Muhurat
-
సెలవున్నా గంట పని చేస్తాయ్.. ఎందుకంటే?
స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్లలో దీపావళి అంటేనే ప్రత్యేక సందడి నెలకొంటుంది. దీపావళి రోజు లక్ష్మీ పూజతోపాటు, సాయంత్రం సమయంలో మదుపుదారులు, ట్రేడర్లకు వీలుగా గంటసేపు స్టాక్ ఎక్స్ఛేంజీలు ముహూరత్ ట్రేడింగ్‌ను నిర్వహిస్తాయి. ప్రపంచంలో ఇలాంటి ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహించే ఏకైక దేశం మనదే. ఈ ముహూరత్ ట్రేడింగ్ రోజును ఇన్వెస్టర్లు, వ్యాపారులు శుభదినంగా భావిస్తారు.ముహూరత్ ట్రేడింగ్ చరిత్రఈ ముహూరత్ ట్రేడింగ్ అనవాయితీ ఏళ్లనాటిదే. 1957లో బీఎస్ఈ ముహూరత్ ట్రేడింగ్ సంప్రదాయాన్ని ప్రారంభించింది. 1992లో ఎన్ఎస్ఈ దీన్ని అందిపుచ్చుకుంది. మార్కెట్ పెట్టుబడిదారులకు అదృష్టాన్ని తెచ్చే విధంగా అన్ని గ్రహాలు, నక్షత్రాలను గమనించి నిర్వహించే శుభ ముహూర్తంగా దీన్ని పరిగణిస్తారు. ఈ సందర్భంగా వ్యాపారులు పెట్టుబడికి అనుకూలమైనదిగా భావిస్తారు. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బీ సెగ్మెంట్ విభాగాల్లో ట్రేడింగ్ నిర్వహిస్తారు. ఈ ఏడాది క్యాలెండర్ ప్రకారం నవంబర్ 1న ఈ ముహూరత్ ట్రేడింగ్ జరుగనుంది. సాధారణంగా దేశంలోని వ్యాపార సంఘాలు కొత్త ఖాతాలను తెరవడంతోపాటు ఈ రోజున మునుపటి బ్యాలెన్స్ షీట్‌ను క్లోజ్ చేస్తారు. అంటే ఈ రోజును వ్యాపారులు కొత్త వ్యాపార సంవత్సరంగా పరిగణిస్తారు. అలాగే ట్రేడ్ పండితులు, ఎనలిస్టులు, బ్రోకరేజ్ సంస్థలు పలు స్టాక్స్‌ను ట్రేడర్లకు రికమెండ్ చేస్తారు. దీపావళి బలిప్రతిపాద సందర్భంగా నవంబర్ 1న ఎక్స్ఛేంజీలు పనిచేయవు.ఇదీ చదవండి: అధికంగా విక్రయించిన స్టాక్‌లు ఇవే..నవంబర్ 1 దీపావళి ముహూరత్ ట్రేడింగ్ సెషన్ సమయాలుమార్కెట్ సాయంత్రం 6:15కు ఓపెన్ అవుతుంది.మార్కెట్ సాయంత్రం 7:15కు ముగుస్తుంది.ట్రేడ్ సవరణ ముగింపు సమయం సాయంత్రం 7:25 -
వివాహం, గృహప్రవేశం.. ఇంకా ఈ ఏడాది ముహూర్తాలు ఇవే!
క్యాలెండర్- 2023: ముహూర్తాలు ఇవే మాఘమాసం 14.01.23 శనివారం.. సప్తమి, హస్త, మీనలగ్నం ఉ. 10.46 ని.లకు క్రయవిక్రయ, వ్యాపారాదుల, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, విద్యారంభం. 26.01.23 గురువారం.. పంచమి, ఉత్తరాభాద్ర, మీనలగ్నం ఉ. 9.32 ని.లకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం, వ్యాపారం, క్రయవిక్రయాలు, ఉపనయనం, వివాహం, గృహారంభం, గృహప్రవేశం. మిథునలగ్నం సా. 4.18 ని.లకు వ్యాపారం, క్రయవిక్రయాలు. 28.01.23 శనివారం.. సప్తమి, అశ్విని, మీనలగ్నం, ఉ. 5.16 ని.లకు ఉపనయనం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, వివాహం, శంఖుస్థాపన. 05.02.23 ఆదివారం.. పౌర్ణమి, పుష్యమి, మీనలగ్నం ఉ. 9.26 ని.లకు వ్యాపారాదులు, క్రయవిక్రయాదులు, ఉపనయనం, దేవతాప్రతిష్ఠ, మంత్రోపదేశం. ఫాల్గుణ మాసం 24.02.23 శుక్రవారం.. పంచమి, అశ్విని, మీనలగ్నం ఉ. 7.26 ని.కు వ్యాపారాదులు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ఉపనయనం, దేవతాప్రతిష్ఠ, వివాహం, శంఖుస్థాపన, గృహప్రవేశం. కన్యాలగ్నం రా. 8.32 ని.లకు గృహప్రవేశం, వివాహం, గర్భాదానం. ధనుర్లగ్నం తె. 3.22 ని.లకు వివాహం, గృహప్రవేశం. 11.03.23 శనివారం.. బ. పంచమి, స్వాతి, ధనుర్లగ్నం రా. 2.25 ని.లకు వివాహం, గృహప్రవేశం. మకరలగ్నం తె.3.23 ని.లకు గృహప్రవేశం, గృహారంభం, వివాహం. 18.03.23 శనివారం.. ఏకాదశి, శ్రవణం, మకర లగ్నం, తె.3.22 వివాహం, గృహప్రవేశం, గృహారంభం, బోరింగ్. చైత్ర మాసం 22.03.23 బుధవారం.. శు. పాడ్యమి, ఉత్తరాభాద్ర, వృషభలగ్నం, ఉ.10.02 వసంత నవరాత్రుల ప్రారంభం, కలశ స్థాపన, పంచాంగ శ్రవణం 29.03.23 నుండి చైత్ర శుద్ధ అష్టమి నుండి 25.04.23 వైశాఖ శుద్ధ షష్ఠి మంగళవారం వరకు గురుమౌఢ్యమి. 05.04.23 బుధవారం.. శు. చతుర్ధశి, ఉత్తరా, మేషలగ్నంష ఉ.7.39 ని.లకు అన్నప్రాసన, క్రయవిక్రయాలు, దస్త్రము, కేశఖండన. 07.04.23 శుక్రవారం.. బ. పాడ్యమి, చిత్తా, మేషలగ్నం, ఉ.7.31 ని.లకు అన్నప్రాసన, క్రయవిక్రయాలు, దస్త్రము, కేశఖండన. 08.04.23 శనివారం.. విదియ, స్వాతి, వృషభలగ్నం ఉ.8.55 ని.లకు అన్నప్రాసన, క్రయవిక్రయాలు, దస్త్రము, కేశఖండన. 12.04.23 బుధవారం.. సప్తమి, మూలా, మేషలగ్నం ఉ.7.12 ని.లకు డోలారోహణం, అన్నప్రాసన, క్రయవిక్రయాలు, దస్త్రము, కేశఖండన. 15.04.23 శనివారం.. దశమి, ధనిష్ఠ, వృషభలగ్నం ఉ.8.22 ని.లకు డోలారోహణం, అన్నప్రాసన, క్రయవిక్రయాలు, దస్త్రము, కేశఖండన. వైశాఖ మాసం 23.04.23 ఆదివారం.. చవితి, రోహిణి, కర్కాటక లగ్నం, ఉ.11.45 ని.లకు వ్యాపారం, క్రయవిక్రయాలు, అన్నప్రాసన, కేశఖండన, బారసాల. 25.04.23 గురుమోఢ్యమి త్యాగం 03.05.23 బుధవారం.. త్రయోదశి, హస్త, వృషభలగ్నం, ఉ.7.18 ని.లకు వివాహం, గృహారంభం, ఉపనయనం, శంఖుస్థాపన. 07.05.23 ఆదివారం.. బ. విదియ, అనూరాధ, వృషభలగ్నం, ఉ.7.02 వివాహం, గృహారంభం, ఉపనయనం, అన్నప్రాసన, క్రయవిక్రయాలు. 10.05.23 నుండి 28.05.23 వరకు నిజకర్తరి గృహప్రవేశం, శంఖుస్థాపనలు, బోరింగ్లు ఉండవు. 11.05.23 గురువారం.. షష్ఠి, ఉత్తరాషాఢ, వృషభలగ్నం ఉ.6.47 ని.లకు అన్నప్రాసన, దేవతా ప్రతిష్ఠ, వివాహం, సమస్త శుభాలు. జ్యేష్ఠ మాసం 25.05.23 గురువారం.. షష్ఠి, పుష్యమి, మిథున లగ్నం, ఉ.8.40 ని.లకు అన్నప్రాసన, ఉపనయనం, అక్షరాభ్యాసం, వివాహం, క్రయవిక్రయాలు. 31.05.23 బుధవారం.. ఏకాదశి, చిత్తా, మిథున లగ్నం, ఉ.8.16 ని.లకు అన్నప్రాసన, ఉపనయనం, అక్షరాభ్యాసం, శంఖుస్థాపన, ప్రతిష్ఠ, గృహప్రవేశం. 07.06.23 బుధవారం.. చవితి, ఉత్తరాషాఢ, మిథున లగ్నం ఉ.7.49 ని.లకు అన్నప్రాసన, వివాహం. శ్రవణం, మీనలగ్నం, రా.1.04 ని.లకు వివాహం, గర్భాదానం, ప్రయాణం. 09.06.23 శుక్రవారం.. సప్తమి, శతభిషం, మీనలగ్నం, రా.12.56 ని.లకు వివాహం, గృహప్రవేశం. అధిక శ్రావణ మాసం 23.07.23 ఆదివారం.. శు. షష్ఠి, ఉత్తరా, కన్యాలగ్నం ఉ.10.34 ని.లకు డోలారోహణం, క్రయవిక్రయాలు, బారసాల, కేశఖండనం, ప్రయాణాలు. 30.07.23 ఆదివారం.. శు. త్రయోదశి, మూలా, కన్యాలగ్నం ఉ.10.07 ని.లకు డోలారోహణం, క్రయవిక్రయాలు,బారసాల, కేశఖండనం, ప్రయాణాలు. 06.08.23 ఆదివారం.. బ. పంచమి, రేవతి, కన్యాలగ్నం, ఉ.9.35 ని.లకు నామకరణం, డోలారోహణం, క్రయవిక్రయాలు, ప్రయాణం. 08.08.23 మంగళవారం.. శోభకృత్ నామ సంవత్సర అధిక శ్రావణ బహుళ సప్తమి నుండి శోభకృత్ నామ సం.ర నిజ శ్రావణ శుద్ధ తదియ వరకు 19.08.2023 వరకు శుక్ర మౌఢ్యమి. నిజ శ్రావణ మాసం 20.08.23 శుక్లపక్షము ఆదివారం.. చవితి, హస్త, వృషభలగ్నం, రా.12.08 ని.లకు గృహారంభం, గృహప్రవేశం, వివాహం. 24.08.23 గురువారం.. నవమి, అనూరాధ, వృషభలగ్నం, రా.3.11 ని.లకు వివాహం, గృహప్రవేశం, గర్భాదానం. మిథునలగ్నం, రా.12.40 ని.లకు వివాహం, గృహప్రవేశం, గర్భాదానం. 30.08.23 బుధవారం.. పూర్ణిమ, శతభిషం, వృషభలగ్నం, రా.11.30 ని.లకు వివాహం, గృహప్రవేశం, గర్భాదానం. 01.09.23 శుక్రవారం.. బ. విదియ, ఉత్తరాభాద్ర, వృషభ లగ్నం, రా.11.21 ని.లకు వివాహం, గర్భాదానం, గృహప్రవేశం, ప్రయాణాలు. 06.09.23 బుధవారం.. బ. అష్టమి, రోహిణి, వృషభలగ్నం, రా.11.02 ని.లకు వివాహం, గృహారంభం, గృహప్రవేశం, గర్భాదానం, 10.09.23 ఆదివారం.. బ. ఏకాదశి, పునర్వసు, వృశ్చికలగ్నం, రా.11.09 ని.లకు శంఖుస్థాపన, క్రయవిక్రయాలు, భాద్రపద మాసం 17.09.23 ఆదివారం.. శు. తదియ, చిత్త, ధనుర్లగ్నం మ.1.53 ని.లకు డోలారోహణం, బారసాల, కేశఖండన, క్రయవిక్రయాలు. 24.09.23 ఆదివారం.. శు. దశమి పూర్వాషాఢ వృశ్చికలగ్నం, ఉ.10.30 ని.లకు డోలారోహణం, అన్నప్రాసన, నామకరణం, కేశఖండన, క్రయవిక్రయాలు. 25.09.23 సోమవారం.. శు. ఏకాదశి, శ్రవణం, వృశ్చికలగ్నం, ఉ.11.55 ని.లకు డోలారోహణం, అన్నప్రాసన, నామకరణం, కేశఖండన, క్రయవిక్రయాలు. 30.09.23 నుండి 14.10.23 వరకు మహాలయ పక్షములు పితృపక్షాలు ముహూర్తాలు ఉండవు. (14.10.23 మహాలయ అమావాస్య) ఆశ్వయుజ మాసం 15.10.23 ఆదివారం.. శు. పాడ్యమి, చిత్త, వృశ్చిక లగ్నం, ఉ.8.50 ని.లకు శరన్నవరాత్రులు, కలశస్థాపన, దేవి పూజలు. 19.10.23 గురువారం.. శు. పంచమి, జ్యేష్ఠ, వృశ్చికలగ్నం, ఉ.8.31 ని.లకు సరస్వతీ పూజ. 21.10.23 శనివారం.. శు. అష్టమి, ఉత్తరాషాఢ, మిథునలగ్నం, రా.10.54 ని.లకు వివాహం, గృహప్రవేశం 24.10.23 మంగళవారం.. విజయదశమి, ధనిష్ఠ, శుభసమయం ఉ.11.20 నుండి 11.45 ని.ల లోపు విజయ ముహూర్త కాలము. 26.10.23 గురువారం.. త్రయోదశి, ఉత్తరాభాద్ర, మకరలగ్నం, మ.12.45 ని.లకు సమస్త శుభాలు 26.10.23 గురువారం.. త్రయోదశి, ఉత్తరాభాద్ర, కర్కాటకలగ్నం, రా.11.32 ని.లకు వివాహం, గృహప్రవేశం, గర్భాదానం, 01.11.23 బుధవారం.. బ. చవితి, మృగశిర, వృశ్చికలగ్నం, ఉ.8.45 ని.లకు వివాహం, శంఖుస్థాపన, గృహప్రవేశం. 09.11.23 గురువారం.. బ. ఏకాదశి, ఉత్తరా, వృశ్చికలగ్నం, ఉ.07.18 ని.లకు వివాహం, శంఖుస్థాపన, గృహప్రవేశం, గర్భాదానం. కార్తీక మాసం 18.11.23 శనివారం.. శు. పంచమి, ఉత్తరాషాఢ, ధనుర్లగ్నం, ఉ.8.45 ని.లకు వాహం, గృహప్రవేశం, శంఖుస్థాపన 19.11.23 ఆదివారం.. శు. సప్తమి, శ్రవణం, ధనుర్లగ్నం, ఉ.9.41 ని.లకు వివాహం, గృహప్రవేశం, గర్భాదానం. 23.11.23 గురువారం.. శు. ఏకాదశి, ఉత్తరాభాద్ర, ధనుర్లగ్నం, ఉ.9.41 ని.లకు వివాహం, గృహప్రవేశం, శంఖుస్థాపన, గర్భాదానం. 24.11.23 శుక్రవారం.. శు. త్రయోదశి, అశ్విని, మిథునలగ్నం, రా.8.41 ని.లకు వివాహం, గృహప్రవేశం. 29.11.23 బుధవారం.. బ. విదియ,మృగశిర, ధనుర్లగ్నం, ఉ.9.15 ని.లకు వివాహం, శంఖుస్థాపన. 01.12.23 శుక్రవారం.. బ. చవితి, పునర్వసు, మకరలగ్నం, ఉ.10.25 ని.లకు గృహారంభం. 02.12.23 శనివారం.. బ. పంచమి, పుష్యమి, మకరలగ్నం, ఉ.10.21 ని.లకు అన్నప్రాసన, క్రయవిక్రయాలు 03.12.23 ఆదివారం.. బ. సప్తమి, మఖ, కర్కాటకలగ్నం, రా.10.09 ని.లకు గర్భాదానం, ప్రయాణం. 06.12.23 బుధవారం.. బ. నవమి, ఉత్తర, ధనుర్లగ్నం, ఉ.8.38 ని.లకు వివాహం, గృహారంభం, క్రయవిక్రయాలు. 07.12.23 గురువారం.. బ. దశమి, హస్త, మిథునలగ్నం, రా.7.45 ని.లకు వివాహం, గృహారంభం, గృహప్రవేశం, క్రయవిక్రయాలు 08.12.23 శుక్రవారం.. బ. ఏకాదశి, చిత్త, మిథునలగ్నం, రా.7.41 ని.లకు వివాహం, గృహారంభం, గృహప్రవేశం, క్రయవిక్రయాలు. -సంగ్రహణ: సాక్షి క్యాలెండర్ 2023 -
వివాహ ‘వేడుకంబు’.. జూన్ వరకు పెళ్లి ముహూర్తాలు ఇవే
కొవ్వూరు(తూర్పుగోదావరి): శ్రీరస్తు.. శుభమస్తు.. కల్యాణమస్తు.. ఆకాశ పందిళ్లు.. భూలోక సందళ్లు.. జీవించు నూరేళ్లు.. ఇలా ఊరూరా పెళ్లి సందడి నెలకొంటోంది. కల్యాణ మంటపాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, గుళ్లు, ఇలా వివాహవేడుకలతో కనువిందు చేస్తున్నాయి. కరోనా కారణంగా గడిచిన రెండేళ్లలో కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ.. నామమాత్రంగానే వివాహాలు చేసుకున్నారు కొందరు. అయితే కోవిడ్ ఆంక్షల సడలింపు, మరోవైపు శుభముహూర్తాలు అధికంగా ఉండడంతో పెళ్లిళ్లు జోరందుకున్నాయి. వందలాది జంటలు ఒక్కటవుతున్నాయి. జూన్ 29 నుంచి జూలై 30 వరకు ఆషాఢమాసం ఉంది. చదవండి: ఫస్ట్‌నైట్ అంటే భయపడ్డాడు.. అందుకే ఇలా చేశాడు: వరుడి తల్లి భాద్రపదం, ఆశ్వీయుజం, కార్తికమాసాల్లో (ఆగస్టు 23 నుంచి నవంబర్ 27 వరకు శుక్ర మౌఢ్యమి(మూఢం) కావడంతో మరో నాలుగు నెలలు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు విరామం రానుంది. పెళ్లిళ్లే కాకుండా ఉపనయనాలు, గృహా ప్రవేశాలు, దేవతా ప్రతిష్ఠ మహోత్సవాలు, అన్ని రకాల శుభకార్యాలకు జూన్ 23 వరకు అనువైన మంచి శుభ ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. ఏప్రిల్‌లో ఇప్పటికే 13, 14, 15, 16 తేదీల్లో వేలాది మందికి వివాహాలయ్యాయి. ద్వారకాతిరుమల, అన్నవరం, శ్రీనివాసపురం వేంకటేశ్వరస్వామి సన్నిధిలో వందలాది వివాహాలయ్యాయి. పెళ్లిళ్లపై కరోనా ప్రభావం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల దేవస్థానంలో ఏటా వేల సంఖ్యలో వివాహాలవుతున్నాయి. కరోనా ప్రభావంతో గడిచిన రెండేళ్లలో నామమాత్రం సంఖ్యలో పెళ్లిళ్లు అయ్యాయి. 2020లో కేవలం 120 పెళ్లిళ్లు మాత్రమే అయ్యాయి. కోవిడ్ ఆంక్షలకు కొంత మేర సడలింపులు ఇవ్వడం, నిర్దిష్టమైన సంఖ్యలో వివాహాలకు అనుమతులు ఇవ్వడంతో 2021లో 603 వివాహాలయ్యాయి. ఇప్పుడు కరోనా ఆంక్షలు తొలగించడంతో గడచిన ఐదు రోజుల్లోనే 311 పెళ్లిళ్లయ్యాయి. రానున్న రెండు నెలల్లో మంచి ముహూర్తాలు ఉండడంతో ఇక్కడ వేల సంఖ్యలో జంటలు ఒక్కటి కానున్నాయి. శుభకార్యాలతో వందల మందికి ఉపాధి పెళ్లిళ్లు ఊపందుకోవడంతో పాటు ఇతర అన్ని రకాల శుభకార్యాలకు అనువైన రోజులు కావడంతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. కల్యాణ మంటపాలు, కేటరింగ్, వంటవాళ్లు, పురోహితులు, ఫొటో, వీడియో గ్రాఫర్లకు, ట్రావెల్స్ కార్లు, బస్సులు, ఐస్‌క్రీమ్, మినరల్ వాటర్, ఈవెంట్ మేనేజ్మెంట్లు, పూలు, డెకరేషన్, లైటింగ్, కూరగాయలు, కిరాణా, కిళ్లీ, వస్త్ర దుకాణాలు, బంగారు, వెండి ఆభరణాల షాపులు, మాంసపు దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జీలు, సాంస్కృతిక కళాకారులతో పాటు పలు విభాగాల్లో పనిచేసే కార్మికులకు ఉపాధి లభించనుంది. ఇప్పటికే పెళ్లిళ్లు కుదిరిన వారందరూ ముందస్తు బుకింగ్‌లు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పరోక్షంగా వీటికి అనుబంధంగా ఉన్న రంగాల్లోని వేలాది మందికి శుభకార్యాల ద్వారా ఉపాధి లభించనుంది. రెండేళ్ల నుంచి అంతంతమాత్రంగా శుభ కార్యాలు చేశారు. ఇప్పుడు వరుస ఫంక్షన్లు రావడంతో అన్నీ రకాల వాళ్లకు ఉపాధి చేకూరిందని చెప్పొచ్చు. జూన్ 23 వరకు మంచి ముహూర్తాలు పెళ్లిళ్లతో పాటు ఉపనయనాలు, గృహా ప్రవేశాలు, దేవతా విగ్రహాల ప్రతిష్ఠ వంటి శుభకార్యాల నిర్వహణకు జూన్ 23వ తేదీ వరకు మంచి ముహుర్తాలున్నాయి. జూన్ 29 నుంచి జూలై 30వ తేదీ వరకు ఆషాఢమాసం, ఆగస్టు 23 నుంచి నవంబర్ 27వ తేదీ వరకు భాద్రపద, ఆశ్వీయుజ, కార్తిక మాసాల్లో శుక్ర మౌఢ్యమి(మూఢం) కారణంగా నాలుగు నెలల పాటు శుభ కార్యాలకు మంచి రోజుల్లేవు. –వారణాసి సీతారామ హనుమంత శర్మ, రాష్ట్ర పురోహిత సంఘం అధ్యక్షుడు, కొవ్వూరు జూన్ వరకు పెళ్లి ముహూర్తాలు ఇవే.. ఈ నెల 21, 22, 24 తేదీలు మే నెలలో తేదీలు: 3, 4, 12, 14, 18, 20, 21, 22, 25 జూన్‌లో తేదీలు: 1, 3, 5, 6, 8, 9, 10, 15, 17, 18, 19, 22, 23 ఇతర శుభ ముహూర్తాలు మేలో 4 నుంచి 9వ తేదీ వరకు, 11 నుంచి 15 వరకు, తిరిగి 18, 20, 21, 22, 23, 25 తేదీల్లో ఇతర శుభ ముహూర్తాలు ఉన్నాయి. జూన్‌లో 1 నుంచి ఆరోతేదీ వరకు, 8 నుంచి 11వ తేదీ వరకు, 13, 15, 16, 17, 18, 19, 22, 23 తేదీలు ఇతర శుభ ముçహూర్తాలున్నాయి. -
హీరో నాని కొత్త మూవీ షురూ
సాక్షి, హైదరాబాద్: వరుస సినిమాలతో బిజీగా మారిపోతున్న నాచురల్ స్టార్ నాని కొత్త సినిమా షూటింగ్ నేడు (గురువారం) హైదరాబాదులో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ‘శ్యామ్ సింగరాయ్’ పేరుతో తెర కెక్కిస్తున్న ఈ మూవీకి నాని తండ్రి ఘంటా రాంబాబు క్లాప్ కొట్టారు. నాని, కృతిశెట్టి, సాయిపల్లవిపై ముహూర్తపు సన్నివేశానికి మేర్లపాక గాంధీ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నాని తండ్రితో క్లాప్ కొట్టించడం విశేషం. రెగ్యులర్ షూటింగ్ కార్యక్రమాలను ఈ నెలలోనే ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ట్యాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్యన్ డైరెక్షన్ లో నాని నటిస్తోన్న ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై వెంకట్ ఎస్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాకు సంబంధించి టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్ ను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. First clap by Nanna :)#ShyamSinghaRoy Begins 🔥 pic.twitter.com/PJf7XOkVTk — Nani (@NameisNani) December 10, 2020 -
ముహూర్తం బాగుంది..
సాక్షి, హైదరాబాద్: మహానగరం పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఆదివారం ఒక్క రోజే సుమారు 30 వేలకు పైగా జంటలు ఒక్కటి కానున్నాయి. తరువాత 5వ తేదీ సోమవారం, 8వ తేదీ కూడా భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్నాయి. ఈ మూడు రోజుల్లో 60 వేలకు పైగా పెళ్లిళ్లు జరగవచ్చునని పురోహితులు అంచనా వేస్తున్నారు. హేవళంబి నామ సంవత్సరంలో ఇవే ఆఖరు ముహూర్తాలు కావడంతో చాలామంది ఈ ముహూర్తాలకే అధిక ప్రాధాన్యతనిచ్చారు. తిరిగి శ్రీ రామనవమి తరువాతనే ముహూర్తాలు ఉండడంతో అనూహ్యమైన డిమాండ్ నెలకొంది. దీంతో నగరంలోని అన్ని పెళ్లి మండపాలు, ఫంక్షన్ హాళ్లకు అనూహ్యమైన డిమాండ్ నెలకొంది. శివార్లలోని వందలాది ఫంక్షన్ హాళ్లు మూడు నెలల ముందే బుక్కయ్యాయి. డిమాండ్‌ను బట్టి హాళ్ల చార్జీలను భారీగా పెంచేశారు. కనీసం సైతం 20 నుంచి 30 శాతానికి ధరలు పెంచారు. డిజైనర్లు, ఈవెంట్ మేనేజర్లు, కేటరింగ్ సంస్థలు సైతం తమ చార్జీలను రెట్టింపు చేశాయి. ఇవి దివ్యమైన ముహూర్తాలు కావడమే.. ఫాల్గుణ మాసం బహుళపక్షం, ఆదివారం, హస్తా నక్షత్రం.. ఉదయం 7.29 గంటల నుంచి రాత్రి 10.50 గంటలకు దివ్యమైన ముహూర్తాలున్నాయి. 5వ తేదీ సోమవారం ఉదయం 7.20 నుంచి మధ్యాహ్నం 12.05 గంటలకు ముహూర్తాలు బాగున్నాయి. 8వ తేదీ ఉదయం 7.13 నుంచి రాత్రి 10.34 వరకు దివ్యమైన ముమూర్తాలున్నాయని పురోహితులు నిర్ణయించారు. మార్చి 27వ తేదీ వరకు ఎలాంటి ముహూర్తాలు లేవు. ఇప్పుడిప్పుడే వేసవి మొదలైంది. ఏప్రిల్ నాటికి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఈ మార్చి మొదటి వారంలోనే తంతు ముగించుకునేందుకు అనువుగా ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. చార్జీలు అ‘ధర’హో.. మరోవైపు డిమాండ్‌ను బట్టి ఫంక్షన్‌హాళ్ల యజమానులు చార్జీలను అమాంతంగా పెంచేశారు. సాధారణ రోజుల్లో రూ.3 లక్షలు వసూలు చేసినవారు ఇప్పుడు రూ.5 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద హాళ్లు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచేశాయి. పెళ్లి మండపాల అలంకరణ, డీజే, ఆర్కెస్ట్రా, భోజనాలు వంటి ఖర్చులన్నీ కలిసి రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు స్థాయికి తగినట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ ఖర్చులు భరించలేని వారు తమ ఇళ్ల వద్దనే వేదికలు ఏర్పాటు చేసి పెళ్లిళ్లు చేస్తున్నారు. మరోవైపు నగరంలోని అన్ని ప్రాంతాల్లోని కమ్యూనిటీ హాళ్లకు భారీ డిమాండ్ నెలకొంది. నగరంలో పూల నుంచి బంగారం వరకు, బట్టలు, అలంకరణ వస్తువుల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వరుస పెళ్లిళ్ల దృష్ట్యా గత పది రోజులుగా 20 శాతం నుంచి 30 శాతం వరకు బంగారం అమ్మకాలు పెరిగినట్లు వ్యాపారవర్గాల అంచనా. ఈ రోజుల్లో సుమారు రూ.100 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్టు అభిప్రాయపడ్డారు. క్యాటరింగ్ కూడా మెనూను బట్టి ప్లేట్ ధర రూ.200 నుంచి రూ.700 వరకు తీసుకుంటున్నారు. పురోహితులు ఫుల్ బిజీ వరుస ముహూర్తాలతో నగరంలోని పురోహితులు బిజీ అయ్యారు. నగరంలో సుమారు 10 వేల మంది పురోహితులు ఉన్నట్లు అంచనా. వీరంతా ఒక్కొక్కరు ఈ మూడు రోజుల్లో 6 నుంచి 10 పెళ్లిళ్లకు హాజరు కావాల్సిన పరిస్థితి. ఇక బాజా భజంత్రీలకు డిమాండ్ పెరిగింది. గతంలో రూ.25 వేల వరకు తీసుకున్న బ్యాండ్ బృందాలు ఇప్పుడు కనీసం రూ.30 వేలు లేందే రానంటున్నాయి. అలంకరణ కోసం తెచ్చిన పూలు.. పూల ధరలకు రెక్కలు పెళ్లి పూలకు విపరీతమైన గిరాకీ పెరిగింది. బొకేలు, డెకరేషన్ కోసం వాడే పూల ధరలూ ఆకాశన్నంటుతున్నాయి. జెర్బరా ఒక్కోటి రూ.40కి చేరుకోగా, కార్నేషన్ రూ.75 పైనే ఉంది. మండపాల అలంకరణకు విదేశీ పూలను అధికంగా వినయోగిస్తుండడంతో థాయిలాండ్ నుంచి ఆర్కిడ్ రకం పూలను పెద్దమొత్తంలో దిగుమతి చేసుకొన్నట్లు పూలవ్యాపారులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో రూ.30లోపే లభించే ఆర్కిడ్ బంచ్ ఇప్పుడు రూ.250 దాటింది. ఈ బంచ్‌లో కేవలం 10 పూలు మాత్రమే ఉంటాయి. పూల ధరలు నగరమంతటా ఒకేలా లేవు. డిమాండ్‌ను బట్టి ఒక్కోచోట ఒక్కో రకంగా అమ్మి వ్యాపారులు సొమ్ము చేసుకొంటున్నారు. ఇవి బలమైన ముహూర్తాలు ఈ మూడు రోజులు బలమైన ముహూర్తాలు. ఇప్పటికైతే ఇది ఆహ్లాకరమైన వాతావరణం కావడంతో అందరూ ఈ ముహూర్తాలనే కోరుకుంటున్నారు. ఈ మూడు రోజులు పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలకు అనుకూలంగా ఉన్నాయి. – డాక్టర్ బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి, శృంగేరి శారద పీఠం ఆస్థాన పండితులు ఆర్డర్లు వదిలేసుకున్నాం.. పాతబస్తీ నుంచి వచ్చి డెకరేషన్లు చేస్తున్నాం. డిమాండ్ బాగా పెరిగింది. రోజుకు నాలుగు ఫంక్షన్ హాళ్లు అలంకరించాల్సి వస్తోంది. పని ఒత్తిడి భరించలేక కొన్ని ఆర్డర్లను వదిలేసుకున్నాం. ధర ఎంతైనా చెల్లించేందుకు నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. కానీ శక్తికి మించి పని చేయలేం కదా. – అబిద్, స్టేజ్ డెకరేషన్ నిర్వహకుడు -
ప్రిన్స్ ప్రేమకథ
ప్రిన్స్, అంకిత శర్మ జంటగా ఓ చిత్రం రూపొందుతోంది. శ్రీచంద్ మల్లా దర్శకుడు. ఎస్.రత్నమయ్య, ఎన్.గణపతిరెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి డా.డి.రామానాయుడు కెమెరా స్విచాన్ చేయగా, బెల్లంకొండ సురేష్ క్లాప్ ఇచ్చారు. నిర్మాతల్లో ఒకరైన ఎస్.రత్నమయ్య గౌరవ దర్శకత్వం వహించారు. సినిమా విజయం సాధించాలని అతిథులందరూ ఆకాంక్షించారు. ఫ్రిబవరి తొలివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, మే చివర్లో సినిమా విడుదల చేస్తామని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ కూరాకుల.