మన సానియా 'రత్నం' | Rajiv Gandhi Khel Ratna Award to Sania | Sakshi
Sakshi News home page

మన సానియా 'రత్నం'

Published Sat, Aug 29 2015 6:42 PM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

మన సానియా 'రత్నం' - Sakshi

మన సానియా 'రత్నం'

భారత మహిళా టెన్నిస్ కు అనధికార బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సానియా మీర్జా  కీర్తి కిరీటంలో మరో కిలికితు రాయి చేరింది. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక రాజీవ్ ఖేల్ రత్న అవార్డును సానియా మీర్జా శనివారం అందుకున్నారు.  ఇవాళ సాయంత్రం ఢిల్లీ లో జరిగిన జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమంలో  రాష్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా సానియా ఖేల్ రత్న పురస్కారాన్ని అందుకుంది.


దీంతో పేస్ తర్వాత ఈ అవార్డు అందుకున్న రెండో టెన్నిస్ ప్లేయర్ గా ఆమె అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సానియా కెరీర్‌లో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో మూడు, డబుల్స్‌లో ఒక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ను కైవసం చేసుకుంది. గత ఏడాది కాలంగా అంతర్జాతీయ సర్క్యూట్‌లో హవా కొనసాగిస్తోంది. 2014 చివర్లో డబ్ల్యూటీఏ ఫైనల్స్ నెగ్గి సంచలనం సృష్టించిన మీర్జా...ఈ ఏడాది ఏప్రిల్ రెండో వారంలో వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌కు కూడా చేరుకొని అందనంత ఎత్తులో నిలిచింది.


గత ఏడాది బ్యాడ్మింటన్‌లో టాప్ ఆటగాడు లిన్ డాన్‌ను ఓడించి చైనా ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ గెలుచుకున్న కిదాంబి శ్రీకాంత్, స్కేటింగ్‌లో ఎలాంటి ప్రోత్సాహం దక్కకపోయినా కఠోర శ్రమతో గత ఏడాది ప్రపంచ చాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన అనూప్ యామాలు అర్జున అవార్డులు గెలుచుకున్న వారిలో ఉన్నారు.

స్పూర్తి నింపింది: సానియా

రాజీవ్ ఖేల్ రత్న అందుకోవడం గొప్ప గౌరవం అని సానియా మీర్జా స్పందించింది. ఈ అవార్డు తనలో ఎంతో స్పూర్తి నింపిందని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement