార్డుల కమిటీ తమ ఎంపికలో ఎలాంటి అంశాలను లెక్కలోకి తీసుకుంటుంది? సాక్షి క్రీడా విభాగం : ప్రతీ ఏడాది జాతీయ క్రీడా అవార్డుల ప్రకటన, వాటితో పాటు వివాదం వెంట రావడం పరిపాటిగా మారిపోయింది. ఈసారి కూడా అదే మళ్లీ జరిగింది. కేంద్ర క్రీడా శాఖ ఓ వైపు ఈ విషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని చెప్పుకుంటోంది. అయినా ‘ఈ అవార్డులు పూర్తిగా రాజకీయమైపోయాయి.. నీకు అవార్డు రావాలంటే సంబంధాలను పెంచుకోవాల్సిందే’ అనే అభిప్రాయం కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఎందుకంటే ప్రతీసారి అర్జున, రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డుల ప్రకటన వెలువడగానే అసంతృప్తుల గళాలు కూడా ఎక్కువవుతున్నాయి. కొందరైతే కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వస్తోంది. దేశం తరఫున ఆడి పతకాలు సాధించేందుకు తమ జీవితాన్ని పణంగా పెడుతున్నా ఎలాంటి గుర్తింపు రాకపోతే ఎలా అనేది వారి ఆవేదన. ప్రభుత్వం నుంచి ఓ చిన్న గుర్తింపు తమ ఇన్నేళ్ల కష్టాన్ని మరిచిపోయేలా చేస్తుందనేది నిరాదరణకు గురవుతున్న అథ్లెట్ల ఆశ. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్‌రత్న’ జాబితాలో తన పేరు లేకపోవడంతో దీపా మలిక్ కమిటీ అవార్డుల కమిటీ తీరును విమర్శించింది. ఎందుకంటే పారాలింపిక్స్‌లో దేశానికి వచ్చిన పతకాలు నాలుగు. ఇందులో మరియప్పన్ తంగవేలు, దేవేంద్ర జజరియాలు స్వర్ణం సాధించారు. దీపా రజతం, వరుణ్ భటి కాంస్యం దక్కించుకున్నారు. ఇందులో దేవేంద్రకు అత్యున్నత క్రీడా పురస్కారం దక్కనుంది. ‘నా ప్రతిభ ఎందుకు మిగతా వారికన్నా తక్కువగా కనిపించింది. ఈ క్రీడల్లో పతకం సాధించిన తొలి మహిళగా నేను పేరు తెచ్చుకున్నాను. కనీసం ఆ గొప్పతనాన్ని కూడా గౌరవించకపోతే ఎలా?’ అని దీపా ప్రశ్నించింది. మరోవైపు భారత టాప్ ర్యాలీ డ్రైవర్ గౌరవ్ గిల్ అర్జున అవార్డు విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. నిజానికి మోటార్ రేసింగ్‌ను కేంద్రం అసలు ఓ క్రీడగానే భావించడం లేదు. ఇప్పటిదాకా ఒక్క రేసర్ కూడా అర్జునను దక్కించుకోలేదు. కేవలం రెండేళ్ల కిందటే కేంద్రం రేసింగ్‌ను గుర్తించింది. భారత్ నుంచి తొలి ఫార్ములావన్ డ్రైవర్‌గా నిలిచిన నరైన్ కార్తీకేయన్కు మాత్రం 2010లో పద్మశ్రీ దక్కింది. క్రికెటర్లు ఎప్పుడో ఒక్కసారి మెరుగ్గా ఆడినా అతడికి వెంటనే అర్జున దక్కడం ఎంతవరకు సబబని 35 ఏళ్ల గౌరవ్ ప్రశ్నించాడు. నిజానికి క్రికెట్ ఒలింపిక్ క్రీడ కాకపోయినా ప్రతీ ఏడాది వారికి మాత్రం అవార్డులు దక్కుతుంటాయని అన్నాడు. ఇక అర్జున కోసం గడువు లోపల తన పేరును కేంద్రానికి పంపకపోవడంతో అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా)పై డబుల్స్ స్టార్ రోహన్న బోపన్న విరుచుకుపడ్డాడు. గతంలోనూ తన విషయంలో ‘ఐటా’ ఇలాగే వ్యవహరించిందని జూన్‌లో ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్‌ను గెలుచుకున్న బోపన్న తెలిపాడు. అయితే భారత్ తరఫున కనీసం ఆసియా క్రీడలు లేదా కామన్వెల్త్ క్రీడల్లో ఎలాంటి పతకం సాధించని బోపన్న పేరును ప్రతీసారి కమిటీ తిరస్కరిస్తోందని ‘ఐటా’ చెబుతోంది. ఏదేమైనా భారత క్రీడాభిమానుల్లో మాత్రం అవార్డీల ఎంపిక వ్యాపారంగా మారిపోతోందని, దీన్ని సమూలంగా మార్చాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. మిల్కా సింగ్ తిరస్కరణ... 2001లో అథ్లెట్ రచనా గోవిల్, జిమ్నాస్ట్ కల్పనా దేవ్‌నాథ్‌లకు అర్జున అవార్డులు ఇవ్వడాన్ని ఆసియా డిస్కస్ చాంపియన్ అనిల్ కుమార్ కోర్టులో సవాల్ చేశాడు. దీంతో రామనాథన్ కృష్ణన్, ప్రకాశ్ పదుకొనే, సునీల్ గావస్కర్‌లాంటి మేటి క్రీడాకారులు సెలక్షన్ కమిటీలో ఉండాలని కోర్టు అభిప్రాయపడింది. అదే ఏడాది దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ కూడా తనకు ఆలస్యంగా లభించిన జీవితకాల సాఫల్య పురస్కారాన్ని తీసుకునేందుకు నిరాకరించారు. తన స్థాయికి ఏమాత్రం సరితూగని వారితో కలిసి ఆ అవార్డును స్వీకరించలేనని తేల్చి చెప్పారు. కోర్టు కేసులూ ఉన్నాయి గత కొన్నేళ్లుగా కోర్టు కేసులు క్రీడా శాఖను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మనోజ్ కుమార్ పేరుతోనే ఉన్న మరో బాక్సర్ డోపింగ్‌కు పాల్పడితే... కపిల్‌దేవ్ నేతృత్వంలోని కమిటీ పొరపాటు పడి సీనియర్ బాక్సర్ మనోజ్ కుమార్ పేరును అర్జున జాబితా నుంచి తొలగించింది. ఈ విషయంలో మనోజ్ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాడు. కానీ మనోజ్ పేరును జాబితాలో చేర్చేందుకు రెండోసారి సమావేశం కావడానికి కమిటీ అంగీకరించలేదు. అయితే కోర్టు మాత్రం అతడికి అవార్డు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. -
ఖేల్ రత్నకు ఇద్దరి పేర్లు సిఫారుసు!
ఢిల్లీ: మన జాతీయ క్రీడైన హాకీలో సుదీర్ఘకాలంగా ముఖ్య భూమిక పోషిస్తున్న మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్ పేరును దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు సిఫారుసు చేశారు. సర్దార్ తో పాటు పారా ఒలింపియన్ దేవేందర్ ఝఝారియాను ఖేల్ రత్న అవార్డుకు ప్రతిపాదించారు. ఈ మేరకు గురువారం అవార్డుల సెలక్షన్ కమిటీ పలువురు ఆటగాళ్ల జాబితాను సిద్దం చేసింది. ఇందులో ఇద్దరి పేర్లను ఖేల్ రత్నకు సిఫారుసు చేయగా, మరో 17 మందిని అర్జున అవార్డుల జాబితాలో చోటు కల్పించారు. అర్జునకు సిఫారుసు చేసిన వారిలో క్రికెటర్లు చటేశ్వర పుజరా(పురుష క్రికెటర్), హర్మన్ ప్రీత్ కౌర్ (మహిళా క్రికెటర్)లతో పాటు పారా ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన మరియప్పన్ తంగవేలు, వరుణ్ భాటి, గోల్ఫర్ ఎస్ ఎస్ పీ చవ్రాసియా, హాకీ ఆటగాడు ఎస్ వీ సునీల్ లు ఉన్నారు. -
పారా అథ్లెట్లకూ ‘ఖేల్ రత్న’
• వచ్చే ఏడాది నుంచి అమలు • కేంద్ర క్రీడల మంత్రి వెల్లడి సాక్షి, హైదరాబాద్: దేశ అత్యున్నత క్రీడాపురస్కారమైన ‘రాజీవ్ ఖేల్త్న్ర’ అవార్డును ఇకపై పారాఅథ్లెట్లకూ అందజేస్తామని కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయెల్ వెల్లడించారు. నగరంలోని గోపీచంద్ అకాడమీకి విచ్చేసిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి ఈ అవార్డు కోసం పారాలింపియన్ల పేర్లను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. రియో ఒలింపిక్స్‌పై సమీక్ష జరిపారా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... ‘కేంద్రం క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించింది. దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇందులో భాగంగా త్వరలోనే కొత్త మార్గదర్శనంతో క్రీడలను ముందుకు తీసుకెళతాం. దీనిపై శ్రద్దపెట్టిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు’ అని మంత్రి గోయెల్ అన్నారు. రియో ఒలింపిక్స్ ముగియగానే భారత క్రీడలపై లోతైన అధ్యయనం అవసరమని భావించినట్లు ఆయన చెప్పారు. -
సూపర్ సిరీస్ కోసం రెడీ అవుతున్నా
-
మన సానియా 'రత్నం'
-
మన సానియా 'రత్నం'
భారత మహిళా టెన్నిస్ కు అనధికార బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సానియా మీర్జా కీర్తి కిరీటంలో మరో కిలికితు రాయి చేరింది. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక రాజీవ్ ఖేల్ రత్న అవార్డును సానియా మీర్జా శనివారం అందుకున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీ లో జరిగిన జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమంలో రాష్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా సానియా ఖేల్ రత్న పురస్కారాన్ని అందుకుంది. దీంతో పేస్ తర్వాత ఈ అవార్డు అందుకున్న రెండో టెన్నిస్ ప్లేయర్ గా ఆమె అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సానియా కెరీర్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మూడు, డబుల్స్‌లో ఒక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ను కైవసం చేసుకుంది. గత ఏడాది కాలంగా అంతర్జాతీయ సర్క్యూట్లో హవా కొనసాగిస్తోంది. 2014 చివర్లో డబ్ల్యూటీఏ ఫైనల్స్ నెగ్గి సంచలనం సృష్టించిన మీర్జా...ఈ ఏడాది ఏప్రిల్ రెండో వారంలో వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌కు కూడా చేరుకొని అందనంత ఎత్తులో నిలిచింది. గత ఏడాది బ్యాడ్మింటన్‌లో టాప్ ఆటగాడు లిన్ డాన్‌ను ఓడించి చైనా ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ గెలుచుకున్న కిదాంబి శ్రీకాంత్, స్కేటింగ్‌లో ఎలాంటి ప్రోత్సాహం దక్కకపోయినా కఠోర శ్రమతో గత ఏడాది ప్రపంచ చాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన అనూప్ యామాలు అర్జున అవార్డులు గెలుచుకున్న వారిలో ఉన్నారు. స్పూర్తి నింపింది: సానియా రాజీవ్ ఖేల్ రత్న అందుకోవడం గొప్ప గౌరవం అని సానియా మీర్జా స్పందించింది. ఈ అవార్డు తనలో ఎంతో స్పూర్తి నింపిందని అన్నారు. -
‘ఖేల్‌రత్న’ సానియా
- అధికారికంగా అవార్డు ప్రకటించిన కేంద్రప్రభుత్వం - శ్రీకాంత్, అనూప్, రోహిత్ సహా 17 మందికి అర్జున న్యూఢిల్లీ: భారత మహిళా టెన్నిస్‌కు పుష్కర కాలంకు పైగా ముఖచిత్రంగా మారిన సానియా మీర్జా ఉజ్వల కెరీర్లో ఇప్పుడు మరో నగ చేరింది. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు హైదరాబాదీ సానియా ఎంపికైంది. శుక్రవారం ప్రభుత్వం దీనిని అధికారికంగా ప్రకటించింది. పేస్ తర్వాత ఈ అవార్డు అందుకోనున్న రెండో టెన్నిస్ ప్లేయర్ సానియా. కెరీర్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మూడు, డబుల్స్‌లో ఒక గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన సానియా అంతర్జాతీయ సర్క్యూట్లో గత ఏడాది కాలంగా హవా కొనసాగిస్తోంది. 2014 చివర్లో డబ్ల్యూటీఏ ఫైనల్స్ నెగ్గి సంచలనం సృష్టించిన మీర్జా...ఈ ఏడాది ఏప్రిల్ రెండో వారంలో వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌కు కూడా చేరుకొని అందనంత ఎత్తులో నిలిచింది. ఈ ప్రదర్శనను ఇప్పుడు ప్రభుత్వం గుర్తించింది. అవార్డుల కమిటీలో ఎలాంటి విభేదాలకు తావు లేకుండా ఏకగ్రీవంగా ఆమె ఎంపిక జరిగిందంటే సానియా ఆటతీరు ఎలా ఉందో తెలుస్తుంది. గతంలోనే ప్రభుత్వంనుంచి అర్జున, పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న 29 ఏళ్ల ఈ టెన్నిస్ స్టార్ ఇప్పుడు దేశంలోని అత్యున్నత క్రీడా అవార్డుకు ఎంపికైంది. ప్రస్తుతం ఆమె తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తోంది. అందరికీ ఆమోదముద్ర మరో వైపు 17 మంది ఆటగాళ్లకు అర్జున పురస్కారాలు దక్కనున్నాయి. అవార్డుల కమిటీ ఎంపిక చేసిన జాబితాలో ఎలాంటి మార్పులూ లేకుండా ప్రభుత్వం దీనిని ఆమోదించింది. గతంలో కొన్ని సందర్భాల్లో జరిగినట్లుగా ఈ సారి అవార్డుల విషయంలో ఎలాంటి వివాదం లేకపోవడం విశేషం. హైదరాబాద్ బ్యాడ్మింటన్ సంచలనం కిడాంబి శ్రీకాంత్, అంతర్జాతీయ స్కేటర్ అనూప్ యామాలు అర్జున జాబితాలో ఉన్నారు. బ్యాడ్మింటన్‌లో గత ఏడాది టాప్ ఆటగాడు లిన్ డాన్‌ను ఓడించి చైనా ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ గెలుచుకున్న శ్రీకాంత్ ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత వరల్డ్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి కూడా ఎగబాకాడు. స్కేటింగ్‌లో ఎలాంటి ప్రోత్సాహం దక్కకపోయినా కఠోర శ్రమతో అనూప్ యామా పలు పతకాలు గెలుచుకున్నాడు. గత ఏడాది ప్రపంచ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించడం అతనికి ‘అర్జున’ అవకాశం కల్పించింది. వన్డే క్రికెట్లో రెండు డబుల్ సెంచరీలతో సంచలనం సృష్టించిన రోహిత్ శర్మతో పాటు భారత హాకీ జట్టులో నిలకడగా రాణిస్తున్న గోల్‌కీపర్ శ్రీజేశ్‌లకు కూడా అర్జున గౌరవం లభించనుంది. ఈ నెల 29న ధ్యాన్‌చంద్ జయంతిన జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వీటిని అందజేస్తారు. ఇదో గొప్ప గౌరవం. దేశం నాపై కురిపించిన ప్రేమాభిమానాలకు సంతోషంగా ఉంది. ఈ అవార్డు స్ఫూర్తితో దేశానికి మరింత గౌరవం పెంచే విజయాలు సాధిస్తాను. సహచర భారతీయులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. అభినందనల వెల్లువ ఖేల్త్న్రకు ఎంపికైన తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియాను, స్కేటర్ అనూప్ యామాను రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అభినందించారు. ఏపీ సీఎం చంద్రబాబు సానియాకు అభినందనలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి కూడా సానియాకు అభినందనలు తెలిపారు. అర్జున అవార్డుకు ఎంపికైన తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు యామా, శ్రీకాంత్‌లను కూడా జగన్మోహన్ రెడ్డి అభినందించారు.