ఖేల్ రత్న అవార్డులు అందుకున్న గుకేశ్‌, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, మనూ బాకర్‌, ప్రవీణ్‌ కుమార్‌ | D Gukesh, Harmanpreet Singh, Manu Bhaker And Para Athlete Praveen Kumar Receives Khel Ratna Awards From President Droupadi Murmu | Sakshi
Sakshi News home page

ఖేల్ రత్న అవార్డులు అందుకున్న గుకేశ్‌, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, మనూ బాకర్‌, ప్రవీణ్‌ కుమార్‌

Published Fri, Jan 17 2025 12:06 PM | Last Updated on Fri, Jan 17 2025 12:06 PM

D Gukesh, Harmanpreet Singh, Manu Bhaker And Para Athlete Praveen Kumar  Receives Khel Ratna Awards From President Droupadi Murmu

భారత దేశపు అత్యున్నత క్రీడా పురస్కారం అయిన "మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు" గతేడాది (2024) నలుగురిని వరించింది. చెస్‌లో డి గుకేశ్‌, పురుషుల హాకీలో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, మహిళల షూటింగ్‌లో మనూ బాకర్‌, పారా-అథ్లెట్ (హై జంప్‌) ప్రవీణ్ కుమార్ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ నలుగురు ఇవాళ (జనవరి 17) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డులు అందుకున్నారు. అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లో జరిగింది.

గుకేశ్‌ అతి చిన్న వయసులో (18) ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌గా నిలిచిన రెండవ భారతీయుడు గుకేష్. గుకేశ్‌ గత నెలలో చైనా గ్రాండ్‌మాస్టర్‌ డింగ్ లిరెన్‌ను ఓడించి వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు.

హర్మన్‌ప్రీత్ సింగ్ భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌. హర్మన్‌ సారథ్యంలో భారత్‌ గతేడాది ఒలింపిక్స్‌ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. భారత్‌ పతకం సాధించడంలో హర్మన్‌ కీలకపాత్ర పోషించాడు.

మ‌నూ భాక‌ర్ .. ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడ‌ల్స్ సాధించిన తొలి భార‌తీయ అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పింది. మనూ బాకర్‌ గ‌తేడాది ఆగ‌స్టులో జ‌రిగిన విశ్వక్రీడ‌ల్లో రెండు కాంస్య పతకాలు (10మీ ఎయిర్ పిస్తోల్‌, 10మీ ఎయిర్ పిస్తోల్ మిక్స్‌డ్ టీం ఈవెంట్ల‌లో) గెలుచుకుంది.

ప్రవీణ్‌ కుమార్‌.. గతేడాది జరిగిన పారాలింపిక్స్‌లో పురుషుల హై జంప్‌ విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు.

పై నలుగురు భారత క్రీడా రంగంలో చేసిన విశేష కృషికి గాను ఖేల్‌ రత్న అవార్డులు అందుకున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement