Indian womens tennis
-
మెయిన్ ‘డ్రా’కు అంకిత రైనా
వార్సా (పోలాండ్): భారత మహిళా టెన్నిస్ నంబర్‌వన్ అంకిత రైనా వార్సా ఓపెన్ డబ్ల్యూటీఏ–250 టోరీ్నలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 200వ ర్యాంక్‌లో ఉన్న అంకిత సోమవారం జరిగిన క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్‌లో 4–6, 6–3, 6–1తో జోనా గార్లాండ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. 2 గంటల 15 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అంకిత ప్రత్యర్థి సరీ్వస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. అంతకుముందు క్వాలిఫయింగ్ తొలి రౌండ్ మ్యాచ్‌లో అంకిత 6–3, 6–1తో ఒలివియా లిన్సెర్ (పోలాండ్)పై గెలిచింది. డబుల్స్ విభాగంలో చైనా ప్లేయర్ యు యువాన్‌తో జతకట్టి అంకిత బరిలోకి దిగనుంది. -
వుహాన్ ఓపెన్ టైటిల్ సానియా జోడీదే
చైనా: వుహాన్ ఓపెన్ టైటిల్‌ను సానియా జోడీ కైవసం చేసుకుంది. శనివారం చైనాలోని వుహాన్‌లో జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ సానియా మీర్జా - స్విస్ స్టార్ మార్టినా హింగిస్ జోడీ, ఇరీనా కామెలియా బెగూ - మోనికా నికెలెస్కూ (రుమేనియా) జోడీపై 6-2, 6-3 తేడాతో విజయం సాధించింది. ఈ ఏడాది పదో టోర్నమెంట్లో టైటిల్ పోరుకు అర్హత సాధించిన తన భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి సానియా వుహాన్ ఓపెన్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఏడో విజయాన్ని సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-2, 6-1తో నాలుగో సీడ్ హావో చింగ్ చాన్-యుంగ్ జాన్‌చాన్ (చైనీస్ తైపీ) జోడీపై విజయం సాధించింది. 53 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఈ ఇండో-స్విస్ జంట తమ సర్వీస్‌ను మూడుసార్లు కాపాడుకొని ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. -
ఫైనల్లో సానియా జంట
న్యూఢిల్లీ: భారత మహిళల టెన్నిస్ డబుల్స్ స్టార్ సానియా మీర్జా ఈ ఏడాది పదో టోర్నమెంట్లో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. తన భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి సానియా వుహాన్ ఓపెన్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. చైనాలోని వుహాన్ నగరంలో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-2, 6-1తో నాలుగో సీడ్ హావో చింగ్ చాన్-యుంగ్ జాన్‌చాన్ (చైనీస్ తైపీ) జోడీపై విజ యం సాధించింది. 53 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఈ ఇండో-స్విస్ జంట తమ సర్వీస్‌ను మూడుసార్లు కాపాడుకొని ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. శనివారం జరిగే ఫైనల్లో ఇ రీనా కామెలియా బెగూ-మోనికా నికెలెస్కూ (రుమేనియా) జోడీతో సానియా-హింగిస్ తలపడతారు. -
మన సానియా 'రత్నం'
భారత మహిళా టెన్నిస్ కు అనధికార బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సానియా మీర్జా కీర్తి కిరీటంలో మరో కిలికితు రాయి చేరింది. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక రాజీవ్ ఖేల్ రత్న అవార్డును సానియా మీర్జా శనివారం అందుకున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీ లో జరిగిన జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమంలో రాష్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా సానియా ఖేల్ రత్న పురస్కారాన్ని అందుకుంది. దీంతో పేస్ తర్వాత ఈ అవార్డు అందుకున్న రెండో టెన్నిస్ ప్లేయర్ గా ఆమె అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సానియా కెరీర్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మూడు, డబుల్స్‌లో ఒక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ను కైవసం చేసుకుంది. గత ఏడాది కాలంగా అంతర్జాతీయ సర్క్యూట్లో హవా కొనసాగిస్తోంది. 2014 చివర్లో డబ్ల్యూటీఏ ఫైనల్స్ నెగ్గి సంచలనం సృష్టించిన మీర్జా...ఈ ఏడాది ఏప్రిల్ రెండో వారంలో వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌కు కూడా చేరుకొని అందనంత ఎత్తులో నిలిచింది. గత ఏడాది బ్యాడ్మింటన్‌లో టాప్ ఆటగాడు లిన్ డాన్‌ను ఓడించి చైనా ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ గెలుచుకున్న కిదాంబి శ్రీకాంత్, స్కేటింగ్‌లో ఎలాంటి ప్రోత్సాహం దక్కకపోయినా కఠోర శ్రమతో గత ఏడాది ప్రపంచ చాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన అనూప్ యామాలు అర్జున అవార్డులు గెలుచుకున్న వారిలో ఉన్నారు. స్పూర్తి నింపింది: సానియా రాజీవ్ ఖేల్ రత్న అందుకోవడం గొప్ప గౌరవం అని సానియా మీర్జా స్పందించింది. ఈ అవార్డు తనలో ఎంతో స్పూర్తి నింపిందని అన్నారు. -
‘ఖేల్‌రత్న’ సానియా
- అధికారికంగా అవార్డు ప్రకటించిన కేంద్రప్రభుత్వం - శ్రీకాంత్, అనూప్, రోహిత్ సహా 17 మందికి అర్జున న్యూఢిల్లీ: భారత మహిళా టెన్నిస్‌కు పుష్కర కాలంకు పైగా ముఖచిత్రంగా మారిన సానియా మీర్జా ఉజ్వల కెరీర్లో ఇప్పుడు మరో నగ చేరింది. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు హైదరాబాదీ సానియా ఎంపికైంది. శుక్రవారం ప్రభుత్వం దీనిని అధికారికంగా ప్రకటించింది. పేస్ తర్వాత ఈ అవార్డు అందుకోనున్న రెండో టెన్నిస్ ప్లేయర్ సానియా. కెరీర్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మూడు, డబుల్స్‌లో ఒక గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన సానియా అంతర్జాతీయ సర్క్యూట్లో గత ఏడాది కాలంగా హవా కొనసాగిస్తోంది. 2014 చివర్లో డబ్ల్యూటీఏ ఫైనల్స్ నెగ్గి సంచలనం సృష్టించిన మీర్జా...ఈ ఏడాది ఏప్రిల్ రెండో వారంలో వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌కు కూడా చేరుకొని అందనంత ఎత్తులో నిలిచింది. ఈ ప్రదర్శనను ఇప్పుడు ప్రభుత్వం గుర్తించింది. అవార్డుల కమిటీలో ఎలాంటి విభేదాలకు తావు లేకుండా ఏకగ్రీవంగా ఆమె ఎంపిక జరిగిందంటే సానియా ఆటతీరు ఎలా ఉందో తెలుస్తుంది. గతంలోనే ప్రభుత్వంనుంచి అర్జున, పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న 29 ఏళ్ల ఈ టెన్నిస్ స్టార్ ఇప్పుడు దేశంలోని అత్యున్నత క్రీడా అవార్డుకు ఎంపికైంది. ప్రస్తుతం ఆమె తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తోంది. అందరికీ ఆమోదముద్ర మరో వైపు 17 మంది ఆటగాళ్లకు అర్జున పురస్కారాలు దక్కనున్నాయి. అవార్డుల కమిటీ ఎంపిక చేసిన జాబితాలో ఎలాంటి మార్పులూ లేకుండా ప్రభుత్వం దీనిని ఆమోదించింది. గతంలో కొన్ని సందర్భాల్లో జరిగినట్లుగా ఈ సారి అవార్డుల విషయంలో ఎలాంటి వివాదం లేకపోవడం విశేషం. హైదరాబాద్ బ్యాడ్మింటన్ సంచలనం కిడాంబి శ్రీకాంత్, అంతర్జాతీయ స్కేటర్ అనూప్ యామాలు అర్జున జాబితాలో ఉన్నారు. బ్యాడ్మింటన్‌లో గత ఏడాది టాప్ ఆటగాడు లిన్ డాన్‌ను ఓడించి చైనా ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ గెలుచుకున్న శ్రీకాంత్ ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత వరల్డ్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి కూడా ఎగబాకాడు. స్కేటింగ్‌లో ఎలాంటి ప్రోత్సాహం దక్కకపోయినా కఠోర శ్రమతో అనూప్ యామా పలు పతకాలు గెలుచుకున్నాడు. గత ఏడాది ప్రపంచ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించడం అతనికి ‘అర్జున’ అవకాశం కల్పించింది. వన్డే క్రికెట్లో రెండు డబుల్ సెంచరీలతో సంచలనం సృష్టించిన రోహిత్ శర్మతో పాటు భారత హాకీ జట్టులో నిలకడగా రాణిస్తున్న గోల్‌కీపర్ శ్రీజేశ్‌లకు కూడా అర్జున గౌరవం లభించనుంది. ఈ నెల 29న ధ్యాన్‌చంద్ జయంతిన జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వీటిని అందజేస్తారు. ఇదో గొప్ప గౌరవం. దేశం నాపై కురిపించిన ప్రేమాభిమానాలకు సంతోషంగా ఉంది. ఈ అవార్డు స్ఫూర్తితో దేశానికి మరింత గౌరవం పెంచే విజయాలు సాధిస్తాను. సహచర భారతీయులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. అభినందనల వెల్లువ ఖేల్త్న్రకు ఎంపికైన తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియాను, స్కేటర్ అనూప్ యామాను రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అభినందించారు. ఏపీ సీఎం చంద్రబాబు సానియాకు అభినందనలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి కూడా సానియాకు అభినందనలు తెలిపారు. అర్జున అవార్డుకు ఎంపికైన తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు యామా, శ్రీకాంత్‌లను కూడా జగన్మోహన్ రెడ్డి అభినందించారు. -
బెస్ట్ సిటీ
అందంలో, ఆటలో, ఫ్యాషన్‌లో ఆమె ఓ ఐకాన్.. భారత మహిళా టెన్నిస్ మణిపూస. నవాబుల నగరానికి నగిషీలుగా చెప్పుకోదగ్గ కొద్దిమంది జాబితాలో ఈ స్టార్ స్థానం ఎన్నటికీ పదిలం. మా హైదరాబాదీ అని అందరూ గర్వంగా చెప్పుకోగల ఆ సెలబ్రిటీయే సానియా మీర్జా. భాగ్యనగరంతో తనకున్న అనుబంధం, అల్లుకున్న జ్ఞాపకాలను ఆమె ‘సిటీప్లస్’తో పంచుకుంది. విశేషాలు సానియా మాటల్లోనే.. హైదరాబాద్ సానియా మీర్జా హైదరాబాద్‌లో ప్రతీది నాకు నచ్చే అంశమే. ఇక్కడ కాకుండా మరో చోట ఉండాలనుకోవడం నాకు సాధ్యం కాని విషయం. టోర్నీల మధ్య వారం రోజుల విరామం వచ్చినా నేను వెంటనే ఇక్కడికి వచ్చేస్తాను. ఇక్కడి చరిత్ర, సంస్కృతి, జనం, ఆహారం.. అంతా బాగుంటుంది. నగరంలోని వెస్ట్ అండ్ ఈస్ట్ మిక్స్డ్ కల్చర్ నాకు చాలా ఇష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే ‘ది బెస్ట్ సిటీ’ అంటాను. చాలా మారిపోయింది.. గతంతో పోలిస్తే సిటీ చాలా మారిపోయింది. ముఖ్యంగా అవుటర్ రింగ్‌రోడ్‌తో పాటు ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. నాకు తెలిసిన చాలా మంది విదేశీయులకు హైదరాబాద్ అంటే తేలిక భావం ఉండేది. కానీ ఈ మధ్య వారు ఇక్కడి అభివృద్ధి చూశాక తమ అభిప్రాయం మార్చుకున్నారు. నా దృష్టిలో ఇక్కడ పెద్దగా సమస్యలు లేవు. కబాబ్ చాలా ఇష్టంగా తినేవాళ్లం ఠంచనుగా వీకెండ్సలో ట్యాంక్‌బండ్‌కు ఫ్యామిలీతో వెళ్లేవాళ్లం. అక్కడ లభించే కబాబ్స్ మేం చాలా ఇష్టంగా తినేవాళ్లం. సినిమాలాంటి సరదాలు పెద్దగా లేవు. టెన్నిస్ ప్లేయర్‌గా గుర్తింపు వచ్చిన తర్వాత బయట తిరిగే ధైర్యం చాలా కాలం పాటు చేయలేకపోయాను. రంజాన్ ప్రత్యేకం ఈ మాసంలో ఇక్కడ కనిపించే ఆధ్యాత్మిక వాతావరణం, రోజాలు, ఇఫ్తార్ పార్టీలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. ప్రపంచంలో మరో చోట ఇలాంటివి చూడలేం. ప్రొఫెషనల్‌గా మారాక రంజాన్‌లో ఇక్కడ ఉండే అవకాశమే చాలాసార్లు రావట్లేదు. ఈసారి కూడా పండగకు మూడు రోజుల ముందే అమెరికా వెళ్లిపోతున్నాను. చిన్నప్పుడు రంజాన్‌లో తప్పనిసరిగా లాడ్‌బజార్‌కు వచ్చి గాజులు, దుస్తులు కొనడం నాకిప్పటికీ గుర్తే. ఇప్పుడు నేను వెళ్లి షాపింగ్ చేయలేను కానీ, ఇతర అమ్మాయిల్లాగే నేను కూడా వాటిని బాగా ఇష్టపడతాను. ప్రైవసీ ఉండేచోటే.. ఎక్కడైతే ప్రైవసీ ఉంటుందో, మీడియా సమస్య ఉండదో అక్కడికే వెళ్తాను. ఎందుకంటే ఎవరితో వెళ్లాం, ఏం తిన్నాం వంటివి కూడా కొంతమంది రాయాలని ప్రయత్నించడం చిరాగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు నగరంలో పెద్ద సంఖ్యలో రెస్టారెంట్లు ఉన్నాయి. తరచుగా ఎన్ గ్రిల్‌కు వెళుతుంటాను. తాజాగా నా ఫేవరేట్ ఈటింగ్ స్పాట్ అదే. టెన్నిస్ వదిలేస్తే... కామెంటేటర్‌గా వెళ్తానేమో.. కొన్నాళ్ల క్రితం జూబ్లీహిల్స్‌లో రిస్ట్రెట్టో పేరుతో నా చెల్లెలితో కలిసి కాఫీ షాప్ ప్రారంభించే ప్రయత్నం చేశాను. ఇక ఆరంభమే తరువాయి అనుకున్న సమయంలో ఆ స్థలం న్యాయ వివాదాల్లో చిక్కుకుంది. దాంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే హైదరాబాద్‌లోనే మరొకటి ఏదైనా చేస్తాను. ముసుగేసుకుని.. ఇన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నా.. ఒకే ఒక్కసారి నా మనసుకు నచ్చిన విధంగా ఓ సాహసం చేశాను. గత ఏడాది రంజాన్‌లో నా ముఖానికి మొత్తం దుపట్టా కట్టుకొని కొంత మంది ఫ్రెండ్స్‌తో చార్మినార్ వెళ్లాను. చాలా ఎక్కువ మంది జనం ఉన్నారు. సాయంత్రం నుంచి దాదాపు రాత్రి వరకు చార్మినార్ పరిసరాలు అంతా తిరిగాను. పూర్తిగా ముసుగు ఉండటంతో నన్నెవరూ గుర్తు పట్టలేదు. చివరకు ఒక హోటల్‌కు వెళ్లాం. రాత్రి 2 గంటల సమయంలో అక్కడ హలీమ్, పాయా వంటివి తినడం చాలా స్పెషల్‌గా అనిపించింది.