Shyam Singha Roy Movie Making Starts In Hyderabad | Natural Star Nani New Movie - Sakshi
Sakshi News home page

హీరో నాని కొత్త మూవీ షురూ

Published Thu, Dec 10 2020 1:45 PM | Last Updated on Thu, Dec 10 2020 3:33 PM

 NANI SAI PALLAVI KRITHI SHETTY FILM LAUNCHED - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  వరుస సినిమాలతో బిజీగా మారిపోతున్న నాచురల్‌ స్టార్‌ నాని కొత్త సినిమా షూటింగ్ నేడు (గురువారం) హైదరాబాదులో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ‘శ్యామ్ సింగరాయ్’ పేరుతో తెర కెక్కిస్తున్న ఈ మూవీకి నాని తండ్రి ఘంటా రాంబాబు క్లాప్‌ కొట్టారు. నాని, కృతిశెట్టి, సాయిపల్లవిపై ముహూర్తపు సన్నివేశానికి మేర్లపాక గాంధీ కెమెరా స్విచ్‌ ఆన్ చేయగా, నాని తండ్రితో క్లాప్ కొట్టించడం విశేషం. రెగ్యులర్‌ షూటింగ్‌ కార్యక్రమాలను ఈ నెలలోనే ప్రారంభించాలని చిత్ర యూనిట్‌ భావిస్తోంది.  

ట్యాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్యన్ డైరెక్షన్ లో నాని నటిస్తోన్న ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి  దర్శకత్వంలో  నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై వెంకట్ ఎస్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్  సంగీతాన్ని అందిస్తున్నారు.  మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్‌, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాకు సంబంధించి టైటిల్‌, కాన్సెప్ట్ పోస్టర్ ను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement