muhurath trading
-
సెలవున్నా గంట పని చేస్తాయ్.. ఎందుకంటే?
స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్లలో దీపావళి అంటేనే ప్రత్యేక సందడి నెలకొంటుంది. దీపావళి రోజు లక్ష్మీ పూజతోపాటు, సాయంత్రం సమయంలో మదుపుదారులు, ట్రేడర్లకు వీలుగా గంటసేపు స్టాక్ ఎక్స్ఛేంజీలు ముహూరత్ ట్రేడింగ్‌ను నిర్వహిస్తాయి. ప్రపంచంలో ఇలాంటి ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహించే ఏకైక దేశం మనదే. ఈ ముహూరత్ ట్రేడింగ్ రోజును ఇన్వెస్టర్లు, వ్యాపారులు శుభదినంగా భావిస్తారు.ముహూరత్ ట్రేడింగ్ చరిత్రఈ ముహూరత్ ట్రేడింగ్ అనవాయితీ ఏళ్లనాటిదే. 1957లో బీఎస్ఈ ముహూరత్ ట్రేడింగ్ సంప్రదాయాన్ని ప్రారంభించింది. 1992లో ఎన్ఎస్ఈ దీన్ని అందిపుచ్చుకుంది. మార్కెట్ పెట్టుబడిదారులకు అదృష్టాన్ని తెచ్చే విధంగా అన్ని గ్రహాలు, నక్షత్రాలను గమనించి నిర్వహించే శుభ ముహూర్తంగా దీన్ని పరిగణిస్తారు. ఈ సందర్భంగా వ్యాపారులు పెట్టుబడికి అనుకూలమైనదిగా భావిస్తారు. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బీ సెగ్మెంట్ విభాగాల్లో ట్రేడింగ్ నిర్వహిస్తారు. ఈ ఏడాది క్యాలెండర్ ప్రకారం నవంబర్ 1న ఈ ముహూరత్ ట్రేడింగ్ జరుగనుంది. సాధారణంగా దేశంలోని వ్యాపార సంఘాలు కొత్త ఖాతాలను తెరవడంతోపాటు ఈ రోజున మునుపటి బ్యాలెన్స్ షీట్‌ను క్లోజ్ చేస్తారు. అంటే ఈ రోజును వ్యాపారులు కొత్త వ్యాపార సంవత్సరంగా పరిగణిస్తారు. అలాగే ట్రేడ్ పండితులు, ఎనలిస్టులు, బ్రోకరేజ్ సంస్థలు పలు స్టాక్స్‌ను ట్రేడర్లకు రికమెండ్ చేస్తారు. దీపావళి బలిప్రతిపాద సందర్భంగా నవంబర్ 1న ఎక్స్ఛేంజీలు పనిచేయవు.ఇదీ చదవండి: అధికంగా విక్రయించిన స్టాక్‌లు ఇవే..నవంబర్ 1 దీపావళి ముహూరత్ ట్రేడింగ్ సెషన్ సమయాలుమార్కెట్ సాయంత్రం 6:15కు ఓపెన్ అవుతుంది.మార్కెట్ సాయంత్రం 7:15కు ముగుస్తుంది.ట్రేడ్ సవరణ ముగింపు సమయం సాయంత్రం 7:25 -
Rakesh JhunJhunwala:ఇదేం మ్యాజిక్! ఒక్క సెకనుకి రూ.1.68 కోట్ల సంపాదన
Rakesh Jhunjhunwala Made Rs 101 Crore From These 5 Stocks: మార్కెట్ బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మరోసారి సంచలనం సృష్టించారు. ఊహకి అందని రీతిలో మార్కెట్లో ఎత్తులు వేస్తూ కాసుల వర్షం కురిపించే బిగ్బుల్ జాదూ మళ్లీ వర్కవుట్ అయ్యింది. ముహూరత్ ట్రేడింగ్ దీపావళి పండగ సందర్భంగా స్టాక్ మార్కెట్లో ప్రతీ ఏడు ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తారు. రెగ్యులర్ ట్రేడింగ్‌కి భిన్నంగా దీనికి ప్రత్యేకంగా సమయం కేటాయించి గంట పాటు లావాదేవీలు నిర్వహిస్తారు. ఈసారి కూడా దీపావళి రోజున కొత్త సంవత్ 2078కి స్వాగతం పలుకుతూ సాయంత్రం 6:15 గంటల నుంచి రాత్రి 7:15 గంటల వరకు ముహూరత్ ట్రేడ్ నిర్వహించారు. గంటలో రూ.101 కోట్లు ముహూరత్ ట్రేడింగ్‌లో బిగ్బుల్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఐదు కంపెనీల షేర్లు బాగా లాభపడ్డాయి. దీంతో కేవలం గంట వ్యవధిలోనే ఆయన సంపాదనలో కొత్తగా రూ. 101 కోట్లు వచ్చి చేరాయి. ఓ రకంగా ప్రతీ సెకనుకి బిగ్బుల్ ఖాతాలో రూ.1.68 కోట్లు వచ్చి పడ్డట్టయ్యింది. కాసులు కురిపించిన హోటల్ షేర్లు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియోలో ఉన్న వాటిలో ఇండియన్ హోటల్ కంపెనీ షేర్లు గంట వ్యవధిలో ఆరు శాతం వృద్ధిని కనబరిచాయి. కేవలం గంట వ్యవధిలో షేరు విలువ రూ.205 నుంచి రూ.215కి చేరుకుంది. కేవలం పది రూపాయలు షేరు ధర పెరగడంతో రాకేశ్ ఖాతాలో రూ.31.13 కోట్లు వచ్చి చేరాయి. ఆ నాలుగు - టాటా మోటార్స్‌లో బిగ్బుల్కి 3.67 కోట్ల షేర్లు ఉన్నాయి. వీటి ధర 1 శాతం పెరగడంతో గంట వ్యవధిలో రూ.17.82 కోట్ల ఆదాయం వచ్చి పడింది. - రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ షేర్ల ధరలో 2 శాతం వృద్ధి కనిపించడంతో రాకేశ్ ఖాతాలో 21.72 కోట్లు వచ్చాయి. - ఎస్కార్ట్ షేర్ల ధరలు పెరగడంతో రూ. 18.11 కోట్లు, డెల్టా కార్పొరేషన్ నుంచి రూ.12.6 కోట్లు ఆర్జించారు. సెంటిమెంట్ అండతో ముహూరత్ ట్రేడింగ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి జరుగుతుందనే సెంటిమెంట్ ఉంది. బాంబే స్టాక్ ఎక్సేంజీలో 1957 నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. కొత్తగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారు కూడా ఈ రోజు మొదలు పెడతారు. ఇలాంటి వారిలో చాలా మంది బిగ్బుల్ రాకేశ్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న షేర్లు కొనేందుకు ఆసక్తి చూపించారు. దీంతో ఆయా కంపెనీల షేర్ల బాగా పెరిగాయి. ఫలితంగా కేవలం గంటలో రాకేశ్ సంపాదన రూ. 101 కోట్లు పెరిగింది. -
సంవత్ 2076కు లాభాల వీడ్కోలు
ముంబై: సంవత్ 2076కు స్టాక్ మార్కెట్లు లాభాలతో వీడ్కోలు పలికాయి. కొత్త ఏడాది 2077కు శనివారం వేదిక కానుంది. దీపావళి పండుగ సందర్భంగా 14న సాయంత్రం 6.15-7.15 మధ్య గంటపాటు ముహూరత్ ట్రేడింగ్‌కు తెరతీయనున్నారు. ప్రతీ ఏడాది సాయంత్రం మూరత్ ట్రేడింగ్‌ను చేపట్టడం స్టాక్ ఎక్స్ఛేంజీలు ఆనవాయితీగా పాటించే సంగతి తెలిసిందే. కాగా.. ముందురోజు 8 రోజుల సూపర్ ర్యాలీకి బ్రేక్ పడినప్పటికీ తిరిగి నేటి ట్రేడింగ్‌లో మార్కెట్లు లాభపడ్డాయి. అయితే రోజంతా ఒడిదొడుకుల మధ్య ట్రేడింగ్ నడిచింది. చివరికి సెన్సెక్స్ 86 పాయింట్ల వృద్ధితో 43,443 వద్ద ముగిసింది. నిఫ్టీ 29 పాయింట్లు బలపడి 12,720 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 43,522 ఎగువన గరిష్టాన్ని తాకగా.. 43,053 వద్ద కనిష్టాన్ని చేరింది. నిఫ్టీ సైతం 12,736- 12,608 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. చదవండి: (ఫ్యూచర్ గ్రూప్ ఫ్యూచర్.. కత్తిమీద సాము!) మీడియా డీలా ఎన్ఎస్ఈలో ప్రధానంగా మెటల్, రియల్టీ, ఫార్మా, బ్యాంకింగ్ 1.7-0.7 శాతం మధ్య లాభపడ్డాయి. మీడియా 1 శాతం డీలా పడింది. నిఫ్టీ దిగ్గజాలలో ఐషర్ 7.5 శాతం జంప్‌చేయగా.. బజాజ్ ఫిన్, కోల్ ఇండియా, టాటా స్టీల్, దివీస్ ల్యాబ్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, గ్రాసిమ్ 4-2 శాతం మధ్య ఎగశాయి. అయితే టాటా మోటార్స్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యూపీఎల్, అదానీ పోర్ట్స్, ఐవోసీ, ఎస్బీఐ లైఫ్, ఎయిర్టెల్, ఎంఅండ్ఎం 3.3-0.6 శాతం మధ్య క్షీణించాయి. చదవండి: (సిరామిక్ టైల్స్ షేర్లు గెలాప్) అపోలో హాస్పిటల్స్ జోరు డెరివేటివ్స్‌లో అపోలో హాస్పిటల్స్, జూబిలెంట్ ఫుడ్, ఐబీ హౌసింగ్, నౌకరీ, పిరమల్, టొరంట్ ఫార్మా, పెట్రోనెట్, వేదాంతా 8-4 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు సన్ టీవీ, జీ, భారత్ ఫోర్జ్, మదర్సన్, సీమెన్స్, అమరరాజా, చోళమండలం, ఎంజీఎల్, అంబుజా 4-2 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,588 లాభపడగా.. 1,073 డీలాపడ్డాయి. ఎఫ్‌పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1514 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,239 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 6,207 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 3,464 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
సంవత్ 2075 శుభారంభం: నేడు మార్కెట్లకు సెలవు
సాక్షి, ముంబై: సంవత్ 2075 జోరుగా హుషారుగా ప్రారంభమైంది. ఈ కొత్త ఏడాది భారీ లాభాలతో దేశీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. దివాలీ సందర్భంగా బుధవారం సాయంత్రం గంటపాటు నిర్వహించిన ముహూరత్ ట్రేడింగ్ లాభాల పంట పండించింది. దీపావళి మతాబుల పువ్వులు పూయించింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ లాభాల డబుల్ సెంచరీ సాధించగా, నిఫ్టీ హాఫ్ సెంచరీ చేసింది. దాదాపు అన్ని సెక్టార్లలో లాభాల మెరుపులు మెరిశాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ షేర్ల లాభాలు బాగా ఊతమిచ్చాయి. దీంతో కీలక సూచీలు కీలక మద్దతుస్థాయిలను అధిగమించాయి. చివరికి సెన్సెక్స్ 246 పాయింట్లు ఎగసి 35,238 వద్ద స్థిరపడింది. తద్వారా 35,000 పాయింట్ల మైలురాయికి ఎగువన నిలిచింది. నిఫ్టీ సైతం 68 పాయింట్లు పెరిగి 10,598 వద్ద ముగిసింది. ఎం అండ్ ఎం, ఇన్ఫోసిస్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ టాప్ విన్నర్స్‌గా నిలిచాయి. మధ్యంతర ఎన్నికల నేపథ్యంలోనూ యూఎస్ స్టాక్ మార్కెట్లు లాభపడటంతో సెంటిమెంటుకు బలమొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు దివాలీ బలిప్రతిపాద సందర్భంగా ఈ రోజు మార్కెట్లకు సెలవు. శుక్రవారం యథావిధిగా 9.15 నిమిషాలకు కీలక సూచీలు ట్రేడింగ్‌ను ఆరంభిస్తాయి. -
‘సెన్సెక్స్’ప్రెస్...ముహూరత్ మెరుపులు
ముంబై: స్టాక్ మార్కెట్లో దీపావళి వెలుగులు జిగేల్మన్నాయి. రెండు రోజుల ముందే గత రికార్డును వెనక్కినెట్టి రంకేసిన బుల్.. దీపావళి సందర్భంగా ఆదివారం జరిగిన ముహూరత్ ట్రేడింగ్‌లో మరింత దూకుడు ప్రదర్శించింది. ‘సంవత్ 2070’ హిందూ కొత్త సంవత్సరంలో తొలి ట్రేడింగ్ సెషన్‌ను లాభాలతో ఆరంభించి.. ఆల్‌టైమ్ రికార్డును తాకింది. శుక్రవారం 21,294 పాయింట్ల ఆల్‌టైమ్ గరిష్టాన్ని నమోదు చేసి(2008 జనవరి ఆల్‌టైమ్ హై 21,207)న బీఎస్ఈ సెన్సెక్స్.. ఆదివారం జరిగిన 75 నిమిషాల(సాయంత్రం 6.15 నుంచి 7.30 వరకూ) ట్రేడింగ్‌లో మరో కొత్త గరిష్టానికి ఎగసింది. ఇంట్రాడేలో 21,322 పాయింట్లను చేరింది. చివరకు గత ముగింపు 21,197 పాయింట్లతో పోలిస్తే 43 పాయింట్లు లాభపడి 21,239 వద్ద స్ధిరపడింది. ముగింపు పరంగా ఇదో కొత్త రికార్డు కావడం గమనార్హం. బీఎస్ఈలోని 13 రంగాల సూచీల్లో 12 సూచీలు 0.1-0.78 శాతం మధ్య లాభాలతో ముగియడం మరో విశేషం. మొత్తం మీద దేశీ స్టాక్ మార్కెట్లు ఐదో రోజూ లాభాల్లోనే నిలిచాయి. ఆల్‌టైమ్ హైకి అతి చేరువలోకి నిఫ్టీ.... సెన్సెక్స్ కొత్త మైలురాళ్ల దిశగా దూసుకెళ్తుంటే.. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇంకా గత రికార్డును ఛేదించేందుకు వెనకాముందూ ఆడుతోంది. ఆదివారం ప్రత్యేక ట్రేడింగ్‌లో ఒకానొకదశలో నిఫ్టీ 6,343 పాయింట్లను తాకి.. గత రికార్డు(2008 జనవరిలో 6,357)కు అతి చేరువలోకి వచ్చింది. అయితే, చివరకు 10 పాయింట్లు లాభపడి 6,317 వద్ద క్లోజైంది. అయితే, ఇది ఆల్‌టైమ్ హై ముగింపు(గతంలో 2010, నవంబర్ 5న 6,312 పాయింట్లు ఇప్పటిదాకా ఆల్‌టైమ్ హై క్లోజ్) కావడం గమనార్హం. సెన్సెక్స్ 30 స్టాక్స్ జాబితాలో 22 లాభపడ్డాయి. ఇక టాటా మోటార్స్ అత్యధికంగా 1.74% పుంజుకోగా, జిందాల్ స్టీల్(1.13%), సన్ ఫార్మా(0.95) మారుతీ(0.86%) ఈ జాబితాలో ఉన్నాయి. నేడు మార్కెట్లకు సెలవు దీపావళి-బలిప్రతిపదను పురస్కరించుకొని స్టాక్ ఎక్స్ఛేంజీలు బీఎస్ఈ, ఎన్‌ఎస్‌ఈలతో పాటు ఫారెక్స్, మనీ మార్కెట్లకు నేడు (సోమవారం) సెలవు ప్రకటించారు.