న్యూఢిల్లీ: విదేశీయులుగా ప్రకటించిన వారిని రాష్ట్రం నుంచి బహిష్కరించకపోవడానికి తోడు వారిని నిర్బంధ కేంద్రాల్లో నిరవధికంగా ఉంచడంపై సుప్రీంకోర్టు అస్సాం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిని పంపేందుకు ఏదైనా ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారా అని కూడా అస్సాం ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. నిర్బంధ కేంద్రాల్లో నివసిస్తున్న 63 మందిని రెండు వారాల్లోగా వారి దేశాలకు తిరిగి పంపించాలని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అసోంనకు వచ్చిన వలసదారులు తమ విదేశీ చిరునామాలను వెల్లడించనందున వారి బహిష్కరణ సాధ్యం కాదన్న అస్సాం వాదనను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నిర్బంధ కేంద్రాల్లో ఉంచిన 63 మందిని రెండు వారాల్లోగా బహిష్కరించాలని అస్సాం ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశించింది. జస్టిస్ అభయ్ ఎస్. ఓకా, న్యాయమూర్తి ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై స్పందిస్తూ నిర్బంధంలో ఉన్నవారు విదేశీయులని నిర్ధారించిన వెంటనే వారిని దేశం నుండి బహిష్కరించాలని పేర్కొంది.
వారి చిరునామాలు తెలియవంటూ, వారి బహిష్కరణ ప్రక్రియను ప్రారంభించడానికి ఎందుకు నిరాకరించారని బెంచ్ ప్రశ్నించింది. దీనిపై ఆందోళన ఎందుకు? వారిని వారి దేశానికి తిరిగి పంపండి. రాజ్యాంగం(Constitution)లోని ఆర్టికల్ 21 ప్రకారం వారిని శాశ్వతంగా నిర్బంధ కేంద్రంలో ఉంచలేరని పేర్కొంది. అస్సాంలో విదేశీయుల కోసం అనేక నిర్బంధ కేంద్రాలు ఉన్నాయని, ఇప్పటి వరకూ ఎంత మందిని బహిష్కరించారని సుప్రీం కోర్టు అస్సాం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిర్బంధ కేంద్రాల్లో ఉంచిన 63 మందిని రెండు వారాల్లోగా బహిష్కరించడం ప్రారంభించాలని, దీనికి సమ్మతిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని అస్సాం ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. అస్సాంలో విదేశీయులుగా ప్రకటితమైన వ్యక్తుల బహిష్కరణ, నిర్బంధ కేంద్రాల్లోని సౌకర్యాలకు సంబంధించిన పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం విచారించింది.
ఇది కూడా చదవండి: ఎన్‌కౌంటర్‌లో ట్విస్ట్.. కంగుతిన్న పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment