మార్కెట్లో దీపావళి మెరుపులు | BSE Sensex, NSE Nifty, currency markets closed today | Sakshi
Sakshi News home page

మార్కెట్లో దీపావళి మెరుపులు

Published Fri, Nov 13 2015 1:51 AM | Last Updated on Sun, Sep 3 2017 12:23 PM

మార్కెట్లో దీపావళి మెరుపులు

మార్కెట్లో దీపావళి మెరుపులు

ముంబై: సంవత్ 2072 సంవత్సరంలో  స్టాక్ మార్కెట్ లాభాలతో శుభారంభం చేసింది. సంవత్ 2072 సంవత్సరం తొలి రోజైన దీపావళి రోజు(బుథవారం) గంట పాటు జరిగిన ప్రత్యేకమైన ముహురత్ ట్రేడింగ్‌లో స్టాక్ సూచీలు గత ఐదు ట్రేడింగ్ సెషన్ల నష్టాల నుంచి కోలుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 124 పాయింట్లు లాభపడి 25,867 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 7.825 పాయింట్ల వద్ద ముగిశాయి. కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను కేంద్రం సరళీకరించడం సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, విద్యుత్తు, లోహ, బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరుగా జరిగాయి.
 
లాభాల్లో 23 సెన్సెక్స్ షేర్లు
30 సెన్సెక్స్ షేర్లలో 23 షేర్లు లాభాల్లో ముగిశాయి. యాక్సిస్ బ్యాంక్ 2.5 శాతం, సన్ ఫార్మా 1.9 శాతం, ఎల్ అండ్ టీ 1.4 శాతం, టాటా స్టీల్ 1.3 శాతం, భెల్ 1.2 శాతం, కోల్ ఇండియా 1.1 శాతం, హిందాల్కో 1 శాతం, వేదాంత 1 శాతం, టాటా మోటార్స్ 0.8 శాతం, ఎస్‌బీఐ 0.8 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.7 శాతం, మారుతీ సుజుకీ 0.6 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.6 శాతం చొప్పున లాభపడ్డాయి.

ఇక నష్టపోయిన షేర్ల విషయానికొస్తే హీరో  మోటొకార్ప్ 0.4%, ఐటీసీ 0.4 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 0.2 శాతం, ఓఎన్‌జీసీ 0.1 శాతం, బజాజ్ ఆటో 0.09 శాతం చొప్పున క్షీణించాయి. 1,957 షేర్లు లాభాల్లో, 413 షేర్లు నష్టాల్లో ముగిశాయి. బలిపాడ్యమి సందర్భంగా గురువారం సెలవు కారణంగా స్టాక్ మార్కెట్ పనిచేయలేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement