Muhurat trading
-
లాభాలతో ముగిసిన ముహూరత్ ట్రేడింగ్
దీపావళి సందర్భంగా ఈరోజు జరిగిన స్టాక్ మార్కెట్ ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్ లాభాల్లో ముగిసింది. సాయంత్రం 7 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 335.06 పాయింట్లు లేదా 0.42% లాభపడి 79,724 వద్ద, నిఫ్టీ 99 పాయింట్లు బలపడి 24,34.35 వద్ద స్థిరపడ్డాయి.సాయంత్రం 6 గంటలకు సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు లాభాలతో సెషన్‌ను ప్రారంభించాయి. అన్ని రంగాలు గ్రీన్‌లో ట్రేడయ్యాయి. కంపెనీలు తమ నెలవారీ విక్రయాల సంఖ్యను విడుదల చేయడంతో ఆటో స్టాక్‌లలో కొనుగోళ్లు కనిపించాయి. ముహూరత్ ట్రేడింగ్ అనేది హిందూ క్యాలెండర్ సంవత్సరం (సంవత్ 2081) ప్రారంభాన్ని సూచిస్తూ దీపావళి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ట్రేడింగ్ సెషన్. సాయంత్రం 6:00 నుండి 7:00 గంటల మధ్య ఒక గంట పాటు ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ కొసాగింది.మహీంద్రా అండ్ మహీంద్రా, ఒఎన్‌జిసి, అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఐషర్ మోటార్స్ లాభపడ్డాయి. నష్టపోయిన స్టాక్స్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్‌సిఎల్ టెక్, బ్రిటానియా, టెక్ మహీంద్రా, విప్రో ఉన్నాయి. ఆటో ఇండెక్స్ 1 శాతం పెరగడంతో అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1 శాతం చొప్పున పెరిగాయి. -
స్టాక్‌మార్కెట్ ప్రత్యేక ట్రేడింగ్
దేశీయ స్టాక్ మార్కెట్ వార్షిక ముహూర్త ట్రేడింగ్ సెషన్ శుక్రవారం సాయంత్రం జరుగుతోంది. దీపావళి లక్ష్మీపూజ సందర్భంగా సాయంత్రం 6:00 నుండి 7:00 గంటల వరకు ఒక గంట పాటు ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహించనున్నారు.ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ హిందూ నూతన సంవత్సరం సంవత్ 2081 ప్రారంభాన్ని సూచిస్తుంది. ప్రీ-ఓపెనింగ్ సెషన్ సాయంత్రం 5:45కి ప్రారంభమవుతుంది. సెషన్ ముగియడానికి 15 నిమిషాల ముందు అన్ని ఇంట్రాడే స్థానాలు ఆటోమేటిక్‌గా ముగుస్తాయి. ఈ ప్రత్యేక సెషన్లో ట్రేడింగ్ చేసేవారు జాగ్రత్తగా ప్లాన్ చేయడం అవసరం.ముహూర్త ట్రేడింగ్ అనేది ప్రత్యేకమైన మార్కెట్ సెషన్ మాత్రమే కాదు. ఇది సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి ఆశీర్వాదం కోసం పెట్టుబడిదారులు టోకెన్ పెట్టుబడులు పెట్టే ప్రతిష్టాత్మకమైన సంప్రదాయం. ప్రపంచంలో ఇలాంటి ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహించే ఏకైక దేశం మనదే.ఇలా ప్రారంభమైంది..ఈ ముహూర్త ట్రేడింగ్ అనవాయితీ ఏళ్లనాటిది. 1957లో బీఎస్ఈ ముహూర్త ట్రేడింగ్ సంప్రదాయాన్ని ప్రారంభించింది. 1992లో ఎన్ఎస్ఈ దీన్ని అందిపుచ్చుకుంది. మార్కెట్ పెట్టుబడిదారులకు అదృష్టాన్ని తెచ్చే విధంగా అన్ని గ్రహాలు, నక్షత్రాలను గమనించి నిర్వహించే శుభ ముహూర్తంగా దీన్ని పరిగణిస్తారు. ఈ సందర్భంగా వ్యాపారులు పెట్టుబడికి అనుకూలమైనదిగా భావిస్తారు. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బీ సెగ్మెంట్ విభాగాల్లో ట్రేడింగ్ నిర్వహిస్తారు. -
సెలవున్నా గంట పని చేస్తాయ్.. ఎందుకంటే?
స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్లలో దీపావళి అంటేనే ప్రత్యేక సందడి నెలకొంటుంది. దీపావళి రోజు లక్ష్మీ పూజతోపాటు, సాయంత్రం సమయంలో మదుపుదారులు, ట్రేడర్లకు వీలుగా గంటసేపు స్టాక్ ఎక్స్ఛేంజీలు ముహూరత్ ట్రేడింగ్‌ను నిర్వహిస్తాయి. ప్రపంచంలో ఇలాంటి ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహించే ఏకైక దేశం మనదే. ఈ ముహూరత్ ట్రేడింగ్ రోజును ఇన్వెస్టర్లు, వ్యాపారులు శుభదినంగా భావిస్తారు.ముహూరత్ ట్రేడింగ్ చరిత్రఈ ముహూరత్ ట్రేడింగ్ అనవాయితీ ఏళ్లనాటిదే. 1957లో బీఎస్ఈ ముహూరత్ ట్రేడింగ్ సంప్రదాయాన్ని ప్రారంభించింది. 1992లో ఎన్ఎస్ఈ దీన్ని అందిపుచ్చుకుంది. మార్కెట్ పెట్టుబడిదారులకు అదృష్టాన్ని తెచ్చే విధంగా అన్ని గ్రహాలు, నక్షత్రాలను గమనించి నిర్వహించే శుభ ముహూర్తంగా దీన్ని పరిగణిస్తారు. ఈ సందర్భంగా వ్యాపారులు పెట్టుబడికి అనుకూలమైనదిగా భావిస్తారు. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బీ సెగ్మెంట్ విభాగాల్లో ట్రేడింగ్ నిర్వహిస్తారు. ఈ ఏడాది క్యాలెండర్ ప్రకారం నవంబర్ 1న ఈ ముహూరత్ ట్రేడింగ్ జరుగనుంది. సాధారణంగా దేశంలోని వ్యాపార సంఘాలు కొత్త ఖాతాలను తెరవడంతోపాటు ఈ రోజున మునుపటి బ్యాలెన్స్ షీట్‌ను క్లోజ్ చేస్తారు. అంటే ఈ రోజును వ్యాపారులు కొత్త వ్యాపార సంవత్సరంగా పరిగణిస్తారు. అలాగే ట్రేడ్ పండితులు, ఎనలిస్టులు, బ్రోకరేజ్ సంస్థలు పలు స్టాక్స్‌ను ట్రేడర్లకు రికమెండ్ చేస్తారు. దీపావళి బలిప్రతిపాద సందర్భంగా నవంబర్ 1న ఎక్స్ఛేంజీలు పనిచేయవు.ఇదీ చదవండి: అధికంగా విక్రయించిన స్టాక్‌లు ఇవే..నవంబర్ 1 దీపావళి ముహూరత్ ట్రేడింగ్ సెషన్ సమయాలుమార్కెట్ సాయంత్రం 6:15కు ఓపెన్ అవుతుంది.మార్కెట్ సాయంత్రం 7:15కు ముగుస్తుంది.ట్రేడ్ సవరణ ముగింపు సమయం సాయంత్రం 7:25 -
మూరత్ ట్రేడింగ్ చేస్తే..ఏడాదంతా స్టాక్ మార్కెట్లో తిరుగుండదు
దేశీయ స్టాక్ మార్కెట్లో మూరత్ ట్రేడింగ్ ప్రారంభం అయ్యింది. దీపావళి పర్వదినం సందర్భంగా ట్రేడింగ్ చేస్తే .. వచ్చే దీపావళి వరకు లాభాల పంట పండుతుందనేది మదుపర్ల నమ్మకం. అందులో భాగంగా ప్రతి ఏడాది స్టాక్ ఎక్ఛేంజీలు మూరత్ ట్రేడింగ్‌ను నిర్వహిస్తాయి. ఈ ట్రేడింగ్ గంట సేపు కొనసాగుతుండగా.. ఆ సమయంలో కనీసం ఒక్క స్టాకైనా కొనుక్కోవాలని ఇన్వెస్టర్లు ఉత్సాహం చూపిస్తుంటారు. చదవండి👉 పాపం..చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా! సంపదకు, ధనానికి మూలం అయిన లక్ష్మీదేవిని పూజిస్తూ మూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తారు. ముఖ్యంగా దీపావళి రోజు ట్రేడింగ్ చేయడం వల్ల ధనంతో ఇల్లు కళకళలాడుతుందనేది గట్టి నమ్మకం. మూరత్ ట్రేడింగ్ ప్రారంభంతో కొత్త హిందూ సంవత్సరం ప్రారంభమైనట్లు ఇన్వెస్టర్లు పరిగణిస్తారు. కాబట్టే భారత దేశ సంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు స్టాక్ ఎక్ఛేంజీలు కార్యకలాపాలు జరగకపోయినా ఈ మూరత్ ట్రేడింగ్‌ను నిర్వహిస్తాయి. చదవండి👉 '1992 స్కాం' వెబ్ సిరీస్‌లో రాకేష్ ఝున్‌ఝున్ వాలా క్యారక్టర్ ఎవరిదో తెలుసా? అందుకే మార్కెట్ బంద్ ఉన్నప్పటికీ కూడా ‘మూరతత్’ పేరుతో 6.15 నిమిషాల నుంచి 7.15 నిమిషాల వరకు జరుగుతాయి. ముఖ్యంగా దీపావళి రోజు లక్ష్మీ పూజ చేసిన తర్వాత గుజరాతీలు ఈ మూరత్ ట్రేడింగ్‌లో లాంగ్ టర్మ్‌లో లాభాలు తెచ్చే పెట్టే స్టాక్స్ వారి కుటుంబ సభ్యుల పేరు మీద కొనుగోలు చేస్తుంటారు. అలాగే వాళ్ల నమ్మకం ఎప్పుడు ఒమ్ము కాలేదని, మూరత్ ట్రేడింగ్ సమయంలో కొన్ని స్టాక్స్ భారీ లాభాల్ని తెచ్చి పెట్టాయని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చదవండి👉 రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా భలే సరదా మనిషి! -
ముహూరత్ ట్రేడింగ్: ‘మిస్‌యూ రాకేశ్ ఝన్‌ఝన్ వాలా’
సాక్షి, ముంబై: దీపావళి అంటే పటాసులు, దీపాలు, స్వీట్లు, లక్ష్మీ పూజ మాత్రమే కాదు ఇన్వెస్టర్లకు మరో ప్రత్యేక పండుగ కూడా ఉంది. అదే ముహూరత్ ట్రేడింగ్. ముహూరత్ ట్రేడింగ్ రోజును ఇన్వెస్టర్లు వ్యాపారులు ఒక శుభదినంగా భావిస్తారు. అందుకే ఈ రోజు కనీసం ఒక షేర్లో అయినా పెట్టుబడులు పెట్టి లాభాలు గడించాలని ట్రేడర్లు ఆశపడతారు. సాధారణంగా దివాలీ రోజు గంట సేపు నిర్వహించే ముహూరత్ ట్రేడింగ్ లాభాల్లోనే ముగుస్తుంది. ఫలితంగా ఏడాదంతా షేర్ మార్కెట్లో లాభాలే లాభాలని ఇన్వెస్టర్లు భావిస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 24న జరిగే ముహూరత్ ట్రేడింగ్ ప్రముఖ పెట్టుబడిదారుడు, బిలియనీర్ బిజినెస్ మాగ్నెట్, దివంగత రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా లేకుండానే ముగియనుంది. ప్రతీ ఏడాది అనేక మంది ఇన్వెస్టర్లకు ఆయన ఇచ్చే సలహాలు, పెట్టుబడి సూత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. సాంప్రదాయ దుస్తులతో ప్రత్యేక ఆహార్యంతో పలు ఛానెళ్లలో ఆయన మార్కెట్ మంత్రాను వివరించేవారు. మార్కెట్లో తన అనుభవం, టాప్ ప్లేస్‌కు చేరుకున్న తన ప్రస్థానం గురించి చెబుతూ ప్రేరణగా నిలిచేవారు. గత ఏడాది 101 కోట్ల రూపాయల లాభం గత ఏడాది దీపావళి ముహూరత్ ట్రేడింగ్ సందర్భంగా 5 స్టాక్‌ల పెట్టుబడిద్వారా రాకేష్ ఝన్‌ఝున్‌వాలా 101 కోట్ల రూపాయలు ఆర్జించారు. అంతేకాదు రాకేష్ రికమెండ్ చేసిన స్టాక్‌లు భారీ లాభాలను గడించాయి. ముఖ్యంగా ఫెడరల్ బ్యాంక్ ఈ ఏడాది రెండో త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ను ఆకర్షించాయి. దీంతో షేర్ వరుస లాభాలతో ఆల్ టైం గరిష్టాన్ని తాకడం విశేషం. దీపావళి ముహూర్తం ట్రేడింగ్ సెషన్లో బిలియనీర్ ఇన్వెస్టర్ లేని లోటు తీరనిదని, మిస్ యూ అంటూ విశ్లేషకులు, ట్రేడర్లు రాకేశ్ ఝన్ఝన్వాలాను గుర్తు చేసుకుంటున్నారు. ట్రేడర్లు ఆయన సూచనలు, సలహాలతోపాటు చమక్కులను కూడా మిస్ అవుతారంటూ నివాళులర్పిస్తున్నారు. కాగా ట్రేడర్‌గా చార్టెడ్ అకౌంటెంట్‌గా పేరుగాంచిన రాకేశ్ ఝున్‌ఝున్ వాలా ఈ ఏడాది ఆగస్టు 14న అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. -
ముహూరత్ ట్రేడింగ్ అంటే ఏంటి? ఈ ట్రేడింగ్‌లో లాభాలే లాభాలా?
సాక్షి,ముంబై: దీపావళి వచ్చిందంటే స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్లలో ప్రత్యేక సందడి నెలకొంటుంది. దీపావళి రోజు లక్ష్మీ పూజతోపాటు, ముహూరత్ ట్రేడింగ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. ముహూరత్ ట్రేడింగ్ రోజును ఇన్వెస్టర్లు, వ్యాపారులు శుభదినంగా భావిస్తారు. దివాలీ రోజు గంట సేపు ముహూరత్ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహించటం ఆనవాయితీ. అంతేకాదు ప్రపంచంలో ఇలాంటి ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహించే ఏకైక దేశం భారతదేశం. దీపావళి పర్వదినం రోజు లక్ష్మీ పూజ తరువాత ఒక గంట ట్రేడింగ్ సెషన్ నిర్వహించి సంవత్ 2079 సాంప్రదాయంగా ప్రారంభిస్తారు.(ముహూరత్ ట్రేడింగ్: ‘మిస్‌యూ రాకేశ్ ఝన్‌ఝన్ వాలా’) ముహూరత్ ట్రేడింగ్ చరిత్ర ఈ ఏడాది అక్టోబర్ 24, 2022న దీపావళి సందర్భంగా ముహూరత్ ట్రేడింగ్ సెషన్ నిర్వహించ నున్నారు. ఈ సాంప్రదాయ చర్రితను ఒక సారి పరిశీలిస్తే 1957లో బీఎస్ఈ ముహూరత్ ట్రేడింగ్ సంప్రదాయాన్ని ప్రారంభించగా, 1992లో ఎన్ఎస్ఈ దీనిని దీపావళి రోజున ప్రారంభించింది. మార్కెట్ పెట్టుబడిదారులకు అదృష్టాన్ని తెచ్చే విధంగా అన్ని గ్రహాలు, నక్షత్రాలను గమనించిన నిర్వహించే శుభ ముహూర్తం. ఈ సందర్భంగా వ్యాపారులు పెట్టుబడికి అనుకూలమైనదిగా భావిస్తారు. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, SLB సెగ్మెంట్' క్యాలెండర్ ప్రకారం, అక్టోబర్ 24, 2022న జరుగనుంది. సాధారణంగా దేశంలోని వ్యాపార సంఘాలు కొత్త ఖాతాలను తెరవడంతోపాటు ఈ రోజున మునుపటి బ్యాలెన్స్ షీట్‌ను క్లోజ్ చేస్తారు. అలాగే ట్రేడ్ పండితులు, ఎనలిస్టులు, బ్రోకరేజ్ సంస్థలు పలు స్టాక్స్‌ను ట్రేడర్లకు రికమెండ్ చేస్తారు. అలాగే దీపావళి బలిప్రతిపాద సందర్భంగా అక్టోబర్ 26న ఎక్స్ఛేంజీలు పనిచేయవు. దీపావళి ముహూరత్ ట్రేడింగ్ సెషన్ సమయాలు మార్కెట్ సాయంత్రం 6:15 కు ఓపెన్ అవుతుంది. మార్కెట్ సాయంత్రం 7:15 ముగుస్తుంది. ట్రేడ్ సవరణ ముగింపు సమయం సాయంత్రం 7:25 -
మూరత్ ట్రేడింగ్ మురిపించెన్..!
ముంబై: దీపావళి రోజు గంటసేపు జరిగిన మూరత్ ప్రత్యేక ట్రేడింగ్ మురిపించింది. స్టాక్ సూచీలు సంవత్ 2078 ఏడాదికి లాభాలతో స్వాగతం పలికాయి. మూరత్ ట్రేడింగ్‌లో ఎంపిక చేసుకున్న షేర్లు లాభాల్ని పంచుతాయనే నమ్మకంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు పాల్పడటంతో సూచీలు భారీ లాభాలతో మొదలయ్యాయి. రెండురోజుల వరుస నష్టాలకు చెక్‌పెడుతూ గురువారం సాయంత్రం 6:15 నిమిషాలకు సెన్సెక్స్ 436 పాయింట్ల లాభంతో 60,208 వద్ద మొదలైంది. నిఫ్టీ 106 పాయింట్ల పెరిగి 17,935 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆటో షేర్లకు కలిసొచ్చింది. ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లకూ అధిక డిమాండ్ నెలకొంది. అయితే చివర్లో లాభాల స్వీకరణ జరగడంతో సెన్సెక్స్ 295 పాయింట్లు లాభపడి 60,067 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 87 పాయింట్లు లాభపడి 17,916 పాయింట్ల దగ్గర ముగిసింది. సెన్సెక్స్ సూచీలో నాలుగు షేర్లు మాత్రమే నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.328 కోట్ల షేర్లను విక్రయించగా.., దేశీయ ఇన్వెస్టర్లు స్వల్పంగా రూ.38 కోట్ల షేర్లను కొన్నారు. బలిప్రతిపదా సందర్భంగా శుక్రవారం స్టాక్ మార్కెట్‌కు సెలవు. ఎక్సే్ఛంజీలతో పాటు ఫారెక్స్, డెట్, కమోడిటీ మార్కెట్లు పనిచేయలేదు. నేడు, రేపు(శని,ఆది) సాధారణ సెలవు రోజులు. సోమవారం అన్ని మార్కెట్లు యథావిధిగా ప్రారంభమవుతాయి. ప్రపంచ మార్కెట్లకు ఫెడ్ బూస్ట్... ఫెడ్ రిజర్వ్ కమిటి గురువారం రాత్రి ప్రకటించిన పాలసీ నిర్ణయాలు మెప్పించడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలు నెలకొన్నాయి. తక్షణమే ఫెడ్ ట్యాపరింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. నెలవారీగా చేపడుతున్న బాండ్ల కొనుగోళ్లను ఈ నవంబర్ నుంచి ప్రతి నెలా 15 బిలియన్ డాలర్ల మేర తగ్గించుకోనున్నట్లు పేర్కొంది. వడ్డీరేట్ల పెంపు ఇప్పట్లో ఉందని హామీనిచ్చింది. ఆసియా మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. అమెరికా అక్టోబర్ ఉద్యోగ గణాంకాలు అంచనాలకు మించి నమోదు కావడంతో శుక్రవారం ఐరోపా మార్కెట్లు ఒకశాతం లాభంతో ముగిశాయి. యూఎస్ సూచీలు అరశాతం లాభంతో ప్రారంభమయ్యాయి. -
ముహురత్ ట్రేడింగ్‌లో షేర్లు కొనుగోలు చేస్తే లాభాల పంట..!
ముంబై: ఫెడ్ రిజర్వ్ పాలసీ ప్రకటనకు ముందు మంగవారం స్టాక్ మార్కెట్లో అప్రమత్తత చోటుచేసుకుంది. ఫలితంగా సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోయి నష్టాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఆర్థిక, టెలికాం, ఎఫ్ఎంసీజీ షేర్లలో తలెత్తడంతో సెన్సెక్స్ 257 పాయింట్లు కోల్పోయి 59,772 వద్ద ముగిసింది. నిఫ్టీ 60 పాయింట్లు నష్టపోయి 17,829 వద్ద నిలిచింది. సూచీలకిది వరుసగా రెండోరోజూ నష్టాల ముగింపు. మెటల్, రియల్టీ, మౌలిక రంగాల షేర్లు రాణించాయి. సెన్సెక్స్ ఉదయం 246 పాయింట్ల లాభంతో 60,275 వద్ద మొదలైంది. భారత సేవల రంగం అక్టోబర్‌లో మెరుగైన వృద్ధిని కనబరచడంతో తొలి సెషన్లో కొనుగోళ్లు జరిగాయి. ఒక దశలో సెన్సెక్స్ 333 పాయింట్లు ర్యాలీ చేసి 60,362 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. నిఫ్టీ 100 వరకు పెరిగి 17,989 వద్ద ఇంట్రాడే హైని తాకింది. అయితే మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల బలహీన ప్రారంభంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు మొగ్గుచూపారు. దీంతో సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోవడమే కాకుండా నష్టాల్లోకి మళ్లాయి. ట్రేడింగ్ ముగిసే వరకు విక్రయాలకే కట్టుబడటంతో సూచీలు నష్టాలతో ముగిశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.401 కోట్ల షేర్లను అమ్మగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.195 కోట్ల షేర్లను కొన్నారు. ‘‘ఫెడ్ రిజర్వ్ పాలసీ కమిటీ నిర్ణయాల కోసం ప్రపంచ మార్కెట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. అయితే ఫెడ్ ట్యాప్‌రింగ్, వృద్ధి, ద్రవ్యోల్బణ అంశాలపై ఫెడ్ చైర్మన్ పావెల్ చేసే వ్యాఖ్యలు రానున్న రోజుల్లో ఈక్విటీ మార్కెట్ల గమనాన్ని నిర్ధేశిస్తాయి’’ అని రిలిగేర్ బ్రోకింగ్ సంస్థ వైస్ చైర్మన్ అజిత్ మిశ్రా తెలిపారు. దీపావళి సందర్భంగా నేడు ముహురత్ ప్రత్యేక ట్రేడింగ్ దీపావళి సందర్భంగా నేడు స్టాక్ ఎక్స్చేంజీలకు సెలవు రోజు అయినప్పటికీ.., సాయంత్రం ప్రత్యేకంగా గంటసేపు ముహూరత్ ట్రేడింగ్ జరుగుతుంది. ట్రేడింగ్ సాయంత్రం 6.15 నుంచి 7.15 మధ్య జరుగుతుంది. ఎక్చ్సేంజీల సమయ పాలన మినహా ట్రేడింగ్ విధివిధానాల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఈ ప్రత్యేక మూహురత్ ట్రేడింగ్‌లో కొనుగోలు చేసిన షేర్లు వచ్చే ఏడాది వరకు లాభాల పంట పండిస్తాయని ట్రేడర్లు విశ్వసిస్తారు. శుక్రవారం స్టాక్ మార్కెట్‌కు సెలవు ... బలిప్రతిపదా సందర్భంగా శుక్రవారం స్టాక్ మార్కెట్‌కు సెలవు. స్టాక్ ఎక్స్చేంజీలతో పాటు ఫారెక్స్, డెట్, కమోడిటీ మార్కెట్లు కూడా పని చేయవు. శని ఆదివారాలు సాధారణ సెలవు రోజులు. సోమవారం అన్ని మార్కెట్లు యథావిధిగా ప్రారంభవుతాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు.. సెప్టెంబర్ క్వార్టర్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంతో ట్రెంట్ షేరు ఐదుశాతం లాభంతో రూ.1093 వద్ద స్థిరపడింది. నిధుల సమీకరణ ప్రణాళికకు బోర్డు ఆమోదంతో శోభ లిమిటెడ్ షేరు 10% పెరిగి రూ.952 వద్ద ముగిసింది. భారీ సంఖ్యలో ఆర్డర్లు రావచ్చనే అంచనాలతో ఎల్అండ్టీ షేరు 4% పెరిగి రూ.1889 నిలిచింది. మార్కెట్ వర్గాల అంచనాలకు మించిన రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించడంతో ఎస్బీఐ షేరు ఇంట్రాడేలో 4% ఎగసి రూ.542 స్థాయికి చేరింది. చివర్లో లాభాల స్వీకరణ జరగడంతో ఒకశాతం స్వల్ప లాభంతో రూ.528 వద్ద ముగిసింది. -
ముహూరత్ అదుర్స్- మార్కెట్ల రికార్డ్స్
గత దీపావళి నుంచి ఈ దీపావళి వరకూ విశేషాలు సెన్సెక్స్ : 43,638= దాదాపు 4400 పాయింట్లు(11.4 శాతం) అప్ నిఫ్టీ: 12,780= సుమారు 1150 పాయింట్లు(10.18 శాతం) ప్లస్ డాలరుతో రూపాయి మారకం= 74.60- రూ. 3.76(5.3 శాతం) డౌన్ ముంబై: సరికొత్త ఏడాది సంవత్ 2077 తొలి రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో బోణీ కొట్టాయి. అంతేకాకుండా సెన్సెక్స్, నిఫ్టీ లైఫ్‌టైమ్ గరిష్టాలను తాకాయి. దీపావళి సందర్భంగా నిర్వహించిన ముహూరత్ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 195 పాయింట్లు ఎగసి 43,638 వద్ద నిలిచింది. నిఫ్టీ 60 పాయింట్లు పుంజుకుని 12,780 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 43,831 వద్ద, నిఫ్టీ 12,829 వద్ద సరికొత్త గరిష్టాలకు చేరాయి. వెరసి సాయంత్రం 6.15-7.15 మధ్య నిర్వహించిన మూరత్ ట్రేడింగ్‌లో మార్కెట్లు మరోసారి సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. రోజంతా మార్కెట్లు లాభాల మధ్యే కదలడం విశేషం! మార్కెట్లకు ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ఆర్థిక రికవరీపై ఆశలు, కోవిడ్-19 కట్టడికి వెలువడనున్న వ్యాక్సిన్లపై అంచనాలు బలాన్నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. దివాలీ బలిప్రతిపద నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్లకు సెలవు. చదవండి: (కొనసాగుతున్న రూపాయి పతనం) బీపీసీల్ భళా ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ 0.5-0.2 శాతం మధ్య లాభపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో బీపీసీఎల్ 5.2 శాతం జంప్ చేయగా.. ఐవోసీ, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, గెయిల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ 3-1 శాతం మధ్య వృద్ధి చూపాయి. అయితే హిందాల్కో, హీరో మోటో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, శ్రీ సిమెంట్, టైటన్, యాక్సిస్, పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ 1.2-0.35 శాతం మధ్య బలహీనపడ్డాయి. చదవండి: (సంవత్ 2076కు లాభాల వీడ్కోలు) ఐడియా జోరు డెరివేటివ్స్‌లో ఐడియా 6.3 శాతం జంప్‌చేయగా.. కంకార్, హెచ్‌పీసీఎల్, ఐడీఎఫ్సీ ఫస్ట్, ఎన్ఎండీసీ, భెల్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 5.2-1.4 శాతం మధ్య ఎగశాయి. హిందాల్కో, పిరమల్, శ్రీరామ్ ట్రాన్స్, జీఎంఆర్, ఆర్ఈసీ, అరబిందో, డీఎల్ఎఫ్, పీవీఆర్, ఎంఅండ్ఎం ఫైనాన్స్ 1 శాతం స్థాయిలో క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6-0.8 శాతం మధ్య బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,842 లాభపడగా.. 606 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,936 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,462 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 1514 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్ రూ. 2,239 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
ఇక స్టాక్ మార్కెట్ల దారెటు?
ముంబై: దీపావళి పండుగ సందర్భంగా స్టాక్ ఎక్స్ఛేంజీలు శనివారం(14న) సాయంత్రం 6.15-7.15 మధ్య ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్ నిర్వహించనున్నాయి. పలు సానుకూల వార్తల నేపథ్యంలో గత వారం(2-6) అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీ దూకుడు చూపాయి. అయితే ఇకపై మార్కెట్ల ట్రెండును ప్రధానంగా విదేశీ సంకేతాలు ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ తాజాగా అమెరికా ప్రెసిడెంట్ రేసులో విజయానికి చేరువలో నిలిచారు. దీంతో ఎన్నికల ఫలితాలలో స్పష్టత ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు బలాన్నివ్వగలదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఫలితాలు, మార్కెట్ల భారీ ర్యాలీ.. వంటి అంశాలతో వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదిలే వీలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశీ గణాంకాలు అక్టోబర్ నెలకు ద్రవ్యోల్బణ గణాంకాలు, సెప్టెంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి వివరాలు 12న విడుదల కానున్నాయి. ఈ బాటలో చైనా, అమెరికా ద్రవ్యోల్బణ వివరాలు, యూరో ప్రాంత పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సైతం 10, 12 మధ్య వెల్లడికానున్నాయి. కాగా.. దేశీయంగా ఇప్పటికే క్యూ2(జులై- సెప్టెంబర్) ఫలితాల సీజన్ ముగింపునకు వచ్చింది. ఈ నెల 11న క్యూ2 ఫలితాలను ప్రకటించనున్న కంపెనీల జాబితాలో అరబిందో ఫార్మా, శ్రీ సిమెంట్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ చేరాయి. ఈ బాటలో ఐషర్ మోటార్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 12న, చమురు దిగ్గజం ఓఎన్జీసీ 13న క్యూ2 పనితీరు వెల్లడించనున్నాయి. ఇతర అంశాలు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి పలు అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. ఈ నెలలో ఇప్పటివరకూ నగదు విభాగంలో ఎఫ్ఐఐలు రూ. 13,399 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. అంతకుముందు అక్టోబర్‌లో రూ. 14,537 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. దీంతో ఇటీవల మార్కెట్లు జోరు చూపుతున్నాయి. ఈ నెలాఖరుకల్లా ఎంఎస్‌సీఐలో ఇండియాకు వెయిటేజీ పెరగనున్నట్లు హీలియోస్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు సమీర్ అరోరా పేర్కొన్నారు. దీంతో డిసెంబర్లో మరో 3 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులకు అవకాశమున్నట్లు అంచనా వేశారు. హైజంప్ గత వారం సెన్సెక్స్ 2,279 పాయింట్లు(5.75 శాతం) జంప్ చేసి 41,893 వద్ద ముగిసింది. తద్వారా 42,000 పాయింట్ల మైలురాయిపై కన్నేసింది. నిఫ్టీ సైతం 621 పాయింట్లు(5.3 శాతం) ఎగసి 12,264 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీకి సమీప భవిష్యత్‌లో సాంకేతికంగా 12,400 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ ఎదురయ్యే వీలున్నట్లు నిపుణులు అంచనా వేశారు. ఇదేవిధంగా 11,800 స్థాయిలో సపోర్ట్ లభించగలదని భావిస్తున్నారు. -
సంవత్ 2076 సందడి, నేడు సెలవు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సంవత్ 2076కు శుభారంభాన్నిచ్చాయి. హుషారుగా ప్రారంభమైన కీలక సూచీలు ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో మరింత మెరిసాయి. సెన్సెక్స్ 250 పాయింట్ల మేర ఎగిసింది. చివరకు సెన్సెక్స్ 192 పాయింట్ల లాభంతో 39, 250 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు ఎగిసి11627 వద్ద స్థిరంగా ముగిసాయి. దాదాపు అన్ని ఇండెక్సులూ లాభపడ్డాయి. ప్రధానంగా ఆటో, మెటల్, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ పుంజు కున్నాయి. టాటా మోటార్స్ 17 శాతం, యస్ బ్యాంక్ 6 ఇన్ఫోసిస్ లాభపడగా, వేదాంతా, ఐటీసీ, ఐషర్, ఎస్బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, హీరో మోటో టాప్ లూజర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఇన్ఫ్రాటెల్, గ్రాసిమ్, ఎయిర్టెల్, టైటన్, డాక్టర్ రెడ్డీస్, మారుతీ, టీసీఎస్ నష్టపోయాయి. ఈ సందర్భంగా బాలీవుడ్ హీరోయిన్ మౌనీ రాయ్ సందడి చేశారు. బీఎస్ఈ సీఎండీ అశిష్ చౌహాన్ మెమొంటోతో మౌనీ రాయ్నుసత్కరించారు. దీపావళి స్పెషల్ ట్రేడింగ్ ప్రారంభానికి ముందు సాంప్రదాయబద్ధంగా లక్ష్మీ పూజ నిర్వహించారు. కాగా నేడు( అక్టోబర్ 28) దీపావళి బలిప్రతిపాద సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు. తిరిగి మంగళవారం 29న సాధారణ ట్రేడింగ్ ప్రారంభంకానుంది. -
ఆ ఒక్క గంట : సిరుల పంట?
సాక్షి, ముంబై: దీపావళి అంటే.. ట్రేడర్లకు, ఇన్వెస్టర్లకు ముందుగా గుర్గొచ్చేది ముహూరత్ ట్రేడింగ్. ప్రతీ ఏడాది దీపావళి రోజు బీఎస్ఈ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఇ)నిఫ్టీ ప్రత్యేకంగా పని చేస్తాయి. ఈ సెషన్‌ను ముహూరత్ ట్రేడింగ్ అని పిలుస్తారు. పరిమిత కాలంపాటు నిర్వహించే ఈ శుభ ట్రేడింగ్ సందర్భంగా కలిసి వస్తుందనీ, అదృష్టం పండి, సంపద తమ ఖాతాలో చేరుతుందని ఇన్వెస్టర్లు నమ్ముతారు. ఈ ఏడాది అక్టోబర్ 27 న దీపావళి - లక్ష్మి పూజన్ ఒక గంట పాటు స్పెషల్ ట్రేడింగ్ సెషన్ ఉంటుంది. ప్రీ-ఓపెనింగ్ సెషన్ సాయంత్రం 6 - 6:08 మధ్య జరుగుతుంది. ప్రారంభ బెల్ వేడుక సాయంత్రం 6.15 గంటలకు, రాత్రి 7.15 వరకు ట్రేడింగ్ కొనసాగుతుంది. ఇది హిందూ క్యాలెండర్ సంవత్సరం (విక్రమ్ సంవత్ 2076) ప్రారంభంతో సమానం. ఈ 60 నిమిషాల్లో నిర్వహించే ట్రేడింగ్ లాభాల పంట పండిస్తుందని ట్రేడర్ల విశ్వాసం. ఈ సందర్భంగా ట్రేడర్లందరికీ ఆ లక్ష్మీకటాక్షం సంపూర్ణంగా లభించాలని సాక్షి.కామ్ కోరుకుంటోంది. విష్ యూ గుడ్ లక్ ఇన్ అడ్వాన్స్. గత ఏడాది (నవంబర్ 7, 2018) ముహూరత్ ట్రేడింగ్ నుండి 2019 అక్టోబర్ 22 వరకు సెన్సెక్స్ , నిఫ్టీ వరుసగా 10.56 శాతం, 9.19 శాతం లాభపడ్డాయి. అలాగే బిఎస్ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు వరుసగా 4.2 శాతం, 9.57 శాతం క్షీణించాయి. అమెరికా డాలరు, అంతర్జాతీయ ప్రతికూలం వాతావరణం, భారత రూపాయి విలువ క్షీణించిన నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్ ధంతేరస్‌కు ప్రతికూలంగా ట్రేడ్ అయింది. బెంచ్‌మార్క్ సూచీ సెన్సెక్స్ 35,000 మార్కు కిందికి చేరగా, నిఫ్టీ 10500 మార్కును కోల్పోయిన సంగతి తెలిసిందే. -
దీపావళి: ముహూరత్ స్పెషల్ ట్రేడింగ్
సాక్షి,ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు దీపావళి పర్వదినం లక్ష్మీపూజ సందర్భంగా నేడు (అక్టోబర్ 7,బుధవారం) ఉదయం ట్రేడింగ్ ఉండదు. అయితే సాధారణ ట్రేడింగ్‌కు బదులుగా ముహూరత్ ట్రేడింగ్ పేరుతో ఒక గంటపాటు స్పెషల్ ట్రేడింగ్ నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే సాయంత్రం 5.30-6.30 మధ్య బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ప్రత్యేక ట్రేడింగ్‌ను నిర్వహిస్తారు. దీనికి ముందు 5.15లకు 15నిమిషాలపాటు ప్రీ ఓపెనింగ్ మార్కెట్సెషన్ కూడా ఉంటుంది. దీంతో సంవత్ 2075 ప్రారంభమవుతుంది. ట్రేడింగ్‌లో భాగంగా బ్లాక్‌డీల్స్, ప్రీసెషన్, పోస్ట్‌సెషన్‌తో కలిపి సాయంత్రం 5.15 నుంచి 6.50 వరకూ ట్రేడింగ్ ఉంటుందని స్టాక్ ఎక్స్ఛేంజి ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే గురువారం(8న) మార్కెట్లకు సెలవు ప్రకటించారు. సో..శుక్రవారం ఉదయం 9.15కు యథావిధిగా సాధారణ ట్రేడింగ్ ప్రారంభంకానుంది. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. -
నిరాశపరచిన ముహురత్ ట్రేడింగ్
ముంబై: సంవత్ 2073 సంవత్సరంలో స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. సంవత్ 2073 సంవత్సరం తొలి రోజైన దీపావళి రోజు(ఆదివారం) గంట పాటు జరిగిన ప్రత్యేకమైన ముహురత్ ట్రేడింగ్‌లో స్టాక్ సూచీలు స్వల్ప నష్టాలతో నిరాశపరిచాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 11 పాయింట్లు నష్టపోయి 27,930 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 12 పాయింట్లు నష్టపోయి 8,626 పాయింట్ల వద్ద ముగిశాయి. సాయంత్రం 6:30 గంటల నుంచి గంటపాటు నిర్వహించిన ముహురత్ ట్రేడింగ్ మొదట పాజిటీవ్‌గా ప్రారంభమైనప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో చివర్లో స్వల్ప నష్టాలతో ముగిసింది. -
మార్కెట్లో దీపావళి మెరుపులు
ముంబై: సంవత్ 2072 సంవత్సరంలో స్టాక్ మార్కెట్ లాభాలతో శుభారంభం చేసింది. సంవత్ 2072 సంవత్సరం తొలి రోజైన దీపావళి రోజు(బుథవారం) గంట పాటు జరిగిన ప్రత్యేకమైన ముహురత్ ట్రేడింగ్‌లో స్టాక్ సూచీలు గత ఐదు ట్రేడింగ్ సెషన్ల నష్టాల నుంచి కోలుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 124 పాయింట్లు లాభపడి 25,867 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 7.825 పాయింట్ల వద్ద ముగిశాయి. కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను కేంద్రం సరళీకరించడం సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, విద్యుత్తు, లోహ, బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరుగా జరిగాయి. లాభాల్లో 23 సెన్సెక్స్ షేర్లు 30 సెన్సెక్స్ షేర్లలో 23 షేర్లు లాభాల్లో ముగిశాయి. యాక్సిస్ బ్యాంక్ 2.5 శాతం, సన్ ఫార్మా 1.9 శాతం, ఎల్ అండ్ టీ 1.4 శాతం, టాటా స్టీల్ 1.3 శాతం, భెల్ 1.2 శాతం, కోల్ ఇండియా 1.1 శాతం, హిందాల్కో 1 శాతం, వేదాంత 1 శాతం, టాటా మోటార్స్ 0.8 శాతం, ఎస్బీఐ 0.8 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.7 శాతం, మారుతీ సుజుకీ 0.6 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.6 శాతం చొప్పున లాభపడ్డాయి. ఇక నష్టపోయిన షేర్ల విషయానికొస్తే హీరో మోటొకార్ప్ 0.4%, ఐటీసీ 0.4 శాతం, భారతీ ఎయిర్టెల్ 0.2 శాతం, ఓఎన్జీసీ 0.1 శాతం, బజాజ్ ఆటో 0.09 శాతం చొప్పున క్షీణించాయి. 1,957 షేర్లు లాభాల్లో, 413 షేర్లు నష్టాల్లో ముగిశాయి. బలిపాడ్యమి సందర్భంగా గురువారం సెలవు కారణంగా స్టాక్ మార్కెట్ పనిచేయలేదు.