సెలవున్నా గంట పని చేస్తాయ్‌.. ఎందుకంటే? | Muhurat Trading is a special one hour trading session held on Diwali | Sakshi
Sakshi News home page

Muhurat Trading: ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహించే ఏకైక దేశం భారత్‌!

Published Thu, Oct 31 2024 8:22 AM | Last Updated on Thu, Oct 31 2024 8:51 AM

Muhurat Trading is a special one hour trading session held on Diwali

స్టాక్‌మార్కెట్‌ ఇన్వెస్టర్లలో దీపావళి అంటేనే ప్రత్యేక సందడి నెలకొంటుంది. దీపావళి రోజు లక్ష్మీ పూజతోపాటు, సాయంత్రం సమయంలో మదుపుదారులు, ట్రేడర్లకు వీలుగా గంటసేపు స్టాక్ ఎక్స్ఛేంజీలు ముహూరత్‌ ట్రేడింగ్‌ను నిర్వహిస్తాయి. ప్రపంచంలో ఇలాంటి ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహించే ఏకైక దేశం మనదే. ఈ ముహూరత్‌ ట్రేడింగ్‌ రోజును ఇన్వెస్టర్లు, వ్యాపారులు శుభదినంగా భావిస్తారు.

ముహూరత్‌ ట్రేడింగ్ చరిత్ర

ఈ ముహూరత్‌ ట్రేడింగ్ అనవాయితీ ఏళ్లనాటిదే. 1957లో బీఎస్‌ఈ ముహూరత్‌  ట్రేడింగ్ సంప్రదాయాన్ని ప్రారంభించింది. 1992లో ఎన్‌ఎస్‌ఈ దీన్ని అందిపుచ్చుకుంది. మార్కెట్ పెట్టుబడిదారులకు అదృష్టాన్ని తెచ్చే విధంగా అన్ని గ్రహాలు, నక్షత్రాలను గమనించి నిర్వహించే శుభ ముహూర్తంగా దీన్ని పరిగణిస్తారు. ఈ  సందర్భంగా  వ్యాపారులు  పెట్టుబడికి అనుకూలమైనదిగా భావిస్తారు. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్‌ఎల్‌బీ సెగ్మెంట్ విభాగాల్లో ట్రేడింగ్‌ నిర్వహిస్తారు. ఈ ఏడాది క్యాలెండర్ ప్రకారం నవంబర్‌ 1న ఈ ముహూరత్‌ ట్రేడింగ్‌ జరుగనుంది. సాధారణంగా దేశంలోని వ్యాపార సంఘాలు కొత్త ఖాతాలను తెరవడంతోపాటు ఈ రోజున మునుపటి బ్యాలెన్స్ షీట్‌ను క్లోజ్‌ చేస్తారు. అంటే ఈ రోజును వ్యాపారులు కొత్త వ్యాపార సంవత్సరంగా పరిగణిస్తారు. అలాగే ట్రేడ్‌ పండితులు, ఎనలిస్టులు, బ్రోకరేజ్‌ సంస్థలు పలు స్టాక్స్‌ను ట్రేడర్లకు రికమెండ్‌ చేస్తారు. దీపావళి బలిప్రతిపాద సందర్భంగా నవంబర్‌ 1న ఎక్స్ఛేంజీలు  పనిచేయవు.

ఇదీ చదవండి: అధికంగా విక్రయించిన స్టాక్‌లు ఇవే..

నవంబర్‌ 1 దీపావళి ముహూరత్‌ ట్రేడింగ్ సెషన్ సమయాలు

  • మార్కెట్ సాయంత్రం 6:15కు ఓపెన్‌ అవుతుంది.

  • మార్కెట్ సాయంత్రం 7:15కు ముగుస్తుంది.

  • ట్రేడ్ సవరణ ముగింపు సమయం సాయంత్రం 7:25

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement